medachal
-
‘ఫార్మ్‌హౌస్‌లో పడుకునే ముఖ్యమంత్రి.. కేసీఆర్’
సాక్షి, మేడ్చల్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్మ్హౌస్లో పడుకునే ముఖ్యమంత్రి అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వరని, ప్రజలకైతే అస్సలు ఇవ్వరని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించటం అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించటానికి హస్తం గుర్తుకే ఓటు వెయ్యవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ను ఇంటికి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను పార్మ్ హౌస్‌లో పడుకోబెట్టే శక్తి ప్రతాప్‌కు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో పలువురు కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు కేసీఆర్ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మాట్లాడారని, గోదావరికి కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయన్నాడని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో పదిమందికి కాళ్లు ఉన్నా గోదావరి, కృష్ణా నదులకు ఎందుకు కాళ్లు అడ్డం పెట్టలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సస్యశ్యామలం చేయలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాబందుల సమితిగా టీఆర్ఎస్ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి.. రాబందుల సమితిగా మారిందని కాంగ్రెస్ నేత మధు యాష్కీ విమర్శించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబందుల నుంచి విముక్తి పొందేందుకు సోనియమ్మని మరోసారి ఆహ్వనించామన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎమ్ఐఎమ్తో టీఆర్ఎస్ జట్టుకట్టిందని పేర్కొన్నారు. సెక్రటేరియట్‌కు రాకుండా ఫార్మ్‌హౌస్‌లో కూర్చోని గద్దలా తెలంగాణను దోచ్చుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కాళ్లకింద తెలంగాణ నగిలిపోయిందన్నారు. కేసీఆర్ ఓ నియంత.. అహంకారి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. అహంకారి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను ఫార్మ్‌హౌస్‌కు పంపాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులతో గెలవాలని చూస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ఏనాడైనా పంటలకు గిట్టుబాటు ధర వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆరే ఓటమిని ఒప్పుకున్నారు ఫాంహౌస్‌కు వెళ్తానని కేసీఆరే ఓటమిని ఒప్పుకున్నారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. హామీలు అమలు చేయలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, సమస్యలను పరిష్కరించకుండా మాటలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మకు వందనం. తెలంగాణను దీవించేందుకు వచ్చిన సోనియమ్మకు, రాహుల్ గాంధీకి స్వాగతం’ అని గద్దర్ అన్నారు. -
మేడ్చల్‌లో కిడ్నాప్ కలకలం
మేడ్చల్: జిల్లాలోని కిష్టాపూర్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. గ్రామానికి చెందిన మణిందర్(14) శనివారం తన స్నేహితులతో కలిసి సైకిల్ పై పాఠశాలకు వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు. నాగార్జున పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మణిందర్‌ను కారులో వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ఇద్దరి మృతి
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్ఎల్ నగర్లో స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మృతులు ఆర్ఎల్ నగర్‌కు చెందిన రామచందర్(36), చర్లపల్లి యాదగిరి(40)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఆర్టీసీ డిపో వద్ద 44 వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ టిప్పర్ అదుపుతప్పి రెండు ఆటోలను, ఓ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ శ్మశాన వాటిక ప్రహరీగోడను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరోసారి అవకాశమివ్వండి
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ మేడ్చల్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట, అంతాయిపల్లి, మందాయిపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఈ ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తూంకుంట గ్రామానికి చెందిన వార్డు సభ్యులు భరత్, బాల్‌రాజ్ కేఎల్లార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు వంగ పెంటారెడ్డి, దయాసాగర్యాదవ్, జి.బాల్‌రాజ్‌గౌడ్, అశోక్, మహేందర్‌రెడ్డి, సింగం సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజ య్య, ఎల్లం, ఐలయ్య యాదవ్, శ్రీని వాస్, రాముయాదవ్, రాగజ్యోతి, కల్ప న, మంగరాణి, సర్పంచ్ నాగేశ్యాద వ్, ఉపసర్పంచ్ మాధవి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి.. ఘట్కేసర్: మరోసారి అవకాశం ఇస్తే అద్భుత అభివృద్ధి చేస్తానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ పేర్కొన్నారు. మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బద్దం యాదగిరిరెడ్డి, రాజేందర్, రమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్‌చారి, పయ్యావుల సంతోష్, వెంకటేష్, అనిల్, శంకర్ పాల్గొన్నారు.