Srinivas Reddy ponguleti
-
ధరణి లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన భూముల లావాదేవీలపై ‘ఫోరెన్సిక్ ఆడిట్’నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన భూముల వివరాలను ఈ ఆడిటింగ్ ద్వారా కూలంకషంగా పరిశీలిస్తామని చెప్పారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘మాకు, బీఆర్ఎస్కు ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందన్నట్టు బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నారు. మా నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తాం. పదేళ్ల పాటు పేద ప్రజలను మోసం చేసి గుంజుకున్న ఆస్తులను, భూములను తిరిగి వారికి ఇప్పి స్తాం’అని వెల్లడించారు. ఆ తర్వాత కూడా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఆడిట్ సరిపోదని, సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమాలు తేలుతాయన్నారు. మంత్రి బదులిస్తూ ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై ప్రాథమిక నివేదిక వచి్చన తర్వాత ఏం చేయాలన్నది పరిశీలిస్తామని, సీఎంతో పాటు మంత్రిమండలిలో చర్చించి, స్పీకర్ అనుమతితో అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పారు. కేసీఆర్ టేబుల్‌పై ఆ పుస్తకం కనిపించేది.. ప్రముఖ న్యాయకోవిదుడు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ కేసీఆర్ టేబుల్‌పై కనిపించేదని మంత్రి పొంగులేటి అంటూ, తన సెల్ ఫోన్లోని ఆ ఫొటోను ప్రదర్శించారు. అలాంటి పుస్తకాలు చదివిన ఆయన రూపొందించే ధరణి అద్భుతంగా ఉంటుందనుకున్నానని, కానీ ప్రజా కంటకంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం, రోజుకో డ్రామా వేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.స్పీకర్ పోడియంపైకి కాగితాలు, పుస్తకాలు విసిరివేయడం, బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వేలు చూపిస్తూ బెదిరించడం లాంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా దాడి చేయాలనే ఉద్దేశంతో తన సీటు వద్దకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించారని పేర్కొన్నారు. ఈ దొరలను ప్రజలు రాష్ట్రంలో ఉండనీయబోరని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సభలో గూండాయిజం ప్రదర్శించిన వారిపై స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కాపలా కుక్క కాదు.. వేటకుక్క..తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని ఉద్య మ సమయంలో కేసీఆర్ చెప్పారని, అయితే ఆయన వేటకుక్కలా రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్, ప్రతిపక్షంలోనూ అబద్ధాలతో కాలం గడపాలనుకుంటోంది. కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా, ప్రతిపక్ష నేత సభలో కనిపించరు.అధికారంలో ఉన్నప్పటి తరహాలో నే ప్రతిపక్షంలో కూడా బీఆర్ఎస్ అరాచకంగా వ్యవహరిస్తోంది. ధరణితో లక్షల మంది ఇబ్బందికి గురికాగా, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాంటి సమస్యల్లేవని బుకాయించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన 73 ఏళ్ల మద్దెల కృష్ణయ్య అనే దళిత రైతు 35 ఏళ్ల క్రితం కొన్న ఏడెకరాల భూమి ధరణి పుణ్యాన వేరే వారి పేరిట మారటంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి’ అని పొంగులేటి ధ్వజమెత్తారు. -
భూ భారతి బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలు పంచుకోలేదు. ఈ–ఫార్ములా రేసింగ్ అంశాన్ని సభలో చర్చించాలని శుక్రవారం మొత్తం సభలో పట్టుపట్టిన బీఆర్ఎస్ కీలకమైన ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లును ఇతర పక్షాలైన బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అయితే, ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఆనంద భాష్పాలొస్తున్నాయి.. భూ భారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు ప్రకటించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలసి అభినందించారు. అంతకుముందు చర్చకు ముగింపుగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలకమైన ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మూడో మంత్రిగా ఈ బిల్లు సభ ఆమోదం పొందినందుకు తన జన్మ ధన్యమైందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.వాస్తవానికి, ఈ బిల్లును మంత్రి పొంగులేటి పట్టుపట్టి మరీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి స్పీకర్ అనుమతి మేరకు సభలో ప్రవేశపెట్టించిæ శీతాకాల సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురావాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆఫీసర్స్ గ్యాలరీలో ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి. లచ్చిరెడ్డిలను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.స్పీకర్‌కు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేల ధన్యవాదాలుఅసెంబ్లీలో భూభారతి బిల్లుకు సభ ఆమోదం లభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ చాంబర్లో ప్రసాద్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. -
అది చార్జిషి ట్ కాదు..పదేళ్ల పాలన డిశ్చార్జ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడంలో ప్రజా ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార.. పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చార్జిషీట్ అంటూ ఆ పార్టీ నివేదిక విడుదల చేసిందని, కానీ అది పదేళ్ల బీఆర్ఎస్ పాలన డిశ్చార్జ్ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు.ఆదివారం సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార..పౌరసంబంధాల శాఖల ప్రగతి నివేదికల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని, మొత్తంగా తుగ్లక్ పాలనను తలపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశారని పొంగులేటి ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను హరించారని, పోలీసులను కార్యకర్తల్లా వాడుకున్నారని ధ్వజమెత్తారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు ఇంకా జ్ఞానం రాలేదన్నారు. ధరణి దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యేలా చూస్తాం ‘ప్రజా ప్రభుత్వం వచి్చన వెంటనే ధరణిని ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేశాం. పోర్టల్ నిర్వహణను గతంలో ఓ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. దాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీకి అప్పగించాం. ధరణి మాడ్యూల్స్ తగ్గిస్తున్నాం. పహాణీలో ఇదివరకు 33 కాలమ్స్ ఉండేవి. వాటిని 11 నుంచి 13 వరకే పరిమితం చేస్తున్నాం. ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఆర్జీదారు సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం.ధరణి సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులతో పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా వచ్చిన 1.38 లక్షల దరఖాస్తుల్లో చాలావరకు పరిష్కరించాం. కొత్తగా ఆర్వోఆర్–2024 చట్టం సిద్ధమైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపజేసి అమలు చేస్తాం.పాత వీఆర్వో, వీఆర్ఏలకు పరీక్ష పెడతాం ‘గ్రామాల్లో రెవెన్యూ పాలనకు అధికారులుండేవారు. గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటారు. ఇదివరకు పనిచేసిన వీఆర్వో, వీఆర్ఏలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి గ్రామాలకు తిరిగి పంపిస్తాం.ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తొలివిడత 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తికాకుండా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రజా ప్రభుత్వం పూర్తి చేస్తుంది..’అని మంత్రి చెప్పారు, ప్రజాపాలన విజయోత్సవాల తర్వాత జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చర్చిస్తామని, ఆ తర్వాత సీఎంతో జరిగే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
‘గ్రీన్‌చానల్’లో ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకొనే వారికి ఆర్థిక సమస్యలు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం గ్రీన్‌చానల్ రూపొందించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఖమ్మంలోని దానవాయిగూడెంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాలు, శాఖల మధ్య సాంకేతిక అడ్డంకులు లేదా ఆర్థికపరమైన చిక్కులు తలెత్తకుండా గ్రీన్ చానల్ విధానం ద్వారా లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తామన్నారు.పునాదుల సమయాన రూ. లక్ష, లింటెల్ లెవల్ పూర్తి కాగానే రూ. 1.20 లక్షలు, స్లాబ్ వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశంకన్నా ముందు లేదా ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లిస్తామని చెప్పారు. ఇదంతా గ్రీన్‌చానల్ విధానంలో ఆటంకాలు లేకుండా పూర్తవుతుందన్నారు. తొలిదశలో రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని.. త్వరలో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుండగా రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని తెలిపారు.వై.ఎస్. హయాంలో తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లు..ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని పొంగులేటి తెలిపారు. నాటి ఉమ్మడి ఏపీ పరిధిలోకి వచ్చే నేటి తెలంగాణలో 19.56 లక్షల ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు తహసీల్దార్ లేదా ఎంపీడీఓ గుర్తించాక కలెక్టర్ ద్వారా ఇన్చార్జి మంత్రి ఆమోదిస్తారని తెలిపా రు. మహిళల పేరుతో 400 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాబోయే 2, 3 రోజుల్లోనే గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.ఇళ్ల నిర్మాణంలో సాంకేతికత కోసం యాప్ రూపొందించామని, లబ్ధిదారులను ఇళ్ల వద్దకు తీసుకెళ్లి వివరాలు అప్లోడ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు పురోగతి తెలుస్తుందన్నారు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకతో సహా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన సుమారు 63 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా నిర్మించి పేదలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పొంగులేటి వివరించారు. -
‘ఇంటిగ్రేటెడ్’లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
ఖమ్మం రూరల్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయగా.. పాలేరు నియోజకవర్గానికి స్థానం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 3 వేల మంది పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో శిక్షణ ఉంటుందన్నారు. పది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణమే.. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్‌లో పెట్టిన 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు, 34 వేల మంది బదిలీలను వివాదాలకు తావు లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూముల విలువల సవరణ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయంలో స్పష్టత రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే సవరించిన విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ పారదర్శకత పేరుతో థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించడంతో జాప్యం జరుగుతోంది. ఈ ఏజెన్సీ నివేదిక ఇంకా ప్రభుత్వం చేతికి రాలేదని తెలుస్తోంది.రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం నవంబర్ నెలలోనే సవరించిన విలువలను అమల్లోకి తేవాలనే యోచనలో ఉన్నా.. థర్డ్ పార్టీ నివేదిక ఎప్పుడు వస్తుందన్న దానిపైనే సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉన్నాయని చెపుతున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున భూముల ధరలు పెంచడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు భూముల విలువల సవరణ అమల్లోకి రాదనే వాదన కూడా వినిపిస్తోంది. నాలుగు నెలల క్రితం.. వాస్తవానికి, భూముల విలువల సవరణ కార్యక్రమాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది జూన్ 14వ తేదీన ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన విలువలు అందుబాటులోకి రావాల్సి ఉంది. షెడ్యూల్ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తమ కసరత్తు పూర్తి చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి భూముల విలువలను సవరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.అయితే, ఈ ప్రతిపాదనల మేరకు విలువలు సవరించకుండా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీకి ఈ కసరత్తు బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కసరత్తు ఎంత వరకు వచి్చందన్నది అంతుపట్టడం లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అసలు ఎప్పుడు నివేదిక ఇస్తుందన్న దానిపై స్పష్టత రావడం లేదని, నివేదిక వచ్చిన తర్వాత కూడా మరోమారు అధికారికంగా ప్రతిపాదనలు చేసి కమిటీల ఆమోదానికి సమయం తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై తామేమీ చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి. -
భగీరథ, కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి పొంగులేటి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్త గూడెం/నేలకొండపల్లి: గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళే శ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మార్కెట్ క మిటీ నూతన పాలక వర్గ ప్ర మాణస్వీకారం సోమ వారం సాయంత్రం జరగగా, ఆయ న పాల్గొని మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఎంఐయూడీలో అమృత్ స్కీంలో అవినీతికి పాల్పడ్డారని, సృజన్‌రెడ్డికి పనులు ఇచ్చారని కేటీఆర్ చెబుతుండగా.. ఈ విషయమై చర్చకు ఎక్కడైనా వస్తానని, ఆరోప ణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెబితే సమాధానం ఇవ్వలేదన్నారు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే కేటీఆర్ ఎవరో చెప్పిన విమర్శలు చేసే ముందుకు ఆలో చించాలని సూచించారు. పాలేరులో తనపై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి అని.. ఆయనకు బీఆర్ఎస్ హయాంలో సబ్ కాంట్రాక్టర్లు ఇప్పించారని తెలిపారు. ఇప్పుడు సృజన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదిగా చిత్రీకరించే పనిచేస్తు న్నారని చెప్పారు. సీఎంను దించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేస్తు న్నారని చెబుతు న్నారని.. కానీ కేటీఆర్ – హరీశ్ రావు మధ్యే అంతర్గత వివాదాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలిపేదవారి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. సర్కారు ఆలోచన లకు అనుగుణంగా అధి కా రులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అలా కాకుండా సొంత ఆలోచనలను పాలనలో జొప్పించాలని చూస్తే ఏ స్థాయి అధికారుల పైనైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కనకయ్య, కలెక్టర్ పాటిల్, ఎస్పీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్ సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో ధరణిని అడ్డుపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. -
నేడు రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ‘పొంగులేటి’ భేటీ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమా వేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. సమావేశంలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పెండింగ్ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఎన్నికల బదిలీలు చేపట్టండి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ రెవె న్యూ ఎంప్లాయీస్ సరీ్వసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌లతో కూడిన బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.పోచమ్మకుంట మోడల్ గ్రేవ్ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజనల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలపై మంత్రి ఆరా తీశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపైనా కలెక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామని, స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా.. ఉపేక్షించవద్దని, నాలాలపై నిరుపేదలున్నట్లయితే వారికి సరైన చోట నివాస సదుపాయం కలి్పంచాలని సూచించారు.వరంగల్ ఎంజీఎంలో కొందరు వైద్యులు పేషెంట్లకు మందులివ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటం పట్ల మున్సిపల్ అధికారులపైనా మంత్రి సీరియస్ అయ్యారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచి్చందని, అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పారు.వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కుస్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యా యని, ఇక్కడ కూడా వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. సమావేశంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు పాల్గొన్నారు. -
ధరణి పేరుతో పెద్దాయన దగా చేశారు
సాక్షి, హైదరాబాద్: ధరణి పేరుతో పెద్దాయన రాష్ట్ర ప్రజలను దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. 2020లో తెచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయా రన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ‘తెలంగాణ భూ హక్కులు–సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన లఘుచర్చలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆ పెద్దమనిషి చేసిన పాప ఫలితాన్ని తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రిగా 1973లో పీవీ నరసింహారావు భూపరిమితి చట్టం తెచ్చి భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారన్నారు. 2006లో వైఎస్.రాజశేఖరరెడ్డి తొలిసా రిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ గిరిజనులు వైఎస్ పట్టా భూములుగానే చెప్పుకుంటున్నార న్నారు. ఎవరి సూచనలు, అభిప్రాయా లను తీసుకోకుండా పెద్దాయన, ఆయన తొత్తుగా ఉన్న ఓ అధికారి కూర్చొని చేసిన చట్టం ధరణి అని...ఇప్పటికీ 1.18 లక్షల భూ ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు.ధరణి పేరుతో పేదల దగ్గరి నుంచి గత ప్రభుత్వం లాక్కొన్న ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామని, మాయమైపోయిన లక్షల ఎకరాలను అర్హులైన వారికి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ నవాబ్ నాటి దోపిడీని తలపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో రైతులను దోపిడీ చేసిందన్నారు. «ధరణి.. ఓ విప్లవం: పల్లారాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసు కొచ్చారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే ధరణి తెచ్చారని, నాలుగు గో డల మధ్య తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలున్న 18 లక్షల ఎకరాలను పార్ట్ బీలో చేరిస్తే, అందులో కూడా 10 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పారు. వివిధ కారణాల వల్ల కొన్ని భూము లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు.రైతుల ఆత్మహత్యలు, హత్యలకు ధరణే కారణం: సీతక్కధరణి ఎంతో అద్భుతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతుండగా మంత్రి సీతక్క కలగజేసుకున్నారు. ధరణి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు, హత్యలు పెరిగాయని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తుంగలో తొక్కారని, దీంతో పేదలు భూముల్లో ఫాంహౌస్‌లు వెలిశాయని చెప్పారు. భూమిని ఎవరు సాగుచేస్తున్నారో తెలిపే కాలమ్‌ను తొలగించారని విమర్శించారు.సోమేశ్‌కుమార్ మాయలో కేసీఆర్ పడ్డారు: కూనంనేని ధరణితో గ్రామాల్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్ప డిందని, ప్రజలకు పనికి రాని ఈ పోర్టల్‌ను రద్దు చేయడం సరైందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమేశ్‌కుమార్ మాయలో పడిన కేసీఆర్ ధరణితో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించారని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టే సంస్కరణల్లో కాస్తు కాలమ్ పెట్టాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు.అవినీతిపరుల పేర్లు ఎందుకు చెప్పడం లేదు: మహేశ్వర్‌రెడ్డి ధరణితో లక్షల ఎకరాల భూములు మాయమ య్యాయని, రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించిందని, ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు బయటపె ట్టడం లేదని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ధరణితో లాభపడ్డ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధరణి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.వక్ఫ్ భూములను పరిరక్షించిన వైఎస్: అక్బరుద్దీన్ ఒవైసీ అనేక లోపాలతో తీసుకొ చ్చిన ధరణి పోర్టల్ కారణంగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిందని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందని ఎంఐఎం పక్షనేత అక్బరు ద్దీన్ ఒవైసీ అన్నారు. ధరణి తో ఎంతోమంది అక్రమంగా ప్రభుత్వ, పేదల భూములను తమ పేరిట చేసుకున్నారని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపాలని కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వక్ఫ్ భూముల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని, ఆయన గొప్ప నేత అని అక్బరుద్దీన్ గుర్తు చేసుకున్నారు. రెండోసారి వక్ఫ్‌బోర్డు భూములను సర్వే చేయించింది వైఎస్ అని చెప్పారు. -
నేడే జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తు న్న జాబ్ కేలండర్ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్ కేలండర్‌ను ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటించనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్ కేలండర్ సహా కొత్త రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, మూసీ నది ప్రక్షాళన, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు చేసేందు కు సిద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో తెల్లరేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్నికల్లో ఇచి్చన మరో హామీ మేరకు త్వరలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల (హెల్త్ ప్రొఫెల్ కార్డులు)ను విడివిడిగా జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు రూపొందించి సత్వరమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం నెలలోగా నివేదిక ఇస్తుందని పొంగులేటి చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమేర్ అలీఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ గతంలో ప్రభుత్వానికి తిప్పిపంపడం తెలిసిందే. దీంతో వారి పేర్లనే మళ్లీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ⇒ కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక, వైద్య, సహకారం అందించాలి. ⇒ షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలంతోపాటు నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్–1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం. ⇒ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా విధినిర్వహణలో మరణించిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 437 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం. ⇒ ఖాయిలాపడిన నిజాం షుగర్స్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి. మంత్రి శ్రీదర్‌బాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. ⇒ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్. 10 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి, మిగిలిన 5 టీఎంసీలను నగర పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నింపడంతోపాటు మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు ఉండేలా వదలాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమరి్పంచిన నివేదికపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చ నిర్వహణకు నిర్ణయం. -
జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత ప్రభుత్వ పెద్దలు కేవలం జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ పెద్దలు ప్రాజెక్టులకు రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని, స్థిరీకరణ కూడా సరిగా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బ్లండర్ అని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచి్చన మంత్రులు..స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాళేశ్వరం స్ట్రక్చరల్ బ్లండర్: ఉత్తమ్ ‘కాళేశ్వరంతో ఐదేళ్ల కాలంలో మొత్తం ఎత్తిపోసింది కేవలం 65 టీఎంసీలే. పైగా ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లులు వస్తున్నాయి. అదే తమ్మిడిహెట్టి వద్ద కట్టి ఉంటే రూ.34 వేల కోట్లలో ప్రాజెక్టు పూర్తయ్యి ఏటా రూ.వెయ్యి కోట్ల బిల్లు మాత్రమే వచ్చేది. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లోనూ అవినీతే. ఇటీవల జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు కాళేశ్వరంపై అఫిడవిట్ సమర్పించారు.ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ తన మధ్యంతర నివేదికలో తెలిపింది. కాళేశ్వర్యం స్ట్రక్చరల్ బ్లండర్. ఇదే విషయంపై శనివారం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో నేను, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి భేటీ అవుతాం. వారిచ్చే సలహాల ఆధారంగానే కాళేశ్వరంపై ముందుకెళ్తాం..’అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరుకు ఆదిలాబాద్‌లో సదర్మాట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని, గౌరవెల్లి ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్‌కు ప్రత్యేక కార్డులు ‘ఆరోగ్యశ్రీ, రేషన్‌కు ప్రత్యేక కార్డులిస్తాం, దరఖాస్తులు కూడా వేర్వేరుగా ఉంటాయి. కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు సముచిత స్థానం ఇస్తుందని ఆశిస్తున్నాం. బీఆర్ఎస్ త్వరలో నామమాత్రంగా ఉండిపోతుంది. మరింతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారు..’అని ఉత్తమ్ చెప్పారు. అప్పుల భారం ఉన్నా రుణమాఫీ: పొంగులేటి గత ప్రభుత్వం మాదిరి గొప్పలకు పోయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టమని, వాస్తవాలను ప్రతిబింబించేలా మాత్రమే ఉంటుందని మంత్రి పొంగులేటి అన్నారు. ‘గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మాపై మోపింది. అయినా మేం రైతు రుణమాఫీ కింద రూ.31 వేల కోట్ల రుణాలు రద్దు చేస్తున్నాం. మాది రైతు పక్షపాత, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతుబంధు పేరిట గుట్టలకు కొండలకు ని«ధులిచ్చి ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. అందుకే, మేం రైతు భరోసా విషయంలో అభిప్రాయాలు అడిగేందుకు వచ్చాం..’అని చెప్పారు. మధ్యంతర నివేదికను అమలు చేశారా! ⇒ సమగ్ర నివేదికతో సమావేశానికి హాజరుకండి ⇒కాళేశ్వరం బరాజ్‌లపై భేటీకి రావాలని ఎన్డీఎస్ఏ పిలుపు ⇒నేటి సమావేశానికి మంత్రి ఎన్.ఉత్తమ్, అధికారులుసాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని లోపాలను గుర్తించేందుకు జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాలంటూ మధ్యంతర నివేదికలో తాము చేసిన సిఫారసులను అమలు చేశా రా? అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా బరాజ్‌లకు వర్షాకాలంలో మరింత నష్టం జరగకుండా మధ్యంతర నివేదికలో సూచించిన అత్యవసర చర్యలు తీసుకున్నారా? అని నిలదీసింది.నివేదిక అమలుకు తీసుకున్న చర్యలతో శనివారం డిల్లీలో జరిగే సమావేశానికి రావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై వానాకాలానికి ముందు జియో ఫిజికల్, జియో టెక్నికల్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని అప్పట్లో ఎన్డీఎస్ఏ కోరింది.ఈ పరీక్షలన్నీ కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసేర్స్ స్టేషన్(సీఎస్ఎంఆర్ఎస్), జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ(ఎన్ జీఆర్)తో చేయించాలని గత మే 1న మధ్యంతర నివేదికను ఇచి్చన విషయం విదితమే. నివేదిక అమలులో పురోగతిని తెలపాలని కోరుతూ గత మే 18న, జూన్ 25న, మళ్లీ ఈనెల 11న తెలంగాణకు ఎనీ్టఎస్ఏ వరుస లేఖలు రాసింది. నేటి భేటీలో వాటిపైనే చర్చ అన్నారం, సుందిళ్లలో పరీక్షల కోసం బోర్ హోల్స్ వేస్తుండగా... ఇసుక, నీరు ఇయటికి వస్తున్నాయని, ఈ కారణంగా పరీక్షలు నిలుపుదల చేసి, జియో టెక్నికల్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయాలు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీన లేఖ రాసింది. అయితే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో ఇప్పటిదాకా ఎన్ని బోరోల్స్/ డ్రిల్లింగ్స్ చేశారు? బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో ఇప్పటిదాకా ఎన్ని డ్రిల్లింగ్ చేశారు..? వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని ఎన్డీఎన్ఏ కోరింది.కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎస్) ఇచి్చన నివేదిక ఏమిటి. బ్యారేజీల పై అధ్యయనాలు, పరిశోధనలపై ఫొటోలతో సహా సమగ్ర నివేదికను అందించాలని ఎనీ్టఎస్ఏ నిర్దేశించింది. ఈ అంశాల ఆధారంగా శనివారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
వైఎస్ విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విజన్, విధానాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాక ముందు హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్ పూర్తిగా క్షీణ దశలో ఉండేదని, ఆయన సీఎం పదవి చేపట్టాక దూరదృష్టితో నగరాభివృద్ధి కోసం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి విప్లవాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశారు. దీంతో అప్పుడు పుంజుకున్న స్థిరాస్తి మార్కెట్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉందని చెప్పారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ 13వ ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో బిల్డర్లు కూడా భాగస్వాములేనన్నారు. బిల్డర్లు ఎంత వ్యాపారం చేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బిల్డర్లను వ్యాపారస్తులుగా చూసే విధానాలకు స్వస్తిచెప్పి పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని పొంగులేటి హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మరింత పెంచి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్మాణ అనుమతులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని పేర్కొన్నారు. ధరణిలో 8.5 లక్షల దరఖాస్తులు పెండింగ్.. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వం ఎన్నో విధ్వంసాలకు పాల్పడిందని, సామాన్యులకు కలిగిన ఇబ్బందులను కళ్లారా చూస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం ధరణిలో 8.5–9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిలో 5.8 లక్షల దరఖాస్తులను సహేతుక కారణాల్లేకుండానే తిరస్కరించారని విమర్శించారు. స్పెషల్ డ్రైవ్‌లతో గత వారం రోజులలో 80 వేల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించామని పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఉన్న లొసుగులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామన్నారు. పారదర్శక రెవెన్యూ వ్యవస్థను సామా న్యుల చెంతకు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైఎస్సార్ లాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ రిఫర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లతో ప్రధాన నగరంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య క్షుడు సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
28న మరో రెండు గ్యారంటీల అమలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలవుతున్నాయని, ఈనెల 28న మరో రెండు, వచ్చే సంక్రాంతిలోగా మిగిలిన రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం పాలేరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ సహా అధికారులతో మంత్రి సమీ క్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమది ప్రజా ప్రభు త్వమని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, నష్టం లేకుండా ధరణిని ప్రక్షాళన చేయడంతోపాటు గత ప్రభుత్వం సామాన్యుల నుంచి లాక్కున్న ఆస్తులు తిరిగి ఇస్తామని చెప్పారు. వీఆర్ఓల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. త్వరలో రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసు కొస్తామని.. ఇందులో అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన విషయంపై సమీక్షిస్తామని, ఖమ్మం, వరంగల్, హైదరాబాదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినా వదలబోమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కొల్లగొట్టిందని, ఈనెల 20న అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. విడతల వారీగా ఇళ్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టానని, రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఎవరికీ ఇల్లు లేదని అనకుండా విడతల వారీగా నిర్మాణం చేస్తామని పొంగులేటి తెలిపారు. నీటి పా రుదల శాఖలో జరిగిన అవినీతి, కాళేశ్వరం ప్రాజె క్టుపై సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ చేయించేందుకు పూనుకుందన్నారు. డ్రగ్స్, గంజాయిపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపేలా ఇప్పటికే సీఎం కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతిపెడతాం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘ఏ ఆశయం కోసం తెలంగాణ బిడ్డలు కలలు గన్నారో అవి నెరవేరలేదు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ వేలకోట్లు దోచుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఇక తెలంగాణ బిడ్డలు ఉపేక్షించరు. బీఆర్ఎస్ పా ర్టీ తోపాటు ప్రభుత్వాన్ని గొయ్యి తీసి పాతిపెట్టడం ఖాయం’’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఖమ్మంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల సూచనలు, దీవెనలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమాధి చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రజల తీర్పు ముందు బీఆర్ఎస్ తలవంచక తప్పదన్నారు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అని కేబినెట్ ప్రకటించడం మాటల గారడీ అన్నారు. గత తొమ్మిదేళ్లలో గుర్తుకురాని బీసీలు ఎన్నికల వేళ గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. మంత్రులే పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న భూములను కొల్లగొట్టడానికి, వేలకోట్లు సంపాదించడానికే కేసీఆర్ ధరణిని తెచ్చారని విమర్శించారు. ఖమ్మంకు చెందిన మంత్రి దోపిడీ అందరికీ తెలుసని, ఆయన అనుచరులు మట్టికొండలను సైతం వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. మార్పునకు ఈ సభ సంకేతం: కోదండరామ్ తెలంగాణలో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజలు పరిష్కారం కోరుకుంటున్నారనడానికి ఖమ్మం సభ ఒక సంకేతమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవలి అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన సర్కార్.. ఇప్పటివరకు ఇవ్వలేదేమని నిలదీశారు. తెలంగాణను కాపాడుకోవడానికి అంతా ఒకతాటిపైకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: జూపల్లి వందలాది మంది యువత బలిదానాలతో వచ్చిన తెలంగాణలో నిరంకుశ పాలన నెలకొందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పిడమర్తి రవి, వైరా మున్సిపల్ చైర్మన్ సుతకాని జైపాల్, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కలలు కల్లలు చేస్తాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘‘సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారు. మూడోసారి సీఎం కావాలనుకుంటున్న ఆయన కలలను కల్లలు చేయడమే లక్ష్యంగా.. ఆయన వల్ల నష్టపోయిన వారమంతా ఐక్యంగా ముందుకు కదలాలన్న ఆలోచన చేస్తున్నాం. వచ్చే నెల మొదటి వారంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటా..’’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకోలేదని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్యనేతలతో చర్చిస్తున్నానని తెలిపారు. ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. తెలంగాణ బిడ్డల కలలు కల్లలయ్యాయి ప్రత్యేక రాష్ట్రమొస్తే ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతుకుతామని తెలంగాణ బిడ్డలు కలలు కన్నారు. కానీ అవన్నీ కల్లలు అయ్యాయి. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినవారి సమాధుల మీద కేసీఆర్ అంతస్తులు కట్టుకుని ఆనందిస్తున్నారే తప్ప అమరులను పట్టించుకోవడం లేదు. గెలవనివ్వను..: మాటల గారడీ చేస్తూ, ప్రజ లను మభ్యపెడుతూ మళ్లీ గెలవాలని కేసీఆర్ కంటు న్న పగ టి కలలను కల్లలుగా మిగుల్చుతానని శపథం చేస్తున్నా.. ఇది నా శపథం కాదు.. ఖమ్మం జిల్లా ప్రజల శపథం. కేసీఆర్‌కు వివరించే ప్రయత్నం చేసినా.. వినలేదు గత ఎన్నికల్లో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించి ఉంటే.. అప్పుడే నన్ను సస్పెండ్ చేయాల్సింది. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలకు కారణాలను కేసీఆర్‌కు వివరించే ప్రయత్నం చేశా. కానీ వారికి వినే ఓపిక లేదు. సమయం వచ్చినప్పుడు మీ స్థిరాస్తులూ చూపిస్తా.. నాకు వేల కోట్ల పనులు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2018 ఎన్నికల తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన కంపెనీకి ఒక్క వర్క్‌ను ఎక్సెస్లోగానీ, ఎస్టిమేట్ రేట్లోగానీ ఇప్పించి ఉంటే.. నేను దేనికైనా రెడీ. 2018 వరకు మా కంపెనీ చేసిన పనులు రూ.1,700 కోట్లు. అందు లోనే వందల కోట్లు మిగిలాయని మీరు అంటుంటే.. మరి రాష్ట్రం వచ్చాక మీరు రూ.లక్షా 80వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. అందులో ఎంత మిగిలాయి, మీకు ఎన్ని వేలకోట్లు మీకు ఇచ్చారు? సందర్భం వచ్చినప్పుడు నేను లెక్కలు చెప్తా.. ఎక్కడైనా మీరు స్థిరాస్తులు దాచుకొని ఉంటే అవన్నీ నేను చూపిస్తా. డబ్బుతో బీఆర్ఎస్ రాజకీయం సుమారు రూ.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్తున్నారు. వాటికి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు మీకు కమీషన్ రూపంలో వచ్చింది? ప్రజలు డబ్బుకు అమ్ముడుపోవడమో, డబ్బుతో రాజకీయాల్లో సక్సెస్ కావడమో ఉత్తమాటే. బీఆర్ఎస్ పెట్టి దేశవ్యాప్తంగా డబ్బుతో రాజకీయం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారు. అవమానించినా.. కేటీఆర్ కోసం ఆగాను 2014లో ఫలితాలు రాకముందే టీఆర్ఎస్లోకి రావాలని మంత్రి కేటీఆర్ మమ్మల్ని అడిగారు. మీకు సరిపోను మెజార్టీ ఉందకదా అని మేం వెళ్లలేదు. నాకు కేసీఆర్ మీద ఎన్నడూ పూర్తిగా నమ్మకం లేదు. కానీ కేటీఆర్ మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. నన్ను బీఆర్ఎస్లోకి తీసుకొచి్చంది కేటీఆరే. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా, నా వెంట ఉన్న నేతలను ఇబ్బందిపెట్టినా, అవమానించినా ఇటీవలి వరకు బీఆర్ఎస్లో ఉన్నాను. దానికి కారణం కేటీఆరే. చాలా సంద ర్భాల్లో ఆయన నాకోసం ఫైట్ చేశారు. కానీ ఫలితం లేదు. అందరం ఐక్యంగా కదులుతాం కేసీఆర్ ద్వారా నష్టపోయినవారితోపాటు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు కూడా ఆత్మగౌరవాన్ని కోల్పోయా మన్న బాధలో ఉన్నారు. అలాంటి వారమంతా ఐక్యంగా ముందుకుపోవాలన్న ఆలోచన ఉంది. ఇప్పటివరకు కొత్త పార్టీ ఆలోచన లేదు. వచ్చేనెల మొదటి వారం నాటికి ఒక నిర్ణయానికి వస్తా. ఆ రెండు పార్టీలు ఆహ్వానించాయి కాంగ్రెస్, బీజేపీ నన్ను వారి పార్టీలోకి ఆహ్వానించాయి. అయితే కేసీఆర్‌తో నష్టపోయిన వాళ్లంతా కూడా ఒక సమీకరణ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సమీకరణగానీ, జాతీయ పార్టీలుగానీ.. ఏదో ఒక నిర్ణయం త్వర లో తీసుకుంటా. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండు కలిపి వస్తే ఆలోచిస్తా. విడిగా వస్తే అసెంబ్లీకి పోటీచేస్తా. -
ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష
జిల్లా నేతలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’ కాజీపేట రూరల్ : ఇటీవల జరిగిన వరంగల్ లో క్‌సభ ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం పార్టీ జిల్లా నాయకులతో సమావేశమైన ఆయన ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్, పార్టీకి పోలైన ఓట్లపై చ ర్చించారని జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిష న్ తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జి ల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు మునిగాల విలియం, పూజారి సాంబయ్య, సంగాల ఈర్మియా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షు డు కాయిత రాజ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కౌటిల్‌రెడ్డి, ప్రచార క మిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, జిల్లా నాయకులు సుమిత్, శరన్, కళ్యాణ్, వీరగోని రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సత్తా చాటాలి
ఇంటింటికీ వైఎస్సార్ పథకాలను ప్రచారం చేయూలి రాజశేఖరరెడ్డి లేని పాలనను ప్రజలు గమనిస్తున్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హన్మకొండలో పార్టీ జిల్లా విస్తృతస్థారుు సమావేశం పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమష్టిగా కృషిచేసి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తచాటాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. హన్మకొండలోని శ్రీ కళ్యాణి ఫంక్షన్హాల్లో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయం గా పనిచేయూలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారం కోసం మెదక్‌లో ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యూరని, ఇప్పుడు.. ఒక దళితుడిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి మరొక దళితునికి పదవి ఇవ్వడానికి వరంగల్ ఉప ఎన్నిక తీసుకువచ్చారని విమర్శించారు. ఇది.. కేసీఆర్ రాజకీయ వికృత చేష్టలకు నిదర్శమని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని, కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో హామీల వర్షం కురిసిస్తూ తెలంగాణ ప్రజలను మో సం చేస్తున్నాడని, ప్రజలు ఇది గమనించాలని పొంగులేటి కోరారు. వైఎస్సార్ పాలన లో అమలైన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజల కు వివరించి ఎన్నికలకు ఆయుధాలుగా వాడుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచిం చారు. 4న పార్టీ అభ్యర్థి నామినేషన్ వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా అందరికీ ఇష్టమైన వ్యక్తిని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తారని, ఆ అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ వేస్తాడని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధినే వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అభ్యర్థిని గెలిపించుకొని వరంగల్‌లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలందరికీ న్యాయం చేశారని, ఆయన పాలన ఒక చరిత్ర అని అన్నారు. వైఎస్ఆర్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో జీవితాల్లో వెలుగులు నింపుకున్న ప్రజలు వైఎస్ కుటుంబంపై నమ్మకంగా ఉన్నారని, ఇటీవల తెలంగాణ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామార్శ యాత్రలో ప్రజలు సొంత ఇంటి బిడ్డగా ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. వరంగల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దొర, నవాబు పాలన చేస్తూ ప్రజలను అనేక విధాలుగా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వా త దళితుడిని సీఎం చేస్తానని చెప్పి దళిత డిప్యూటీ సీఎంను తొలగించాడని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు భయం పుట్టుకొస్తున్నదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత అందరికీ ఉన్నదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకుమార్, నాయకులు ఇరుగు సునీల్‌కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రైతు అధ్యక్షుడు కిష్టారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్య రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, పూజారి సాంబయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రె డ్డి, ముస్తఫా, మతిన్, జిల్లా నాయకులు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, మునిగాల కళ్యాణ్‌రాజ్, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, అప్పం కిషన్, దుప్పటి ప్రకాష్, సంగాల ఈర్మియా, గౌని సాంబయ్యగౌడ్, రాబర్ట్ విల్సన్, కౌటిల్‌రెడ్డి, దోపతి సుదర్శన్ రెడ్డి, చల్లా అమరేందర్ రెడ్డి, జి.సమ్మయ్య, పి.గాంధీ, బొడ్డు శ్రావన్, అచ్చిరెడ్డి, రజనీకాంత్, రాజేష్ రెడ్డి, ఎన్.దయాకర్, బద్రుద్దీన్‌ఖాన్, సుమిత్ గుప్తా, పవిత్రన్, ప్రతీక్‌రెడ్డి, ముజఫరుద్దీన్ ఖాన్, పి.సంపత్, సంగాల ఈర్మియా తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గోడు పట్టించుకోరా..?
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి బూర్గంపాడు: అకాలవర్షాలతో పం టలు నష్టపోయిన రైతులను పాల కులు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాలవర్షంతో ఖమ్మం జిల్లా బూర్గంపాడు మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని, వర్షం ధాటికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యూర్డుకు తీసుకువస్తే.. అధికార యంత్రాంగం తీరు తో తీవ్రనష్టం జరిగిందన్నారు. ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నా పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షపార్టీగా విమర్శ చేయటం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల బాధలేమిటో తెలుస్తాయన్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో అకాలవర్షాలతో జరిగిన పంటనష్టాన్ని పరిశీలించామని చెప్పారు. పంటనష్టం తాలూకు విషయాలను పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. పొలాల్లో జరిగే నష్టం కంటే మార్కెట్‌యార్డులకు తీసుకువచ్చిన పంటలకు అధికనష్టం జరుగుతుందన్నారు. బూర్గంపాడు మార్కెట్‌యార్డులో సుమారు 70 లారీల ధాన్యం వర్షానికి తడిసిందని, 3 లారీల ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించి అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
జిల్లా ప్రజలకు పొంగులేటి శుభాకాంక్షలు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రజలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారని, మళ్లీ వచ్చే బతుకమ్మ పండుగను ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వేర్వేరు ప్రకటనల్లో జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలుసుకున్నారు. సోమవారమిక్కడ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించినప్పుడు ఆయనపై టీడీపీ నాయకులు జరిపిన దాడి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఖండించారని, తాటి వెంకటేశ్వర్లుకు ఆయన సానుభూతిని తెలియజేసి పరామర్శించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు. -
బంగారు తెలంగాణకు సహకరిస్తాం
చండ్రుగొండ : బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అబ్బుగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిలా కేసీఆర్ సమర్థ పాలన అందించాలన్నా రు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాలన్నారు. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామ ని చెప్పారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బం ది ఇటీవల పోడుదారులను ఇబ్బందుల పాల్జేస్తున్నారని, వారి దాడులు, దౌర్జన్యాలతో గిరి జన పోడుదారులు విసిగివేసారి పోయారని అన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అటవీ శాఖ అధికారుల దాష్టీకాలపై ఫిర్యాదు లు వస్తున్నాయని తెలిపారు. పోడుదారులపై అటవీశాఖ దాడులు నిలిపి వేయకపోతే సహిం చబోమన్నారు. పోడుదారుల పక్షాన పోరాటానికి వైఎస్సార్ సీపీ సన్నద్ధమవుతోందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అదను దాటి పోతోం దని, సత్వరమే పంట రుణాలు రైతులకు అందే లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. అదను దాటిన తర్వాత రుణాలు ఇచ్చినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. అభివృద్ధి కుంటుపడింది : ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాష్ట్రంలో మూడేళ్లుగా అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిందని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. అధికార యంత్రాంగమంతా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. ప్రధానంగా అటవీ శాఖ పనితీరు దారణంగా ఉందన్నారు. ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం కొరవడిందన్నారు. పనిచేయని వారి తుప్పును వదిలిస్తామని వ్యాఖ్యానించారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అడవిలో పుట్టిన వారు అక్కడే జీవనం సాగిస్తారని అన్నారు. సమావేశంలో జెట్పీటీసీ సభ్యుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సొసైటీ చెర్మైన్ ఇంజం గోపాలరావు, వైఎస్సార్ పీసీ మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జంగా శ్రీనివాసరెడ్డి, భూపతి అప్పారావు, ఎంపిటీసీ సభ్యుడు భీమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
బస్సు ప్రమాదం బాధాకరం
సాక్షి, ఖమ్మం: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొని అనేకమంది చిన్నారులు మృతిచెందిన దుర్ఘటన కలిచివేసిందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం పార్లమెంట్ జీరో అవర్‌లో మాట్లాడారు. నిండా పదేళ్లు కూడా లేని చిన్నారులు మృతిచెందారని, ఈ ప్రమాదంలో స్కూల్ యాజమాన్య తప్పిదం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అన్నారు. రైలు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చి చిన్నారుల ప్రాణాలను గాలిలో కలిపేసిందని అన్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు లేనందునే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి రైల్వే శాఖ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు 25లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే క్రాసింగుల వద్ద గేటు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని సూచించారు. వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు సంతాపం దమ్మపేట: మెదక్ జిల్లా ముసాయిపేట వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో చిన్నారుల మృతి కలిచివేసిందని అశ్వారావుపేట ఎమ్మె ల్యే, వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నాయకుడు తాటి వెంకటేశ్వర్లు విచారం వ్యక్తం చేశా రు. ఆయన గురువారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. లెవల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది లేనందునే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. మృతిచెందిన చిన్నారులకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ పక్షాన సంతాపం తెలిపారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ దిగ్భ్రాంతి వైరా: మెదక్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దారుణమైనదని, అనేకమంది చిన్నారులు మృతిచెందారన్న వార్త దిగ్భ్రాంతిగొల్పిందని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అనుభవం లేని డ్రైవర్‌న పంపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠ శాల యాజమాన్యంపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే శాఖ ఇప్పటికైనా స్పందించి, లెవ ల్ క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
సత్వరం రుణమాఫీ చేయాలి
ముదిగొండ: సత్వరం రుణమాఫీ చేయాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దమండవ గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు. సర్పంచ్ లంకెల లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. పూలు చల్లి, టపాసులు పేల్చి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ పొంగులేటి గ్రామంలోని ఎస్సీ కాలనీలో దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ దంపతులు ఎంపీని శాలువ కప్పి గజమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ కన్వీనర్ మరికంటి గురుమూర్తి పూలమాలతో సన్మానించారు. సన్మాన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నవిధంగా తక్షణమే రైతుంలదరికీ రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఎంపీ కోటా నిధులతో ప్రతి పల్లెకు సాగు, తాగు నీరందిస్తామని చెప్పారు. తన నిధులు మొట్టమొదటగా పెద్దమండవ గ్రామానికే ఖర్చు పెడతానని అన్నారు. వ్యవసాయ సీజన్ కాలం దాటిపోతోందని, రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అన్నారు. వందేళ్ల కాంగ్రెస్, 30 ఏళ్ల టీడీపీ కంటే మిన్నగా జిల్లా ప్రజలు తనకు రాజకీయ ఘనత అందించారని తెలిపారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందిన రైతు నాగార్జునను ఎంపీ పరామర్శించారు. గ్రామంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దమండవ సర్పంచ్ లంకెల లక్ష్మి, ఎంపీటీసీ శెట్టిపోగు సునీత, జిల్లా నాయకులు లంకెల బ్రహ్మారెడ్డి, మండల కన్వీనర్ మరికంటి గురుమూర్తి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మోర్తాల నాగార్జునరెడ్డి, సర్పంచ్‌లు బత్తుల వీరారెడ్డి, పడిశాల భద్రయ్య, వేముల రాజకుమారి, శెట్టిపల్లి రమాదేవి, నాయకులు లంకెల లక్ష్మీకాంతారెడ్డి, కనగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలి బోనకల్: ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో డీసీసీబీ డెరైక్టర్ బోజడ్ల అప్పారావు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులోత మాట్లాడారు. రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, విత్తనాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. మోటమర్రిలోని బయ్యారం లిఫ్టు పనిచేయడంలేదని, రైతులు తన దృష్టికి తెచ్చారని, ఐడీసీ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయిస్తానని చెప్పారు. రాయన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి పాలకేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని అఖిలపక్ష నాయకులు కోరారని, ఎంపీ కోటా నిధులతో రోడ్డు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఐలూరి వెంకటేశ్వరెడ్డి, తూమాటి నర్సిరెడ్డి, మండల కన్వీనర్ చావా హనుమంతరావు, బండి వెంకటేశ్వర్లు, గుడ్డురి గోవిందమ్మ, కన్నెపోగు వెంకటరమణ, ఇరుగు యశోద తదితరులు పాల్గొన్నారు.