‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’ | BJP MLA advice to students not use Degrees open a puncture shop | Sakshi

‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’: బీజేపీ ఎమ్మెల్యే విచిత్ర సూచన

Jul 15 2024 8:07 PM | Updated on Jul 15 2024 8:28 PM

BJP MLA advice to students not use Degrees open a puncture shop

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య  విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం  గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్‌ సైకిల్‌ రిపేర్‌ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.

‘మేము  ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్‌ సైకిల్‌ రిపేర్‌ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు  సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.

 

ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement