ఓరుగల్లులో రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభం | YS Jagan Mohan Reddy election campaign in warangal | Sakshi
Sakshi News home page

ఓరుగల్లులో రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభం

Published Tue, Nov 17 2015 10:43 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

ఓరుగల్లులో రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభం - Sakshi

ఓరుగల్లులో రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభం

ఆత్మకూరు: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రచారం వరంగల్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ఆత్మకూరులో అడుగుపెట్టిన వైఎస్ జగన్కు స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఉదయం పరకాల నియోజకవర్గం ఆత్మకూరులో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడ రోడ్ షో, ప్రచారం అనంతరం శాయంపేట, రేగొండ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ ప్రచారం ముగించి సాయంత్రం పరకాల వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ వెంట పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement