Amway company
-
అలాంటి కంపెనీలకు ప్రచారం చేయొద్దు: అమితాబ్‌కు సజ్జనార్ విజ్ఞప్తి
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలతో పాటు యాడ్స్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తారు. ఆయన ప్రమోట్ చేశారంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి దూసుకుపోతుంది. అందుకే పలు కంపెనీలు కోట్లలో డబ్బులు ఇచ్చి అమితాబ్‌ని తమ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే వాటిలో కొన్ని కంపెనీలు జనాలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి ప్రచారం చేయ్యొద్దని అమితాబ్‌కు విజ్ఞప్తి చేశాడు సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ‘అమితాబ్‌తో పాటు మిగిలిన స్టార్ హీరోలందరికి నాదొక విజ్ఞప్తి. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది’ అని సజ్జనార్ ట్వీట్ చేశాడు. కాగా, అబితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేపై 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ.. ఆమ్వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF — V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023 -
ఆమ్వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను
ప్రముఖ న్యూట్రిలైట్ కంపెనీ ఆమ్వే ఇండియా తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానును ప్రకటించింది. ఈ ఒప్పందంపై మీరాబాయి చాను సంతకం చేసింది. న్యూట్రిలైట్ డైలీ, ఒమేగా, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వంటి ఆమ్వే ప్రచారా కార్యక్రమాలలో ఇక నుంచి మీరాబాయి చాను కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలోని మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్యం, పోషకాహార రంగాన్ని ఏకీకృతం చేయడంపై ఆమ్వే దృష్టి సారించింది. అందుకోసమే చానుతో సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం తెలిపింది. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం) "మీరాబాయి చానుతో మా అనుబంధం ఒక సహజ ఎంపిక. ఆమె ఫిట్ నెస్ పట్ల కనబర్చిన నిబద్ధత సాటిలేనిది. ప్రజలు మరింత మెరుగ్గా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, అందుకే ఆమెను భాగస్వామిగా ఎంచుకునట్లు" ఆమ్వే ఇండియా సీఈఓ అన్షు బుధ్రాజా తెలిపారు. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో 26 ఏళ్ల చాను మహిళల 49 కిలోల విభాగంలో 204 కిలోల (87 కిలోల+115 కిలోలు) విభాగంలో రజత పతకాన్ని సాధించడంతో దేశమంతా సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. -
ఆమ్వే కేసులపై వైఖరి ఏమిటో చెప్పండి: హైకోర్టు
హోంశాఖకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: గొలుసుకట్టు వ్యాపారంతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలపై ఆమ్వే సంస్థపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులన్నింటినీ సీఐడీకి బదలాయించే విషయంలో వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని హైకోర్టు శుక్రవారం హోంశాఖను ఆదేశించింది. ఇందుకు సం బంధించిన వివరాలను తమ ముందుంచాలం టూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమ్వే కింది స్థాయి ఉద్యోగులెవ్వరినీ కూడా అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.