pit
-
బురద గోతిలో దిగబడిన శివరాజ్‌సింగ్ కారు
బహరగోరా: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ నేపధ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తరచూ జార్ఖండ్‌లో పర్యటనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన జార్ఖండ్‌లోని బహరగోరా చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బురద గుంతలో కూరుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన భద్రతా సిబ్బంది కారు చుట్టూ నిలబడి, కారును గొయ్యి నుంచి బయటకు తీయడాన్ని చూడవచ్చు. #WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K— ANI (@ANI) September 23, 2024ఇంతటి వర్షం మధ్యనే బహారగోరాలో జరిగిన బహిరంగ సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘మేఘాలు గర్జిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూస్తుంటే జార్ఖండ్‌లో చీకటి పోతుందని, సూర్యుడు ఉదయిస్తాడని, కమలం వికసిస్తుందని, మార్పు వస్తుందని నేను చెప్పగలను. జార్ఖండ్‌లోని మట్టిని, ఆడబిడ్డలను కాపాడుకుంటామని భారతీయ జనతా పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
ఎండల ఎఫెక్ట్.. నీటి కోసం వచ్చి గుంటలో పడ్డ ఏనుగు
చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్‌ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు -
కుక్కను కాపాడిన జేబీసీ.. కుక్క తెలివికి ఫిదా
-
విషాదం: ప్రాణం తీసిన పిల్లర్ గుంత
సాక్షి, బంజారాహిల్స్: పిల్లర్‌కోసం తీసిన గుంత బాలుడి ప్రాణం బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు గుంత వరదనీటితో నిండిపోవడంతో పొరపాటున అందులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా కంచిరాపల్లి తండాకు చెందిన గోపాల్, మోనిక దంపతులు కూలిపనులు చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల చిన్న కుమారుడు మూడవత్ సిద్దు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నాడు. బస్తీని ఆనుకొని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ కాలనీలో పరుచూరి రవీంద్రనాథ్ అనే వ్యక్తి భవన నిర్మాణం చేపట్టాడు. భవన బిల్డర్ నారాయణరావు గత రెండేళ్ల నుంచి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా పలు గుంతలు తీశారు. ఇటీవలి వర్షాలకు ఆ గుంతలు వరదనీటితో నిండిపోయాయి. లిప్ట్ కోసం తీసిన భారీ గుంత కూడా వరద నీటితో నిండిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన సిద్దు ఆ గుంతలో పడిపోయాడు. గంట సేపు గడిచినా కొడుకు కనిపించకపోడంతో తల్లి మోనిక అన్ని ప్రాంతాలు గాలిస్తూ నిర్మాణంలో ఉన్న ఖాళీ ప్లాట్‌లోకి వెళ్లి వెతికింది. ఓ గుంతలో కొడుకు విగత జీవిగా నీళ్లపై కనిపించాడు. బాలుడి మృతితో బస్తీవాసులు విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోడకూలి బాలిక మృతి అబిడ్స్: మంగళ్‌హాట్ ఆర్కేపేట్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత గోడ కూలి ఐదేళ్ల బాలిక మృతిచెందింది. ఆర్కేపేట్లో నివా సం ఉంటున్న ఇమ్రాన్ ఇల్లు ఓ వైపు గోడ కూలడంతో అతని కుమార్తె ఆదిబా(5) మృతి చెందింది. దీంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబ ఫసియుద్దీన్, మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీ సింగ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రియురాలిని మరువలేక.. నాగోలు: ప్రేమించిన యువతిని మరిచిపోలేక ఓ ఆర్ఎంపీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం, ఎల్లాపురం గ్రామానికి చెందిన దున్నా ఉదయ్‌కుమార్ (27) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని ఓ లాడ్జిలో దిగాడు. శనివారం మధ్యాహ్నం వరకు గదిలో నుంచి బయటకు రాలేదు. లాడ్జి సిబ్బంది తలుపుకొట్టినప్పటికీ స్పందించలేదు. దీంతో వారు ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచిచూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు కట్టిన నైలాన్‌తాడుకు ఉదయ్‌కుమార్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహానికి ముందే ఓ యువతిని ప్రేమించానని, ఆ యువతిని మరిచిపోలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నానని అందులో పేర్కొన్నాడు విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఉప్పల్: సెల్లార్లో నిండిన వరద నీటిని తోడటానికి మోటార్ పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘానికి గురైన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..చిలుకానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వద్ద గల జోగు శ్రీనివాస్(45) మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిసెల్లార్ నిండిపోయింది. దీంతో శ్రీనివాస్ సెల్లార్ నీటిని తోడటానికి మోటార్‌ను బిగించి స్విచ్ ఆన్ చేశాడు. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
రాకాసి గుంత... ఇద్దరిని మింగేసింది..
బూర్గంపాడు: సీతారామ ప్రాజెక్ట్ కాలువ పనుల కోసం తవ్విన గుంత ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇటీవలి వర్షాలకు ఈ నీటి గుంతలో నీరు చేరింది. శనివారం పాఠశాలలకు సెలవు కావటంతో గేదెలను సరదాగా మేపేందుకు ఆ కాలువ వైపు వెళ్లిన ఇద్దరు పిల్లలను ఆ నీటి గుంత అమాంతం మింగేసింది. మండలంలోని జింకలగూడెం గ్రామ సమీపంలోగల సీతారామ ప్రాజెక్ట్ కాలువల వద్ద ఇది జరిగింది. మండలంలోని మోరంపల్లిబంజర గ్రామాని కి చెందిన గంటా భార్గవ్(10), అతని సమీప బంధువైన దుబ్బాల సుధీర్(18) కలిసి జింకలగూడెం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కాలువ వద్దనున్న తమ పొలానికి గేదెలతోపాటు శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం వేళ అటుగా వెళ్తున్న స్థానికులు.. ఆ గుంత పక్కన రెండు జతలు చెప్పులు, పశువుల అదిలించేందు కు ఉపయోగించే కర్రలు ఉండటాన్ని గమనించా రు. గుంతలోకి నిశితంగా పరిశీలించారు. అందు లో ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా గమనించారు. వారిచ్చిన సమాచారంతో గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. గుంత నుంచి ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. వారిని మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన గంటా రమేష్–సావిత్రి దంపతుల కుమారుడు భార్గవ్(10), వారి సమీప బంధువు దుబ్బాల సుధీర్(18)గా గుర్తించారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో భార్గవ్ ఐదవ తరగతి చదువుతున్నాడు. రమేష్ సోదరి కుమారుడైన దుబ్బాల సుధీర్ ది క్రిష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని రమనాగుపేట గ్రామం. దుబ్బాల మంగళాద్రి–ఉమ దంపతులు రెండవ కుమారుడైన సుధీర్, చిన్నత నం నుంచి మోరంపల్లిబంజరలోని అమ్మమ్మ ఇం ట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం పాల్వంచలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. శనివారం భార్గవ్, సుధీర్ కలిసి పొలానికి వెళ్లి గుంతలో ప్రాణాలు కోల్పోయారు. ఎలా జరుగిందో... ‘ఆ నీటిగుంతలో ముందుగా భార్గవ్ జారిపడి ఉంటాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో సుధీర్ కూడా గుంతలో పడిపోయుంటాడు. సుధీర్ ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ ఉంది. దీనిని బట్టి, భార్గవ్‌ను రక్షించేందుకు వెంటనే గుంతలోకి వెళ్లి ఉంటాడని అర్థమవుతోంది’ అని, స్థానికులు భావి స్తున్నారు. భార్గవ్, సుధీర్ కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మృతితో మోరంపల్లి బంజరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదస్థలాన్ని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, స్థానిక ఎస్ఐ సంతోష్ పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మున్నేరులో వ్యక్తి గల్లంతు ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాల వద్ద మున్నేటిలో శనివారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. రామన్నపేటకు చెందిన ఆరెంపుల నాగయ్య(47), తాపీ కార్మికుడు. తోటి కార్మికులతోపాటు శుక్రవారం మంగళగూడెంలో పనికి వెళ్లాడు. అక్కడే బాగా పొద్దుపోయింది. వర్షం కూడా పడుతోంది. దీంతో ఆ రాత్రి మంగళగూడెంలోనే ఉన్నాడు. శనివారం ఉదయం రామన్నపేటకు బయలుదేరాడు. తీర్ధాల వద్ద మున్నేటిపై నిర్మిస్తున్న రోడ్ కం బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. మున్నేటిలో దిగి కామంచికల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో మున్నేటికి ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. నాగయ్య కోసం గాలింపు సాగుతోంది. ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
దులుపుకుంటే పోతుంది
ఎన్ని విధాలుగా కూడా గాడిద బయటికి వచ్చే మార్గం కనబడలేదు. ఇక దాన్ని తీయలేక, అలాగని వదిలేయలేక– అలాగే ప్రాణాలతో పూడ్చిపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఒక ఊళ్లో ఒకాయనకు గాడిదే సర్వస్వం. దాని మీద మోసుకొచ్చే సరుకులతోనే అతడి జీవితం గడిచిపోయేది. అట్లానే ఒక పనిమీద ఆయన గాడిదను తోలుకొని పొరుగూరు వెళ్లాడు. దానికోసం ఒక చిట్టడవిని దాటాలి. అలా వెళ్తుండగా, ఒక చోట ప్రమాదవశాత్తూ ఒక పెద్ద గుంతలో పడిపోయిందా గాడిద. దాన్ని బయటికి తీయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు యజమాని. చెట్టు కొమ్మలను విరిచేశాడు, దాని ఆసరాగా ఎక్కొస్తుందని. తాడు పేని లాగడానికి యత్నించాడు. ఎన్ని విధాలుగా కూడా గాడిద బయటికి వచ్చే మార్గం కనబడలేదు. ఇక దాన్ని తీయలేక, అలాగని వదిలేయలేక– అలాగే ప్రాణాలతో పూడ్చిపెట్టడానికి సిద్ధమయ్యాడు. మట్టిని గుంతలో నింపడం మొదలుపెట్టాడు. మీద పడిన మట్టిని దులుపుకుంటూ గాడిద కొంచెం పైకి వచ్చింది. ఆయన మరింత మట్టిని పోస్తూనేవున్నాడు. గాడిద దాన్ని దులిపేసుకుంటూ మరికొంత పైకి వస్తూనేవుంది. ఎంత మట్టి పోస్తుంటే అంత పైకి రాసాగింది. సాయంత్రంకల్లా పూర్తిగా బయటకు వచ్చేసి ఆబగా గడ్డిని మేయసాగింది. దాన్నే చూసుకుంటూ కూర్చున్న యజమాని మనసులో అనుకున్నాడు: ‘నేను ఎంత పొరపాటుగా ఆలోచించాను! కష్టమొచ్చిందని దాన్ని నేను పాతేయబోయాను. కానీ అదే కష్టాన్ని దులిపేసుకుంటూ అది పైకి వచ్చేసింది. ఈ పాఠాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను’. నెమ్మదిగా వెళ్లి, గాడిదను ప్రేమగా నిమరసాగాడు. -
అంబా... గొయ్యి తీసి వదిలేశారేమయ్యా!
ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో స్థానిక దూర్గదేవి ఆలయ సమీపంలో మరుగుదొడ్డి కోసం తీసిన గోతిలో ఓ ఆవు పడిపోయి పైకి రాలేక అరుస్తూ సుమారు మూడు గంటలపాటు నరకయాతన పడింది. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గోతిలో నుంచి ఆవు అరుపులు విని దగ్గరకు వెళ్లి చూశారు. పైకి వచ్చేందుకు ఆవు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. దీంతో స్థానికులు తాళ్లను తీసుకు వచ్చి గంటకుపైగా శ్రమించి అతికష్టం మీద ఆవును బయటకు తీశారు. చిన్నచిన్న గాయలతో ఆవు ఉండడం బయటకు వచ్చిన వెంటనే కన్నీరు కారుస్తుండడం స్థానికులను ఒక్కింత అవేదనకు గురి చేసింది. మరుగుదొడ్ల కోసం తీసే గోతులపై పైకప్పులు ఏర్పాటు చేయాలని, ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మూగజీవులతో పాటు చిన్నరులు సైతం గోతుల్లో పడి గాయాలు పాలు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని స్థానికులు అంటున్నారు. -
ఆవును రక్షించిన ముస్లింలు
లక్నో: గో మాంసం కోసం ఆవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానాలపై అమాయకులను కొట్టి చంపుతున్న నేటి సమాజంలో ఆపదలో చిక్కుకున్న ఓ ఆవును ముస్లింలు రక్షించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా, బిలారి గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. బిలారి గ్రామంలోని ఓ స్మశానంలోకి రెండు రోజుల క్రితం ప్రవేశించిన ఓ ఆవు ప్రమాదవశాత్తు అందులో ఉన్న ఓ గుంతలో పడిపోయింది. బయటకు వచ్చే దారిలేక బాధపడుతుంటే గమనించిన ముస్లిం యువకులు తమ పెద్దలకు చెప్పారు. వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తాళ్లు తీసుకొచ్చి ఆవుకు కట్టారు. అప్పటికే దాని నోరు ఎండిపోవడంతో నీళ్లు తెచ్చి తాపించారు. అనంతరం దాన్ని వెలుపలికి తీశారు. గ్రామస్థులు వారి మానవత్వానికి ప్రశంసించారు. -
బాలుడిని మింగిన కుళాయి గుంత
– ఆడుకుంటూ గుంతలో పడిపోయిన బాలుడు - శోకసంద్రంలో కుటంబసభ్యులు బోయ రామాంజనేయు, జయలక్ష్మి దంపతులకు ఒకే ఒక సంతానం. ఆ బిడ్డకు రెండేళ్లు. వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.తాము కష్టపడి బిడ్డను బాగా చదివించాలని కలలుగన్నారు. అయితే, విధి చిన్నచూపుచూసిందని కుళాయిగుంత రూపంలో తమ ఆశల దీపాన్ని ఆర్పేస్తుందని వారు ఊహించలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సోగనూరు గ్రామానికి బోయ రామాంజనేయులు పట్టణంలో హమాలీ. భార్య జయలక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. ఈ దంపతులకు వివాహమైన రెండేళ్లకు మొదటి సంతానంగా బాబు పుట్టాడు. వాడికి ధనుంజనేయులు(2)అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఎప్పటిలాగే రామంజనేయులు ఉదయం పనికి పోయాడు. తల్లి వద్ద ఉన్న ధనుంజయులు ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. పక్కన ఉన్న కుళాయి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అందులో నీళ్లు ఉండటంతో మునిగిపోయాడు. కొద్దిసేపటికి కుళాయి నీటి కోసం వచ్చిన మహిళ నీటిలో మునిగి ఉన్న చిన్నారిని చూసి కేకలు వేసింది. వెంటనే చిన్నారి తల్లి, ఇరుగుపొరుగువారు వచ్చి గుంతలో నుంచి బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్నాడేమోననే ఆశతో కుటుంబ సభ్యులు స్కూటర్‌పై పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కుళాయి గుంతలో పడి ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుళాయిలకు వాల్ ఏర్పాటు చేయకపోవడంతోనే.. గుంతల్లో ఏర్పాటు చేస్తున్న మంచినీటి కుళాయిలకు వాల్స్ అమర్చడం అధికారులు మరచిపోతున్నారు. దీంతో నీరు వృథాగా పోయి గుంత నిండిపోతుంది. సోగనూరులో జరిగిందీదే. అదే వాల్ ఉండి ఉంటే గుంతలో నీళ్లు ఆగేవి కావు..చిన్నారి ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనికంతటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. -
మెట్రో పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి
హైదరాబాద్ : మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నగరంలోని పాత గాంధీ ఆస్పత్రి సమీపంలో మెట్రో పిల్లర్ కోసం తీసిన గుంటలో నీరు నిండటంతో.. ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మెట్రో పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి
-
వివాహితను మింగిన ఇంకుడుగుంత
దుస్తులు ఉతుకుతుండగా ప్రమాదం ధారూరు: ఓ వివాహిత దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి దుర్మరణం చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని దోర్నాల్ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోర్నాల్ గ్రామానికి చెందిన తానెం సాయిలు తన పెద్దకూతురు దేవమ్మ (24)కు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, ఆమె ఆదివారం తన పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన కూలీ జోగు అంజమ్మతో కలిసి వెళ్లింది. వీళ్లు తమతో పాటు ఉతికేందుకు దుస్తులు తీసుకెళ్లారు. ముందుగా, పొలం పక్కనే ఇటీవల తవ్విన ఇంకుడు గుంతలో ఇద్దరూ కలిసి దుస్తులు ఉతుకుతున్నారు. దేవమ్మ కూర్చున్న బండరాయి పట్టుతప్పి గుంతలో పడిపోయింది. దేవమ్మ నీటిలో పడడంతో పక్కనే ఉన్న అంజమ్మ బిగ్గరగా కేకలు వేసింది. సమీప పొలంలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు వెంటనే అక్కడికి వచ్చి దేవమ్మను బయటకు తీయగానే కొద్దిసేపటికి ఆమె ప్రాణం విడిచింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ కావలి రాములు ఎస్ఐ షంషొద్దీన్కు సమాచారం ఇవ్వడంతో ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకుడు గుంతలో పడి మహిళ మృతి
ధారూర్(రంగారెడ్డి): ఇంకుడు గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం డోర్నాల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవమ్మ(25) ఇంటి ముందు పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి ఇంకుడు గుంతలో పడింది. ఆమెకు ఈత రాకపోవడంతో.. నీట మునిగి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుంతలో పడ్డ గున్న ఏనుగు
-
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
హనుమంతునిపాడు: ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం గాయంవారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మేడిబోయిన పౌర్ణమి(3) ప్రమాదవశాత్తు ఇంకుడుగుంతలో జారిపడి మునిగిపోయింది. కుటుంబసభ్యులెవరూ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఊపిరాడక చనిపోయింది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
జనావాసాల్లో జింక
నల్లగొండ: నూతన భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి జింకకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని తిరుమల థియేటర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. సమీపంలోని లతీఫ్ షావలి గుట్టపై సంచరిస్తున్న జింకను కుక్కలు తరమడంతో.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడింది. ఇది గుర్తించిన స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంటలో పడిన జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి
హైదరాబాద్ : పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి బాలిక మృతిచెందిన సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నందిని(10) రెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు కావడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. మధుకాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.