వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి.. అలాగే, లాస్ వెగాస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో 16 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని అనిపిస్తోంది. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోంది. ఘటనలకు కారణమైన రెండు కార్లను టూర్ రెంటల్ వెబ్‌సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారు. బహుశా రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చు’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో లాస్ వెగాస్‌లో చోటుచేసుకున్న ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని.. టెస్లా వాహనం వల్ల కాదని మస్క్ స్పష్టంచేశారు. అదేవిధంగా దీనిపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందన్నారు.
మరోవైపు.. ఈ ప్రమాదాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికాలో వలసల కారణంగా నేరాల సంఖ్య పెరుగుతోంది. వలసల వల్లే నేరస్థుల సంఖ్య అధికంగా ఉందని ముందే హెచ్చరించాం. నా మాటలను డెమోక్రాట్లు, మీడియా ఖండించాయి. నేను చెప్పింది నిజమేనని వరుస ఘటనలే చెబుతున్నాయి. గతంలోకంటే ఇప్పుడు అమెరికాలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం తెలియచేస్తున్నాం. గాయాలపాలైనవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ కామెంట్స్ చేశారు.
The whole Tesla senior team is investigating this matter right now.
Will post more information as soon as we learn anything.
We’ve never seen anything like this. https://t.co/MpmICGvLXf— Elon Musk (@elonmusk) January 1, 2025
Comments
Please login to add a commentAdd a comment