
బెంగళూరు: హనీ ట్రాప్ (honey trap) దుమారంతో కర్ణాటక (Karnataka) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హనీట్రాప్ అంశంపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన 18 మంది బీజేపీ (bjp) ఎమ్మెల్యేలపై స్పీకర్ యుటి ఖాదర్ సస్పెన్షన్ వేశారు.
కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించింది. అయితే, ఆ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హనీట్రాప్‌పై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హనీట్రాప్‌ను డైవర్ట్ చేసేందుకు ముస్లిం రిజర్వేజన్ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారని ఆరోపణలు గుప్పించారు
అంతేకాదు, హనీట్రాప్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పేపర్లను చించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ ముఖంపై విసిరేశారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేపర్లు చించి బీజేపీ ఎమ్మెల్యేలపై విసరడంతో గందరగోళం నెలకొంది.
దీంతో అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. సభ నుంచి 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment