kphb
-
కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. లేఅవుట్లో 54.29 ఎకరాల స్థలంలో ఉందన్న న్యాయమూర్తి.. అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 10 శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని ఏజీ సమాధానమిచ్చారు.ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్ కేపీహెచ్‌బీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దన్న హైకోర్టు.. లేఅవుట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
హైదరాబాద్ కేపీహెచ్బీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి పై ఉన్న ఫర్నిచర్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాటుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు సమీపంలో ఉన్న మరో మూడు దుకాణాలకూ వ్యాపించాయి. శ్రీ ఫుట్ వరల్డ్, ఎంఎస్ ఫర్నిచర్, ఫుట్ నీడ్స్, వాచెస్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్‌లు తగలబడిపోయాయి. -
కేపీహెచ్బీలో ఓయో రూమ్లపై పోలీసుల దాడులు..
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్‌బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
హైదరాబాద్ : KPHBలో మహిళ ఆత్మహత్య
-
మూసాపేట నుంచి కేపీహెచ్‌బీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్
-
కేపీహెచ్‌బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు ఐటీ కారిడార్ పరిధిలో మెట్రో నియోగా పిలిచే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (బీఆర్టీఎస్) ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల లేమి శాపంగా మారింది. పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.3,100 కోట్ల నిధులు వెచి్చంచేందుకు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర సర్కారు రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానిస్తోంది. మరోవైపు రూ.450కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లాభాలు రాకపోవడంతో.. ఇప్పటికే నగరంలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ మార్గంలో అందుబాటులో ఉన్న తొలిదశ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభదాయకం కాలేదు. ఈ నేపథ్యంలో యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకొస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సర్కారు అంచనాల ప్రకారం.. యాన్యుటీ విధానంలో మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థ ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. తర్వాత అయిదు నుంచి పదేళ్ల అనంతరం వడ్డీతో కలిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయాన్ని వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు చెల్లిస్తుందన్న మాట. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్టు చేపట్టే మార్గంలో విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక పద్ధతిన తక్కువ మొత్తానికి లీజుకిచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈవిధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం(ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. - ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. - ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ జంజాటం లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ– హైటెక్స్–రాయదుర్గం– కోకాపేట్– ఓఆర్ఆర్ వరకు సుమారు 19 కి.మీ మేర సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. కానీ నిధులు వెచి్చంచే విషయంలో ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడం గ్రేటర్ పిటీ. -
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
హైదరాబాద్: కెపిహెచ్బి క్లబ్ మస్తీ పబ్‌లో అశ్లీల దందా
-
జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల ఘర్షణ
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల నడుమ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ గురువారం బహిర్గతమైంది. బుధవారం రాత్రి మెటలర్జీ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని ఏబీవీపీ నాయకులు క్యాంటీన్ వద్దకు పిలిచి దాడి చేశారని, గురువారం ఉదయం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో సదరు ర్యాలీలో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు పాల్గొన్నారని, బయటి వ్యక్తులను ఎలా రానిస్తారంటూ ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల నడుమ మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు సంఘాల నాయకులు ఘర్షణ పడకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఏబీవీపీ నాయకులు అక్కడి కొన్ని జెండాలను తొలగించి దగ్ధం చేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన మఫ్టీ పోలీసును తోసేశారు. దీంతో అప్పటికే అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడి విద్యార్థులను జీపుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘర్షణకు కారమైన విద్యార్థి నాయకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కిషన్‌కుమార్ తెలిపారు. దాడిని ఖండిస్తూ ర్యాలీ... బుధవారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు యూనివర్సిటీలోని అన్ని కళాశాల ముందు నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్‌కు, ఓఎస్డీకి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా విద్యార్థులను నడుమ సఖ్యతను పెంచి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాల్సిన విద్యార్థి సంఘాల వ్యవహారాలను చూసే అధికారి పేరుతోనే విద్యార్థులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురు విద్యార్ధులు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతుండటం గమనార్హం. (క్లిక్: ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్) -
కూకట్ పల్లి పబ్ లో చీకటి గుట్టు రట్టు
-
KPHB: పబ్‌లో యువతుల అర్ధనగ్న నృత్యాలు
-
కూకట్పల్లి పబ్‌లో యువతుల అర్ధనగ్న నృత్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతోంది. దీంతో పబ్ నిర్వాహకులు ఇష్టారీతిలో రూల్స్‌ను బ్రేక్ చేస్తూ పబ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ‘సాక్షి’ నిఘాతో కబ్ల్ మస్తీ పబ్ చీకటి గుట్టు బయటలకు వచ్చింది. మరో పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో మంజీరా మెజిస్టిక్ కమర్షియల్‌లోని క్లబ్ మస్తీ పబ్‌లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా పబ్ యజమాన్యం పరిమితికి మించి డీజే సౌండ్‌తో పబ్ నడుపుతోంది. ఈ పోలీసుల దాడుల్లో భాగంగా పబ్‌లో 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పబ్ యజమాని శివప్రసాద్, మేనేజర్లు, కృష్ణ పరారీలో ఉన్నారు. ఇక, డీజే మిక్సర్, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకే పబ్ యాజమాన్యం అమ్మాయిలతో ఇలా అర్ధనగ్న నృత్యాలు చేపిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత -
‘మెదక్ కారు డెత్’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య
-
ఏఎస్సై మృతి: కిస్మత్పూర్లో విషాదం
కూకట్పల్లి (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అతివేగంగా కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై మహిపాల్‌రెడ్డి మంగళవారం మృతి చెందారు. గత శనివారం నిజాంపేట్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకువచ్చిన టాక్సీ కారు మహిపాల్‌రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్సకోసం ఆయన్ను కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న మహిపాల్‌రెడ్డి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాలు.. మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న కేపీహెచ్‌బీ ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ డ్రైవ్ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్.. పవన్‌తో కలిసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయలుదేరారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కుమార్ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు. కిస్మత్పూర్లో అంత్యక్రియలు: ఏఎస్ఐ మహిపాల్‌రెడ్డి మృతి చెందడంతో ఆయన స్వస్థలం కిస్మత్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిపాల్‌రెడ్డి కిడ్నీలు, లివర్‌ను అవయవదానం చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం కిస్మత్పూర్తోని ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. అంత్యక్రియల్లో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహిపాల్‌రెడ్డి భౌతికకాయానికి అడిషనల్ డీజీపీ సజ్జనార్ నివాళులర్పించారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామంటూ.. రూ.3 కోట్ల మోసం -
హైదరాబాద్: కేపిహెచ్బీలో అగ్నిప్రమాదం
-
కేపీహెచ్బీలో బ్యూటీషియన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ బ్యూటీషియన్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. అయిదో ఫేజ్‌లో నివాసం ఉంటున్న సత్య శిరీష గతంలో బ్యూటీపార్లర్ నిర్వహించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో దాన్ని ఆమె మూసివేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే బ్యూటీపార్లర్ బిజినెస్‌లో నష్టాలు రావడంతో శిరీష మనస్తాపంతో సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు శిరీష భర్త గోపాలకృష్ణ, బంధువులు చెబుతున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు. -
మెహరీన్ మెరుపు
-
ఇక్కడ మేము క్షేమమే బాబూ..
హైదరాబాద్: ఏపీలో రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు.. తెలంగాణలో నివశిస్తున్న సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికి పాకులాడడం సిగ్గుచేటని కూకట్‌పల్లికి చెందిన సీమాంధ్ర ప్రాంతవాసులు విమర్శించారు. సోమవారం సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో సీమాంధ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, విజయభాస్కర్, రంగమోహన్, నాగకుమార్, గోపీ, రవీంద్రనాధ్‌ఠాగూర్, ప్రియదర్శిని, పవన్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని మూడున్నర కోట్ల మంది ప్రజల సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో చిన్నాచితక ఐటీ కంపెనీపై పోలీసులు దాడులు చేస్తే సీమాంధ్రులపై దాడిగా చిత్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) గత 25–30 ఏళ్లుగా తాము తెలంగాణ ప్రాంతాంలో క్షేమంగా జీవిస్తున్నామని అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం సీమాంధ్ర ప్రజలను పావులుగా వాడుకోవద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను.. అక్కడి ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొవడం కోసం తప్పుడు దారులు వెతుక్కోవడం ద్వారా చంద్రబాబు తన వక్రబుద్ధిని చాటుకున్నాడని విమర్శించారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీ, అక్కడి మంత్రివర్గం మొత్తం ఆందోళన చెందడం చూస్తే ఏదో తప్పు జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) కాగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉందని, ఇక్కడి ప్రభుత్వం వెంటనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాపురాల్లో ‘కరక్కాయ’
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ప్రకటనను చూసి ఆకర్షితురాలైన కేపీహెచ్‌బీకి చెందిన అరుణ జీవితం నిజంగానే మారిపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే ఆశపడిన ఆమెకు ‘కరక్కాయల పొడి’ రూపంలో డబ్బు పోవడమే కాకుండా ఆమె కుటుంబంలో కలతలు రేపింది. రూ. వెయ్యితో కిలో కరక్కాయలు కొనుగోలు చేసి పొడి చేసి ఇస్తే రూ.1300 వస్తున్నట్లు తెలియడంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో దాదాపు 12 మంది అరుణ మాటలు విని కరక్కాయల పొడిలో పెట్టుబడి పెట్టారు. చివరకు సదరు కంపెనీ బిచాణా ఎత్తివేయడంతో డబ్బులు పోయిన బెంగలో ఉన్న ఆమెను బంధువుల మాటలు మరింత నొప్పించాయి. నీ కారణంగానే పెట్టుబడులు పెట్టామంటూ వారు గొడవకు దిగడంతో అరుణ, ఆమె భర్త మధ్య ఘర్షణకు దారి తీసింది. అరుణ ఒక్కరే కాదు..కరక్కాయల పొడి కేసులో మోసపోయిన దాదాపు 500 మంది మహిళల్లో 150 మంది మహిళల పరిస్థితి ఇదే. అయినవాళ్లే కదా వారూ లాభపడతారన్న ఉద్దేశంతో వీరు చెప్పిన మాటలు ఇప్పుడూ ఏకంగా వారిని బాధిస్తున్నాయి. ఓ వైపు డబ్బులు పోగా..మరోవైపు బంధువుల మాటలతో ఆవేదనకు లోనైన పలువురు మహిళలు సైబరాబాద్ పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీలు ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని ప్రచారం చేశారు. బేగంపేటలో కిలోకు కేవలం రూ.38కి కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్‌గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ 650 మందిని మోసగించిన నెల్లూరు జిల్లా అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జున ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంతో తమ డబ్బులు వస్తాయన్న ఆశతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఘటన నుంచైనా ప్రజలు మారాలని పోలీసులు కోరుతున్నారు. విద్యావంతులు సైతం ఈ మోసంలో చిక్కుకోవడం దారుణమని డబ్బుపై ఉన్న ఆశను వెల్లడిస్తోందని, దీనినే నేరగాళ్లు ఆసరాగా చేసుకొని టోపీ పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. సులువుగా డబ్బులు రావు... డబ్బులు సులభంగా సంపాదించేందుకు షార్ట్‌కట్ మార్గాలు ఉండవు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇస్తే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారంలో చాలా మంది మహిళలే బాధితులుగా ఉంటున్నారు. బంధువులను కూడా ఆయా స్కీమ్‌ల్లో చేర్పిస్తున్నందున కుంటుంబాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎంఎల్ఎం కంపెనీలు, పొంజి స్కీమ్‌లు, చిట్స్, డిపాజిట్ కంపెనీలు నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా వాటిని ఆదిలోనే అరికట్టవచ్చు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
కరక్కాయ స్కాం.. నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మల్లిఖార్జున్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 44 లక్షల రూపాయలతో పాటు కరక్కాయ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించింది విషయం తెలిసిందే. గతనెల 16న కేపీహెచ్‌బీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కరక్కయ పొడి చేసి ఇస్తే అధిక మొత్తం చెల్లిస్తామంటూ దగా చేసిన నిందితులు కోట్ల రూపాయలను దండుకున్న విషయం తెలిసిందే. ఈ స్కాంలో 10 కోట్లకు పైగా మోసం జరిగిందని సీపీ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. -
కత్తి మహేష్‌పై ఫిర్యాదులు
సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ కోరింది. ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు. న్యూస్ ఛానల్ డిబేట్లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్‌కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్‌పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోనూ ఫిర్యాదు కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
కేపీహెచ్బీలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
-
కూకట్‌పల్లిలో కలకలం.. ఏటీఎం పేల్చివేత
సాక్షి, హైదరాబాద్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పదార్థాల సహాయంతో ఏటీఎం సెంటర్లో రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్‌ను పేల్చివేసి ఓ లేఖను వదిలి వెళ్లిన సంఘటన ఆదివారం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ కుషాల్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మొహానికి రుమాలు కట్టుకుని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్ 1లో ఓవర్సీస్ బ్యాంక్ ఏటిఎంలో ప్రవేశించిన ఓ యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పేలుడు పదార్ధాలు, విద్యుత్ తీగల సహాయంతో ఏటిఎం మిషన్‌లోని రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్‌ను పేల్చివేశాడు. అనంతరం తనతో పాటు తీసుకువచ్చిన లేఖను అక్కడే వదిలివేసి వెళ్లి పోయాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలకు పరిష్కార మార్గాలు సూచించాడు. తన లేఖలోని అంశాలను ప్రచారంలోకి తీసుకురాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. స్వల్పంగా యంత్రం దగ్ధమైనప్పటికి ఎలాంటి నష్టం జరగలేదని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందు కు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన లేఖను 24 గంటల్లోపు మీడియాలో ప్రచారం చేయాలని లేనిపక్షంలో ఆత్మహత్యకు పాల్పడతానని పేర్కొనడం గమనార్హం. -
కూకట్‌పల్లిలో దారుణం
భాగ్యనగర్‌కాలనీ: వివాహేతర సంబంధం కారణంగా మహిళ దారుణ హత్యకు గురైన సంఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె ప్రియుడు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కూకట్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బి రోడ్డునెంబర్ 2లో అంజిరెడ్డి, ప్రత్యూష రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. అంజిరెడ్డి వ్యాపారం నిమిత్తం గత ఏడాది శ్రీలంక వెళ్లాడు. ఈ సమయంలో ప్రత్యూష తన స్నేహితుడు శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అంజిరెడ్డి.. శ్రీనివాస్‌ను ఇంటికి రానివ్వకపోవటమే కాకుండా గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే శ్రీనివాస్ మూడునెలల క్రితం బాలాజీనగర్‌లోని ఓ అపార్టుమెంట్లో పెంట్ హౌస్‌లో అద్దెకు దిగాడు. ఇటీవల అంజి రెడ్డి శ్రీలంక వెళ్లడంతో శ్రీనివాస్, ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి ఇంటి యజమానికి భార్యగా పరిచయం చేశాడు. ఇటీవల ప్రత్యూష పుట్టింటికి వెళ్లి కూతురిని అక్కడే వదిలేసి గత శుక్రవారం బాలాజీనగర్‌లోని శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇదిలా వుండగా శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన శ్రీనివాస్ తిరిగిరాకపోగా, సోమవారం అతని ఫ్లాట్‌లోంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన ఇంటి యజమాని కిటికీలు తెరిచి చూడగా ప్రత్యూష చనిపోయి వుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరీరమంతా కత్తి పోట్లు ఉండటం, మృతదేహం పక్కనే కత్తి ఉండటంతో శ్రీనివాసే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చేపట్టారు. -
పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి
హైదరాబాద్‌సిటీ: పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఇద్దరు పేకాటరాయుళ్లు భవనంపై నుంచి దూకారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వేకువజామున చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలు..గురువారం వేకువజామున ఒంటి గంట సమయంలో ఓ ఇంటి రెండో అంతస్తులో శబ్దం రావడంతో పాటు లైట్లు ఆన్ చేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి తలుపుతట్టారు. దీంతో కంగారు పడిపోయిన ఇద్దరు పేకాట రాయుళ్లు తప్పించుకోబోయి వెనకవైపు బాల్కనీలోకి వెళ్లారు. మరో బాల్కనీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ కిందపడిపోయారు. ఇద్దరిని పోలీసులు దగ్గరలోని అనుపమా ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ శ్రీనివాస్(36) అనే వ్యక్తి మృతిచెందారు. ఇద్దరిదీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మామిడిపల్లి గ్రామం. స్థానికంగా ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.