ప్రభుత్వం,వ్యాపారాలు, మీడియా, స్వచ్ఛంద సంస్థల పట్లప్రజల్లో నమ్మకంపై సర్వే
ఎడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ ర్యాంకింగ్స్ విడుదల
3వ స్థానానికి పడిపోయిన భారత్
మొదటి స్థానంలోచైనా
అధిక ఆదాయం దేశాల్లోనే..
భారత్ ప్రధాన కేంద్రంగా ఇతర దేశాలు కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలపట్ల ప్రజల విశ్వాసంలో మన దేశం 13వ స్థానానికి పరిమితమైంది. ఈ విషయంలో కెనడా టాప్‌లో నిలిచింది. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, మీడియా, స్వచ్ఛంద సంస్థల పట్ల అధిక ఆదాయ దేశాల్లో సగటున 61 శాతం, అల్పాదాయ దేశాల్లో సగటున 48 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక అల్పాదాయ దేశాల్లో వ్యాపార సంస్థల పట్ల ప్రజలు తటస్థంగా ఉన్నారు. ఎన్‌జీవోలు, ప్రభుత్వం, మీడియా విషయంలో భరోసా లేదని చెప్పారు. తక్కువ ఆదాయం ఉన్న జనాభాలో భారతీయ సంస్థల పట్ల విశ్వాసం 65 శాతం ఉంటే, అధిక ఆదాయ వ్యక్తుల విషయంలో ఇది 80 శాతంగా ఉంది.
చాలా దేశాల్లో ఎన్నికలు లేదా ప్రభుత్వ మార్పుల ప్రభావం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. ఏదైనా వార్త విషయంలో విశ్వసనీయ సమాచారమా లేదా మోసగిస్తున్నారా అన్నది తేల్చుకోలేకపోతున్నట్టు 63 శాతం మంది చెప్పారు. ఈ అభిప్రాయాన్ని థాయ్‌లాండ్‌లో 75 శాతం మంది, భారత్‌లో 72 శాతం మంది వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment