కూకట్‌పల్లిలో దారుణం | Woman found murdered in Kukatpally Housing Board | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో దారుణం

Published Wed, Apr 26 2017 9:30 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కూకట్‌పల్లిలో దారుణం - Sakshi

కూకట్‌పల్లిలో దారుణం

భాగ్యనగర్‌కాలనీ: వివాహేతర సంబంధం కారణంగా మహిళ దారుణ హత్యకు గురైన సంఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె ప్రియుడు శ్రీనివాస్‌ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కూకట్‌పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

కేపీహెచ్‌బి రోడ్డునెంబర్‌ 2లో అంజిరెడ్డి, ప్రత్యూష రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. అంజిరెడ్డి వ్యాపారం నిమిత్తం గత ఏడాది శ్రీలంక వెళ్లాడు. ఈ సమయంలో ప్రత్యూష తన స్నేహితుడు శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అంజిరెడ్డి.. శ్రీనివాస్‌ను ఇంటికి రానివ్వకపోవటమే కాకుండా గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే శ్రీనివాస్‌ మూడునెలల క్రితం బాలాజీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో పెంట్‌ హౌస్‌లో అద్దెకు దిగాడు.

ఇటీవల అంజి రెడ్డి శ్రీలంక వెళ్లడంతో శ్రీనివాస్, ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి ఇంటి యజమానికి భార్యగా పరిచయం చేశాడు. ఇటీవల ప్రత్యూష పుట్టింటికి వెళ్లి కూతురిని అక్కడే వదిలేసి గత శుక్రవారం బాలాజీనగర్‌లోని శ్రీనివాస్‌ ఇంటికి వచ్చింది. ఇదిలా వుండగా శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన శ్రీనివాస్‌ తిరిగిరాకపోగా, సోమవారం అతని ఫ్లాట్‌లోంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన ఇంటి యజమాని కిటికీలు తెరిచి చూడగా ప్రత్యూష చనిపోయి వుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరీరమంతా కత్తి పోట్లు ఉండటం, మృతదేహం పక్కనే కత్తి ఉండటంతో శ్రీనివాసే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement