VC Sajjanar Request To Amitabh Bachchan Not To Collaborate With Fraud Companies - Sakshi
Sakshi News home page

అలాంటి కంపెనీలకు ప్రచారం చేయొద్దు: అమితాబ్‌కు సజ్జనార్‌ విజ్ఞప్తి

Published Fri, Mar 31 2023 9:19 AM | Last Updated on Fri, Mar 31 2023 9:47 AM

VC Sajjanar Request To Amitabh Bachchan Not To Collaborate With Fraud Companies - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలతో పాటు యాడ్స్‌ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తారు. ఆయన ప్రమోట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి దూసుకుపోతుంది. అందుకే పలు కంపెనీలు కోట్లలో డబ్బులు ఇచ్చి అమితాబ్‌ని తమ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే వాటిలో కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయ్యొద్దని అమితాబ్‌కు విజ్ఞప్తి చేశాడు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌.

‘అమితాబ్‌తో పాటు మిగిలిన స్టార్‌ హీరోలందరికి నాదొక విజ్ఞప్తి. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది’ అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా, అబితాబ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేపై 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసు నమోదు చేసింది. గొలుసు క‌ట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ.. ఆమ్వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement