గడీల మధ్య ఇద్దరు కూర్చొని చేసిన చట్టం ఇది
రాష్ట్రంలో పీవీ, వైఎస్ భూసంస్కరణలతో పేదలకు మేలు చేశారు
ధరణి స్థానంలో తీసుకొచ్చే కొత్త చట్టాన్ని మూడు వారాల్లో వెబ్‌సైట్‌లో పెడతాం
లఘు చర్చ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ధరణి పేరుతో పెద్దాయన రాష్ట్ర ప్రజలను దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. 2020లో తెచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయా రన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ‘తెలంగాణ భూ హక్కులు–సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన లఘుచర్చలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆ పెద్దమనిషి చేసిన పాప ఫలితాన్ని తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రిగా 1973లో పీవీ నరసింహారావు భూపరిమితి చట్టం తెచ్చి భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారన్నారు. 2006లో వైఎస్.రాజశేఖరరెడ్డి తొలిసా రిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ గిరిజనులు వైఎస్ పట్టా భూములుగానే చెప్పుకుంటున్నార న్నారు. ఎవరి సూచనలు, అభిప్రాయా లను తీసుకోకుండా పెద్దాయన, ఆయన తొత్తుగా ఉన్న ఓ అధికారి కూర్చొని చేసిన చట్టం ధరణి అని...ఇప్పటికీ 1.18 లక్షల భూ ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు.
ధరణి పేరుతో పేదల దగ్గరి నుంచి గత ప్రభుత్వం లాక్కొన్న ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామని, మాయమైపోయిన లక్షల ఎకరాలను అర్హులైన వారికి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ నవాబ్ నాటి దోపిడీని తలపించేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణితో రైతులను దోపిడీ చేసిందన్నారు. «
ధరణి.. ఓ విప్లవం: పల్లా
రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసు కొచ్చారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే ధరణి తెచ్చారని, నాలుగు గో డల మధ్య తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలున్న 18 లక్షల ఎకరాలను పార్ట్ బీలో చేరిస్తే, అందులో కూడా 10 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పారు. వివిధ కారణాల వల్ల కొన్ని భూము లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు.
రైతుల ఆత్మహత్యలు, హత్యలకు ధరణే కారణం: సీతక్క
ధరణి ఎంతో అద్భుతంగా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతుండగా మంత్రి సీతక్క కలగజేసుకున్నారు. ధరణి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు, హత్యలు పెరిగాయని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తుంగలో తొక్కారని, దీంతో పేదలు భూముల్లో ఫాంహౌస్‌లు వెలిశాయని చెప్పారు. భూమిని ఎవరు సాగుచేస్తున్నారో తెలిపే కాలమ్‌ను తొలగించారని విమర్శించారు.
సోమేశ్‌కుమార్ మాయలో కేసీఆర్ పడ్డారు: కూనంనేని
ధరణితో గ్రామాల్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్ప డిందని, ప్రజలకు పనికి రాని ఈ పోర్టల్‌ను రద్దు చేయడం సరైందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమేశ్‌కుమార్ మాయలో పడిన కేసీఆర్ ధరణితో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించారని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టే సంస్కరణల్లో కాస్తు కాలమ్ పెట్టాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు.
అవినీతిపరుల పేర్లు ఎందుకు చెప్పడం లేదు: మహేశ్వర్‌రెడ్డి
ధరణితో లక్షల ఎకరాల భూములు మాయమ య్యాయని, రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించిందని, ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు బయటపె ట్టడం లేదని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ధరణితో లాభపడ్డ బీఆర్‌ఎస్ నాయకుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధరణి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.
వక్ఫ్ భూములను పరిరక్షించిన వైఎస్: అక్బరుద్దీన్ ఒవైసీ
అనేక లోపాలతో తీసుకొ చ్చిన ధరణి పోర్టల్ కారణంగానే బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఓడిందని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందని ఎంఐఎం పక్షనేత అక్బరు ద్దీన్ ఒవైసీ అన్నారు. ధరణి తో ఎంతోమంది అక్రమంగా ప్రభుత్వ, పేదల భూములను తమ పేరిట చేసుకున్నారని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపాలని కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వక్ఫ్ భూముల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని, ఆయన గొప్ప నేత అని అక్బరుద్దీన్ గుర్తు చేసుకున్నారు. రెండోసారి వక్ఫ్‌బోర్డు భూములను సర్వే చేయించింది వైఎస్ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment