Truck Attack
-
‘న్యూ ఓర్లీన్స్’ దాడి..ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్లో జరిగిన ట్రక్కు దాడిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రాట్ల విధానాల వల్లే అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(జనవరి3) ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.బలహీన,అసమర్థ నాయకత్వమే ఇందుకు కారణమన్నారు.డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) ఎఫ్‌బీఐ,డెమోక్రట్ ప్రభుత్వం,న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.Our Country is a disaster, a laughing stock all over the World! This is what happens when you have OPEN BORDERS, with weak, ineffective, and virtually nonexistent leadership. The DOJ, FBI, and Democrat state and local prosecutors have not done their job. They are incompetent and…— Donald J. Trump (@realDonaldTrump) January 3, 2025అమెరికా విఫలమైందని అంతా మాట్లాడుకుంటున్నారన్నారు. న్యూ ఓర్లీన్స్లో బోర్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ ట్రక్కుతో జనంపైకి దూసుకువచ్చిన ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ మృతి చెందాడు.ఈ కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జబ్బార్ విదేశీ సంస్థల సహకారం లేకుండా ఒంటరిగానే ట్రక్కు దాడి చేశాడని ఎఫ్‌బీఐ తేల్చింది.అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి జబ్బార్ స్ఫూర్తి పొందాడని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన -
USA:ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్‌కు ఎఫ్‌బీఐ వివరించింది. సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్‌బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ న్యూఓర్లీన్స్‌లో అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు. -
అమెరికాలో వరుస ప్రమాదాలు.. ట్రంప్, మస్క్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి.. అలాగే, లాస్ వెగాస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో 16 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని అనిపిస్తోంది. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోంది. ఘటనలకు కారణమైన రెండు కార్లను టూర్ రెంటల్ వెబ్సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారు. బహుశా రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చు’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో లాస్ వెగాస్‌లో చోటుచేసుకున్న ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని.. టెస్లా వాహనం వల్ల కాదని మస్క్ స్పష్టంచేశారు. అదేవిధంగా దీనిపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందన్నారు.మరోవైపు.. ఈ ప్రమాదాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికాలో వలసల కారణంగా నేరాల సంఖ్య పెరుగుతోంది. వలసల వల్లే నేరస్థుల సంఖ్య అధికంగా ఉందని ముందే హెచ్చరించాం. నా మాటలను డెమోక్రాట్లు, మీడియా ఖండించాయి. నేను చెప్పింది నిజమేనని వరుస ఘటనలే చెబుతున్నాయి. గతంలోకంటే ఇప్పుడు అమెరికాలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం తెలియచేస్తున్నాం. గాయాలపాలైనవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ కామెంట్స్ చేశారు.The whole Tesla senior team is investigating this matter right now. Will post more information as soon as we learn anything.We’ve never seen anything like this. https://t.co/MpmICGvLXf— Elon Musk (@elonmusk) January 1, 2025 -
USA: న్యూ ఇయర్ వేళ ఉగ్రదాడి.. 15కు చేరిన మరణాలు
వాషింగ్టన్: కొత్త ఏడాది వేడుకల వేళ అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 15 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు కారణమైన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు. ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది.ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ కీలక ప్రకటన చేసింది. న్యూ ఆర్లీన్స్‌లో పికప్ ట్రక్‌తో బీభత్సం సృష్టించిన నిందితుడిని షంషుద్దీన్ జబ్బార్(42)గా ఎఫ్‌బీఐ గుర్తించింది. అతడు అమెరికా పౌరుడే. టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జబ్బార్ పనిచేస్తున్నాడు. ఏడేళ్లు మిలిటరీలోనూ సేవలు అందించాడు. అయితే, ఆర్థిక కారణాలు ఎదుర్కొంటున్న జబ్బార్‌కు భార్యతో విడాకులు అయ్యాయి. కాగా, ప్రమాదం తర్వాత అతడి వాహనంలో ఐసీస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. దీంతో, ఈ ఘటన టెర్రరిస్ట్‌ల పన్నాగమేనని ఎఫ్‌బీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.New video of last night’s terror attack in New Orleans 😡😡 pic.twitter.com/7Zrab642ab— KellyCurrie45 (@KaCurrie_45) January 1, 2025ఇదిలా ఉండగా.. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూఆర్లీన్స్‌లోని బార్బన్ వీధి కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారీ వేల మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో జబ్బార్ అక్కడికక్కడే మృతిచెందాడు.#ShamsudDinJabbar also Muhammad Shamsuddin Jabbar is the #NewOrleansMassacre terrorist. It looks like he may have some Middle Eastern / South Asian ancestry, desides his dominant black ancestry. #NewOrleansHorror #NewOrleansTerroristAttack #NewOrleansStrong pic.twitter.com/PihoTkf0Qi— Dr. Asim Yousafzai (@asimusafzai) January 2, 2025 బైడెన్ సంతాపం..ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రతి అంశాన్నీ పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసనూ సహించేది లేదని స్పష్టం చేశారు. -
వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌ను కలిపే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి కుప్పగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మంటల్లో చిక్కుకున్న వాహనాలు, ఉవ్వెత్తున ఎగసిన పొగతో కూడిన ఫొటోలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనలో 16 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
సాయివర్షిత్పై తీవ్ర అభియోగాలు! ఏ శిక్ష పడుతుందంటే..
తాను హిట్లర్‌కు అభిమానినని, నాజీయిజం గొప్పదని చెబుతూ.. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడమే లక్ష్యమని, అడ్డొస్తే ఏకంగా అధ్యక్షుడినైనా చంపుతానంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు తెలుగు మూలాలున్న సాయి వర్షిత్. వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో సహా దూసుకెళ్లి బారికేడ్లను ఢీ కొట్టి హల్చల్ చేసిన ఆ టీనేజర్‌పై తీవ్ర అభియోగాలే నమోదు అయ్యాయి. తెలుగు మూలాలు ఉన్న 19 ఏళ్ల సాయివర్షిత్.. సోమవారం(మే22 రాత్రి సమయంలో) ఓ ట్రక్‌తో వైట్‌హౌజ్ వైపు దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి కలకలమే రేపాడు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. విస్తూపోయే విషయాలను వెల్లడించాడు. బుధవారం ఫెడరల్ కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. మే 30 దాకా కస్టడీ విధించింది న్యాయస్థానం. ‘‘ప్రెసిడెంట్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్‌ను చంపుతానని బెదిరించడం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకూ హాని తలపెడతానని ప్రకటించడం, అధ్యక్షుడి కిడ్నాప్‌నకు యత్నం, అధ్యక్షుడికి హాని తలపెట్టే యత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అక్రమ చొరబాటు, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలగజేయడం.. లాంటి అభియోగాలను యూఎస్ పార్క్ పోలీసులు సాయి వర్షిత్‌పై నమోదు చేశారు. అంతేకాదు అతనసలు అమెరికా పౌరుడే కాదని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభియోగాల ఆధారంగా.. గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల(మన కరెన్సీ ప్రకారం) జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ సాయివర్షిత్‌కు స్పష్టం చేశారు. Here are the court doc’s 👉 compiled by @SecretService in this investigation. 19yo Sai Kandula was held w/out bond by a D.C. Superior Court judge today. He’s expected to appear at the federal courthouse tomorrow. No time announced yet. @fox5dc continues to follow developments https://t.co/qLUZvIIo1A pic.twitter.com/FFneR5bQUb — Stephanie Ramirez (@RamirezReports) May 23, 2023 సోమవారం రాత్రి.. సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్కు సాయివర్షిత్ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాడు. అక్కడ యూ హాల్ బాక్స్ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడని, నేరుగా వైట్ హౌజ్ వైపు దూసుకెళ్లాడని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పోలీసులు వెల్లడించారు. వైట్ హౌజ్‌లోకి చొరబడి.. అధికార కైవసం చేసుకోవాలని అనుకున్నానని, దేశాన్ని పాలించడమే తన ఉద్దేశమని సాయివర్షిత్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అదెలా సాధ్యమని పోలీసులు నిలదీయగా.. అధ్యక్షుడిని చంపడమో లేదంటే అడ్డొచ్చే వాళ్లను గాయపర్చడం ద్వారానో అనుకున్నది సాధించాలని సాయివర్షిత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు హాని తలపెట్టడమే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు సాయివర్షిత్. ఈ మేరకు ఆరు నెలల నుంచే గ్రీన్ బుక్ పేరిట తాను ఎలా ప్లాన్ చేసుకున్నదంతా సాయి రాసుకున్నట్లు తెలుస్తోంది. Sai Varshith Kandula of Chesterfield, Missouri is the teenager who was driving the U-Haul and carrying a Nazi flag as he crashed into the security barrier near the White House on Lafayette Square. Kandula allegedly wanted to kill or harm President Biden and VP Kamala Harris. If… pic.twitter.com/dWC5OLED9j — Ed Krassenstein (@EdKrassen) May 23, 2023 సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రం చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రుల నేపథ్యం తెలియాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడెన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. గతంలో డేటా అనలిస్ట్‌గా పని చేశానని, ప్రస్తుతం తానొక నిరుద్యోగినని చెప్పాడు. బుధవారం కోర్టు విచారణలోనూ వినయంగా అతను సమాధానాలు ఇవ్వడంతో జడ్జి సైతం ఆశ్చర్యపోయారు. మరోవైపు అతని తల్లిదండ్రులు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 14 దేశాలను టచ్ చేసే రోడ్డు ఇదే! -
బైక్‌పై లవర్‌తో సోదరి షికారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అన్న
భోపాల్: తన సోదరి.. లవర్‌తో బైక్ మీద వెళ్తోందని ఆమె అన్న గమనించాడు. దీంతో వారిని రోడ్డుపై ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, వారు బైక్ స్పీడ్ పెంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం పట్టలేక దారుణనికి ఒడిగట్టాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో ఫాలో చేసి హైస్పీడ్‌లో ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అయోధ్యనగర్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తన సోదరి.. లవర్‌తో బైక్‌పై వెళ్తోందన్న కోపంతో ఆమె సోదరుడు అజీం మస్సూరీ వారిని వెంబడించాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో వెంబడించి.. బలంగా ఢీకొట్టాడు. అలాగే బైకును, వారిద్దరినీ 10 మీటర్ల దూరం ట్రక్కుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం దిగి.. తన సోదరి సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అజీం మన్సూరీని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. #WATCH | Bhopal: A couple in their twenties from different communities were injured after the girl’s cousin allegedly chased, hit their scooter and assaulted them while they were trying to elope in Ayodhya Nagar on Monday afternoon. pic.twitter.com/hFgg3kOfVC — TOI Bhopal (@TOIBhopalNews) April 20, 2022 ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్ -
జెరూసలేంలో ఉగ్రదాడి : నలుగురు మృతి
-
అసలు నిందితుడు అతడు కాదు!
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ట్రక్కుతో విధ్వంసం సృష్టించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశామని అక్కడి భద్రతా బలగాలు తెలిపాయి. దుండగుడు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తి అని అధికారులు వెల్లడించారు. అయితే.. తాము పొరపాటున వేరే వ్యక్తిని అరెస్ట్ చేశామని.. ట్రక్కు దాడికి పాల్పడింది అతడు కాదని బెర్లిన్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అసలు నిందితుడు వేరే ఉన్నాడని.. అతడి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇంకా పట్టుబడని దుండగుడి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నాయని.. విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో అక్కడ తీవ్ర కలకలం రేగుతోంది. సోమవారం ట్రక్కు దాడిలో.. సెంట్రల్ బెర్లిన్‌లోని క్రిస్మస్ మార్కెట్లో ప్రజలను లక్ష్యంగా దుండగుడు ట్రక్కుతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా జనంపైకి ట్రక్కును తోలుతూ.. మారణహోమానికి దిగాడు. ఈ ఘటనలో 12 మంది చెందగా, 50 మంది గాయపడ్డారు. -
నెత్తురోడిన ఫ్రాన్స్
-
నెత్తురోడిన ఫ్రాన్స్
ఉగ్రమూకలు మరోసారి ఫ్రాన్స్‌లో నెత్తురు పారించాయి. నీస్ నగరంలో ఆ దేశ జాతీయ దినోత్సవం వేడుకలను చూడటానికి వచ్చిన వేలాదిమంది పౌరులను లక్ష్యం చేసుకుని ఉగ్రవాది ఒకడు అత్యంత వేగంగా ట్రక్కు నడుపుకుంటూ పోయి పలువురు చిన్నారులతోసహా 84మందిని పొట్టనబెట్టుకున్నాడు. వందలాదిమందిని గాయపరిచాడు. వెంటనే భద్రతా బలగాలు అతన్ని కాల్చిచంపాయి. 1798 ఫ్రెంచ్ విప్లవంలో జూలై 14న జరిగిన బాస్టిల్ కోట ముట్టడి ఒక కీలకమైన ఘట్టం. రాజరికాన్ని, భూస్వామ్యాన్ని తుత్తినియలు చేసిన ఆ దాడి స్ఫూర్తికీ, విలువలకూ పునరంకితమవుతూ ఏటా ఆ రోజును ఫ్రాన్స్ తన జాతీయ దినోత్సవంగా జరుపు కుంటుంది. ఆ వేడుకల్లో భాగంగా జరిగే వివిధ విన్యాసాలను చూడటానికి వచ్చే వేలాదిమందితో అన్ని నగరాల్లాగే నీస్ నగర సముద్రతీరం కూడా కోలాహలంగా ఉంటుంది. ఫ్రాన్స్‌ను దొంగదెబ్బ తీయడానికి పొంచివున్న ఉగ్రభూతాలు దీన్ని అదునుగా తీసుకున్నాయి. ఒక్కసారిగా పంజా విసిరాయి. ఉగ్రవాదానికి రూపురేఖ లుండవు. విలువలుండవు. ఏ పేరు చెప్పుకున్నా దానికి మతం ఉండదు. మృత్యువే దాని మతమూ, అభిమతమూ. ఫ్రాన్స్‌లో గత రెండేళ్లుగా ఉగ్ర జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. నిరుడు జనవరిలో వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యా లయంపై తుపాకులతో దాడిచేసి పాత్రికేయులు, పోలీసులతోసహా 17మందిని పొట్టనబెట్టు కున్నాక ఆ ఏడాది నవంబర్‌లో పారిస్ నగరంలో మారణహోమం సృష్టించారు. వివిధచోట్ల దాడులు చేసి 130మంది ప్రాణాలు తీశారు. అదే నెలలో ఆఫ్రికా ఖండం మాలిలో ఒక హోటల్‌పై దాడిచేసి 27మందిని కాల్చిచంపగా అందులో అత్యధికులు ఫ్రెంచి పౌరులు. ఆ దాడులకు ముందూ, వెనకా యూరప్ లోని వివిధచోట్ల ఉగ్ర వాదులు దాడులు చేయకపోలేదు. కానీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో 32 మందిని హతమార్చిన ఉదంతమే పెద్దది. అయితే దాడి జరిగిన తీరు గమనిస్తే ఈ వరస దాడులనుంచి ఫ్రాన్స్ గుణ పాఠం నేర్చుకోలేదనిపిస్తుంది. పారిస్ దాడుల తర్వాత అసాధారణ రీతిలో ఫ్రాన్స్ ఎమర్జెన్సీ విధించింది. అందుకు సంబంధించిన కఠినమైన నిబంధనలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. ఎమర్జెన్సీని ఈ నెలలో తొలగించబోతున్నట్టు ఈమధ్యే ఆ దేశం ప్రకటించింది. ఎమర్జెన్సీ పేరిట విశేషాధికారాలు దఖలు పరుచుకుని ఉగ్రవా దంపై యుద్ధం చేస్తున్నచోట మళ్లీ ముష్కరులు దాడికి ఎలా తెగించారు? రోజూ యధావిధిగా ఉండే భద్రతతోపాటు జాతీయ దినోత్సవానికి అదనపు భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. పటిష్టమైన నిఘా ఉంటుంది. పైగా ఇప్పుడు వేడు కలు జరిగిన బీచ్ ప్రాంతంలో ఎలాంటి వాహనాలనూ అనుమతించరు. తనిఖీల కోసం అక్కడ పోలీస్ బారికేడ్ కూడా ఏర్పాటుచేశారు. అలాంటి ప్రాంతంలో ఉన్న ట్టుండి ఒక భారీ ట్రక్కు పెనువేగంతో జనంపైకి దూసుకెళ్లడాన్ని...దాన్ని నడుపు తున్న దుండగుడు కాల్పులు జరుపుకుంటూ వెళ్లడాన్ని ఎవరైనా ఊహించగలరా? అది కూడా కొద్దో గొప్పో దూరం కాదు...రెండు కిలోమీటర్ల నిడివి. ఆ దారి పొడవునా అనేకుల్ని నుజ్జు నుజ్జు చేసుకుంటూ వాహనం వెళ్తుంటే అక్కడున్న భద్రతా సిబ్బంది వెనువెంటనే నిలువరించలేకపోయారు. కాల్పులు జరిపి దుండ గుణ్ణి చంపే సమ యానికి 84మంది మృత్యువాతపడ్డారు. ఇవన్నీ ఫ్రాన్స్ అజాగ్రత్తనూ, నిఘా లోటు పాట్లనూ పట్టిచూపుతున్నాయి. దుండగుడు గతంలో చిన్న దొంగతనం కేసులో అరెస్టుకావడం, ఆ తర్వాత దౌర్జన్యానికి దిగిన కేసులో పోలీసులు ప్రశ్నించడం మినహా అతను ఉగ్రవాదులతో ప్రభావితమైనట్టు పోలీసు రికార్డుల్లో నమోదు కాలేదని అంటున్నారు. దాడికి దిగిన ఉగ్రవాది ఒక్కడే అయినా అతనికి ఉన్మాదాన్ని నూరిపోసినవారూ, పథకరచన చేసి దాడికి పంపినవారూ ఆ గడ్డ పైనే ఉంటారు. వారిని ముందుగా గుర్తించలేకపోవడం నిఘా వైఫల్యం. కనీసం ఇప్పుడైనా మెలకువతో వ్యవహరించడం అవసరమని ఫ్రాన్స్ పాలకులు గుర్తిం చాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే నీస్ మారణహోమం తర్వాత అతివాదులు రెచ్చిపోతున్నారు. ‘ఇస్లామిక్ ఛాందసవాదం’పై పోరు చేయాలంటూ జాతీయవాద నాయకుడు లీ పెన్ డిమాండ్ చేస్తున్నారు. దాడి వెనకున్న ఉన్మాదులు కోరుకునేది కూడా ఇదే. సమాజంలో పరస్పర అనుమానాలు, ద్వేషం, అసహనం, కక్షలు రగల్చగలిగితే అలాం టిచోట మురికి కాల్వల్లో పెరిగే క్రిమికీటకాల మాదిరి శరవేగంతో వృద్ధి చెందడానికి వారికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సమాజాన్ని ధ్వంసం చేయడం వారికి తేలికవుతుంది. తమ దేశాల్లో ఉగ్రవాదంపై యుద్ధం పేరిట వైమానిక దాడులు, ద్రోన్ దాడులు చేస్తున్న అమెరికా, పాశ్చాత్యదేశాలకు గుణపాఠం నేర్ప డానికి ఇంతకుమించిన వ్యూహం వారి దగ్గరలేదు. పాశ్చాత్య దేశాల్లో ఉంటున్న ముస్లింలు తాము ఎటువైపో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతున్నదని 2014 చివరిలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ చేసిన హెచ్చరికను మరువకూడదు. అలాంటి ‘తేల్చుకోవాల్సిన సమయం’ తీసుకురావడంలో భాగంగానే యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అక్కడి సమాజాలు ముస్లింలను అను మాన దృక్కులతో చూస్తే, ద్వేషం విస్తరిస్తే... వారిలో అభద్రతాభావం పెరగక తప్పదని ఉగ్రవాదులు అంచనా వేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడి తేనే అక్కడ పాగా వేయగలమని, ప్రతీకారం తీర్చుకోగలమని వారు భావిస్తు న్నారు. అదే జరిగితే ఇప్పటిలా కొందరు వ్యక్తుల్ని ప్రభావితం చేసి, వారితో విధ్వంసాలను సృష్టించడంకాక భారీ స్థాయిలో నష్టం కలిగించగలమనుకుంటు న్నారు. అందువల్లే జాగ్రత్తగా అడుగేయాల్సిన అవసరం ఉంటుంది. ఉగ్ర భూతాన్ని తుదముట్టించడానికి కఠినమైన చర్యలు, నిఘా అవసరం. అలాంటి చర్యలన్నీ వారిని ఏకాకుల్ని చేసేలా ఉండాలి. అంతేతప్ప సమస్య మూలాలు ఒకచోట ఉంటే దృష్టి కేంద్రీకరణ వేరేచోట ఉండకూడదు. బహుళ సంస్కృతుల మేళవింపుగా... ఉదారవాద భావాల నిలయంగా ఉంటున్న ఫ్రాన్స్ అత్యంత చాకచక్యంతో, సంయ మనంతో వ్యవహరించినప్పుడే ఉగ్రవాదులను ఓడించడం తేలికవుతుంది.