తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్ అధికారికానూ సోషల్ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా. తాజాగా.. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్ సెక్షన్‌లోనే చర్చ జరుపుతున్నారు.
సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయలేమా? అని..
చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!!
అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024
ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు.
తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్‌లైన్ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయాలని, వాటని ప్రమోట్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి!
Comments
Please login to add a commentAdd a comment