cow
-
ఆవును హతమార్చిన పెద్దపులి
నార్నూర్: మండలంలో ని చోర్గావ్ గ్రా మ శివారులో సోమవారం సాయంత్రం తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం ఉట్నూర్ చిన్నునా యక్ తండా, హస్నాపూర్, చాందోరి మీదుగా మండలంలోని గుంజాల శివారుకు చేరుకున్న పెద్దపులి మధ్యాహ్నం నుంచి అదే ప్రాంతంలో తలదాచుకుంది. రాత్రి జైనూర్ లేదా బేల మీదుగా వెళ్లిపోతుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం గుంజాల వద్ద ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రం చోర్గావ్ శివారులో ఆవుపై దాడి చేసి బాబేఝరి వైపు మళ్లిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
మేయని ఆవుకు హోమియో చికిత్స
ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్‌లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం. పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్‌తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది. పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు. – డాక్టర్. జి.రాంబాబు (94945 88885),పశువైధ్యాధికారి, కడప -
పిచ్చెక్కి దాడి చేసిన ఆవు
ఎడపల్లి (బోధన్): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో పిచ్చెక్కిన ఆవు స్వైర విహారం చేసి 13 మందిని గాయపరిచింది. గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక ఆవును కుక్కలు కరిచాయి. ఈ క్రమంలో మతిస్థిమితం తప్పిన ఆవు.. గురువారం ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ పలువురిపై దాడి చేసి గాయపరిచింది. సాయంత్రం ఆటోపై దాడి చేయడంతో అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. ఆవు సైతం గాయపడి మృతి చెందింది. సమాచా రం అందుకున్న ఎస్ఐ వంశీచందర్ రెడ్డి గ్రామానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ సిబ్బంది ఆవును పరీక్షించి కళేబరాన్ని తరలించారు. -
గో హంతకునిపై పోలీసుల కాల్పులు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్‌లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అన్వర్ నగర్, కృష్ణ నగర్లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
ఆవురా... ఎంత క్రమశిక్షణ!
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్‌ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్‌లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్‌తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
అత్యంత రమణీయంగా గోమాత కళ్యాణం.. స్వయంవరంతో ఒక్కటాయెనె..
కాకినాడ రూరల్: కల్యాణం... కమనీయమంటారు పెద్దలు. పచ్చని పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాలు, భాజా భజంత్రీలు, కన్యాదానం, మాంగళ్యధారణ ఇలా... వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కలకాలం గుర్తుండిపోతుంది. అయితే అన్నింటి కంటే భిన్నంగా సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపం గోమాత కల్యాణం జరిగితే అది మధురానుభూతే. గోమాత సారణ కల్యాణోత్సవం ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల ఆసుపత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు తమ పెంపుడు గోవు సారణకు స్వయంవరం ప్రకటించారు. దీంతో ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద కొండ తిమ్మాపురంలోని నాడీపతి గోశాల ఆవరణలోని 89 నందీశ్వరులు (గిత్తలు)ను తొలుత ఎంపిక చేశారు. వాటి నుంచి 24కు కుదించారు. మళ్లీ ఇందులో 16ను ఎంపిక చేయగా స్వయంవరంలో 10 గిత్తలు పాల్గొన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు గిత్తలు ఉండడం విశేషం. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తొలుత డాక్టర్ గౌరీశేఖర్, రమాదేవి దంపతులతో విఘ్నేశ్వర, గౌరీ పూజలు జరిపించారు. అనంతరం స్వయంవరం ప్రకటించగా భైరవ, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు, షణ్ముఖ కన్నయ్య తదితర పేర్లతో పిలిచే నందీశ్వరులను ప్రవేశపెట్టారు. డాక్టర్ గౌరీశేఖర్ వధువు సారణను తీసుకువచ్చి స్వయంవరంలో నందులు వద్ద ఉంచగా వాటిని పరీక్షించి మధ్యలో ఉన్న షణ్ముఖ కన్నయ్యను ఎంపిక చేసుకుంది. షణ్ముఖ కన్నయ్య తరఫున తల్లిదండ్రులుగా పాకలపాటి నారాయణరాజు, సీతాదేవి వివాహ వేడుకను జరిపించారు. వరుడు కాళ్లను డాక్టరు గౌరీశేఖర్ దంపతులు కడిగి వివాహం జరిపించారు. అత్యంత రమణీయంగా జరిగిన వేడుకను భారీగా తరలివచ్చిన ప్రజలు తిలకించారు. గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపమని, ఎక్కడ గోపూజలు జరుగుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యా«తి్మక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువు అన్నారు. ఈ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోమాత కల్యాణోత్సవం తలపెట్టిన డాక్టర్ గౌరీశేఖర్ దంపతులు అభినందనీయులన్నారు. నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంవరం ద్వారా గోమాత కల్యాణోత్సవం అరుదు అన్నారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ తాను సారణను దత్తత తీసుకుని కూతురుగా భావించి ఇప్పుడు కల్యాణోత్సవం జరిపించామన్నారు. ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గోమాతకు స్వయంవరం ప్రకటించిన వైద్యుడు
కాకినాడ రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న గో మాత పేరు సారణ. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్ గారాల పట్టి. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా.. వారి కంటే ఎక్కువ ప్రేమను సారణపై చూపుతారు. సరిగ్గా 20 నెలల కిత్రం అనగా 2022జనవరి 22న సారణకు బారసాల, ఊయల వేడుకను శాస్తోక్తంగా నిర్వహించి సారణగా నామకరణం చేశారు. అప్పట్లో మీడియాలో గోమాతకు బారసాల పెద్ద వైరల్ అయ్యింది. ఇప్పుడు 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఉదయం 9గంటలకు నుంచి స్వయంవరం ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలలోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు. ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 నందీశ్వరులను వరుసలో ఉంచగా వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. తరువాత ఫంక్షన్ హాలులో వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్తోక్తంగా కల్యాణం జరుపుతారని డాక్టరు గౌరీశేఖర్ తెలిపారు. -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కౌ క్లాత్ స్టోర్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఓ క్లాత్స్టోర్కు గత ఏడు సంవత్సరాలుగా చంద్రమణి డైలీ విజిటర్. అయితే చంద్రమణి అనేది మహిళ పేరు కాదు. ఒక ఆవు పేరు. చంద్రమణి రోజూ క్లాత్స్టోర్లోకి వచ్చి కాసేపు ఉండి పోతుంది. క్లాత్‌స్టోర్ యజమాని పదమ్ డాక్లియా ఎప్పుడూ ఆవును విసుక్కోలేదు. పైగా భక్తిభావంతో పూజిస్తాడు. వస్త్ర దుకాణానికి వచ్చే కొనుగోలుదారులకు ఈ ఆవు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ‘మహాలక్ష్మి క్లాత్ స్టోర్’ అనే పేరు కాస్త ‘కౌ క్లాత్ స్టోర్’గా మారింది. -
ప్రస్తుతం దేశంలో 26 శాతం విదేశీ జాతుల ఆవులే
-
పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది?
-
ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా..
రెండు విరుద్ధ జంతువులు ఎదురుపడితే కాసేపు కోట్లాడుకుంటాయి. లేదా తప్పుకోవడమో చేస్తాయి. ఔనా! అదికూడా కాదు అంటే..వాటిలో ఒకటి కాస్త ప్రమాదమైంది అయితే మరోకటి అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నిస్తుంది. ఇది కామన్. కానీ ఇక్కడ అలా ఇలా కాకుండా ప్రకృతికే విరుద్ధంగా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నో డౌట్!.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాక్ అవ్వుతారు. ఆ వీడియోలో ఓ పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది? అనిపిస్తుంది. అవి అసలు ఎలా ఉన్నాయంటే..ఆ రెండు చాలా అన్యోన్యంగా ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా ఉంటాయి. పైగా ఏ మాత్రం దాడి చేసుకోకుండా చాలా సఖ్యంగా ఉంటాయి. చూస్తున్నంత సేపు మనకేమో ఆ పాము ఎక్కడ ఆవుపై దాడి చేస్తుందో అని టెన్షన్ పడిపోతుంటాం. కానీ ఆ పాము దానికి సహకరిస్తున్నట్లుగా ఏం చేయదు. పైగా ఆవుతో సరదాగా ఉంటుంది ఆ పాము. దీన్ని 'వివరించడం చాలా కష్టం', ఆ రెండింటి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబోలు అని సదరు అధికారి సుశాంత నంద ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు కూడా వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: సముద్రగర్భంలో సంగీత కచేర!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!) -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆవు మొదలుకొని ఆడ కుక్క వరకూ.. ఇలా పలు జంతువులపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చిన ఒక వృద్దుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో గుజైనీ నివాసి విజేంద్ర మిశ్రా(62)ను అరెస్టు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితునిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా నిందితునిపై గతంలోనూ పలు నేరారోపణలు వచ్చాయని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి మాట్లాడుతూ పోలీసులు తమ దర్యాప్తులో పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారని, వాటిలో మిశ్రా బహిరంగ ప్రదేశాల్లో వివిధ జంతువులతో లైంగిక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమయ్యిందన్నారు. మిశ్రా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని, అతనిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించామన్నారు. దీనికిముందు బులంద్షహర్లోనూ ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 65 ఏళ్లవృద్దుడు పెంపుడు కుక్కతో లైంగిక చర్య జరిపాడు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ శునకం యజమాని ప్రేమ్‌చంద్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వృద్దుడుని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది కూడా చదవండి: అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే.. -
‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి..
ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్ ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్‌చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం అక్బర్ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్లో కూర్చోబెట్టారు. 2022 నాటి ఉదంతంలో.. రూధౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎథర్ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. జైలుకు వెళ్లిన భార్య ఈ ఉదంతంలో అక్బర్ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు! -
నెల్లూరు జాతి ఆవు @ రూ. 35 కోట్లు!
ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్‌లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది. బ్రెజిల్‌లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్‌కు రూ. 4 లక్షలు పలుకుతోంది. నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ... ♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. ♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు. ♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు. ♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు. ♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే..
గుజరాత్: ఒక రైతు సింహం బారి నుండి తన ఆవును రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. చివరకు ఎలాగోలా సింహాన్ని భయపెట్టి గంగిగోవును కాపాడుకున్నాడు. గుజరాత్ లోని గిర్ సోమ్ నాట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చగడ్డిని ఆదమరచి తింటోన్న ఆవుపై అక్కడే మాటు వేసి ఉన్న ఆడ సింహం ఒక్క ఉదుటున దూకి దాని గొంతు పట్టుకుంది. పాపం ఆ ఆవు నొప్పితో విలవిలలాడిపోయింది. పంటిబిగువున నొప్పిని భరిస్తూ తన యజమానికి వినిపించేలా పెద్దగా అరిచింది. తన గోవు అరుపులు విన్న ఆ రైతు వెంటనే అక్కడికి చేరుకొని ఎలాగైనా తనని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ధైర్యంగా సింహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నంలో ఆవు రోడ్డు పక్కకు జరిగింది. అంతలో తనవైపుగా వస్తోన్న రైతును చూసిన సింహం భయపడి వెంటనే అవును విడిచిపెట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది. ఈ వీడియోని జునాగఢ్ లోని కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు సింహానికి ఎదురెళ్ళిన ఆ రైతు గుండె ధైర్యానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు. ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ. ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ — Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023 ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా.. -
షాకింగ్ విషయాలు: ఆవు సాధు జంతువు... అదేగానీ దాడికి దిగితే..
వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ పలు ఆసక్తిక వివరాలు వెల్లడించింది. ప్రతీయేటా ఆవుల కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. వీరంతా ఆవుల దాడికి బలవుతున్నారని తెలియజేసింది. భారతీయులు ఆవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు కూడా చేస్తుంటారు. ఆవును గోమాత అని కూడా అభివర్ణిస్తుంటారు. ఆయుర్వేద పరిభాషలో ఆవు పాలు అమృతంతో సమానం. అయితే అప్పుడప్పుడు మనుషులపై జంతువుల దాడులు జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనుషుల మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా వందల మంది మృత్యువు బారిన పడుతున్నారు. ఆవుల దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారనే వివరాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్ తెలియజేసింది. ఆ వివరాలు ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి. Tbh, Id not get close to a cow too. They have no jokes really, when they attack they do it so hard😳 One time we stopped near a fountain to drink water. And cows came and i went to car. I was getting in and one of cows attacked me but car door protected me. It was like a shield pic.twitter.com/BDmZ7ip5M9 — ヒジExodus (@siriusm46) June 17, 2023 గణాంకాలు ఏమి చెబుతున్నాయి? వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ వెబ్సైట్లో ప్రచురితమైన డేటా ప్రకారం ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా అమెరికాలో 20 నుంచి 22 మంది మరణిస్తున్నారు. ఆవుల గుంపు తొక్కివేయడం కారణంగా మరణించారంటూ ప్రతీయేటా సుమారు 5 కేసులు వెలుగు చూస్తున్నాయి. లండన్‌లో ప్రతీయేటా ఆవుల దాడులలో కనీసం నలుగురు కన్నుమూస్తున్నారు. దీనిని షార్క్ దాడులతో పోల్చి చూస్తే.. షార్క్ దాడుల కారణంగా ప్రతీయేటా కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ప్రతీయేటా ఆవుల దాడులకు కనీసం 22 మంది బలవుతున్నారు. భారత్‌లో ఆవుల దాడుల సంగతేమిటి? సోషల్ మీడియాలో జంతువుల దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. వీటిలో ఆవుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. ఇటీవల ఒక ఎద్దు ఒక వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికిముందు కూడా ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళపై ఆవు దాడి చేసినట్లు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎద్దుల దాడులతో పోల్చి చూస్తే, ఆవుల దాడులు స్వల్పమేనని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. -
చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు
బనశంకరి: తన యజమానిపై దాడి చేసిన చిరుత పులితో తీవ్రంగా పోరాడి రైతు ప్రాణాలు ఆవు కాపాడిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... చెన్నగిరి తాలూకా ఉబ్రాణి హొబళి కొడతికెరె గ్రామానికి చెందిన రైతు కరిహాలప్ప(58) గత సోమవారం తన ఆవును తోటలో వదిలిపెట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా కరిహాలప్పపై దాడి చేసింది. గమనించిన ఆవు పరుగెత్తుకొచ్చి చిరుతపైకి దూకింది. కొమ్ములతో పొడిచింది. దీంతో చిరుత కిందపడిపోగా, అక్కడే ఉన్న శునకం కూడా దానిపైకి దూకింది. దీంతో చిరుత అక్కడి నుంచి ఉడాయించింది. ఈ సందర్భంగా రైతు కరిహాలప్ప మాట్లాడుతూ తాను పోషించిన ఆవు గౌరీ, శునకం మాత్ర శౌర్యాన్ని ప్రదర్శించి చిరుత బారి నుంచి తన ప్రాణాలు కాపాడాయని చెప్పాడు. -
పేద రైతు కుటుంబం నుంచి కోట్ల రూపాయల సంపాదన ఎలా ?
-
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
రాజస్తాన్‌లో కిడ్నాప్.. హరియాణాలో హత్య
జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లా ఘట్‌మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్‌కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు.