మేడ్చల్: జిల్లాలోని కిష్టాపూర్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. గ్రామానికి చెందిన మణిందర్(14) శనివారం తన స్నేహితులతో కలిసి సైకిల్ పై పాఠశాలకు వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు. నాగార్జున పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మణిందర్‌ను కారులో వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.