
చెన్నై : వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. జంతువులతో తాను మాట్లాడిస్తానని శాస్ర్తీయంగా దీన్ని నిరూపిస్తానని చెప్పారు. గోవులు మీతో తమిళం, సంస్కృతంలో మాట్లాడేలా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అత్యున్నత స్పృహ ద్వారా జంతువులకు భాషపై స్పృహ, మాట్లాడే వరం ప్రసాదించవచ్చని నిత్యానంద చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. శాస్త్ర ఆధారాలతో తాను దీన్ని నిరూపిస్తానని ఆయన అంటున్నారు.
కోతులు సహా ఇతర జంతువులకు మనకు ఉన్నన్ని శరీర అవయవాలు లేకున్నా నిత్యచైతన్య శక్తిని ప్రేరేపించడం ద్వారా అవి ఆయా అవయవాలను పెంపొందించుకోగలుగుతాయని, శాస్త్రపరంగా, వైద్యపరంగా ఈ అంశాన్ని తాను రుజువు చేస్తానని చెప్పారు. ఏడాదిలోగా తాను దీన్ని ప్రజల ముందుకు తీసుకువస్తానన్నారు.
తాను త్వరలోనే కోతులు, పులులు, సింహాల కోసం ఫోనెటిక్, భాషా సామర్థ్యమున్న వోకల్ కార్డును అభివృద్ధి చేస్తానన్నారు. మనతో సంస్కృతంలో, తమిళంలో స్పష్టంగా మాట్లాడే ఎద్దులు, ఆవులను మనం చూడబోతున్నామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment