tourisam development
-
కరోనా ఎఫెక్ట్.. అమెరికా కోసం చైనా భారీ ప్లాన్!
బీజింగ్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు రకాల ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా కూడా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టూరిజంపై చైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమెరికా సహా పలు దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగిన చైనా.. కరోనా కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మూడేళ్లపాటు టూరిజం విషయంలో ఒంటరిగానే పోరాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టూరిజంపై ఫోకస్ పెట్టిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా వీసా రహిత రవాణా విధానాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఎక్కువ మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, చైనా ఆర్థిక వ్యవస్థను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా.. ఇకపై చైనాకు వెళ్లే విదేశీ ప్రయాణికులు 10 రోజుల వరకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇందులో అమెరికాతో సహా అనేక దేశాల నుంచి విదేశీ ప్రయాణికులు ఉన్నారు. విదేశీ పర్యాటకులు.. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఉండేందుకు అనుమతించారు. ఇంతకుముందు, ప్రయాణికులు దేశంలో ఎక్కడ సందర్శించారు అనేది ఆధారంగా 72 గంటల నుంచి 144 గంటలు మాత్రమే ఉండేందుకు అనుమతించేవారు.China's 144-hour visa-free transit policy has continued to fuel the popularity of "China Travel. pic.twitter.com/5OZnLTr5Zi— jasony (@JalisaJackson13) December 18, 2024ఇక, చైనా తీసుకువచ్చిన వీసా రహిత పాలసీ విధానం అమెరికా, కెనడా, అనేక యూరోపియన్, ఆసియా దేశాలతో సహా 54 దేశాలకు వర్తించనుంది. అయితే, ఈ పాలసీ ప్రయోజనాన్ని పొందడానికి విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజులలోపు చైనా నుంచి నిష్క్రమించడానికి ధృవీకరించిన టిక్కెట్‌ను కలిగి ఉండాలి. ఈ వీసా పాలసీలో భాగంగా పర్యాటకులు.. రాజధాని బీజింగ్, చైనాలో అతిపెద్ద నగరం షాంఘైతో సహా 24 ప్రావిన్సులలోని 60 ప్రదేశాల నుంచి యాత్రికులు దేశంలోకి ప్రవేశించవచ్చు. దీంతో, అనేక దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యపరంగా లాభాలను పెంచుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.మరోవైపు.. చైనా విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. కరోనా సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇజ్రాయెల్-రష్యా యుద్ధంలో చైనా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల చైనా కోసం ప్రయాణ విధానాన్ని లెవల్-3 నుంచి లెవెల్-2కి తగ్గించింది. ఇదిలా ఉండగా.. అమెరికాను చేరువ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటీవల చైనా కీలక ప్రకటన చేసింది. కొన్నేళ్లుగా చైనా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసింది. అనంతరం, వీసాకు సంబంధిచిన నిర్ణయాన్ని అమలోకి తీసుకువచ్చింది. -
ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగం
దేశ పర్యాటక రంగంలో రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రధానంగా టెక్నాలజీ సేవలందిస్తున్న కంపెనీల్లో గణనీయంగా ఉద్యోగుల అవసరం ఏర్పడబోతున్నట్లు కొన్ని కంపెనీల అధికారులు తెలిపారు.ట్రావెల్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ కంపెనీలు 2024లో భారీగా ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. మేక్మైట్రిప్, ఈజ్‌మైట్రిప్, అగోడా, ర్యాడిసన్ హోటల్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్ వంటి సంస్థలు ఇప్పటికే డిమాండ్‌కు అనుగుణంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి. సాంకేతికత, కస్టమర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కేంద్ర సబ్సిడీ ప్రక్రియ గడువు తగ్గింపురాడిసన్ హోటల్ గ్రూప్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ శర్మ మాట్లాడుతూ..‘పర్యాటక రంగం కొవిడ్ సమయంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. క్రమంగా కరోనా భయాలు వీడి ఈ రంగం పుంజుకుంటోంది. ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితుల కంటే వేగంగా ఈ రంగం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ సంవత్సరం రాడిసన్ హోటల్ గ్రూప్ దేశవ్యాప్తంగా 3,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అన్నారు. -
రాజమండ్రి చూసొద్దామా?
చారిత్రక నగరమైన రాజమండ్రి టూరిజం హబ్‌గా మారుతోంది. పవిత్ర గోదావరి తీరాన వెలసిన రాజమండ్రిలో రివర్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాజమండ్రి నగరంతోపాటు సమీపంలో గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుకలంక, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఆకట్టుకునే మ్యూజియంలు, పురాతన కట్టడాలు, పాపికొండల టూరిజం వంటి సదుపాయలతో ఉన్న రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్ గా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో భాగమైన రాజమండ్రి, కాకినాడ, కోనసీమ, ఏజెన్సీలలో ఎన్నో అందమైన, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలచిన ప్రదేశాలు ఉన్నాయి. నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అద్భుతమైన అందాలకు చారిత్రక ఇతిహాసాలకు కొలువైన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పథకాలు సిద్దం చేసింది. రాజమండ్రి నగరం కేంద్రంగా రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా రాజమండ్రి నగరంలో గోదావరిపై 122 ఏళ్ల క్రితం నిర్మించిన హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేసి, టూరిజం స్పాట్ గా మార్చాలని భావిస్తోంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వంతెనను వెడల్పు చేసి, వాకింగ్ ట్రాక్ తోపాటు, షాపింగ్ స్ట్రీట్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న వంతెనను తీర్చిదిద్దితే దేశంలోనే పురాతనమైన గోదావరి వంతెన ప్రత్యేక గుర్తింపు పొందుతుంది రాష్ట్రంలో పాపికొండల టూరిజం ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందింది. రాజమండ్రి నగరం కేంద్రంగానే పాపికొండల బోట్ల నిర్వహణ జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చే టూరిస్టులు రాజమండ్రికి వచ్చి,ఇక్కడినుంచి దేవీపట్నం వద్ద బోట్లు ఎక్కి పాపికొండల యాత్రకు వెళతారు. ఇపుడు యాత్రికులు బసచేయడానికి ఏర్పాట్లు చేయడం,అదే విధంగా స్థానికంగా రివర్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే హరిత, అర్ధర్ కాటన్ బోట్లుతోపాటు మరో పది ప్రైవేట్ బోట్లు పాపికొండలకు వెళ్లి వస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచి, మరికొన్ని బోట్లకు అనుమతివ్వడంతోపాటు పాపికొండల టూరిజాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుక లంక పర్యాటకంగా అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించారు. దాదాపు 57 ఎకరాలున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి గతంలోనే ఎత్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో హోటల్ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఓబెరాయ్ గ్రూపు ఇక్కడ హోటల్స్, రిసార్టులు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఏర్పడ్డాయి. రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఓవైపు ఆహ్లాదాన్నిచ్చే గోదావరిపై ఉన్న వంతెనలు, ఘాట్లు, వాటిలో ఉన్న పవిత్ర దేవాలయాలతోపాటు చారిత్రిక కట్టడాలు కూడా కనపడతాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి గోదావరి పై ధవళేశ్వరంలో కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట దానితోపాటు ఆయన పేరిట ఏర్పాటు చేసిన కాటన్ మ్యూజియం. రాజమండ్రికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండటంతో సుదూర ప్రాంతాలనుంచి సైతం పర్యాటకలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నగరంలోకి వచ్చే మార్గాన్ని సైతం ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దారు. రాజమండ్రికి సమీపంలోనే వాడపల్లి, ద్రాక్షారామ, అయినవిల్లి, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉండటం, రాజమండ్రి నగరంలో కూడా అనేక దేవాలయాలు, ఘాట్లు, ఉండటంతో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. -
ఏళ్లుగా.. ఎదురుచూపులే
సాక్షి, ఖమ్మం(పాల్వంచరూరల్) : పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసాని గురించి ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. అందుకు తగ్గట్టుగానే దీన్ని దర్శించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది యాత్రీకులు తరలివస్తుంటారు. ఇక్కడి డీర్‌పార్కులో దుప్పులు, నెమళ్లు, డక్‌పార్కులో బాతులు, కోతులు, కొండముచ్చులు పర్యాటకులను ఆకట్టకుంటాయి. రిజర్వాయర్‌లో బోటుషికారు మరింతగా ఆకర్షిస్తుంది. దీన్ని మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని ప్రకటించాయి. తదనుగుణంగా నిధులు కూడా మంజూరు చేశాయి. అయితే మూడేళ్లు దాటినా అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో కిన్నెరసాని కళావిహీనంగా మారింది. పర్యాటకులకు నిరాశే.. ప్రకృతి అందాలు, పర్యాటక సొగసులను తిలకించేందుకు వచ్చేవారికి కిన్నెరసాని పర్యాటక ప్రాంతం నిరాశనే మిగిలిస్తోంది. మూడేళ్ల క్రితం ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. కిన్నెరసాని, కొత్తగూడెంలోని పర్యాటక అభివృద్ధి పనులు ఏడు నెలలుగా ఆగిపోయాయి. 2015లో నీతి ఆయోగ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించాయి. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, తొమ్మిది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన చాప్రాస్ అసోసియేట్ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ తొమ్మిది కాటేజీలు, రెండంతస్తుల్లో నిర్మిస్తున్న అద్దాలమేడ, ఫుడ్‌కోర్టుకు స్లాబ్ వేసి వదిలేశారు. ఆ తర్వాత కూలీల సమస్య వస్తోందని చెపుతూ గత డిసెంబర్ నుంచి పనులు చేయడం ఆపేశారు. ఆయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పనులు పడకేశాయి. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పనులు ప్రారంభించడంతో వాటి కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాణ పనులు మాత్రం నత్తను మరిపిస్తున్నాయి. పనులు శరవేగంగా పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో జాప్యం జరుగుతోంది. దీంతో పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. పనులు ఎప్పుటికి పూర్తయ్యేనో... రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవేం పనులంటూ సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. 2017 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. దీంతో 2018 డిసెంబర్ వరకు సమయం కావాలని కాంట్రాక్టర్ కోరారు. అయితే ఆ గడువు దాటి ఏడు నెలలైనా ఇప్పటికీ పనులు పూర్తికాకపోగా.. కమిషనర్ ఆదేశాలను సైతం భేఖాతర్ చేస్తూ పనులు మధ్యలోనే వదిలి కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. దీంతో వి«విధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నిరాశ, నిరుత్సాహాలతో వెనుదిరుగుతున్నారు. కాగా, కొంతవరకు చేపట్టిన అద్దాలమేడ, కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లోనూ నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రతిపాదనలు పంపాం కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనుల్లో జాప్యం చేయడంతో పాటు చెప్పకుండా మధ్యలోనే వెళ్లిపోయిన కాంట్రాక్టర్‌కు పనులను రద్దు చేయాలని పర్యాటక శాఖ ఎస్ఈకి ప్రతిపాదనలు పంపాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కొంత మేర పనులు చేసినప్పటికీ మధ్యలోనే వెళ్లిపోయాడు. మళ్లీ కొత్తగా టెండర్లు పలిచి పనులను కొనసాగించే అవకాశం ఉంది. –రాంబాబు, పంచాయతీరాజ్ ఏఈ -
కేరళ హంగులతో కోన సీమ అభివృద్ధి
ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాంత్ దిండి(మలికిపురం) : కోనసీమ పర్యాటకాన్ని కేరళ హంగులతో అభివృద్ధి చేయనున్నట్టు ఏపీ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు. శనివారం దిండి టూరిజం కేంద్రంలో కేరళ కన్సల్టెన్సీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు ఇచ్చిన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆయన మాట్లాడుతూ కోనసీమ సంప్రదాయాలకు అనుగుణంగా కేరళ నమూనాలతో టూరిజం అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. కోనసీమ పర్యాటక ప్రదేశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పారు. కేరళకు దీటుగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆర్డీఓ గణేష్‌కుమార్, అఖండ గోదావరి ప్రత్యేకాధికారి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.