అంబా... గొయ్యి తీసి వదిలేశారేమయ్యా! | cow slipped in toilet pit | Sakshi
Sakshi News home page

అంబా... గొయ్యి తీసి వదిలేశారేమయ్యా!

Published Mon, Jan 22 2018 7:57 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

cow slipped in toilet pit - Sakshi

మరుగుదొడ్డి గోతిలో పడి ఉన్న ఆవు ,ఆవును బయటికి తీస్తున్న స్థానికులు

ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో స్థానిక దూర్గదేవి ఆలయ సమీపంలో మరుగుదొడ్డి కోసం తీసిన గోతిలో ఓ ఆవు పడిపోయి పైకి రాలేక అరుస్తూ సుమారు మూడు గంటలపాటు నరకయాతన పడింది. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గోతిలో నుంచి ఆవు అరుపులు విని దగ్గరకు వెళ్లి చూశారు.  పైకి వచ్చేందుకు ఆవు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. దీంతో స్థానికులు తాళ్లను తీసుకు వచ్చి గంటకుపైగా శ్రమించి అతికష్టం మీద ఆవును బయటకు తీశారు. చిన్నచిన్న గాయలతో ఆవు ఉండడం బయటకు వచ్చిన వెంటనే కన్నీరు కారుస్తుండడం స్థానికులను ఒక్కింత అవేదనకు గురి చేసింది.  మరుగుదొడ్ల కోసం తీసే గోతులపై పైకప్పులు ఏర్పాటు చేయాలని, ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మూగజీవులతో పాటు చిన్నరులు సైతం గోతుల్లో పడి గాయాలు పాలు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని స్థానికులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement