రెంట్‌కి ఉండి ఇళ్లుని కాజేయాలనుకున్నారు.. అడ్డొచ్చిన ఓనర్‌ని చంపేశారు.. | Woman Murdered Body Chopped Into Pieces In Karnataka By Tenants From Bihar | Sakshi
Sakshi News home page

రెంట్‌కి ఉండి ఇళ్లుని కాజేయాలనుకున్నారు.. అడ్డొచ్చిన ఓనర్‌ని చంపేశారు..

Published Sat, Jun 10 2023 9:25 PM | Last Updated on Sat, Jun 10 2023 9:32 PM

Woman Murdered Body Chopped Into Pieces In  Karnataka By Tenants From Bihar - Sakshi

కర్ణాటక:ఇంట్లో రెంట్‌కు ఉ‍న్నారు బిహార్‌ యువకులు. ఓనర్‌తో చనువుగా ఉండేవారు. ఎప్పుడు సరదాగా కామెడీ చేస్తూ నవ్వించేవారు. ఇలా ఓనర్‌కు మరింత దగ్గరయ్యారు. ఇళ్లుని తమ పేర రాయమని పీడించారు. అంగీకరించని ఓనర్‌ను చంపారు. శరీర భాగాలను దేహం నుంచి వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో పడేశారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక బన్నేర్‌ఘట్ట ప్రాంతంలో జరిగింది.

బన్నేర్‌ఘట్ట జనతా కాలనీలో గీతమ్మ(53) ఒంటరిగా నివసిస్తోంది. ఏడుగురు బిహార్ యువకులు ఆమె ఇంట్లో రెంట్‌కి ఉంటున్నారు. ఏడుగురిలో చాలాకాలం నుంచి రెంట్‌కి ఉంటున్న పంకజ్ కుమార్ గీతమ్మతో సన్నిహితంగా ఉండేవాడు. అక్రమంగా ఇంటిని తన పేర రాయించుకోవాలని చూశాడు. ఒప్పుకోని ఆవిడను అందరూ కలిసి మే 27న గొంతు పిసికి చంపేశారు. అరెస్టవుతాయమనే భయంతో మృతదేహం నుంచి కాళ్లు, చేతులు, తల వేరుచేసి మిగిలిన దేహాన్ని జనతా కాలనీ కాంపౌడ్‌ దగ్గర పడేశారు. అనంతరం బిహార్‌కు పరారయ్యారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. బిహార్ పోలీసుల సహాయంతో నిందితుల్లో ఒకరైనా ఇందాల్ కుమార్‌ను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పాలు దొంగిలిస్తున్న రూమ్‌మేట్‌.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement