Warangal Lok Sabha
-
ఆరు నెలల్లో లోక్‌సభకు ఉప ఎన్నిక
కోర్టు తీర్పుతో మళ్లీ మీ మధ్యకు వస్తా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హసన్‌పర్తి : ఆరునెలల్లో వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 54వ డివిజన్ దేవన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలోనే తనుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ తానే కాంగ్రెస్ అభ్యర్థినని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటా అబద్ధమేనన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదన్నారు. 87 వేల మంది గౌడకులస్థులు ఉన్నా ఆ వర్గానికి గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. మడికొండ : కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సర్వే సత్యనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా 34వ డివిజన్ అభ్యర్ధి మేకల ఉపేందర్‌కు మద్దతుగా శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కృషి తోనే తెలంగాణ రాలేదని, ఎందరో ఉద్యమకారుల పోరాటం, సోనియాగాంధీ చొరవ వల్లే వచ్చిందని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నెరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, పసునూరి మనోహర్, నర్మెట వెంకటరమణ, డబోయిన ప్రభాకర్, రాములు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి వరంగల్ : గత సాధారణ ఎన్నికల నుంచి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న టీఆర్ఎస్కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో మొట్టికాయ వేయూలని సర్వే సత్యనారాయణ అన్నారు. డీసీసీ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ జిల్లా అయిన ఓరుగల్లు నుంచే టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. -
ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష
జిల్లా నేతలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’ కాజీపేట రూరల్ : ఇటీవల జరిగిన వరంగల్ లో క్‌సభ ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం పార్టీ జిల్లా నాయకులతో సమావేశమైన ఆయన ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్, పార్టీకి పోలైన ఓట్లపై చ ర్చించారని జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిష న్ తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జి ల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు మునిగాల విలియం, పూజారి సాంబయ్య, సంగాల ఈర్మియా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షు డు కాయిత రాజ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కౌటిల్‌రెడ్డి, ప్రచార క మిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, జిల్లా నాయకులు సుమిత్, శరన్, కళ్యాణ్, వీరగోని రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
రుణపడి ఉంటా
వరంగల్ అభివృద్ధికి శాయశక్తులా కృషి.. ఉద్యమం, ఎన్నికల్లో జిల్లా ప్రజలు అండగా నిలిచారు వారి మేలు మరువలేనిది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఎంను కలిసిన పసునూరి దయాకర్, జిల్లా నేతలు హన్మకొండ : వరంగల్ జిల్లాకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన పసునూరి దయాకర్ కుటుంబసభ్యులు టీఆర్ఎస్ జిల్లా నాయకులతో కలిసి బుధవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిశారు. అనూహ్య విజయం సాధించిన దయాకర్‌ను సీఎం అభినందించారు. జిల్లా నాయకులు కూడా కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం బలహీనపడిందని అనుకున్నప్పుడు పోరాటాన్ని ఉధృతం చేసింది వరంగల్ జిల్లా ప్రజలేనన్నారు. ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు అండగా నిలిచారని, ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థికి అఖండ మెజారిటీ ఇచ్చి మరోసారి మద్దతు తెలిపారని అన్నారు. వరంగల్‌ను రాష్ట్రంలో రెండవ పెద్ద నగరంగా అన్ని అహంగులతో తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటారుుంచి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుదామని హామీ ఇచ్చారు. స్వయంగా తానే వచ్చి కూర్చుని నగరాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తానని చెప్పారు. వరంగల్ రింగ్ రోడ్డు మంజూరు ఉత్తర్వులు రెండు రోజుల్లో జారీ చేస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్స్టైల్స్ పార్కును వరంగల్‌కు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. తమిళనాడులోని తిరుపూరు, గుజరాత్‌లోని సూరత్, మహారాష్ట్రలోని షోలాపూర్‌లా అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభించే హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రెండు, మూడు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి టెక్స్టైల్స్ పార్కును రూపొందిస్తామని తెలిపారు. వరంగల్‌కు రైల్వే లైన్, కాజీపేటలో జంక్షన్ ఉన్నందున ఇక్కడ ఉత్పత్తి చేసే వస్తువులను దేశంలో ఎక్కడికైనా పంపించవచ్చన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ త్వరలో పర్యటిస్తానని, నియోజకవర్గ కేంద్రంలో ఉండి పరిస్థితులు సమీక్షించి అప్పటికప్పుడు అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తన వద్ద రూ.3 వేల కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటితో అప్పటికప్పుడే పనులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఉస ఎన్నిక కోడ్ ముగియక ముందే మరో కోడ్ వచ్చిందని, దీని తర్వాత కార్పొరేషన్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముందని, అరుుతే ఈ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయూల గురించి ఈసీతో మాట్లాడాలని చీఫ్ సెక్రటరీకి సూచించామని చెప్పారు. నగరంలో బీడీ కార్మికులకు పింఛన్లు అందలేదని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు సూచించా రు. రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణాల సంఖ్య పెంచాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనకు పంపించారని తెలిపారు. తానే స్వయంగా వరంగల్‌కు వచ్చి పింఛన్లు అందిస్తానని చెప్పారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఆజ్మీర సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయబాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, ఆరూరి రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, సుధాకర్‌రావు ఉన్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ వాకాటి కరుణ విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు సీపీ సుధీర్‌బాబు వరంగల్ సిటీ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను మంగళవారం లెక్కించేందుకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ వా కాటి కరుణ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ రెండో గేట్ సమీపంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్‌బాబు తో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి మాక్ కౌంటింగ్ నిర్వహిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఏడు కౌంటిం గ్ హాళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభవుతుందన్నారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ కౌంటింగ్ హాళ్ల పరిసర ప్రాంతాలలో 144సెక్షన్ విధించామని,విజయోత్సవ ర్యాలీలు నిషేధమని తెలిపారు. ప్రజాప్రతినిదులు, వివిధ పార్టీల నాయకులు తమకు సహకరించాలని కోరారు. అనుమతి పాస్‌లు లేకుండా ఎవరూ కౌం టింగ్హాల్ లోపలికి వెళ్లవద్దని సూచించారు. -
నేడు లెక్కింపు
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం 11 గంటల వరకు ఫలితం వెల్లడి ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు అత్యధికంగా భూపాలపల్లిలో 22 రౌండ్లు.. తక్కువగా వరంగల్ తూర్పులో 16 రౌండ్ల లెక్కింపు విధుల్లో 600 మంది ఉద్యోగులు హన్మకొండ అర్బన్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. 11 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని చెప్పారు. కౌంటింగ్ విధుల్లో 600 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కోదానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. మొదట 14 ఈవీఎంలు స్ట్రాంగ్ రూం నుంచి తీసుకొచ్చి ఒక్కో టేబుల్‌పై ఒక్కొక్కటి చొప్పున లెక్కిస్తారు. ఆ తర్వాత మరో 14.. ఇలా అన్ని ఈవీఎంలు లెక్కిస్తారు. చివరకు రెండు ఈవీఎంలను లెక్కించినా దాన్ని కూడా ఒక రౌండ్‌గానే పరిగణిస్తారు. ఒక రౌండ్ లెక్కింపునకు సుమారు 10 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అభ్యర్ధుల కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్లు, కౌంటింగ్ హాల్లో జాలీలు ఏర్పాటు చేశారు. సమాచారం అందజేసేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌కు ఫలితాలను ప్రకటిస్తారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సహా మొత్తం 23 మంది బరిలో ఉన్నారు. పోలైన ఓట్లు 10, 35,656... ఉప ఎన్నికలో మొత్తం 15,09,671 ఓట్లకు గాను 1788 కేంద్రాలలో 10,35,656 ఓట్లు (69.19 శాతం) పోలయ్యాయి. భూపాలపల్లి అసెంబ్లీ పరిధిలో 297 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఆ నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. ఆ తర్వాత అధికంగా 274 కేంద్రాలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉండగా, అక్కడ 19 రౌండ్లు కౌంటింగ్ చేయనున్నారు. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ లెక్కింపు 16 రౌండ్లలో ముగియనుంది. రౌండ్ల వారీ ఫలితాలను ఏఆర్ఓలు వెల్లడించనుండగా, తుది ఫలితాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కరుణ ప్రకటిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం 500 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపగా కేవలం 126 మాత్రమే తిరిగి వచ్చారుు. వీటి లెక్కింపు తర్వాత రౌండ్ల వారీగా మిగితా ఓట్లు కౌంట్ చేస్తారు. -
ఉప ఎన్నికలో గెలుపు మాదే..
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి హన్మకొండ చౌరస్తా : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే విషయం ఫలితాలతో స్పష్టమవుతుందని చెప్పా రు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజ య్య, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్తోకలిసి ఆయన హన్మకొండలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆది వారం విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్ రోజున ప్రతిపక్ష కాం గ్రెస్, బీజేపీలకు పోలింగ్ ఏజెంట్లు సైతం దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీనేతలు డబ్బుల కోసం ఆశపడ్డారని, అవి రాకపోవడం తో ఆయూపార్టీల నేతలు ఎన్నిక రోజు జాడలేకుండా పోయూరని అన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, బస్వరాజు సారయ్య పోలింగ్ బూత్‌లకు రాకుండా ఎందుకు తోకముడిచారో చెప్పాలని ప్రశ్నించారు. ఓట ర్లను ఓటు అడగడం పక్కనపెట్టి కేసీఆరే లక్ష్యంగా విమర్శలు చేశారన్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తన పార్టీ నేతలనే సమన్వయం చేయలేకపోయూడని విమర్శించారు. అధికార పార్టీ అరుునా టీఆర్ఎస్ ఎన్నికల నియమావళికి లోబడి వ్యవహరించిందని అన్నారు. ప్రచారం ముగి సిన తర్వాత ప్రెస్మీట్లు పెట్టి కాం గ్రెస్, బీజేపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని ఆరోపించారు. ఎ మ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ప్రతిపక్షాలను ప్రజ లు పట్టించుకోలేదని ఉప ఎన్నికలో తేలిపోయిందన్నారు. టీఆర్ఎస్ జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, కన్నెబోయిన రాజయ్యయాదవ్ పాల్గొన్నారు. -
ఓరుగల్లులో రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభం
ఆత్మకూరు: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రచారం వరంగల్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ఆత్మకూరులో అడుగుపెట్టిన వైఎస్ జగన్‌కు స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఉదయం పరకాల నియోజకవర్గం ఆత్మకూరులో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడ రోడ్ షో, ప్రచారం అనంతరం శాయంపేట, రేగొండ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ ప్రచారం ముగించి సాయంత్రం పరకాల వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ వెంట పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే. -
రాజన్న బిడ్డకు నీరాజనం
ఓరుగల్లులో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రోడ్‌షో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మహానేత అభిమానులు బోనాలు, బతుకమ్మలతో ఆత్మీయ స్వాగతం పాలకుర్తిటౌన్ / పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా జిల్లాలో చేపట్టిన ప్రచారానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల గుండా కొనసాగిన రోడ్‌షోకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహానేత వైఎస్సార్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ మేరకు పాల కుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రోడ్‌షోకు తరలివచ్చిన ప్రజానీకానికి అభివాదం చేశారు. మధ్యమధ్యలో చిన్నారులు, వృద్ధులు, రైతు లు, గిరిజనులను ఆప్యాయంగా పలకరించారు. కాగా, తొలుత పాలకుర్తికి చేరుకున్న అధినేత జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బొకే లు అందజేసి స్వాగ తం పలికారు. ఇది లా ఉండగా రోడ్ షోలో కార్యకర్తల బైక్ ర్యాలీ, వైఎస్సార్సీపీ సాంస్కృతిక బృందం పాడిన పాటలు అలరించాయి. స్వాగతం పలికిన చాకలి ఐలమ్మ మనవరాలు.. రోడ్‌షోకు హాజరైన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల సంధ్యారాణి ఘన స్వాగతం పలికారు. అలాగే మండల కేంద్రంలోని వాగ్ధేవి జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా స్వాగతం పలికారు. రోడ్‌షోలో వైఎస్సార్సీపీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, ఎమ్మెల్సీ ఎండీ రహమాన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బండి లక్ష్మణ్, మాదిరెడ్డి భగంవంత్రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఎస్. శేఖర్‌పంతులు, తమ్మాళి బాల్‌రాజ్, మాడరాజు యాకయ్య, గుడ్ల వెంకన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రచారంతో నూతనోత్సాహం
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’ పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రవేశంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్‌కు ఏ పా ర్టీ నుంచి పోటీ లేకుం డా పోయిందని ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తొర్రూరు బస్టాండ్ ఆవరణలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పార్లమెంట్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని తమకు పోటీగా భావించామని.. ప్రస్తుతం వైఎస్.జగన్మోహన్రెడ్డి రాగా అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, అపూర్వ స్వాగతంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయిందని తెలిపారు. తప్పుడు హామీలు, మోసపూరిత విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయూలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్ పాలనతో ప్రస్తుత పాలనను పోల్చుకుని వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కొండా రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, విజయ్‌చందర్, కళ్యాణ్‌రాజు, శ్యాంసుందర్‌రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఇబ్రహీం, బిజ్జాల అశోక్, కోటగిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచార బరిలోకి సీఎం
నేడు బహిరంగ సభ కు హాజరుకానున్న కేసీఆర్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు హన్మకొండ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం వరంగల్ రానున్నారు. ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసునూరి దయాకర్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యాన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరున్నర గంటలకు జరగనున్న ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. సాధారణ ఎన్నికల మాదిరిగానే తమ పార్టీ అభ్యర్థిని అదే మె జార్టీతో గెలిపించుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, టీఆర్ఎస్ అగ్రనేత లు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రచా రం చేస్తుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారానికి ఊపు తెచ్చేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ వస్తున్నారు. అరుుతే, ఈనెల 21వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలూ ప్రచార జోరు పెంచా రుు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరఫున జాతీయస్థాయి నేతలుగా పేరొందిన దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్, కొప్పుల రాజు, సుశీల్‌కుమార్‌షిండే ప్రచా రం చేస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఆర్ట్స్ కళాశాలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభ విజయవంతానకి టీఆర్ఎస్ శ్రేణులు భా రీగా ఏర్పాట్లు చేశారుు. లక్ష మందిని ఈ సభకు తరలించాలని నిర్ణయించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్‌మ్యాప్‌ను వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు పరిశీలించారు. గుడిమళ్ల ఇంటికి కేసీఆర్... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ గౌరవఅధ్యక్షు డు గుడిమళ్ల రవికుమార్ టికెట్ ఆశించగా చివరి ని ముషంలో చేజారిన విషయం విదితే. ఈ మేరకు ఆ యన ఇంటికి వరంగల్ పర్యటనలో భాగంగా ము ఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గుడిమళ్ల రవికుమార్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. -
హస్తంలో అయోమయం!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభకు అభ్యర్థిని మార్చడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటనతో.. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చి సర్వే సత్యనారాయణను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. రాజయ్యనే కొనసాగిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందేమోనని నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారు. నామినేషన్లకు గడువు పూర్తికాక ముందే రాజయ్య బీ-ఫారాన్ని ఉపసంహరింపజేయడంతో పాటు అటు అధిష్టానం, ఇటు జిల్లా నేతలతో టీపీసీసీ వేగంగా సంప్రదింపులు చేసి నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే జిల్లాలో ఎక్కువగా పరిచయాల్లేని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడాన్ని శ్రేణులు ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నాయి. గురువారం నాగార్జునసాగర్‌లో పార్టీ సమావేశం ఉండటంతో వరంగల్ ఎన్నికలపై టీపీసీసీ దృష్టి సారించలేకపోయింది. సర్వేతో జిల్లా పార్టీ నేతలు, టీపీసీసీ నేతలు విస్తృత సమావేశం తర్వాత ప్రచారం ప్రారంభించనున్నారు. అభ్యర్థులు ఎవరైనా గెలుపే ధ్యేయం గత ఎన్నికల ఓటమి తర్వాత ఎదురుదెబ్బలతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో మెరుగైన ఫలితం సాధించాలని టీపీసీసీ స్థిర నిశ్చయంతో ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపికైన తర్వాత జరుగుతున్న మొదటి ఉపఎన్నిక కావడంతో ఆయన కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అయితే ఇతర పార్టీల వేగాన్ని అందుకోవడానికి ఒకట్రెండు రోజులు సమయం పడుతుందని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. ‘‘అభ్యర్థి నివాసంలో జరిగిన దుర్ఘటనతో పార్టీకి నష్టం ఉండదు. పార్టీ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పు జరిగింది. అనుకోని సంఘటనల వల్ల, అభ్యర్థి మార్పు వల్ల ఒకట్రెండు రోజులు కొంత అయోమయం ఉండటం సహజమే. ఇలాంటి ఆటుపోట్లను కాంగ్రెస్ ఎన్నో అధిగమించింది. ఈ సమస్య నుంచి బయటపడి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సిద్ధమవుతాయి. అభ్యర్థులు ఎవరనేది కాకుండా పార్టీ గెలుపుపైనే దృష్టి పెడతాం’’ అని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. -
జన హోరు
అట్టహాసంగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సూర్యప్రకాష్ నామినేషన్ ర్యాలీకి తరలివచ్చిన ప్రజానీకం యువకుల బైక్ ర్యాలీ ఆకట్టుకున్న గిరిజన నృత్యాలు ర్యాలీలో పాల్గొన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాజీపేట రూరల్ : వైఎస్సార్సీపీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ ర్యాలీ బుధవారం జనసందోహం నడుమసాగింది. కాజీపేట ఫాతిమానగర్ వంతెన వద్ద ఉదయం వైఎస్సార్సీపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు వేలాది మంది ర్యాలీకి సిద్ధమయ్యూరు. అక్కడికి పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ చేరుకున్న అనంతరం జిల్లా, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో నల్లా సూర్యప్రకాష్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మేహ ందర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ గట్టు శ్రీకాంత్‌రెడ్డిలతో ప్రత్యేక రథంతో ర్యాలీ సాగింది. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కాజీపేట బ్రిడ్జి, ఫాతిమానగర్ జంక్షన్ల మీదుగా డప్పుచప్పుళ్లతో గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ర్యాలీ సాగింది. అభ్యర్థికి సంఘీభావంగా నగర యువత బైక్‌ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ సినీనటుడు విజయ్‌చందర్ తలకు కాషాయపు రంగు టవల్ కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు ఉత్సాహంచూపారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలు కూడా ర్యాలీలో తీసుకెళ్లారు. ప్రత్యేక ప్రచార రథంపై తెలంగాణ, ైవె ఎస్సార్లపై వినిపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాజీపేట పోలీసులు కలెక్టరేట్ వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవిందర్, జనరల్ సెక్రెటరీ గాదె నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భగవాన్ రెడ్డి, ఇరుగు సునిల్ కుమార్, గవాస్కర్‌రెడ్డి, మునిగాల విలియం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, పూజారీ సాంబయ్య, సంగాల ఈర్మియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, జిల్లా నాయకులు మునిగాల కల్యాణ్‌రాజ్, అప్పం కిషన్, ఎర్రంరెడ్డి మహిపాల్ రెడ్డి, దుప్పటి ప్రకాష్, మంచె అశోక్, కౌటిల్‌రెడ్డి, అచ్చిరెడ్డి, గాందీ, నెమలిపురి రఘు, నాగపురి దయాకర్, రజనికాంత్, గౌని సాంబయ్య, ఆరెపెల్లి రాజు, దోపతి సుదర్శన్ రెడ్డి, ప్రతీక్‌రెడ్డి, బద్రుద్దీన్‌ఖాన్, బొడ్డు శ్రావన్, సంపత్, తిక్క శ్రీధర్, రవికుమార్, ఎం.అనిల్ లతో పాటు వర్థన్నపేట, పాలకుర్తి, పరకాల, హసన్‌పర్తి, నర్సంపేట తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చి పాల్గొన్నారు. -
అతి విశ్వాసం వద్దు...
ఉప ఎన్నికలో గెలుపు మనదే మెజారిటీ తగ్గితే విమర్శలొస్తాయ్.. త్వరలో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ హన్మకొండ : ‘వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపు మనదే.. అరుుతే అతి ధీమాకు పోవద్దు.. అలా జరిగి మెజారిటీ తగ్గితే విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతారుు.. ఈ విషయూన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ కార్యకర్త తానే పోటీలో ఉన్నట్లు భావించి పార్టీ అభ్యర్థి పసునూరి దయూకర్ విజయూనికి కృషి చేయూలి’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఉద్భోదించారు. హన్మకొండలోని శ్యామల గార్డెన్స్‌లో టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జరి గింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా కేటీఆర్ మాట్లాడుతూ ఉపఎన్నికల్లో గెలుపు ఖాయమే అరుునా.. గెలుస్తామ ని అలసత్వం వహిస్తే మోసపోతామన్నా రు. సామాన్య కుటుంబానికి చెందిన పసునూరి దయాకర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా ఖర్చులు భరిం చిన ఘనత టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల కాలంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్, టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అలాగే, ప్రతీ కార్యకర్త తాను పోటీలో ఉన్నట్లుగా భావించి పసునూరి దయూకర్ విజయూనికి కృషి చేయూలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్షలాది మందికి మేలు జరుగుతుందని భావించగా.. ఆ కోణంలో టీఆర్ఎస్ ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు. 38 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని, మిషన్ కా కతీయ, వాటర్‌గ్రిడ్ వంటి పథకాలు చేపట్టామని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండని.. ఇప్పు డు ఇంటింటికీ తాగునీరు అందించకపో తే ఓట్లు అడిగేది లేదని చెప్పిన దమ్మున్న నేత కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇక వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలో రానున్నాయని, కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నారు. గెలుపునకు ఢోకా లేదు.. వరంగల్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయూకర్ విజయూనికి ఢోకా లేదని.. మెజారిటీపై నే దృష్టి సారించాలని ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ సూచించారు. ఈ ఎన్ని కలు రాజకీయ ప్రయోజనాల కోసమా, ప్రజా ప్రయోజనాల కోసమా అనే చర్చ కు తెర లేపారని.. ఈ ఎన్నికలు ప్రజా ప్రయోజనాల కోసమేనన్నారు. కాంగ్రెస్ లో టికెట్ కావాలంటే రూ.కోట్లు నాయకులకు చెల్లించాల్సి ఉంటుందని ఆరోపించారు. టీఆర్ఎస్ మాత్రం పేద వారికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటుదని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సైని కుల్లా పని చేసి దయాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ దయాకర్ మొదటి నుంచి వినయ విధేయతలు కలిగి ఉన్నారని.. ఎంపీగా గెలిచాక కూ డా ఇలాగే వ్యవహరించాలని సూచించా రు. ఇక ఈ ఎన్నికలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల కార్యకర్తలు మెజారిటీ సాధించడంలో పోటీ పడాలన్నారు. ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ను చూసి విపక్షాల గుం డెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన పసునూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. చివరగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్లో సామా న్య కార్యకర్తగా పని చేశానని.. ఏ పదవి ఉన్నా, లేకపోరుునా కేసీఆర్‌కు విధేయుడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల విజ యవంతానికి కృషి చేశానని తెలిపారు. తన వంటి పేదవాడిని పంపేలా టికెట్ ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, నాయకులు గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్య, ప్రొఫెసర్ సాంబయ్య, బి.రవీంద్రకుమార్, మర్రి యాదవరెడ్డి, కె.సాంబయ్య, వాసుదేవరెడ్డి, జోరిక ర మేష్, నార్లగిరి రమేష్, అబూబకర్, శివశంకర్, నయూముద్దీన్‌తో పాటు స్ర వంతి, కృష్ణలత, జ్యోతి పాల్గొన్నారు. -
బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రైతు ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత రెండవ రాజధానిగా వరంగల్‌కు బీజేపీ గుర్తింపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హన్మకొండ: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బుధవారం హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో బీజేపీ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ,ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించిన వారి ఆశలు వమ్ము చేశారని, బంగారు తెలంగాణ అంటూ ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రజా వ్యరేకతను బీజేపీకి అనుకూలంగా మలచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకమైందని, నాయకులు, కార్యకర్తలు కష్టించి పనిచేయాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక అభివృద్ది, సంక్షేమ, సామాజిక భద్రత పథకాలు ప్రవేశ పెట్టిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరు రోడ్లకు రూ.1100 కోట్లు మంజూరు చేయాలని కోరితే.. మంత్రి నితిన్ గడ్కరి రూ.1300 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు చేరుకుంది టీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని, రోజు రోజుకు పరిస్థితి దిగజారుతుందన్నదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం నాడున్న పరిస్థితులు నేడు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. దేశంలో మహిళా మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తే స్థలాన్ని చూపలేదని, టెక్స్టైల్స్ పార్కు మాటే ఎత్తడం లేదన్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ తర్వాత రెండు పెద్ద నగరం వరంగల్‌ను బీజేపీ రెండో రాజధానిగా గుర్తించి దీని అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హెరిటేజ్ సిటీగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. అదే విదంగా అమృత్, స్మార్ట్సిటీనగరాలుగా ఎంపిక చేసిందన్నారు. వరంగల్‌లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చి కేంద్రం.. మామునూరు విమానాశ్రయంకు ప్రస్తుతమున్న స్థలానికి తోడు గా మరో 480 ఎకరాలు స్థలాన్ని సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని విమర్శించా రు. తెలంగాణలో బీజేపీ నుంచి ఒక్క ఎంపీ బండారు దత్తాత్రేయ గెలిస్తే సంసద్ యోజన కింద రెండు గ్రామాలను కూడా వరంగల్ జిల్లా నుంచి ఎంపిక చేసుకోవడం జిల్లా అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. కేంద్రం జిల్లాకు చేసిన అభివృద్ధి పనులను, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించి మద్దతు కూడగట్టాలని కిషన్‌రెడ్డి కార్యకర్తలను కోరారు. కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదు.. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కరితో తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో కలుస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పితే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందని, బీజేపీ మద్దతిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్‌కు ఇచ్చిన మాటతో పాటు, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఈ ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్ కళ్ళు తెరిపించాలన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఉప ఎన్నిక సమన్వయకర్త ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్కు మేలు చేసిన వారవుతారని, జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గమనించాలని కోరారు. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ నాయకులు యెండల లక్ష్మినారాయణ, పేరాల చంద్రశేఖర్‌రావు, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. -
టీఆర్ఎస్ను ఓడించాలి
బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు అశోక్‌రెడ్డి, సత్యనారాయణరావు హన్మకొండ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓడించాలని బీజే పీజిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నిక రావడానికి టీఆర్ఎస్ పార్టీయే కారణమని, అసందర్భ, అనాలోచిత నిర్ణయాలతో ఈ ఎన్ని క వచ్చిందని విమర్శించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలువడం వల్ల జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. గండ్ర సత్యనారాయణరావు మాట్లాడు తూ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ను ఓడించే సత్తా ఉన్న వ్యక్తిని బీజేపీ, టీడీపీ జాతీ య అధ్యక్షులు ఎంపిక చేస్తారని తెలిపారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎన్డీఏ అభ్యర్థి విజ యానికి కృషి చేయాలన్నారు. బీజేపీ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ మాట్లాడుతూ ఈనెల 28న హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో బీజేపీ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కన్వీనర్లు, కోకన్వీనర్ల సమావేశం జరుగుతుం దని తెలిపారు. టీడీపీ వరంగల్ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళిమనోహర్ మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చదువు రామచంద్రారెడ్డి, జన్నె మొగిళి, కూచన రవళి, కాసర్ల రాంరెడ్డి, కొత్త దశరథం, పుప్పాల రాజేందర్, మార్టిన్ లూథర్, త్రిలోకేశ్వర్, వీసం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాంగం సన్నద్ధం
ఎన్నికల విధులకు బాధ్యుల నియూమకం 13 విభాగాలకు 20 మంది అధికారులు వారికి సహాయకులుగా 100 మంది సిబ్బంది సమీక్షించిన రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. వచ్చే నెల 21వ తేదీన జరిగే పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక జరిగేందుకు ఎన్నికల అధికారి వాకాటి కరుణ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో ఆమె సోమవారం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించినందున ప్రస్తుతం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారందరూ డిప్యూటేషన్‌పై భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు భావించాలని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయూలని, వ్యయ పరిశీలన తదితర ప్రాధాన్యత అంశాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా ఉండే 13 విభాగాలకు 20 మంది జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. వీరికి సహాయకులుగా 100 మంది సిబ్బందిని నియమించారు. వీరి నియూమకాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ తీసుకున్న నిర్ణయం మేరకు సహాయక రిటర్నింగ్ అధికారి(డీఆర్వో) కె.శోభ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పులు లేని ఓటర్ల జాబితా అంశాన్ని మెప్మా పీడీ పురుషోత్తం, పోలింగ్ కేంద్రాల్లో వీడియో పర్యవేక్షణ బాధ్యతలను దళిత సంక్షేమ అభివృద్ధి శాఖ ఏడీ శంకర్లు నిర్వహిస్తారు. మానవ వనరుల నిర్వహణను ముఖ్య ప్రణాళికాధికారి వి.లలిత్‌కు, రవాణా నిర్వహణకు డీటీసీ శివనాగయ్యకు అప్పగించారు. సిబ్బంది శిక్షణ నిర్వహణను డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రావు, సామగ్రి(మెటీరియల్) నిర్వహణను ఎన్సీఎల్ ప్రాజెక్టు అధికారి కె.ప్రసాదరావు పర్యవేక్షిస్తారు. మీడియా సర్టిఫికెషన్, మానిటరింగ్ కమిటీని సమాచార శాఖ ఏడీ డీఎస్ జగన్, మీడియా, కమ్యూనికేషన్‌ను పీఆర్వో పి.శ్రీనివాస్, ఎన్నికల అంశాల కంప్యూటరైజేషన్, కమ్యూనికేషన్ ప్రణాళికను జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి వి.విజయకుమార్‌లు నిర్వర్తిస్తారు. పోలింగ్ స్టేషన్లకు విద్యుత్, ఇంటర్నెట్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పోలింగ్ స్టేషన్లకు కల్పించే ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.మధుసూదన్, బీఎస్ఎన్ఎల్ డీఈ కౌండిన్యకుమార్, ఆర్వీఎం ఈఈ ఎం.రవీందర్‌లకు అప్పగించారు. పోలింగ్ స్టేషన్లకు తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లను వరంగల్ మునిసిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ఎల్.రామ్‌చంద్ పర్యవేక్షిస్తారు. రేపటి వరకు అవకాశం... మెరుగైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరూ బుధవారంలోపు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు కాలేజీల ప్రిన్సిపాళ్లు యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈ-సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో యువత తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ కరుణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. -
‘గెలుపు గుర్రం’ ఎవరు?
-
‘గెలుపు గుర్రం’ ఎవరు?
♦ వరంగల్ అభ్యర్థిపై సీఎం కేసీఆర్ కసరత్తు ♦ అభ్యర్థి ప్రకటనతోనే సగం విజయం దక్కించుకోవాలని వ్యూహం ♦ ఆచితూచి అడుగులు వేస్తున్న అధికార పార్టీ ♦ టికెట్ రేసులో పార్టీ నేతలతోపాటు ఉద్యమ సంఘాల నాయకులు సాక్షి, హైదరాబాద్ : ఓరుగల్లు ఉప పోరులో విజయం కోసం అధికార టీఆర్ఎస్ వ్యూహ రచనలో నిమగ్నమైంది. అభ్యర్థి ప్రకటన తోనే సగం విజయం సాధించాలన్న తలంపుతో కసరత్తు చేస్తోంది. రెండు పర్యాయాలు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సర్వే చేయించిన గులాబీ పార్టీ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటికే విపక్షాలు వరంగల్ ఉప ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు, పదహారు నెలల టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా ప్రచారం మొదలు పెట్టడంతో మరింత జాగ్రత్తగా ఎత్తులు వేస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్యులతో మంతనాలు జరుపుతున్నారు. శనివారం రాత్రి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి అధికారిక నివాసానికి చేరుకున్న సీఎం.. ఆదివారం ఉదయం కొందరు పార్టీ ముఖ్యులను పిలిపించుకుని మరోసారి వరంగల్ ఎంపీ అభ్యర్థిపై చర్చించినట్లు సమాచారం. టికెట్ రేసులో ఎవరెవరు? టీఆర్ఎస్ తరపున ఈసారి బరిలోకి దిగాలని ముందు నుంచీ పార్టీలో ఉన్న నాయకులతోపాటు తెలంగాణ ఉద్యమంలో కలసి నడిచిన ఉద్యమ సంఘాల నేతలూ పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు అన్ని రకాల సమీకరణాలను పార్టీ విశ్లేషిస్తోంది. పార్టీ జరిపించిన సర్వే ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వచ్చినా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అభ్యర్థి ఎంపిక, పేరు ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 4 నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతో వచ్చేనెల ఒకటి, రెండు తేదీల్లోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నవారిలో పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తోపాటు ప్రొఫెసర్ సాంబయ్య, రవికుమార్, దయాకర్, ఇటీవలే పార్టీలో చేరిన పరంజ్యోతి వంటి వారు ఉన్నట్టు సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కుటుంబంలో ఒకరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి ముగ్గురి పేర్లతో జాబితాను కుదించారని వినికిడి. ఇతర పార్టీల అభ్యర్థులు ఖరారయ్యాక తమ అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఉందంటున్నారు. హరీశ్‌కు ఎన్నికల బాధ్యత? ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేరుస్తారని పేరున్న మంత్రి హరీశ్‌రావుకు వరంగల్ ఉప ఎన్నికల బాధ్యతను అప్పజెప్పే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలిసింది. వరంగల్‌తోపాటు నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక బాధ్యతలు హరీశ్‌కు అప్పజెప్పుతారని ప్రచారం జరిగింది. దీనికి తగిన ట్లే ఆయన ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. గతంలో వరంగల్ జిల్లా పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల బాధ్యతను భుజానా వేసుకున్న హరీశ్ అక్కడి అభ్యర్థులను గెలిపించారు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నిక బాధ్యతను ఆయనకే కట్టబెడతారని సమాచారం. -
తుది జాబితాలో ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు వచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ అభ్యర్థుల తుది జాబితాకు ముగ్గురి పేర్లను సిద్ధం చేసింది. బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ పోటీ చేయాలన్న నిర్ణయానికి రావడానికి ముందే ‘గెలుపు గుర్రం’ కోసం పార్టీ విస్తృతంగా చర్చలు జరిపింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 14 మంది అభ్యర్థులతో ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశమై చర్చించింది. మరోవైపు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ లోక్‌సభ ఉప ఎన్నికకు పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. ఆ ముగ్గురి నేపథ్యాలివీ.. పార్టీ సిద్ధం చేసిన తుది జాబితాలో డాక్టర్ పంగిడి దేవయ్య, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ పేర్లున్నాయి. జనగాం పట్టణానికి చెందిన పంగిడి దేవయ్య వృత్తి రీత్యా డాక్టర్. అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన ఈయన పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. రాజమౌళి కూడా వైద్యుడే. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయనది జనగాం సమీపంలోని వెల్లంల గ్రామం. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎ.చంద్రశేఖర్ మాజీ మంత్రి. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. బీజేపీ అభ్యర్థిగా పోటీచేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తు న్నారు. వీరి పేర్లతో కూడిన జాబితాను జాతీయ కమిటీకి ఆమోదం కోసం పంపినట్టుగా తెలుస్తోంది. ప్రొఫెసర్ గాదె దయాకర్, మాజీ ఎమ్మెల్యే జైపాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు కూడా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి బూత్‌కు సమన్వయ కమిటీ టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయానికి ప్రతి బూత్‌కు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ప్రతీరోజూ బూత్ స్థాయిలో ప్రచారం, ఎన్నికల వ్యూహం వంటి వాటిపై చర్చించడానికి వీలుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాంటి కమిటీలనే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ నిర్ణయించింది. -
టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికో..
అధిష్టానం పరిశీలనలో రవికుమార్, దయూకర్ పేర్లు రేసులో మరికొందరు నేతలు.. ఎవరికివారు ప్రయత్నాలు పార్టీలో చర్చ తర్వాతే నిర్ణయం వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి పోరు మొదలైంది.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేస్తూ సత్తా ఉన్న నాయకుడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులు ఖరారైన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. మన జిల్లాకు చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వారి పేర్లను అభ్యర్థిత్వం కోసం టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. పార్టీ అభ్యర్థిత్వం కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీపడుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం... టీఆర్ఎస్ సీనియర్ నేతలు గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన ఈ ఇద్దరిలో ఒకరిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడిమల్ల రవికుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉంటున్నారు. గతంలో ఆయన పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. అధినేత కేసీఆర్, కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు పోటీ చేసే అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లోనూ పని చేసిన అనుభవాన్ని పార్టీ గుర్తిస్తుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్లో గతంలో కీలకంగా పనిచేసిన పసునూరి దయాకర్ పేరు కూడా టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. పసునూరి దయాకర్ సైతం గతంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని దయాకర్ భావిస్తున్నారు. ప్రయత్నాల్లో మరికొందరు... అధికార పార్టీ కావడంతో గెలుపు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది నేతలు టీఆర్ఎస్ టిక్కెట్‌పై గురిపెట్టారు. స్థానిక నాయకులకే టిక్కెట్ వస్తుందని ముఖ్యనేతలు చెబుతుండడంతో జిల్లాలోని ఎస్సీ వర్గం ముఖ్యనేతలు అందరూ ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్లో పనిచేస్తున్న చింతల యాదగిరి, జోరిక రమేశ్, జన్ను జకార్య, బోడ డిన్న, బొజ్జపల్లి రాజయ్య టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన జన్ను పరంజ్యోతి, రామగల్ల పరమేశ్వర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ రమేశ్ సైతం టీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం గుడిమల్ల రవికుమార్, పసునూరి దయాకర్‌లతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య భార్య ఫాతిమామేరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ భార్య కవితాకుమారి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 28న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాతే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇవీ.. వీరి అనుకూలతలు గుడిమల్ల రవికుమార్ గతంలో పార్టీ యువజన విభాగం జిల్లా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై నమోదైన ఉద్యమ కేసులలో వారి తరఫున రవికుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల కోటాలో తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పసునూరి దయాకర్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. టిక్కెట్ కేటాయింపులో ఇది తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నం!
టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్ వరంగల్, నారాయణఖేడ్లలో సర్వేలన్నీ మనకే అనుకూలం ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుంది పార్టీలో గ్రూపులను ప్రోత్సహించవద్దని హెచ్చరిక హైదరాబాద్: ‘ఉప ఎన్నికలు జరగనున్న వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాల్లో మనమే గెలుస్తున్నం. ఈ రెండు చోట్లా సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి. అయితే పార్టీ శ్రేణులన్నీ కష్టపడి పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ బాధ్యత తీసుకోవాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నట్లు సమాచారం. కేసీఆర్ నేతృత్వంలో గురువారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఉప ఎన్నికలు, కార్పొరేషన్ల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపైనే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో 11 స్థానాల్లో ఓడిపోయాం. ఐదారు వందల ఓట్ల తేడాతో మరికొన్ని చోట్ల స్థానాలు కోల్పోయాం. గట్టిగా పనిచేసి ఉంటే ఇంకొన్ని స్థానాలు మన ఖాతాలో పడేవి. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా పనిచేద్దాం..’’ అని నేతలకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానాలకు బిహార్ ఎన్నికలతోనే నోటిఫికేషన్ వస్తుందని భావించినా రాలేదు. అయితే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలపై ఉంటుందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో ఆయా జిల్లాల నేతలంతా కలసి పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. తక్కువ సభ్యులతో పొలిట్‌బ్యూరో? పార్టీలో అత్యున్నతమైనదిగా భావించే పోలిట్‌బ్యూరోను తక్కువ మంది సభ్యులతో ఏర్పాటు చే స్తామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఐదారు మందికే పొలిట్‌బ్యూరో పరిమితం కానుందని... రాష్ట్ర కమిటీని 42 మందితో ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు సమాచారం. ‘పార్టీలో గ్రూపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రొత్సహించొద్దు. మీరు మళ్లీ గెలవాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. మార్కెట్ కమిటీల నియామకాల్లో గందరగోళానికి గురికావొద్దు. ఉద్యమ పార్టీగా మనతో కలిసి నడిచిన వారున్నారు. రాజకీయ పార్టీగా మారాక మనతో కలసి వచ్చిన వారున్నారు. పాత, కొత్త కలయికతో పదవులు భర్తీ చేసుకోవాలి..’’ అని సూచించారని తెలిసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లను హైదరాబాద్‌లో నిర్ణయిస్తామని... డెరైక్టర్ పోస్టులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని సూచించారని సమాచారం. కాగా డబుల్ బెడ్రూం ఇళ్ల మోడల్‌ను ఐడీహెచ్ కాలనీకి వెళ్లి చూడాలని సీఎం సీఎం సూచించడంతో.. భేటీ అనంతరం నేతలంతా ఆ కాలనీకి వెళ్లారు. -
ష్..!
వరంగల్ : బిహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు జరుగుతాయని భావించిన ఆశావహులకు నిరాశ మిగిలింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలు జోరును కాస్త తగ్గించాయి. ప్రధాన పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఎన్నికలు దూరంగా ఉన్నాయనే సమాచారంతో కొంచెం వెనక్కి తగ్గుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది లేనప్పుడు ఇప్పుడే హడావుడి ఎందుకనే ధోరణిలో అధిక మంది నేతలు ఉన్నారు. కొందరు మాత్రం ఎన్నికలు ఆలస్యమవడాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తమ ప్రాధాన్యతను చెప్పి టిక్కెట్ వచ్చేలా వ్యూహాలు అమలు చేసుకుంటున్నారు. సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీల ముఖ్యనేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. జూన్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జూన్ 11న లోక్‌సభ స్పీకర్ జూన్ 11న కడియం రాజీనామాను ఆమోదించారు. నాటి నుంచి వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. టిక్కెట్‌పై పలువురి ఆశలు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్కు ఈ ఎన్నిక పెద్ద సవాలుగా మారనుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ ఎంపీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక, రాజకీయ వ్యూహం.. వంటి విషయాల్లో టీఆర్ఎస్ అధిష్టానం కొంత స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుకు పరీక్షగా మారనున్న ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని నేతలకే టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి కాకుండా గతం నుంచి పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది పూర్తిగా టీఆర్ఎస్ అధినేత నిర్ణయం ప్రకారమే జరుగుతుందని గులాబీ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు చెబుతున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి క్రియాశీలంగా ఉన్న బోడ డిన్న, పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి, జోరిక రమేశ్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్లతోపాటు ఒయాసిస్సు విద్యా సంస్థల అధినేత జన్ను పరంజ్యోతి గులాబీ పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాలవారీగా పార్టీ ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి కార్యక్రమాలు చేపడుతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యమవుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఇటీవల కార్యక్రమాలను తగ్గించారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం వెతుకుతోంది. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఎవరైనా తెరమీదకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ వరంగల్ ఉప ఎన్నికలో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఉప ఎన్నిక నిర్వహణలో స్పష్టత లేకున్నా కార్యక్రమాల నిర్వహణలో మాత్రం బీజేపీ క్రీయాశీలంగానే వ్యవహరిస్తోంది. పార్టీకి చెందిన కీలకమైన నేతలు తరుచు వరంగల్ జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాగానే ఉన్నా అభ్యర్థి విషయంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతిని బరిలో దించాలని స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు కొత్త రవి, సోద రామకృష్ణ, చింతా సాంబమూర్తి, రిటైర్డ్ పోలీస్ అధికారి రామచంద్రు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ తదితర నేతలు బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తటస్థులను బరిలో దించేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాల ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా ఉప ఎన్నిక నిర్వహణ ఆలస్యమవుతుండడంతో వ్యూహాల అమలు విషయంలో రాజకీయ పార్టీలు స్తబ్దుగానే వ్యవహరిస్తున్నాయి. -
జోరు లేని కారు
టీఆర్ఎస్లో వీడని స్తబ్దత కాంగ్రెస్‌లో పెరిగిన హడావుడి కార్యాచరణలో ప్రతిపక్ష పార్టీలు ముంచుకొస్తున్న వరంగల్ ఉప ఎన్నిక వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. బీహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. అక్టోబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని... దీనికి 45 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ప్రక్రియలో భాగంగా తాజాగా తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలూ కార్యాచరణ ముమ్మరం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంది. బీజేపీ, టీడీపీ ఇదే స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యి. వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యాచరణ మొదలుపెట్టాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టడంలేదు. టీఆర్ఎస్ పార్టీలో 4 నెలలుగా స్తబ్దత నెల కొంది. పార్టీ కార్యక్రమాలు అనేవే జరగడంలేదు. అధికార పార్టీగా టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారనున్న వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఆ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల్లో కదలిక కనిపించడంలేదు. టీఆర్ఎస్కు సంబంధించి అన్ని నిర్ణయాలు అధినేత కేసీఆర్ చేతుల్లోనే ఉన్నా... ఎన్నికల విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు తప్పితే.. మిగిలిన వారు ఈ విషయంపై చర్చ కూడా జరపడంలేదు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్లో పూర్తిగా స్తబ్దత నెలకొంది. ఉపఎన్నిక విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పీసీసీ చీఫ్ వంటి నేతలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మూడు వారాలకు ఓ సారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, డి.శ్రీధర్‌బాబు వంటి నేతలు నియోజకర్గాల బాధ్యతలను తీసుకున్నారు. జిల్లా నేతలు వీరికి అనుబంధంగా పనిచేస్తున్నారు. సమావేశాలు నిర్వహించడం బాగానే ఉన్నా... పార్టీ ప్రకటించిన ప్రకారం కార్యక్రమాలు జరగడంలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మండల, డివిజన్, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కోసమే నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో ఆచరణకు రావడంలేదు. ఎక్కువ మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ఏ పార్టీ పోటీ చేయాలనే విషయంలో స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడలేదు. రెండు పార్టీలు బరిలో దిగాలని భావిస్తున్నాయి. పైకి కూటమి గా కనిపిస్తున్నా... రెండు పార్టీలు ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నిక విషయంలో సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ముఖ్యనేతలు జిల్లాకు ఎక్కువగా వస్తున్నారు. టీడీపీ సైతం కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది. వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఇటీవలే కార్యాచరణ సిద్ధం చేసింది. వైఎస్సార్సీపీ ముఖ్య నేత షర్మిల పరామర్శ యూత్ర త్వరలో మొదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీ నాయకులు ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మొత్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీల్లో వరంగల్ లోక్‌సభ ఎన్నిక వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. -
మీ రాక కోసం..
ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్య కేసీఆర్ రాక జిల్లాలో రెండు రోజులు సీఎం టూర్ ఎంపీ టిక్కెట్ ఆశావహుల ఎదురుచూపు కేసీఆర్‌తో ప్రత్యేక భేటీకి ప్రయత్నాలు వరంగల్ : వరంగల్ లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పేరుకు ఉప ఎన్నిక అయినా వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఆధారంగా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోయేది స్పష్టం కానుంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారనుంది. కీలకమైన ఈ ఎన్నికలో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ఆ పార్టీలోని దళిత నేతలు ప్రయత్నాలు తీవ్రం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జిల్లాకు రానున్నారని సమాచారం. ఆ రోజు కాకుంటే, ఈ నెల 10 లోపే కేసీఆర్ జిల్లా పర్యటన ఉంటుందని.. రెండు రోజులు జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. మొదట హరితహారంలో పాల్గొని రాత్రి వరంగల్‌లోనే బస చేస్తారని.. మరుసటి రోజు గ్రేటర్ వరంగల్‌లో ఇళ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఉంటుందనే సమాచారం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకుల్లో ఆశలు కలిగిస్తోంది. కేసీఆర్‌ను ఎలాగైనా స్వయంగా కలిసి తమ ఆకాంక్షను తెలియజేయాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కీలక నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ద్వారా సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికివారు వ్యక్తిగతంగా కలవడంతోపాటు.. జిల్లా నేతలుృబందంగా కేసీఆర్ వద్దకు వెళ్లి స్థానిక నేతలకే టిక్కెట్ ఇవ్వాలని కోరాలని భావిస్తున్నారు. పెరుగుతున్న జాబితా.. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై గులాబీ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎన్నిక ఎప్పుడు జరుతుందనే విషయంలో స్పష్టత లేకున్నా.. టిక్కెట్ ఆశించే వారి జాబితా రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు గుడిమల్ల రవికుమార్, జోరిక రమేశ్, పసునూరి దయాకర్, చింతల యాదగిరి, జన్ను జకారియా, ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ పి.ఎస్.సుగుణాకర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య, బూజుగుండ్ల రాజేంద్రకుమార్ టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ముఖ్యనేతలు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు, కె.కవితకు సంబంధించిన ఉద్యమ కేసులో వరంగల్ కోర్టులో న్యాయవాదిగా వ్యవహరిస్తున్న గుడిమల్ల రవికుమార్ టిక్కెట్‌పై ఆశలుపెట్టుకున్నారు. జనగామ కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ నాయకుడు డాక్టర్ పి.ఎస్.సుగుణాకర్‌రాజు.. అరుదైన శస్త్ర చికిత్సలు, దళిత ఉద్యమాలలో కీలకంగా పని చేయడం తనకు అనుకూల అంశాలని భావిస్తున్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ద్వారా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. కొసమెరుపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ స్థానానికి జూన్ 11న రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో స్వయంగా కలిసి కడియం తన రాజీనామా లేఖను అందజేశారు. కడియం శ్రీహరి రాజీనామా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. దీంతో సాంకేతికంగా వరంగల్ లోక్‌సభ స్థానం ఇంకా ఖాళీ కానట్లేనని నిపుణులు చెబుతున్నారు. -
వరంగల్ లోక్‌సభకు మన అభ్యర్థినే నిలబెడదాం
* టీడీపీ ‘ఓటుకు కోట్లు’ కేసుతో ఇబ్బందే * బీజేపీ ముఖ్యనేతల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో తెలుగు దేశం పార్టీ ఇరుక్కోవడంతో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినే రంగంలోకి దించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ లోక్‌సభ స్థానంలో గెలుపుకోసం బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు, వరంగల్ జిల్లా ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు. వరంగల్ లోక్‌సభకు గత ఎన్నికలో బీజేపీ పోటీ చేయడంతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చేసిన ఓటుకు కోట్లు నిర్వాకంతో అప్రతిష్ట పాలు కావడం వంటి కారణాలతో బీజేపీ అభ్యర్థినే రంగంలోకి దించాలని నిర్ణయించారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని, బీజేపీ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు.