
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టించింది.
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కిడ్నాప్‌నకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లారు. పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన కొందరు దుండగులు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తెలియడంతో ఆయన కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల పేరుతో తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వెంటనే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వారు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఈ క్రమంలో అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆయన అక్కడే కూర్చుని నిరసనలు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment