హైదరాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి బాలిక మృతిచెందిన సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నందిని(10) రెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు కావడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. మధుకాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.