శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ మేడ్చల్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట, అంతాయిపల్లి, మందాయిపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఈ ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం తూంకుంట గ్రామానికి చెందిన వార్డు సభ్యులు భరత్, బాల్‌రాజ్ కేఎల్లార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు వంగ పెంటారెడ్డి, దయాసాగర్‌యాదవ్, జి.బాల్‌రాజ్‌గౌడ్, అశోక్, మహేందర్‌రెడ్డి, సింగం సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజ య్య, ఎల్లం, ఐలయ్య యాదవ్, శ్రీని వాస్, రాముయాదవ్, రాగజ్యోతి, కల్ప న, మంగరాణి, సర్పంచ్ నాగేశ్‌యాద వ్, ఉపసర్పంచ్ మాధవి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి..
ఘట్‌కేసర్: మరోసారి అవకాశం ఇస్తే అద్భుత అభివృద్ధి చేస్తానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ పేర్కొన్నారు. మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బద్దం యాదగిరిరెడ్డి, రాజేందర్, రమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్‌చారి, పయ్యావుల సంతోష్, వెంకటేష్, అనిల్, శంకర్ పాల్గొన్నారు.
మరోసారి అవకాశమివ్వండి
Published Fri, Apr 25 2014 12:27 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement