bengaluru
-
ఐపీఎల్ క్రికెటర్‌ను పెళ్లాడిన హీరోయిన్ అర్చన (ఫొటోలు)
-
CCTV: నిను వీడని నీడను నేనే..!
బెంగళూరు: అతనొక ఐఏఎఫ్ ఆఫీసర్.. పేరు సలాధిత్య బోస్. .డీఆర్డీవో పైలట్. ఇదంతా బానే ఉంది. అయితే తనపై కొంతమంది దాడి చేశారని ఆరోపించాడు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతుంటే పలువురు బైక్ పై అడ్డగించి తనను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భార్యను కూడా అసభ్య పదజాలంతో తిట్టారన్నాడు. ఇదంతా బోస్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పిన మాటలు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. బోస్ చెప్పిన దానికి పరిశోధనలో తేలిన దానికి పొంతనే లేకుండా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా బోస్ చెప్పింది అంతా అబద్ధమేనని తేలిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ ల్లో కేవలం విక్రమ్ అనే వ్యక్తిపై బోస్ దాడి చేయడమే కనిపించింది. అతన్ని కిందపడేసి మరీ పిడుగు గుద్దులు కురిపించాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. న్యాయాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లు ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బలి అవుతారని నెటిజన్లు పేర్కొంట్నునారు. ప్రస్తుతం బోస్ పై హత్యాయాత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బయ్యప్పనహళ్లి పోలీసులు.. బోస్ పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 109 (హత్యాయత్నం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 304 (స్నాచింగ్), 324 (అల్లరి), మరియు 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.The #DRDO pilot who had alleged that he was assaulted by a motorist on Monday has now been booked for attempted murder of that same motorist, #Bengaluru police sources said. Investigations have revealed that the #wingcommander made several false claims in the vdeo. @DeccanHerald pic.twitter.com/FnaA5jzUD2— Chetan B C (@Chetan_Gowda18) April 22, 2025 ఆఫీసర్ చెప్పిన కథ ఇది.. సోమవారం ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాను. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నా. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు. -
ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్ కమాండర్ షీలాదిత్యా బోస్, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలుత బోస్ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు కూడా.భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్ సంచలన ఆరోపణలకు దిగారు. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా.. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపించింది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతూ కనిపించింది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్ నాన్ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ దేవ్‌రాజ్ షాకింగ్ విషయం తెలియజేశారు. తొలుత బోస్ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్పై ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పరస్పర దాడికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తెలియజేస్తామన్నారు. బోస్, మధుమిత వీడియోలో.. ‘‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్‌పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్‌ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో.. ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని’’ నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని, కారు అద్దాలను, నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అదీ నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి.’’ అంటూ ఆ భార్యాభర్తలు వీడియోలో వ్యాఖ్యానించారు.#BREAKINGWing commander assault case in #BengaluruCCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory JunctionDespite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack...blowing… pic.twitter.com/ovMg9g4xcS— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025 -
కర్ణాటకలో మరో దారుణం.. ఐఏఎఫ్ ఆఫీసర్‌పై ఘోరమైన దాడి
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య ఉదంతం ఇప్పటికే సంచలనంగా మారితే, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకంది. సదరు అధికారి భార్యతో కలిసి కారులో ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో దారి కాచి కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. బైక్ కీతో ముఖంపై పిడుగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. పక్కనున్న ఆఫీసర్ భార్యపై దుర్భాషలాడారు.వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పని చేస్తున్న బోస్.. ఈరోజు(సోమవారం) ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాడు. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు.A Wing Commander of the Indian Air Force, brutally assaulted in bangalore today’s morning all over language issueHe explains everything in the video after getting Aid! pic.twitter.com/R05dt3faUk— Chauhan (@Platypuss_10) April 21, 2025 -
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది. నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్యఅయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను. అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.12 ఏళ్లుగా.. భయం భయంగానే? -
కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్య కేసు
-
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. -
ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?
బెంగళూరులోని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు.. ఫుడ్ ఆర్డర్లో చేతితో రాసిన నోట్‌ను వేసి, సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం తనను తాను ప్రపోజ్ చేసుకున్నాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇతడు చేసిన పనిని తెగ ప్రశంసిస్తున్నారు.డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేతితో రాసిన నోట్లో.. తాను మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ కోసం వెతుకుతున్న కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నాడు. నోట్ అందుకున్న వారు తగిన అవకాశం ఉంటే తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా అందులో రాశాడు. ఈ నోట్‌కు సంబంధించిన ఫోటోను.. బెంగళూరులో సొల్యూషన్స్ ఇంజనీర్ నిఖిల్ లింక్డ్ఇన్లో షేర్ చేశారు.జొమాటో డెలివరీ ఏజెంట్ ధైర్యం చూసి నిఖిల్ ఆశ్చర్యపోయాడు. డెలివరీలు చేసే హడావిడిలో కూడా తాను.. చేతితో రాసిన నోట్ ద్వారా ఉద్యొగావకాశం కోసం సెర్చ్ చేయడం గొప్ప విషయం అని అన్నారు. డెలివరీ ఏజెంట్ మీద చాలా గౌరవం ఏర్పడిందని మరొకరు కామెంట్ చేయగా. తాను ఆశించినట్లే.. ఇంటర్న్‌షిప్ లభిస్తుందని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయిత -
రీల్స్ కోసం ఎక్స్ట్రాలకు పోయి..
సోషల్ మీడియాలో యూజర్ల అటెన్షన్ కోసం వినూత్నంగా ప్రయత్నించే వాళ్లు ఈ మధ్యకాలంలో పెరిగిపోయారు. అదే సమయంలో అధికారిక చానెల్స్ నుంచే ‘సెల్ఫ్ ట్రోలింగ్’తో ఆకట్టుకుంటున్నవాళ్లను ఈ మధ్యకాలంలో చూస్తున్నదే. ఇక.. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో, ఆకతాయిలను హెచ్చరించే విషయంలోనూ పోలీసులూ అస్సలు తగ్గడం లేదు.తాజాగా.. బెంగళూరు సిటీ పోలీసులు(Bengaluru City Police) చేసిన ఓ ట్వీట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి మాగాడి రోడ్లో పైత్యం ప్రదర్శించాడు. నడిరోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ రీల్ జనాల్లోకి విపరీతంగా వెళ్లింది.అయితే ఈ స్టంట్ అతనికే కాదు.. ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేదిగా ఉండడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాగోలా ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వేషాలు వస్తే కటకటాల వెనక్కి నెడతామంటూ ఓ సినిమాలోని ఫన్నీ సీన్‌ను జోడించారు. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని గమనిస్తుంటారు జాగ్రత్త అంటూ ఓ ఫన్నీ పోస్ట్ చేశారు. Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025 -
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. -
ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’!
బెంగళూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పట్టుకునే క్రమంలో తప్పించుకోబోయిన 35 ఏళ్ల నితీష్ కుమార్.. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.‘మేము నిందితుడి నితీష్ కుమార్ ను పట్టుకున్న తర్వాత మాపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే పారి\పోయే యత్నం చేశాడు. దీనిలో భాగంగా మేము ఓ హెచ్చరిక జారీ చేస్తూ ‘వార్నింగ్ షాట్( అతనిపై కాల్చాం. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మేము కేసు రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా అతని ఊరికి తీసుకెళ్లాం. అక్కడ మా టీమ్ పై దాడికి పాల్పడ్డాడు. హుబ్బాల్లి పోలీస్ అధికారి శశి కుమార్ మీడియాకు వెల్లడించారు.తప్పించుకునే క్రమంలో తమ వాహనాలను కూడా అతడు ధ్వంసం చేశాడని, ఈ క్రమంలో తమ టీమ్ లోని ఒక పోలీస్ అధికారి గాల్లోకి కాల్పులు జరపాడన్నారు. అయినా కూడా తప్పించుకునేందుకు యత్నించడంతో అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. ఆపై వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే యత్నం చేశామని, కానీ డాక్టర్లు అతను చనిపోయినట్లు ధృవీకరించారని సదరు పోలీస్ అధికారి వెల్లడించారు.కన్నేసి.. కిడ్నాప్ చేసి హత్యాచారంఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లాలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కు గురి కావడమే కాకుండా ఆపై అత్యాచారం, హత్య గావించబడింది. ఇళ్లలో పని చేసుకునే ఓ మహిళ కూతుర్ని నితీష్ కుమార్ అనే వ్యక్తి హత్యాచారం చేశాడు. తల్లి పనిలో వెళ్లడాన్ని గమనించిన అతను.. పాపను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆ పాపను హత్య చేశాడు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో అతన్ని పోలీసులు పట్టుకుని కస్టడీకి తీసుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు అతని ఊరికి తీసుకెళ్లగా, పోలీసుల్ని ఎదురించి దాడికి యత్నించాడు. దాంతో పోలీసులు జరిగిపన కాల్పుల్లో నితీష్ కుమార్ మరణించాడు. -
యువతీ యువకుడిపై దౌర్జన్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బెంగళూరులో యువతీ యువకుడిపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిందూ యువకుడి జతలో బైకుపై మాట్లాడుతూ కూర్చొన్న యువతిని ఐదు మంది నిందించి దాడికి యత్నించారు. ఘటనపై మైనర్ యువకుడితో పాటు మహిం, అఫ్రిది, వాసిం, అంజుంలను పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు రోజుల క్రితం తన స్నేహితుడి జతలో బుర్కా ధరించిన యువతి బైకుపై కూర్చొని మాట్లాడుతుండగా ఐదు మంది వెళ్లి దాడికి యత్నించారు. యువకుడితో అసభ్యంగా మాట్లాడారు. ఎందుకు కూర్చున్నావు, మానం, మర్యాద లేదా అంటూ ఇద్దరిని నోటికొచ్చినట్లు నిందించారు. యువతిని తల్లిదండ్రుల నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన తరగతి స్నేహితుడితో మాట్లాడుతున్నా తమ తల్లిదండ్రుల నంబర్ మీకెందుకని ప్రశ్నించిన ఇద్దరిపై దాడికి యత్నించారు. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. The #BengalauruPolice arrested four individuals, including a minor, on Friday in connection with a case of moral policing reported under the Chandra Layout police station limits in #Bengaluru.The accused allegedly confronted a #Muslim woman for speaking with a youth from #Hindu… pic.twitter.com/uoyPgU6jv8— Hate Detector 🔍 (@HateDetectors) April 11, 2025 -
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
కర్ణాటక: గతంలో తెరవెనుక జరిగే రొమాన్స్ నేడు వీధుల్లోకి వచ్చింది. మెట్రో రైల్వేస్టేషన్లో ఓ జంట పట్టపగలే అందరి ముందు ప్రేమ కలాపాల్లో మునిగిపోయిన వీడియో భారీ వైరల్‌గా మారింది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ఒకటో ప్లాట్‌ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యం ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రేమికులు ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్‌లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజన్ ఒకరు తెలిపారు. -
BCCI: హై పెర్ఫార్మెన్స్ శిబిరానికి త్రిష, ధృతి
సాక్షి, హైదరాబాద్: అండర్–19 స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న తెలంగాణ ప్లేయర్లు గొంగడి త్రిష (Gongadi Trisha), కేసరి ధృతి (Kesari Drithi)కి హై పెర్ఫార్మెన్స్ క్యాంప్ నుంచి పిలుపు వచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ నెల 21 నుంచి మే 15 వరకు బీసీసీఐ అండర్–19 మహిళల హై పెర్ఫార్మెన్స్ క్యాంప్ జరగనుంది. దీని కోసం ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ తెలంగాణ నుంచి త్రిష, ధృతిని ఎంపిక చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా త్రిష ఈ ఏడాది ఆరంభంలో మలేసియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 309 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచిన త్రిష 7 వికెట్లు సైతం పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకుంది.ఇక ధృతి వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యురాలైనా... ఆమెకు తుది జట్టులో చోటు దక్కలేదు. హై పెర్ఫార్మెన్స్ క్యాంప్‌లో ప్లేయర్ల నైపుణ్యాలను పెంపొదించడంతో పాటు... ఫిట్నెస్ను మరింత మెరుగు పర్చనున్నారు. దీని కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్‌ను సిద్ధం చేశారు. ఇదీ చదవండి: నిగార్ సుల్తానా సూపర్ సెంచరీ లాహోర్: కెప్టెన్ నిగార్ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, 1 సిక్స్) ‘శత’క్కొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు బోణీ కొట్టింది. గురువారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ మహిళల జట్టు 178 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.వన్డేల్లో బంగ్లాదేశ్ జట్టుకిదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిగార్ సుల్తానా ధనాధన్ షాట్లతో సెంచరీ పూర్తి చేసుకోగా... షర్మిన్ అక్తర్ (126 బంతుల్లో 94 నాటౌట్; 11 ఫోర్లు) శతకానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫర్జానా హక్ (53) అర్ధశతకంతో రాణించింది. ధాయ్‌లాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న బంగ్లాదేశ్ బ్యాటర్లు జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్ జట్టు 28.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. చునిడా సుతిరాంగ్ (22) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమ, జన్నతుల్ ఫిర్దోస్ చెరో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో బంగ్లాదేశ్ జట్టు తలపడుతుంది. -
ఏసీ లేకున్నా ఎంత హాయి!
వేసవి వచ్చిందంటే చాలు... ఫ్యాన్ నాన్ స్టాప్‌గా తిరగాల్సిందే. ఏసీ ఎప్పుడూ పని చేయాల్సిందే. కరెంట్ బిల్లు భారం సంగతి ఎలా ఉన్నా... ఏసీల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బెంగళూరుకు చెందిన వారణాసి సత్యప్రకాష్ ‘వారణాసి హౌజ్’ను సృష్టించాడు. ఏసీ అవసరం లేకుండానే ఈ ఇల్లు చల్లగా ఉంటుంది. ఇంటి నిర్మాణం విషయానికి వస్తే... హీట్ ట్రాపింగ్ సిమెంట్ గోడలకు బదులుగా బోలు మట్టి బ్లాకులను ఎంచుకున్నాడు. ఇవి ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రిస్తాయి. వేసవిలో ఇంటిని చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఫ్రెంచ్ కిటికీల వల్ల తగినంత వెంటిలేషన్ ఉంటుంది. ఇంటి రూపకల్పనలో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, భూగర్భ జలాలను రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపల కొలను, నీటి ప్రవాహాలు, బావి ఉన్నాయి. కారు షెడ్‌కు దగ్గరలో అందమైన పూలతోట... వర్షపు నీటిని భద్రపరిచే ఏర్పాటు కూడా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ కూలింగ్ అవసరం లేకుండా రెడ్ ఆక్సైడ్ ఫ్లోర్స్, పైన్ వుడ్ ఇంటీరియర్స్, నేచురల్ చిమ్నీ... మొదలైనవి కనిపిస్తాయి.‘క్రాస్ వెంటిలేషన్, డిస్ప్లేస్మెంట్ వెంటిలేషన్ సూత్రాలను మిళితం చేసి ఇంటికి రూపకల్పన చేశాం’ అంటున్నాడు సత్యప్రకాష్. (చదవండి: మామయ్య ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!) -
Bengaluru: ఫ్రెండ్ తోవెళ్తున్న యువతిపై వేధింపులు
-
ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్
చదువుకుని డిగ్రీలు తెచ్చుకోవడం ఒక ఎత్తైతే.. ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో నచ్చిన ఉద్యోగాలు దొరక్క కొందరు సతమవుతుంటే.. అసలు ఉద్యోగాలే లభించనివారు చాలామందే ఉన్నారు. మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.బెంగళూరుకు చెందిన 'ప్రశాంత్ హరిదాస్' అనే వ్యక్తి.. మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగెత్తిపోయి.. తనకు తానే లింక్డ్ఇన్లో 'రెస్ట్ ఇన్ పీస్' అని ఒక పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. మేమున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు.పరిశ్రమ నాయకులారా, నన్ను దెయ్యంలా చూసి రిజెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఎంత మంచి వాడిని అయినా.. ఎన్ని రెకమెండేషన్స్ పెట్టినా.. ఈ పోస్ట్ పెట్టిన తరువాత నాకు జాబ్ ఇవ్వరని తెలుసు. నేను ఆత్మహత్య చేసుకోను. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రుచి చూడాల్సిన వంటకాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే సుమారు మూడు సంవత్సరాలు నిరుద్యోగిగా.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం అని ప్రశాంత్ పోస్ట్ చేసాడు.ఈ పోస్టుపై పలువురు స్పందించారు. నేను మీ మాటలు విన్నాను, మీ ప్రయాణం ఎంత కఠినంగా ఉందో ఊహించగలను. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒంటరిగానే ఉంటాయి. కానీ మీ ప్రయత్నాలు వృధా కాదు. పట్టు వదలకుండా శ్రమించండి, అని ఒకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, మీ పట్ల సానుభూతి ఉంది. కరోనా మహమ్మారి మనందరినీ ఒంటరిని చేసింది. ప్రస్తుతం జాబ్ మార్కెట్ మునుపటిలా లేదు. తల పైకెత్తి చూడండి. నా నెట్వర్క్.. అనుభవం మీకు సహాయం చేయగలితే సంతోషిస్తాను అని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో.. వారు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. -
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
బెంగళూరు: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో ఎఫైర్ పెట్టుకుని ఆపై బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న శ్రీదేవి రుదాగి అనే టీచర్.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తన ఐదేళ్ల కూతుర్ని 2023లో బెంగళూరులోని ఓ స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి సతీష్(పేరు మార్చాం). అయితే అక్కడే అసలు కథ మొదలైంది. పాపను స్కూల్ కు తీసుకొచ్చి, తీసుకెళ్లే క్రమంలో అతనితో టీచర్ శ్రీదేవి సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఇలా ఇరువురి మధ్య ప్రారంభమైన వ్యవహారం కాస్తా ముదిరింది. ఈ క్రమంలోనే అతనితో సాన్నిహిత్యంగా ఉండటాన్ని సీక్రెట్ గా వీడియో రికార్డు చేసింది. అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. తనకు డబ్బులు కావాలంటూ పదే పదే వేధించసాగింది. కాలే, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టింది ఇలా మొత్తం మీద రూ. 4 లక్షల వరకూ లాగేసింది.ఏకంగా ఇంటికి..ఇక తనతో సాన్నిహిత్యం తగ్గించడంతో వ్యాపారి ఇంటికి వచ్చేసింది టీచర్ శ్రీదేవి. తనకు అప్పు కావాలనే వంకతో ఇంటికి వచ్చింది. అక్కడ రూ. 50 వేల అప్పు రూపంలో ఆమెకు ఇస్తున్నట్లు ఇంట్లో నమ్మించాడు సదరు వ్యాపారి. ఆ తర్వాత కూడా ఆమె నుంచి వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.మకాం మార్చాడు..ఇక ఆమె వేధింపులు అధికం కావడంతో గుజరాత్ కు మకాం మార్చాడు సదరు వ్యాపారి. అయితే తన ఐదేళ్ల కూతురు ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ కోసం మళ్లీ ఆమెను కలవాల్సి వచ్చింది. అలా ఆమె ఆఫీస్ లో చిక్కుపోయాడు వ్యాపారి. అక్కడ వీడియోలు, ఫోటోలు చూపిస్తూ రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది. ఒకవేళ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లకు వాటిని పంపిస్తానంటూ బెదిరించింది. అక్కడ కాలే, సాగర్ లు కూడా ఉండటంతో చివరకు చేసేది లేక బయటకొచ్చాడు.పోలీసులకు ఫిర్యాదుఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీదేవితో పాటు కాలే, సాగర్ లను కూడా అరెస్ట్ చేయగా,. ఆ ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్రూమ్లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు. అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చేరిన హుళిమావు పోలీసులు పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు. -
భార్యను హత్య చేసిన ఘటన.. టెకీ ఆత్మహత్యాయత్నం!
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.సూట్ కేస్ లో ప్యాక్ చేసి..అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.ఆత్మహత్యకు యత్నంభార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.ఏడాది క్రితమే బెంగళూరుకు..మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు నో బెయిల్
బెంగళూరు : నటి రన్యారావుకు బెంగళూరు కోర్టులో చుక్కెదురైంది. బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రన్యారావుకు బెంగళూరు 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. రన్యా రావు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవ్వడం ఇది మూడోసారి. అంతకుముందు మార్చి 14న రన్యారావు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అనంతరం, మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోర్టు సైతం బెయిల్ ఇవ్వలేదు. తాజాగా,64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. విశ్వసనీయ సమాచారం మేరకు రన్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె తరుఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’
బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్) విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్‌లో ప్రొఫెసర్ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుంది.ఈ వీడియోను చూసిన యూజర్స్ సోషల్ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్‌గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు. View this post on Instagram A post shared by 🎥🚀 (@gatalbum)ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట -
వీడియో వైరల్: జాతరలో అపశ్రుతి.. కుప్పకూలిన 120 అడుగుల రథం
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల రథం కూలిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకల్‌లోని హుస్కూర్‌లో శనివారం మద్దురమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వంద అడుగులకుపైగా ఎత్తైన రెండు రథాలను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు.కాగా, ఊరేగింపు సందర్భంగా రెండు రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల120 అడుగుల ఎత్తైన రథం అదుపుతప్పి ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా.. పలువులు గాయపడ్డారు. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మృతి చెందిన వ్యక్తిని తమిళనాడులోని హోసూర్‌కు చెందిన లోహిత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో రథం కూలిపోవడంతో.. పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి, అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
ఒక్క బెంగళూరు సెంటర్లోనే 180 మంది తొలగింపు
ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొంటోన్న అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ లేఆఫ్‌లను అమలు చేస్తోంది. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తగ్గింపులో భాగంగా బెంగళూరులోని ఇంజినీరింగ్ టెక్నాలజీ సెంటర్ నుంచి 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విమాన తయారీ సంస్థ భారత్ లో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.బోయింగ్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగుల కోతను ప్రకటించింది. భారత్‌లో ఇటీవల 2024 డిసెంబర్ త్రైమాసికంలో జరిగిన తొలగింపులు ఇందులో భాగంగానే జరిగాయి. కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఉద్యోగ కోతలు వ్యూహాత్మకంగా ఉన్నాయని, అయితే వీటి ప్రభావం కస్టమర్లు, కార్యకలాపాలపై పెద్దగా ఉండదని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.కంపెనీలో కొన్ని ఉద్యోగాలు తగ్గినప్పటికీ అదే సమయంలో సర్వీస్, సేఫ్టీ, నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కొత్త ఉద్యోగాలను కూడా కంపెనీ సృష్టించింది. బెంగళూరు, చెన్నైలోని బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (బీఐఈటీసీ) అధునాతన ఏరోస్పేస్ పనులను నిర్వహిస్తోంది. కంపెనీ బెంగళూరు క్యాంపస్.. యూఎస్ వెలుపల అతిపెద్ద గ్లోబల్ పెట్టుబడులలో ఒకటి.ఇదిలావుండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి 2029 నాటికి జర్మనీలో 7,500 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. 2024లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు 23,382 మంది ఉద్యోగులను తొలగించగా, 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023లో అత్యధికంగా 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను తొలగించాయి. -
రూ.25 లక్షల వేతనం.. బెంగళూరులో కష్టం!: పోస్ట్ వైరల్
ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వైరల్ అయ్యాయి.పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తికార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.పూణేలోని 15 రూపాయల వడాపావ్ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు. -
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు శాలరీ డబుల్..!
బెంగళూరు: హనీ ట్రాప్ అంశం ఓవైపు కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు(శుక్రవారం) ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం, ఎమ్మెల్యేల శాలరీని వంద శాతం హైక్ చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ. 10 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. తాజా శాలరీ హైక్ బిల్లు ఆమోదంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతం భారీగా పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటక సీఎం జీతం రూ. 75 వేలు ఉండగా, అది ఇప్పుడు రూ. 1 లక్షా యాభై వేలకు చేరనుంది. ఇక మంత్రుల జీతం 108 శాతం హైక్ తో రూ. 60 వేల నుంచి లక్షా పాతికవేలకు చేరింది.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు చేరనుంది.ఇక వీరందరికీ వచ్చే పెన్షన్ కూడా పెరగనుంది. రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు వీరికి పెన్షన్ లభించనుంది.దీనిపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. శాలరీ వంద శాతం హైక్ చేయడాన్ని సమర్థించారు. సామాన్యుడు ఎలా ఇబ్బందులు పడతాడో చట్ట సభల్లో ఉన్న తాము కూడా అలానే ఇబ్బందులు పడతామనే విషయం గ్రహించాలన్నారు. దీనికి సంబంధింంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు పరమేశ్వరన్. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.. సస్పెన్షన్ఈరోజు చర్చకు వచ్చిన అంశాలతో పాటు పల్లు బిల్లులకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారుఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. దాంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ కు గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీ ట్రాప్ -
సంచలనం.. ‘హనీట్రాప్’లో 48 మంది ఎమ్మెల్యేలు.. సీడీలు,వీడియోలు కూడా
బెంగళూరు: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పడీ హనీ ట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశంపై దుమారం చెలరేగింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారుఅంతేకాదు, సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్‌లోకి దించడం పరిపాటిగా మారింది. ఈ తరహా రాజకీయాలు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు. హనీ ట్రాప్‌పై కేఎన్ రాజన్న మాట్లాడుతూ.. హనీట్రాప్‌లో కనీసం 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కొత్త విషయం కాదు. వారిలో చాలామంది హైకోర్టులో స్టే తీసుకున్నారు. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హనీ ట్రాప్ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుతం, ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. -
హెడ్ కోచ్‌కు గాయం.. రాజస్తాన్ రాయల్స్ పోస్ట్ వైరల్
తమ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) గాయంపై రాజస్తాన్ రాయల్స్ అప్డేట్ అందించింది. ‘ది వాల్’ కోలుకుంటున్నాడని.. త్వరలోనే పూర్తిస్థాయిలో టీమ్‌తో చేరతాడని తెలిపింది. కాగా ఇటీవల ద్రవిడ్ క్లబ్ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే.తన చిన్న కుమారుడు అన్వయ్‌తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో ద్రవిడ్ పాల్గొన్నాడు. యంగ్ లయన్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన ద్రవిడ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే రాహుల్ ద్రవిడ్ గాయపడినట్లు సమాచారం. దీంతో రాజస్తాన్ రాయల్స్ ముందస్తు శిక్షణా శిబిరంలో పాల్గొనలేకపోయాడు.కాలికి కట్టు అలాగే ఉండటంతోఅయితే, తాజాగా అతడు జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బుధవారం వెల్లడించింది. ‘‘బెంగళూరులో క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన మా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకుంటున్నారు. ఈరోజే జైపూర్‌లో ఆయన మాతో చేరతారు’’ అని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాయల్స్ జెర్సీలో థమ్సస్ సింబల్ చూపిస్తున్న ద్రవిడ్ ఫొటోను పంచుకుంది. అయితే, అతడి ఎడమకాలికి ఇంకా కట్టు ఉండటం గమనార్హం.ఇక ఈ ఫొటో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు చదివాం గానీ.. ఇలా హెడ్ కోచ్‌కు ఇంజూరీ కావడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘వాల్’ కాస్త పెద్దవాడైపోయాడని.. క్రికెట్ ఆడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితవుపలుకుతున్నారు.కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో జట్టుకట్టాడు. ఈ ఏడాది నుంచి రాజస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రవిడ్ ఈ ఫ్రాంఛైజీతో పనిచేశాడు.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ జట్టుసంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్, షిమ్రన్ హెట్మెయిర్, నితీశ్ రాణా, యుధ్వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఫజల్హక్ ఫారూకీ, క్వెనా మఫాకా, అశోక్ శర్మ, సందీప్ శర్మ.రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ సిబ్బందిహెడ్కోచ్- రాహుల్ ద్రవిడ్డైరెక్టర్ ఆఫ్ క్రికెట్- కుమార్ సంగక్కరఫాస్ట్ బౌలింగ్ కోచ్- షేన్ బాండ్బ్యాటింగ్ కోచ్- విక్రమ్ రాథోడ్ఫీల్డింగ్ కోచ్- దిశాంత్ యాగ్నిక్.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..Head Coach Rahul Dravid, who picked up an injury while playing Cricket in Bangalore, is recovering well and will join us today in Jaipur 💗 pic.twitter.com/TW37tV5Isj— Rajasthan Royals (@rajasthanroyals) March 12, 2025 -
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
గోల్డ్ కేసులో ట్విస్ట్.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్‌ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు. -
ఈవెంట్ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు. -
కాలర్ ట్యూన్‌తో సైబర్ నేరాలు అరికట్టలేం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రగతితోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, కేవలం ఫోన్ కాలర్ ట్యూన్లతో వాటిని నియంత్రించలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటివల్ల చోటుచేసుకుంటున్న దుష్పరిణామాలు ఆపడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారిందన్నారు. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నదో ఆలోచించాలన్నారు. బెంగళూరులో గురువారం ప్రారంభమైన ‘2025 ఆంట్రప్రెన్యూర్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. డిజిటల్ అక్షరాస్యతతో సమాన అవకాశాలు..: ‘సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నా ప్రతీ సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరంగా తయారవుతుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలి.టెక్నాలజీతో పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజలు తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్షపైనే కాకుండా సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపైనా దృష్టి సారించాలి. డిజిటల్ అంతరం పెరుగుతున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారానే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి’ అని కేటీఆర్ వివరించారు. -
ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
సైకియాట్రిస్టు రశ్మికి 10ఏళ్ల జైలు శిక్ష
కర్ణాటక: బెంగళూరులో హైప్రొఫైల్ పసికందు కిడ్నాప్ కేసులో దోషికి కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. వివరాలు.. సైకియాట్రిస్టుగా పనిచేసే బెంగళూరు విజయనగరవాసి డా.రశ్మి నిందితురాలు. 2020 మే 29న వాణివిలాస్ ఆసుపత్రిలో ఓ జంటకు పుట్టిన మగబిడ్డను కొన్ని గంటలలోపే రశ్మి అపహరించింది. వార్డు కాపలాదారు ద్వారా తల్లికి నిద్రమాత్రలు కలిపిన పాలను తాగించింది, ఆమె నిద్రలోకి జారుకోగానే శిశువును ఎత్తుకుని పరారైంది. తరువాత కొప్పళలో ఓ రైతు కుటుంబానికి అప్పగించింది. మీరు గతంలో సరోగసి కోసం ప్రయత్నించారు కదా, ఆ బిడ్డే ఈ శిశువు అని చెప్పి వారి నుంచి రూ. 14 లక్షలను వసూలు చేసింది. ఏడాదిన్నర తరువాత ఆచూకీ బాధితుల ఫిర్యాదు మేరకు బసవనగుడి, చామరాజపేటే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు ఏడాదిన్నర తరువాత చిన్నారి ఆచూకీని గుర్తించారు. కానీ అసలైన తల్లిదండ్రులు తామంటే, తామని రెండు జంటలు గొడవకు దిగాయి. దీంతో కోర్టు అనుతితో డీఎన్ఏ టెస్టులు చేయించి, బెంగళూరుకు చెందిన జంటే అసలైన తల్లిదండ్రులని నిర్ధారించారు. నిందితురాలు రశ్మిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ వేశారు. సులభంగా డబ్బు సంపాదనకు ఈ పనికి పాల్పడినట్లు తెలిపింది. బుధవారం తుది విచారణ జరిపిన నగర సీసీహెచ్ 51వ కోర్టు, నిందితురాలు రశ్మి నేరం రుజువు కావడంతో పై మేరకు తీర్పు వెలువరించింది. -
రూ.40 లక్షల జాబ్.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు!
ఈరోజుల్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో చూస్తూనే ఉన్నాం. మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అంటే మంచి పేరున్న కాలేజీలో చదివుండాలి. ఎన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని రెజ్యూమ్‌లో ఆకట్టుకునేలా పేర్కొనకపోతే ఉద్యోగం కష్టమే. అయితే ఇవేవీ లేకుండా హై పేయింగ్ జాబ్ ఇస్తానంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఫౌండర్.బెంగళూరులో జాబ్.. ఏడాదికి రూ. 40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని.. మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదు.. అనుభవం అక్కర్లేదు.. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ కంపెనీ ఫౌండర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది.బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్ తెలిపారు. "‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ను నియమించాలని చూస్తున్నాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న 100 పదాల టెక్స్ట్ పంపండి చాలు" అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు".. "రెజ్యూమ్ అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.ఇక్కడ "క్రాక్డ్ ఇంజనీర్స్" అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమె కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే క్రాక్డ్ ఇంజనీర్ కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI Salary CTC - 40 LPASalary Base - 15-25 LPASalary ESOPs - 10-15 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 0-2 yearsWork from Office - 5 days a weekCollege - Does not matter…— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025 -
New expressway: బెంగళూరు- మంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం
కర్నాటక ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రెండు మెగా నగరాలైన బెంగళూరు- మంగళూరులను అనుసంధానిస్తూ త్వరలో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(Ministry of Road Transport and Highways) ప్రకటించింది. ఈ నగరాలను హసన్ ప్రాంతం మీదుగా అనుసంధానిస్తామని తెలిపింది.ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఈ రెండు నగరాల ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఏడు నుండి ఎనిమిది గంటలు వరకూ తగ్గే అవకాశం ఉందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కర్ణాటక ప్రజా పనుల శాఖ(Karnataka Public Works Department) సంయుక్తంగా చేపట్టనున్నాయని తెలిపింది.ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రధాన లక్ష్యం బెంగళూరు వెలుపలి ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం. ఈ ఎక్స్‌ప్రెస్ వే 335 కి.మీ. దూరం ఉంటుంది, నాలుగు నుండి ఆరు లేన్లుగా దీనిని నిర్మించనున్నారు. ఈ బెంగళూరు-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే(Bengaluru-Mangalore Expressway) నిర్మాణం 2028లో ప్రారంభం కానుంది . ఇది రాష్ట్ర రవాణా రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి చాలా సమయం పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే పలు ఇబ్బందులు ఎదువుతుంటాయ. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ మాట్లాడుతూ బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సమస్యను రాబోయే రెండు,మూడు ఏళ్లలోపు పరిష్కరించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత? -
ఐఏఎస్ రోహిణి Vs ఐపీఎస్ రూపాల వివాదం మళ్లీ తెరపైకి..!
బెంగళూరు: ఒక మహిళా ఐఏఎస్ ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపా డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం బెంగళూరులో మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతున్న తరుణంలో వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్ర పరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్- రిలయన్స్ జియోలకు ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. అదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా ఐపీఎస్ రూపా డి మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.ఐపీఎస్ రూపా డి విచారణకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో ఈ నెల ఆరంభంలో విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.రాజీ కుదరలేదు..!వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది.కాగా, సుమారు రెండేళ్ల క్రితంఐఏఎస్ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా డి అంటున్నారు. -
బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. -
దేవుడే దిగి వచ్చినా.. డీకేఎస్ వ్యాఖ్యలపై దుమారం
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. భగవంతుడే స్వయంగా వచ్చినా బెంగళూరు నగరం బాగుచేయలేడంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఇటు నగరవాసులు.. అటు రాజకీయ వర్గాలు ఆయనపై మండిపడుతున్నాయి. ‘బెంగళూరు నగరాన్ని రాత్రికి రాత్రే మార్చేయలేం. ఈ మహా నగరం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో మారదు. ఒకవేళ దేవుడే తల్చుకున్నా(Even God) అది సాధ్యపడదు. నగరాన్ని బాగు చేయాలంటే.. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అది జరగాల్సిందే తప్ప మరో మార్గం లేదు’’ అని శివకుమార్ ఓ వర్క్‌షాప్‌లో వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరులో ట్రాఫిక్‌జామ్(Bengaluru Traffic Troubles) వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ పెరిగిపోవడంతో.. పలువురు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వయానా డిప్యూటీ సీఎం నెగెటివ్ కామెంట్లు చేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రకటించారే తప్ప.. వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, ఆరిన్ కాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పై(Mohan Das Pai) డీకేఎస్ స్టేట్మెంట్పై ఫైర్ అయ్యారు. ‘‘శివకుమార్గారూ.. మీరు మంత్రి అయ్యి రెండేళ్లు కావొస్తోంది. ఒక బలమైన నేతగా మీకు ఆహ్వానం పలికాం. కానీ, మా బతుకులు మరింత హీనంగా తయారవుతున్నాయి’ అంటూ ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. అలాగే.. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రాజెక్టులెన్నో నిలిచిపోయాయని అంటున్నారాయన. ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ కూడా సరిపడా లేదని తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, నగరానికి సుమారు 5,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని, మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు.Minister @DKShivakumar it has been 2 years since you became our Minister! We applauded and welcomed you as a strong Minister.But our lives have become much worse!Big projects announced!Will take very long and delayed as govt has not completed any project in city on time! Why… https://t.co/32Kqkzrviv— Mohandas Pai (@TVMohandasPai) February 20, 2025ఇక రాజకీయంగానూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘బ్రాండ్ బెంగళూరు’’ అంటూ నినాదం ఇచ్చిన వ్యక్తి.. ఇవాళ దేవుడు కూడా సరి చేయలేడంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ అంటోంది. ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇసతే.. ఈ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని బీజేపీ నేత మోహన్ కృష్ణ విమర్శించారు. అయితే విమర్శల నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు సమస్యలను పరిష్కరించే బాధ్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే నగరంలో కొత్త రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యను తప్పించే ప్రణాళికతో కూడిన హ్యాండ్‌బుక్‌ను రిలీజ్ చేశామని అంటున్నారు. -
ఆహా అనిపిస్తున్న.. బెంగళూరులోని గూగుల్ కొత్త ఆఫీస్ (ఫోటోలు)
-
సవతికి చిత్రహింసలు
బాగేపల్లి : నా భర్తకే వల వేస్తావా అని రెండో భార్యను మొదటి భార్య బంధువులు ఫాంహౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన గుడిబండ తాలూకా జిగానహళ్లిలో జరిగింది. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర నివాసి గంగరాజు తన అమ్మమ్మ గారి ఊరైన జిగానహళ్లికి వచ్చివెళ్తుండేవాడు. తన అక్క తరఫు బంధువులైన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయినా గంగరాజు బెంగళూరుకు చెందిన సంగీత అనే యువతిని కూడా ప్రేమించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.సంగీత, గంగరాజు బుధవారం జిగానహళ్లికి వచ్చారు. ఈక్రమంలో మొదటిభార్య బంధువులు సంగీతను ఫాంహౌస్‌లో బంధించి హింసించారు. పోలీసులు వచ్చి సంగీతను రక్షించి నిందితులను అరెస్టు చేశారు. సంగీత మొహం గుర్తుపట్టలేనంతగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
అరుంధతితో అనైతిక సంబంధం..బెంగళూరులో దారుణం
కృష్ణరాజపురం: అనైతిక సంబంధాలు రక్తపాతానికి కారణమవుతున్నాయి. తన భార్యతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని ఆమె భర్త కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ప్రియుడు హతం కాగా, భార్య చావు బతుకుల్లో ఉంది. బెంగళూరు మహాదేవపుర పరిధిలోని కాడుగోడి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. నిందితుడు యల్లప్ప. ఇతని భార్య అరుంధతి. మరో వ్యక్తి కిషోర్. కిషోర్ తన భార్యతో గొడవపడి కొన్నినెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ సమయంలో అతడు అరుంధతితో అనైతిక సంబంధం పెట్టుకున్నాడు. ఇది చూసి యల్లప్ప సహించలేకపోయాడు. ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో కత్తితో విరుచుకుపడ్డాడు. కిషోర్‌ను గొంతు కోశాడు. భార్యను కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికే కిషోర్ చనిపోయాడు. అరుంధతి పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. -
బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్ - ఇదే..
టెక్ దిగ్గజం గూగుల్ (Google) బుధవారం బెంగళూరులో తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు పెట్టినట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. అంతర్జాతీయంగా తమకున్న భారీ కార్యాలయాల్లో ఇది కూడా ఒకటని పేర్కొంది.నేవిగేషన్కి సులభంగా ఉండేలా అనంతలోని ప్రతి ఫ్లోరు.. వీధుల నెట్వర్క్లాగా ఉంటుందని పేర్కొంది. చిరకాలంగా టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, దేశీయంగా అంకుర సంస్థలు .. యాప్ వ్యవస్థలు వృద్ధి చెందుతున్న తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కోట్ల మంది జీవితాల్లో పరివర్తన తెస్తున్నాయని వివరించింది.వివిధ ఉత్పత్తులు, ప్లాట్‌ఫాంలతో కోట్ల మంది యూజర్లకు చేరువ కావడానికి తమకు భారత్‌లో ప్రత్యేక అవకాశం లభించిందని తెలిపింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది.గూగుల్ అనంతలో 100 శాతం మురుగునీటి రీసైక్లింగ్, వర్షపునీటి సేకరణ.. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి పెద్ద స్మార్ట్ గ్లాస్ ఇన్స్టాలేషన్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ మెటీరియల్స్ కోసం దాదాపు పూర్తిగా స్థానికంగా ఉన్నవాటినే ఉపయోగించారు. భారతదేశం ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైన అవకాశాన్ని సూచిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట
బెంగళూరు : ముడా కేసులో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు భారీ ఊరట దక్కింది. ఆయనకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.ముడా స్కాం ఇదే..మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.కాగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది. -
థియేటర్లో ప్రకటనలపై కోర్టు కీలక తీర్పు
బెంగళూరు: సరదాగా సినిమా చూద్దామని వెళితే తన విలువైన సమయం వృథా చేశారని ఓ యువ న్యాయవాది థియేటర్‌పై కేసు వేశారు. ఈ కేసులో వినియోగదారుల కోర్టు న్యాయవాదికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతనికి రూ.65వేల నష్టపరిహారం చెల్లించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. 2023లో బెంగళూరులో అభిషేక్ అనే న్యాయవాది బుక్‌మైషో ప్లాట్‌ఫాంలో టికెట్లు బుక్ చేసుకొని పివిఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమాకు వెళ్లారు.సినిమా ప్రదర్శించే ముందు థియేటర్లో 25 నిమిషాల పాటు ప్రకటనలు వేశారు. దీంతో యువ న్యాయవాదికి చిర్రెత్తుకొచ్చి థియేటర్‌పై కేసు వేసి విజయం సాధించారు.ఈ కేసులో తీర్పిచ్చే సందర్భంగా వినియోగదారుల కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమయం డబ్బులతో సమానమని, అభిషేక్ విలువైన టైమ్ వేస్ట్ చేసినందుకు అతడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ప్రకటనలు వేయడాన్ని థియేటర్ యాజమాన్యం సమర్థించుకుంది. తాము కొన్ని ప్రకటనలు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. -
'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్
చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ తెచ్చుకోవాలని, ఎక్కువ ప్యాకేజ్ పొందాలని అనుకుంటారు. కానీ ఇటీవల ఒక టెకీ 'ఉద్యోగం ఇవ్వండి, ఉచితంగానే పని చేస్తా' అని అంటున్నాడు. అతని రెజ్యూమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తాను 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, కానీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కూడా సమయం ఉద్యోగం పొందలేకపోయానని చెప్పాడు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో, ఉచితంగా పనిచేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నా రెజ్యూమ్‌ను కాల్చండి.. కానీ దయచేసి సహాయం చేయండి. సమీపంలో ఉద్యోగం దొరికితే ఉచితంగానే చేస్తాను. ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాను.. అని ఆ యూజర్ రెడ్డిట్‌లో రాశారు. “నేను జావా, పైథాన్, డెవ్ఆప్స్ (DevOps), క్లౌడ్ కంప్యూటింగ్,మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందాను. సీఐ/సీడీ పైప్లైన్లు, డాకర్, కుబెర్నెట్స్, ఏపీఐ డెవలప్మెంట్తో పనిచేసిన అనుభవం కూడా ఉందని.. రెజ్యూమ్‌లో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన.. ఈ సారి ఎంతంటే?కాలేజీలో చదువు పూర్తయిన తరువాత.. ఫుల్ టైమ్ జాబ్ పొందలేకపోయాను. ఇప్పటికే రెండు కంపెనీలలో ఒక్కో నెల ఇంటర్న్‌గా పనిచేశాను. ఇంటర్న్‌షిప్‌లు, ఫ్రీలాన్స్ గిగ్‌లు లేదా ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్‌లు వంటి ఏవైనా అవకాశాల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండని టెకీ తన పోస్టులో పేర్కొన్నాడు.నేను ప్రొడక్ట్ ఇంజనీర్ ఇంటర్న్, టెక్నికల్ ఇంటర్న్‌గా ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నప్పుడు.. వెబ్ క్రాలర్లు, ఏపీఐ టెస్టింగ్, ఎంఎల్ సిస్టమ్‌లపై పనిచేశాను. ఐఈఈఈలో రీసర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశాను. డీప్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ప్రాజెక్టులను నిర్మించాను" అని టెకీ చెప్పారు.Burn my resume but please help. Desperate & Ready to Work for Free Remotely – 23' Grad Looking for a Job ASAPbyu/employed-un inIndianWorkplace -
‘అమ్మా బంగారు తల్లీ.. కారులో అలా చేయొద్దమ్మా!’
వైరల్: కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో.. అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్‌ట్యాప్‌లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్‌లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్‌ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్‌లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు."work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025 -
#AeroIndia2025 : ఆకాశంలో అద్భుతాలు చేసిన యుద్ధ విమానాలు (ఫోటోలు)
-
ఏరో ఇండియా ప్రదర్శన..ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు (ఫొటోలు)
-
అలరించిన ఏరో ఇండియా
సాక్షి బెంగళూరు: ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక మహాకుంభమేళ జరుగుతుంటే బెంగళూరు వైమానిక మహాకుంభమేళ జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం బెంగళూరు సమీపంలోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో 15వ ఎడిషన్ ఏరో ఇండియా ప్రదర్శనను మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక శక్తిని, సంస్కృతిని చాటిచెబుతుంటే యలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా ప్రదర్శన మన దేశ పరాక్రమాన్ని, రక్షణ సామార్థ్యాలను యావత్తు ప్రపంచానికి చాటిచెబుతోందని తెలిపారు.ఇక్కడికి తరలివచ్చిన అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచారని ప్రశంసించారు. దేశంలో, ముఖ్యంగా వైమానిక రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ షో ఆçహూతులను విశేషంగా అలరించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తేజస్ యుద్ధ విమానాన్ని నడిపి విన్యాసాలను ప్రారంభించారు.తేజస్, సుఖోయ్, సూర్యకిరణ్ తదితర యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ఇంకా, అత్యాధునిక, 5వ తరం లాక్‌హీడ్ మార్టిన్ తయారీ అమెరికా యుద్ధ విమానం ఎఫ్–35, రష్యాకు చెందిన ఎస్‌యూ–57 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అనంతరం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)ల సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాగా, ఈ షో అయిదు రోజులపాటు జరగనుంది. -
అంబరమంటే సంబరం..నేటి నుండి ఏరో ఇండియా ప్రదర్శన (ఫొటోలు)
-
నేటి నుంచి ఏరో ఇండియా
న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా’15వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదిక కానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్‌యూ–57, అమెరికాకు చెందిన ఎఫ్–35 లైట్నింగ్ 2 ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వివరాలను ఆదివారం రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఇండియా కార్యక్రమంగా నిలవనుంది. ఈ ఎడిషన్‌ను ‘ది రన్ వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’అనే ఇతివృత్తంతో చేపట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది . ఇందులో 90 వరకు దేశాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని వివరించింది. సుమారు 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు మరో 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపింది. -
సాటి లేరెవరూ నీ సాహసానికి!
బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్‌గా మారింది.‘రోయింగ్‌ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది. -
కిలాడీ పనిమనిషి
కర్ణాటక: ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్న ఇంటిలోని గుట్టుమట్లను తెలుసుకుంది, ఓ రోజు బంగారు, నగదు చోరీ చేసి, చివరకు కటకటాల పాలైన పనిమనిషి ఉదంతమిది. వివరాలు.. పరప్పన అగ్రహార ఠాణా పరిధిలోని ఓ ఇంటిలో నిందితురాలు పనిచేసేది. చాలా బంగారు ఆభరణాలు, నగదు ఉండటాన్ని గమనించిన కిలాడీలో దుర్బుద్ధి పుట్టింది. బంగారు నగలు, నగదు మాయం చేసి ఏమీ తెలియనట్లు పని చేసుకుంటోంది. సొత్తు కనబడకపోవడంతో ఇంటి యజమాని ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కాగానే భర్త, అతని అన్నతో కలిసి నిందితురాలు పరారైంది. పోలీసులు గాలింపు జరిపి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 లక్షల విలువ చేసే 273 గ్రాముల బంగారం, నగదును స్వాదీనపరచుకున్నారు. -
చలాన్లలో ట్రిపుల్ సెంచరీ..!
బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ ఆటలో కొట్టింది కాదు.ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా 311సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి నగరంలోనే అత్యధిక ఉల్లంఘనల చలాన్లు పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామి స్కూటర్‌ను అతడే కాక అతడి బంధువులు ఇద్దరు ముగ్గురు తరచుగా నడపుతుంటారు.స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ మీద బైక్ ఆపడం లాంటి ఉల్లంఘలనకు పాల్పడ్డారు.అయితే 311 చలాన్లు జారీ చేసినప్పటికీ పెరియస్వామి నుంచి జరిమానా వసూలు చేయడంపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టలేదు.అయితే ఓ నెటిజన్ షిబమ్ పెండింగ్ చలాన్ల విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఎక్స్(ట్విటర్)లో పెట్టారు.దీంతో ఈ విషయం సోషల్‌మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.సోషల్‌మీడియాలో ఈ వివాదంపై చర్చ మొదలవడంతో సిటీ మార్కెట్ పోలీసులు పెరియస్వామి ఆఫీసుకు వెళ్లారు. చలాన్ల విషయం చెప్పారు. దీనికి షాక్‌కు గురైన పెరియస్వామి తొలుత కొంత మొత్తం చెల్లిస్తానని, తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పారు.జరిమానాలన్నీ కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషనలో వదిలేస్తే బెటరని పెరియస్వామికి సలహా ఇవ్వడం విశేషం. -
లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్: ప్రముఖ కంపెనీ ఆఫర్
ఉద్యోగం ఇచ్చేవాళ్లు విద్యార్హత చూస్తారు.. లేదా స్కిల్స్ చూస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం దీనికి భిన్నమైన రూల్స్ పెట్టింది. లవ్‌లో కనీస ఒకసారైనా బ్రేకప్ అయి ఉండాలని కూడా ఒక కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటి? దానికి కావాల్సిన మరిన్ని అర్హతలు ఏమిటనేవి ఇక్కడ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు ఆ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. కనీసం 2-3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలి. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్ఫిషింగ్కు తావులేదని స్పష్టం చేసింది. అవసరమైన అన్ని లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు.. ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: పనిగంటలపై 78 శాతం మంది అభిప్రాయమిదే..ఇప్పుడు జాబ్ ఆఫర్ చేసిన బెంగళూరు కంపెనీలో ఉద్యోగం చేయడానికి ప్రత్యేకంగా ఎంబీఏ, ఎంసీఏ వంటివి అవసరం లేదు. ఉద్యోగానుభవం అంతకంటే అవసరం లేదు. ప్రేమ పిపాసులై, ప్రేమ భాషలో నిష్ణాతులైన వారు ఎవ్వరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే జీతం గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాలను కంపెనీ పరిశీలిస్తుంది.Hiring Alert! We are looking for a Chief Dating Officer. Are you the go-to friend for dating advice? We’re hiring someone who lives and breathes dating culture. The self-proclaimed matchmaker who can decode “ghosting,” “breadcrumbing,” and every new dating buzzword in the… pic.twitter.com/yqyJJiCVJy— Nimisha Chanda (@NimishaChanda) January 29, 2025 -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్‌కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్‌ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్‌కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్‌కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్‌పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
ఆ రేంజ్ ధర పలికే ఇడ్లీలా..?
ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్‌ని బట్టి ధరలు కూడా వేరేలెవల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది. బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్‌కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్‌కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్‌లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్‌కి నాలుగున్నర మార్కులే వేశాడు. ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్‌లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్‌గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్‌గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! ) -
‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!
న్యూఢిల్లీ: భార్య వేదింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ నాలుగేళ్ల కుమారుడి సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాలుడి తల్లి నిఖితా సింఘానియా సంరక్షణలోనే ఉంచాలని సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. తన మనువడిని తనకు అప్పగించాలని కోరుతూ అతుల్ సుభాష్ తల్లి అంజు దేవి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఇవాళ విచారణ జరిగింది. బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్సీ శర్మ సోమవారం అతుల్ సుభాష్ కుమారుడు ఆన్లైన్లో వీడియో ద్వారా మాట్లాడారు. అనంతరం తీర్పును వెలువరించారు.విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కోర్టు వ్యాఖ్యలపై 45 నిమిషాల విరామం తర్వాత బాలుడు వీడియో లింక్‌లో ప్రత్యక్షమయ్యాడు. వీడియోలో కనిపిస్తున్న అతుల్ సుభాష్ కుమారుడితో మాట్లాడారు. ఆ సమయంలో కోర్టు విచారణను ఆఫ్ లైన్ చేసింది. ఇక బాలుడితో మాట్లాడిన తర్వాత అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా కుటుంబసభ్యుల సమక్షంలో ఉండాలని సుప్రీం అత్యున్నత న్యాయ స్థానం తీర్పును వెలువరించింది. అతుల్ సుభాష్ కేసేంటి?ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో.. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. -
పుష్ప ప్రదర్శనలో సినీ నటి ప్రేమ సందడి (ఫొటోలు)
-
పెళ్లికి సహాయం చేస్తానని పిలిచి..
శివాజీనగర: అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై వ్యాపారి, మాజీ బీజేపీ నాయకుడు సోమశేఖర్ జయరాజ్ (జిమ్ సోమ)పై అశోక్ నగర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్థిక సహాయం చేస్తానని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారని 26 సంవత్సరాల బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారురాలికి తన స్నేహితురాలి ద్వారా సోమశేఖర్ పరిచయం అయ్యాడు. గత సంవత్సరం వివాహం నిర్ణయం కావటంతో రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సోమశేఖర్‌ను బాధితురాలు కోరింది. గత అక్టోబర్‌లో డబ్బు ఇస్తానని చెప్పి లాంగ్ ఫోర్ట్ రోడ్డులో ఉన్న తన ప్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని సోమశేఖర్ బెదిరించినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా పరారీలో ఉన్న సోమశేఖర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సకలేశపుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమశేఖర్... జేడీఎస్‌కు చెందిన హెచ్.కే.కుమారస్వామి చేతిలో ఓటమిపాలయ్యాడు. -
చిరుతను బంధించిన ధైర్యశాలి
తుమకూరు: చిరుత కనిపించిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఓ యువకుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రాణాలకు తెగించి ఓ చిరుతను తోక పట్టుకొని బోనులోకి నెట్టేశాడు. ఈఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా రంగాపురం వద్ద జరిగింది.గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా అటవీశాఖ అధికారులు సమీపంలో బోను ఏర్పాటు చేశారు. పరలేహళ్లి రోడ్డులోని కుమార్ అనే వ్యక్తికి చెందిన తోటలో చిరుత నిద్రావస్థలో ఉండగా దానిని బంధించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది సకల సరంజామాతో వచ్చారు.అయితే చిరుతను పట్టుకునేందుకు భయంతో వెనుకాడుతుండగా గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చిరుత తోకను పట్టుకుని బోనులోకి లాగి పడేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అటవీ సిబ్బంది వల విసిరి చిరుతను బంధించడంలో సఫలమయ్యారు. కాగా యువకుడి ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. The #forest department officials with the help of a local youth Anand captured a #leopard at Rangapur Village in #Tumakuru... pic.twitter.com/QFrdogAvqt— Yasir Mushtaq (@path2shah) January 7, 2025 -
అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది
బెంజ్, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని కార్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వింటేజ్ కార్లు కనుమరుగైపోయాయి. దీనికి కారణం.. ఆ కార్లను కంపెనీలు తయారు చేయడం ఆపేయడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వింటేజ్ కార్లు (Vintage Cars) లేదా పాతకాలం కార్లను కొనుగోలు చేయడానికి.. ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు అలాంటి కార్లను కొనుగోలు చేయడం ఓ కలగా పెట్టుకుంటారు. ఇటీవల బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళ ఓ పాతకాలం కారును కొనుగోలు చేసి.. కల నెరవేరిందని సంబరపడిపోయింది.బెంగళూరుకు చెందిన 'రచన మహదిమనే' అనే మహిళ.. 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి ఈ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన కారును కొనుగోలు చేసింది.బెంగళూరు మహిళ కొనుగోలు చేసిన ప్రీమియం పద్మిని కారు చూడటానికి కొత్త కారు మాదిరిగానే ఉంది. దీని కోసం ఈమె ప్రత్యేకంగా కారుకు మరమ్మతులు చేయించింది. ఈ కారణంగానే ఆ కారు కొత్తదాని మాదిరిగా కనిపిస్తోంది. నా పుట్టినరోజు సందర్భంగా.. నేను కారు కొన్నాను. ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుంచి ఈ కారు గురించి కలలు కన్నాను అని ఆమె వీడియోలో వెల్లడించారు.గతంలో మన చుట్టూ ఉన్న ప్రీమియర్ పద్మిని కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు నేను దీనిని డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని మహదిమనే పేర్కొంది. పాతకాలపు కార్లను ఉపయోగించాలని అందరికీ ఉంటుంది. కానీ బహుశా అది అందరికీ సాధ్యం కాదు. అయితే పాతకాలపు కారును ఎంతో ఇష్టంగా మళ్ళీ పునరుద్ధరించి, డ్రైవ్ చేయడాన్ని చూసి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు వినియోగదారులు ఈ ఐకానిక్ వాహనం గురించి తమ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఫ్యాన్సీ లగ్జరీ కార్ ఛేజింగ్ ప్రపంచంలో ప్రీమియర్ పద్మిని చెప్పుకోదగ్గ మోడల్ అని ఒకరు పేర్కొన్నారు. మా తాత అంబాసిడర్లో పని చేసేవారు. అంతే కాకుండా పద్మిని పేరు పెట్టడానికి ఆయన కూడా బాద్యుడు. నేను పద్మినిలో డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane)ప్రీమియర్ పద్మినిప్రీమియర్ పద్మిని కార్లను.. ఇటాలియన్ కంపెనీ 'ఫియట్' లైసెన్స్‌తో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) తయారు చేసింది. ఇది ఫియట్ 1100 సిరీస్ ఆధారంగా తయారైంది. 1964లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారుని మొదట ఫియట్ 1100 డిలైట్ అని పిలిచేవారు. ఆ తరువాత దీనిని 1970లలో 'ప్రీమియర్ పద్మిని' పేరుతో పిలిచారు.ప్రీమియర్ పద్మిని కారు.. గుండ్రని అంచులు, క్రోమ్ గ్రిల్ వంటి వాటితో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద స్టీరింగ్ వీల్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో కూడిన ఇంటీరియర్లు అన్నీ ఉన్నాయి. రోజువారీ వినియోగానికి ఈ కారును ఒకప్పుడు విరివిగా ఉపయోగించారు.ఇదీ చదవండి: 'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..1970, 1980లలో సినిమాల్లో ఈ కార్లను విరివిగా ఉపయోగించారు. ఆ తరువాత కాలంలో మారుతి 800 భారతదేశంలో అడుగుపెట్టాక.. ప్రీమియర్ పద్మిని కార్లకు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2000వ సంవత్సరంలో నిలిపివేసింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది సినీతారలు తమ గ్యారేజిలలో ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రజనీ కాంత్, మమ్ముట్టి వంటివారు ఉన్నారు. -
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు. -
ఇద్దరు పిల్లలను చంపి ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య!
సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్ రెండో లేఅవుట్లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది. అనూప్ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్టప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. బెంగళూరు–మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో 2022 నవంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తీర్పు వెలువరించింది. రాజ్యాంగ(44 సవరణ) చట్టం–1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300ఏ ప్రకారం.. ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను ఆదేశించింది. -
గులాబ్ జామూన్‌తో మాజీ మంత్రికి చిక్కులు
దొడ్డబళ్లాపురం: శ్వేతా గౌడ అనే మహిళ మాజీ మంత్రి పేరు చెప్పుకుని బెంగళూరు కమర్షియల్ వీధిలో ఓ జ్యువెలరీ షాప్ నుంచి రూ. 2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వకుండా టోకరా ఇచ్చిన కేసు మలుపు తిరిగింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ భారతినగర పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిందితురాలు.. ఆయన ముద్దుగా పిలుచుకునే గులాబ్ జామూన్.. శ్వేతాగౌడ ఇచ్చిన మొత్తం రూ.12.50 లక్షల విలువైన నగదు, గిఫ్ట్‌లు, బంగారు నగలను పోలీసు అధికారులకు అప్పగించారు. శ్వేతగౌడ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఆమె అడగకుండానే కానుకలు ఇచ్చిందని పోలీసులకు వర్తూరు తెలిపారు. తన పేరు చెప్పగానే జ్యువెలరీ షాప్ యజమాని కోట్ల విలువైన నగలను ఆమెకు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.ఫేస్బుక్లో పరిచయమై..అయితే శ్వేతా గౌడ, వర్తూరు ప్రకాశ్ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని, అనేకసార్లు మైసూరు చాముండి కొండకు వెళ్లారని, తిరుమల కొండకు వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మూడు నగల షాపుల్లో షాపింగ్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. 6 నెలల క్రితం శ్వేతాగౌడ వర్తూరుకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైందని, తరువాత వాట్సాప్, మెసెంజర్లలో ఘాటుగా చాటింగ్ చేసుకున్నారని, శ్వేతగౌడ మొబైల్ నంబర్‌ను గులాబ్ జామూన్ అని వర్తూరు ప్రకాశ్ సేవ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.మరో ఆభరణాల మోసం..యశవంతపుర: మాజీ ఎంపీ డికే సురేశ్ చెల్లినని చెప్పుకొంటూ మహిళ ఒకరు 14.6 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి మోసం చేసిన ఘటన బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐశ్యర్య గౌడ, నటుడు ధమేంద్ర, హరీశ్ అనే వ్యక్తులపై కేసు నమోదైంది. ఐశ్వర్య.. ఓ నగల దుకాణానికి వెళ్లి 11 సార్లు బంగారాన్ని కొనుగోలు చేసి మాజీ ఎంపీ పేరు చెప్పి వెళ్లిపోయింది. దీంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హలో అన్నాడు.. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు
బెంగళూరు : హలో సార్..! మేం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఆధార్ కార్డ్‌తో మనీ లాండరింగ్, ఆధార్ కార్డ్‌కు జత చేసిన సిమ్‌ను తప్పుడు ప్రకటనల కోసం వినియోగిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అగంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఓ ఐటీ ఉద్యోగి రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల టెక్కీ డిజిటల్ అరెస్ట్ అయ్యారు. నవంబర్ 11న బాధితుడికి తాను ట్రాయ్ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన సిమ్ కార్డుతో అక్రమ ప్రకటనలు, మహిళల్ని వేదించేలా వారికి మెసేజ్‌లు పంపేందుకు ఉపయోగిస్తున్నారని, దీనిపై ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు చెప్పాడు. దీంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. మేం మీకు ఫోన్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచండి. కేసును ఆన్లైన్లో విచారిస్తాం. సహకరించండి. వర్చువల్‌గా విచారించేందుకు మీరు ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి అని కోరాడు. ఆ తర్వాత బాధితుడికి నకిలీ ముంబై పోలీసు యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఓ వ్యాపార వేత్త మీ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి రూ.6 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీనిపై కేసు నమోదైందని మరింత భయపెట్టించాడు. అయితే, నవంబర్ 25న, పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి బాధితుడికి ఓ యాప్ నుంచి కాల్ చేశాడు. మీ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం, మీరు మా విచారణకు సహకరించాలి. లేదంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. ముందుగా వెరిఫికేషన్ నిమిత్తం చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించాడు. బాధితుడు అరెస్టుకు భయపడి నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.11.8కోట్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. అది సరిపోదని ఇంకా కావాలని డిమాండ్ చేయడం తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే తాను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బెంగళూరు యాక్సిడెంట్.. అసలేం జరిగింది?
బెంగళూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు దుర్మరణం పాలవడంతో రహదారి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోడ్ టెర్రర్‌పై భయాందోళన వ్యక్తం చేస్తూ నెటిజనులు ఆన్లైన్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్లకు గల కారణాలను ఏకరువు పెడుతున్నారు. బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రకు వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో అంతమవడం తీవ్రంగా కలిచివేసింది. మృతులను బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), ఆయన భార్య గౌరాబాయి(42), వారి పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు.అసలేం జరిగింది?బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న చంద్రం యోగప్ప తన సొంతూరిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వోల్వో కారులో మహారాష్ట్రలోని విజయపురకు బయలుదేరారు. హైవేపై వెళుతుండగా నెలమంగళ వద్ద భారీ కంటైనర్ లారీ హఠాత్తుగా వీరి కారుపై పడిపోయింది. ప్రమాదం ధాటికి కారులోని వారు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించినా ఫలితం లేకపోయింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ మీడియాతో చెప్పాడు. తన ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో కంటైనర్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారుపై పడిందని వివరించాడు. అయితే ఈ ప్రమాదంలో ఆరిఫ్‌కు కాలిరిగింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, కంటైనర్ లారీలో 26 టన్నుల అల్యూమినియం స్తంభాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.సోషల్ మీడియాలో చర్చబెంగళూరు రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. మనం ప్రయాణించే వాహనం ఎంత సురక్షితమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించలేవని చాలా మంది అభిపప్రాయపడ్డారు. సురక్షితమైన రోడ్లు, సుశిక్షితుడైన డ్రైవర్, రక్షణ ప్రమాణాలు కలిగిన వాహనం.. ఈ మూడింటితో ప్రమాదాలు నివారించవచ్చని ‘డ్రైవ్ స్మార్ట్’ పేర్కొంది. దీనిపై పలువురు నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెత్త రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. కంటైనర్లు, లారీల్లో ఓవర్‌లోడ్ తీసుకెళ్లకుండా ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు.చదవండి: తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరంఊహించని విధంగా మరణం.. ‘ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా వోల్వో XC90 ప్రసిద్ధి చెందింది. 2002లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి యూకేలో ఒక్క ప్రాణాంతక ప్రమాదానికి గురికాలేదు. అలాంటి సురక్షితమైన కారులో ప్రయాణిస్తూ ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. కంటైనర్ ట్రక్ అదుపు తప్పి, డివైడర్‌ను దాటి కారుపై పడి యజమానితో పాటు అతడి కుటుంబ సభ్యులను బలితీసుకోవడాన్ని ఎవరూ ఊహించరు. ఎంత మంచి ప్రమాణాలు కలిగిన కారు అయిన ఇంత భారీ బరువు మీద పడితే కచ్చితంగా నలిగిపోతుంది. సురక్షితంగా ప్రయాణించేందుకు మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎవరూ ఊహించని విధంగా మరణం మన దరికి చేరడం విషాదమ’ని స్కిన్ డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.చదవండి: చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలుప్రతిగంటకు 19 మంది బలి‘మీరు సురక్షితమైన కార్లను తయారు చేయవచ్చు, కానీ భారతదేశం అత్యంత అసురక్షిత రహదారులను నిర్మిస్తుంది. జాతీయ రహదారులు గందరగోళంగా ఉంటాయి. కొన్ని వందల రూపాయలు ఖర్చు చేస్తే చాలు డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చేస్తాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, చెత్త రోడ్ల కారణంగా మనదేశంలో ప్రతిగంటకు 19 మంది బలైపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ రహదారులు దేశ భవిష్యత్తును చంపేస్తున్నాయ’ని మరో నెటిజన్ పేర్కొన్నారు. -
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. వీకెండ్సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. — SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024 -
మొన్న టెక్కీ అతుల్.. ఇప్పుడు పోలీస్ తిప్పణ్ణ
కృష్ణరాజపురం: నా భార్య, ఆమె కుటుంబీకుల వేధింపులను భరించలేను. అన్ని విధాలా వేధించి నరకం చూపుతున్నారు. నాకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ న్యాయం చేయాలని వేడుకుంటూ అతుల్ సుభాష్ అనే టెక్కీ బెంగళూరులో ఉరివేసుకోవడం దేశమంతటా చర్చనీయాంశమైంది. కుటుంబ హింస చట్టాలను సవరించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. నీవు చచ్చినా ఫరవాలేదని దూషణలు అంతలోనే ఐటీ నగరిలో మరో హృదయ విదారక దుర్ఘటన జరిగింది. భార్య, మామ వేధింపులను భరించలేక ఓ హెడ్‌కానిస్టేబుల్ ఇక జీవితం చాలనుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు.. విజయపుర జిల్లా సిందగి తాలూకా హందిగనూరు గ్రామానికి చెందిన తిప్పణ్ణ (35) బెంగళూరు సిటీ పోలీసు విభాగం పరిధిలో హుళిమావులో సివిల్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని భార్య, మామ వేధిస్తున్నట్లు తెలిసింది. తరచూ అతన్ని కించపరుస్తూ సతాయించేవారు. ఈ నెల 12న కూడా భార్య, మామ ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. నీవు చచ్చినా ఫరవాలేదు, నా కూతురు హాయిగా జీవిస్తుంది అని మామ నిందించాడు. ఈ పరిణామాలతో జీవితంపై విరక్తి చెందిన తిప్పణ్ణ డెత్‌నోట్ రాసి, రైలు కింద పడ్డాడు. డ్యూటీ నుంచి నేరుగా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. తండ్రి ఫిర్యాదు తన కుమారుని మృతిపై న్యాయం చేయాలని శుక్రవారం అర్ధరాత్రి మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్లో ఆత్మహత్యకు ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద భార్య, మామపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మర ణోత్తర పరీక్ష కోసం సీవీ రామన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
#Men Too: నిఖితా సింఘానియా కుటుంబం అరెస్ట్
బెంగళూరు: భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34) కేసు కీలక మలుపు తిరిగింది. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్‌ను ఆదివారం ఉదయం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అతుల్ భార్య నికితా సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు మరో పోలీసు అధికారి ధృవీకరించారు.#AtulSubhash's wife Nikita Singhania, her mother & brother arrested by Karnataka Police. pic.twitter.com/sTB98N2XTN— Mr Sinha (@MrSinha_) December 15, 2024ఇదిలా ఉంటే.. తన సోదరుడు అతుల్ సుభాష్ అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు బికాస్ కుమార్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఆదివారం ఉదయం వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే, కేసు విచారణ నిమిత్తం మూడు రోజుల్లోగా హాజరుకావాలని నిందితులకు బెంగళూరు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు నిఖితా సింఘానియా.. 2019లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతుల్ సుభాష్‌కు పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు ఈ జంట మకాం మార్చింది. వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అయితే.. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.आत्महत्या से पहले का #AtulSubhash का 63 मिनट का ये पूरा वीडियो सुनकर निःशब्द और विचलित हूं। उफ़ ! #JusticeForAtulSubhash pic.twitter.com/lFDQZFLEBV— Vinod Kapri (@vinodkapri) December 10, 2024కొడుకును తీసుకుని నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత మూడేళ్లుగా ఆమె సుభాష్‌కు దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలోనే జౌన్పూర్ కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేసింది. అలాగే.. అతుల్, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 9 కేసులు నమోదు చేయించింది. శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, పైగా వరకట్న వేధింపులతో తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం.. లాంటి అభియోగాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. అయితే అతుల్ మరణంతో.. అతన్ని అంతగా వేధించిన ఆమెను ఉద్యోగం తొలగించాలంటూ సదరు కంపెనీలకు పలువురు రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో బికాస్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం అతుల్ సుభాష్ భార్య,అత్త,బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగళూరు టెక్కీ తండ్రి సంచలన ఆరోపణలు
పాట్నా : భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ (34) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని ఓ న్యాయవాది అతుల్ సుభాష్‌ను డిమాండ్ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుభాష్, నిఖితలకు 2019లో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో నిఖిత.. సుభాష్‌ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో అతుల్‌పై, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం తన కుమారుడు సుభాష్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కి 40కి కంటే ఎక్కువ సార్లు తిరిగాడని బాధితుడి తండ్రి పవన్ కుమార్ మీడియా ఎదుట వాపోయాడు.కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ‘కేసు పరిష్కరించేందుకు’ రూ.5 లక్షలు అడిగారని ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము సిద్దమైనట్లు చెప్పారు. ఆ సమయంలో తాను మధ్యవర్తిత్వం వహించినందుకు ఓ న్యాయవాది తనని ముందు రూ.20 వేల అడిగారని, ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని అన్నారు. అప్పుడే న్యాయమూర్తి అతనికి (సుభాష్) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. Atul Subhash’s father shares how the judiciary systematically harassed his son and family. It’s so painful to watch. 😣To everyone involved, remember—karma is real, and you have your family too.😏#JusticeIsDue #JusticeForAtulSubhash pic.twitter.com/H8211785xL— Sann (@san_x_m) December 12, 2024 ప్రస్తుతం, అతుల్ సుభాష్ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగవంతం చేశారు. మృతుని సోదరుడు బికాస్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ను విచారణ చేపట్టారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నారు. 👉చదవండి : సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ -
ఆయనదే విజన్.. ఇతరులది భజన్ భజన్!
ఫలానా అభివృద్ధికి మేమే కారణం అంటూ అరిగిపోయిన రికార్డులాగా.. ఏళ్లు గడుస్తున్నా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే నేతల్ని ఇంకా మనం చూస్తున్నాం. అయితే చర్చల ద్వారా మేధావులు అందులో ఎంత వాస్తవం ఉందనేది వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయినా అలాంటి నేతల తీరు మారడం లేదు. అయితే ఈ దారిలో సోమనహల్లి మల్లయ్య కృష్ణ(SM Krishna) ఏనాడూ పయనించలేదు.దేశంలో కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఐటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే.. భారత్‌కు సెమీకండక్టర్ హబ్‌గానూ పేరుగాంచింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరును ఇవాళ పిలుచుకుంటున్నాం. అయితే.. ఈ నగరానికి ఇంతలా ఘనత దక్కడానికి ఎఎస్ఎం కృష్ణ చేసిన కృషి గురించి కచ్చితంగా చెప్పుకుని తీరాలి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999-2004 మధ్య పని చేశారు. అదే టైంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా స్వయంప్రకటిత విజనరీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎస్ఎం కృష్ణతో పోలిస్తే అప్పటికే చంద్రబాబు ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పని చేసి ఉన్నారు. పైగా హైటెక్ సిటీలాంటి కట్టడంతో కొంత పేరూ దక్కించుకున్నారు. అయితే నిజంగా చంద్రబాబు తాను చెప్పుకునే విజన్‌తో.. తన రాజకీయానుభవం ఉపయోగించి ఉంటే ఆనాడే హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ ఘనత దక్కించుకుని ఉండేదేమో!. కానీ, ఎస్ఎం కృష్ణ తన రియల్ విజన్‌తో ఆ ట్యాగ్‌ను బెంగళూరుకు పట్టుకెళ్లిపోయారు.విజన్ అంటే ఇది.. 1999 టైంలో.. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఐటీ సంస్థలు భారత్‌లో తమ తమ కంపెనీలకు అనుకూలమైన స్పేస్ కోసం వెతుకుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటైనా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. మరోవైపు ఆపాటికే బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటైంది. ఇదే అదనుగా ఐటీ కంపెనీలను ఎలాగైనా బెంగళూరుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఎస్ఎం కృష్ణ.. ఆ పరిశ్రమ వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలను బెంగళూరులో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఆకర్షించింది. అలాగే.. ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే అంశాలపై అప్పటికే ఐటీ మేధావులతో ఆయన చర్చలు జరిపి ఉన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, సరళీకృత నిబంధనలతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తద్వారా వాళ్ల అవసరాలకు అనుగుణంగా తెచ్చిన సంస్కరణలు.. బెంగళూరులో టెక్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేశాయి.ఇక.. ఒకవైపు ఐటీ రంగం కోసం ప్రతిభావంతులైన నిపుణుల అవసరాన్ని గుర్తించి విద్యతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఐటీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, శిక్షణా సంస్థల స్థాపనకూ ప్రాధాన్యత ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా.. అంతర్జాతీయ వేదికలపై బెంగళూరును ఎస్ఎం కృష్ణ ప్రమోట్ చేశారు. తద్వారా భాగస్వామ్యాలను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగారు. బాబు విజన్.. వాస్తవం ఎంత?‘‘హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే’’ అంటూ హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఒక భ్రమను కల్పించారనే వాదన ఒకటి ఉంది. కానీ, అంతకు ముందే హైదరాబాద్‌కు టెక్ కంపెనీల రాక మొదలైంది. నగరానికి 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం అయ్యింది. 1982లో సీఎంసీ ఆర్ అండ్ డీ వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ సంస్థ. బెంగళూర్ కన్నా మూడేళ్ల ముందే అది హైదరాబాద్‌కు వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు.ఇక.. 1987లో ఇంటర్‌గ్రాఫ్ హైదరాబాద్‌లోని బేగంపేటలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ.. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐటీ వృద్ధికి కృషి జరిపారు. ఈ క్రమంలోనే మైత్రీవనంలో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. ఆ తర్వాత మాదాపూర్ ప్రాంతంలో ‘‘హైటెక్ సిటీ’’కి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలిపోయాయి.కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ వ్యూహాత్మక దృక్పథం, ఆయన విశేషకృషి వల్లే బెంగళూరు భారతదేశ ఐటీ విప్లవానికి పర్యాయపదంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించుకోగలిగింది. అయితే ఇతరుల్లా ఏనాడూ ఆయన ఆ ఘనతను.. తన ఘనతగా తర్వాతి కాలంలోనూ చెప్పుకుంది లేదు!.ఎస్ఎం కృష్ణకి నివాళిగా.. -
ఫుడ్ డెలివరీ యాప్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రచారం చేయడానికి బిల్‌బోర్డ్‌లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
చదువుకుందామని ఇండియా వచ్చాడు.. రూ.50 కోట్లు సంపాదిస్తున్నాడు
మనం ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ తప్పకుండా ఇండియన్ రెస్టారెంట్స్, హోటల్స్ వంటివి ఉంటాయి. ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటూ ఇలా రెస్టారెంట్స్ ప్రారంభించి బాగా సంపాదిస్తున్న భారతీయులు ప్రపంచ దేశాల్లో కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. ఓ వ్యక్తి ఫ్రాన్స్ నుంచి చదువుకోవడానికి ఇండియాకు వచ్చి.. ఇప్పుడు ఏడాదికి రూ. 50 కోట్లు సంపాదిస్తూ వార్తల్లో నిలిచాడు.ఫ్రాన్స్‌కు చెందిన 'నికోలస్ గ్రాస్మీ' (Nicolas Grossemy) అనే వ్యక్తి 22 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఇండియాకు వచ్చాడు. అయితే ఇప్పుడు నెలకు రూ.4 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శమయ్యాడు.ఇండియాలో చదువు పూర్తయిన తరువాత 2015లో ఫుడ్ ట్రక్ ద్వారా బిజినెస్ ప్రారంభించాడు. తన తల్లికి వంట చేయడంలో చిన్నప్పుడు నికోలస్ సహాయపడేవాడు. ఆ విధంగా ఈ రంగంపై అతనికి మక్కువ పెరిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఎనిమిది డైనింగ్ అవుట్లెట్లు, ఏడు క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. ఫుడ్ ట్రక్ ద్వారా ప్రారంభమైన వ్యాపారం నేడు.. నగరం మొత్తం విస్తరించింది.ఇదీ చదవండి: 17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదనఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నికోలస్‌కు చిన్నతనం నుంచే శాండ్‌విచ్‌లంటే చాలా ఇష్టం. దీంతో వీటిని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. అదే ఈ రోజు కోట్లు సంపాదించేలా చేసింది. శాండ్విచ్ సేల్స్ దాదాపు 70 శాతం ఆన్లైన్లోనే జరుగుతాయని, మిగిలిన 30 శాతం మాత్రమే ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని సమాచారం. -
టెక్ మహీంద్రా, పెరల్ ఇన్నోవేషన్ హబ్
ముంబై: టెక్ మహీంద్రా సహకారంతో బెంగుళూరులో మేకర్స్ ల్యాబ్ పేరుతో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పెరల్ అకాడమీ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెటావర్స్, గేమింగ్ రంగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్ధేశమని క్రియేటివ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన పెరల్ అకాడమీ పేర్కొంది.‘టెక్ మహీంద్రా సంకేతిక నైపుణ్యంతో మా డిజైన్ ఇన్నోవేషన్లను మిళితం చేయడం ద్వారా పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది’ అని అకాడమీ ప్రెసిడెంట్ అదితీ శ్రీవాస్తవ తెలిపారు. అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం కొత్త నైపుణ్యాలను, సృజనాత్మక రంగం అనుభవాలను మేకర్స్ ల్యాబ్ అందిస్తుందన్నారు. -
స్పా ఉద్యోగిని ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఢిల్లీ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బ్యూటీ స్పాలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సోనియా (24) మృతురాలు. ఆత్మహత్యకు గల కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ప్రేమలో మోసపోయానని..ప్రేమలో మోసపోయానని అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తండగి తాలూకా మిత్రబాగిలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమ్మాయి (17)ని బంధువు అయిన ప్రవీణ్ అనే యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీంతో విరక్తి చెందిన యువతి 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ప్రవీణ్‌పై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బెంగళూరు ట్రాఫిక్.. ఇలా చేస్తే నో టెన్షన్!
‘రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుంది. అంతసేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటాం. బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది’ బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఇటీవల ఎక్స్‌లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇది. ఇండియా ఐటీ క్యాపిటల్‌గా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యం. బెంగళూరు వాసులు రోడ్డు మీదకు వచ్చారంటే నరకప్రాయమే. ట్రాఫిక్ రద్దీతో గంటలకొద్దీ రోడ్లపై గడపాల్సి ఉంటుంది. తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. జోకులు, సెటైర్లు కూడా షేర్ చేస్తుంటారు.బెంగళూరు మెట్రో సిటీలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతంలో బెంగళూరు మహా నగరంలో దాదాపు 1.4 కోట్ల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ నానాటికీ ఎక్కువవుతోంది. నగర రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యూహాత్మక, సమగ్ర విధానం చాలా అవసరమని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన వాటి గురించి బెంగళూరు వాసి ఒకరు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 1.05 కోట్ల ప్రైవేటు వాహనాలు ఉండగా, గత అక్టోబర్ నెలలో కొత్తగా 70 వేల ప్రైవేటు వెహికిల్స్ రోడ్డెక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీకి ఎక్కువగా (87.6 శాతం) ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరులో ట్రాఫిక్ మరింత నరకప్రాయం అవుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 5 ఏళ్లలో చేపట్టాల్సిన చర్యలు..1. బెంగళూరు జనాభాలో ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 70 శాతానికి పెంచాలి.2. ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు, సైకిల్ రైడ్ వంటి బహుముఖ ప్రయాణాలను ప్రోత్సహించాలి.3. ఆక్రమణలు తొలిగించి వీధులను ప్రయాణానికి అనువుగా మార్చాలి. పాదచారులు ఏ ఆటంకాలు లేకుండా నడిచేలా ఉండాలి.చదవండి: ఇండియా సిలికాన్ సిటీలో సిగ్నల్ దాటాలంటే చుక్కలే4. బెంగళూరులో బస్సుల సంఖ్య పెంచాలి. పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు కూడా అవసరం. నివాస ప్రాంతాల నుంచి మెట్రో రైలు, పెద్ద బస్సులకు అనుసంధానంగా మినీ బస్సులు నడపాలి.5. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో రైలు పరిధిని విస్తరించాలి. సబర్బన్ రైలు సేవలను కూడా విస్తృతం చేయాలి.6. ఫుట్‌పాత్‌లు, సైకిల్, బస్ లేన్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలి. BENGALURU city is now home to 1.4 crore people & 1.05 crore private vehiclesThe city added around 70k new private vehicles in the last month, with Private vehicles now dominating 87.6% of trafficSteps needed to be taken during the next 5 years as a major priority for the city… pic.twitter.com/ulagWNybVR— Karnataka Weather (@Bnglrweatherman) November 21, 2024 -
Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు
అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, ఆ తరువాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మద్యానికి బానిసవడమే తన దుస్థితికి కారణమని చెబుతున్నాడు. అతను తనతో పంచుకున్న కథను శరత్ యువరాజా అనే యువకుడు ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐన్‌స్టీన్ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. అయితేనేం, ‘తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మతం కులం, ఇవన్నీ కలగలసి చివరకు నేనేమయ్యానో చూడండి. నేనింకా చదవాలి’’ అని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్ పేర్కొన్నారు. ‘‘దాంతో ఎన్జీవోలను సంప్రదించా. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు’’ అని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియోలు ఆన్లైన్లో గట్టి చర్చకు దారి తీశాయి. View this post on Instagram A post shared by 𝙎𝙃𝘼𝙍𝘼𝙏𝙃 YUVARAJ🌎 (@sharath_yuvaraja_official) -
రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా
లైఫ్‌స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్‌కామర్స్‌లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.మింత్రా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే.. ఎంపిక చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, 'M-Now' బెంగళూరులో కొన్ని పిన్ కోడ్లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది.నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎం ఎక్స్‌ప్రెస్ అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడం. ఇప్పుడు రెండు గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది. -
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో.. సిగ్నల్ దాటాలంటే చుక్కలే
సాక్షి బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర వాసులకు ట్రాఫిక్ అనేది నేడు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. రద్దీ సమయాల్లో ఒక్కో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంత వాతావరణం, నిండైన పచ్చదనంతో ఒకప్పుడు ఉద్యాననగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రస్తుతం జనాభా సంఖ్య కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నగరంలో రోడ్ల సమర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 1.40 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్ల విస్తరణకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అడుగులు వేస్తోంది. దశాబ్ద కాలంలో మారిన నగరం..శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం కావడం, కాంక్రీటీకరణ, అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ తదితర కారణాల వల్ల బెంగళూరు గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో మారిపోయింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మెట్రో, ఫ్లయ్వోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరకడంలేదు. రోడ్ల విస్తరణ అభివృద్ధికి కావాల్సిన స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు అవసరమైన ఆరి్థక వనరులు బీబీఎంపీ వద్ద లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఒక మహిళ ఇటీవల ఎక్స్‌లో చేసిన చిన్న పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుందని, అంత సేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటారని, బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందంటూ ఇక్కడి ట్రాఫిక్ని ఎద్దేవా చేస్తూ అనఘ అనే మహిళ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ ట్వీట్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో భారీ చర్చకు తెరతీసింది. అయితే బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి ఆమె ట్వీట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని, నగరవాసులను ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ట్రాఫిక్ వ్యథలు వందల కొద్దీ చెబుతారని నెటిజన్లు అంటున్నారు.బీబీఎంపీ పరిధిలో రహదారుల పొడవు: 12,878 కి.మీఇందులో ఆర్టిరియల్, సబ్ ఆర్టిరియల్ (అధిక సామర్థ్యంగల) రోడ్లు: 1344.84 కి.మీ నగరంలో రిజిష్టర్ అయిన వాహనాల సంఖ్య: 1.40 కోట్లుటామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారందేశంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 1ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 6నగరంలో సగటున 10 కి.మీ ప్రయాణించేందుకు పట్టే సమయం: 28 నిమిషాలు -
అమెజాన్ బెంగళూరు హెడ్‌క్వార్టర్స్ తరలింపు
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా బెంగళూరులోని తన కార్పోరేట్ ప్రధాన కార్యాలయాన్ని వేరొక చేటుకు తరలిస్తోంది. చాలా కాలంగా ఉంటున్న బెంగళూరు వాయువ్య ప్రాంతం నుండి నగరంలోని విమానాశ్రయానికి సమీపంలోకి మారుస్తోది. నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో భాగంగా హెడ్‌క్వార్టర్స్ తరలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.అమెజాన్ ఇండియా తన కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలోని 30-అంతస్తుల భవనంలో 18 అంతస్తులలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఖాళీ చేస్తుండటంతో అంత భారీ విస్తీర్ణాన్ని కొత్తగా అద్దెకు తీసుకునే సంస్థ దొరకడం కష్టమే.అమెజాన్ ఇండియా కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ కోసం డబ్ల్యూటీసీలో చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో అద్దె ఇందులో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఆదా అవుతుందని అంచనా. తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై 2026 ఏప్రిల్‌లో ముగుస్తుంది.🚨 Amazon India is moving its headquarters from WTC building in Bengaluru near to the city's airport to save costs. pic.twitter.com/WItCV9suYP— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2024 -
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్పాళ్యకు ప్రదీప్ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. On Saturday afternoon,a 42 yr old businessman Mr Pradeep was charred to death inside his car at Muddinpalya in Bengaluru. Prima Facie suggests a case of death by suicide.Police have registered the case of Unnatural Death.. pic.twitter.com/JOCTeYLBif— Yasir Mushtaq (@path2shah) November 16, 2024 -
‘నువ్వు చచ్చినా పర్వాలేదు’.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్‌ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్‌ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆన్లైన్ కంటే తక్కువ ధరకే!.. పోస్ట్ వైరల్
బెంగళూరు నగరానికి చెందిన ఒక కొబ్బరి బొండాల వ్యాపారి.. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి వాటికి సవాలు విసిరారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వ్యాపారి విసిరినా సవాల్ ఏమిటి? దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో.. కొబ్బరి బోండాం రేటు జెప్టోలో రూ. 80, బ్లింకిట్‌లో రూ. 80, బిగ్‌బాస్కెట్‌లో రూ. 70 ఉంది. కానీ వ్యాపారి కేవలం రూ. 55కే కొబ్బరి బోండాం అంటూ వెల్లడించారు. ఈ పోస్ట్ చూసిన చాలామందిలో చర్చ మొదలైంది. యాప్‌లు వ్యసనంగా మారితే వస్తువులు ఖరీదైనవిగా మారతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.క్విక్ కామర్స్ సైట్లు ఎప్పుడూ ధరలను భారీగా పెంచుతాయి. ప్రజల సమయాన్ని, సౌకర్యాలను బట్టి బిల్లు వేస్తాయి. వీటిపైనే ఆధారపడితే భవిష్యత్తులో ఖర్చులు భారీగా పెరుగుతాయి. జొమాటో, స్విగ్గీ వంటి వాటిని తొలగించినప్పటి నుంచి నా ఖర్చులు చాలా తగ్గాయని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..క్విక్ కామర్స్ సైట్లలో మోసాలు కూడా విపరీతంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా ఒక నెటిజన్ బ్లింకిట్ ద్వారా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి 1 గ్రాముల బంగారు నాణెం, 10 గ్రాముల వెండి నాణెం ఆర్డర్ చేసినప్పటికీ 0.5 గ్రాముల బంగారు నాణెం వచ్చినందుకు మోసపోయానని ఆరోపించాడు. ఇలా నెటిజన్లు ఎవరికితోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.Will Quick Commerce affect roadside coconut vendors? 📸: @nithishr46 found this in @peakbengaluru pic.twitter.com/LfQKpgO2uc— Peak Bengaluru (@peakbengaluru) November 7, 2024 -
రామేశ్వరం కెఫే ఘటనలో పాక్ ముష్కరుడి హస్తం
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన వెనుక పాక్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్నారు. పాక్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది పైజల్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారని తెలిపింది. కాగా ఈ కేసులో ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజమ్మిల్ షరీఫ్‌లు నిందితులుగా ఎన్ఐఏ గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మంగళూరు కుక్కర్ పేలుడు తర్వాత ముస్సావిర్ షాజిబ్, తాహాలు అదృశ్యమయ్యారు. కొన్నేళ్ల అనంతరం మళ్లీ బెంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ముజమ్మిల్ షరీఫ్‌తో పరిచయమైంది. ముజమ్మిల్ మెజస్టిక్ వద్ద హోటల్లో పనిచేసేవాడు. ఇతనే ముస్సావిర్ షాజిబ్, తాహాలను ఐసిస్ ఉగ్రవాదంలోకి చేర్చాడు. మొదటి దశలో కొన్ని దుశ్చర్యలు చేయడానికి ముజమ్మిల్ టాస్క్ ఇచ్చాడు. 2023 డిసెంబర్లో బెంగళూరులోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి కుట్రపన్నారు. తర్వాత షాజీబ్ బెంగళూరు నుంచి చెన్నైకు మకాం మార్చాడు. ట్రిప్లికేన్‌లో అద్దె ఇంట్లో ఐఈడీ బాంబు తయారుచేసి 2024 జనవరి 22 ఉదయం బెంగళూరుకు చేరుకున్నాడు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో బాంబు పెట్టడానికి షాజీబ్ ప్లాన్ రూపొందించాడు. పోలీసు భద్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ కార్యాలయం వెనుక బాంబు పెట్టి 90 నిమిషాలకు టైమర్ సెట్ చేశారు. అయితే బాంబు పేలలేదు. అనంతరం షాజీబ్ చెన్నై పారిపోయాడు. అనంతరం బెంగళూరులో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతంలో బాంబు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఫిబ్రవరి నెలలో ఐఈడీ బాంబు తయారుచేసి అదేనెల 29 తేదీన షాజీబ్ చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నాడు. కృష్ణరాజపురం టిన్ ఫ్యాక్టరీ వద్ద దిగి అక్కడ నుంచి కుందలహళ్లికి వెళ్లి మార్చి 1న రామేశ్వరం కెఫేలో బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. -
Video: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్
ఇటీవల గుండెపోటు మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి యువకులు, మధ్య వయస్సు వారు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా డ్రైవర్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. అయితే గమనించిన కండక్టర్ అప్రమత్తతో వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలోని దాసనపుర బస్ డిపోలో కిరణ్(39) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. . నెలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని 50 మంది ప్రాణాలు నిలిచాయి. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.In Bengaluru: When the bus driver suffered a heart attack, BMTC bus conductor Obalesh jumped on the driver’s seat and took control of the steering🫡 (Sadly Bus Driver Passed away due to Cardiac arrest) https://t.co/PgpTz6ENxt— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2024 -
రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్‌లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్‌లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
బెంగళూరులో మరో ఆఫీస్: 300 మంది ఉద్యోగులకు అవకాశం
కరోనా సమయంలో భారీ నష్టాలను చవి చూసిన దిగ్గజ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ 'యూఎస్టీ' తన కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా.. బెంగళూరులో రెండవ ఆఫీస్ ప్రారంభించింది. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న యూఎస్టీ కొత్త కార్యలయం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది.కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగానే.. ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించినట్లు సమాచారం. యూఎస్టీ తన కొచ్చి ప్రధాన కేంద్రంలో వచ్చే ఐదేళ్ల నాటికి సుమారు 6,000 మందికి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా కేరళలోని తిరువనంతపురం కేంద్రంలో సుమారు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2012లో తన కార్యకలాపాలను ప్రారంభించిన యూఎస్టీ.. బెంగళూరులో ప్రస్తుతం 6000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ సెమీకండక్టర్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హైటెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం అంతటా 20000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 30000 కంటే ఎక్కువ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. -
బెంజ్ కారుతో 20 ఏళ్ల యువకుడి బీభత్సం.. మహిళ మృతి
బెంగళూరు: పీకలదాకా తాగిన మత్తులో కారు నడిపిన ఓ యువకుడు.. మహిళ ప్రాణాలను బలి తీసుకున్నాడు. మెర్సిడెస్ బెంజ్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. నగరంలోని కెంగేరి మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 30 ఏళ్ల సంధ్య రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న 20 ఏళ్ల విద్యార్థి ధనుష్ తన తండ్రి మెర్సిడెస్ బెంజ్ కారుతో వవేగంగా వస్తూ ఆమెను ఢీకొట్టాడు. దీంతో సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది.ప్రమాదం తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న కెంగేరి పోలీసులు నిందితుడు ధనుష్‌తోపాటు అతని స్నేహితుడుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.కాగా నిందితుడిని ప్రైవేట్ బస్ ట్రావెల్ కంపెనీ యజమాని అయిన వీర శివ కుమారుడు ధనుష్‌గా గుర్తించారు. అతని తండ్రి ఇటీవలే లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ధనుష్ ఈ కారును తీసుకొని యశ్వంత్‌పూర్ సమీపంలోని ఒక మాల్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇద్దరు అక్కడ మద్యం తాగి మైసూరు రోడ్డుకు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారు నడుపుతున్న ధనుష్ అతివేగంతో కెంగేరి స్టేషన్ కు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ ను గమనించలేక వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టాడు. -
పందెం విసిరిన స్నేహితులు.. బాంబు మీద కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
బెంగళూరు : స్నేహితులతో పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాంబు మీద కూర్చొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. దీపావళి పండుగ సందర్భంగా శబరిష్ (32) అతని ఆరుగురు స్నేహితులు మధ్య పందెం వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్‌కు అతని స్నేహితులు పందెం విసిరారు. పందెం ప్రకారం..శబరీష్ కార్డ్ బోర్డ్ కింద అమర్చిన బాంబులపై కూర్చోవాలి. అనంతరం బాంబుకు నిప్పు అంటిస్తాము. నిప్పు అంటించినా అలాగే కూర్చుంటే ఓ కొత్త ఆటో కొనిస్తామని ఆఫర్ ఇచ్చారు.చదవండి : తెగిపడిన కుమారుడి తల.. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తూదీంతో మద్యం మత్తులో ఉన్న శబరీష్ స్నేహితులు చెప్పినట్లుగానే బాంబులు అమర్చిన కార్డ్ బోర్డ్‌పై కూర్చున్నాడు. అంనతరం అతని స్నేహితులు కార్డ్ బోర్డ్ కింద ఉన్న బాంబులకు నిప్పు అంటించి దూరంగా పరిగెత్తారు. సెకన్ల వ్యవధిలో భారీ శబ్ధాలతో బాంబులు పేలాయి.శబరీష్ అలాగే ఉన్నాడు. అతనికి ఏమైందా అని చూద్దామని ముందుకు వచ్చిన స్నేహితుల్ని చూసిన శబరీష్ వెంటనే కుప్పకూలాడు. ప్రాణాలు కోల్పోయాడు. అత్యవసర చికిత్స కోసం శబరీష్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాంబు పేలుడు ధాటికి శబరీష్ అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి పందెం విసిరిన అతని ఆరుగురు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. A Bet that proved costly, takes a Life in #Bengaluru !In a shocking incident a 32-yr-old Shabari died in a tragic way on #Diwali, after he accepted a challenge to sit on a box full of #firecrackers in it to win an auto rickshaw, in Konanakunte, South Bengaluru. His friends lit… pic.twitter.com/YGHEmxViV2— Surya Reddy (@jsuryareddy) November 4, 2024 -
Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ
ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్ చెప్పాడు. నేను వంద శాతం న్యూజిలాండ్వాడినేచిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే. అక్కడే పుట్టి పెరిగాను. కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు. కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్ పంపించారు. అందుకే ఈ సిరీస్ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనుఎజాజ్ చివరి వికెట్ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్ వివరించాడు. చదవండి: Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా -
బెంగళూరులో కింగ్ చార్లెస్–3
బెంగళూరు: బ్రిటన్ రాజు చార్లెస్–3 సతీసమేతంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో రహస్యంగా పర్యటించారు. రాజదంపతులు సమోవా దేశంలో కామన్వెల్త్ సమావేశంలో పాల్గొన్న తర్వాత యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్తూ మధ్యలో బెంగళూరులో ఆగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. వారిద్దరూ నగరంలోని ప్రముఖ వెల్నెస్ కేంద్రంలో చికిత్స పొందినట్లు తెలిసింది. వైట్‌ఫీల్డ్ సమీపంలోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్లో రాజు చార్లెస్–3, రాణి కెమిల్లా మూడు రోజులపాటు బస చేశారు. యోగా, ధ్యానంతోపాటు ఇతర థెరపీలకు ఈ హెల్త్ సెంటర్ పేరుగాంచింది. శరీరం, మనసు అలసిపోయినప్పుడు పునరుత్తేజం పొందడానికి ఇక్కడ నిపుణులు ప్రకృతిసిద్ధమైన చికిత్స అందిస్తుంటారు. డాక్టర్ ఐజాక్ మథాయ్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ సెంటర్‌కు చార్లెస్–3 రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఆయన ఇక్కడే 71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ‘మనసుకు స్వాంతన లభించే యోగా క్రియల్లో బ్రిటన్ రాజ దంపతులు పాల్గొన్నారు. కోడిగుడ్లతోపాటు కేవలం శాకాహారం తీసుకున్నారు. ధ్యానం చేశారు. చార్లెస్–3 ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతితో కూడిన వెల్‌నెట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు’’ అని సౌఖ్య హెల్త్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. రాజదంపతులకు ప్రత్యేక మర్యాదలేవీ చేయలేదని, ఇతర అతిథుల తరహాలోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. హెల్త్ సెంటర్లో మూడు రోజులపాటు ఉన్న చార్లెస్–3 దంపతులు ఇక్కడ సాగవుతున్న ఆర్గానిక్ పంటలను పరిశీలించారు. ఔషధాల గార్డెన్‌ను సందర్శించారు. గోవుల మధ్య కలియతిరిగారు. ప్రకృతికి దగ్గరగా జీవించారు. పర్యావరణ హిత పద్ధతులు పాటించారు. రాజదంపతులు బుధవారం ఉదయమే హెల్త్‌సెంటర్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. -
వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..
ఆన్లైన్ మోసాలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ల బారిన పడ్డారు. వీరు కేవలం ఒక వారం రోజుల్లో ఏకంగా 9.54 కోట్ల రూపాయాలు పోగొట్టుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యాపవేత్తలు, ఒక ఇంజినీర్ ఉన్నట్లు సమాచారం.అధిక రాబడి వస్తుందనే వాగ్దానాలతో పబ్లిక్ ఆఫర్లకు ముందస్తు యాక్సెస్‌తో బాధితులను ఆకర్శించారు. మోసగాళ్లు బాధితులను మొదట్లో 'జేజే77 ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా', జీ3364 మెయిన్ పుల్ అప్ లేఅవుట్ ఎక్స్ఛేంజ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేశారు. గ్రూపుల్లో పరిచయం లేనివారి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నారు.పరిచయం లేనివారు ఇచ్చిన సలహాలను అనుసరించి.. ముగ్గురు వ్యక్తులు స్కామర్లు అందించిన లింక్‌ల ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో స్కామర్లు ఆకట్టుకునే ట్రేడింగ్ లాభాలను చూపడంతో బాధితులు సెప్టెంబర్ 8, అక్టోబర్ 23 మధ్య వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేశారు. వారు అనుకున్న లాభాలు రాకపోగా.. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్నారు.ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనమోసపోయామని తెలుసుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
బెంగళూరు: 20 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు తాజాగా ఛేధించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన మహిళ.. సొంత భర్తనే డబ్బులు డిమాంఢ్ చేయడం.. అతడు నిరాకరించడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి మరో రాష్ట్రంలో మృతదేహాన్ని పడేసి నిప్పంటించిన మహిళ.. చివరకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దరికిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న కొడగు జిల్లాలో అక్టోబరు 8న సగం కాలిపోయిన మృతదేహాన్నికర్ణాటక పోలీసులు గుర్తించారు. సొంటికొప్ప టౌన్ సమీపంలోని కాఫీ ఎస్టేట్‌లో లభ్యమైన మృతదేహం 54 ఏళ్ల రమేష్ అనే తెలంగాణ వ్యాపారిదిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు అక్కడ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఆ కారు ఎవరిదో తెలుసుకునేందుకు తుమకూరు వరకు 500కుపైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు కారు నంబర్ ప్లేట్‌ను కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త రమేష్ పేరుతో ఆ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.రమేష్ అదృష్యమైనట్లు అతని భార్య నిహారిక(29) ఇటీవల మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో పోలీసులు కారు రిజిస్టర్ అయిన తెలంగాణలోని పోలీసులను సంప్రదించారు. అయితే రమేష్ హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లు కొడగు పోలీసులు అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడైన వెటర్నరీ డాక్టర్ నిఖిల్, గతంలో జైలులో పరిచయమైన అంకుర్ సహాయంతో భర్త రమేష్‌ను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఊపిరాడకుండా చేసి రమేష్‌ను చంపినట్లు కొడగు పోలీస్ అధికారి తెలిపారు.నిందితులు అతడి ఇంటికి చేరుకుని డబ్బు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రమేష్ మృతదేహంతో అతడి కారులో బెంగళూరుకు ప్రయాణించారని పేర్కొన్నారు బంకులో పెట్రోల్ నింపుకున్న తర్వాత కొడగు జిల్లా సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో రమేష్ మృతదేహానికి నిప్పంటించారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు చేరుకున్నారని, మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడంలేదని నిహారిక ఫిర్యాదు చేసిందని చెప్పారు.కాగా, నిహారిక చిన్నప్పుడు పేదరికం వల్ల చాలా ఇబ్బందిపడినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. 16వ ఏటా ఆమె తండ్రి మరణించడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని చెప్పారు. చదువులో రాణించిన నిహారిక ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిందని అన్నారు. ఒక వ్యక్తిని పెళ్లాడిన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిందని చెప్పారు. హర్యానాలో ఉన్నప్పుడు ఆర్థిక మోసానికి పాల్పడి జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. జైలులో అంకుర్ పరిచయమైనట్లు వెల్లడించారు.జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌తో నిహారికకు రెండో పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి కూడా ఇది రెండో వివాహమని చెప్పారు. నిహారికకు రమేష్ విలాసవంతమైన జీవితాన్ని అందించాడని చెప్పారు. అయితే లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఆమె రమేష్‌ను రూ.8 కోట్లు అడిగిందని, అంత డబ్బు ఇచ్చేందుకు భర్త నిరాకరించడతో అతడి ఆస్తి కోసం హత్య చేయాలని ప్లాన్ వేసిందన్నారు. రిలేషన్షిప్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ నిఖిల్, జైలులో పరిచయమైన అంకుర్‌తో కలిసి రమేష్‌ను హత్య చేసి 800 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి కాల్చివేశారని పోలీస్ అధికారి వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
కివీస్ సరికొత్త చరిత్ర.. రోహిత్ చెత్త రికార్డు
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయపరంపరకు కళ్లెం పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో రోహిత్ సేన 113 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఫలితంగా గత 18 టెస్టు సిరీస్‌లలో టీమిండియా సాగించిన జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కివీస్ సరికొత్త చరిత్రఅంతేకాదు.. పుణె టెస్టు ఓటమితో రోహిత్ సేన ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. స్వదేశంలో కివీస్ జట్టు చేతిలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కూడా!.. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ భారత్‌లో మొట్టమొదటి సిరీస్ గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా కివీస్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేనపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్.. తాజాగా పుణె టెస్టులో 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పదమూడు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు విశేషాలుభారత్లో పర్యాటక జట్ల టెస్టు సిరీస్ విజయాలు👉ఇంగ్లండ్- ఐదుసార్లు👉వెస్టిండీస్- ఐదుసార్లు👉ఆస్ట్రేలియా- నాలుగుసార్లు👉పాకిస్తాన్- ఒకసారి(1986/87)👉సౌతాఫ్రికా- ఒకసారి(1999/00)👉న్యూజిలాండ్- ఒకసారి(2024/25)ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా ఓడిన అత్యధిక మ్యాచ్‌లు👉1969- నాలుగు(ఆస్ట్రేలియా చేతిలో మూడు, న్యూజిలాండ్ చేతిలో ఒకటి)👉1983- మూడు(వెస్టిండీస్ చేతిలో మూడు)👉2024- మూడు(న్యూజిలాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో ఒకటి).కపిల్ దేవ్, అజారుద్దీన్‌తో పాటు రోహిత్రోహిత్ శర్మ ఇప్పటి వరకు సొంతగడ్డపై 15 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కివీస్ చేతిలో ఓటమితో తాజాగా అతడి ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. అంతకు ముందు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సంయుక్తంగా ఇరవై టెస్టుల్లో సారథ్యం వహించి నాలుగేసి మ్యాచ్‌లు ఓడిపోయారు. ఈ జాబితాలో అత్యధికంగా 9 టెస్టు పరాజయాల(ఇరవై ఏడింట)తో మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది సమిష్టి వైఫల్యం: రోహిత్ శర్మ -
Bengaluru: కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు, ఎందుకంటే!
బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ అంటూ వాహనదారులు భయపడిపోతూ ఉంటారు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని సగం జీవితం రోడ్డుపైనే గడపాల్సి వస్తుందంటూ తరచూ నగరవాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. అదే వర్షాలు కురిసి వరద నీటితో రోడ్లు అన్నీ నిండిపోయిన సందర్భంలో ఏర్పడే ట్రాఫిక్ గురించి ఇక చెప్పనవసరం లేదు.తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయిన పరిస్థితి తలెత్తింది. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6— KpopStan🤍 (@PratikfamHouse) October 23, 2024 -
భవనం కుప్పకూలి ఐదుగురు మృతి.. డిప్యూటీ సీఎం సీరియస్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. మంగళవారం కురుసిన కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురు మృతి చెందారు.మరో ఏడుగురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 13 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బీహార్‌కు చెందిన హర్మన్ (26), త్రిపాల్ (35), మహ్మద్ సాహిల్ (19), సత్యరాజు (25), శంకర్ ఉన్నారు.బెంగళూరు తూర్పు ప్రాంతంలోని హోరామావు అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలిందదని, ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 20 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాత్రి వరకు సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సహాయక చర్యల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు.A multi storey building collapsed with in seconds In Bengaluru. The building collapse killed one person with five people still missing. Fourteen workers have been rescued from the rubble at the construction site in Babusapalya. Building basement became weak due to continuous… pic.twitter.com/rM5dr5WVhf— V Chandramouli (@VChandramouli6) October 23, 2024భవనం కూలిన ప్రాంతాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సందర్శించారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. అయితే భవన నిర్మాణం చట్టవిరుద్ధమని, దాని యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవనానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెప్రనిరు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యజమాని, కాంట్రాక్టర్, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెంగళూరు వ్యాప్తంగా అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేసేలా తాము అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్, యజమాని, అధికారులు ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు.Rains and building collapse. This is in Anjanadri layout, near #HoramavuAgara 6 storey building under construction.. some workers are stuck inside sadly z pic.twitter.com/igamkHjA7L— HennurBlr (@HennurBlr) October 22, 2024 భవనం కూలిన ఘటనపై మాకు సమాచారం అందిన తర్వాత, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సమాచారం అందించామని, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.. తమకు అందిన సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో 21 మంది కూలీలు ఉన్నారని, రోజూ 26 మంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. 60/40 ప్లాట్‌లో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం నేరమని, మూడుసార్లు నోటీసులు జారీ చేశామని చెప్పారు. మరోవైపు రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. బెంగళూరు నగరానికి నేడు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిటీలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించారు. -
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులోని బాబాసపాల్యా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. మంగళవారం(అక్టోబర్ 22) ఈ ఘటనలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు.పదిహేడు మంది దాకా కార్మికులు భవన శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని కాపాడారు. మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది.#Karnataka: Incessant rains have caused the collapse of an under-construction multi-storey building in Babasapalya near Hennur in #Bengaluru. Sixteen labourers are reportedly trapped beneath the debris, while one labourer, who sustained injuries, managed to escape after the… pic.twitter.com/cENnfDuO1j— South First (@TheSouthfirst) October 22, 2024 ఇదీ చదవండి: నాగపూర్‌లో పట్టాలు తప్పిన రైలు -
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
నేడు నాలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తేలికపాటి చలి మొదలైంది. అక్టోబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు.దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నేడు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన డోనా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రాంతం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా డోనా తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కన్నడ, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, హవేరి, గడగ్, శివమొగ్గ, దావణగెరె, బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇది కూడా చదవండి: 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను -
వాళ్లిద్దరు అద్భుతం.. ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 50 లోపు స్కోరుకే ఆలౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపిందని.. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో తమ జట్టు అద్భుతంగా పోరాడిందని పేర్కొన్నాడు. సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారని కొనియాడిన రోహిత్.. వారిద్దరి వల్లే తాము మెరుగైన స్కోరు సాధించామని తెలిపాడు.46 పరుగులకే ఆలౌట్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయి సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగింది.సర్ఫరాజ్, పంత్ అద్భుత ఇన్నింగ్స్మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ అద్భుతంగా రాణించినందు వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన సర్ఫరాజ్ 150 పరుగులతో చెలరేగగా.. మోకాలి నొప్పి ఉన్నా పంత్ 99 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టును గెలిపించేందుకు వీరి పోరాటం సరిపోలేదు.మోచ్యూర్గా ఆడారుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో మరీ ఘోరంగా బ్యాటింగ్ చేశాం. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మేము పుంజుకున్నాం. ఆ ఇద్దరు(సర్ఫరాజ్, పంత్) భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సర్ఫరాజ్, పంత్ బ్యాటింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్‌రూంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా తిలకించారు.వాళ్లిద్దరు ఎంతో పరిణతి కనబరిచారు. మామూలుగా అయితే, రిషభ్ చాలా వరకు రిస్క్ తీసుకుంటాడు. కానీ ఈసారి మంచి బంతులు పడ్డప్పుడు డిఫెన్స్ చేసుకున్నాడు. కొన్నింటిని వదిలేశాడు. ఆచితూచి ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాడు.ఇక సర్ఫరాజ్ గురించి చెప్పాలంటే.. ఎంతో మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్లో ఇది నాలుగో టెస్టే అయినా.. ఓవైపు ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారన్న రోహిత్ శర్మ.. తాము మూకుమ్మడిగా విఫలం కావడం బాధించిందన్నాడు.వరుసగా నాలుగు గెలిచాంఅయితే, గతంలో ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన తాము.. తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన విషయాన్ని రోహిత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని.. జట్టులో ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసునని పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు(అక్టోబరు 16- 20)👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు.. రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాస్కోర్లు:👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 46👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్- 402👉టీమిండియా రెండో ఇన్నింగ్స్- 462👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్- 110/2👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రచిన్ రవీంద్ర(134, 39 నాటౌట్)చదవండి: IND vs PAK: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
బొంగుతో డ్రోన్.. ఇదో కొత్తరకం
బొంగులో చికెన్ గురించి తెలుసు గాని, ఈ బొంగుతో డ్రోన్ ఏంటనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్నది బొంగుతో తయారైన డ్రోన్. సాధారణంగా యంత్రాల తయారీకి లోహాలను వాడతారు. బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్, ప్రోడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే రకం.సుస్థిరమైన పదార్థాలతో రోబోటిక్ యంత్రాలను తయారు చేయవచ్చనే ఆలోచనతో అతడు అచ్చంగా వెదురు బొంగులతో ఈ డ్రోన్‌ను రూపొందించాడు. స్క్రూలు, నట్లు వంటివి తప్ప ఈ డ్రోన్లోని మిగిలిన భాగాలన్నింటినీ చీల్చిన వెదురు బొంగులతో తయారు చేశాడు.ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వస్తువుల తయారీకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కలపను ప్రధాన పదార్థంగా వినియోగించలేదు. వెదురుబొంగులతో పూర్తిగా పనిచేసే డ్రోన్‌ను తయారు చేసిన ఘనత దీపక్ దధీచ్‌కే దక్కుతుంది. దీని తయారీకి అతడికి వెయ్యి రూపాయల లోపే ఖర్చు కావడం విశేషం. -
ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!
క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అతడి ఆట తీరులో మార్పు రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ దారుణ వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేస్తున్నారు!ఇక రాహుల్ కోసం ఇప్పటికే ‘ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేసారని.. ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం చేయవద్దంటూ సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో తాను ఆడిన గత రెండు మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు 16, 22*, 68. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ఈ మేర పరుగులు రాబట్టాడు.దారుణంగా విఫలంఈ క్రమంలో తాజాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో పన్నెండు పరుగులకే పెవిలియన్ చేరాడు.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. కివీస్‌కు కేవలం 107 పరుగుల లక్ష్యం విధించిన భారత్.. ఆఖరి రోజైన ఆదివారం నాటి ఆటలో ప్రత్యర్థిని 105 పరుగులకే ఆలౌట్ చేయాలి. లేదంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పదు.సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో దుమ్ములేపాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఇంకా పోటీలో నిలవగలగడానికి కారణం సర్ఫరాజ్ ఇన్నింగ్స్ అనడంలో సందేహం లేదు.ఇకనైనా అతడికి అవకాశాలు ఇవ్వండిఇక తుదిజట్టు మిడిలార్డర్లో చోటు కోసం సర్ఫరాజ్ కేఎల్ రాహుల్‌తో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ వల్ల విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఆడగా.. సర్ఫరాజ్‌కు అనుకోకుండా ఛాన్స్వచ్చింది. లేదంటే.. రాహుల్ కోసం అతడిని డ్రాప్ చేసేవారే! ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌కు ఇన్నాళ్లూ అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు.చదవండి: ‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Harsha : Do you remember last time Kl Rahul saved India from a collapse?Ravi : No, because KL Rahul himself is part of the collapse. pic.twitter.com/6LC5UNmI98— mufaddla parody (@mufaddl_parody) October 19, 2024 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ విరాట్ కోహ్లి అంపైర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను ఎలా నిలిపివేస్తారంటూ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శనివారం నాటి ఆట సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత్ స్వదేశంలో కివీస్ జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు కాగా.. గురువారం మ్యాచ్ మొదలైంది.462 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలగా.. న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది.విజయంపై ఆశలుఅయితే, భారత్‌కు కేవలం 106 పరుగుల లీడ్ మాత్రమే లభించింది. ఈ స్కోరును డిఫెండ్ చేసుకుని మ్యాచ్ గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే. కాగా శనివారం ఆట చరమాంకానికి చేరుకునే సమయంలో కొత్త బంతితో కివీస్ పేసర్లు రాణించారు. దీంతో టీమిండియాలో విజయంపై ఆశలు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలనే తొందర కనిపించింది.ఈ క్రమంలో కివీస్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఓపెనర్ టామ్ లాథమ్ క్రీజులో ఉండగా.. రెండో బంతికే బుమ్రా ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, అంపైర్లు నాటౌట్ ఇచ్చారు. దీంతో చిరాకెత్తిపోయిన రోహిత్ సేనకు అంపైర్ల మరో నిర్ణయం ఆగ్రహం తెప్పించింది.అంపైర్ల నిర్ణయం.. మండిపడ్డ రోహిత్, కోహ్లివెలుతురులేమి కారణంగా దాదాపు అరగంట ముందుగానే ఆటను నిలిపివేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వారి దగ్గరకు వెళ్లి వాదనకు దిగగా.. కోహ్లి కూడా అతడికి జత కలిశాడు. ఆట నిలిపే ప్రసక్తే లేదంటూ రోహిత్ కంటే ఎక్కువగా కోహ్లినే గట్టిగా వాదించినట్లు కనిపించింది. వీరిలా అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కాసేపటికే మబ్బులు కమ్ముకువచ్చాయి. అంపైర్లు తమ నిర్ణయం ఫైనల్ చేస్తూ ఆట నిలిపివేయగానే.. గ్రౌండ్స్‌మెన్ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ఇక శనివారం ఆట పూర్తయ్యే సరికి కివీస్ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. టామ్ లాథమ్ 0, డెవాన్ కాన్వే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆట ఆదివారం ఉదయం 9.15 నిమిషాలకు ఆరంభం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 46 రన్స్ ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్- 402 రన్స్ ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్- 462 రన్స్ ఆలౌట్👉న్యూజిలాండ్ లక్ష్యం- 107 పరుగులు👉విజయానికి పది వికెట్ల దూరంలో టీమిండియాచదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?The umpire is asking the players to go off due to bad light. Rohit Sharma & Virat Kohli are not happy 😭😭😭#INDvNZ #tapmad #DontStopStreaming pic.twitter.com/vkn2oq93OE— Mubashir hassan (@Mubashirha88911) October 19, 2024 -
‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విజృంభించినా.. వారి పోరాటం సరిపోయేలా కనిపించడం లేదు. భారమంతా ఇప్పుడు బౌలర్లపైనే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. లేదంటే రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్ పడుతుంది.బెంగళూరు వేదికగా భారత్- కివీస్ మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ తొలిరోజు వర్షం కారణంగా.. టాస్ పడకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో గురువారం వాన తెరిపినివ్వగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి బొక్కబోర్లా పడింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగులు రాబట్టలేక 46 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసి.. 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. రోహిత్, విరాట్ ఫిఫ్టీలుఓపెనర్లలో యశస్వి జైస్వాల్(35) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ రోహిత్ శర్మ(52), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలు చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు.చెలరేగిన హీరోలు.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు చిన్నస్వామి స్టేడియంలో దుమ్ములేపాడు. రిషభ్ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్ 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, పంత్ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు.మొత్తంగా 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. విలియం రూర్కీ బౌలింగ్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. వీళ్లిద్దరు నిష్క్రమించిన తర్వాత టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కివీస్ టార్గెట్ ఎంతంటే?కుల్దీప్ యాదవ్ ఆరు పరగులతో అజేయంగా నిలవగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కివీస్ కంటే కేవలం 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్‌కు స్వల్ప లక్ష్యం విధించింది.అంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసిందంటే గెలిచేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే భారత బౌలర్లదే బాధ్యత. వెలుతురు లేమి కారణంగా శనివారం త్వరగా ఆటను ముగించారు. ఆట పూర్తయ్యే సరికి కివీస్ విజయానికి 107 పరుగులు, టీమిండియా పది వికెట్ల దూరంలో నిలిచాయి.చదవండి: వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్! రోహిత్ రియాక్షన్ వైరల్ -
Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?
టెస్టు క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపిస్తూ ఆపద్భాందవుడిలా నిలుస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన పంత్.. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనను గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిషభ్ పంత్ అవుటయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 89వ ఓవర్‌ను కివీస్ పేసర్ విలియం రూర్కీ వేశాడు. అయితే, అతడి బౌలింగ్‌లో మొదటి బంతికే పంత్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. 99 పరుగుల(9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.స్టాండింగ్ ఓవియేషన్అప్పటిదాకా సర్ఫరాజ్ ఖాన్- రిషభ్ పంత్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై అటాకింగ్ చేస్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టిన అభిమానులు.. పంత్ శతకం మిస్ కాగానే షాక్‌కు గురయ్యారు. అయితే, గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సముచిత రీతిలో గౌరవించారు. పంత్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.కాగా రిషభ్ పంత్ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్ కావడం ఇది ఏడోసారి. అయితే, అతడు సాధించిన శతకాలు ఆరు కావడం విశేషం. ఇక శనివారం కొత్త బంతి రాగానే కివీస్ పేసర్లు మరోసారి విజృంభిస్తున్నారు. 150 పరుగుల వద్ద సర్ఫరాజ్, 99 పరుగుల వద్ద పంత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.కేఎల్ రాహుల్(12) మరోసారి నిరాశపరచగా.. రవీంద్ర జడేజా(5) సైతం విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు కాగా.. రెండో రోజు(గురువారం) టాస్ పడింది👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్👉కివీస్ లక్ష్యం: 107 పరుగులు చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్
ఎవరైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారనేది సర్వసాధారణం. ఓ వ్యక్తి తనకు రూ.80 లక్షల జీతం వస్తోందని, ఇప్పుడు బెంగళూరులో రూ.50 లక్షల జీతానికి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు నేను బెంగుళూరుకు రావాలా? వద్దా? అనే సందేహాన్ని రెడ్డిట్‌లో వెల్లడించారు.నాకు ఐరోపాలో ఐదు సంవత్సరాలు ఉద్యోగానుభవం ఉంది. నా జీతం రూ.80 లక్షల సీటీసీ. నాకు బెంగళూరులో దాదాపు రూ.50 లక్షల సీటీసీ ఆఫర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జాబ్ మార్కెట్ కూడా బాగుంటుందని ఈ ఆఫర్‌కు అంగీకరించాలనుకుంటున్నాను. దీనికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. దీనికి ఓ సలహా ఇవ్వండి? అని రెడ్డిట్‌లో అడిగారు.ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. భారతదేశంలో పని ఒత్తిడి అధికం, అవినీతి, కల్తీ ఆహారం, కలుషితమైన గాలి, నీరు ఇలా చాలా ఉన్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నారు.యూరప్‌లో ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ముఖ్యంగా తొలగింపులు సందర్బాలను గురించి మరికొందరు వివరించారు. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వద్దు, పని భారం ఎక్కువ కావాలనుకుంటే ముందుకు సాగండి అని పేర్కొన్నారు. భారతదేశ జీవన నాణ్యతలో విస్తృత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓభారతదేశంలో ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే హాయిగా జీవించవచ్చు అని ఇంకొందరు అన్నారు. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే మీకు నెల రోజుల సెలవు లభిస్తుంది.. కానీ మీరు బెంగుళూరుకు వెళ్లినట్లయితే 15 రోజులు సెలవు లభించడం కూడా కష్టం అని అన్నారు. -
Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు!.. ఎట్టకేలకు కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అర్ధ శతకం బాది.. తొమ్మిది నెలల నిరీక్షణకు తెరదించాడు. తనకు సొంత మైదానం(ఐపీఎల్- ఆర్సీబీ)లాంటి బెంగళూరు చిన్వస్వామి స్టేడియంలో.. చక్కని షాట్లతో అలరిస్తూ.. టెస్టుల్లో తన 31వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డెబ్బై బంతుల్లో ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.అరుదైన మైలురాయికాగా సంప్రదాయ క్రికెట్లో కోహ్లి చివరగా గతేడాది డిసెంబరులో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో అరుదైన మైలురాయిని దాటాడు. టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో కోహ్లి నిరాశపరిచిన విషయం తెలిసిందే.బంగ్లాతో తొలి మ్యాచ్‌లో కేవలం 23 పరుగులే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టులో 76(47, 29*) చేయగలిగాడు. అయితే, న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి పాత కథనే పునరావృతం చేశాడు. అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు.ధీటుగా బదులిస్తున్న టీమిండియాఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసింది. అయితే, రోహిత్ సేన ఇందుకు ధీటుగా బదులిస్తోంది. 40 ఓవర్ల ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(52) చేయగా.. సర్ఫరాజ్ ఖాన్, కోహ్లి అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
IND Vs NZ: ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను? షాక్‌లో రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రోహిత్ శర్మకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హిట్‌మ్యాన్ నిర్ణయం బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(2) సహా స్టార్ బ్యాటర్లంతా విఫలం కావడంతో 46 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.టీమిండియా శుభారంభంఅనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 రన్స్ చేసి.. ఏకంగా 356 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుభారంభమే అందుకుంది.రోహిత్ హాఫ్ సెంచరీఓపెనర్లు యశస్వి జైస్వాల్ 52 బంతులు ఎదుర్కొని 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రోహిత్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. అయితే, నిలకడగా ఆడుతున్న సమయంలో రోహిత్ దురదృష్టకరరీతిలో అవుట్ అయ్యాడు.ఊహించని రీతిలో బౌల్డ్భారత రెండో ఇన్నింగ్స్ 22వ ఓవర్‌ను కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రోహిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ఊహించని విధంగా బంతి బ్యాట్‌ను తాకి.. బౌన్స్ అయి వికెట్లను తాకగా.. స్టంప్స్ ఎగిరిపడ్డాయి. నిజంగా ఇది రోహిత్ దురదృష్టమనే చెప్పవచ్చు.ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?.. దురదృష్టం భయ్యా!ఒకవేళ ప్రమాదాన్ని పసిగట్టి కాస్త జాగ్రత్త పడి ఉంటే వికెట్ నిలిచేదే! ఏదేమైనా.. తాను అవుటైన తీరుపై రోహిత్ శర్మ సైతం తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అతడు.. ‘‘ఇలా ఎలా బౌల్డ్ అయ్యాను?’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ మ్యాచ్‌లో నువ్వు నిజంగా అన్‌లక్కీ భయ్యా’’ అంటూ నెటిజన్లు రోహిత్‌పై సానుభూతి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా 25 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు కాగా.. రెండో రోజు టాస్ పడింది👉బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)What a terrible test match for Rohit Sharma to remember in all senses.#INDvNZ pic.twitter.com/f0d3gtrGvZ— iNaveenVijayakumar (@iNaveentalks) October 18, 2024 -
IND vs NZ: కివీస్ 402 ఆలౌట్.. భారీ ఆధిక్యం
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.రచిన్ రవీంద్ర సెంచరీమిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: టీమిండియా ఫ్యాన్స్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘ముందు మీ జట్టు సంగతి చూసుకో.. ఆ తర్వాత మా వాళ్ల గురించి మాట్లాడు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరోసారి భారత జట్టును తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.సొంతగడ్డపై అత్యల్ప స్కోరుకాగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా బెంగళూరు వేదికగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో రోహిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసింది.పెద్ద గండం నుంచి బయటపడినిజానికి.. ఒకానొక దశలో 34 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. కథ తొందరగానే ముగుస్తుందేమోనని అభిమానులు భయపడ్డారు. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం మరోసారి పునరావృతమవుతుందేమోనని బెంబేలెత్తిపోయారు. ఆయితే, రిషభ్ పంత్ (20)కారణంగా టీమిండియా పెద్ద గండం నుంచి బయటపడింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.టీమిండియా అభిమానుల ముఖాలు అంటూ టీజింగ్..కాగా ఆస్ట్రేలియా గడ్డపై 2020-21 టెస్టు సిరీస్‌లో భారత జట్టు 36 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా చేసిన స్కోరు.. తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్పం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఎక్స్ వేదికగా రోహిత్ సేన వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ.. టీమిండియా ఫ్యాన్స్‌ను టీజ్ చేశాడు. ‘కాస్తైనా సిగ్గుండాలి అంటూ కౌంటర్స్‘‘కనీసం మీ వాళ్లు 36 పరుగుల మార్కు దాటేశారు.. చూడండి.. టీమిండియా అభిమానుల ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయో!’’ అంటూ వాన్ హేళన చేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మమ్మల్ని కామెంట్ చేయడానికి కాస్తైనా సిగ్గుండాలి.2019 తర్వాత టీమిండియాపై ఇంగ్లండ్ సిరీస్ గెలవనే లేదు. టీమిండియా డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఫైనల్ చేరబోతోంది. ఇంగ్లండ్‌కు ఆ అవకాశం లేనే లేదు. అయినా ఐర్లాండ్ చేతిలో మీ జట్టు 52 రన్స్‌కే ఆలౌట్ అయిన విషయం మర్చిపోయావా?’’ అంటూ భారత జట్టు ఫ్యాన్స్ వాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. కాగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయి.. భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్Look on the bright side Indian fans .. at least you have got past 36 .. 😜😜— Michael Vaughan (@MichaelVaughan) October 17, 2024 -
IND vs NZ: కొరకరాని కొయ్య.. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర శతకంతో మెరిశాడు. భారత బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారి.. వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆద్యంతం అద్భుత బ్యాటింగ్‌తో 124 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటేశాడు.అతడి తర్వాత.. కివీస్ తొలి బ్యాటర్గాకాగా టెస్టుల్లో రచిన్‌కు ఇది రెండో శతకం. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరులో సెంచరీ సాధించడం అతడి కెరీర్లో మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు.. రచిన్ సాధించిన ఈ శతకానికి మరో ప్రత్యేకత కూడా ఉందండీ! న్యూజిలాండ్ తరఫున బెంగళూరులో 2012 తర్వాత సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రచిన్ రవీంద్ర కావడం విశేషం. నాడు రాస్ టేలర్ ఇదే వేదికపైన టీమిండియాపై 113 పరుగులు సాధించాడు.భారీ ఆధిక్యంలో కివీస్ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షం వల్ల గురువారం మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, పిచ్‌ను తప్పుగా వేయడం వల్ల భారీ మూల్యం చెల్లించింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక రోహిత్ సేన 46 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ.. ఇదే వేదికపై న్యూజిలాండ్ బ్యాటర్లను మాత్రం కట్టడి చేయలేకపోయింది. గురువారం ఆట ముగిసే సరికి 180/3 స్కోరు చేసిన కివీస్.. శుక్రవారం ఆరంభం నుంచి నిలకడగా ఆడింది.భోజన విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 299 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లంచ్ బ్రేక్నకు ముందు రచిన్ రవీంద్ర 104, టిమ్ సౌతీ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టీమిండియా 46 ఆలౌట్.. రహానే పోస్ట్ వైరల్
టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో చేదు అనుభవం ఎదురైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేనను 46 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ.. భారత బ్యాటర్ల వైఫల్యానికి, రహానే పోస్ట్‌కి సంబంధం ఏమిటంటారా?!రహానేకు అప్ప ట్లో పిలుపుటీమిండియా టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా వెలుగు వెలిగిన రహానేకు ప్రస్తుతం జట్టులో చోటు కరువైంది. అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడంతో మళ్లీ భారత జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడిన జట్టులో స్థానం సంపాదించాడు.తన విలువ చాటుకున్నాడుఇంగ్లండ్ గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విఫలం కాగా రహానే 89, 46 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఏకంగా మరోసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, విండీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా రహానేకు మళ్లీ అవకాశాలు రాలేదు.రంజీ, ఇరానీ కప్ గెలిచిన సారథిప్రస్తుతం అతడు దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్నాడు. ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే గతేడాది ఆ జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు ఇరానీ కప్-2024 ట్రోఫీ కూడా గెలిచాడు. ప్రస్తుతం మళ్లీ రంజీ 2024-25 సీజన్‌తో బిజీగా మారాడు. అతడి సారథ్యంలోని ముంబై తమ మొదటి మ్యాచ్‌లో బరోడా చేతిలో ఓడిపోయింది.స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాఈ క్రమంలో అక్టోబరు 18 నుంచి తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా రహానే సేన మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రహానే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం షేర్ చేస్తూ.. ‘‘స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అంటూ గ్రీన్‌టిక్ బాక్స్‌లో రైట్ గుర్తు ఉన్న ఎమోజీ పోస్ట్ చేశాడు.‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్ఇక అదే సమయంలో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ రెండింటినీ ముడిపెడుతూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్.. ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేయాలో బాగా తెలుసు. నువ్వు టీమిండియా రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నావని సంకేతాలు ఇస్తున్నావు కదా! అసలే ఆస్ట్రేలియా పర్యటన ముందుంది మరి!’’ అని రహానే క్యాప్షన్‌కు తమ భాష్యాలు ఆపాదిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే నాటి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్ View this post on Instagram A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) -
Rishabh Pant: సర్జరీ జరిగిన కాలికే గాయం.. దురదృష్టవశాత్తూ..
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్డేట్ అందించాడు. సర్జరీ అయిన మోకాలికే బంతి బలంగా తాకిందని.. ముందు జాగ్రత్త చర్యగానే పంత్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కి పంపినట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.అప్పుడు ప్రాణాలతో బయటపడినాభారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొని టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.‘టాప్’ స్కోరర్‌గా ఇక కివీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. బుధవారమే ఆరంభం కావాల్సి ఉండగా.. భారీ వర్షం వల్ల మొదటి రోజు ఆట సాధ్యం కాలేదు. ఈ క్రమంలో గురువారం వాన పడకపోవడంతో ఆటను మొదలుపెట్టారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 46 పరుగులకే కుప్పకూలింది.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. అయితే, కివీస్ మొదిటి ఇన్నింగ్స్ సమయంలో పంత్‌కు గాయమైంది. 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చి పంత్ మెకాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అతడి స్థానాన్ని ధ్రువ్ జురెల్ భర్తీ చేశాడు. నిజానికి.. ఈ మ్యాచ్‌కు పంత్ మళ్లీ అందుబాటులోకి రావడం అత్యంత ముఖ్యం. బ్యాటర్‌గా, కీపర్‌గా అతడి సేవలు జట్టుకు అవసరం. మోకాలు కాస్త వాపు వచ్చిందిదీంతో అతడు గాయం వల్ల దూరమైతే పరిస్థితి ఏమిటన్న అభిమానుల ఆందోళన నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించాడు. గురువారం ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ సరిగ్గా మోకాలికే బంతి తగలింది.అదే కాలికి గతంలో సర్జరీ జరిగింది. అందుకే.. మోకాలు కాస్త వాపు వచ్చింది. కండరాలు కూడా పట్టేశాయి. అందుకే మేము రిస్క్ తీసుకోదలచుకోలేదు. రిషభ్ కూడా మాకు ఇదే చెప్పాడు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా అతడిని వెనక్కి పంపించాం. సర్జరీ జరిగిన కాలుకే గాయం కావడంతో ఈ నిర్ణం తీసుకున్నాం. అతడు తొందరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నాం. రేపు(శుక్రవారం) తనని మనం మైదానంలో చూస్తామనే అనుకుంటున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్ -
Ind vs NZ: తప్పు నాదే.. మాకు ఇది దుర్దినం: రోహిత్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆరంభంలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 46 పరుగులకే కుప్పకూలింది. ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మనే కారణమంటూ భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. విశ్లేషకులు సైతం రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని విమర్శిస్తున్నారు. సారథి నిర్ణయమే కొంపముంచిందని అభిప్రాయపడుతున్నారు.రోహిత్ శర్మ స్పందనఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై రోహిత్ శర్మ స్పందించాడు. తాను పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేయాలన్న తన నిర్ణయం బెడిసికొట్టిందని తెలిపాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా బెంగళూరులో బుధవారం తొలి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా మొదటి రోజు ఆట సాధ్యపడలేదు. అయితే,గురువారం వాన తెరిపినివ్వడంతో ఆట మొదలు కాగా.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలంఅయితే, కివీస్ సీమర్ల విజృంభణ ముందు భారత బ్యాటింగ్ నిలవలేకపోయింది. 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి.. మరో 12 పరుగుల వ్యవధిలోనే ఆలౌట్ అయిపోయింది. స్టార్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్(13), రోహిత్ శర్మ(2), విరాట్ కోహ్లి(0), సర్ఫరాజ్ ఖాన్(0), కేఎల్ రాహుల్(0) మూకుమ్మడిగా విఫలం కాగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(0), రవిచంద్రన్ అశ్విన్(0) కూడా చేతులెత్తేశారు.అదే పిచ్‌పై కివీస్ ‘హిట్’అయితే, ఇదే చిన్నస్వామి పిచ్‌పై కివీస్ గురువారం ఆట ముగిసే సరికి 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 105 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా‘‘తొలి సెషన్ తర్వాత పిచ్ సీమర్లకు అంతగా అనుకూలించదని భావించాం. వికెట్ మీద పచ్చిక కూడా అంతగా లేదు. నిజానికి రానురాను బంతి బాగా టర్న్ అవుతుందని మేము భావించాం. అయితే, నా అంచనా తప్పింది. పిచ్ స్వభావాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.సీమర్లకు స్వర్గంలా మారిన పిచ్‌పై మేము 46 పరుగులకే ఆలౌట్ అయ్యాము. షాట్ సెలక్షన్ సరిగ్గా లేదని చెప్పవచ్చు. అయితే, కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలను అమలు చేయడంలో తడబడతాం. ఏదేమైనా ఈరోజు మాకు దుర్దినం’’ అని రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
IND vs NZ: దంచికొట్టిన కాన్వే.. టీమిండియాకు చేదు అనుభవం!
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్డులతో పాటు విమర్శలూ మూటగట్టుకుంది. ఇక బౌలింగ్‌లోనూ మన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లు పరుగులు రాబట్టలేక చతికిలపడిన పిచ్‌పై కివీస్ బ్యాటర్లు మెరుగైన స్కోర్లు సాధించారు. ఓవరాల్‌గా రెండో రోజు కివీస్‌దే పైచేయి అయింది.భారీ వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దుకాగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో బుధవారం మొదటి రోజు ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. ఉదయం నుంచి వర్షం కురవడంతో కనీసం టాస్ కూడా పడకుండానే తొలి రోజు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా... ఆ సమయంలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. కాసేపటికి వరుణుడు తెరిపినివ్వడంతో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కావడం ఖాయమే అని అభిమానులు ఆశపడ్డారు.కానీ గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్‌ను పూర్తిగా కవర్స్‌తో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ‘హాక్–ఐ’ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ముందస్తు లంచ్ బ్రేక్ ప్రకటించి ‘హాక్–ఐ’ పరికరాలను అమర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే టీ విరామ సమయం కూడా మించి పోగా... కాసేపటికే మరోసారి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో రోజు కరుణించిన వరణుడుఈ క్రమంలో గురువారం కూడా ఆట మొదలవుతుందో లేదోనన్న సందేహాల నడుమ ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కెప్టెన్ రోహిత్ శర్మ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు.వికెట్ల పతనంఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఇక టెయిలెండర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మ్యాచ్ హెన్నీ ఐదు వికెట్లు కూల్చగా.. విలియం రూర్కీ నాలుగు, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.కాన్వే హీరో ఇన్నింగ్స్ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు డెవాన్ కాన్వే శుభారంభం అందించి.. రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ కాన్వే 105 బంతులాడి 91 పరుగులతో అదరగొట్టాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. గురువారం ఆట పూర్తయ్యేసరికి రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ భారత్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
టీమిండియాకు మరో భారీ షాక్.. స్టార్ బ్యాటర్‌కు గాయం
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 13, కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులే చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ సున్నా చుట్టారు.పంత్ ఒక్కడేఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.మోకాలికి బలంగా తాకిన బంతిమరోవైపు.. బౌలింగ్‌లోనూ రోహిత్ సేన పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ క్రమంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు టీమిండియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది.కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి పంత్ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియోలు వచ్చి పంత్‌ను పరీక్షించారు.బరిలోకి జురెల్అయితే, బాధ తాళలేక పంత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడు మైదానం వీడాడు. ఈ క్రమంలో పంత్ సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఒకవేళ పంత్ గనుక కోలుకోకపోతే టీమిండియాకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్ బోర్డు వార్నింగ్! -
టీమిండియా అత్యంత చెత్త రికార్డు..
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కివీస్ ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై నిప్పులు చేరుగుతున్నారు.బ్లాక్ క్యాప్స్ ఫాస్ట్ బౌలింగ్ దాటికి టీమిండియా బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. వారిని ఎదుర్కొవడం భారత బ్యాటర్ల తరం కాలేదు. వచ్చిన వారు వచ్చినట్లగానే వెనక్కి వెళ్తున్నారు. తొలి సెషన్లో ఏ ఒక్క భారత్ బ్యాటర్ కూడా కివీస్ బౌలర్‌ను టార్గెట్ చేయలేకపోయాడు. ఈ క్రమంలో భారత జట్టు కేవలం 32 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా వంటి స్టార్ బ్యాటర్లు డకౌట్లగా వెనుదిరిగారు.మరోవైపు రోహిత్ శర్మ రెండు, జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేశారు. మిగతా వాళ్లలో రిషభ్ పంత్ 20 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్ర్ అశ్విన్ డకౌట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు పరుగులు చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. విలియం రూర్కీ నాలుగు, సౌతీ ఒక వికెట్ తీశారు. 55 ఏళ్ల తర్వాత..ఇక ఈ మ్యాచ్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్ ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. 1969 తర్వాత స్వదేశంలో భారత జట్టు 6వ వికెట్ నష్టానికి చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఇంతకుముందు 1969లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో భారత్ 6వ వికెట్ పతనానికి 27 పరుగులు చేసింది. మళ్లీ ఇప్పుడు 55 ఏళ్ల తర్వా అదే కివీస్‌పై భారత్ ఈ చెత్త రికార్డు మూటకట్టుంది.అదే విధంగా మరో చెత్త రికార్డును భారత్ తమ ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో జరిగిన ఓ టెస్టులో టాప్ 7 భారత బ్యాటర్లలో నలుగురు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఇలా జరగడం మూడోసారి. 1952, 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో టాప్ 7 భారత బ్యాటర్లలో నలుగురు డౌకటయ్యారు. -
IND vs NZ 1st Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆట రద్దు
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) ప్రారంభం కావాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టాస్ కూడా సాధ్యపడలేదు. తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రకటించారు. బెంగళూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో కవర్లు తీసేందుకు కూడా సాధ్యపడలేదు. చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ వర్షం ఆగితే ఏమైనా చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు చేసేదేమీ లేక తొలి రోజు ఆటను రద్దు చేశారు. రేపు కూడా ఇదే పరస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందో లేక పేలవమైన డ్రాగా ముగుస్తుందో వేచి చూడాలి.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో (అక్టోబర్ 24-28).. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో (నవంబర్ 1-5) జరుగనున్నాయి. చదవండి: అరంగేట్రం బ్యాటర్ సెంచరీ.. 366 పరుగులకు ఆలౌటైన పాక్ -
బెంగళూరులో వర్షం.. భారత్ - కివీస్ తొలి టెస్టు మొదటి సెషన్ ఆట కష్టమే! (ఫొటోలు)
-
తమిళనాడు, కర్ణాటకలో జడివానకు ప్రజలు అతలాకుతలం (ఫొటోలు)
-
IND vs NZ 1st Test: బెంగళూరులో భారీ వర్షం.. అభిమానులకు చేదువార్త
Ind vs NZ 1st Test Day 1: Toss delayed due to rain: టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీగా వాన పడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత్‌కు వచ్చింది.షెడ్యూల్ ప్రకారం... ఇరుజట్ల మధ్య బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, భారత్- కివీస్ తొలి టెస్టుకు వేదికైన చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే మైదానాన్ని కవర్స్‌తో కప్పినా.. సమయానికి మ్యాచ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.ఫైనల్ దారిలో టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన కివీస్‌తో మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు.. పట్టికలో ఆరోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇటీవలే శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. అయితే, భారత్‌లో సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ 2024 జట్లుటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024 -
ఓ వైపు పూజ.. మరోవైపు వర్క్: వీడియో వైరల్
చదువుకునే రోజుల్లో.. జాబ్ వస్తే ఏదైనా చేసేయొచ్చని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి దుర్గా పూజలో కూడా ల్యాప్‌టాప్, మొబైల్ రెండూ చేతపట్టుకుని క్లయింట్ మీటింగ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. ఈయన చుట్టూ ఏం జరుగుతోందో కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది చూసిన చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బెంగళూరులో ఇలాంటివి మామూలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఉద్యోగుల జీవితం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకొందరు పని పూర్తయిన తరువాత పూజకు హాజరైతే బాగుంటుందని అంటున్నారు.ఇలాంటి సంఘటనలు బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. స్కూటర్ మీద వెల్తూ మీటింగులకు హాజరైన సంఘటనలు, బైక్ నూక కూర్చుని వర్క్ చేసుకుంటున్న దృశ్యాలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.A Peak Bengaluru moment unfolded when a man was caught attending a client meeting on both his laptop and phone while at a Navratri pandal in Bengaluru. The incident perfectly encapsulates the city's fast-paced work culture, where balancing professional commitments and personal… pic.twitter.com/fVIeGDN23d— Karnataka Portfolio (@karnatakaportf) October 13, 2024 -
Ind vs NZ: కివీస్ పేసర్ అవుట్! అన్క్యాప్డ్ ప్లేయర్ ఎంట్రీ
టీమిండియాతో టెస్టులకు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ బెన్ సియర్స్(Ben Sears) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. సియర్స్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ జాకోబ్ డఫీ(Jacob Duffy)ని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. బెంగళూరు వేదికగా అక్టోబరు 16(బుధవారం) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి.మోకాలి గాయంఅయితే, తొలి టెస్టు ఆరంభానికి ముందే న్యూజిలాండ్ యువ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం తీవ్రమైంది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాగా 26 ఏళ్ల సియర్స్ ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.అనంతరం.. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. అయితే, రెండో టెస్టు సమయంలో మోకాలి నొప్పితో అతడు ఇబ్బందిపడ్డాడు. వైద్య పరీక్షల ఫలితాలు తాజాగా వెలువడగా.. ఆటకు కొంతకాలం దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.పేస్ విభాగం పటిష్టంగానేఇక సియర్స్ టీమిండియాతో సిరీస్‌కు సియర్స్ లేకపోయినా.. న్యూజిలాండ్ పేస్ విభాగం పటిష్టంగానే ఉంది. వెటరన్ బౌలర్ టిమ్ సౌతీతో పాటు ఎమర్జింగ్ పేసర్ విలియం ఒ రూర్కీ జట్టుతో ఉన్నారు. అంతేకాదు.. మీడియం పేసర్‌గా డారిల్ మిచెల్ కూడా సేవలు అందించగలడు. ఈ క్రమంలో సియర్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాకోబ్ డఫీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం లేదు.టీమిండియాతో టెస్టు సిరీస్-2024కు న్యూజిలాండ్ జట్టు(అప్డేటెడ్)డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.న్యూజిలాండ్‌తో టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ. -
మహిళ దుస్తులు నచ్చలేదని ‘యాసిడ్ దాడి’ బెదిరింపు
బెంగళూరు: ఓ మహిళ తనకు నచ్చిన దుస్తులు వేసుకున్నందుకు.. యాసిడ్ పోస్తానని సోషల్ మీడియాలో బెదిరించిన ఓ వ్యక్తిని అతని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ‘‘అతనికి నచ్చని దుస్తులు వేసుకున్నందుకు యాసిడ్ పోస్తానని నా భార్యను నికిత్శెట్టి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు, వెంటనే ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’’అని జర్నలిస్ట్ షాబాజ్ అన్సార్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి కర్ణాటక అధికారులను ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్స్ మహిళకు మద్దతుగా నిలిచారు. నికిత్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని అతడు ఉద్యోగం చేస్తున్న సంస్థ ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై నికిత్ శెట్టి యాజమాన్యం స్పందించింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘‘మా ఉద్యోగి మరో వ్యక్తి దుస్తుల ఎంపిక గురించి బెదిరించడం మాకు బాధ కలిగించింది. ఈ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది మా విలువలకు విరుద్దం. మేం నికిత్ శెట్టిని తొలగిస్తున్నాం. అతనిపై ఫిర్యాదు చేశాం. కేసు నమోదు అయ్యింది’’అని ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్ తెలిపింది. అయితే తన భార్యను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న కంపెనీకి, అందుకు మద్దతు తెలిపిన పలువురు నెటిజన్స్‌కు అన్సార్ కృతజ్ఞతలు తెలిపారు. -
Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్ కూడా!
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్హిడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. -
బెంగళూరులో మూడు కాలేజీలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat— LatestLY (@latestly) October 4, 2024క్రెడిట్స్: LatestLYసమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య -
రూపాయికే ఆటో రైడ్: భారీగా ఎగబడిన జనం
బెంగళూరులో ప్రయాణమంటే కొంత కఠినతరమే.. చార్జీలు (ఆటో) కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. కేవలం ఒక రూపాయికే ఆటోరైడ్ అంటూ ఓ వీడియోను కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చూసిన చాలామంది రూపాయి మాత్రమే చెల్లించి నగరాన్ని చుట్టేస్తున్నారు. దీంతో నగరంలో ఆటోల రద్దీ బాగా పెరిగిపోయింది. ఆటోలను బుక్ చేసుకోవడానికి చాలా మంది ఎగబడుతున్నారు. యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఫ్లిప్‌కార్ట్ స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి టెక్ క్యాపిటల్‌లో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.ఇదీ చదవండి: రెండు రోజుల్లో 33 కోట్లు: పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ జోరుఫ్లిప్కార్ట్ ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం బెంగళూరు నగర వాసులకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మరింత ఉత్సాహాన్ని నింపడానికి సంస్థ రూపాయికే ఆటోరైడ్ ప్రకటించింది. కేవలం రూపాయికే ప్రయాణం చాలా గొప్ప విషయం అంటూ.. చాలామంది నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని మరికొందరు నెటిజన్లు కోరుతున్నారు. -
కండక్టర్‌కు కత్తిపోట్లు..బస్సులో ప్రయాణికుడి బీభత్సం
బెంగళూరు: నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. కత్తి దాడిలో కండక్టర్ యోగేష్(45)కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కత్తిదాడికి పాల్పడ్డ యువకుడిని జార్ఖండ్‌కు చెందిన హరీశ్సిన్హా(28)గా గుర్తించారు. ఇతడు కాల్సెంటర్లో పనిచేస్తూ గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. మంగళవారం(అక్టోబర్1) జరిగిన ఈ ఘటనకు సంబంధించి హరీశ్సిన్హాపై వైట్‌ఫీల్డ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Stabbing inside BMTC Bus Shocks #BengaluruBPO employee who was fired from his job, stabs a conductor inside BMTC bus near ITPL Whitefield Conductor Yogesh reportedly asked the accused not to stand near the door, in a fit of rage the accused stabbed the conductor multiple… pic.twitter.com/AhwqUoAYPZ— Nabila Jamal (@nabilajamal_) October 2, 2024 ఇదీ చదవండి: పుణెలో కుప్పకూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి -
కర్ణాటకలో నిర్మలపై కేసు
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.నిర్మల రాజీనామా చేయరా: సిద్ధుకేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. -
భారతీయుల తీరుపై నితిన్ కామత్...
భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన జరోధా సీఈఓ 'నితిన్ కామత్' ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లిష్టమైన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు. బెంగళూరు జరిగిన టెక్‌స్పార్క్స్ 2024 ఈవెంట్లో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ.. భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు? అని ప్రశ్నించారు.ధనవంతుల విషయంలో భారతీయులకు, అమెరికన్లకు మధ్య వ్యత్యసాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. యుఎస్‌లో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించి.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తే, అలాంటి విషయాలను న్యూస్ పేపర్ కవర్ పేజీ మీద ముద్రిస్తారు. అక్కడ ఇదంతా సర్వ సాధారణం.కానీ.. భారతదేశంలో ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అంటే.. ఏదో తప్పుడు దారిలో డబ్బు సంపాదిస్తున్నారని చాలామంది భావిస్తారు. ఆ తరువాత వాళ్ళను ద్వేషించడం మొదలుపెడతారు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారీ సమాజం, భారత్ మాత్రం పెట్టుబడిదారీ సమాజంగా నటిస్తున్న సోషలిస్టు సమాజం అని అన్నారు. ఇప్పటికీ చాలామంది ప్రజల గుండెల్లో సోషలిస్టు భావాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు పేదరికాన్ని గౌరవ చిహ్నంగా ధరిస్తారని ఒకరు అన్నారు. భారతదేశంలో, ధనికులు తగిన పన్నులు చెల్లించకుండా, మోసాలకు పాల్పడుతున్నారని, పేద.. మధ్యతరగతి వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ధనవంతులు అవుతున్నారని మరొకరు అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Shradha Sharma (@shradhasharmayss) -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు
బెంగళూరు: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రద్దైన ఎన్నికల బాండ్ల పేరిట మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానం తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది.కాగా పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మతా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్షపరిషత్తుకు చెందిన ఆదర్శ్ గతంలో తిలక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సంతోశ్ గజానన ధర్మాసనం..నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు ఎఫ్ఐఆర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ నతేలు, నలీన్ కుమార్ కటీల్, బీఐ విజయేంద్ర పేర్లను కూడా చేర్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఒత్తిళ్లు పెంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలతో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్లను జాతీయ, రాష్ట్ర స్థాయిలలోని బిజెపి నాయకులు నగదుగా మార్చుకున్నారని తెలిపారు.కాగా నగదు రూపంలో పార్టీలకు ఇచ్చే విరాళాలకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే,ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఈ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది. ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది -
మహాలక్ష్మి నన్ను కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా
బనశంకరి: ఐటీ నగరంలో వయ్యాలికావల్ మునేశ్వరనగరలో మహాలక్ష్మీ (29) అనే నేపాలీ యువతిని హత్య చేసి, ఖండాలుగా నరికి ఫ్రిజ్‌లో కుక్కి పారిపోయిన హంతకుడు ముక్తిరంజన్ రాయ్ కూడా కడతేరిపోయాడు. అతడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కారణాలను డెత్‌నోట్‌లో రాశాడు. ఈ నెల 3వ తేదీన ప్రేయసి మహాలక్ష్మీని హత్యచేశానని అందులో తెలిపాడు. ఆమె ఇంటికి వెళ్లాను, వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది, ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశానని రాశాడు. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాను. ఆమె ప్రవర్తనతో విరక్తిచెంది ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. ముందుగా ఆమెను గొంతు పిసికి చంపాను, తరువాత బాత్రూమ్లో ఆమె శరీరాన్ని హ్యాక్సా బ్లేడుతో ముక్కలుముక్కలుగా చేశాను. ఆపై ఫ్రిజ్‌లో పెట్టాను. బాత్రూమ్లో యాసిడ్ పోసి శుభ్రం చేశానని డెత్‌నోట్‌లో రాశాడు.సొంతూరికి వెళ్లి ఆత్మహత్య20 రోజులుగా మృతదేహం ఫ్రిజ్‌లో ఉండిపోయింది. నాలుగు రోజుల కిందట యువతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్తిరంజన్ రాయ్‌తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలింది. ఇద్దరూ ఒకే మాల్లో పనిచేసేవారు. అలా ప్రేమాయణం ప్రారంభించారు. హత్య తరువాత దుండగుడు 23వ తేదీ ఒడిశాలో సొంతూరైన పండి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంట్లో గడిపి మరుసటి రోజు స్కూటర్, ల్యాప్‌టాప్ తీసుకుని సమీప శ్మశానానికి వెళ్లాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్‌ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్‌కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్‌కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఇవి ఉద్యోగాలా.. నరకంలో శిక్షలా?
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.నరకానికి స్వాగతం"నన్ను ఒక లగ్జరీ హోటల్లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు. -
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
నీడనిచ్చే చెట్టుకే తిట్లు
బొమ్మనహళ్లి: బెంగళూరులో కొంతమంది చిల్లర ప్రవర్తన ఆ వర్గాలకు చెందిన అందరికీ చెడ్డ పేరు తెచ్చేలా ఉంటోంది. పైగా వారు చదువుకుని ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు పొంది జీవితంలో ముందుకు సాగుతూ, పైగా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి వల్ల సమాజంలో కలతలు వస్తున్నాయి. మేం వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అని.. ఉత్తర భారత ప్రాంతాలకు చెందిన తాము బెంగళూరుకు రాకపోతే బెంగళూరు మొత్తం ఖాళీ గా ఉంటుంది. ఇక్కడి నుంచి తాము వెళ్లిపోవాలని అంటూ ఉంటారు. మేం వెళ్లిపోతే ఇక్కడ ఏమీ ఉండదు. మీకు ఆదాయం రాదు. పీజీ హాస్టళ్లు, పబ్‌లు వెలవెలబోతాయి అని సుగంధ శర్మ అనే మహిళ రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. బెంగళూరుకు వలస వచ్చిన సుగంధ శర్మ.. బెంగళూరు గురించి, ఇక్కడి ప్రజల గురించి ఇన్‌స్టాలో చులకనగా వీడియోలు, రీల్స్ చేసింది, దానిని చూసిన కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు, రచయితలు వంటివారు ఆమె చేష్టలను ఖండించారు. మొదట మీరు మా బెంగళూరును వదిలి వెళ్ళండి, నగరం ఎలా ఖాళీ అవుతుందో చూస్తాము అని అనేకమంది ఆమెకు ఘాటుగా సమాధానాలిచ్చారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం కన్నడ పోరాట సంఘం నాయకుడు రూపేష్ రాజన్న, ఆప్ నాయకులు ఆమె ప్రవర్తనపై మండిపడ్డారు. ఆమె పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొడుతోందని కోరమంగళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వేలాది మంది నుంచి తీవ్ర నిరసనలు రావడంతో సుగంధ శర్మ దిగివచ్చింది. ఐ లవ్ బెంగళూరు అని మరో వీడియో పోస్టు పెట్టి ప్రజల కోపాన్ని చల్లబరిచే యత్నం చేశారు. కంపెనీ, పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. -
బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసులో పురోగతి
బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.అయితే మహాలక్ష్మి కేసు నేపథ్యంలో మహిళల భద్రతపై నెలకొన్న ఆందోళనపై పరమేశ్వర్ స్పందించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.బెంగళూరు వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నట్టు బెంగళూరు వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్ ఎన్ సతీశ్ కుమార్ తెలిపారు. -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు
‘చూపున్నా చూడలేని అంధుల కంటే....అంధులు బాగా చూడగలరు’ అంటుంది పెర్షియన్ సామెత. కంటిచూపు బాగున్నా వాస్తవాలు చూడలేని వారిపై ఈ సామెత ఒక చురక అనుకున్నప్పటికీ.... చూపులేని మహిళలు వైద్యరంగంలో కొత్త కాంతితో వెలుగుతున్నారు. తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’తో ఎర్లీ స్టేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తిçస్తూ ఎంతోమంది మహిళలు ప్రమాదం బారిన పడకుండా చూస్తున్నారు...మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ్రపారంభ సంకేతాలను గుర్తించడంలో చూపులేని అయేషా వైద్యులకు సహాయపడుతుంది. ఈ పరీక్షల కోసం తన చేతి వేళ్లను ఉపయోగిస్తుంది. ‘మా చేతి వేళ్లలోని అధిక స్పర్శ జ్ఞానం వక్షోజాలలోని చిన్న లంప్స్‌ను కనిపెట్టడంలో సహాయపడుతుంది. ఈ వృత్తి నాలాంటి చూపులేని మహిళలకు బాగా సరిపోతుంది’ అంటుంది అయేషా.బెంగళూరులోని ‘సైట్‌కేర్’ హాస్పిటల్లో పనిచేస్తుంది అయేషా. రోజుకు తొమ్మిది పరీక్షలు చేస్తుంది. ఒక్కొక్కరికి అరగంట సమయం తీసుకుంటుంది.‘కంటిచూపు లేని అయేషాలాంటి యువతులు ఎర్లీ స్టేజిలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను డిటెక్ట్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు’ అంటున్నాడు ‘సైట్‌కేర్’ హాస్పిటల్స్ కో–ఫౌండర్, సీయివొ సురేష్ రాము. చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన అయేషా డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అయేషా తన నెల జీతంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది. (మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...)అయేషాలాగే కోలార్‌కు చెందిన 29 సంవత్సరాల నూరున్నీసా చిన్న వయసులోనే చూపు కోల్పోయింది. తన ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా ఎంతోమంది మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంటుంది.బెంగళూరులోని ‘జ్యోతి నివాస్ కాలేజీ’లో డిగ్రీ చేసిన నూరున్నీసాకు ఉద్యోగం దొరకడం కష్టం అయింది. ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా తనకు ఉపాధి దొరకడమే కాదు గుర్తింపు కూడా లభించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ‘గతంలో మాదిరిగా కాదు. ఇప్పుడు చూపులేని వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది నూరున్నీసా.అయేషా, నూరున్నీసా...ఈ ఇద్దరిలో ఎవరికీ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు.బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి, టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించడానికి అయేషా, నూరున్నీసాలు దేశంలోని ఎన్నో ్రపాంతాలు తిరిగారు. టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు అనేవి చూపు లేని మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక పరీక్షలు. ఈ పరీక్షలను నిర్వహించేవారిని మెడికల్ టక్ట్యల్ ఎగ్జామినర్స్(ఎంఐటీ)లుగా వ్యవహరిస్తారు. ‘ఎంఐటీ’లుగా ఎంతో మంది చూపు లేని మహిళలు ఉపాధి పొందడమే కాదు తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎర్లీ స్టేజీలో గుర్తిస్తున్నారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)డిస్కవరింగ్ హ్యాండ్స్దిల్లీకి చెందిన ‘డిస్కవరింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ టక్ట్యల్ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలకు సంబంధించి చూపు లేని మహిళల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థ బెంగళూరులో కూడా శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళల్లో అయేషా, నూరున్నీసా ఉన్నారు. ‘మొదట్లో వైద్యానికి సంబంధించిన పదాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది’ అంటుంది లీనా మెహతా. పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె చూపు కోల్పోయింది. అయితే ట్రైనర్స్ ఒకటికి పదిసార్లు అర్థమయ్యేలా చెప్పేవాళ్లు. త్రీడీ మోడల్స్‌తో శరీర పనితీరును సులభంగా అర్థం చేయించేవారు. -
బెంగళూరులో చిరుత పులి సంచారం కలకలం
కర్ణాటకలోని బెంగళూరులో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తుమకూరు రోడ్..హోసూర్ రోడ్ మధ్య ఫేజ్ 1 టోల్ ప్లాజ్ ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3.00 గంటలకు చిరుతపులి టోల్‌ప్లాజా సమీపంలోని ఫ్లైఓవర్‌ను దాటుతున్నట్లు టోల్ ఫ్లాజా అధికారులు గుర్తించారు. పనక్ ఇండియా కంపెనీ ప్రాంతం నుండి నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఎన్ టీటీ ఎఫ్ ) వైపు చిరుత పులి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీటీఎఫ్ ప్రిన్సిపల్ సునీల్ జోషి మాట్లాడుతూ.. టోల్ గేట్ సమీపంలోని కెమెరాలో కాంపౌండ్ వాల్ దగ్గర నుండి చిరుతపులి వెళ్ళినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం ఇనిస్టిట్యూట్ లలో అన్నీ గదులను, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశాం.ఎక్కడా పులి ఆనవాళ్లు కనిపించలేదు. క్యాంపస్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించాం. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు. చిరుతపులి కాంపౌండ్ ప్రక్కన ఉన్న దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో మాకు తెలియదు’ అని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ తరగతులను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి : రూటు మార్చిన ఇజ్రాయెల్ -
భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన అగంతకుడు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సభలోకి ఓ అగంతకుడు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది?కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం సిద్ధరామయ్యకు శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ వ్యక్తి వేదికపైకి రాకముందే పోలీసు అధికారులు అతన్ని వెంటనే పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తి సిద్ధరామయ్య అభిమాని అని, శాలువతో సత్కరించాలని సీఎం వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది.కాగా,సీఎం సభలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా..అగంతకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అతను ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 📍बेंगलुरुकर्नाटक के CM सिद्धारमैया की सुरक्षा में बड़ी चूक सामने आई है. दरअसल, एक कार्यक्रम के दौरान एक युवक भागते हुए उनके मंच पर पहुंच गया. जिसे कार्यक्रम में मौजूद सुरक्षाकर्मियों ने दबोचा लिया और मंच से नीचे उतारकर पुलिस के हवाले कर दिया.@siddaramaiah #Bengaluru… https://t.co/xKyZW4fVws pic.twitter.com/vDqbA1GEWf— Dainik Live (@Dainik_Live) September 15, 2024ఇదీ చదవండి : టీ తాగేందుకు రావాలని వైద్యులకు దీదీ ఆహ్వానం -
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా?
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ ఓ మహిళ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది.బెంగళూరు కేంద్రంగా నివసిస్తున్న ఓ మహిళ తాను ఫుడ్ ఆర్డర్ పెట్టానని, డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌కి కన్నడ రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బెంగళూరు కర్ణాటకలో ఉందా లేదా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ మీ డెలివరీ ఉద్యోగికి కన్నడ,ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోతున్నారు. కనీసం అర్థం చేసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. హింది మేం కూడా నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్నర్లు కన్నడ నేర్చుకునేలా చూడండి’ అని సదరు మహిళ ట్వీట్ చేశారు.Bengaluru is in Karnataka or Pakistan @Swiggy ?Your delivery guy is neither speaking nor understanding #kannada ,not even #English. Do you expect us to learn his state language #Hindi in our land? Stop imposing things on us and make sure your delivery persons know #Kannada. pic.twitter.com/smzQ6Mp7SV— Rekha 🌸 (@detached_98) September 12, 2024అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వినియోగ దారుడు భారత్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ భాష విషయంలో తమిళ, కన్నడిగులు అంత కఠినంగా ఉండరు. అలా ఉండకూడదు. భారతదేశం వైవిధ్యం, అనేక భాషలతో కూడిన దేశం, అన్ని భాషలను గౌరవించాలి.మరొకరు మీరు డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే.. డెలివరీ సకాలంలో జరిగినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? అని మరోకరు అండగా నిలుస్తున్నారు. మీరు నిజంగా డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? మీ ఆహారాన్ని తీసుకోండి. రేటింగ్ ఇవ్వండి అది చాలు’ అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి : ప్రధానిగా నాకు అవకాశం వచ్చింది -
కష్టాలన్నీ తీరినట్టే.. బెంగళూరుతో తొలి మ్యాచ్.. ఈసారైనా!
జట్టులోని ఆటగాళ్లకు ఫీజులు కూడా చెల్లించలేని నిస్సహాయత... కాంట్రాక్ట్‌ల రద్దు... ఆటగాళ్ల బదిలీలపై నిషేధం... టీమ్‌పై నిషేధం... కొద్ది రోజుల క్రితం వరకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) పరిస్థితి ఇది. వరుణ్ త్రిపురనేని తదితరులు యజమానులుగా ఉన్న ఈ టీమ్‌కు ఐఎస్ఎల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినా స్పందించలేని వైనం... చివరకు ఐఎస్ఎల్ నుంచి హైదరాబాద్ టీమ్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం!ఇలాంటి సమయంలో బీసీ జిందాల్ గ్రూప్ బరిలోకి దిగింది. అన్ని రకాల బాకీలను తీరుస్తూ జట్టును తీసుకునేందుకు సిద్ధమైంది. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు యాజమాన్య మార్పు ఖాయమైంది. ఇప్పుడు అధికారిక అనుమతి తర్వాత హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఐఎస్ఎల్లో ఆరో సీజన్‌కు ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఎల్లో హైదరాబాద్ టీమ్ అడుగు పెట్టడమే అనూహ్యంగా జరిగింది. 2018–19 సీజన్ తర్వాత ఆర్థిక సమస్యలతో పుణే సిటీ టీమ్ సతమతమైంది. దాంతో తర్వాతి సీజన్లో పుణే స్థానాన్ని మరో జట్టుతో భర్తీ చేసేందుకు ఐఎస్ఎల్ నిర్వాహకులు సిద్ధం కాగా... అప్పటికే కేరళ బ్లాస్టర్స్ టీమ్‌తో కలిసి పని చేసిన వరుణ్ ఎక్కువ వాటాతో పుణే స్థానాన్ని హైదరాబాద్ టీమ్‌తో భర్తీ చేశాడు.తొలి సీజన్ (2019–20)లో పేలవమైన ఆటతో జట్టు చివరి స్థానానికే పరిమితమైంది. తర్వాతి ఏడాది కాస్త మెరుగైన ప్రదర్శనతో జట్టు ఐదో స్థానంతో ముగించింది. అయితే 2021–22లో ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ నేతృత్వంలో చాంపియన్‌గా నిలిచింది.తర్వాతి ఏడాదీ రన్నరప్‌గా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే గత సీజన్లో జట్టు గతి తప్పింది. మైదానంలో ప్రదర్శన ఘోరంగా ఉండగా... మైదానం బయట సమస్యలు టీమ్ పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. 22 మ్యాచ్‌లు ఆడితే 1 మ్యాచ్‌లో నెగ్గి, 16 మ్యాచ్‌లలో ఓడి, 5 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని అట్టడుగున నిలిచింది. అన్నీ సమస్యలే... బయటకు కనిపించని ఎన్నో కారణాలతో హైదరాబాద్ ఎఫ్‌సీ టీమ్ పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల పాటు తమకు ఒప్పందం ప్రకారం ఫీజులు చెల్లించలేదంటూ ఎనిమిది మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆటగాళ్ల బదిలీపై కూడా ‘ఫిఫా’ నిషేధం విధించింది. టీమ్ అప్పులు పెరిగిపోయాయి. మ్యాచ్‌ల కోసం ప్రయాణాలను కూడా సరిగా ప్లాన్ చేయలేక వేదిక అయిన మరో నగరానికి మ్యాచ్ రోజు ఉదయం చేరిన ఘటనలు కూడా జరిగాయి.ఐఎస్ఎల్ నుంచి నోటీసు వచ్చినా టీమ్ యాజమాన్యం స్పందించలేదు. ఒకదశలో మాకు జీతాలు చెల్లించండి ప్రభూ అంటూ టీమ్‌తో కలిసి పని చేసిన పలువురు సహాయక సిబ్బంది మ్యాచ్‌ల సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని వరుణ్ ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరలేదు.గచ్చిబౌలి స్టేడియంలో కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఎవరూ మ్యాచ్ నిర్వహణకు సహకరించలేదు. చివరకు యాజమాన్య హక్కులను వదులుకోవాల్సి వచ్చింది. కొత్త యాజమాన్యంతో... సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా విధించగా... టీమ్ యాజమాన్యం మరో రెండు వారాలు అదనపు గడువు అడిగింది. దాంతో హైదరాబాద్ మ్యాచ్‌లను మినహాయించి ఇతర మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐఎస్ఎల్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యాపారాల్లో ఉన్న సంస్థ బీసీ జిందాల్ గ్రూప్ క్రీడల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమై ముందుకు వచ్చింది.1952 నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఈ సంస్థ ‘జిందాల్ ఫుట్‌బాల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో తొలిసారి లీగ్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేసింది. గత యాజమాన్యం చేసిన అప్పులు, లాభాలు, ఇతర లెక్కలు అన్నీ తేలిన తర్వాత ఈ నెల 2న హైదరాబాద్ టీమ్‌ను జిందాల్ గ్రూప్ తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త మేనేజ్మెంట్ అండతో హెచ్ఎఫ్సీ 2024–25 సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు వివరాలు అర్ష్‌దీప్ సింగ్ సైనీ, లాల్బియాక్లువా జాంగ్తే, అలెక్స్ షాజీ, లియాండర్ కన్హా, మనోజ్ మొహమ్మద్, మొహమ్మద్ రఫీ, పరాగ్ సతీశ్ శ్రీవాస్, సోయల్ జోషి, విజయ్ మరాండి, రామ్లన్చుంగా, అబ్దుల్ రబీ అంజుకందన్, అభిజిత్ పా, ఆయుశ్ అధికారి, ఐజాక్ వన్మల్సవ్మా చాక్చువాక్, లాల్చన్హిమా చైలో, లెనీ రోడ్రిగ్స్, రషీద్ మదమ్బిల్లత్, అమోన్ లెప్చా, ఆరోన్ వన్లాల్రించనా, స్టీఫెన్ గొడార్డ్, దేవేంద్ర ఢాకూ ముర్గాంవ్కర్, జోసెఫ్ సన్నీ. కోచ్: తంగ్బోయ్ సింగ్‌తో. నేటి నుంచి ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 11వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీలో మొత్తం 13 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్‌సీతో గత ఏడాది రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. ఈ రెండు టీమ్‌లతో పాటు డ్యురాండ్ కప్ విజేత నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ కూడా చక్కటి ఫామ్‌తో సవాల్ విసురుతోంది.నేడు జరిగే మొదటి మ్యాచ్‌లో రెండు జట్లలో కలిపి భారత సీనియర్ జట్టు ఆటగాళ్లంతా పెద్ద సంఖ్యలో ఉండటం ఆసక్తిని పెంచింది. టోర్నీలో ప్రాథమిక లీగ్ దశ పోటీలు డిసెంబర్ 30 వరకు సాగుతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్ గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం హోం టీమ్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడే ఆరు మ్యాచ్‌లకు (అక్టోబర్ 1, 30...నవంబర్ 25...డిసెంబర్ 4, 23, 28) ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు
-
షార్ట్స్ వేసుకోకూడదా? యోగా ట్రైనర్‌కి చేదు అనుభవం..!
ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే మనలో మనకే వ్యతిరేకతన అనిపిస్తుంది. కొన్ని రకాల శిక్షణకు, ఆటలకు, వ్యాయమాలకు వెసులుబాటుగా ఉండే దుస్తులే ధరించాల్సి ఉంటుంది. తప్పదు. దీన్ని కొందరూ పెద్దవాళ్లు విశాల దృక్పథంతో అర్థం చేసుకునే యత్నం చేయాలి. లేదా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే సూచించొచ్చు. అంతేగానీ బహిరంగంగా వేరొకరి వేషధారణ గురించి అవమానకరంగా మాట్లాడటం సబబు కాదు. కానీ ఇక్కడ అలాంటి దిగ్బ్రాంతికర ఘటనే చోటు చేసుకుంది. బెంగళూరులో టానీ భట్టాచార్జీ అనే యోగా ట్రైనర్ షార్ట్స్ వేసుకున్నందుకు బహిరంగంగా ఓ వృద్ధ మహిళ అవమానించింది. ఇలాంటివి వేసుకోకూడదంటూ తన మాతృభాషలో అరుస్తూ మాట్లాడింది. అందుకు యోగా ట్రైనర్ మీకేంటి సమస్య అని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్న అదేపనిగా మాట్లాడుతూ ఆమెని ఇబ్బంది పెట్టింది. చివరికీ ఆమెకు అర్థం కావడం లేదు లే అని సదరు యోగా ట్రైనరే పక్కకు తప్పుకుని వెళ్లిపోతున్నా.. వెంటపడి మరీ అవమానించే పని చేసింది. అంతేగాదు ఆమె వేసుకున్న షార్ట్‌ని అక్కడున్న మరికొందరికీ చూపిస్తూ గట్టి గట్టిగా మాట్లాడటం వంటివి చేసింది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునిక విలువల మధ్చ తీవ్రమైన చర్చకు దారితీసింది. కొందరూ ఆ వృద్ధ మహిళకు సపోర్ట్ చేయగా, మరికొందరూ మాత్రం సదరు యోగా ట్రైనర్‌ని లైట్ తీసుకోమని పట్టించుకోవద్దని సలహాలిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Tanny Bhattacharjee (@fit_and_fabb) (చదవండి: 'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!)