Swapna Dutt
-
రికార్డులు క్రియేట్ చేసే వాళ్లు పరుగులు పెట్టరు: స్వప్న దత్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం తాజాగా విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కల్కి నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ తాజాగా స్పందించారు. 'కల్కి సినిమా విడుదల తర్వాత చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ఇతర సినిమాలకు చెందిన రికార్డులను 'కల్కి' క్రాస్ చేసిందా..? అని కొందరు అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన వారెవ్వరూ మళ్లీ వాటికోసమే పరుగులు పెట్టి సినిమాలు చేయరు. కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల కోసం తీశాం. ఇలాంటి ప్రశ్నలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.' అని స్వప్నదత్ అన్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి స్టార్స్ నటించారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్, వైజయంతి మూవీస్ బ్యానర్లో కల్కి చిత్రం కూడా ఎవర్‌గ్రీన్‌గా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
Kalki2898AD ‘నవ్వొస్తోంది.. మేం రికార్డులకోసం చేయలేదు’! షాకింగ్ ట్వీట్
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి2898 ఏడీ అంచనాలకు మించి ఆదరణను సంపాదించు కుంటోంది. నాగ్ కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే, టెక్నికల్ విలువలు, విజువల్స్ అన్నీ అద్భుతంగా అమరి పోవడం ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. అద్భుతమైన సినిమా అంటూ కితాబిస్తున్నారు. దీంతో వసూళ్లు , రికార్డులపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు సి. అశ్వినీదత్ కుమార్తె , నిర్మాత స్వప్నాదత్ చలసాని చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.#Kalki2898AD pic.twitter.com/85X4CYqNij— Swapnadutt Chalasani (@SwapnaDuttCh) June 28, 2024 ‘చాలామంది కాల్ చేసి మీరు రికార్డులను బ్రేక్ చేశారా అని అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నవ్వొస్తోంది.. ఎందుకంటే ఆ రికార్డులను సాధించినవారు, లేదా రికార్డులు సృష్టించిన వారు .. రికార్డుల కోసం ఎపుడూ సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమాలు తీసారు. మేమూ అదే చేశాం’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు మంచిమాట అంటూ కమెంట్ చేశారు. ఎవరూ ఉచితంగా ఏమీ చేయరు అక్కా. మీరు నిజంగా సినిమాపై ఉన్న ప్రేమ కోసం దీన్ని రూపొందించినట్లయితే, తొలి వారంలోనే రెట్టింపు వసూళ్ల కోసంలా కాకుండా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించండి. అందరూ చూడగలిగేలా సరసమైన ధరలో ఉండేలా చూడండి అని వ్యాఖ్యానించారు. -
'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి కానుకగా ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ... ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' అని పేర్కొని, ఆయన లేటెస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'భైరవ' పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ‘సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్’ వేదికపై కల్కి చిత్రం గురించి ఆమె ఇలా మాట్లాడారు. 'ప్రభాస్ పోషిస్తున్న 'భైరవ' పాత్ర చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది' అంటూ స్వప్న పేర్కొన్నారు. అందుకు సంబంధిత విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రొడ్యూసర్ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కల్కి సినిమా కథ గురించి గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇలా వ్యాఖ్యానించారు. 'మహాభారతంతో కథ మొదలై.. క్రీస్తుశకం 2898లో ముగుస్తుంది. కల్కి కథ మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా సినిమా విలువలు ఉంటాయి. గతం, భవిష్యత్తు ప్రపంచాలను క్రియేట్ చేయడంలో భారతీయతని ప్రతిబింబించేలా ఉంటాయి. అందరూ అనుకున్నట్లు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లేడ్ రన్నర్' చిత్రంతో కల్కికి పోలికలు ఉండవు. అని అశ్విన్ తెలిపాడు. మే 9న విడుదల కానున్న కల్కి సినిమా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. Bhairava is gonna stay in hearts for a very long time -#Prabhas 💥🫶 pic.twitter.com/w00j7uF7JL — Ace in Frame-Prabhas (@pubzudarlingye) March 22, 2024 -
అది మా అదృష్టం
‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు. ► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్‌డ్రాప్‌లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్‌ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్‌కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్‌ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది. ► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్‌తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం. ► అందరం చర్చించుకునే ఓ జడ్జ్‌మెంట్‌కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్‌కు బలం. ► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం. -
ఫిలిం మేకింగ్‌లోకి ‘మేడమ్స్’.. ప్రొడ్యుసర్స్‌గా రాణిస్తున్న నారీమణులు
ఒక సినిమాను నిర్మించాలంటే చాలా కష్టం. కేవలం డబ్బు పెడితే సరిపోదు..ఎంతో మందిని మేనేజ్ చేయాలి...ఎన్నో టెన్షన్స్ పడాలి. అందుకే సినిమా నిర్మాణ విషయంలో మహిళలు దూరంగా ఉండేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ...నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకొని ఫిలిం మేకింగ్(నిర్మాణం)లో రాణిస్తున్న ‘మేడమ్స్’ గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించాడు. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్...ప్రియాంక దత్. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ లేడీ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. స్వప్న సినిమాస్ బ్యానర్ స్థాపించి భారీ చిత్రాలను నిర్మించటమే కాదు..బిగ్గెస్ట్ హిట్స్ కూడా అందుకున్నారు. డైరెక్టర్ నాగ్అశ్విన్ తో మహానటి నిర్మించిన ఈ లేడీ ప్రొడ్యూసర్స్...సేమ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించారు. సమంత నటిస్తున్న మైధిలాజికల్ మూవీ శాకుంతలం...ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తన తండ్రి గుణశేఖర్ సినిమాలకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రుద్రమదేవి సినిమాకి కూడా నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా చేసింది. నిన్నటి వరకు చిరంజీవి సినిమాలకు , క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ డాటర్ సుస్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్ గా మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షూట్ అవుట్ ఎట్ ఆలేర్ లాంటి వెబ్ సిరీస్ తో పాటు ..సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు నిర్మించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు డాటర్..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్ ప్రసీద కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టింది. ప్రసీద..ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు, దివ్య దీప్తి నిర్మాతగా మారి... హీరో కిరణ్ అబ్బవరంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నిర్మించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. మరో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కూడా ప్రొడ్యూసర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ వెంకటేష్ మహా ను నమ్మి...ప్రొడ్యూసర్ గామారింది పరుచూరి విజయ ప్రవీణ. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా మారిన ఈమె వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు.. వీళ్లే కాదు..కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్స్ గా...కో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. హీరోయిన్ చార్మి నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. హీరోయిన్ అవికా గోర్ పాప్ కార్న్ సినిమాని తనే సొంతంగా నిర్మించింది.