బీజింగ్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు రకాల ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా కూడా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టూరిజంపై చైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమెరికా సహా పలు దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చింది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగిన చైనా.. కరోనా కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మూడేళ్లపాటు టూరిజం విషయంలో ఒంటరిగానే పోరాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టూరిజంపై ఫోకస్ పెట్టిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా వీసా రహిత రవాణా విధానాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఎక్కువ మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, చైనా ఆర్థిక వ్యవస్థను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా.. ఇకపై చైనాకు వెళ్లే విదేశీ ప్రయాణికులు 10 రోజుల వరకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇందులో అమెరికాతో సహా అనేక దేశాల నుంచి విదేశీ ప్రయాణికులు ఉన్నారు. విదేశీ పర్యాటకులు.. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఉండేందుకు అనుమతించారు. ఇంతకుముందు, ప్రయాణికులు దేశంలో ఎక్కడ సందర్శించారు అనేది ఆధారంగా 72 గంటల నుంచి 144 గంటలు మాత్రమే ఉండేందుకు అనుమతించేవారు.
China's 144-hour visa-free transit policy has continued to fuel the popularity of "China Travel. pic.twitter.com/5OZnLTr5Zi
— jasony (@JalisaJackson13) December 18, 2024
ఇక, చైనా తీసుకువచ్చిన వీసా రహిత పాలసీ విధానం అమెరికా, కెనడా, అనేక యూరోపియన్, ఆసియా దేశాలతో సహా 54 దేశాలకు వర్తించనుంది. అయితే, ఈ పాలసీ ప్రయోజనాన్ని పొందడానికి విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజులలోపు చైనా నుంచి నిష్క్రమించడానికి ధృవీకరించిన టిక్కెట్‌ను కలిగి ఉండాలి. ఈ వీసా పాలసీలో భాగంగా పర్యాటకులు.. రాజధాని బీజింగ్, చైనాలో అతిపెద్ద నగరం షాంఘైతో సహా 24 ప్రావిన్సులలోని 60 ప్రదేశాల నుంచి యాత్రికులు దేశంలోకి ప్రవేశించవచ్చు. దీంతో, అనేక దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యపరంగా లాభాలను పెంచుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు.. చైనా విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. కరోనా సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇజ్రాయెల్-రష్యా యుద్ధంలో చైనా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటీవల చైనా కోసం ప్రయాణ విధానాన్ని లెవల్-3 నుంచి లెవెల్-2కి తగ్గించింది. ఇదిలా ఉండగా.. అమెరికాను చేరువ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటీవల చైనా కీలక ప్రకటన చేసింది. కొన్నేళ్లుగా చైనా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసింది. అనంతరం, వీసాకు సంబంధిచిన నిర్ణయాన్ని అమలోకి తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment