telangana construction
-
బంగారు తెలంగాణకు సహకరిస్తాం
చండ్రుగొండ : బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అబ్బుగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిలా కేసీఆర్ సమర్థ పాలన అందించాలన్నా రు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాలన్నారు. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామ ని చెప్పారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బం ది ఇటీవల పోడుదారులను ఇబ్బందుల పాల్జేస్తున్నారని, వారి దాడులు, దౌర్జన్యాలతో గిరి జన పోడుదారులు విసిగివేసారి పోయారని అన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అటవీ శాఖ అధికారుల దాష్టీకాలపై ఫిర్యాదు లు వస్తున్నాయని తెలిపారు. పోడుదారులపై అటవీశాఖ దాడులు నిలిపి వేయకపోతే సహిం చబోమన్నారు. పోడుదారుల పక్షాన పోరాటానికి వైఎస్సార్ సీపీ సన్నద్ధమవుతోందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అదను దాటి పోతోం దని, సత్వరమే పంట రుణాలు రైతులకు అందే లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. అదను దాటిన తర్వాత రుణాలు ఇచ్చినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. అభివృద్ధి కుంటుపడింది : ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాష్ట్రంలో మూడేళ్లుగా అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిందని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. అధికార యంత్రాంగమంతా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. ప్రధానంగా అటవీ శాఖ పనితీరు దారణంగా ఉందన్నారు. ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం కొరవడిందన్నారు. పనిచేయని వారి తుప్పును వదిలిస్తామని వ్యాఖ్యానించారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అడవిలో పుట్టిన వారు అక్కడే జీవనం సాగిస్తారని అన్నారు. సమావేశంలో జెట్పీటీసీ సభ్యుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సొసైటీ చెర్మైన్ ఇంజం గోపాలరావు, వైఎస్సార్ పీసీ మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జంగా శ్రీనివాసరెడ్డి, భూపతి అప్పారావు, ఎంపిటీసీ సభ్యుడు భీమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
అధికార పక్షానికి సహకరిస్తాం: పొన్నాల
ఓటమికి తనదే బాధ్యత అని అంగీకారం సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో అధికార పక్షానికి సహకరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇందుకోసం రాజీలేని కృషి చేస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటమికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ అధిష్టానానికి నివేదిక పంపుతామని చెప్పారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్.. తెలంగాణలోనూ కనిపించిందని అభిప్రాయపడ్డారు. కేవలం మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఏనాడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. దీనిపై బాధపడాల్సిన అవసరం లేదని, అయితే ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉందని పొన్నాల వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై సహజంగా ఉండే వ్యతిరేకతలను కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్.. మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ అనుకూలంగా మార్చుకున్నాయని విశ్లేషించారు. అయినప్పటికీ దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి పాటుపడతామని పేర్కొన్నారు. -
మరోసారి అవకాశమివ్వండి
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ మేడ్చల్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట, అంతాయిపల్లి, మందాయిపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఈ ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తూంకుంట గ్రామానికి చెందిన వార్డు సభ్యులు భరత్, బాల్‌రాజ్ కేఎల్లార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు వంగ పెంటారెడ్డి, దయాసాగర్యాదవ్, జి.బాల్‌రాజ్‌గౌడ్, అశోక్, మహేందర్‌రెడ్డి, సింగం సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజ య్య, ఎల్లం, ఐలయ్య యాదవ్, శ్రీని వాస్, రాముయాదవ్, రాగజ్యోతి, కల్ప న, మంగరాణి, సర్పంచ్ నాగేశ్యాద వ్, ఉపసర్పంచ్ మాధవి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి.. ఘట్కేసర్: మరోసారి అవకాశం ఇస్తే అద్భుత అభివృద్ధి చేస్తానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ పేర్కొన్నారు. మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బద్దం యాదగిరిరెడ్డి, రాజేందర్, రమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్‌చారి, పయ్యావుల సంతోష్, వెంకటేష్, అనిల్, శంకర్ పాల్గొన్నారు.