జిల్లా నేతలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’
కాజీపేట రూరల్ : ఇటీవల జరిగిన వరంగల్ లో క్‌సభ ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం పార్టీ జిల్లా నాయకులతో సమావేశమైన ఆయన ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్, పార్టీకి పోలైన ఓట్లపై చ ర్చించారని జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిష న్ తెలిపారు.
సమావేశంలో వైఎస్సార్ సీపీ జి ల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు మునిగాల విలియం, పూజారి సాంబయ్య, సంగాల ఈర్మియా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షు డు కాయిత రాజ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కౌటిల్‌రెడ్డి, ప్రచార క మిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, జిల్లా నాయకులు సుమిత్, శరన్, కళ్యాణ్, వీరగోని రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష
Published Tue, Dec 1 2015 1:24 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement