assebly
-
ధరణి పేరుతో పెద్దాయన దగా చేశారు
సాక్షి, హైదరాబాద్: ధరణి పేరుతో పెద్దాయన రాష్ట్ర ప్రజలను దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. 2020లో తెచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయా రన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ‘తెలంగాణ భూ హక్కులు–సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన లఘుచర్చలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆ పెద్దమనిషి చేసిన పాప ఫలితాన్ని తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రిగా 1973లో పీవీ నరసింహారావు భూపరిమితి చట్టం తెచ్చి భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారన్నారు. 2006లో వైఎస్.రాజశేఖరరెడ్డి తొలిసా రిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ గిరిజనులు వైఎస్ పట్టా భూములుగానే చెప్పుకుంటున్నార న్నారు. ఎవరి సూచనలు, అభిప్రాయా లను తీసుకోకుండా పెద్దాయన, ఆయన తొత్తుగా ఉన్న ఓ అధికారి కూర్చొని చేసిన చట్టం ధరణి అని...ఇప్పటికీ 1.18 లక్షల భూ ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు.ధరణి పేరుతో పేదల దగ్గరి నుంచి గత ప్రభుత్వం లాక్కొన్న ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామని, మాయమైపోయిన లక్షల ఎకరాలను అర్హులైన వారికి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ నవాబ్ నాటి దోపిడీని తలపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో రైతులను దోపిడీ చేసిందన్నారు. «ధరణి.. ఓ విప్లవం: పల్లారాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసు కొచ్చారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే ధరణి తెచ్చారని, నాలుగు గో డల మధ్య తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలున్న 18 లక్షల ఎకరాలను పార్ట్ బీలో చేరిస్తే, అందులో కూడా 10 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పారు. వివిధ కారణాల వల్ల కొన్ని భూము లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు.రైతుల ఆత్మహత్యలు, హత్యలకు ధరణే కారణం: సీతక్కధరణి ఎంతో అద్భుతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతుండగా మంత్రి సీతక్క కలగజేసుకున్నారు. ధరణి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు, హత్యలు పెరిగాయని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తుంగలో తొక్కారని, దీంతో పేదలు భూముల్లో ఫాంహౌస్‌లు వెలిశాయని చెప్పారు. భూమిని ఎవరు సాగుచేస్తున్నారో తెలిపే కాలమ్‌ను తొలగించారని విమర్శించారు.సోమేశ్‌కుమార్ మాయలో కేసీఆర్ పడ్డారు: కూనంనేని ధరణితో గ్రామాల్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్ప డిందని, ప్రజలకు పనికి రాని ఈ పోర్టల్‌ను రద్దు చేయడం సరైందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమేశ్‌కుమార్ మాయలో పడిన కేసీఆర్ ధరణితో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించారని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టే సంస్కరణల్లో కాస్తు కాలమ్ పెట్టాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు.అవినీతిపరుల పేర్లు ఎందుకు చెప్పడం లేదు: మహేశ్వర్‌రెడ్డి ధరణితో లక్షల ఎకరాల భూములు మాయమ య్యాయని, రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించిందని, ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు బయటపె ట్టడం లేదని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ధరణితో లాభపడ్డ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధరణి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.వక్ఫ్ భూములను పరిరక్షించిన వైఎస్: అక్బరుద్దీన్ ఒవైసీ అనేక లోపాలతో తీసుకొ చ్చిన ధరణి పోర్టల్ కారణంగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిందని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందని ఎంఐఎం పక్షనేత అక్బరు ద్దీన్ ఒవైసీ అన్నారు. ధరణి తో ఎంతోమంది అక్రమంగా ప్రభుత్వ, పేదల భూములను తమ పేరిట చేసుకున్నారని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపాలని కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వక్ఫ్ భూముల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని, ఆయన గొప్ప నేత అని అక్బరుద్దీన్ గుర్తు చేసుకున్నారు. రెండోసారి వక్ఫ్‌బోర్డు భూములను సర్వే చేయించింది వైఎస్ అని చెప్పారు. -
శాసనసభ బీజేపీ పక్షనేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బీజేపీ నేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు.మహేశ్వర్‌రెడ్డిని బీజేపీఎల్పీ నేతగా నియమిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ పక్ష ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డిని నియామకం అయ్యారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విదితమే. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించించగా ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఇందులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. -
అసెంబ్లీలోనే నిద్రపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
లక్ష వరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తయ్యాయి: మంత్రి కేటీఆర్
-
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశం ప్రారంభం కానుంది. పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టాల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. శుక్రవారం శాసనసభలో చర్చ నిర్వహించి మున్సిపల్ చట్టాల బిల్లును ఆమోదించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిల్ హాల్లో శాసన మండలి సమావేశం నిర్వహించి ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. మున్సిపల్ చట్టాల బిల్లులతో పాటు మరో నాలుగు ఆర్డినెన్స్‌ల బిల్లులను సైతం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ప్రధానంగా మున్సిపల్ చట్టాల బిల్లును ఆమోదించేందుకు శాసనసభ సమావేశాన్ని నిర్వహిస్తున్నందున ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి ప్రొసీడింగ్‌లతో సంబంధం లేకుండా కేవలం ఎజెండాలోని అంశాలపై మాత్రమే చర్చకు అనుమతించనున్నారు. -
ఇంకెవరు?
సాక్షి,సిటీబ్యూరో: సీఎం కేసీఆర్ నూతన కేబినెట్లో నగరం నుంచి నలుగురికి చోటు కల్పించనున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వారెవరు అన్నది సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గురువారం సీనియర్ నేత మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణం చేయించి పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటుకు మరో నాలుగు రోజులుందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో కేబినెట్లో చోటు కోసం నేతలు ఎవరికి వారుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రద్దయిన కేబినెట్లో నగరం నుంచి మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డికి స్థానం కల్పించారు. తాజా కేబినెట్లో రంగారెడ్డితో కలుపుకుని ఇంకా నాలుగు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రంగారెడ్డిఉమ్మడి జిల్లా కోటాలో మేడ్చల్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి అవకాశం కల్పించే అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కూడా సీఎం కేసీఆర్ ముందస్తు నిర్ణయమేనని ప్రచారం జరగుతోంది. మల్లారెడ్డికి సీఎం కేసీఆర్‌తో పాటు యువనాయుడు కేటీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసివచ్చే అంశం. ఇక సిటీకి చెందిన నాయిని నర్సింహారెడ్డిని మళ్లీ క్యాబినెట్లో కొనసాగించే అంశం సస్పెన్స్‌గా ఉంది. నాయినికి ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకా రెండేళ్లు ఉంది. కొత్త క్యాబినెట్లోనూ స్థానం దక్కుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ నాయినిని తప్పిస్తే పార్టీ బాధ్యతలు లేదా శాసనమండలిలో ఏదైనా కీలక పదవి ఆయనకు అప్పగించే అవకాశం లేకపోలేదని సన్నిహితులు భావిస్తున్నారు. మరోపక్క సికింద్రాబాద్, సనత్నగర్ల నుంచి విజయం సాధించిన పద్మారావు, తలసాని సైతం తమకు క్యాబినెట్లో చోటు ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ఒకరిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే ఆలోచన అధినేతకు ఉంటే క్యాబినెట్లో చోటు దక్కకపోవచ్చు. ఒకవేళ సీనియర్లు అందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వస్తే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆమేరకు ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్‌గౌడ్, వివేకానంద్‌గౌడ్, అరికెపూడి గాంధీ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
‘చట్టసభల్లోకి వెళ్తెనే బీసీలకు న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. చట్టసభల్లోకి వెళితేనే సమన్యాయం జరుగుతుందని పేర్కొనారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ జాయింట్ కమిటీ సమావేశంలో 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్యను జాతీయ ఓబీసీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, సమానత్వం రావాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, పంచాయతీ రాజ్ ఎన్నికలవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు యాక్షన్ కమిటీ కృషిచేస్తుందని పేర్కొన్నారు. యాక్షన్ కమిటీకి తోడుగా మండల స్థాయివరకూ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల్లో ప్రజాస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటును అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
4 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు.. నేడు ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానా లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే నూపుర్(ఉత్తర ప్రదేశ్), షాకోట్(పంజాబ్), జోకిహట్(బిహార్), గొమియా, సిల్లీ(జార్ఖండ్), చెంగన్నూరు(కేరళ), పాలుస్ కడేగావ్(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్) మహేస్థల( పశ్చిమబెంగాల్) అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. మే 31న లెక్కింపు చేపడతారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణంతో యూపీలోని కైరానాకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ మద్దతుతో లోక్‌దళ్ అభ్యర్థి తబస్సుమ్ ఆమెపై తలపడుతున్నారు. గోరక్‌పూర్, పూల్పూర్ ఫలితాలు కైరానాలో పునరావృతమవుతాయని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్లో బీజేపీ ఎంపీ చింతామన్ వంగర మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరంగా వంగర కుమారుడు శ్రీనివాస్ శివసేన తరఫున బరిలో ఉండగా.. బీజేపీ నుంచి గవిట్ పోటీపడుతున్నారు. భండారా–గోండియా సిట్టింగ్ ఎంపీ ఆ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
‘గన్మెన్లను తొలగించడం దారుణం’
సాక్షి, హైదరాబాద్ : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు బోడెపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇప్పుడు ఆయనకు ఏమైన అయితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డికి ప్రాణ హాని ఉందని గతంలోనే ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి కక్ష్యపూరిత నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వపు నీతిమాలిన చర్య అసెంబ్లీలో జరిగిన సంఘటనలో కేవలం కోమటిరెడ్డి విసిరిన విజువల్స్ మాత్రమే చూపిస్తున్నారని, స్వామిగౌడ్‌కి తాకిన విజువల్స్‌ని చూపించడంలేదని శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వపు దిక్కుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ నీతిమాలిన చర్యతోనే అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. న్యాయంగా వీడియో ఫుటేజ్‌లను ఇస్తామని చెప్పిన ప్రకాశ్ రెడ్డిని ప్రభుత్వం అవమానించిదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయంగానే సస్పెండ్ చేస్తే సాల్వే వంటి అత్యంత ఖరీదైన అడ్వకేట్ ఎందుకని ప్రశ్నించారు. బీసీలు అయినా మధుసూదనాచారి, స్వామిగౌడ్‌లను పావులుగా మార్చుకొని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. -
గంటన్నర ఇవ్వటమే గొప్ప అన్నట్లుగా...
హైదరాబాద్ : సభ ఇదే తీరుగా పని చేస్తే.. తమకు నిరసన వ్యక్తం చేయడం మినహా మరో మార్గం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము మాట్లాడతామని పదే పదే కోరుతున్నా.. అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపించారు. బడ్జెట్ కేటాయింపులపై వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే తాము మాట్లాడదల్చామని.. అయినా మైక్ ఇవ్వడం లేదని.. ఇలా అయితే నిరసన వ్యక్తం చేయడం మినహా మరో మార్గం లేదని జగన్ అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌పై ఎన్ని గంటలు మాట్లాడారో రికార్డులు తిరగేయాలని ఆయన సూచించారు. గత పదేళ్లలో బడ్జెట్ మీద ప్రతిపక్ష నేతలు బడ్జెట్ మీద చర్చపై ఎంత సమయం తీసుకున్నారో పరిగణనలోకి తీసుకోవాలని జగన్ అన్నారు. ఉన్నది ఒక్క ప్రతిపక్ష పార్టీయేనని... ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్టం లేదని, గంటన్నర సమయం ఇవ్వటమే గొప్ప అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా అయితే తమకు నిరసన మినహా మరో మార్గం లేదన్నారు. బడ్జెట్‌పై చర్చలో తనకు మరింత సమయం కావాలని జగన్ పట్టుబట్టారు. అయితే స్పీకర్ మాత్రం సమయం కేటాయించడానికి అనుమతించకపోవడంతో సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సభనుంచి వాకౌట్ చేసింది. కేవలం గంటన్నర సమయం మాత్రమే ఇవ్వడంపై నిరసన తెలిపింది. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
ఏప్రిల్ 2న నోటిఫికేషన్ 9వరకు నామినేషన్ల స్వీకరణ జిల్లాలో 28 లక్షలపైగా ఓటర్లు 3,339 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీన జరగనున్న 13 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. సోమవారం ఆయన తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వచ్చే నెల 2వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని, అదే రోజు నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మహదేవపూర్, మహా ముత్తారం మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో కమ్యూనికేషన్ లేనట్లు గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని అసెం బ్లీ సెగ్మంట్లకు రిటర్నింగ్ అధికారిగా తాను వ్యవహరిస్తానని, పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లకు జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్, నిజామాబాద్ లోక్‌సభ స్థా నం పరిధిలోని కోరుట్ల, మెట్పల్లి స్థానాలకు ని జామాబాద్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. సాధారణ ఎన్నికలకు సం బంధించి ఇప్పటికే జిల్లాలో 3,339 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో పో లింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లున్న గ్రా మాల్లో, 1400 ఓటర్లున్న పట్టణాల్లో అదనంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 52 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి నివేదించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో వెబ్ అందుబాటులో లేని 476 పోలింగ్ కేంద్రాలను మినహాయించి మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. 83 పోలింగ్ కేంద్రాను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామన్నారు.ఇప్పటికే 13 మంది రిటర్నిం గ్ అధికారులు, 57 మంది తహసీల్దార్లు గుర్తించిన పో లింగ్ కేంద్రాలను తనిఖీ చేశారన్నారు. పెరిగిన ఓటర్లు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలోగా జిల్లాలో ఓటర్ల సంఖ్య 28 లక్షలు దాటుతుందని కలెక్టర్ చెప్పా రు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు జిల్లా లో 27,43,655 మంది ఓటర్లుండగా.. ఈ నెల 9వ తేదీన 73,178 మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఇప్పటికే 52వేల మందికి నంబర్లు కేటాయించామని, వ చ్చే నెల 9వ తేదీలోగా ఇంకొందరికి ఓటు హ క్కు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 30వ తేదీ వ రకు కొత్త ఓటర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వచ్చేనెల 9వ తేదీ తర్వాత పెరిగిన ఓటర్ల సంఖ్య ప్రకటిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈవీఎంల పరిశీలన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగిస్తామన్నారు. ఇందుకోసం 9,500 బ్యాలెట్ యూనిట్లు, 7,600 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈవీఎంలకు ఫస్ట్ లెవల్ చెక్(ఎఫ్ఎల్సీ) నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఈవీఎంలలో ఉన్న మొత్తం డాటా తొలగిస్తామన్నారు. ఎఫ్ఎల్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ఐదు ఈవీఎంలలో వెయ్యి ఓట్లు వేసి చూపెడతామన్నారు. తర్వాత వాటినిస్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తామన్నారు. అనంతరం ఎస్పీ శివకుమార్‌తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేష్ లట్కర్, డీఆర్వో వీరబ్రహ్మయ్య, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ కరీంనగర్: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత లు, ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలు కు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శివకుమార్ తెలిపారు. జిల్లాలో 552 అత్యంత సమస్యాత్మక, 1277 సమస్యాత్మక, 159 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పా రు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరి గేందుకు భద్రతాదళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1,86,96,233ల నగదును సీజ్ చేసి, 1225.5 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నామని, 6638 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. నిబంధనల ఉల్లంఘన కింది 10 కేసులు నమోదు చేసి, 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. -
వైఎస్ఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమం
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనా కాలంలో మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్ఆర్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 9వ వార్డు బండిమెట్టకు చెందిన ఇమ్రాన్ ఖాన్, అయ్యూబ్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, మహబూబ్, వలి, నజీర్, చాంద్, జమీల్, అబ్దుల్ సలీమ్, షేక్షా, బాబులతో పాటు మరో 80 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 20వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, చందు, నటరాజ్, హరి, మధు, వెంకటేశ్, నాగేంద్ర, వలి, మహేశ్‌తో పాటు మరో 150 మంది స్థానికులు పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని తెలిపారు. తండ్రిబాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే సువర్ణ పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.