బైక్‌పై లవర్‌తో సోదరి షికారు.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన అన్న | Lovers Injured After Being Girl Brother Chased In Bhopal | Sakshi
Sakshi News home page

బైక్‌పై లవర్‌తో సోదరి షికారు.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ఆమె అన్న.. షాకింగ్‌ వీడియో

Published Thu, Apr 21 2022 6:33 PM | Last Updated on Thu, Apr 21 2022 6:36 PM

Lovers Injured After Being Girl Brother Chased In Bhopal - Sakshi

భోపాల్‌: తన సోదరి.. లవర్‌తో బైక్‌ మీద వెళ్తోందని ఆమె అన్న గమనించాడు. దీంతో వారిని రోడ్డుపై ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, వారు బైక్‌ స్పీడ్‌ పెంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం పట్టలేక దారుణనికి ఒడిగట్టాడు. వారు వెళ్తున్న బైక్​ను ఓ మినీ ట్రక్కుతో ఫాలో చేసి హైస్పీడ్‌లో ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అయోధ్యనగర్‌లో చోటుచేసుకుంది.

ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తన సోదరి.. లవర్‌తో బైక్‌పై వెళ్తోందన్న కోపంతో ఆమె సోదరుడు అజీం మస్సూరీ వారిని వెంబడించాడు. వారు వెళ్తున్న బైక్​ను ఓ మినీ ట్రక్కుతో వెంబడించి.. బలంగా ఢీకొట్టాడు. అలాగే బైకును, వారిద్దరినీ 10 మీటర్ల దూరం ట్రక్కుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం దిగి.. తన సోదరి సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

దాడి తర్వాత.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అజీం మన్సూరీని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్​ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement