దేశ పర్యాటక రంగంలో రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రధానంగా టెక్నాలజీ సేవలందిస్తున్న కంపెనీల్లో గణనీయంగా ఉద్యోగుల అవసరం ఏర్పడబోతున్నట్లు కొన్ని కంపెనీల అధికారులు తెలిపారు.
ట్రావెల్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ కంపెనీలు 2024లో భారీగా ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్, అగోడా, ర్యాడిసన్ హోటల్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్ వంటి సంస్థలు ఇప్పటికే డిమాండ్‌కు అనుగుణంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి. సాంకేతికత, కస్టమర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్ర సబ్సిడీ ప్రక్రియ గడువు తగ్గింపు
రాడిసన్ హోటల్ గ్రూప్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ శర్మ మాట్లాడుతూ..‘పర్యాటక రంగం కొవిడ్ సమయంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. క్రమంగా కరోనా భయాలు వీడి ఈ రంగం పుంజుకుంటోంది. ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితుల కంటే వేగంగా ఈ రంగం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ సంవత్సరం రాడిసన్ హోటల్ గ్రూప్ దేశవ్యాప్తంగా 3,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment