
తెలుగు సినీ ప్రేక్షకులకు స్వప్న దత్ పరిచయమే

నిర్మాత అశ్వనీ దత్ కూతురిగా ఆమె చిత్రపరిశ్రమలో అడుగు పెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు

స్వప్న సినిమా బ్యానర్‌ను ప్రారంభించిన ఆమె పలు చిత్రాలను నిర్మించారు. తన బ్యానర్‌కు ఒక టాప్ హీరో లక్ ఫ్యాక్టర్ అని ఆమె అన్నారు

స్వప్న సినిమా బ్యానర్ నుంచి స్టూడెంట్ నెం: 1,ఒకటో నంబర్ కుర్రాడు,ఎవడే సుబ్రహ్మణ్యం,మహానటి,జాతి రత్నాలు, సీతా రామం వంటి చిత్రాలు వచ్చాయి

ఇప్పటి వరకు స్వప్న దత్ నిర్మించిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ విజయంలో తమకు ఒక సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది

స్టూడెంట్ నెం: 1 సినిమా వల్ల ఎన్టీఆర్‌తో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడిందని స్వప్న తెలిపింది

స్వప్న సినిమా బ్యానర్‌లో కొబ్బరి కాయ కొట్టి మొదటి సినిమా (స్టూడెంట్ నెం: 1)తో ప్రారంభించింది ఎన్టీఆర్ అని ఆమె అన్నారు

ఆ లక్ కలిసొచ్చిందని తర్వాతి సినిమాలన్నింటికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించే వాళ్లం.. ఆయన కూడా సంతోషంగా వచ్చేవారని స్వప్న తెలిపారు

తమ బ్యానర్‌కు ఎన్టీఆర్ ఒక లక్ ఫ్యాక్టర్ అని ఆమె అన్నారు

స్వప్న బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా లాంచ్ సమయంలో ఎన్టీఆర్ ప్రమేయం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు




