woman murdered
-
వివాహిత దారుణ హత్య
కర్ణాటక: వివాహిత దారుణహత్యకు గురికాగా ఆమెను ఆస్తి కోసం భర్తే కడతేర్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటన మండ్య నగరం వి.వి. నగర లేఔట్లో జరిగింది. మైసూరు హెబ్బాళ లేఔట్‌కు చెందిన పి.షణ్ముక స్వామి, రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రుతి(32)ని మండ్య వీవీ నగరలోని నాగరాజప్ప కుమారుడు టీఎన్ సోమశేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నరకు పైగా వీరి దాంపత్య జీవితం సుఖంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దలు రాజీ చేశారు. అయినా సోమశేఖర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మరో వైపు శ్రుతి తల్లిదండ్రులు, శ్రుతి చెల్లెలు సుషి్మతా కూడా ప్రమాదంలో మరణించింది. ఈ నేపథ్యంలో అన్ని ఆస్తులు శ్రుతిపేరిట మారాయి. శ్రుతి పేరిట మైసూరులోని విజయనగర ఒకటో లేఔట్లో మూడంతస్తుల ఇల్లు ఉంది. ఆస్తులపై ఆశ పెట్టుకున్న సోమశేఖర్.... వాటన్నింటిని తన పేరిట మార్చాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. అయితే సోమశేఖర్ డిమాండ్‌ను శ్రుతి తిరస్కరించింది. ఆస్తులన్నింటిని తన పిల్లల పేరు మీద మార్చేందుకు శ్రుతి నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సోమశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో శ్రుతి దారుణహత్యకు గురైంది. శ్రుతి మరణంపై చిన్నాన్న పి.కుమారస్వామి అనుమానం వ్యక్తం చేస్తూ సోమశేఖర్, ఆమె అత్త నీలాంబిక, ఆడపడుచు హేమలతపై పశి్చమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమశేఖర్‌ను అరెస్టు చేశారు. తానే శ్రుతిని హత్య చేసినట్లు సోమశేఖర్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
ఏడాది క్రితమే పెళ్లి.. అంతలోనే దారుణం.. ప్రతీరోజూ దిండు కింద..
కర్ణాటక: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాక పోవడంతో కక్ష పెంచుకున్న భర్త ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన మైసూరు సిటీ కుంబార కొప్పలిలో చోటు చెసుకుంది. హర్షిత (21) హతురాలు కాగా, నిందితుడు వి.మాదేశ (30). వివరాలు.. మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని చినకురళి కి చెందిన హర్షితను గుండ్లుపేటే తాలూకా బేరంబళ్లికి చెందిన మాదేశకు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి జరిపించారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు, కానీ క్రమంగా గొడవలు మొదలయ్యాయి. మాదేశ పడుకునే సమయంలో పక్కన కొడవలిని పెట్టుకునేవాడు. భర్త వైఖరిని తట్టుకోలేక భార్య అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లిపోతే, బతిమాలి తీసుకొచ్చేవాడు. ఇటీవల గలాటాలు పెరగడంతో ఆమె కుంబారకొప్పలిలోని పుట్టింటివద్దే ఉంటోంది. ఆదివారం వేటకొడవలి తీసుకుని వెళ్లిన మాదేశ భార్యను ఇంటికి రావాలని గొడవపడి నరికి చంపాడు. అడ్డు వచ్చిన అత్త గీత పైన దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మేటిగళ్లి పోలీసులు మాదేశను అరెస్టు చేశారు. -
రెంట్‌కి ఉండి ఇళ్లుని కాజేయాలనుకున్నారు.. అడ్డొచ్చిన ఓనర్ని చంపేశారు..
కర్ణాటక:ఇంట్లో రెంట్‌కు ఉన్నారు బిహార్ యువకులు. ఓనర్‌తో చనువుగా ఉండేవారు. ఎప్పుడు సరదాగా కామెడీ చేస్తూ నవ్వించేవారు. ఇలా ఓనర్‌కు మరింత దగ్గరయ్యారు. ఇళ్లుని తమ పేర రాయమని పీడించారు. అంగీకరించని ఓనర్‌ను చంపారు. శరీర భాగాలను దేహం నుంచి వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో పడేశారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక బన్నేర్‌ఘట్ట ప్రాంతంలో జరిగింది. బన్నేర్‌ఘట్ట జనతా కాలనీలో గీతమ్మ(53) ఒంటరిగా నివసిస్తోంది. ఏడుగురు బిహార్ యువకులు ఆమె ఇంట్లో రెంట్‌కి ఉంటున్నారు. ఏడుగురిలో చాలాకాలం నుంచి రెంట్‌కి ఉంటున్న పంకజ్ కుమార్ గీతమ్మతో సన్నిహితంగా ఉండేవాడు. అక్రమంగా ఇంటిని తన పేర రాయించుకోవాలని చూశాడు. ఒప్పుకోని ఆవిడను అందరూ కలిసి మే 27న గొంతు పిసికి చంపేశారు. అరెస్టవుతాయమనే భయంతో మృతదేహం నుంచి కాళ్లు, చేతులు, తల వేరుచేసి మిగిలిన దేహాన్ని జనతా కాలనీ కాంపౌడ్ దగ్గర పడేశారు. అనంతరం బిహార్‌కు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బిహార్ పోలీసుల సహాయంతో నిందితుల్లో ఒకరైనా ఇందాల్ కుమార్‌ను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి! -
మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు.. అంతలోనే..
సాక్షి, కదిరి టౌన్: కదిరిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి నివాసి బిల్లూరు ప్రమీల(36) స్థానిక వాణి వీధి (వేమారెడ్డి సర్కిల్) సమీపంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తోంది. ఈమె భర్త రంగారెడ్డి ఏడాది క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. సోమవారం ఉదయం ఇంటిలోనే ఆమె విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ భవ్యకిషోర్, సీఐ సత్యబాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో ఆమె తలపై మోది హతమార్చినట్లు గుర్తించారు. ప్రమీల భర్తకు ఇద్దరు భార్యలని, మొదటి భార్యకు, ప్రమీలకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని ఈ సందర్భంగా పోలీసుల ఎదుట హతురాలి సంబంధీకులు ఆరోపించారు. ఆస్తి కోసమే ఆమెను హతమార్చి ఉంటారని ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..) -
మహిళ మెడకు చున్నీ బిగించి.. 23 రోజుల తర్వాత!
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. దాదాపు 23 రోజుల క్రితం హత్యకు గురైన మహిళ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. కేశంపేట మండల కేంద్రానికి చెందిన నారా అమృత(25)ను హత్య చేసిన ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మార్చి 31న అమృత హత్యకు గురికాగా నిందితుడి సమాచారంతో శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ వెల్లడించిన కేసు వివరాలు.. అమృతకు పదేళ్ల క్రితం కేశంపేట మండలం అల్వాల్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. నాలుగున్నరేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అమృత తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కూలీపని చేసుకునే ఈమెకు ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్‌తో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అమృత మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న శంకర్ ఆమె హత్యకు పథకం వేశాడు. మార్చి 31న అమృత కనిపించకుండా పోవడంతో సోదరుడు నర్సింహ ఏప్రిల్ 1న కేశంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే మార్చి 31న అమృతకు మద్యం తాగించిన శంకర్ తన బైక్‌పై తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలోని మల్లప్పగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫోన్‌ద్వారా తన స్నేహితుడైన ఆమనగల్లు మండలం విఠాయిపల్లికి చెందిన ఇస్లావత్ శంకర్‌కు సమాచారం ఇచ్చి పిలిపించాడు. ఇద్దరూ కలిసి అమృత మెడకు చున్నీ బిగించి చంపేశారు. చదవండి: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని... అనంతరం గుట్ట పక్కనే ఉన్న గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతురాలి ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. గురువారం శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి సమాచారం మేరకు మల్లప్పగుట్టవద్ద అమృత మృతదేహాన్ని వెలికితీయించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు పాల్పడిన శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మరో నిందితుడు ఇస్లావత్ శంకర్ పరారీలో ఉన్నాడని ఏసీపీ వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ ఉపేందర్, ఎస్ఐలు ధర్మేశ్, వరప్రసాద్ పాల్గొన్నారు. చదవండి: క్షణికావేశంలో భర్తను చంపిన భార్య -
భార్య తరచూ సెల్ఫోన్లో మాట్లాడుతుందని..
సాక్షి, విజయనగరం : మండలంలోని కుమిలి కొండపై ఓ వివాహిత మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారించారు. భర్తే ఆమెను హతమార్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొండగుడ్డికి చెందిన సంబాపు పుష్ప(35)ను ఆమె భర్త సంబాపు శ్రీను ఈ నెల రెండో తేదీన కుమిలిలో రక్ష కట్టించుకుందామని చెప్పి మోపెడ్‌పై తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి ఆమె కనిపించలేదు. భార్యను తీసుకెళ్లిన శ్రీను కుమిలిలోనే విడిచిపెట్టి వెళ్లినట్లు బందువులకు చెప్పి చీపురుపల్లిలో పురుగుమందు సేవించి ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. అనుమానం వచ్చిన పుష్ప తల్లిదండ్రులు పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న తరుణంలో కుమిలి సమీపంలో కొండపై వివాహిత మృతదేహం వున్నట్లు మంగళవారం రాత్రి తెలుసుకున్నారు. ఆమె పుష్ప అని నిర్థారించుకుని భర్తే హత్య చేసి వుండవచ్చన్న అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలికి మెరకముడిదాం మండలం సిమంద్రాయవలసకు చెందిన సంబాపు శ్రీనుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరి మధ్య ఎప్పటినుంచో మనస్పర్థలున్నాయి. రెండు నెలల క్రితమే సిమంద్రాయవలస నుంచి అత్తవారి గ్రామమైన కొండగుడ్డికి శ్రీను వచ్చినట్లు బంధువులు తెలియజేశారు. గతంలో కూడా భార్య భర్తలు పురుగుమందు సేవించినట్లు పోలీసులు తెలిపారు. భార్య సెల్ఫోన్లో తరచూ మాట్లాడుతున్నందునే వారి మధ్య గొడవలు జరుగుతుండేవని తెలిసింది. మృతురాలికి దీపిక, మనోజ్ అనే ఇద్దరు పిల్ల లు వున్నారు. భోగాపురం సీఐ సీహెచ్.శ్రీధర్, ఎస్ఐ ఆర్.జయంతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చేయి కోసుకొని.. లవర్‌కు వాట్స్‌ప్‌లో ఫొటోలు పెట్టి.. -
అట్ట పెట్టెలో యువతి మృతదేహం!
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రీ పార్క్ వద్ద కలకలం రేగింది. సోమవారం అక్కడ ఓ పాతికేళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని హతమార్చిన దుండగులు మృతదేహాన్ని ఓ అట్ట పెట్టెలో కుక్కి శాస్త్రీ పార్క్ వద్దనున్న ఓ హోటల్ ముందు పడేసినట్టు పోలీసులు తెలిపారు. యవతి మెడకు ఓ నీలి రంగు స్కార్ఫ్ చుట్టి ఉందని వెల్లడించారు. యువతి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించామని సీనియర్ పోలీస్ అధికారి వేద్ ప్రకాశ్ సూర్య తెలిపారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
మరిది చేతిలో వదిన హతం
పాలకొల్లు అర్బన్: ఆర్థిక లావాదేవీల కారణంగా వదినను కత్తితో నరికి హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం లంకలకోడేరు శివారు వెదుళ్లపాలెంలో జరిగింది. పాలకొల్లు రూరల్ ఎస్సై పి.తులసీరావు కథనం ప్రకారం.. లంకలకోడేరు శివారు వెదుళ్లపాలెంలో మడికి చల్లాలు, కుటుంబరావు అన్నదమ్ములు. చల్లాలు భార్య మారెమ్మ (45) గల్ఫ్ వెళ్లింది. అలాగే కుటుంబరావు, అతని భార్య కూడా గల్ఫ్ వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెదుళ్లపాలెంలో రెండు పోర్షన్ల కొత్త భవనం ఇటీవలే నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణ ఖర్చును అన్నదమ్ములిద్దరూ సమానంగా భరించాలని ఒప్పందం. 15 రోజుల క్రితమే మారెమ్మ గల్ఫ్ నుంచి రావడంతో మరిది కుటుంబరావు ఇంటి నిమిత్తం చేసిన ఖర్చుల లెక్కలు ఆరా తీశారు. అయితే లెక్కలు తేలకపోవడంతోగ్రామ పెద్దల్లో కూర్చుని మాట్లాడుకుందామని వదిన మారెమ్మ చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన కుటుంబరావు కత్తి తీసుకుని తాను చెప్పినట్టు వింటావా లేక పెద్దల్లోకి వెళతావా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కుటుంబరావు తన వెంట తెచ్చుకున్న కత్తితో మారెమ్మను విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. మృతురాలు మారెమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. వారందరికీ వివాహాలయ్యాయి. గల్ఫ్ నుంచి మరియమ్మ వచ్చిన వెంటనే కుమార్తెలు వేర్వేరు చోట్ల ఉండడంతో వారి ఇళ్లకు వెళ్లి గురువారమే వెదుళ్లపాలెం వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్యాయంగా తన భార్యను చంపేశాడు.. నా పిల్లలకు దిక్కెవరంటూ మారెమ్మ భర్త చల్లాలు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా మారెమ్మను కుటుంబరావు తరచూ లైంగికంగా కూడా వేధించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
మహిళ మెడ నరికి హత్య
హయత్‌నగర్: దుండగులు ఓ మహిళ మెడ నరికి దారుణంగా హత్యచేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూర్‌లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. కుంట్లూర్ శివారులో నాగోలు వెళ్లే దారిపక్కన దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గమనించగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గుర్తు తెలియని దుండగులు మహిళ మెడ నరికి చంపినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి మృతురాలిని మెదక్ జిల్లా జోగిపేట మండలం యారారం గ్రామానికి చెందిన బేతమ్మ అలియాస్ లింగమ్మగా, ఆమె వయసు 45–50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. దుండగులు రెండు రోజుల కిందట హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్, డైరీలు, మద్యం సీసాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ దారుణ హత్య
సాక్షి, కర్నూలు (టౌన్) : స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మరోసారి ప్రయత్నించగా అవుటాఫ్ ఆర్డర్ అని రావడంతో అనుమానంతో ఇంటి సమీపంలోని బంధువు(మరదలు)కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లి చూడగా చంద్రకళావతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంకటేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చింది. అతడు ఇంటికి చేకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు డీఎస్పీ బాబా ఫకృద్దీన్, మూడో పట్టణ సీఐ ఓబులేసు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ రప్పించి పరిసరాలను తనిఖీ చేయించారు. మృతురాలి పుస్తెల గొలుసు, సెల్‌ఫోన్ కనిపించడం లేదని భర్త పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
దారితప్పిన ప్రేమకు హత్యతో ముగింపు
ఆమె వయసు 32, అతని వయసు 24. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఒంటరిగా ఉంటోంది. యువకునితో ప్రేమలోపడింది. అనుమానాలు తలెత్తి ఆమె హత్యకు దారితీశాయి. సమాజంలో నేటి పెడ పోకడలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. కర్ణాటక, హొసూరు: జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో దుకాణంలో విధులు నిర్వహిస్తున్న మహిళను దారుణంగా హత్య చేసిన ప్రియుడు పోలీసులకు లొంగిపోయాడు. అతడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నివ్వెరపరిచే నిజాలు బయటపెట్టాడు. క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని కరుకన్‌సావడి గౌండనూర్‌కొటాయ్ గ్రామానికి చెందిన సెల్వి(32). ఈ మెకు 13, 11 ఏళ్ల వయసు ఇద్దరు పిల్లలున్నారు. ఇరువురూ కావేరిపట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి, 6వ తరగతి చదువుతున్నారు. భర్తను వదలి నివసిస్తున్న సెల్వి క్రిష్ణగిరి జక్కప్పన్ నగర్‌లోని ఓ గిఫ్ట్‌ల దుకాణంలో పనిచేస్తూ వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దారుణహత్యకు గురైంది. నిందితుడు దౌలత్ ఏమన్నాడంటే నిందితుడు కావేరిపట్టణం అన్నానగర్‌కు చెందిన దౌలత్ (24) పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని విచారించగా, ఇద్దరూ కావేరిపట్టణంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ వచ్చామని ఈ సమయంలో ఇరువురి మధ్య ప్రేమ ఏర్పడిందని, అప్పటి నుండి తన సంపాదన పూర్తిగా సెల్విచేతికే ఇచ్చేవాడినని తెలిపాడు. శనివారం మధ్యాహ్నం తనకు ఫోన్ చేసిన సెల్వి రూ. 2 వేలు అడిగిందని, డబ్బులు తీసుకొని ఆమె పనిచేస్తున్న దుకాణం వద్దకు వెళ్లేసరికి మరొకరితో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుండగా నిలదీయడంతో, నేను ఎవరితోనైనా మాట్లాడతాను, ఆ విషయం నీకు అనవసరం అని చెప్పడంతో ఆవేశానికి గురై దుకాణంలో విక్రయానికి ఉంచిన కత్తితో నరికి చంపానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు దౌలత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఇద్దరు మహిళలు దారుణ హత్య
జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. పీలేరు మండలంలో పశువుల మేతకు వెళ్లిన వివాహితను తలపై బండరాయితో మోది హతమార్చారు. పుత్తూరు మండలంలో మరో మహిళను గొంతు కోసి పొట్టన పెట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలకమైన ‘క్లూ’లు లభించాయి. చిత్తూరు, పీలేరు: పశువులు మేపడానికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని వేపులబైలు వద్ద చోటు చేసుకుంది. పీలేరు ఎస్ఐ పీ.వీ. సుధాకర్కరెడ్డి కథనం.. వేపులబైలు పంచాయతీలోని వరంపాటివారిపల్లెకు చెందిన శేషాద్రి భార్య వరలక్ష్మి(36) బుధవారం ఆటోలో సోమల మండలం కందూరుకు వెళ్లి పశువులకు దాణా తీసుకువచ్చింది. అనంతరం తమ పశువులు మేపడానికి ఇంటికి తాళం వేసి వెళ్లింది. భర్త శేషాద్రి మేస్త్రీ కావడంతో పని కోసం పీలేరుకు వచ్చారు. వీరి ఇద్దరు కుమారులు తేజ, దినేష్ పాఠశాలకు వెళ్లారు. మేస్త్రీ పనికి వెళ్లిన భర్త, స్కూలుకు వెళ్లిన ఇద్దరు కుమారులు సాయంత్రం ఇంటికి వచ్చారు. వరలక్ష్మి ఇంటి వద్ద లేకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. అప్పటికే మేతకు వెళ్లిన పశువులు సైతం ఇంటికి వచ్చేశాయి. రాత్రి అయినా వరలక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. గ్రామ సమీపంలోని పొలాలు, బావులు, చెరువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు ముమ్మరం చేశారు. ఇంతలో మదరసా సమీపాన చెరువు సమీపంలో వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె భర్త గురించి నిశ్చేష్టుడయ్యాడు. బండరాయితో తలపై మోది వరలక్ష్మిని హత్య చేసినట్టు ఉండడంతో పీలేరు పోలీసులకు, వీఆర్ఓ సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ, వరలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ధరించిన నగలు అలాగే ఉండటం, దుస్తులు చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. హతురాలి భర్త, బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. వివాహేతర సంబంధమేమై నా హత్యకు దారితీసిందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు, పుత్తూరు రూరల్ : వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం స్థానిక ఎన్టీఆర్ కాలనీ సమీపంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం..మండలంలో వేపగుంట క్రాస్ రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో శంకరయ్య, ఆయన భార్య దేవకి (43) నివాసం ఉంటున్నారు. శంకర్ ఓ ప్రైవేట్ కాటన్ మిల్లో పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఇటీవలే ఒక కుమార్తెకు వివాహం చేశారు. దేవకి పశువులను మేపేది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటికి అవసరమైన వంటచెరకు (ముళ్లకంపలు) తెచ్చేందుకు వెళ్లింది. రాత్రి అయినా ఆమె జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ముళ్లపొదల మధ్య ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తిం చారు. గొంతు కోసి ఆమెను దుండగలు దారుణంగా హత్య చేశారని గుర్తించారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పుత్తూరు పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో మూడు తాగి పడేసిన మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, మాంసాహారం తిన్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం ఉన్న స్థితి బట్టి బుధవారం రాత్రి హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, కంపలు కొట్టే ఒక కొడవలిని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు సంఘటన స్థలానికి పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. అక్కడి నుంచి జాగిలాలు నేరుగా హతురాలి ఇంటి సమీపంలో ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్లి ఆగాయి. దీంతో పోలీసులు సమీప ప్రాంతంలోని 30–35 ఏళ్లున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హతురాలి కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న పశువుల కొట్టం స్థలంపై వివాదం ఉన్నట్టు తెలియవచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో హత్య చేశారా? మరే ఇతర కారణాలా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది. గస్తీ పటిష్టం చేయండి : ఎమ్మెల్యే రోజా సంఘటనా స్థలాన్ని నగరి ఎమ్మెల్యే రోజా కూడా పరిశీలించారు. ఇటీవల పుత్తూరు పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు హత్యలు జరిగాయని వాటిని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, సీసీ కెమెరాల పనితీరునూ సమీక్షించాలని పోలీసులకు సూచించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
నెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన నెల్లూరులోని నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రాజీవ్‌గాంధీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, భర్త సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన శ్యామల (28)కు కోట బొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.లక్ష్మీనారాయణతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమ (ఐదో తరగతి), శివరామ్ (ఒకటో తరగతి) పిల్లలు న్నారు. ఏడాది క్రితం లక్ష్మీనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురై అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో శ్యామలకు తన స్వగ్రామానికి చెందిన సమీప బంధువు పి.రాజుతో స్నేహం మొదలైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం ఆస్పత్రిలో ఉన్న భర్త వద్దకు రాజును తీసుకువచ్చి మనకు అండగా ఉంటాడని చెప్పి అతనివద్దనే ఉంచింది. లక్ష్మీనారాయణ కోలుకునేంత వరకు రాజు అతనితోనే ఉన్నాడు. వైద్యశాల నుంచి డిశ్చార్జి అయిన కొద్దిరోజుల్లోనే శ్యామల, రాజుల ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. భార్యకు ఆమె కుటుంబసభ్యుల ద్వారా చెప్పించడంతోపాటు రాజును సైతం మందలించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. అప్పటికే లక్ష్మీనారాయణ అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో నెల్లూరులో నివాసం ఉంటున్న శ్యామల బంధువుల వద్దకు వెళ్లి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏడునెలల క్రితం నెల్లూరుకు.. అప్పులు తీరుతాయని, మరోవైపు రాజు బాధ తప్పుతుందని భావించిన లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి ఏడునెలల క్రితం నెల్లూరుకు వచ్చాడు. కొత్తకాలువ సెంటర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బేల్దారి పనులు చేసుకోసాగాడు. ఈ క్రమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో రైస్‌మిల్లులో లక్ష్మీనారాయణ పనికి చేరాడు. అతనికి తెలియకుండా రాజు తరచూ నెల్లూరుకు వచ్చి శ్యామలతో మాట్లాడి వెళ్లేవాడు. కొంతకాలం క్రితం లక్ష్మీనారాయణ పనిపై శ్రీకాకుళం వెళ్లగా రాజు నెల్లూరుకు చేరుకుని అతనికి ఫోన్ చేశాడు. దీంతో భర్త విషయాన్ని శ్యామల బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వెళ్లి రాజును అక్కడినుంచి పంపివేశారు. లక్ష్మీనారాయణ నెల్లూరుకు చేరుకుని 15 రోజుల క్రితం కొత్తకాలువ వద్ద నుంచి కాపురాన్ని కిసాన్‌నగర్ రాజీవ్‌గాంధీకాలనీకి మార్చాడు. పిల్లల్ని స్థానికంగా ఉన్న మున్సిపల్ పాఠశాలలో చేర్పించాడు. మందలించినా.. ఇటీవల రాజు నెల్లూరుకు రాగా లక్ష్మీనారాయణ అతడిని భార్యను మందలించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో శ్యామల కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు గ్రామానికి రావాలని సూచించడంతో పిల్లలు తీసుకుని అతను అక్కడకు వెళ్లారు. అప్పటికే శ్యామల వారి పుట్టింట్లో ఉంది. పెద్దమనుషులు శ్యామలను మందలించారు. ఫోనులో రాజును హెచ్చరించారు. శ్యామల మరోమారు ఇలా చేయనని చెప్పి భర్తతో కలిసి నెల్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తనతో రాకపోతే చంపేస్తానని, లేదంటే చచ్చిపోతానని రాజు బెదిరిస్తున్నాడని భర్తకు చెప్పింది. తనను వదిలేయమని రాజును ప్రాధేయపడింది. రోకలిబండతో కొట్టి.. రాజు రెండురోజుల క్రితం నెల్లూరుకు చేరుకున్నాడు. బుధవారం లక్ష్మీనారాయణ పని నిమిత్తం రైస్‌మిల్లుకు వెళ్లడం, ఉమ టిఫిన్ కోసం వెళ్లడాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన తనతో వచ్చేయాలని రాజు శ్యామలను కోరాడు. ఆమె నిరాకరించడంతో రోకలిబండతో తలపై మోదాడు. దీంతో ఆమె తలపగిలి తీవ్రరక్తసావ్రం అవుతుండటంతో అక్కడినుంచి పరావుతూ రోకలిబండను ముళ్లపొదల్లో విసిరేశాడు. శ్యామల తనను కాపాడాలని పెద్దగా కేకలువేస్తూ ఇంట్లోనుంచి బయటకు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతిచెందింది. «శ్యామల హత్య ఘటనపై స్థానికులు నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.బాలసుందరరావు, నవాబుపేట ఎస్సైలు శ్రీహరి, ప్రతాప్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి భర్తను పిలిపించి హత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఈ హత్యలు ఎవరి పనో..?
వైఎస్ఆర్ జిల్లా , రాజంపేట: రాజంపేట పట్టణం నడిబొడ్డున నూనివారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో ఓ ఇంటిలో మహిళ దారుణహత్యకు గురైన సంఘటన బుధవారం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నలందనగర్లో నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో కిషోర్‌కుమార్‌రెడ్డి గల్ఫ్‌కు వెళ్లగా, మరొక కుమారుడు దినేష్‌రెడ్డి వేరే ఊరిలో చదువుకుంటున్నాడు. సుజాత ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఇంటి బెడ్ రూమ్‌లో శవమై కనిపించింది. అక్కడి సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచం కింద రక్తం ప్రవహించింది. మృతదేహంపై ఉన్న గాయాలు కనిపించకుండా దుండగులు ఆమెపై చీరలు కప్పి వెళ్లారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు సుజాత మృతి చెందిన గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణ ఎస్ఐ చెన్నకేశవ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కడప నుంచి క్లూస్‌టీంను రప్పిస్తున్నట్లు ఆయన వివరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హత్య ఎలా వెలుగు చూసిందంటే.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సుజాత ఇంట్లోనుంచి బయటకు రాకపోగా.. ఆమె ఉం టున్న ఇంటికి బయట తాళం వేసి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూమ్లో ఆమె శవమై కనిపించింది. ఆమె ఒంటిపై చీరలు కప్పి ఉండటంతో ఎక్కడెక్కడ గాయాలైంది అర్థం కాలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగిందా? లేక బుధవారం రోజు పగలే జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు దొంగలు చొరబడి నగలు దోచుకునే క్రమంలో ఆమెను హత్య చేశారా లేక ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పనా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికితోడు ఇంటి బయట తాళం వేసి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. బండరాయితో మోది చంపి.. పోరుమామిళ్ల(కలసపాడు): కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లె దళితవాడకు చెందిన ఓబు ళాపురం థామస్(26) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లారేటప్పటికే ఈ వార్త పరిసర గ్రామాల్లో సంచలనమైంది. చెన్నారెడ్డిపల్లె – నల్లగొండుపల్లె మధ్య చెరువు సమీపంలో గజ్జ రాయితో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య మంజుల, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. థామస్‌కు మద్యం తాగే అలవాటు తప్పితే ఏ ఇతర అలవాట్లు లేవని, ఇతర విషయాల్లో తలదూర్చేవాడు కాదని సమాచారం. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో తేరు ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో ఉన్న థామస్ ఊరి బయటకు ఎందుకు వెళ్లాడో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. అతని బలహీనత తెలిసిన వ్యక్తులు మద్యం సేవిద్దామని ఊరికి దూరంగా తీసుకెళ్లి రాయితో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో పెనుగులాట జరిగినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ హత్యలో ముగ్గురు, నలుగురు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయని, పోలీస్ స్టేషన్ వరకు ఈ తగాదా వెళ్లినట్లు తెలిసింది. మృతుని భార్య మంజులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కలసపాడు ఎస్ఐ వెంకటరమణ కేసు నమోదు చేసుకున్నారు. ఏమీ తేల్చని డాగ్‌స్క్వాడ్: సంఘటన సమాచారం తెలిసి బుధవారం ఉదయం డాగ్‌స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. మృతదేహం వద్ద వాసన చూసిన కుక్కలు ఆ తర్వాత చెరువు కట్టపై తారాడి మహనందిపల్లె వరకు వెళ్లాయి. అయినా అవి ఏమీ నిర్ధారించలేకపోయాయి. -
మహిళ దారుణ హత్య
కావలి అర్బన్: ప్రకాశం జిల్లాకు చెందిన మిట్ల కృష్ణవేణి (32) దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన స్థానిక శివరామ సుబ్బయ్య కాలనీ సమీపంలోని అడవిలో గురువారం వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. అడవిలో మహిళ మృతదేహం ఉందని పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జీఎల్ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని కొందరు బొంతరాయితో మహిళ తల వెనుక భాగంలో మోది ఆమెను చీరతో ఉరేయడంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద బ్యాగ్ ఉంది. అందులో బ్యాంక్ పాస్‌పుస్తకం, ఫోన్, చిల్లర నగదు, ఇతర వస్తువులున్నాయి. పాస్‌పుస్తకం ఆధారంగా ఆమెది ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని కొనకనమిట్ల గ్రామంగా గుర్తించారు. కృష్ణవేణి భర్త పేరు శ్రీనివాసులురెడ్డి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మహిళ దారుణ హత్య
సత్తెనపల్లి: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సత్తెనపల్లి పట్టణం, చెంచుకాలనీ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని అచ్చంపేట రోడ్డు, పోలేరమ్మ దేవాలయం సమీపానికి చెందిన నూర్‌బాషా ఇమాంబీ (36)కి తెనాలికి చెందిన కాలేషావలితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా పదిహేనేళ్ల కిందట ఇమాంబీ భర్త, పిల్లలను వదిలేసి సత్తెనపల్లి వచ్చింది. అప్పటి నుంచి పట్టణానికి చెందిన తాజుద్దీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. 40 రోజుల కిందట తాజుద్దీన్ మృతి చెందాడు. కాగా తాజుద్దీన్‌కు కొంత నగదు ఇవ్వాల్సి ఉందని, ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో వివాదం ఉన్నట్లు పోలీసులకు సమాచారం. పట్టణంలోని చెంచుకాలనీ సమీపంలో నివసిస్తున్న ఇమాంబీతో తాజుద్దీన్ సోదరుడైన చినబాబు అలియాస్ వడ్డీల బాబుకు వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్వక్తపరుస్తున్నారు. గురువారం ఇమాంబీ గృహంలో హత్యకు గురైన విషయం తెలియడంతో సత్తెనపల్లి డీఎస్పీ వి.కాలేషావలి, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వీరయ్య, అర్బన్ ఎస్ఐలు అశోక్‌బాబు, శేషాచార్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇమాంబీ శరీరంపై 7, 8 కత్తిపోట్లు ఉండడాన్ని గుర్తించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ ఇమాంబీ ఇంటి వద్ద నుంచి చెంచుకాలనీలోకి ప్రవేశించి ఆగిపోయింది. ఈ క్రమంలో ఇమాంబీని హతమార్చిన వ్యక్తి చెంచుకాలనీ వైపుగా వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇమాంబీని చినబాబు హత్యచేశాడా లేక మరెవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తపరుస్తూ విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి సైదాబీ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణం
సాక్షి, చెన్నై/వేలూరు: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పోలీస్టేషన్ గేటు ముందే దారుణ హత్యకు గురికావటం తమిళనాట సంచలనం సృష్టిచింది. వివరాలు.. వేలూరు జిల్లా రాణిపేటలోని సెంగాడు ప్రాంతానికి చెందిన సుగుణ పొరుగునే ఉంటున్న సురేంద్రకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సురేంద్రపై ఫిర్యాదు చేసేందుకు సుగుణ బుధవారం స్థానిక మహిళా పోలీస్టేషన్‌కు వచ్చింది. ఫిర్యాదు చేసి బయటకు వస్తుండగా స్టేషన్ గేటు దగ్గరే కాపుగాసిన కొందరు దుండగులు వేటకొడవళ్లతో ఆమెపై దాడిచేశారు. విచక్షణారహితంగా ఆమెను నరికేశారు. తీవ్ర గాయాలతో సుగుణ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. రెప్పపాటు కాలంలో పోలీస్టేషన్ ఎదుటే ఈ దారుణ ఘటన జరగడం గమనార్హం. మృతదేహాన్ని వాలాజా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామనీ, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. సురేంద్ర, సుగుణకు గతంలో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
గొలుసు కోసం గొంతు కోశారు..
సాక్షి, నల్గొండ/కోదాడ: పట్టణంలో గురువారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా బాలాజీ నగర్లో నివాసముండే లక్ష్మీ (50) అనే మహిళను గొంతుకోసి హతమార్చారు. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారు నగలను చోరీకి యత్నించారు. అయితే మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లే క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు కోసి ఈ అఘయిత్యానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడివున్న లక్ష్మీని కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా దారిలోనే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు మాట్లాడుతూ.. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదంటూ విలపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దోపిడీ దొంగలు రెచ్చిపోయారు
-
కత్తితో పొడిచి...నువ్వుల నూనెతో కాల్చి..
అమీర్‌పేట: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలోని ఓ అపార్ట్మెంట్లో సోమ వారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులో స్థిరపడిన విశాఖపట్నానికి చెందిన పున్నారావు, ర మణి దంపతుల కుమార్తె సౌమ్యకు (25) అదే ప్రాంతానికి చెందిన సీతారామారావు, రత్నమాంబ దంపతుల కుమారుడు నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది కిత్రం నాగభూషణం భార్య సౌమ్య, కుమారుడు సాయి దత్తాత్రేయతో కలిసి నగరానికి వచ్చి ఎర్రగడ్డ , నందనగర్‌లోని సూరజ్ ఆర్కేడ్స్ ఫ్లాట్ నెంబర్ 104లో ఉంటున్నాడు. యూసుఫ్‌గూడలోని హైదరాబాద్ మెట్రో కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగభూషణం సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో నైట్ డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి పోయాడు. సౌమ్య తన కుమారుడితో కలిసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాం తంలో ఫ్లాట్‌లో నుంచి దట్టమైన పొగలు వస్తుండటాన్ని గుర్తించిన పక్కింట్లో ఉండే విశాల్ అ క్కడికి వెళ్లి చూడగా తలుపులు బయ టి నుంచి గడియపెట్టి ఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా సౌమ్య మంటల్లో కాలిపోతూ కనిపించింది. కొద్ది దూరంలో ఏడుస్తూ ఉన్న ఆమె కుమారుడిని రక్షించి పోలీసులకు సమాచారం అందజేశారు. అపార్ట్మెం ట్ వాసులు అతికష్టంపై మంటలను ఆర్పివేశా రు. కాగా సౌమ్య శరీరంపై నువ్వుల నూనె పోసి నిప్పటించడమేగాక, తప్పించుకునేందుకు వీలులేకుండా బయటి నుంచి గడియ పెట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృ తురాలి ఒంటిపై మూడు కత్తి పోట్లు ఉన్నాయని, అరవకుండగా గొంతు నులిమి గదిలో ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. బాత్రూం ఫ్లెష్‌లో పడి ఉన్న ఓ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘ టనా స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ, పంజగుట్ట ఏసీపీ సందర్శించారు. అల్లుడిపై అత్తామామ అనుమానం సౌమ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. భర్త నాగభూషణంపై సౌమ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త నైట్ డ్యూటీకి వెళితే బయటి వ్యక్తులు ఇంటికి వచ్చే అవకాశం ఉండదని, లేదా తనకు తెలిసిన వ్యక్తులతో హత్య చేయించి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేనందున వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. సౌమ్య తండ్రి పున్నారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పండుగ కోసం ఊరెళ్దామనుకుంది అంతలోనే..
-
ప్రాణంతీసిన ప్రేమోన్మాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాదం మరో యువతి ప్రాణాలు బలి తీసుకుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లేందుకు సెలవు పెట్టిన ఆమె.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. ఊరెళ్లేందుకు టికెట్లు తీసుకుని.. షాపింగ్ కూడా పూర్తి చేసింది.. ఎన్నో ఆశలతో ఇంటికి చేరుకున్న ఆమెను ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి మూసాపేట హబీబ్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లావాసి బోను జానకి(24)గా, నిందితుడిని వికారాబాద్ జిల్లావాసి ఆనంద్ అలియాస్ అనంతప్ప(27)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ డీమార్ట్ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రేమించాలంటూ వేధింపులు.. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే పనిచేస్తున్న రూపావతితో కలసి మూసాపేట హబీబ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన ఆనంద్ అలియాస్ అనంతప్ప(27) కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రగతినగర్‌లో నివాసముంటున్న ఆనంద్.. జానకితో పరిచయం పెంచుకున్నాడు. అదే చనువుగా తీసుకుని ప్రేమించాలంటూ ఒత్తిడి తీసుకురాగా.. ఆమె సున్నితంగా తిరస్కరించింది. అతడి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో 15 రోజుల క్రితం డీమార్ట్ యాజమాన్యానికి, ఆనంద్ స్వగ్రామంలోని పెద్దలకు చెప్పటంతో అతడిని పిలిచి మందలించారు. ఇక నుంచి జానకితో మాట్లాడనని, మరిచిపోతానని ఆనంద్ చెప్పాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేయటం ఇబ్బందిగా ఉంటుందని జానకిని కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లోని డీమార్ట్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా జానకికి వేధింపులు తప్పలేదు. ఆనంద్ సనత్‌నగర్‌లో విధులు ముగించుకుని.. కేపీహెచ్‌బీ డీమార్ట్ వద్దకు వచ్చి తనను ప్రేమించాలంటూ మళ్లీ వేధింపులు మొదలెట్టాడు. సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. సంక్రాంతి పండుగ కోసం బుధవారం సొంతూరు వెళ్లాలనుకున్న జానకి.. మంగళవారం నుంచి సెలవు తీసుకుని షాపింగ్ పూర్తి చేసి రూమ్‌కి చేరుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె గది దగ్గరకు వచ్చిన ఆనంద్.. గడియ తీసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కసితో జానకి గొంతు నులిమి.. రూమ్‌లోని కూరగాయలు కోసే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. గది బయట గడియ వేసి పరారయ్యాడు. రూపావతి విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ జానకి కనిపించడంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రూపావతి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానకి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
కూకట్‌పల్లిలో దారుణం
భాగ్యనగర్‌కాలనీ: వివాహేతర సంబంధం కారణంగా మహిళ దారుణ హత్యకు గురైన సంఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె ప్రియుడు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కూకట్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బి రోడ్డునెంబర్ 2లో అంజిరెడ్డి, ప్రత్యూష రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. అంజిరెడ్డి వ్యాపారం నిమిత్తం గత ఏడాది శ్రీలంక వెళ్లాడు. ఈ సమయంలో ప్రత్యూష తన స్నేహితుడు శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అంజిరెడ్డి.. శ్రీనివాస్‌ను ఇంటికి రానివ్వకపోవటమే కాకుండా గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే శ్రీనివాస్ మూడునెలల క్రితం బాలాజీనగర్‌లోని ఓ అపార్టుమెంట్లో పెంట్ హౌస్‌లో అద్దెకు దిగాడు. ఇటీవల అంజి రెడ్డి శ్రీలంక వెళ్లడంతో శ్రీనివాస్, ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి ఇంటి యజమానికి భార్యగా పరిచయం చేశాడు. ఇటీవల ప్రత్యూష పుట్టింటికి వెళ్లి కూతురిని అక్కడే వదిలేసి గత శుక్రవారం బాలాజీనగర్‌లోని శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇదిలా వుండగా శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన శ్రీనివాస్ తిరిగిరాకపోగా, సోమవారం అతని ఫ్లాట్‌లోంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన ఇంటి యజమాని కిటికీలు తెరిచి చూడగా ప్రత్యూష చనిపోయి వుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరీరమంతా కత్తి పోట్లు ఉండటం, మృతదేహం పక్కనే కత్తి ఉండటంతో శ్రీనివాసే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చేపట్టారు. -
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి భార్యను హతమార్చి అనంతరం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కాకినాడ మండలం పోలవరం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులిద్దరు మృతిచెందడంతో వారి ఏడాదిన్నార పాప అనథగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంగారం కోసం దారుణ హత్య
బాసర: బంగారు నగల కోసం గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హాతమార్చారు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగమ్మ(73)ను గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గొంతునులిమి హత్యచేసి ఆమె వంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ మహిళను అందరు చూస్తూండగానే ఓ అగంతకుడు గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ హత్య మంగళవారం రాత్రి భోపాల్‌లోని అశోకా గార్డెన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీతా టాకుర్ టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఇటీవలే ఆమె డ్రగ్స్ అమ్మిన కేసులో పట్టుబడి బెయిల్‌పై విడుదలైంది. మంగళవారం రాత్రి టీకొట్టు మూసిన ఆమె పనివాడితో కలిసి ఇంటికి వెళ్తుండగా 8 గంటల సమయంలో ఓ అంగతకుడు ఆమెను కత్తితో గొంతు కోసి చంపాడు. ఘటనాస్థలి నుంచి పనివాడు తప్పించుకోగా.. అక్కడున్న వారు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. సునీతతో డ్రగ్స్ అమ్మిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పిడంటుడాని, పూర్తి విచారణ చేసి నిందితుని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
భారత మహిళ యూకేలో దారుణహత్య
లండన్: భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకేలో దారుణహత్యకు గురైంది. కిరణ్ దాడియా(46) అనే మహిళను హత్యచేసి సూట్‌కేసులో మృతదేహాన్ని ఉంచి లీసెస్టర్ లోని క్రొమర్ స్ట్రీట్‌లో వదిలివెళ్లారు. సూట్‌కేసును గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. లీసెస్టర్‌షైర్ పోలీసులు అక్కడకి చేరుకుని సూట్‌కేసు తెరచిచూడగా రక్తపు మరకలతో ఉన్న కిరణ్ దాడియా మృతదేహాన్ని గుర్తించారు. భారత సంతతికి చెందిన ఈ మహిళ గత 17 ఏళ్ల నుంచి ఓ కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఆమె కనిపించడం లేదని కిరణ్ సోదరి జస్బీర్ కౌర్ పోలీసులకు తెలిపారు. చివరగా జాబ్ వెళ్లే ముందు తన సోదరితో ఫోన్లో మాట్లాడినట్లు వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైన మహిళ భర్త అశ్విన్ దాడియా(50)ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అదే ఏరియాలో ఇటీవల తప్పిపోయిన బ్రిటన్ మహిళ మృతదేహమని మొదట తాము భావించామని స్థానికులు చెప్పారు. ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్ దర్యాప్తు జరుపుతోంది. కిరణ్ భర్త అశ్విన్‌ను కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు పోలీసులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తన సోదరి మృతదేహాన్ని చూసిన తన పిల్లలు ఎంతో భయపడ్డారని, అందులోనూ ఇంటికి వచ్చి పోలీసులు విచారణ చేయడం ఇందుకు మరో కారణమని జస్బీర్ కౌర్ చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారని, సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుని వారిని శిక్షించాలన్నారు. అమ్మ అందరితోనే కలిసిపోయే వ్యక్తి అని ఆమె హత్యకు గురయ్యారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని కిరణ్ దాడియా ఇద్దరు కుమారులు పోలీసుల విచారణలో తెలిపారు. -
సారంగాపూర్‌లో మహిళ హత్య
జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో పూర్ణ (35) అనే మహిళ సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. ఈమె భర్త చనిపోగా ఒక కుమార్తె ఉంది. పూర్ణకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో సదరు వ్యక్తి కుమారుడు, ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను తలపై రోకలిబండతో మోది హత్య చేశాడు. కేకలు వినిపించడంతో స్థానికులు వచ్చేసరికి ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా పారిపోతూ ముగ్గురు నిందితులు బావిలో పడిపోయారు. దీంతో వారిలో ఒకరిని స్థానికలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. -
బ్రిటిష్ యువతి దారుణ హత్య
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సమీప ప్రాంతంలో బ్రిటిష్ యువతిని దారుణంగా పొడిచి చంపారు. బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో 30 మంది చూస్తూ ఉండగానే ఓ ఫ్రెంచి వ్యక్తి ఆమెను చంపేశాడు. పోలీసులు అక్కడకు వచ్చేసరికే 21 ఏళ్ల వయసున్న ఆ బ్రిటిష్ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మరో బ్రిటిష్ వ్యక్తి (30) కూడా కత్తిపోట్లకు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరినీ పొడిచిన ఫ్రెంచి వ్యక్తి (29)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, హత్యకు కారణం ఏంటన్న విషయాలు తెలుసుకోడానికి తము ప్రయత్నిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ రే రోవెదర్ తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత నిందితుడు వాళ్లను ఎదుర్కోడానికి ప్రయత్నించడంతో బాగా కష్టపడాల్సి వచ్చింది. సుమారు 30 మంది వ్యక్తులు అక్కడి పరిస్థితిని చూసి హడలిపోయారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేసేందుకు వీలుగా బ్రిటిష్ కాన్సులేట్‌ను తాము సంప్రదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడు తప్ప వేరే నిందితులు ఎవరి కోసం ఈ కేసులో గాలించడం లేదని రోవెదర్ చెప్పారు. -
గుంటూరులో వివాహిత దారుణ హత్య
ముప్పాళ్ల: గుంటూరు జిల్లాలో కుటుంబకలహాల కారణంగా ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబిరెడ్డి, లక్ష్మి(35) దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కూడా సాంబిరెడ్డి అతడి తండ్రి బక్కిరెడ్డి కలసి లక్ష్మితో గొడవపెట్టుకున్నారు. తండ్రి, కొడుకు కలసి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అత్త మృతి.. అల్లుడిపై అనుమానాలు!
నర్సాపూర్ రూరల్: ఓ మహిళ పట్టపగలే దారుణహత్యకు గురైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, కుటుంబీకులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపల్లి పంచాయతీ తావుర్యా తండాకు చెందిన మెగావత్ విఠల్ భార్య తార(48) నేటి ఉదయం నాగులపల్లి పాఠశాల వైపు నుంచి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కల్లు సీసాతో విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. తార మృతదేహాన్ని పక్కనే ఉన్న కుంటలో పడేసి నిందితులు వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు అటుగా మూత్రవిసర్జనకు వెళ్లగా ఆమె మృతదేహం కనిపించింది. వారు వెంటనే ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లుడిపై ఎన్నో అనుమానాలు! ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమెను అల్లుడు జగదీషే చంపి ఉంటాడని బంధువులు, భర్త ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం అదే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. అత్త చనిపోయిన విషయం తెలిసినా అతడు రాకపోవటంతో అనుమానాలకు ఊతమిచ్చినట్లు అయింది. -
కత్తులతో పొడిచి మహిళ దారుణ హత్య
మోత్కూరు: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం తాటిమట్ల గ్రామంలో పట్నూరు సావిత్రమ్మ(48) అనే మహిళ బుధవారం ఉదయం దారుణ హత్యకు గురైంది. భర్త నుంచి విడిపోయి సావిత్రమ్మ కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటోంది. గుర్తుతెలియని దుండగులు బుధవారం వేకువజామున ఆమె ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో పొడిచి హత్యచేశారు. నగలు, డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారా?. లేక పాత కక్షలేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. సావిత్రమ్మ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. -
మహిళ దారుణ హత్య
వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. మొయినాబాద్ మండలం వెల్చాల గ్రామానికి చెందిన చిన్నమ్మ(42) అనే మహిళ భర్తతో విడిపోయి పదేళ్లుగా వికారాబాద్ మండలం గంగారాం కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. మంగళవారం రాత్రి చిన్నమ్మను గుర్తుతెలియని వ్యక్తులు గొంతునులిమి హత్యచేశారు. బుధవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు తెలిపారు. చిన్నమ్మ కుమార్తె సునీత ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రియుడి చేతిలో వివాహిత హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రియుడి చేతిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కళాశాలలో తన సీనియర్ అయిన వ్యక్తితో కొనసాగించిన వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గుంటూరు అమరావతి రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం కొమ్మూరుకు చెందిన కుమ్మరి రమ్య (24)కు గుంటూరు గోరంట్లకు చెందిన సతీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇంజనీరింగ్ చదివే సమయంలో రమ్యకు కిషోర్‌బాబు అనే సీనియర్ విద్యార్థితో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, పెళ్లయిన తర్వాత కూడా ఈ బంధం కొనసాగించడంతో వారు మరింత సన్నిహితమయ్యారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని రమ్య కిషోర్‌బాబుపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదే విషయమై మంగళవారం కిషోర్‌బాబు ఫ్లాట్‌లో వారిద్దరీ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆగ్రహించిన కిషోర్‌బాబు రమ్యను గొంతునులిమి నేలకేసి కొట్టడంతో ఆమె మృతి చెందింది. వెంటనే కిషోర్‌బాబు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కరీంనగర్లో మహిళ దారుణ హత్య
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. హుజూరాబాద్ పట్టణంలో ఒక మహిళ హత్యకు గురైంది. స్థానిక పాత టెలిఫోన్ ఎక్స్చేంజి సమీపంలో నివాసం ఉండే అయిత సురేందర్, భాగ్యలక్ష్మీ(44) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సురేందర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. బుధవారం ఉదయం ఆయన విధులకు, ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్లగా భాగ్యలక్ష్మీ ఒక్కరే ఇంట్లో ఉంది. ఆ ఇంటి కింది పోర్షన్లో అద్దెకు ఉండే మహిళ ఆమె కోసమని మధ్యాహ్నం పై అంతస్తులోకి వెళ్లింది. హాలులో భాగ్యలక్ష్మీ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి, చుట్టుపక్కల వారికి విషయాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని ఆగంతకులు ఆమె మెడలోని గొలుసు తెంపుకు పోయే ప్రయత్నంలో... ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రమణమూర్తి పరిశీలించారు. -
చేతబడి నెపంతో పెద్దమ్మనే చంపేశాడు
భూపాలపల్లి: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తోందనే కారణంతో ఓ వృద్ధురాలిని ఆమె వరుసకు కుమారుడు అయ్యే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన చందుపట్ల పద్మ(69) చేతబడి చేస్తున్న కారణంగానే తన కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతున్నారని ఆమె మరిది కుమారుడు చందుపట్ల శ్రావణ్‌రెడ్డి భావించేవాడు. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే, గత నెల 25వ తేదీన పద్మ తన పత్తిచేనులో ఉండగా శ్రావణ్‌రెడ్డి ఆమెను బండరాయితో మోది చంపేశాడు. శవాన్ని గోనెసంచిలో ఉంచి రాయిని కట్టి గ్రామ సమీపంలోని చెరువులో పడేశాడు. రక్తంతో తడిసిన తన దుస్తులను గ్రామ సమీపంలో దాచి పెట్టాడు. గురువారం సాయంత్రం శ్రావణ్‌రెడ్డి దుస్తులను గమనించిన గ్రామస్తులు అతడిని నిలదీశారు. దీంతో అతను భూపాలపల్లి పోలీసులకు లొంగిపోయాడు. అతడు చెప్పిన ఆనవాళ్ల మేరకు శుక్రవారం ఉదయం చెరువులో గాలించగా పద్మ శవం లభ్యమైంది. మృతురాలి కుమారుడు శ్రీరాంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహిత దారుణ హత్య
భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భీమ్‌గల్ మండలం మెండోరా శివారులోని ఈర్లగుట్ట వద్ద దుండగులు గొంతుకోసి మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతురాలు కమ్మర్పల్లి మండలం మానాల గ్రామానికి చెందిన లలిత(35)గా పోలీసులు గుర్తించారు. లలిత గత నెల 12 వ తేదీ నుంచి కనపడటం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, సీఐ రమణారెడ్డి పరిశీలించారు. -
కమలాపూర్‌లో వివాహిత దారుణహత్య
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలో వివాహిత దారుణ హత్యకు గురైంది. డిచ్పల్లి మండలం కమలాపూర్‌కు చెందిన స్వరూప(26)ను ఆమె ఇంట్లోనే ఉరివేసి చంపబడింది. ఆమె తలపై బలంగా కొట్టిన తర్వాత ఉరివేసినట్లు తెలుస్తోంది. స్వరూప తలపై పలు గాయాలున్నాయి. ఆమె భర్త తేజావత్ సంతోషే ఈ పనికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వరూపకు, సంతోష్‌కు 2011లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. 2012 లో సంతోష్, ఇందిర అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. 2013లో ఇందిరకు విడాకులిచ్చాడు. కొన్ని రోజులుగా మళ్లీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్వరూపను అడ్డు తొలగించుకోవడానికి సంతోష్ ఈ హత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డాగ్ స్వ్కాడ్‌ను తెప్పించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. -
భార్యలా చూడమందని చంపేశాడు
రామసీత హత్య కేసులో నిందితుడి లొంగుబాటు ద్వారకాతిరుమల : మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన కుంకుళ్లమ్మ ఆలయ అర్చకుడు కుందుర్తి నాగరాజు ఆమెను వదిలించుకోవటానికి హత్య చేశాడని భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో శనివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా ఐ.రుద్రవరానికి చెందిన పడమటి రామసీత(28)కు కైకలూరుకు చెందిన వెలివల రవికుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహానంతరం వారు ద్వారకాతిరుమలలో స్థిరపడ్డారు. వీరికి తొమ్మిదేళ్ల వయసు కుమార్తె ఉంది. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఉపాలయమైన కుంకుళ్లమ్మ ఆలయ అర్చకుడు కుందుర్తి నాగరాజుకు, రామసీతకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో రామసీత దంపతుల మధ్య వివాదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వారు విడిపోయారు. అప్పటి నుంచి రామసీత పోషణను నాగరాజే చూస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు గుండుగొలనుకుంట కాలనీలో రామసీతకు చెందిన 3 సెంట్ల ఇంటి స్థలాన్ని, ఆమె కుమార్తెకు చెందిన బంగారు గొలుసును అమ్ముకున్నాడు. ఏం జరిగిందంటే.. భార్యతో సమానంగా తననూ చూడాలని రామసీత కొద్దిరోజుల నుంచి నాగరాజుపై ఒత్తిడి తీసుకొస్తోంది. తనను ఆలయాలకు తీసుకెళ్లాలని అడుగుతోంది. మరోపక్క వీరి విషయం తెలిసి నాగరాజు కుటుంబంలో కలహాలు రేగాయి. రామసీత వల్ల తన పరువు దెబ్బతిని మనుగడకే ముప్పు వాటిల్లుతోందని నాగరాజు భావించాడు. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 1న ఉదయం దేవస్థానం కార్యాలయానికి వెళుతున్నానని ఇంటి దగ్గర చెప్పిన నాగరాజు నేరుగా రామసీత ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె కుమార్తెను పిలిచి మీ అమ్మకు, నాకు ఏ విధమైన సంబంధం లేదని తన భార్యతో చెప్పమని లక్ష్మీపురంలోని తన ఇంటికి పంపించాడు. అనంతరం నాగరాజు ఒక చీరను ఒడిచుట్టి రామసీత మెడకువేసి బిగించాడు. ఆమె కేకలు వేయకుండా అదే చీరను నోటిపై చుట్టి హత్య చేసి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న రామసీత కుమార్తె తన తల్లి ఎంతకీ కదలకుండా పడి ఉండటంతో చుట్టుప్రక్కల వారికి తెలిపింది. స్థానికులు పోలీస్టేషన్‌కు సమాచారం అందించడంతో భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం ద్వారకాతిరుమల వీఆర్వో లక్ష్మీపతి సమక్షంలో నాగరాజు లొంగిపోయి, తన తప్పు ఒప్పుకున్నాడని సీఐ వివరించారు. అతడిని భీమడోలు కోర్టులో హాజరు పరచగా జడ్జి ఎస్.వెంకటేశ్వరరెడ్డి రిమాండ్ విధించారు. రామసీత ఫోన్ తీసుకెళ్లిన నాగరాజు అందులోని సిమ్ కార్డులు, మెమొరీ కార్డును రాజమండ్రి వద్ద గోదావరిలో పడేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
‘మా అమ్మను ఆ ముగ్గురే చంపారు’
పెద కూరపాడు(గుంటూరు): మా అమ్మను ముగ్గురు వ్యక్తులు చంపారంటూ ఆమె కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓ మహిళను ఆమె భర్త, అత్తమామలు కలసి ఉరేసి చంపారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, ఆమె కుమారుడు నిజం చెప్పటంతో దారుణం వెలుగుచూసింది. వివరాలివీ.. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మకు పెదకూరపాడుకు చెందిన తమ్మిశెట్టి రంగతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కోటేశ్వరమ్మను భర్త రంగతోపాటు అత్తమామలు శాంతి, వెంకటేశ్వర్లు శనివారం కొట్టి చంపారు. అనంతరం ఇంట్లోనే ఉరివేసి, ఆత్మహత్య చేసుకుందని అందరికీ చెప్పసాగారు. అయితే, కోటేశ్వరమ్మ కుమారుడు మాత్రం.. తన తల్లిని ఆ ముగ్గురూ కలసి కొట్టి చంపారని పోలీసుల ఎదుట వెల్లడించే సరికి అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించగా వారు నేరం అంగీకరించారు. వారిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్గావ్లో మహిళ మృతి
పరువు హత్యగా అనుమానిస్తున్న పోలీసులు గుర్గావ్: బోరా కాలన్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటిలోనే మృతిచెందింది. కాగా, దీనిని పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. వివరాలు.. హరియానాలోని భివానీ గ్రామంలో జ్యోతి, ఆమె సోదరి వివాహాలు ఈ నెల 20న చేయడానికి ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు సమీపిస్తోండగా శుక్రవారం ఉదయం జ్యోతి ఇంటిలోనే చనిపోయింది. అనుమానస్పద కారణాలతో ఓ మహిళ మృతి చెందిందని కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేయగా ఆమె తల్లిదండ్రులు మాత్రం జ్యోతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ‘జ్యోతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోలేదని శవపరీక్షలో తేలింది. చనిపోయిన తర్వాత మాత్రమే ఆమెకు ఉరేసినట్లు నివేదికలో వైద్యులు పేర్కొన్నారు’ అని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆత్మహత్య కేసును హత్య కేసుగా మారుస్తున్నామని బిలాస్పూర్ పోలీస్‌స్టేషన్ అధికారి చెప్పారు. ఆమె కుటుంబసభ్యులు తమనెందుకు పక్కదారి పట్టించాలనుకున్నారో అనే దిశలో విచారణ చేస్తున్నామన్నారు. పరువు హత్య కోణంలో వారిని విచారిస్తామని తెలిపారు. -
మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు
మహబూబ్ నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని పరిశీలించగా.. వెంకటమ్మ అనే మహిళగా పోలీసులు గుర్తించారు. వెంకటమ్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రాణం తీసిన డబ్బుల గొడవ
మూడు నెలల్లో కూతురు పెళ్లి జరగనుండడంతో ఆ ఇల్లాలు ఫైనాన్స్ వ్యాపారి వద్ద చీటీ వేసింది. పెళ్లి అవసరాలకు డబ్బు కావాలని ఆ వ్యాపారి వద్దకు వెళ్తే.. తీరా లేవు పొమ్మన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తే.. చెబితే భయమా? ఫిర్యాదు చేసుకుంటే చేసుకో.. అంటూ తెగేసి చెప్పాడు. పైగా తానూ వస్తానంటూ ఆమెను తన ద్విచక్రవాహనంపైనే ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు. అలా వెళ్తుండగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో ఏమైందో ఏమో ఆమె బండి నుంచి జారిపడిపోయింది. ‘ఆమె పోతే డబ్బులు ఇవ్వనవసరం లేద’నుకున్నాడో ఏమో.. రోడ్డుపైనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి పోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్చినా ఫలితంలేకపోయింది. చివరికి ప్రాణం పోయింది. పలాస: కాశీబుగ్గ మహారాణిపేటకు చెందిన బీమా రూపావతి(45) ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి గురువారం మృతి చెందారు. ఫైనాన్స్ వ్యాపారి ప్రకాశరావుతో స్కూటీపై వెళ్తుండగా బండిపై నుంచి జారిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కథనం ప్రకారం... మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె సంతోషిణి(19)కి ఇటీవల వివాహం నిశ్చయమైంది. జనవరి 26న పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా డబ్బు అవసరం కావడం తో తనకుమార్తె సంతోషిణి, కుమారుడు సంతోష్‌తో కలిసి చినబాడాంలోని ప్రకాశరావు ఫైనాన్స్ కార్యాలయానికి ఉదయం 9.30 గంటలకు వెళ్లింది. ప్రకాశరావు వద్ద చీటీ కట్టిన సొమ్ము ఉండడంతో అందులో నుంచి రూ.50 వేలు కావాలని కోరారు ప్రస్తుతం డబ్బులు లేవని ప్రకాశరావు చెప్పడంతో రూపావతి, ప్రకాశరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పగా, తాను కూడా వస్తాను పదా అం టూ తన స్కూటీపై తీసుకుని వెళ్లాడు. అయితే స్కూటీని కాశీబుగ్గ వైపు కాకుండా దారిమళ్లించి బెండి రైల్వేగేటు వైపు తీసుకెళ్తుండగా, ఇలా వెళ్తున్నావేంటి అంటూ బండిమీద ఆమె గొడవ చేశారు. బం డి అలా వెళ్తుండగా గరుడఖండి, సరియాపల్లి గ్రా మాల మధ్య జాతీయ రహదారికి సమీపంలో రూపావతి జారిపడిపోయారు. దీంతో ఆమె తలకు బల మైన గాయాలు తగిలాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రూపావతిని ప్రకాశరావు పట్టించుకోకుండా అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ విషయం కుటుంబీకులకు తెలియడంతో రూపావతిని పలాస ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె మృతి చెందారు. కుమార్తె సంతోషిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పా రు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మహిళ దారుణ హత్య
చౌటుప్పల్ : గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామశివారులో ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగుచూసింది. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35సంవత్సరాల వయస్సు గల మహిళను దుండగులు వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు పక్కన గల, ఎస్.లింగోటం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చాడు.పత్తిచేలో పెనుగులాట జరిగింది. మొదట గొంతు నులిమి,బండరాయిని తలపై మోది చంపేశాడు.బండరాయిని అలాగే తలపై ఎత్తేసి వెళ్లాడు. రెండు రోజులు సద్దుల బతుకమ్మ, విజయదశమి కావడంతో పత్తిచేను వైపు ఎవరూ వెళ్లలేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. శనివారం ఉదయం అటు వైపు వెళ్లిన పశువుల కాపరి చూసి, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు పోలీసులతో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం పోలీసులను రప్పించి, ఆనవాళ్లను సేకరించారు. పోలీస్ డాగ్‌స్క్వాడ్‌ను రప్పించినా ఫలితం లేకపోయింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేశారు. సుమారు 50గంటల క్రితమే చనిపోయినట్టు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న పౌల్ట్రీఫామ్, పరిశ్రమల్లో పనిచేసే మహిళగా భావించి, విచారించినప్పటికీ ఫలితం లేకపోయింది. వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. గత 3రోజుల క్రితం ఎక్కడైనా మహిళ అదృశ్యమైతే, 9440795612నెంబరుకు సంప్రదించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ కోరారు. -
బస్‌స్టాప్‌లో మహిళ దారుణ హత్య
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ బస్‌స్టాప్ వద్ద దారణం చోటు చేసుకుంది. బస్‌స్టాప్‌లో మహిళపై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్య చేశారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీకూతుళ్లతో సంబంధం.. తల్లి హత్య!
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తర్వాత ఆమె కూతురిపై కన్నేసి, ఆమెను కూడా ముగ్గులోకి దింపి, చివరకు తల్లిని పీకపిసికి చంపేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బిలాస్పూర్ గ్రామంలో జరిగింది. రామ్‌వీర్ అనే వ్యక్తి ఓ వితంతువుతో సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఆమె 18 ఏళ్ల కుమార్తె మీద కూడా అతడి కన్ను పడింది. నెమ్మదిగా ఆమెను ప్రేమ పేరుతో వలలోకి దించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అయితే తన కూతురు అతడికి కూడా కూతురి వరస అవుతుందని, ఇలా చేయొద్దని ఆమె తల్లి పెళ్లికి నిరాకరించింది. దాంతో అతడు అనుజ్, సతీష్, అర్జున్ అనే ముగ్గురు సహచరులను వెంటబెట్టుకుని, ఆ వితంతువును పీక పిసికి చంపేశాడు. అనంతరం బిలాస్పూర్ గ్రామ సమీపంలో ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై పడేశాడు. ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులు నలుగురినీ అరెస్టు చేశారు. -
యువతిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఆ విషయాన్ని ఆదివారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి హత్యపై పోలీసులు గ్రామస్తులను ప్రశ్నిస్తున్నారు. యువతి మృతదేహంలోని సరిగా కాలని శరీర భాగాలను పోలీసులు సేకరించారు. పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
గర్భిణిని పీకపిసికి చంపిన దుండగులు
పశ్చిమబెంగాల్లో మహిళల మీద అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలీపుర్దౌర్ జిల్లాలోని దాల్సింగ్పర గ్రామంలో 30 ఏళ్ల గర్భిణిని గుర్తుతెలియని దుండగులు పీక పిసికి చంపేశారు. ఆమె శరీరం మీద లెక్కలేనన్ని గాయాలున్నాయి. బాధితురాలు రేఖా దేవి షాకు రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఆమె మరణించి ఉన్నట్లు గుర్తించారని అదనపు ఎస్పీ ఆకాష్ మేఘారియా తెలిపారు. రేఖాదేవి మృతదేహం నేలమీద పడి ఉండగా, ఆమె మరణించిందని తెలియని కొడుకు ఆ పక్కనే ఏడుస్తున్నాడు. ఆమె భర్త బీహార్‌లో ఉండగా, అత్తమామలు ఏదో ఊరు వెళ్లారు. కొంత గొడవ అయిన తర్వాత ఆమెను పీకపిసికి చంపినట్లు తెలుస్తోందని అదనపు ఎస్పీ చెప్పారు. హత్యకు ఆస్తి వివాదం కూడా కారణం కావచ్చని అన్నారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం