జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ | ys jagan meet of Khammam MP, MLA asvaravupeta | Sakshi
Sakshi News home page

జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ

Published Tue, Sep 23 2014 1:46 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ - Sakshi

జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలుసుకున్నారు. సోమవారమిక్కడ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.

పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించినప్పుడు ఆయనపై టీడీపీ నాయకులు జరిపిన దాడి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడిని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి  ఖండించారని, తాటి వెంకటేశ్వర్లుకు ఆయన సానుభూతిని తెలియజేసి పరామర్శించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement