టీఆర్‌ఎస్‌ను ఓడించాలి | The defeat TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి

Published Tue, Oct 27 2015 1:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి - Sakshi

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి

బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు
అశోక్‌రెడ్డి, సత్యనారాయణరావు

 
హన్మకొండ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్‌ను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓడించాలని బీజే పీజిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నిక రావడానికి టీఆర్‌ఎస్ పార్టీయే కారణమని, అసందర్భ, అనాలోచిత నిర్ణయాలతో ఈ ఎన్ని క వచ్చిందని విమర్శించారు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలువడం వల్ల జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. గండ్ర సత్యనారాయణరావు మాట్లాడు తూ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా ఉన్న వ్యక్తిని బీజేపీ, టీడీపీ జాతీ య అధ్యక్షులు ఎంపిక చేస్తారని తెలిపారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎన్డీఏ అభ్యర్థి విజ యానికి కృషి చేయాలన్నారు. బీజేపీ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ మాట్లాడుతూ ఈనెల 28న హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్‌లో బీజేపీ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కన్వీనర్లు, కోకన్వీనర్ల సమావేశం జరుగుతుం దని తెలిపారు.

టీడీపీ వరంగల్ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళిమనోహర్ మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చదువు రామచంద్రారెడ్డి, జన్నె మొగిళి, కూచన రవళి, కాసర్ల రాంరెడ్డి, కొత్త దశరథం, పుప్పాల రాజేందర్, మార్టిన్ లూథర్, త్రిలోకేశ్వర్, వీసం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement