బహరగోరా: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ నేపధ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తరచూ జార్ఖండ్‌లో పర్యటనలు సాగిస్తున్నారు.
తాజాగా ఆయన జార్ఖండ్‌లోని బహరగోరా చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బురద గుంతలో కూరుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన భద్రతా సిబ్బంది కారు చుట్టూ నిలబడి, కారును గొయ్యి నుంచి బయటకు తీయడాన్ని చూడవచ్చు.
#WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K
— ANI (@ANI) September 23, 2024
ఇంతటి వర్షం మధ్యనే బహారగోరాలో జరిగిన బహిరంగ సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘మేఘాలు గర్జిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూస్తుంటే జార్ఖండ్‌లో చీకటి పోతుందని, సూర్యుడు ఉదయిస్తాడని, కమలం వికసిస్తుందని, మార్పు వస్తుందని నేను చెప్పగలను. జార్ఖండ్‌లోని మట్టిని, ఆడబిడ్డలను కాపాడుకుంటామని భారతీయ జనతా పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: యూపీలో ఎన్‌కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం
Comments
Please login to add a commentAdd a comment