హోంశాఖకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గొలుసుకట్టు వ్యాపారంతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలపై ఆమ్వే సంస్థపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులన్నింటినీ సీఐడీకి బదలాయించే విషయంలో వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని హైకోర్టు శుక్రవారం హోంశాఖను ఆదేశించింది. ఇందుకు సం బంధించిన వివరాలను తమ ముందుంచాలం టూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమ్వే కింది స్థాయి ఉద్యోగులెవ్వరినీ కూడా అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమ్వే కేసులపై వైఖరి ఏమిటో చెప్పండి: హైకోర్టు
Published Sat, Jun 7 2014 12:07 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement