బీఆర్‌ఎస్ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాలు పరిశీలిస్తాం
అక్రమంగా గుంజుకున్న పేదల భూములను వారికే అప్పగిస్తాం
అసెంబ్లీలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన భూముల లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాలను ఈ ఆడిటింగ్ ద్వారా కూలంకషంగా పరిశీలిస్తామని చెప్పారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘మాకు, బీఆర్‌ఎస్‌కు ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందన్నట్టు బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నారు. మా నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తాం. పదేళ్ల పాటు పేద ప్రజలను మోసం చేసి గుంజుకున్న ఆస్తులను, భూములను తిరిగి వారికి ఇప్పి స్తాం’అని వెల్లడించారు. ఆ తర్వాత కూడా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఆడిట్ సరిపోదని, సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమాలు తేలుతాయన్నారు. మంత్రి బదులిస్తూ ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై ప్రాథమిక నివేదిక వచి్చన తర్వాత ఏం చేయాలన్నది పరిశీలిస్తామని, సీఎంతో పాటు మంత్రిమండలిలో చర్చించి, స్పీకర్ అనుమతితో అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పారు.
కేసీఆర్ టేబుల్‌పై ఆ పుస్తకం కనిపించేది..
ప్రముఖ న్యాయకోవిదుడు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ కేసీఆర్ టేబుల్‌పై కనిపించేదని మంత్రి పొంగులేటి అంటూ, తన సెల్ ఫోన్‌లోని ఆ ఫొటోను ప్రదర్శించారు. అలాంటి పుస్తకాలు చదివిన ఆయన రూపొందించే ధరణి అద్భుతంగా ఉంటుందనుకున్నానని, కానీ ప్రజా కంటకంగా మారిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు రోజుకో వేషం, రోజుకో డ్రామా వేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.
స్పీకర్ పోడియంపైకి కాగితాలు, పుస్తకాలు విసిరివేయడం, బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వేలు చూపిస్తూ బెదిరించడం లాంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా దాడి చేయాలనే ఉద్దేశంతో తన సీటు వద్దకు వచ్చి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించారని పేర్కొన్నారు. ఈ దొరలను ప్రజలు రాష్ట్రంలో ఉండనీయబోరని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సభలో గూండాయిజం ప్రదర్శించిన వారిపై స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసీఆర్ కాపలా కుక్క కాదు.. వేటకుక్క..
తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని ఉద్య మ సమయంలో కేసీఆర్ చెప్పారని, అయితే ఆయన వేటకుక్కలా రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్, ప్రతిపక్షంలోనూ అబద్ధాలతో కాలం గడపాలనుకుంటోంది. కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా, ప్రతిపక్ష నేత సభలో కనిపించరు.
అధికారంలో ఉన్నప్పటి తరహాలో నే ప్రతిపక్షంలో కూడా బీఆర్‌ఎస్ అరాచకంగా వ్యవహరిస్తోంది. ధరణితో లక్షల మంది ఇబ్బందికి గురికాగా, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఎలాంటి సమస్యల్లేవని బుకాయించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన 73 ఏళ్ల మద్దెల కృష్ణయ్య అనే దళిత రైతు 35 ఏళ్ల క్రితం కొన్న ఏడెకరాల భూమి ధరణి పుణ్యాన వేరే వారి పేరిట మారటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి’ అని పొంగులేటి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment