* టీడీపీ ‘ఓటుకు కోట్లు’ కేసుతో ఇబ్బందే
* బీజేపీ ముఖ్యనేతల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో తెలుగు దేశం పార్టీ ఇరుక్కోవడంతో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినే రంగంలోకి దించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ లోక్‌సభ స్థానంలో గెలుపుకోసం బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు, వరంగల్ జిల్లా ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు. వరంగల్ లోక్‌సభకు గత ఎన్నికలో బీజేపీ పోటీ చేయడంతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చేసిన ఓటుకు కోట్లు నిర్వాకంతో అప్రతిష్ట పాలు కావడం వంటి కారణాలతో బీజేపీ అభ్యర్థినే రంగంలోకి దించాలని నిర్ణయించారు.
కేంద్రంలో ఉన్న అధికారాన్ని, బీజేపీ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు.
వరంగల్ లోక్‌సభకు మన అభ్యర్థినే నిలబెడదాం
Published Mon, Jun 22 2015 3:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement