చండ్రుగొండ : బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అబ్బుగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిలా కేసీఆర్ సమర్థ పాలన అందించాలన్నా రు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాలన్నారు. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామ ని చెప్పారు.
అటవీ శాఖ అధికారులు, సిబ్బం ది ఇటీవల పోడుదారులను ఇబ్బందుల పాల్జేస్తున్నారని, వారి దాడులు, దౌర్జన్యాలతో గిరి జన పోడుదారులు విసిగివేసారి పోయారని అన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అటవీ శాఖ అధికారుల దాష్టీకాలపై ఫిర్యాదు లు వస్తున్నాయని తెలిపారు. పోడుదారులపై అటవీశాఖ దాడులు నిలిపి వేయకపోతే సహిం చబోమన్నారు. పోడుదారుల పక్షాన పోరాటానికి వైఎస్సార్ సీపీ సన్నద్ధమవుతోందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అదను దాటి పోతోం దని, సత్వరమే పంట రుణాలు రైతులకు అందే లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. అదను దాటిన తర్వాత రుణాలు ఇచ్చినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు.
అభివృద్ధి కుంటుపడింది : ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో మూడేళ్లుగా అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిందని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. అధికార యంత్రాంగమంతా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. ప్రధానంగా అటవీ శాఖ పనితీరు దారణంగా ఉందన్నారు. ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం కొరవడిందన్నారు. పనిచేయని వారి తుప్పును వదిలిస్తామని వ్యాఖ్యానించారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారని విమర్శించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా అడవిలో పుట్టిన వారు అక్కడే జీవనం సాగిస్తారని అన్నారు. సమావేశంలో జెట్పీటీసీ సభ్యుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సొసైటీ చెర్మైన్ ఇంజం గోపాలరావు, వైఎస్సార్ పీసీ మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జంగా శ్రీనివాసరెడ్డి, భూపతి అప్పారావు, ఎంపిటీసీ సభ్యుడు భీమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
బంగారు తెలంగాణకు సహకరిస్తాం
Published Mon, Jul 28 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement