![Woman body chopped into 30 pieces found stored in refrigerator in Bengaluru house](/styles/webp/s3/article_images/2024/09/22/ka.jpg.webp?itok=uAy-A9F-)
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్‌లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment