VC Sajjanar
-
మ్యాట్రి 'మనీ' స్కాం: అలాంటి వీడియోలతో బెదిరింపులు, బీ కేర్‌ఫుల్!
పెళ్లిళ్ల పేరయ్యల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇపుడంతా మ్యాట్రీ మోనీ వెబ్సైట్ల హవానే నడుస్తోంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకుని అపుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితినిమనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా, అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలావరకు ‘మ్యాట్రీ మోనీ’ పై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పదండి!మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు.. ప్రతీ విషయాన్ని తమ కనుగుణంగా మలుచు కుంటున్నారు కేడీగాళ్లు. ఆఖరికి మ్యాట్రీమోనీ సైట్లను కూడా వదలడం లేదు. మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా పెరిగిపోతున్న మోసాలు అంటూ దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను షేర్ చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త! అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సజ్జనార్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సి ఉందనీ, ఒకటి పది సార్లు ఆలోచించాలని తెలిపారు. అలాగే మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ట్వీట్ చేశారు.ఈ వీడియోలో ఒక యువతి తన స్నేహితురాలి అనుభవాన్ని గురించి వివరించారు. ఈ వివరాల ప్రకారం మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు స్కాం రాయుళ్లు. ఆ తరువాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు. మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తరువాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అడిగిన సొమ్ము ముట్టచెప్పక పోతే..న్యూడ్ వీడియోలను బయట పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో ఈ వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందని భయంతో వణికిపోతారు బాధితులు. అడిగినంత ముట్జచెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!!మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్.న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.మ్యాట్రిమోని… pic.twitter.com/wS48rAVmTp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 13, 2025 ఇలాంటి స్కాంలపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడ కూడదు. సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదంటే సైబర్ క్రైం విభాగాన్ని గానీ వెంటనే సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన వారమవుతాం. అలాకాకుండా పరువు పోతుందని భయపడితే, కేటుగాళ్లు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుగా చిక్కుకుంటామనే సంగతి గుర్తుంచు కోవాలి. -
‘సజ్జనార్ సార్.. ఇలాంటి వారిని ఏం చేయలేమా?’
తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్ అధికారికానూ సోషల్ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా. తాజాగా.. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్ సెక్షన్లోనే చర్చ జరుపుతున్నారు.సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయలేమా? అని..చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!! అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్లైన్ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయాలని, వాటని ప్రమోట్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి! -
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్!
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్ చేశారు.అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.తమన్‌కు సజ్జనార్ కృతజ్ఞతలుఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్‌కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుందని అన్నారు. భవిష్యత్‌లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి @ahavideoIN నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు ద… https://t.co/9Z4HR44QFF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 14, 2024 I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿What a Talent what perfect pitching 🖤God is sometimes harsh But we humans are there… https://t.co/CqjEU0QHfc— thaman S (@MusicThaman) November 13, 2024 -
వెర్రి వేషాలపై వీసీ సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: దీపావళి సందర్భంగా.. హైటెక్‌సిటీ ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట ఇదేం వికృతానందమని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని సజ్జనార్ ప్రశ్నించారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నారన్నారు. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఏడాది క్రితం అదృశ్యమై.. ఆధార్‌తో దొరికాడు -
ఖాళీగా రిటర్న్.. స్పెషల్ బస్సుల్లో అధిక ఛార్జీలు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6300 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇదే సమయంలో స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని బాంబు పేల్చారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘దసరా రద్దీ దృష్ట్యా 6300 బస్సులు నడుపుతున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులు అదనంగా నడిపిస్తున్నాం. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయి. రేపటి నుంచి మొత్తం బస్సులు నడిపిస్తాం. ఈనెల 14వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. దసరా పండుగ కాబట్టి రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది.. కాబట్టి కొంత చార్జీలు పెంపు తప్పదు. మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి అని చెప్పారు.ఇక, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి చాలా మంది తమ స్వగ్రామాలకు పయణమవుతున్నారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ఇవ్వడంతో వారంతా ముందుగానే ఇళ్లకు చేరుకున్నారు. రేపు సద్దుల బతుకమ్మ కావడంతో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
వీసీ సజ్జనార్ అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే మరో 8 ప్రాణాలు బతుకుతాయని అదనపు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మరణానంతరం తాను తన అవయవాలు దానం చేస్తున్నట్లు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానని, ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో అవవయదాన అవగాహన ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా చేసుకుంటారు. దీనిపై ఉన్న అపోహలను తొలగించి, మరింతమందిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు, అవయవదానంపై అవగాహన కల్పిచేందుకు ఈ కార్యక్రమం చేపడతారు.ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయత్రీ కామినేని మాట్లాడుతూ.. “గౌరవనీయులైన వీసీ సజ్జనార్ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ స్ఫూర్తినిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇక్కడ అనేకమంది రోగులు తమకు జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 వేల మందికి పైగా వ్యక్తులు అవయవమార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మనమంతా స్పందించాలి. అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ మేం ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదుచేసుకుని, ఇక్కడ ఉన్నవారికి ఒక ఆశ కల్పించాలని కోరుతున్నాను. రాబోయే సంవత్సరాల్లో జాతీయ సగటును మించి మన తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానాలు జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో మాత్రం పరిస్థితి అలా లేదు. దాతల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. అవయవదానం అంటే ప్రాణాన్ని నిస్వార్థంగా మరొకరికి దానం చేయడమే. అలా చేయడం ద్వారా మరో ఎనిమిది మందిలో మనం చిరంజీవులుగా ఎప్పటికీ ఉండిపోతాం. నేనూ ఇప్పటికే అవయవదాన ప్రతిజ్ఞ చేశాను. మీరంతా నాతో కలిసొస్తారని ఆశిస్తున్నా. మనమంతా కలిసి ఒక ప్రభంజనంలా ఈ అవయవదాన సత్కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. వ్యాధులతో బాధపడుతున్న దశ నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ల కథలు వింటే మీ హృదయాలు కరుగుతాయి” అని తెలిపారు.ప్రజలందరూ ముందడుగు వేసి, అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... “కామినేని ఆస్పత్రిని నా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఇటీవల ఇలాంటి కార్యక్రమం నేను చూడలేదు. అవయవదానం గురించి అవగాహన కల్పించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని నాకు విశ్వాసం ఉంది. కామినేని కుటుంబంతో నాకు రెండు దశాబ్దాల సాహిత్యం ఉంది. పోలీసులకు కూడా వాళ్లు చాలా చేశారు. పోలీసు శాఖ తరఫున కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొవిడ్ వచ్చినప్పుడు కామినేని ఆస్పత్రి చేసిన సేవలు అపూర్వం. నేను చాలామంది వైద్యులకు ఫోన్లు చేసేవాడిని. శశిధర్ లాంటివాళ్లు అర్ధరాత్రి చేసినా స్పందించేవారు. వైద్యులు, నర్సులు, అందరూ కొవిడ్ సమయంలో చాలా సేవలు చేశారు. తీవ్రగాయాలు అయినప్పుడు మొట్టమొదటగా కామినేని ఆస్పత్రికే మా సిబ్బందిని పంపేవాడిని. ముఖ్యంగా అవయవదానం విషయంలో చాలా అవగాహన రావాలి. కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436 కెడావర్ డొనేషన్లు 2,942చొప్పున ఉన్నాయి. లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం అంటే దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. పది సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణం. డాక్టర్ స్వర్ణలత లాంటివాళ్లు జీవన్‌దాన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వైద్యులు అవయవ మార్పిడి ఆపరేషన్లలో ఎంతో ముందున్నారు. వీరందరికీ నా మనఃపూర్వక అభినందనలు” అని చెప్పారు.క్యూఆర్ కోడ్ విడుదలఈ సందర్భంగా ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్పత్రి తరఫున ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.అవయవదానంపై అవగాహన కల్పించేందుకు కామినేని ఆస్పత్రి డైరెక్ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రచారాలతో కూడిన సమగ్ర అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు 'గర్వించదగిన అవయవ దాత' కార్డును పంపిస్తారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కామినేని ఆస్పత్రి అందరినీ ఆహ్వానిస్తోంది. అవయవదాతగా పేరు నమోదుచేసుకోవడం ద్వారా, కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులకు ప్రాణదానం చేయగల అవకాశం మీకు దక్కవచ్చు. -
HYD: కీచక కండక్టర్.. యువతి ట్వీట్‌కు ఆర్టీసీ రి‘యాక్షన్’
సాక్షి, రంగారెడ్డి: సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్, హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది.‘ఈ నెల 15న (మంగళవారం)మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.తాజాగా ఈ ఫిర్యాదుపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ‘ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది. టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా #TGSRTC యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన చర్యలను సంస్థ… pic.twitter.com/pCzfcZRUz4— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 16, 2024 -
ఫేక్ రీల్ వైరల్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ, ఫ్యామస్ అయిపోవాలనే తాపత్రయంతో కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చు కుంటోంటే.. మరికొందరు బూటకపు వేషాలు, తప్పుడు వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024బస్సు కిందకి యువకుడు, పిచ్చి రీల్హైదరాబాద్లోని ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సు కింద పడుకోవడం, బస్సు వెళ్లిపోయాక, ఎలాంటి గాయాలు లేకుండానే, తీరిగ్గా షర్ట్‌కి అంటిన దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోయినట్టుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది ఎడిటెడ్ వీడియో అని ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇది ఫేక్ అంటూ తీవ్ర చర్చ సాగింది కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను తెలంగాణా ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. కాగా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలను కానీ, ఇమేజెస్‌ను గానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమో, కాదో. ఇట్టే అర్థమవుతుంది. లేదంటే గూగుల్స్ లెన్స్ ద్వారా ఇమేజ్ను ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. వీడియో అయితే ‘ఇన్విడ్’ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్‌లోని టోల్ సెస్‌ను సంస్థ సవరించింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని సజ్జనార్ ట్వీట్ చేశారు.టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. #TGSRTC బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగింది. ఈ… pic.twitter.com/kO2mbAkjl2— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 12, 2024 -
TGSRTC ఫేక్ ప్రచారంపై సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్సైట్లు అలా లోగోను డిజైన్ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు అవస్థలు.. సజ్జనార్ క్లారిటీ
-
వచ్చే 4 రోజులు తెలంగాణ బస్సులు బిజీ బిజీ
తొందరపడి బస్టాండ్లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. "తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం." రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 -
ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన
హైదరాబాద్, సాక్షి: మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో.. సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యే వరకు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని కోరారాయన. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 ఇదీ చదవండి: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్!! అంతకు ముందు.. జాతర వెళ్లే భక్తులకు ఆర్టీసీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మూగజీవాలకు ఆర్టీసీ బస్సుల్లో ఎంట్రీ లేదన్నారాయన. అంతేకాదు.. గతంలో ఎప్పుడూలేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. -
మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనుంది. ఇక, ఈసారి మేడారం జాతర కోసం భక్తులు ఇప్పటి నుంచే పోటెత్తుతున్నారు. దీంతో, టీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, తాజాగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..‘మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నాం. ఇక, మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించాం. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు. -
దాడులు చేస్తే..: తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆర్డీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు.. ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మహాలక్ష్మీ స్కీం ప్రకటన అనంతరం.. పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. మొన్నీమధ్య ఫరూక్నగర్ డిపో బస్సులో డ్రైవర్, కండక్టర్లపై జరిగిన దాడిని ఆయన ఖంచింన సంగతి తెలిసిందే. తాజాగా గాయపడిన ఆ సిబ్బందిని పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారాయన. ‘‘గాయపడ్డ కండక్టర్, డ్రైవర్‌కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది. ఫరూక్ నగర్ డిపో బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే ఇక ఉపేక్షించం. ఇక నుంచి రౌడీ షీట్లు కేసులు తెరుస్తాం’’ అని సజ్జనార్ హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని సజ్జనార్ చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా ఫరూక్నగర్ డిపోకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారని, ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. -
ఇదో కొత్తతరహా మోసం.. జాగ్రత్త: సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరలేపారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో వారు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాను మొదలెట్టారని... మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు సమర్పించుకోవద్దన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. భయపడిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి… pic.twitter.com/l30JmmPCeS — V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 2, 2024 -
TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ.. చేయిచేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో..‘హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY — Telugu Scribe (@TeluguScribe) January 31, 2024 Video Credentials: Telugu Scribe మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024 అయితే, హయత్‌నగర్ డిపో-1 పరిధిలో మద్యం సేవించిన ఓ మహిళ మత్తులో దుర్భాషలాడింది. బస్సులో తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కండక్టర్‌పై దాడికి దిగింది. కాగా, మహిళా కండక్టర్‌ను తన్నిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రూ.500లకు చిల్లర లేకపోవడంతో దిగిపోవాలని కండక్టర్ సూచించినట్లు తెలిసింది. దీంతో, సదరు ప్రయాణికురాలు హల్చల్ చేసింది. -
మహాలక్ష్మీ స్కీమ్, కొత్త బస్సులపై సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్, కొత్త ఆర్టీసీ బస్సుల గురించి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా 12కోట్లకుపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించినట్టు సజ్జనార్ చెప్పుకొచ్చారు. కాగా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈరోజు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని అన్నారు. ఇదే సమయంలో సజ్జనార్..‘ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
TSRTC: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సిద్దిపేట, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. -
Telangana: మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
TS: సంక్రాంతికి 4వేల స్పెషల్ బస్సులు
హైదరాబాద్, సాక్షి: సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో TSRTC అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత ప్రయాణం.. ఈ బస్సులకూ వర్తించేలా ఈ సందర్భంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 4 వేల 484 బస్సులు అదనపు బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇందులో 626 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి. బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని.. సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని తెలిపారాయన. అలాగే.. సంక్రాంతి పండగకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందని స్పష్టత ఇచ్చింది. ఈ సమీక్షలో ఈడీలు, జిల్లాల రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
TSRTC: న్యూ ఇయర్లో షాకిచ్చిన ఆర్టీసీ.. సిటీలో ప్రయాణికులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గట్టి షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ కోసం టీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనికి మంచి స్పందన కూడా లభించింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు ప్రయాణికులే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎదురుచూపులతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. దీంతో ఫ్యామిలీ-24, టీ-6 రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’ అని తెలిపారు. -
HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp — Telangana Congress (@INCTelangana) December 30, 2023 రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. లీజుకు ఆర్టీసీ భూములు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది. -
TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ..‘టీఎస్ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. #TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX — V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023 -
హైదరాబాద్: "ICBM- స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్" 16వ స్నాతకోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. -
TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోందన్నారు. అయితే, హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం’ అని తెలిపారు. ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్) ఉందని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు… pic.twitter.com/fjALCZS9Pm — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9 వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యుషన్ (CIS)పై మొగ్గు చూపి వాటి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. “సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చాం. CIS ప్రాజెక్ట్ సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతోంది. కేంద్రీకృత సమగ్రమైన డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్లు, వర్క్‌షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్ వంటి కార్యకలాపాల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్పీ ఏకీకృతం చేస్తోంది. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీఎస్ ఆర్టీసీ మొదటిది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్ వర్క్‌ను అప్ గ్రేడ్ చేశాం అని సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత సామార్థాన్ని మెరుగుపరచాలనే ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సమర్థవంతమైన ఈ వ్యవస్థ సంస్థ అభివృద్ధికి దోహద పడగలదని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన నాణ్యమైన సేవల్ని అందించేందుకు టీఎస్ ఆర్టీసీతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని నల్సాఫ్ట్ సీఈఓ నల్లూరి వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు. సమష్టి కృషి, అంకితభావంతో పని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయగలిగామని చెప్పారు. ఆధునీక సాంకేతితను అందిపుచ్చుకోవడంలో టీఎస్ ఆర్టీసీ ముందంజలో ఉందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హన్స ఈక్విటీ పార్ట్నర్స్ త్రినాథ్ బాబు మాట్లాడుతూ, రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు. సీఐఎస్ ప్రాజెక్టు ద్వారా కార్యకలాపాల నిర్వహణ మరింత సౌలభ్యంగా మారే అవకాశం ఉందన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ టీఎస్ ఆర్టీసీ పురోగమించడం శుభపరిణామన్నారు. సీఓఓ డాక్టర్ వి రవీందర్, ఐటి కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పివి ముని శేఖర్, ఎస్ కృష్ణకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఎ. పురోషోత్తం, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప, చీఫ్ ఇంజనీర్ (IT) ఎం. రాజ శేఖర్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
TSRTC: ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. 286 మందికి అవార్డులు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచిందన్నారు. టీఎస్ఆర్టీసీ ముందు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ఉందని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా సజ్జనార్.. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచింది. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేశారు. మొత్తం 286 మందికి అవార్డులు వరించగా.. వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్ కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్ లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ లతో పాటు సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు.. ఇలా అన్ని విభాగాల వారు పురస్కారాలను అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థాయికి సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని వివరించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. శ్రావణ మాసంలో ఛాలెంజ్ లోనూ గత ఏడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ రికార్డుల్లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్ గా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ జ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC) గారు అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్… pic.twitter.com/G5vLCs4aRV — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 7, 2023 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ “రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో.. 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించడం జరిగింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్ ల మాదిరిగానే పనిచేసి..ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలి.” అని సజ్జనర్ కోరారు. పండుగలకు సిబ్బంది చేస్తోన్న త్యాగం గొప్పదని, ఇంట్లో కుటుంబసభ్యులను, బంధుమిత్రులను విడిచి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పండగ సమయాల్లో పోలీస్, రవాణా శాఖలు సంస్థకు ఎంతగానో సహకరిస్తున్నాయని గుర్తుచేశారు. “టీఎస్ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్ లో ఉన్న 9 డీఏలను ఉద్యోగులకు సంస్థ మంజూరు చేసింది. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన ఉన్న అరియర్స్, సీసీఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిను కూడా చెల్లిస్తాం. బకాయిలు చెల్లింపు విషయంలో ఒక ప్రణాళికను సంస్థ రూపొందించింది.” అని సజ్జనర్ తెలిపారు. ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే.. సిబ్బంది సంక్షేమానికి కూడా సంస్థ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ నవంబర్, డిసెంబర్ నుండి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. ఛాలెంజ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారాలు - రాఖీ పౌర్ణమి ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష) సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ(రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్(రూ.50 వేలు). - శ్రావణ మాసం ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్(రూ.50 వేలు). ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ఫ, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం(కమర్షియల్) సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఈ వివరాలను వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా వీసీ సజ్జనార్..‘టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది’ అని తెలిపారు. తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు #TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన… pic.twitter.com/nqLnQC3IpM — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 4, 2023 ఇది కూడా చదవండి: TS: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు -
TSRTC: దసరా బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవ్
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. 12 రోజులకు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయించుకుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ►అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ►ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. ► అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులు ► హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ►హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. ► పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో!. ►అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ► ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ►ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. ► వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. ► విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. ► మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి. “బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని నడుస్తాయి. గత దసరాకు 4280 ప్రత్యేక నడపగా.. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించాం. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నాం. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచాం. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది.” :::టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023 -
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8 డీఏలను మంజూరు చేశామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. "పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 2, 2023 ఇది కూడా చదవండి: వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణలో మూడు రోజులు గట్టి వానలే! -
టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు #TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 1, 2023 20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈసారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్ కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు గమనార్హం. ప్రయాణికులకు ధన్యవాదాలు “ప్రజా రవాణా వ్యవస్థ వెంటే తాము ఉన్నామని ప్రజలు మరోసారి నిరూపించారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి రాఖీ పౌర్ణమికి కూడా సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక్క రోజులో దాదాపు 41 లక్షల మంది ప్రయాణికులు సంస్థ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంస్థ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఈ సారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదు. గత ఏడాది రాఖీ నాడు 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా.. ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్(ఐపీఎస్) మీడియాకు తెలిపారు. రాఖీ పండుగ నాడు ఎంతో నిబద్దతతో సిబ్బంది పనిచేశారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని సిబ్బందిని అభినందించారు.. ఎంతో మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను మొచ్చకుంటూ తమకు, ఉన్నతాధికారులకు సందేశాలు పంపించారని పేర్కొన్నారు. “ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే.. సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అందుకు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది చేసే త్యాగం ఎనలేనిది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పని చేసి భవిష్యత్ లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నమ్మకాన్ని కొల్పోకుండా మంచి ఫలితాలు వచ్చేలా పాటుపడాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సిబ్బందికి పిలుపునిచ్చారు. -
TSRTC: రాఖీ స్పెషల్.. మహిళా ప్రయాణికులకు బంపరాఫర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో యువతులు, మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని పేర్కొంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని ప్రకటించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. ప్రతీ రిజయన్‌లో లక్కీ డ్రా.. వివరాల ప్రకారం.. ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్‌లను ఒక చోటికి చేర్చి.. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వట్టర్ వేదికగా..‘మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది’ అని తెలిపారు. రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 29, 2023 ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు. ఇది కూడా చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క -
రాఖీ పండుగ: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ సోమవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. నాలుగు రోజుల పాటు టికెట్‌ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో మంగళవారం నుంచి 4 రోజుల పాటు టీ-9 టికెట్ల నిలుపుదల అమల్లో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, సెప్టెంబర్ 2 నుంచి ఈ టికెట్ల అమలు యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. కాగా, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. టీఎస్ఆర్టీసీ 60 కి.మీ. పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కి.మీ. టీ-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టీ-9-60 టికెట్‌ను రూ.100కు, టీ-9-30 టికెట్‌ను రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తోంది. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 28, 2023 టికెట్ల నిలుపుదలపై ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: వినాయక చవితిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
TSRTC: రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. రాఖీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ప్రత్యే బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు వెయ్యి బస్సుల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌తోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. చదవండి: అమిత్ షా ఖమ్మం పర్యటనలో మార్పులు ‘అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది’ అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. పండుగ నాడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్‌లతో పాటు హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు గమనిక!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ ముఖ్య సమాచారం అందించింది. కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా బుధవారం (ఆగస్టు 16) నుంచి పునరిద్దరించినట్లు తెలిపింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపిందని పేర్కొంది.అయితే తాజాగా ఆ రూట్లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపింది. కాగా ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. చదవండి: వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే హైదరాబాద్ లోని ప్రయాణికులకు గమనిక! కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా ఈ రోజు నుంచి #TSRTC పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది.… pic.twitter.com/FiJZjyxUiy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 16, 2023 -
ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా..
సాక్షి, హైదరాబాద్/ఆఫ్జల్‌గంజ్: లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ రకాల ఫీచర్లతో రూపొందించిన ఆర్టీసీ బస్ వెహికల్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ‘గమ్యం’ను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శనివారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘గమ్యం’ యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తిరిగే పుష్పక్, మెట్రో బస్సులతో పాటు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, జిల్లాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను కూడా ‘గమ్యం’ యాప్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చు. సుమారు 4,170 బస్సులను వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తాము ఎంపిక చేసుకున్న బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తాము ఎదురుచూసే బస్‌స్టేషన్‌కు చేరుకుంటుందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దశలవారీగా ఆర్టీసీలోని అన్ని బస్సులను ట్రాకింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అక్టోబర్ నాటికి అన్ని బస్సులకు ట్రాకింగ్ సదుపాయం వస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా 776 బస్సులు: ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ‘గమ్యం’ యాప్ ద్వారా ప్రతి బస్సు వాస్తవ స్థితి కచ్చితంగా తెలుస్తుందన్నారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణం చేసే బస్సును ప్రతి క్షణం ట్రాక్ చేయవచ్చునన్నారు. ప్రతి రోజూ 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రవాణారంగంలో పోటీని ఎదుర్కొనేందుకు అత్యాధునిక హంగులతో రూపొందించిన 776 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చదవండి: బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు ’’ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడమే కాకుండా, బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు’’ అని ఎండీ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడీలు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, జేడీ (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా ప్రతినిధి హర్మ న్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ విజయ పుష్ప, సీఈ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీ శ్రీధర్ పాల్గొన్నారు. మహిళల భద్రతక ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ ►మహిళా ప్రయాణికుల భద్రత కోసం గమ్యం యాప్ లో ‘ఫ్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి వేళల్లో బస్టాప్‌లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ►రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ►అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. ►బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహా యం, రోడ్డు ప్రమాదం, తది తర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపో ర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ►‘TSRTC Gamyam'’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివ రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ►ఇప్పటికే మొబైల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్లు అప్డేట్ చేసుకో వడం తప్పనిసరి. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్.. 'గమ్యం' యాప్ తో..
వరంగల్: టీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికుల ముంగిటకు మరో సాంకేతిక సహకారాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సంపూర్ణ సహకారం అందించే ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్’ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను శనివారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవాన్ని ప్రయాణికులు వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో జీపీఎస్ పరికరాలు బిగించారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ ఆపై బస్సుల్లో మాత్రమే జీపీఎస్ సమాచారం అందుబాటులోకి వచ్చింది. త్వరలో పల్లె వెలుగు బస్సులకు కూడా ఈ సౌకర్యం విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్ యాప్’ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌తో బస్సుల సమయం, ఏఏ బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయో, బస్సు ఎక్కడికి వరకు వచ్చింది. బస్ స్టేషన్లు, బస్ స్టేజీల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం.. మహిళల రక్షణకు యాప్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బస్ స్టేషన్లు, రూట్లు తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం గమ్యం యాప్‌లో ‘ఫ్లాగే బస్సు’ ఆనే ఆప్షన్ కూడా చేర్చారు. యాప్‌లోకి వెళ్లి ఫ్లాగే బస్ అనే చోట నొక్కితే (టచ్ చేస్తే) స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక కలర్ వస్తుంది. ఈ కలర్‌తో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను బస్సు ఎదుటగా చూపిస్తే డ్రైవర్ చూసి బస్సును నిలిపి మహిళలను ఎక్కించుకుంటారు. సమీపంలో ఉన్న బస్ స్టేజీలో దింపుతారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. -
'గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్'.. సీనియర్ IPS ఆఫీసర్ ట్వీట్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ గారి పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(సంస్థ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు నివాళులు అర్పించారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ గారితో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్ గారు జ్ఞాపకం చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారు. అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ గారు నిలిచిపోయారని కొనియాడారు. గద్దర్ గారితో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారని సజ్జనర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేకపోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమకారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన్నారు. గద్దర్ గారి పార్ధివ దేహానికి టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనర్, ఐపీఎస్ ప్రకటించారు. కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి! గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న. పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని… pic.twitter.com/TwtYTnzoCW — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 6, 2023 -
TSRTC: హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసులు రద్దు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, కృష్ణా జిల్లాలోని కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యూలర్ టీఎస్ఆర్టీసీ బస్సుల రద్దు చేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలన్నారు. ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023 ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్ -
ఆర్టీసీ కొత్త టికెట్! రూ.50 చెల్లించు.. 12 గంటలపాటు బస్సుల్లో ప్రయాణించు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు వారు తెలిపారు. (చదవండి: పెద్దపల్లిలో విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి) ఎక్కడ తీసుకోవాలంటే? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. టి9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. (చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్) అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
నిరుద్యోగులకు అలర్ట్.. TSRTC ఐటీఐలో ప్రవేశాలపై సజ్జనార్ కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించింది. టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వివరాల ప్రకారం.. ‘వరంగల్‌లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు’ అని సజ్జనార్ తెలిపారు. వరంగల్‌లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో… pic.twitter.com/JjOooikIlR — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 23, 2023 ఇది కూడా చదవండి: దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్ పాస్‌లో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ను సంస్థ తెచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన! -
TSRTC: ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబి టికెట్ వర్తిస్తుంది. టీ-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. అయితే, ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టి-9 టికెట్‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబితో టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాల’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్, కడియంపైన సంచలన ఆరోపణలు -
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం ‘టీ-9 టీకెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను ఇప్పటీకే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టీకెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో శుక్రవారం ‘టీ-9 టీకెట్’ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టీకెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ►‘టీ-9 టీకెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్స్‌కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. ►ఈ టీకెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ► ‘టీ-9 టీకెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీలపైన మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ టీకెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని సంస్థ ప్రకటీంచింది. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టీకెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్లను కండక్టర్లు ఇస్తారు. ►తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి! ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటీజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టీ-9 టీకెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టీంది. ఈ టీకెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటీకే టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటీకి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టీకెట్లకు మంచి స్పందన వస్తుండటంతో తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం ‘టీ-9 టీకెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టీకెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ‘టీ-9 టీకెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటీంగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి లక్కీ మండే.. ఒక్కరోజే రూ.20.36 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి సోమవారం రద్దీ బాగా కలిసొస్తోంది. గత నెల 15న సోమవారం రోజు రికార్డు స్థాయిలో రూ.20.26 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఆర్టీసీ , తాజాగా ఈ సోమవారం దాన్ని బ్రేక్ చేస్తూ రూ.20.36 కోట్లను పొందింది. గత సంక్రాంతి తర్వాతి రోజు, రాఖీ పౌర్ణమి రోజు రూ.20 కోట్లను మించి టికెట్ రూపంలో ఆదాయం పొందింది. మిగతా సందర్భాల్లో ఒకేరోజు రూ.20 కోట్లను మించి ఆదాయం రికార్డు కాలేదు. ఆ రెండు సందర్భాలు పండుగలతో ముడిపడి ఉన్నందున, ఆర్టీసీ కొంత ఆశించి లక్ష్యంగా పెట్టుకుని ఆదాయం పొందింది. ఈ సోమవారం ఎలాంటి పండుగలు లేకున్నా అంత ఆదాయం రావటం విశేషం. నిర్ధారించుకున్న లక్ష్యాన్ని మించి 116 శాతం ఆదాయం పొందటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో అది 122 శాతంగా నమోదైంది. ఆక్యుపెన్సీ రేషియో 82 శాతంగా నమోదైంది. సోమవారంరోజు 34.26 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు రికార్డు అయింది. కిలోమీటర్‌కు రూ.53.74 చొప్పున ఆదాయం (ఈపీకే) వచి్చనట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఇక స్నాక్ బాక్స్.. స్పెషల్ ఏంటంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్‌తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ‘ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా స్నాక్ బాక్స్ ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్‌తో కూడిన స్నాక్ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుంది. టీఎస్ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్ విధానాన్ని అలాగే అదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ప్రతీ స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ.. -
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్..! తొలిసారిగా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్‌కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1000గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్‌కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్‌కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్‌లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్‌ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది. “గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్‌ను సంస్థ ప్రారంభించింది. చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్‌తో.. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్‌లను ఇస్తున్నాం. తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1200గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం. హైదరాబాద్‌లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్‌లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్‌లు 40 వేల వరకు ఉన్నాయి. వాటి మాదిరిగానే కొత్తగా తీసుకువచ్చిన రూట్ పాస్‌ను ప్రయాణికులు ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. -
BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్‌తో..
IPL 2023: టీ20 క్రికెట్ ఫార్మాట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర లీగ్‌కు లేదనడంలో సందేహం లేదు. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించే ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది. అదే విధంగా స్పాన్సర్ల మీద కనక వర్షం కురిపిస్తుంది. అయితే, నాణేనికి మరోవైపు.. ఐపీఎల్ క్రేజ్‌ను బెట్టింగ్‌లు, ఇతర దందాలతో దుర్వినియోగం చేస్తున్నవాళ్లు కూడా కోకొల్లలు. తాజాగా.. గొలుసుకట్ట సంస్థ హెర్బల్ లైఫ్ కూడా ఈ జాబితాలో చేరిందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఐపీఎల్ అఫిషియల్ పార్ట్నర్గా ఉన్నామంటూ తమ ప్రాడక్టులతో అమాయక ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదే విధంగా హెర్బల్ లైఫ్ లాంటి సంస్థలను తమ భాగస్వామిగా ప్రకటించడంపై బీసీసీఐ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుని మోసాలకు అడ్డుకట్ట వేయాలని సజ్జనార్ కోరారు. ఈ మేరకు.. ‘‘హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుకట్టు సంస్థలు అమాయకపు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. #IPLకు అఫిషియల్ పార్టనర్‌గా ఉన్నామంటూ ప్రొడక్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోసపూరిత సంస్థలను అఫిషియల్ పార్టనర్‌గా పెట్టుకోవడంపై ఐపీఎల్ యాజమాన్యం పునరాలోచించాలి. హెర్బల్ లైఫ్‌పై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చట్టప్రకారం చర్యలు తీసుకుని.. మోసాలకు అడ్డుకట్ట వేయాలి’’ అని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్-2023 నేపథ్యంలో హెర్బల్ లైఫ్ సంస్థ బీసీసీఐతో జట్టు కట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా.. Concerns arise over the practices of multi-level marketing companies such as Herbal Life, who are accused of deceiving unsuspecting individuals. Leveraging their association with #IPL, they promote their products extensively. IPL management should reconsider aligning with such… pic.twitter.com/28dME1M9rV — V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 25, 2023 -
టీఎస్ఆర్టీసీలో ఇక విలేజ్ బస్ ఆఫీసర్లు.. వీళ్లు చేస్తారంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్లో విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను సజ్జనార్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ‘టీఎస్ఆర్టీసీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ప్రజలకు, సంస్థకు మధ్య మీరు అనుసంధానకర్తల్లాగా వ్యవహారించబోతున్నారు. సంస్థపై ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచడంలో మీ వంతుగా కృషి చేయాలి. మన సంస్థ ప్రజలకు కల్పిస్తోన్న సౌకర్యాలను, వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం, తదితర అంశాలు ప్రజలకు చెప్పాలి. జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) పెంచేలా పాటుపడాలి. గ్రామాల్లోని ప్రజల రవాణా అవసరాలకు మీరే గుర్తు వచ్చే విధంగా వారితో మమేకమవ్వాలి. మిమల్ని అధికారులుగా గుర్తించి ఇచ్చిన ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు సమర్థవంతంగా నిర్వహించాలి. సంస్థను ప్రజలకు మరింతగా దగ్గర చేయడంలో మీ పాత్ర కీలకమనే విషయం మరిచిపోవద్దు’ అని అన్నారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని హితవు చెప్పారు. టీఎస్ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినేలా వ్యవహారించొద్దని, స్వీయ క్రమ శిక్షణ కలిగి ఉండాలని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ గతకొంత కాలంగా ఐటీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకుని టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలకు వివరించాలన్నారు. విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరించిన విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ గుర్తించి సత్కరిస్తుందని, ఈ ప్రోత్సహకాలను మోటివేషన్‌గా తీసుకుని మంచిగా పనిచేసి.. సంస్థ వృద్దికి కృషి చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. అనంతరం విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ పోస్టర్, కరదీపికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ విలేజ్ బస్ ఆఫీసర్‌కు ఐడీ కార్డుతో పాటు బ్యాగ్‌ను అందజేశారు. తమను అధికారులుగా గుర్తించి ఈ బాధ్యతను అప్పగించింనందుకు సజ్జనర్‌కు విలేజ్ బస్ ఆఫీసర్లు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన ప్రసాద్, చీఫ్ మేనేజర్(ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్స్) విజయ్ కుమార్, సీఈఐటీ రాజశేఖర్, బిజినెస్ హెడ్ సంతోష్ కుమార్, సీటీఎం(మార్కెటింగ్) సుధా పరిమళ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ఎంలు వెంకన్న, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘కేటీఆర్‌కు ఓయూ, కేయూకు వెళ్లే దమ్ముందా?’ -
పుంజుకున్న ఆర్టీసీ.. లాభాలబాట పట్టించిన శుభ ముహూర్తాలు
శుభ ముహూర్తాలు ఆర్టీసీని లాభాల బాటపట్టించాయి. ఏప్రిల్‌లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి జీతాలిచ్చేందుకు సంస్థ ఇబ్బందిపడ్డ పరిస్థితి మారి.. ప్రస్తుతం రోజువారీ సగటు ఆదాయం రూ.15.50 కోట్లుగా నమోదవుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 45 డిపోలు లాభాల్లోకి చేరాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74 శాతంగా నమోదవుతోంది. శుభముహూర్తాలు కొనసాగినన్ని రోజులు పరిస్థితి మెరుగ్గా ఉండనుంది. అలాగే, రానున్న వానాకాలంలోనూ ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ భావిస్తోంది. రికార్డు స్థాయి లాభాలతో.. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడిన స్వల్ప కాలానికే ఏకంగా 44 శాతం ఫిట్ మెంట్‌తో వేతన సవరణ జరిగింది. దీంతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల భారం పడింది. అనంతరం పర్యవేక్షణ లోపించడంతో ఆర్టీసీ పనితీరు దిగజారింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నష్టాల కంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పెరిగిపోయాయి. డిపోలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఇన్నాళ్లకు తొలిసారి 96 డిపోలకు 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవడంతో ఓఆర్ 58 శాతానికి పడిపోయి, రోజు వారీ ఆదాయం సగటున రూ.11.50 కోట్లకు పరిమితమైంది. మేలో ముహూర్తాల కాలం ప్రారంభం కావటంతో ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ పుంజుకుంది. ఆదాయం రూ.16 కోట్లను మించి నమోదుకాగా, సగటున వారం రోజులుగా రూ.15.50 కోట్ల మేర వస్తోంది. లాభాల్లో ఉన్న డిపోలు ఇవే.. షాద్‌నగర్, తొర్రూరు, ఆదిలాబాద్, అచ్చంపేట, తాండూరు, జనగామ, వేములవాడ, బీహెచ్ఈఎల్, మహేశ్వరం, మెట్పల్లి, మధిర, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, పరిగి, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, జగిత్యాల, మణుగూరు, గద్వాల, కరీంనగర్–1, భద్రాచలం, నల్లగొండ, సత్తుపల్లి, కోదాడ, దేవరకొండ, వరంగల్–1, పికెట్, యాదగిరిగుట్ట, హైదరాబాద్–2, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వనపర్తి, హైదరాబాద్–1, మియాపూర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, నారాయణ్‌ఖేడ్. చదవండి: ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు -
ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించం: సజ్జనార్ సీరియస్
Hyderabad Viral Video: వీసీ సజ్జనార్ మరోసారి తన మార్క్ చూపించారు. ఓ యువకుడికి సలహా ఇస్తూనే.. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది కాస్త వైరల్ కావడంతో.. సజ్జనార్ స్పందించారు. ప్రమాదాల బారిన పడి.. మీ తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దని సూచిస్తూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు.. చట్టప్రకారం.. ఇలాంటి వారిపై చర్యల కూడా ఉంటాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. మిథానీ డిపోకు చెందిన ఓ బస్సుపై సదరు యువకుడు స్టంట్లు చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఇన్స్టంట్ పాపులారిటీ కోసం పాకులాడుతూ.. ప్రమాదాలు పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తన సొంత అకౌంట్నుంచి.. వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి అంటూ ట్వీట్ చేశారు. ఆపై ఆర్టీసీ ఎండీ హోదాలో మరో ట్విటర్ అకౌంట్ నుంచి.. ఇలాంటి చర్యలకు కఠిన చర్యలు ఉంటాయని మరో ట్వీట్ చేశారాయన. ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023 -
టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం.. ఊరికో బస్ ఆఫీసర్ నియామకం
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్శించేందుకు తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తోన్న వివిధ కార్యక్రమాలను వివరించి.. టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకే విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు రూపకల్పన చేసింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ గారు జారీ చేశారు. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బస్ ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విలేజ్ బస్ ఆఫీసర్ల మార్గదర్శకాలివే! గ్రామాల్లో నివాసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లగా డిపో మేనేజర్లు నియమిస్తారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీల్లేదు. హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామస్థులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను వారు సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్ ట్రిప్పులను పెంచుతారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని వివరిస్తారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే జరిగే అనర్థాలను ప్రజలకు చెప్తారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో పాటు పంక్షన్ హాల్స్ నిర్వాహకులను బస్ ఆఫీసర్లు సంప్రదిస్తారు. వారికి తమ సెల్‌ఫోన్ నంబర్లను అందజేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో సంబంధిత విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను స్థానిక డిపో మేనేజర్ పొందుపరుస్తారు. అందులో బస్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్ ఉంటుంది. ''మీ గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు పొందుటకు విలేజ్ బస్ ఆఫీసర్‌ను సంప్రదించండి." అని పేర్కొంటారు. అంతేకాదు, ప్రతి గ్రామ సర్పంచ్‌కు తమ విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను లేఖ రూపంలో తెలియజేస్తారు. ఆ ఆఫీసర్ సేవలను వినియోగించుకోవాలని కోరుతారు. మంచిగా పనిచేసే విలేజ్ బస్ ఆఫీసర్లను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి పనితీరు మంచిగా ఉన్న వారిని బెస్ట్ విలేజ్ బస్ ఆఫీసర్ అవార్డుతో సత్కరించనుంది. ఈ విధానం వల్ల అందరూ మంచిగా పనిచేసే అవకాశముంది. ''గ్రామాల్లో సర్వీస్‌లకు సంబంధించి ఎమైనా సమస్యలుంటే ప్రస్తుతం డిపో మేనేజర్లను సంప్రదించాలి. చాలా గ్రామాలకు డిపో దూరంగా ఉంది. శుభకార్యాలకు అద్దె బస్సులను బుక్ చేసుకోవాలన్నా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థతో ఇక ఆ సమస్య ఉండదు. ప్రతి సమస్యను ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రజల అవసరాలను చెప్పొచ్చు. ప్రజలు, టీఎస్ఆర్టీసీకి అనుసంధానకర్తల్లాగా ఈ ఆఫీసర్లు పనిచేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 10 వేల గ్రామాలకు టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఆయా గ్రామాల్లో 2 వేలకు పైగా విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను వినియోగించుకుని ప్రోత్సహించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. -
కండక్టర్లు మర్యాదగా మెలగాలి: సజ్జనార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులతో బస్సు కండక్టర్లు మర్యాదగా మెలగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. బస్‌భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ చాలెంజ్ ఫర్ట్రైనింగ్ పేరుతో కండక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కండక్టర్లతో ఆయన మాట్లాడారు. ప్రయాణికులను బస్సుల్లోకి సాదరంగా ఆహ్వానించాలని, గౌరవంగా సంబోధించాలని సూచించారు. ఆక్యుపెన్సీ రేషియోను 75 శాతానికి చేర్చాలనే సంస్థ లక్ష్యానికి కండక్టర్లు సహకారం అందించాలన్నారు. హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జీపీలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు కొత్తగా జీపీ లు, ఏజీపీల నియామకం చేపడుతూ అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సల్వాజి రాజశేఖర్‌రావు, కె.సుధాకర్‌రెడ్డి, ఆర్.మన్మద్‌రెడ్డి, కొండపర్తి శ్రీనివాస్, ఎల్.సు«దీర్, కె.ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారు. మరో 31 మందిని అసిస్టెంట్ జీపీలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
TSRTC: కొత్త ఈ-బస్సును చూశారా?
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ హితం దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ-బస్సులను రోడ్డెక్కించనుంది. వచ్చే నెల నుంచి ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అదీ విజయవాడ(ఆంధ్రప్రదేశ్) రూట్లో కావడం గమనార్హం. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతుంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. వచ్చే నెలలోనే కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, మునిశేఖర్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్‌తో పాటు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఏజీఎంలు వేణుగోపాల్ రావు, ఆనంద్ బసోలి, తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు #TSRTC ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తేనుంది.హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా)… pic.twitter.com/Yzk0svcSja — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 17, 2023 ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రత్యేకతలివే! ►12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంది. ► ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ► బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ► ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ► ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. ► బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ► బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. ► అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ► ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి కూడా మరో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను ఆయా సంస్థలు టీఎస్ఆర్టీసీకి అందజేయనున్నాయి. -
TSRTC: లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్‌లు
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు లక్షకి పైగా మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచే ఈ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. భక్తుల డిమాండ్ దృష్ట్యా తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించింది. బుక్ చేసుకున్న భక్తులకు రెండు మూడు రోజుల్లోనే తలంబ్రాలను అందజేయనుంది. భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాల తొలి బుకింగ్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం సజ్జనర్‌కు టీఎస్ఆర్టీసీ బిజినెస్ హెడ్(లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోందన్నారు. ఎంతో విశిష్టమైన ఆ తలంబ్రాలను పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారనని పేర్కొన్నారు. ‘గత ఏడాది 88 వేల మంది బుక్ చేసుకుంటే.. ఈ సారి సోమవారం నాటికి రికార్డు స్థాయిలో ఒక లక్షమందికిపైగా భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. మొదటగా 50 వేల మందికి తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం హోండెలివరీ చేస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నాం. భక్తుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు పొడిగించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. భక్తులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, ఎంతో విశిష్టమైన తలంబ్రాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, పీవీ మునిశేఖర్, సీటీఎం జీవనప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ -
అలాంటి కంపెనీలకు ప్రచారం చేయొద్దు: అమితాబ్‌కు సజ్జనార్ విజ్ఞప్తి
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తారు. ఆయన ప్రమోట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి దూసుకుపోతుంది. అందుకే పలు కంపెనీలు కోట్లలో డబ్బులు ఇచ్చి అమితాబ్‌ని తమ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే వాటిలో కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయ్యొద్దని అమితాబ్‌కు విజ్ఞప్తి చేశాడు సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ‘అమితాబ్‌తో పాటు మిగిలిన స్టార్ హీరోలందరికి నాదొక విజ్ఞప్తి. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది’ అని సజ్జనార్ ట్వీట్ చేశాడు. కాగా, అబితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేపై 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ.. ఆమ్వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF — V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023 -
టీఎస్ఆర్టీసీ చాలెంజ్.. టార్గెట్ 100 డేస్.. రూ.200 కోట్లే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలను పెద్ద ఆదాయంగా మలుచుకొనేందుకు టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయత్నం ప్రారంభిస్తోంది. వంద రోజులపాటు ఆర్టీసీలో స్పేర్ బస్సులు సహా మొత్తం బస్సులను రోడ్డెక్కించడంతోపాటు ప్రత్యేక మార్పుచేర్పులు, కొత్త ప్రయత్నాలతో భారీ ఆదాయాన్ని పొందాలని నిర్ణయించింది. దీనికి ‘టార్గెట్ 100 డేస్’గా పేరు పెట్టింది. ఈ నెల 23 నుంచి జూన్ 30 వరకు దీన్ని కొనసాగించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఈ వంద రోజుల్లో సిబ్బంది అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టరాదన్నారు. వీక్లీ ఆఫ్‌లలో సిబ్బంది ‘పరిరక్షణ బృందాలు’గా ఏర్పడి రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులెక్కేలా చూడాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ కనీసం 70 వేల కి.మీ. మేర బస్సులన్నీ కలిపి అదనంగా తిరగాలని లక్ష్యం నిర్దేశించారు. వంద రోజుల్లో కనీసం రూ. 200 కోట్ల మేర అదనపు ఆదాయం పొందాలని ఆర్టీసీ భావిస్తోంది. గతేడాది వేసనిలో ప్రయోగాత్మకంగా వంద రోజుల చాలెంజ్‌ను అమలు చేయగా అప్పట్లో రూ. 178 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. అలాగే గతేడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో మరో కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సైతం భారీ ఆదాయం లభించింది. దీంతో ఇప్పుడు మరింత ఆదాయం కోసం ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇవీ లక్ష్యాలు ► ప్రతి ట్రిప్పులో కనీసం నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు అదనంగా బస్సులు ఎక్కేలా డ్రైవర్, కండక్టర్లు చొరవ చూపాలి. ►రద్దీ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద అవసరమైతే రెండు నిమిషాలపాటు అదనంగా బస్సులను ఆపాలి. ►ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద ఆర్టీసీ ‘పరిరక్షణ బృందాలు’ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న ప్రయాణికులను బస్సుల వైపు మళ్లేలా చూడాలి. ►వేసవిలో బస్సు ట్రిప్పులు మధ్యాహ్నం వేళ తగ్గించి ఉదయం, రాత్రిళ్లలో పెంచాలి. ►ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అవసరమైతే రాత్రి వేళ బస్సులు తిప్పే మూడో షిఫ్టును కూడా అమలు చేయాలి. ►అదనపు సమయంలో పనిచేసిన సిబ్బందికి కి.మీ.కు రూ.2 చొప్పున అదనంగా చెల్లించాలి. అద్దె బస్సులను కూడా అదనపు ట్రిప్పులకు వినియోగించాలి. ►రాత్రివేళ మెయింటెనెన్స్ చేసే బస్సులకు పగటి వేళనే ఆ ప్రక్రియ పూర్తి చేసి రాత్రి వేళ ట్రిప్పులకు వినియోగించాలి. ►పరీక్షలు పూర్తయ్యాక గ్రామాలకు తిప్పే సరీ్వసుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉండే సరీ్వసులను గుర్తించి వాటిని రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలకు మళ్లించాలి. ►డిమాండ్ ఎక్కువగా ఉండే రోజుల్లో టార్గెట్‌ను మించి బస్సులు ఎక్కువ కి.మీ. తిరగాలి. ఒకటి రెండు పాయింట్లలో గ్రౌండ్ బుకింగ్ కోసం కండక్టర్లను పెట్టి, బస్సులను కండక్టర్ సరీ్వస్ లేనివిగా ఎక్కువ తిప్పాలి. ►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే వారిపై చర్యలు తీసుకొనేందుకు రవాణా, పోలీసు శాఖలతో కలిసి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలి. -
TSRTC: పాదచారులూ.. జర జాగ్రత్త
హైదరాబాద్: పాదచారులు రహదారులపై వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూచిస్తోంది. అజాగ్రత్తగా వల్ల తమ విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని చెప్తోంది. కొందరు పాదచారులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే టీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురువుతున్నాయని తమ పరిశీలనలో వెల్లడయిందని తెలిపింది. ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల్లో 283 మంది మరణించారు. అందులో 71 మంది పాదచారులు ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారిలో 25 శాతం పాదచారులే ఉండటం గమనార్హం. ప్రమాదాలు జరిగిన తీరుపై ఇటీవల టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా విచారణ చేశారు. ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లే పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఈ విచారణలో వెల్లడైంది. ‘రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలను తీసుకుంటోంది. దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలనూ సేప్టీ వార్డెన్లను నియమించి.. ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పడు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తోంది. కానీ పాదచారులు తెలిసో తెలియకో చేసే చిన్న తప్పిదాల వల్ల టీఎస్ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే వారికి ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకే రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించిన ప్రాణాలకే ప్రమాదం ’అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. దేశంలో రోడ్డు ప్రమాదానికి గురువుతున్న ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు పాదచారులుంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఆయా ప్రమాదాల్లో 15 నుంచి 20 శాతం మంది పాదచారులు మృత్యువాతపడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పాదచారులు ట్రాపిక్ రూల్స్‌పై స్వీయ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాదచారులు అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోయి తమ కుటుంబాలకు శోకాన్ని మిగల్చవద్దని హితవు పలికారు. పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి పాదచారులు ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకోవాలి. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. గ్రామీణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారు. రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలి. జీబ్రాలైన్ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్ చేయాలి. పరధ్యానంలో అసలే ఉండొద్దు. పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలి. సెల్‌ఫోన్, హియర్ ఫోన్స్ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హరన్ వినపడకపోవచ్చు. రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలి. -
‘స్వప్నలోక్’ అగ్నిప్రమాద ఘటన: క్యూనెట్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి
హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలని చెప్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తోన్న ఆరుగురు యువతీ యువకులు మరణించడంపై సజ్జనర్ స్పందించారు. ''స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తాం." అని సజ్జనర్ అన్నారు. భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందన్నారు. క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్ ఎంఎల్ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50-3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మోసపూరిత క్యూనెట్ పై అనేక కేసులు నమోదు చేసిన, ఈడీ ఆస్తులను జప్తు చేసిన దాని తీరు మారడం లేదన్నారు. ''యువతీయువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్షిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి.'' అని సజ్జనర్ సూచించారు. మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒక్కటికి ఒక్కటికి రెండు సార్లు నిర్ధారించుకుని అద్దెకివ్వాలని సూచించారు. అధిక అద్దెకు ఆశపడి ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దని సజ్జనర్ హితవు పలికారు. #Hyderabad కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో #TSRTC కి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. @tsspbnshq @Govardhan_MLA @DrSangramsingh3 pic.twitter.com/GjUbDkNajg — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 19, 2023 -
హైదరాబాద్: అదిరిపోయే ఆఫర్లును ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. రూ.50 చెల్లిస్తే..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ పని తీరుతో ఆకట్టుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీ ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. కొత్త ఆఫర్ వచ్చేసింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట సరికొత్త ఆఫర్లను ప్యాసింజర్లకు కోసం తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. టీ-6 ఆఫర్ ఏంటంటే.. మహిళలు, సీనియర్ సిటిజన్ల టీ-6ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. 6 గంటల పాటు (అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) సిటీ ఆర్డినరీ బస్ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎఫ్-24 .. కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల కోసం ఈ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది శనివారం, ఆదివారం, సెలవు దినాలలో వర్తిస్తుంది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌పై 4 వ్యక్తులు రోజంతా సిటీ ఆర్డినరీ బస్ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. వారిలో 55.50 లక్షల మంది T-24 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023 -
మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. -
అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష.. జేడీ సంగ్రామ్‌కు సజ్జనార్ అభినందన
హైదరాబాద్: 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ గారు స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను ప్రశంసించారు. కెరిర్ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్‌గా మారిందన్నారు. కానీ.. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష ఖరారు కావడం చారిత్రాత్మకమన్నారు. "పిల్లలు సమాజ ఆస్తి. వారిని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే.. వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. పిల్లలకు రక్షణ ఛత్రంగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులనూ సీరియస్‌గా తీసుకుని కోర్టుల్లో వేగంగా ట్రయల్ జరిగేలా చూడాలి. తన వంతు బాధ్యతగా పొక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చొరవ ప్రశంసనీయం." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారులపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాటుపడాలన్నారు. చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను అభినందించి సన్మానించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్, రాజేంద్ర కుమార్, హరిగోపాల్, కానిస్టేబుల్ హనుమంతరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ (ఐటీ) రాజశేఖర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, చీఫ్ మేనేజర్(ఫైనాన్స్) విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
సజ్జనార్ ట్వీట్: అదృష్టం అంటే ఈమెదే.. మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చింది!
రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వాహనదారులు ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటిని చూస్తుంటే వాహనాలతో రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గుదలలో ఏ మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి. తాజాగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పనితీరుతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచే దిశగా అడుగులు వేయడంతో పాటు ఆర్టీసీలో ప్రయాణించే వారికి నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో.. ట్రాఫిక్ జామ్‌లో ఓ యువతి లేన్ని క్రాస్ చేసి లారీ ముందుకు తన ద్విచక్ర వాహనాన్ని ఆపుతుంది. అంతలో వెనుక ఉన్న లారీ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వాహనం బైక్‌ని ఢీకొట్టడంతో ఆమె లారీ కింద పడిపోతుంది. అయితే లారీ డ్రైవర్ మాత్రం తన వాహనాన్ని ఆపక ముందుకు నడిపిస్తాడు. అదృష్టవశాత్తు ఆ యువతి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ఈ వీడియో షేర్ చేసిన ఆయన ద్విచక్రవాహనదారులకు రోడ్డపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తతో పాటు నిబంధనలు పాటించడం ఎంతైనా అవసరమని సూచించారు. అందరికీ ఈమెలా అదృష్టం వరించదు! ద్విచక్రవాహనదారులారా..! లేన్ డ్రైవింగ్ ను పాటించండి. రోడ్డుపై బైక్ తో అడ్డదిడ్డంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. #RoadSafety pic.twitter.com/uq9gRIwubk — V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 22, 2023 చదవండి మరీ.. ఇంత దారుణమా.. రాత్రికి రాత్రే కూల్చేశారు.. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గూడ్ న్యూస్.. భారీ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆ మేరకు ఆన్లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్ఎస్) సాప్ట్‌వేర్‌ను అప్డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. చదవండి: తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు "రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలి. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యం. ముందస్తు రిజర్వేషన్ విధానానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రయాణీకులకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి తగిన కృషి జరుగుతోంది" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వారు కోరారు. -
ప్రయాణికుల ఆనందమే లక్ష్యం.. సిటీ బస్సుల్లో 'టీఎస్ఆర్టీసీ రేడియో’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో కూకట్పల్లి డిపోకు చెందిన బస్సులో ఈ రేడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కూకట్పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్చెరువు, కూకట్పల్లి-శంకర్పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ సరికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు. TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 28, 2023 -
భక్తులకు గమనిక.. రథసప్తమికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు 80 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలు వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెం ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. కరీంనగర్ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్‌నగర్ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడెంకు 5, హైదరాబాద్ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్‌నగర్ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్నీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వారు స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. గురువారం వసంత పంచమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర, వర్గల్‌కు 108 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
టీఎస్ఆర్టీసికి సంక్రాంతి బొనాంజ.. 11 రోజుల్లో భారీ ఆదాయం!
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ నెల 10 నుంచి 20 తేది వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. “టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు. సాధారణ చార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు, రద్దీకి అనుగుణంగా మా సిబ్బంది అద్బుతంగా పనిచేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించిన ప్రజలకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలానే ఆదరించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్దతతో పనిచేశారని, వారి కృషి వల్లే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ బయోటాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ కుటుంబంలోని ప్రతి ఒక్క సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలని అందించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా తమ సంస్థకు రవాణా, పోలీస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు సహకరించారని గుర్తుచేశారు. ఆయా విభాగాల సమన్వయంతో పనిచేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. టీఎస్ఆర్టీసీకి సహకరించిన రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ అధికారులకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎంఎల్ఎం వలలో చిక్కుకోవద్దు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: అత్యాశతో క్యూనెట్ వంటి మోసపూరిత మల్టీలెవెల్ మార్కె టింగ్ (ఎంఎల్ఎం) సంస్థల వలలో చిక్కు కోవద్దని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధ తిలో అమాయకుల నుంచి రూ. వేల కోట్లు కొల్లగొట్టిందని ఆయన పేర్కొన్నారు. క్యూనె ట్‌కు చెందిన 36 బ్యాంకు ఖాతాల్లోని రూ. 90 కోట్ల నగదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సీజ్ చేసిన నేపథ్యంలో సజ్జనార్ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రజలకు ఈ సూచనలు చేశారు. గతంలో తాను సైబరా బాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేసినప్పుడు క్యూనెట్ మోసాలపై పలు కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశా రు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమ తులు ఉండవని, ఆర్బీఐ నియంత్రణలో లేని సంస్థలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు -
క్యూనెట్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎంఎల్ఎం మోసాలపై సజ్జనార్ ట్వీట్
అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని, అవి మోసపూరిత సంస్థలని అని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయని తెలిపారు. అలాంటి మోసపూరిత స్కీమ్ లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవని స్పష్టం చేశారు. బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకు సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని, నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు. మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల మాయలో పడొద్దన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ గొలుసుకట్టు సంస్థల వల్ల దేశ ఆర్థిక పరిస్థితే కాక.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీగా సజ్జనర్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. (చదవండి: Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది) అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్, పూజహెగ్డే, షారుఖ్ ఖాన్ లకు 2019లో నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా 500 మందికి సైబరాబాద్ పోలీసులు అప్పట్లో నోటీసులు జారీ చేయడం గమనార్హం. తాజాగా క్యూనెట్ సంస్థ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనార్ స్పందించారు. క్యూనెట్ లాంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి మాయలో పడొద్దని సూచించారు. ఎంఎల్ఎం కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. It’s a FRAUD ⚠️ When I was @cpcybd, I registered several cases against #Qnet. Since I felt that #Qnet business model is a FRAUD and DUPED gullible investors, I fought with conviction. @dir_ed’s public disclosure of its findings against Qnet vindicated my stand. pic.twitter.com/elXSEhPSMN — V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2023 It’s a FRAUD ⚠️ There is a need to widen the crackdown on such entities (firms running pyramid, MLM and other ponzi schemes) and save gullible people. pic.twitter.com/hFOETKLMP1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 19, 2023 -
టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్లను కేటాయించాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఎ.ఐ), తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు లేఖలు రాసింది. ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని అభ్యర్థించింది. అందుకు ఆయా విభాగాలు అంగీకరించాయి. ఈ నెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడురు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా టోల్ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించనున్నారు. ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లేన్ నుంచి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్ఆర్టీసీ తీసుకుంటోంది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు. "సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 4,233 ప్రత్యేక బస్సులను ఈ నెల 10 నుంచి 14వ తేది వరకు నడుపుతున్నాం. అలాగే, ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్‌ను కేటాయించాలని ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్ విభాగాలను కోరాం. మా అభ్యర్థనను వారు అంగీకరించారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడే కన్నా.. టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండి. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు." అని ప్రజలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. -
ఆర్టీసీ సిబ్బందిని కాపాడిన ఓ నిర్ణయం.. 280 మందికిపైగా తప్పిన ప్రాణాపాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో ఏటా మరణాలు అధికంగా నమోదవుతుండటాన్ని గుర్తించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వాటి నివారణ దిశగా తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా 280 మందికిపైగా సిబ్బందికి ప్రాణాపాయం తప్పించింది. మరే ప్రభుత్వ విభాగంలో లేనట్లుగా రెండు నెలల క్రితం ఆర్టీసీలో ‘హెల్త్ చాలెంజ్’ పేరుతో ఉద్యోగులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 287 మంది తీవ్రమైన హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది. రోజువారీ విధులకు హాజరవుతున్నప్పటికీ వారి గుండె పనితీరు బాగోలేదని, వారి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే వారికి అత్యవసర వైద్య చికిత్సలు ప్రారంభించారు. సరిగ్గా మందులు వాడని ఇద్దరు మాత్రం మృత్యువాత పడగా మిగతా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో అపాయం నుంచి బయటపడ్డారు. ఇందులో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నందున, వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చే డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడటం ద్వారా పరోక్షంగా ప్రయాణికులకు కూడా ప్రమాదం తప్పినట్టయింది. ఆ మరణాలు అలాంటివే... ఆర్టీసీలో గత ఆర్థిక సంవత్సరం దాదాపు 225 మంది చనిపోయారు. ఇందులో 60 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతోనే ప్రాణాలు వదిలారు. ఏటా సగటున ఆర్టీసీలో 200 మంది వరకు చనిపోతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ఆ సంఖ్య గరిష్టంగా 180 ఉండగా ఆ తర్వాత అది క్రమంగా 200 దాటుతూ వస్తోంది. అప్పటివరకు డ్యూటీ చేసిన వారు ఉన్నట్టుండి నేలకూలుతున్నారు. తీవ్ర పని ఒత్తిడిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, ఇతర ఫీల్డ్ సిబ్బంది ఎక్కువగా చనిపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఏకంగా 48 వేల మంది ఉద్యోగులకు డిపోలవారీగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. హైబీపీతో బాధపడుతూ సరైన వైద్యం తీసుకోకపోవడం, మందులు సరిగ్గా వాడకపోవడంతో పరిస్థితి క్రిటికల్‌గా మారిన వారు, క్రిటికల్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నవారు, సమస్య ఇప్పుడిప్పుడే పెరుగుతున్నవారు, కొత్తగా ఆ సమస్య పరిధిలోకి వచ్చినవారు ఇలా ఏబీసీడీఈ అంటూ జాబితాలు రూపొందిస్తున్నారు. అందులో క్రిటికల్ ఈసీజీ జాబితాలో 287 మంది చేరారు. శరీరంలో సమస్య తీవ్రంగా ఉన్నట్టు ఆ ఉద్యోగులకు కూడా తెలియదు. రోజువారీ విధులకు హాజరవుతున్నారు. వారికి సంబంధించి కొందరి మెడికల్ హిస్టరీ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఉంది. కానీ దాన్ని ఫాలో అవుతున్నవారు లేరు. వారి పరిస్థితి అంత బాగోలేదని రిపోర్టులు స్పష్టం చేయటంతో వెంటనే నిమ్స్‌లో ఓ డాక్టర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. వారిలో సమస్య తీవ్రత దృష్ట్యా 60 మందికి యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. తీవ్ర సమస్య ఉన్న 25 మందికి వెంటనే స్టెంట్లు వేయించారు. ఇక 10 మంది మరింత క్రిటికల్‌గా ఉన్నట్లు తేల్చి అందులో ఇద్దరికి నిమ్స్‌లోనే తాజాగా ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించారు. మరో ఇద్దరికి సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వారికి తగిన చికిత్సలు అందిస్తున్నారు. మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం.. ఇద్దరి మృతి.. ప్రమాదకరంగా ఉన్నవారిలో ఇద్దరు డ్రైవర్లు సరిగా మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇటీవల ఆ ఇద్దరు మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎండీ సజ్జనార్ వెంటనే మిగతావారు మందులు సరిగా వేసుకునేలా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్లకు అప్పగించారు. ఇందుకోసం యాప్ ద్వారా అలర్ట్ మెసేజ్‌లు డీఎంలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్య కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు మందులు వాడుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే డీఎంకు మెసేజ్ వెళ్తుంది. ఆ మేరకు డీఎంలు వారితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మందులు వాడేలా చర్యలు తీసుకుంటారు. ఫలితంగా మిగతావారి ఆరోగ్యం కుదుటపడుతోంది. త్వరలో వీరంతా తిరిగి విధుల్లోకి వచ్చే పరిస్థితి తేనున్నట్టు వైద్యులు భరోసా ఇస్తున్నారు. నిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లోని డిస్పెన్సరీల్లో సిబ్బందికి చికిత్సలందిస్తున్నారు. నిమ్స్‌లోనూ వారికి ప్రత్యేకంగా బెడ్లు, ఓ డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. స్టెంట్లు వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీలను నిమ్స్‌లో నిర్వహిస్తున్నారు. -
Hyderabad: మెట్రో స్టేషన్లతో సిటీ బస్సుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: మెట్రో స్టేషన్లతో సిటీ బస్సులను అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. మెట్రో రైళ్లు, సిటీ బస్సుల మధ్య సమన్వయం కోసం శనివారం బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రోకు, ఆరీ్టసీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఎల్అండ్టీ చీఫ్ స్ట్రాటజీ అధికారి మురళీ వరద రాజన్, చీఫ్ మార్కెటింగ్ అధికారి రిషికుమార్ వర్మ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్లను అనుసంధానం చేస్తూ బస్సులను నడపడంతో పాటు సర్వీసుల సమయపట్టిక, సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ల వద్ద ఆర్టీసీ సమాచార కేంద్రాలను, అనౌన్స్మెంట్ ఏర్పాట్లను చేయనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా ఈ అనుసంధానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మెట్రోరైల్ ప్రతినిధుల బృందం చొరవను ప్రత్యేకంగా అభినందించారు. మెట్రో రైలుతో ఆర్టీసీ బస్సుల అనుసంధానం ఆహ్వానించదగిన పరిణామమని ఎల్అండ్టీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత! -
సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ వారియర్స్ వాళ్లే: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వర్తించే కార్మికులే సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ యోధులని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కోవిడ్ సమయంలో మరణించిన వారికి కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారాలను చేయలేకపోయారని, అలాంటి సమయంలో శ్మశాన వాటిక కార్మికులు చేసిన వృత్తి ధర్మం మాటల్లో వర్ణించలేనిదని ఆయన కొనియాడారు. జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ ఆధ్వర్యంలో శ్మశాన కార్మికులకు చేయూతనందించేందుకు బుధవారం మాదాపూర్‌లోని ఈ–గెలేరియా మాల్ వేదికగా ‘బెస్ట్ సిగ్నేచర్’ అనే ఫండ్ రైసింగ్ కాంటెస్ట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ సజ్జనార్ తన సిగ్నేచర్‌తో కాంటెస్ట్‌లో పాల్గొని ఫండ్‌రైసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో గౌరవప్రదంగా అంతిమ క్రియలను నిర్వర్తించిన నిజమైన హీరోల సంక్షేమానికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ కాంటెస్ట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కోవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని దాదాపు ఐదు వందల శ్మశానాల్లో నాలుగు వేల మంది కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారని జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ అధ్యక్షులు ధన్నారపు రాకేష్ తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో కార్మికుల పిల్లల పాఠశాల విద్య, ఆరోగ్య బీమా, వారి వృత్తిపరమైన భద్రత, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా పాల్గొనే వారు కనీసం రూ.500 కన్నా ఎక్కువ చెల్లించి తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కాంటెస్ట్‌లో ఆకట్టుకునే సంతకం ఉన్న మొదటి విజేతకు రూ.25 వేలు, ఆ తరువాతి స్థానాల్లో రూ.15 వేలు, రూ. 10 వేల బహుమతులతో పాటు రూ. వెయ్యితో ఐదు కన్సోలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు jcibph.in లేదా 903120 01980, 9951143775లో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో మెట్రో రైల్ అడ్వర్టైజ్ లీజింగ్ హెడ్ కెవి నాగేంద్ర ప్రసాద్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ ఆనందిత సిన్హా, గిరీష్ భట్, మనోహర్ భట్, సీఎస్ చలం, అనిల్ కుమార్ సిద్దూ, పీ వీరభద్రుడు, కేసీజీఎఫ్ బుధపూర్ణిమ అధ్యక్షుడు అనిల్ దండూ, రమేష్ దాడిగల, రఘురాజ్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు) -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వాహనం
సాక్షి, పెద్దపల్లి(పాలకుర్తి): ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణిస్తున్న కారు పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్వంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో సజ్జనార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రామగుండం మండలం మల్యాలపల్లికి చెందిన ఎగ్గె నాగరాజు (38), అతని భార్య లక్ష్మి, అంతర్గాం మండలం రాయదండికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి వారి సొంత ఆటోలో కరీంనగర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి రామగుండంకు తిరుగుపయనమయ్యారు. ధర్మారం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే వీరి ఆటోను వెనుక నుంచి వచ్చిన సజ్జనార్ కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజు, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. భూమయ్య, నూనె లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్ ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఈ సంఘటనలో సజ్జనార్ కుడిచేతికి స్వల్పంగా గాయమైంది. ఫోర్‌లైన్ రహదారిపై ఆటో ఒక్కసారిగా అడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బసంత్‌నగర్ ఎస్సై శివాణిరెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: (నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం) -
ఆర్టీసీ బస్సు సమస్యపై యువతి ట్వీట్.. సజ్జనార్ స్పందన
సాక్షి, హైదరాబాద్: నగరంలో రాత్రి సమయాల్లో బస్టాప్‌లో బస్సలు సరిగా ఆపడం లేదంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే నందిని అనే యువతి తన సమస్యను ట్విటర్ వేదికగా తెలియజేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చింది.‘దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుంచి 10:02 వరకు పటాన్చెరు ఆల్విన్ బస్టాప్‌లో ఒక్క బస్సు కూడా ఆపలేదు. చేయి చూపించిన కూడా ఆపలేదు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది, ఆర్టీసీ అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. స్టాప్‌లలో కాకుండా ఇంకెక్కడ ఆపుతారు. దయచేసి అవసరమైనవి చేయండి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంజీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ట్విటర్లను ట్యాగ్ చేశారు. Sir, దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుండి 10:02 వరకు patancheru ఆల్విన్ బస్టాప్ లో ఒక్క బస్సు కూడా ఆపలేదు చేయి చూపించిన కూడా ఆపలేదు ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది rtc ante public transport, stops kaaka inkekkada aaputharu @tsrtcmdoffice — Nidhi Nidhi (@NandhiniNandu12) September 27, 2022 అయితే యువతి చేసిన ట్వీట్‌కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సంబంధిత అధికారులు దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ టీఆఎస్ఆర్టీసీ ట్విటర్‌ను ట్యాగ్ చేశారు. సజ్జనార్ ఆదేశాలపై స్పందిస్తూ. యువతికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ. . తమ డ్రైవర్లు, కండక్టర్లకు అల్విన్ బస్ స్టాప్ వద్ద బస్సులను ఆపమని అవగాహన కల్పిస్తామని టీఎస్ఆర్టీసీ తెలిపింది. కాగా సాధారణ పౌరులు చెప్పే సమస్యలు, చేసే ట్వీట్లపై వెంటనే సమాధానమిచ్చే సజ్జనార్‌పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అదృష్టం అంటే ఆమెదే.. వీడియో షేర్ చేసిన సజ్జనార్!
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేము. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నా ఎదుటి వ్యక్తులు చేసే తప్పుల వల్ల ప్రాణాలపైకి వస్తుంది. అయితే, కొన్నిసార్లు అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడతారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి వీసి సజ్జనార్ ట్విట్టర్లో షేర్ చేశారు. త్రుటిలో తప్పించుకున్నా ఎన్నాళ్లు ఇలా అదృష్టంపై ఆధారపడతాం? రోడ్డుపై వెళ్తున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అంటూ రాసుకొచ్చారు. వీడియోలో.. బిజీ రోడ్డులో ఓ మహిళ రోడ్డు పక్కన వెళ్తూ వీధి దారిని దాటుతుంటుంది. ఆ ముందే ఓ ఆటోను నిలిపి వేచి చూస్తుంటాడు డ్రైవర్. ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా బోల్తా పడింది. అయితే, రోడ్డుపై వెళ్తున్న మహిళ రెండు వాహనాల మధ్య నుంచి రెప్పపాటులో ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో రోడ్డుపై వెళ్లేప్పుడు బాధ్యతగా మెలగాలని, ప్రమాదల నివారణకు చట్టాలను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. Narrow escape but how long do we depend on luck? Be responsible on Roads #RoadSafety pic.twitter.com/JEck2aXIuK — V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 1, 2022 ఇదీ చదవండి: Viral Video: హనుమాన్ వేషాధారణతో డ్యాన్స్.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలడంతో..