pieces
-
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
టైటానిక్ సబ్‌మెరైన్ విషాదం: యూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక ప్రకటన
టైటానిక్ సబ్‌మెరైన్‌కు విషాదానికి సంబంధించిన అన్వేషణలోయూఎస్ కోస్ట్‌గార్డ్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చేసుకున్నామని కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్ సబ్మెర్సిబుల్ నుండి మానవ అవశేషాలు భావిస్తున్నవాటితోపాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం పంపింది. గత వారం వాటిని స్వాధీనం చేసుకుని కోస్ట్ గార్డ్ అధికారులు యుఎస్ ఓడరేవుకు తరలించినట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది. అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిధిలాల అన్వేషణకు వెళ్లి మార్గమధ్యలో సబ్‌మెరైన్ పేలిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే కొన్నింటిని సేకరించగా మిగిలిన శిధిలాల చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డ్ తాజాగా గుర్తించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఓషన్ ఆపరేటర్ అయిన Ocean Gate అప్పటినుండి వ్యాపారాన్ని నిలిపివేసింది. ఈ ఏడాది జూన్ 18న ఉత్తర అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన పేలుడులో మరణించిన వారిలో సబ్మెర్సిబుల్ పైలట్, కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఉన్నారు. మిగిలిన నలుగురు ప్రయాణికుల్లో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, పాల్-హెన్రీ నార్గోలెట్, మాజీ ఫ్రెంచ్ నౌకాదళ డైవర్ ఉన్నారు.ఈ విషాదంపై ప్రపంచ వ్యాప్త విచారణ కొనసాగుతోంది. కాగా 1912లో టైటినిక్ షిప్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టినపుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణనౌకగా పేరు గాంచింది. అయితే ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన తొలి ప్రయాణంలోనే 1912 ఏప్రిల్ 14న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 1517 మంది మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంపై 1997లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ తీసిన‘ టైటానిక్’ సినిమా భారీ హిట్ అందుకుంది. -
రెంట్‌కి ఉండి ఇళ్లుని కాజేయాలనుకున్నారు.. అడ్డొచ్చిన ఓనర్ని చంపేశారు..
కర్ణాటక:ఇంట్లో రెంట్‌కు ఉన్నారు బిహార్ యువకులు. ఓనర్‌తో చనువుగా ఉండేవారు. ఎప్పుడు సరదాగా కామెడీ చేస్తూ నవ్వించేవారు. ఇలా ఓనర్‌కు మరింత దగ్గరయ్యారు. ఇళ్లుని తమ పేర రాయమని పీడించారు. అంగీకరించని ఓనర్‌ను చంపారు. శరీర భాగాలను దేహం నుంచి వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో పడేశారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక బన్నేర్‌ఘట్ట ప్రాంతంలో జరిగింది. బన్నేర్‌ఘట్ట జనతా కాలనీలో గీతమ్మ(53) ఒంటరిగా నివసిస్తోంది. ఏడుగురు బిహార్ యువకులు ఆమె ఇంట్లో రెంట్‌కి ఉంటున్నారు. ఏడుగురిలో చాలాకాలం నుంచి రెంట్‌కి ఉంటున్న పంకజ్ కుమార్ గీతమ్మతో సన్నిహితంగా ఉండేవాడు. అక్రమంగా ఇంటిని తన పేర రాయించుకోవాలని చూశాడు. ఒప్పుకోని ఆవిడను అందరూ కలిసి మే 27న గొంతు పిసికి చంపేశారు. అరెస్టవుతాయమనే భయంతో మృతదేహం నుంచి కాళ్లు, చేతులు, తల వేరుచేసి మిగిలిన దేహాన్ని జనతా కాలనీ కాంపౌడ్ దగ్గర పడేశారు. అనంతరం బిహార్‌కు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బిహార్ పోలీసుల సహాయంతో నిందితుల్లో ఒకరైనా ఇందాల్ కుమార్‌ను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి! -
మహిళను చంపి, ముక్కలుగా నరికి..
శ్రీనగర్: ఢిల్లీలో అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణాన్ని గుర్తుకు తెచ్చే ఘటన ఇది. జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో షబీర్ అహ్మద్ వనీ(45) అనే వ్యక్తి కార్పెంటర్ ఓ మహిళ(30)ను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు. మార్చి 7వ తేదీన కోచింగ్ క్లాస్‌కని వెళ్లిన తన సోదరి కనిపించకుండా పోయిందంటూ షోయిబుగ్‌కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ సెల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహన్‌పురా ఒంపొరాకు చెందిన వనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మహిళ శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానంటూ వనీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై పగబట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోరం: అత్తను సుత్తితో కొట్టి..పది ముక్కలుగా చేశాడు
సాక్షి, జైపూర్: యావత్తు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అచ్చం అలాంటి తీరులోనే మరో ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తి ఈవెంట్‌కి వెళ్లొద్దని అడ్డు చెప్పిందన్న కోపంతో అత్తను సుత్తితో కొట్టి చంపి ముక్కలుగా చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...32 ఏళ్ల అనూజ్ శర్మ అనే యువకుడు జైపూర్‌లోని విద్యానగర్‌లో తండ్రి, చెల్లి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఆ యువకుడి తల్లి గతేడాది కరోనా సమయంలో మృతి చెందింది. అతడి చెల్లి, తండ్రి ఇండోర్‌లో వెళ్లడంతో ఈ నెల డిసెంబర్ 11 నుంచి అనుజ్ అతడి మేనత్త సరోజ్ ఇద్దరే జైపూర్‌లో ఉంటున్నారు. వాస్తవానికి అనూజ్ మేనత్త సరోజ్ భర్త చనిపోవడంతో ఆమె అతడి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. ఐతే ఒకరోజు అనూజ్ ఢిల్లీలోని ఒక ఈవెంట్‌కి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయమై అతడి మేనత్తకు ఆమెకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో అనూజ్ కోపంతో ఒక సుత్తి తీసుకుని మేనత్తను కొట్టి చంపేశాడు. ఆతర్వాత ఆమె మృతదేహాన్ని ఒక మార్బుల్ కట్టర్‌తో సుమారు 10 ముక్కలుగా కోసేశాడు. ఆ భాగాలను బకెట్, సూట్‌కేసులలో పెట్టుకుని జైపూర్-సికర్ హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అత్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. అతడు కేసును తప్పుదోవ పట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడు. ఐతే అతడి చర్యలను అనుమానించిన పోలీసులు నిందితుడి ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..అతడు మాత్రమే ఇంటి నుంచి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. పైగా అతడి ఫ్లాట్‌లోని కిచెన్‌లో రక్తపు మరకలను గుర్తించారు పోలీసలు. సదరు యువకుడు బీటెక్ వరకు చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీసీటీవీలో బకెట్లు, సూట్‌కేసులతో అనూజ్ బయటకు వెళ్లినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉండటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...) -
అసదుద్దీన్ మెడపై కత్తిపెట్టి...
ముంబైః మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది. ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే... అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన... మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వైఎస్ విగ్రహాలే లక్ష్యమా..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.విగ్రహాలే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పావులు కదుపుతోందా!... కోర్టు తీర్పు, నిబంధనల అమలుపేరుతో ఇందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా!... జీవీఎంసీ పరిధిలో అధికార యంత్రాంగం నడుపుతున్న తతంగం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ అంశంపై జీవీఎంసీ అధికారులు స్పందిం చేందుకు నిరాకరిస్తుండటం సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. నోటీసులే.. నోటీసులే : అనుమతిలేని విగ్రహాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులు రెండు రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రదేశాలలో అనధికారికంగా ఉన్న విగ్రహాలకు ఈ నోటీసులు జారీ చేస్తున్నామని జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో 109 విగ్రహాలలో 99 విగ్రహాలు అనధికారికంగా ఉన్నాయని గుర్తించారు. ఆ విగ్రహాలన్నింటికీ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇలా భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడ, కొమ్మాది పరిధిలోని నాలుగు చోట్ల నెలకొల్పిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాల తొలగింపునకు నోటీసులు జారీ చేశారు. వాటిని ఏర్పాటు చేసిన నిర్వాహకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందిస్తున్నారు. ఆ విగ్రహాలను తొలగించాలని స్పష్టం చేశారు. లేకపోతే తామే తొలగించి ఆ వ్యయాన్ని నిర్వాహకుల నుంచి రాబడతామనితేల్చిచెప్పారు. అనకాపల్లిలో ఉన్న 28 విగ్రహాలలో 25 విగ్రహాల తొలగింపునకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వని మూడు విగ్రహాలు జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, ఎన్టీ రామారావులది. మిగిలిన అన్ని విగ్రహాలకు నోటీసులు ఇచ్చారు. వాటిలో అత్యధికంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డివే కా వడం గమనార్హం.త్వరలోనే జీవీఎంసీ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తదనంతరం జిల్లాలోని విగ్రహాలపై కూడా అధికారులు గురిపెట్టనున్నారు. పారదర్శకత ఏదీ!: న్యాయస్థానం తీర్పును అమలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ ఆ పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారంలో పారదర్శకత లోపించడమే సందేహాలకు తావిస్తోంది. కేవలం వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అంతగా పారదర్శకంగా చేయదలచుకుంటే జీవీఎంసీ అధికారులే తొలగించాల్సిన విగ్రహాల జాబితాను అధికారికంగా ప్రకటించేవారు. అసలు ఏ విగ్రహాలకు నోటీసులు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించేవారు. దాంతో ఏ నేతల విగ్రహాలు జాబితాలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసేది. కానీ అధికారులు అలా చేయలేదు. అంతా గోప్యంగా చేస్తుండటంతోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కొమ్మాది జంక్షన్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు అప్పట్లో జీవీఎంసీ మేయర్, కలెక్టర్లకు దరఖాస్తు చేశారు. అప్పటి ప్రజాప్రతినిధులే ఈ మేరకు అధికారులతో మాట్లాడారు. కానీ ఆ విగ్రహాన్ని తొలగిస్తామని ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాహకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలో కూడా అధికారుల వ్యవహార శైలి అలాగే ఉంది. విగ్రహాల తొలగింపు అంశంపై స్పందించేందుకు అధికారులు విముఖత చూపుతుండటం జీవీఎంసీ తీరుపై సందేహాలు బలపడుతున్నాయి.