
నార్నూర్: మండలంలో ని చోర్గావ్ గ్రా మ శివారులో సోమవారం సాయంత్రం తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం ఉట్నూర్ చిన్నునా యక్ తండా, హస్నాపూర్, చాందోరి మీదుగా మండలంలోని గుంజాల శివారుకు చేరుకున్న పెద్దపులి మధ్యాహ్నం నుంచి అదే ప్రాంతంలో తలదాచుకుంది.
రాత్రి జైనూర్ లేదా బేల మీదుగా వెళ్లిపోతుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం గుంజాల వద్ద ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రం చోర్గావ్ శివారులో ఆవుపై దాడి చేసి బాబేఝరి వైపు మళ్లిందని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment