
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రీ పార్క్ వద్ద కలకలం రేగింది. సోమవారం అక్కడ ఓ పాతికేళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని హతమార్చిన దుండగులు మృతదేహాన్ని ఓ అట్ట పెట్టెలో కుక్కి శాస్త్రీ పార్క్ వద్దనున్న ఓ హోటల్ ముందు పడేసినట్టు పోలీసులు తెలిపారు. యవతి మెడకు ఓ నీలి రంగు స్కార్ఫ్ చుట్టి ఉందని వెల్లడించారు. యువతి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించామని సీనియర్ పోలీస్ అధికారి వేద్ ప్రకాశ్ సూర్య తెలిపారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment