Bye-elections
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ క్లీన్ స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను తృణమూల్ కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం కలియాగంజ్ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ ఫలితాలపై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజా విజయంగా పేర్కొన్న ఆమె... బీజేపీకి ఇక రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత రాజకీయాలు పనిచేయవని, అందుకే బీజేపీని ప్రజలు తిరస్కరించారని మమతా విమర్శించారు. ఖరగ్ పూర్ సదర్ నుంచి పోటీ చేసిన తృణమూల్ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ 20,811 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే కరీంపూర్, కలియాగంజ్ నుంచి తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో విజయంతో తృణమూల్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని ఖరగ్ పూర్ సదర్, కరీంపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, మహువా మొయిత్రా లోక్ సభకు ఎన్నిక కావడం, ఉత్తర్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమథనాథ్ రాయ్ ఈ ఏడాది మే 31న మరణించడంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఉప ఎన్నికలు వచ్చే అవకాశం: విజయసాయి రెడ్డి
సాక్షి, శ్రీకాకుళం : ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశాలకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావుతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు, నిర్లక్ష్యం కారణాంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని విమర్శించారు. నాలుగేళ్లయినా వంశధార ఫేజ్ 2 పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ అవినీతి ధనార్జనతో 3 లక్షల కోట్లు దోచుకుని, విదేశాల్లో దాచుకున్నా.. సంతృప్తి చెందడం లేదని.. అందుకే రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ధర్మాన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో హుద్‌హుద్ తుఫాన్లో ఇళ్లు కోల్పోయిన వారికి.. ఇళ్లు కేటాయించలేని అసమర్ధత టీడీపీ ఎమ్మెల్యేల సొంతమన్నారు. ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరగడంతో.. అవి బయటపడకూడదనే పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. -
4 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
కర్ణాటక / కేజీఎఫ్ : నగరంలోని ఎన్‌టి బ్లాక్ వార్డు నెంబర్ 17కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అన్బరసి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత సభ్యురాలు అనిత రాజీనామాతో ఖాళీపడిన వార్డు కౌన్సిలర్ స్థానానికి ఈ నెల 18న ఉప ఎన్నిక నిర్వహించారు. బుధవారం జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అన్బరసి విజయం సాధించారు. కోలారు ఉప విభాగాధికారి శుభాకళ్యాణ్ గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి అన్బరసికి ప్రమాణ పత్రం అందజేశారు. -
బాబూ..సిద్ధమేనా..?
-
వేసవి సెలవులే కొంపముంచాయి: బీజేపీ
లక్నో: తాజాగా దేశవ్యాప్తంగా వెలువడ్డ పలు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాక్‌నే ఇచ్చాయి. యూపీలో విపక్షాలు చేతులు కలపటంతో కీలకమైన కైరానా లోక్‌సభ స్థానాన్ని కోల్పోవటం, అదే సమయంలో మరో సిట్టింగ్ స్థానం నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తుగా ఓడటం బీజేపీకి మింగుడుపడటం లేదు. అయితే ఈ ఓటమికి బీజేపీ నేతలు చేప్తున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. వేసవి సెలవులే తమ కొంప ముంచాయని పాడి పరిశ్రమల శాఖా మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి చెబుతున్నారు. ‘పార్టీ మద్ధతుదారులు, కార్యకర్తలు, ఓటర్లు అంతా వేసవి సెలవుల కారణంగా కుటుంబాలతోసహా ఊళ్లకు వెళ్లారు. వారిని ఇబ్బంది పెట్టకూడదని అధిష్ఠానం భావించింది. ఒకవేళ వారంతా అందుబాటులో ఉండి ఉంటే కైరానా, నూర్పూర్లో బీజేపీ అవలీలగా గెలిచి ఉండేది’ అని లక్ష్మీ నారాయణ్ అంటున్నారు. అయినా ఉప ఎన్నికలను.. సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి తీరుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలోని అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని హర్దోయి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం యోగిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. -
యోగిపై పెరుగుతున్న అసమ్మతి!
లక్నో: 2014తో పోలిస్తే యూపీలో బీజేపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక పార్టీకి మరింత ఊపు వస్తుందనుకున్నప్పటికీ.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. గోరఖ్‌పూర్, ఫుల్పూర్, కైరానా (ఎంపీ స్థానాలు), నూర్పూర్ (అసెంబ్లీ) ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమితో.. సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకుంది. పదిహేను రోజుల క్రితం రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ.. యోగి తీరుపై నేరుగా పార్టీ జాతీయాధ్యక్షుడికే ఫిర్యాదు చేశారు. తాజా ఫలితాలతో.. ఓ రాష్ట్ర మంత్రి, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా యోగి నాయకత్వంపై తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. ఈ అసమ్మతి, ప్రజల్లో అసంతృప్తి కొనసాగితే 2019లో బీజేపీ ఆశిస్తున్నన్ని సీట్లు రావడం కూడా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేరుగా యోగిపైనే విమర్శలు గోపామా ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం (యోగి)పై వ్యంగ్యంగా కవితలు రాసి ఫేస్బుక్లో పోస్టు చేశారు. బీజేపీ ప్రభుత్వం పారదర్శక పాలన అందించడంలో విఫలమైనందున ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను నేరుగా కలవలేక పోతున్నారని మరో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ విమర్శించారు. మరోవైపు, యోగి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని.. తద్వారా ప్రజల్లో తమపై (ఎమ్మెల్యేలు, ఎంపీలు) ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిర్మూలనలో విఫలమైనందునే వరుస ఓటములు ఎదురవుతున్నాయని.. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఎస్బీఎస్పీ నేత, రాష్ట్ర మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ కొంతకాలంగా విమర్శిస్తూనే ఉన్నారు. -
నేను ఫ్రంట్ పెడతాను.. పీఎం అవుతానంటే..
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మంతనాలు జరపడాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ‘రాహుల్‌తో కరచాలనం చేస్తే తప్పేంటి. తన భుజం తట్టాను. మీరు కలిసిన ఆ విధంగానే చేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియాలతో నాకు వ్యక్తిగత గొడవలు ఉన్నాయా’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నవ నిర్మాణ దీక్షపై శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. దేశంలో జరిగిన ఉప ఎన్నికలపై కూడా చంద్రబాబు జోస్యం చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాజా ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలన ఎలా ఉందో స్పష్టం చేస్తుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఇంత ఘోరంగా ఓడిపోలేదని గుర్తు చేశారు. బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలువదదని బాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను కుప్పింగంతులు వేయ్యను.. ఎప్పుడు ఏం చేయ్యాలో నాకు తెలుసు. నేను ఫ్రంట్ పెడతాను. పీఎం అవుతానంటే మీరు రాస్తారు. కానీ ఫూల్‌ని, బఫూన్‌ను అవుతా.. అందరం కలసి పని చేయాలి’ అని అన్నారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన జరిగిన తీరుపై చంద్రబాబు పాత పాటే పాడారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కంటే బీజీపీనే ఎక్కువ అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. రేపటి(జూన్ 2) నుంచి ఏడు రోజులపాటు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. రోజుకో అంశంపై మాట్లాడుతూ దీక్ష కొనసాగిస్తామన్నారు. 4 ఏళ్లలో జరిగిన అంశాలపై నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతానన్నారు. కేంద్రం సహకరించక పోయిన అభివృద్ధి అగదంటూ పేర్కొన్నారు. ఈ దీక్ష 5 కోట్ల మంది చేసే పవిత్ర కార్యక్రమం.. శనివారం ఉదయం 9 గంటలకు ఎవరు ఎక్కడున్నా అధికారులు ఈ దీక్షలో పాల్గొనాలని బాబు ఆదేశించారు. -
పరువూ పాయె...సీట్లూ పాయె....
సాక్షి, న్యూఢిల్లీ : పది రాష్ట్రాల పరిధిలోని నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గురువారం వెలువడిన ఫలితాల్లో కేంద్ర పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. ముఖ్యంగా బిహార్‌లో పాలకపక్ష బీజేపీతో అంటకాగిన జేడీయూ మరీ నష్టపోయింది. జోకిహట్ అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీయూ ఓడిపోయింది. లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. లాలూ పార్టీతోని తెగతెంపులు చేసుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జేడీయూ పరాజయం కావడం వరుసగా ఇది మూడవసారి. గత మార్చి నెలలో అరారియా లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో జెహనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కూడా రాష్ట్రీయ జనతాదళ్ యూ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ మూడు ఎన్నికలను కూడా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ (29) చేతుల్లో ఈ పరాభవాన్ని చవిచూడటం నితీష్ కుమార్‌కు మింగుడు పడని విషయం. నాలుగు పశుదాణా కేసుల్లో లాలూకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో తేజస్వీ యాదవ్ ఆర్జేడీ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినప్పటికీ ప్రజల్లో ఆయన ప్రతిష్ట దెబ్బతినలేదని తెలుస్తోంది. పైగా రాజకీయ కక్ష సాధింపులకు లాలూ బలయ్యారన్న సానుభూతి కూడా ప్రజల్లో కనిపిస్తోంది. జోకిహట్ నియోజకవర్గంలో తాము ఓడిపోవడానికి ఇతర కారణాలున్నాయని జేడీయూ వాదిస్తోంది. ఏదీ ఏమైనా ఇది నితీష్ కుమార్ ప్రతిష్టకు సంబంధించిన విషయమని ఒప్పుకోక తప్పదు. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకోవడానికి ముందు అన్ని ప్రతిపక్షాలను నడిపించగల సమర్థుడైన నాయకుడని పేరు తెచ్చుకున్న నితీష్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నష్టపోతున్నారు. ఆయన ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నాయకుడని కూడా పేరు పొందారు. ఇప్పుడు ఆయనకిదంతా గతించిన చరిత్ర. బీజేపీతో పొత్తు కారణంగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిన నితీష్ కుమార్ రాష్ట్రంలో కూడా బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపటిలాగా కాకుండా ఇప్పుడు ఆయనపై బీజేపీ ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2019లో జరిగే ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి ఆ పార్టీనే ఎక్కువ సీట్లను తీసుకొని జేడీయూకు తక్కువ సీట్లను కేటాయించే అవకాశం ఉంది. -
సంఖ్య తగ్గినా బీజేపీదే మెజారిటీ
న్యూఢిల్లీ: ఇటీవల వరుసగా ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి లోక్‌సభలో బీజేపీకి వచ్చిన సమస్యేమీ లేదు. తాజా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం.. లోక్‌సభలో బీజేపీ బలం 272 (స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కలుపుకుని) గా ఉంది. మొత్తం 543 స్థానాల్లో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముగ్గురు కర్ణాటక సభ్యులు ఇటీవల రాజీనామా చేయగా.. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ సీటు కూడా ఏడాదిగా ఖాళీగా ఉంది. మొత్తం 539 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ 271. ఇద్దరు నామినేటెడ్ సభ్యులను జతచేరిస్తే 541 సంఖ్యకు గానూ 272 మెజారిటీ అవసరం. వీరిద్దరిని కలుపుకుంటే బీజేపీకి 274 మంది సభ్యుల మద్దతుంది. ఎన్డీయే కూటమికి 315 మంది సభ్యుల బలముంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే బలం 336 గా ఉంది. అయితే పలు ఉప ఎన్నికలు, టీడీపీ తెగదెంపుల అనంతరం ఈ సంఖ్య 315కు చేరింది. -
2019లో మోదీ హవాతో గెలుస్తాం: బీజేపీ
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో ఓటమిని బీజేపీ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రధాని, సీఎంలను ఎన్నుకోరని, స్థానిక సమస్యలే ప్రభావం చూపుతాయని ఆ పార్టీ పేర్కొంది. అయినా మోదీ హవాతో 2019 ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. యూపీ, మహారాష్ట్రాల్లో సిట్టింగ్ సీట్లను కోల్పోవడంపై విశ్లేషణ జరుపుతామని తెలిపింది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సహాయక పాత్రకు దిగజారిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబితా పాత్రా ఎద్దేవా చేశారు. ప్రధాని కావాలంటే పనితీరు, కష్టపడేతత్వం అవసరమని, అవి ప్రధాని మోదీలో ఉన్నాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 2014 నాటి కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు దేశ, రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపవని అన్నారు. -
బీజేపీకు 3.. విపక్షాలకు 11
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు 11 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు విపక్షాలకు భారీ విజయం వంటివే. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ (సిట్టింగ్ స్థానంలో) ఓటమిపాలైంది. ఇక్కడ విపక్షాల తరపున బరిలో దిగిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్‌పై విజయం సాధించారు. యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ (బీజేపీ సిట్టింగ్ స్థానం) విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (సమాజ్‌వాదీ పార్టీ) గెలిచారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ లలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ ఎంపీ స్థానంలో 29వేల పై చిలుకు ఓట్లతో, ఉత్తరాఖండ్‌లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మరాఠా గడ్డపై ఫిఫ్టీ–ఫిఫ్టీ మహారాష్ట్రలో పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒకచోట గెలిచి.. మరోచోట ఓటమి పాలైంది. పాల్ఘర్ ఎన్నికల్లో శివసేనతో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో బీజేపీ విజయం 29,572 ఓట్లతో సాధించింది. బీజేపీ తరపున రాజేంద్ర గవిట్, శివసేన తరపున శ్రీనివాస్ వనగా పోటీపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగింది. బీజేపీకి 2,72,782 ఓట్లు, శివసేనకు 2,43,210 ఓట్లు రాగా.. బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) పార్టీ 2,22,838 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 47,714 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికకు ముందే కాంగ్రెస్ నుంచి గవిట్ బీజేపీలో చేరారు. అటు, భండారా–గోందియా స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ మధ్య హోరాహోరీగానే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి హేమంత్పై ఎన్సీపీ అభ్యర్థి 48,907 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, ఆర్పీఐ మరో స్వతంత్రుడు కలిపి ఎన్సీపీకి మద్దతిచ్చారు. ఈ విజయంతో ఎన్సీపీ ఎంపీల సంఖ్య ఐదుకు పెరగగా.. లోక్‌సభలో బీజేపీ సభ్యుల సంఖ్య (మహారాష్ట్ర నుంచి) 22కు తగ్గింది. గోందియాలో బీజేపీ ఓటమితో మోదీ అహంకార పూరిత పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఎన్సీపీ విమర్శించింది. నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షమైన ఎన్డీపీపీ అభ్యర్థి తోఖెహో యెప్తోమీ లక్షా 73వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి ఎన్డీపీపీ అధ్యక్షుడు, నాగాలాండ్ ప్రస్తుత సీఎం నీఫూ రియో విజయం సాధించారు. బిహార్‌లో ఆర్జేడీ.. బెంగాల్లో మమత బిహార్‌లోని జోకిహత్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార జేడీయూకు, సీఎం నితీశ్ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ స్థానంలో జేడీయూ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఆర్జేడీ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. లాలూ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ఈ విజయం భారీగా నైతిక బలాన్నిచ్చింది. ఈ విజయం మోదీ అహంకారపూరిత పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. అటు పశ్చిమబెంగాల్లోని మహేస్తల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 62వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ రెండోస్థానంలో నిలవగా, లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేరళలోని చెంగన్నూర్ స్థానం ఉప ఎన్నికలో అధికార సీపీఎం అభ్యర్థి సాజిచెరియన్ 20,956 ఓట్లతో కాంగ్రెస్‌పై గెలిచారు. పంజాబ్‌లో అకాలీదళ్ కంచుకోట షాకోట్లో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి హర్దేవ్ సింగ్ లాడీ 38,801 ఓట్లతో అకాలీ–ఆప్ సంయుక్త అభ్యర్థిపై గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని థరాళీలో బీజేపీకి చెందిన మున్నీదేవీ షా 1900 ఓట్లతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియా నియోజకవర్గాలో జేఎంఎం ఘన విజయం సాధించింది. మేఘాలయాలో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా కూతురు మియానీ షిరా 3191 మెజారిటీతో అంపతీ నియోజకవర్గంలో గెలిచారు. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 41వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. యూపీలో హసన్‌ల హవా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా పట్టుకోల్పోతోంది. మార్చిలో యూపీలో గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. గురువారం వెల్లడైన కైరానా ఫలితాల్లోనూ పరాజయం పాలైంది. నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ ఓటమిపాలైంది. కైరానాలో బీజేపీ, ఆర్ఎల్డీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగానే పోలింగ్ జరిగింది. విపక్షాల (ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ) ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్ హసన్ 44,618 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో తబస్సుమ్.. యూపీ నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికైన తొలి ముస్లింగా నిలిచారు. నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి నయీముల్ హసన్ (కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ మద్దతు) 5,662 సీట్లతో గెలిచారు. ఈ రెండు స్థానాలూ బీజేపీ నుంచే విపక్షాలు గెలుచుకున్నాయి. 2019లో యూపీలో ప్రధాని మోదీ ప్రభావమేమీ ఉండదని ఫలితాలు నిరూపిస్తున్నాయని తబస్సుమ్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ చెప్పారు. ఎవరేమన్నారంటే.. ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి చావుగంట మోగింది. నేను ప్రతిపాదించిన మూడో కూటమి ఫార్ములా విజయవంతమైంది. ప్రజలకు బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఆ పార్టీ పతనం ఉత్తరప్రదేశ్ నుంచే ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలసి పనిచేస్తే యూపీలో బీజేపీ ఓటమి ఖాయం. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. – మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని, విభజన రాజకీయాలకు పాల్పడే వారి ఓటమి ఇది. బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇది దళితులు, రైతులు, పేదల విజయం. – అఖిలేశ్ యాదవ్ నాలుగేళ్ల ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అబద్ధాలు, మోసంతో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్–మిత్ర పక్షాల విజయం తథ్యం. – కాంగ్రెస్ యూపీలోని కైరానాలో బీజేపీ ఓటమితో ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారన్న సంగతి స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఓటుబ్యాంకును ఏర్పర్చుకోవడానికి బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ముప్పు ఉంది. – సీతారాం ఏచూరి మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఓట్ల చీలిక వల్లే పాల్ఘర్లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ పతనం ఆరంభమైందని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. – ఎన్సీపీ -
123 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. -
123 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. -
ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ,విపక్షాలు
-
ఉపఎన్నికల్లో ఈవీఎం పంచాయితీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం 14 చోట్ల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో రెండు, యూపీలో ఒకటి, నాగాలాండ్‌లో ఒక పార్లమెంటు స్థానాలకు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 31న జరగనుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో ఈవీఎంల గందరగోళంపై శివసేన, ఎన్సీపీలు మండిపడ్డాయి. 25శాతం ఈవీఎంలు సరిగా పనిచేయలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్ అన్నారు. చాలాచోట్ల వీవీపీఏటీ (ఓటు ధ్రువీకరణ యంత్రం)లు పనిచేయలేదన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై విచారణ జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. భండారా–గోందియాలో 40%, పాల్ఘర్లో 46% ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ లోక్‌సభ స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. కైరానాలో హైరానా! అటు యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఎన్నికల సంఘం వేరే ఈవీఎంలను ఏర్పాటుచేసింది. వీలుకాని చోట్ల రీపోలింగ్ జరపనుంది. కాగా, ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఎస్పీ, బీఎస్పీలు ఆరోపించాయి. పలుచోట్ల ఈవీఎంలు చాలాసేపు పనిచేయకపోవడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కైరానాలో 54.17% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలోని రాజరాజేశ్వర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని.. కానీ విపక్షాలు దీన్ని ఎక్కువచేసి చూపిస్తున్నాయని ఈసీ పేర్కొంది. చాలాచోట్ల ముందుగానే అదనపు ఈవీఎంలు ఏర్పాటుచేశామని తెలిపింది. ఉప ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలు కైరానా (యూపీ) 2014 ఎన్నికల్లో విజేత: హుకుమ్‌సింగ్ (బీజేపీ) ప్రత్యర్థి: నహీద్ హసన్ (ఎస్పీ) మెజారిటీ: 2,36,828 పాల్ఘర్ (మహారాష్ట్ర) 2014లో విజేత: చింతామన్ వానగా (బీజేపీ) ప్రత్యర్థి: బలిరాం (బహుజన్ వికాస్ అఘాడీ) మెజారిటీ: 2,39,520 భండారా–గోందియా (మహారాష్ట్ర) 2014లో విజేత: నానాభావ్ పటోలే (బీజేపీ) ప్రత్యర్థి: ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ) మెజారిటీ: 1,49,254 నాగాలాండ్ 2014లో విజేత: – నీఫియూ రియో (ఎన్పీఎఫ్) ప్రత్యర్థి: కేవీ పుసా (కాంగ్రెస్) మెజారిటీ: 4,00,225 -
ముద్దుకృష్ణమ సతీమణికి చిత్తూరు ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: దివంగత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును శనివారం ఉదయం గాలి సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలిశారు. కాగా గాలి మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కాగా, చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. ఇందుకోసం రెండు రోజుల క్రితమే షెడ్యూల్ విడుదలైంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంతో పాటు మహారాష్ట్రలో ఆరు స్థానాలకు అదే రోజున ఎన్నికలు జరుగుతాయి. -
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను గురువారం ఉదయం 10.30లకు ఎన్ని కల రిటర్నింగ్ అధికారి, జేసీ గిరీషా విడుదల చేశారు. ఆయన విలేకరులతో మా ట్లాడుతూ అభ్యర్థులు ఏప్రి ల్ 26 నుంచి మే 3 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునన్నారు. సెలవు రోజులు మినహా ప్రతిరో జూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కలెక్టరేట్లోని జేసీ కార్యాలయం వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్లో నామినేషన్ దాఖలు చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,172 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. అందులో తిరుపతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 261 మంది, చిత్తూరు పోలింగ్ స్టేషన్ పరిధిలో 354 మంది, మదనపల్లె పోలింగ్ స్టేషన్ పరిధిలో 557 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితో పాటు మొత్తం ఐదుగురిని అనుమతిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ నియామవళి అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నిల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పెయిడ్ న్యూస్, ఇతరత్రా ప్రచారాలను పర్యవేక్షించేందుకు ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటుచేశామన్నారు. మొదటి రోజు నామినేషన్లు నిల్ నామినేషన్ దాఖలకు మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ దాఖలు చేయదలుచుకున్న అభ్యర్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉండేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాట్లను డీఎస్పీలు సుబ్బారావు, శ్రీకాంత్, టూటౌన్ సీఐ వెంకటకుమార్ పర్యవేక్షించారు. షెడ్యూల్ ఇలా.... ♦ నామినేషన్ల స్వీకరణ – ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు ♦ నామినేషన్ల పరిశీలన – మే 4 ♦ ఉపసంహరణ గడువు – మే 7 ♦ పోలింగ్ – మే 21 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ♦ ఓట్ల లెక్కింపు – మే 24, అదే రోజు ఫలితాలు ♦ ఎన్నికల కోడ్ – మే 29 వరకు -
మే 29 వరకు ఎన్నికల నియమావళి అమలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మే 29వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం జారీ చేసిందన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అధికారిక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజ కీయ నాయకులు, ప్రజలు సహకరిం చాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చట్టపరంగా చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 1,163 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉంటారన్నారు. అందులో జెడ్పీటీసీలు 65 మంది, ఎంపీటీసీలు 884, చిత్తూరు మున్సిపల్ కార్పొరేటర్లు 49 మంది, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 34 మంది, మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్లు 33 మంది, పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్లు 24 మంది, నగరి కౌన్సిలర్లు 27 మంది, పలమనేరు కౌన్సిలర్లు 24 మంది, పుత్తూరు కౌన్సిలర్లు 23 మంది ఓటర్లుగా ఉంటారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తారని తెలియజేశారు. -
మేలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. శనివారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమి షన్ వెంటనే ఎన్నికల నిర్వహణకు తెరతీసింది. నోటిఫికేషన్‌ను ఈనెల 26న విడుదల చేయనుంది. మే 3న నామినేషన్లకు గడువుగా విధించి మే 21న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 24న ఫలితాలను వెల్లడిస్తుంది. ఇప్పటికే జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు సాధారణ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లా రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడిని రగిలించడం ఖాయమని చెబుతున్నారు. ఈ నెలాఖరు కల్లా పోటీలో నిలిచే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ప్రకటించే వీలుంది. -
ఎంపీలుగా ఆ ముగ్గురి ప్రమాణం..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు సభ్యులు శుక్రవారం ఉదయం లోక్‌సభలో ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని భావిస్తున్న నేపథ్యంలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ప్రాధాన్యం సంతరించుకుంది. సభికుల హర్షద్వానాల మధ్య తొలుత ఆర్జేడీ నుంచి గెలుపొందిన సర్ఫ్రాజ్ ఆలం ఎంపీగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌ల నుంచి విజయం సాధించిన సమాజ్‌వాదీ అభ్యర్థులు ప్రవీణ్‌కుమార్ నిషాద్, నాగేంద్ర పటేల్ సింగ్ పాటిల్ లు ప్రమాణం చేశారు. వీరంతా హిందీలో తమ ప్రమాణ పాఠాన్ని చదవడం విశేషం. పార్టీ టోపీలు ధరించి ఎంపీలుగా.. సమాజ్‌వాది పార్టీ సంప్రదాయ ఎరుపు రంగు టోపీలను ధరించి ప్రవీణ్‌కుమార్, నాగేంద్ర పటేల్‌లు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ ఉప ఎన్నిక ఖాయం?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండకు ఉప ఎన్నిక ఖాయమన్న నిశ్చితాభిప్రాయానికి అధికార టీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది. ఈ మేరకు జిల్లా నేతలతో పార్టీ అధినాయకత్వం మంతనాలు జరుపుతోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. నల్లగొండపై పట్టు సాధించేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తోంది. బుధవారం రాత్రి కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరగడం వల్ల జిల్లా నాయకులతో కూలంకశంగా చర్చించలేక పోయారని, గురువారం సీఎం కేసీఆర్ మరో మారు పార్టీ ముఖ్య నాయకులు కొందరిని పిలిపించుకుని ఎన్నికల వ్యూహంపై చర్చించారని తెలిసింది. నల్లగొండ ఇన్చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డిలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన మైక్ హెడ్సెట్ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలి కంటికి గాయమైందని తేల్చారు. స్పీకర్ నిర్ణయం మేరకు కోమటిరెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయినట్లు గుర్తిస్తూ శాసన సభా సచివాలయం భారత ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ఎన్నికలు జరిగే ఖాళీ స్థానాలతో కలిపి నల్లగొండ ఉపఎన్నిక కూడా వస్తుందన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైతే, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లా నాయకులు దిశానిర్దేశం చేశారని సమాచారం. కలిసి పనిచేయాలి పార్టీ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు నల్లగొండ నియోజకవర్గంలో అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. టీడీపీ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరగానే ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో అప్పటిదాకా ఇన్చార్జిగా వ్యవహరించిన దుబ్బాక నర్సింహా రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముందునుంచీ ఎడమొహం, పెడమొహంలా ఉంటున్న ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, కంచర్ల వర్గాలు కలిసి పనిచేస్తాయా అన్న అనుమానాలూ రేకెత్తాయి. దీంతో అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిందేనని, అందరినీ కలిసి, కలుపుకొని పోవాల్సిన బాధ్యత భూపాల్‌రెడ్డిదేదని కేసీఆర్ చెప్పారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా, రాకున్నా, 2019 సార్వత్రిక ఎన్నికల కోసమైనా ఇప్పటినుంచే పనిచేసుకుంటూ పోవాలని కూడా సూచించారని సమాచారం. మరో వైపు జిల్లా నాయకులను, ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రూపులను సమన్వయం చేసి, అంతా కలిసికట్టుగా పనిచేయించే బాధ్యతను, ఉప ఎన్నికకు ఇన్చార్జ్గా మంత్రి కేటీఆర్‌ను నియమించారని తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారాలు ముగిసి ఉప ఎన్నిక ప్రకటన వెలువడేలోగా పార్టీని బలోపేతం చేసుకోవడం, తమలో ఉన్న అభిప్రాయ బేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేసేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో టీఆర్ఎస్ ఉంది. స్థానిక నాయకులంతా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పనిచేయాలని కూడా సూచించా రని అంటున్నారు. మొత్తంగా ఉప ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి పూర్తి సంసిద్ధంగా ఉండేలా కేడర్‌ను తయారు చేయడంపై నాయకత్వం దృష్టి పెట్టింది. -
బీజేపీ కళ్లు తెరుస్తుందా?
ఉప ఎన్నికలు జరిగినప్పుడు సర్వసాధారణంగా పాలకపక్షాలే గెలుస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ, జేడీ(యూ) లకు షాకిచ్చాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని ఆవిరిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. బిహార్‌లో ఉప ఎన్నిక జరిగిన ఒక లోక్‌సభ స్థానాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ గెల్చుకోగా, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీ చెరొకటీ గెల్చుకున్నాయి. ఈ ఉప ఎన్నికలు అనేక విధాల కీలకమైనవి. యూపీలోని గోరఖ్‌పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత స్థానం. ఆయన గోరఖ్‌పూర్ మఠం ప్రధాన పూజారిగా ఉంటూ ఇక్కడ అయిదు దఫాలు విజయం సాధించారు. అంతక్రితం కూడా ఆ మఠం ప్రధాన పూజారులే విజేతలు. వెరసి ముప్పై ఏళ్లుగా అది బీజేపీదే. మరో స్థానం ఫుల్పూర్ 2014లో తొలిసారి బీజేపీ గెలిచిన స్థానం గనుక అక్కడ ఇప్పుడెదురైన ఓటమి ఆ పార్టీని పెద్దగా బాధించదు. ఇక బిహార్‌లో లాలూ జైల్లో ఉన్నా ఆయన తనయుడు తేజస్వియాదవ్ గట్టిగా కృషి చేసి తమ పార్టీ స్థానాలను నిలబెట్టుకోగలిగారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడం బీజేపీకి ఇది మొదటిసారేమీ కాదు. గత సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తర్వాత పది రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకూ, 33 అసెంబ్లీ స్థానాలకూ జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలు పోగొట్టుకుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఈమధ్య రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరి గిన ఉప ఎన్నికల్లో సైతం అదే జరిగింది. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలుపు అర్థమైనం తగా ఓటమి అర్థంకాదు. ఎందుకంటే ఓటమి అనాథ. ఎవరికి వారు నెపాన్ని ఎదు టివారిపైకి నెట్టే యత్నం చేస్తారు. అందువల్ల ఇప్పుడెదురైన చేదు అనుభవానికి కారణాలేమిటో అర్థం కావడానికి బీజేపీకి మరికొంత సమయం పడుతుంది. నిజా నికి ఉప ఎన్నికలను పాలకపక్షాలు పెద్దగా పట్టించుకునేవి కాదు. అక్కడ గెలిచినా, ఓడినా అదనంగా ఒరిగేదేమిటని అనుకునేవి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల సారథ్యం మొదలయ్యాక పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీజేపీ ప్రతి ఎన్నికనూ తీవ్రంగా తీసుకుంటోంది. ఉప ఎన్నికలను కూడా వదలడం లేదు. ప్రస్తుత ఉపఎన్నికలనూ అలాగే భావించింది. కనుకనే ఇప్పుడు వెల్లడైన ఫలితాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 71 గెల్చుకుంది. మోదీ ఆ రాష్ట్రంలోని వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే సరిగ్గా సంవత్సరం క్రితం అక్కడి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకు 312 సాధించింది. ఇలాంటి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా గెల్చుకుంటున్న లోక్‌సభ స్థానాన్ని, అందునా మొన్నటివరకూ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని చేజార్చుకోవడం చిన్న విషయం కాదు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు ఏకమవుతాయనిగానీ... ఏక మైనా ఇంతటి ప్రభావం చూపగలవనిగానీ తాము అనుకోలేదని, అతి విశ్వాసమే దెబ్బతీసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఆ రెండు పార్టీల ఓట్లనూ కలిపి లెక్కేసినా బీజేపీ కన్నా అవి చాలా దూరంలో ఉన్నాయి. ఆ ఓట్లన్నీ ఇప్పుడెందుకు గల్లంతయ్యాయి? బీఎస్పీ నేత మాయావతి వ్యూహాత్మకంగా ఎన్నికల బరినుంచి తప్పుకుని ప్రధాన శత్రువుగా భావించే ఎస్పీకి మద్దతు ప్రకటించడం ఉప ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసింది. దళిత ఓటర్లు మాయావతి పిలుపు అందుకుని మూకుమ్మడిగా ఎస్పీకి ఓట్లేశారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎన్నికల్లో యాదవులకే పెద్దపీట వేసే అలవాటున్న ఎస్పీ ఈసారి రెండు స్థానాలనూ ఓబీసీలకు కేటాయించడం కూడా గెలుపునకు దోహదపడింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ చేతులు కలిపితే బీజేపీ కంగారుపడక తప్పదు. బిహార్ ఉప ఎన్నికలు సైతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యూ)నేత నితీష్ కుమార్‌తోపాటు బీజేపీ పెద్దల్ని కూడా నిరాశపరిచాయి. 2015లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కూటమి బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా...ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ కూటమినుంచి నితీష్ వైదొలగి, సీఎం పదవికి రాజీనామా చేసి, విపక్షంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వానికి సార థ్యంవహించడం మొదలెట్టారు. పైగా రెండు కేసుల్లో దోషిగా తేలి లాలూ జైల్లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులందరూ అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. లాలూ కుమారుడు తేజస్వియాదవ్ ఎన్నికల పోరులో అనుభవమున్న వ్యక్తికాదు. కనుక ఈ ఉప ఎన్నికలో గెలుపు ఖాయమని అధికార కూటమి భావించింది. కానీ ఓటర్లు వేరేలా తలిచారు. కొత్తగా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు మెరుగైన, సమర్ధవంతమైన పాలన అందించడానికి బదులు పోలీసులకు విస్తృతాధికారాలిస్తాయి. వారు చేసే హడా వుడి కారణంగా ప్రభుత్వం చాలా చురుగ్గా ఉన్నట్టు అందరూ భావిస్తారని పాలకుల విశ్వాసం. యోగి ఆదిత్యనాథ్ కూడా దీన్ని తుచ తప్పకుండా పాటించారు. పోలీ సులు ముందుగా ప్రేమికులపై ప్రతాపం చూపడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈవ్‌టీజింగ్‌ను కట్టడి చేసే పేరుతో నడి బజారుల్లో అతిగా ప్రవర్తించారు. నేర స్తులను అరికట్టే పేరిట ఏకంగా వరస ఎన్కౌంటర్లకు దిగారు. యోగి అధికారం స్వీకరించాక ఏడాది వ్యవధిలో 1,142 ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 38మంది చనిపోయారు. ప్రతి ఎన్‌కౌంటర్‌కూ వేర్వేరు కథలు వినిపించే ఓపిక లేక కాబోలు ఒకే మాదిరి కథనాన్ని 9 ఎఫ్ఐఆర్లలో చేర్చారు. నేరాన్ని కట్టడి చేసే పేరుతో ప్రభుత్వమే ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడటాన్ని జనం మెచ్చరు. ఇలాంటి వన్నీ యోగి పాలనను పలచన చేశాయి. ఈ ఉప ఎన్నికలను హెచ్చరికగా భావించి లోపాలను సరిదిద్దుకోనట్టయితే, విపక్షాలను తక్కువగా అంచనా వేస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితుల్లో పడొచ్చు. -
చేదు ఫలితాలు: బీజేపీ ఓడినవే ఎక్కువ
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఫలితాలతో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం అధికంగా ఓటములను చవిచూస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా కేవలం నాలుగింటినే బీజేపీ కైవసం చేసుకుంది. కాగా, కాంగెస్ పార్టీ 5 స్థానాల్ని గెలుచుకొని ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కంటే మెరుగ్గా ఉంది. తృణముల్ కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలిచి తన సత్తా చాటింది. మోదీ హవాలో.. మరో రెండు విజయాలు ఈ 23 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలు 10. ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగిన 2014లో రెండు స్థానాల్లో, 2016లో మరో రెండు సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. మిగతా ఆరింటిని కోల్పోయింది. అయితే 2014లో ఉప ఎన్నికలు జరిగిన 5 లోక్‌సభ స్థానాలను ఆయా పార్టీలు తిరిగి చేజిక్కించుకోవడం గమనార్హం. 2016లో ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరవాలేదనిపించింది. లక్ష్మీపూర్ (అసోం), శాదోల్ (మధ్యప్రదేశ్) లోక్‌సభ స్థానాలను తిరిగి నిలబెట్టుకుంది. కంచుకోటలో కలవరం.. గత ఏడాది బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదు. పంజాబ్‌లోని అమృత్సర్, గుడాస్పూర్ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అమృత్సర్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. అయితే వరసగా 4 సార్లు గుడాస్పూర్లో గెలుపు బావుటా ఎగరేసిన బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. కేరళలోని మలప్పురం, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానాల్లోనూ బీజేపీకి పరాభవం తప్పలేదు. ముఖ్యమంత్రి స్థానంలోనూ అపజయమే.. 2018లో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాజస్థాన్‌లోని అజ్మీర్, అల్వార్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంతకు ముందు ఆ రెండు స్థానాలు బీజేపీవే. పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా స్థానంలో ఓటమి పాలైన బీజేపీ.. బిహార్‌లోనూ అదే పంథా కొనసాగించింది. బీజేపీకి అఖండ విజయాన్ని అందించి కేంద్రంలో అధికారంలో నిలిపిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ స్థానాలను సైతం బీజేపీ కాపాడుకోలేక పోయింది. విశేషమేమంటే.. ఆ రెండూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేసిన స్థానాలు కావడం. గతేడాది సీఎం, డిప్యూటీ సీఎంలుగా వీరు యూపీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా గోరఖ్‌పూర్, ఫూల్పూర్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ వరసగా 5 సార్లు విజయభేరి మోగించిన తన కంచుకోట గోర్‌ఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి పాలవడం ఈ పార్టీకి మింగుడు పడడం లేదు. -
సీఎం యోగి కంచుకోట బద్దలు
-
ఉపఎన్నికలు వచ్చే అవకాశాల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి సొంత నియోజకవర్గం లోనే ప్రజలు బీజేపీని ఓడించారన్న విషయా న్ని సీఎం కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తు తం అసెంబ్లీ నడిచే తీరును చూసి బాధపడుతున్నానన్నారు. గతంలో అసెంబ్లీ ఎంతో హుం దాగా నడిచేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానేం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తానేమీ చేయకపోతే ఆయన తన ఇంటికి ఎందుకొచ్చా రని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పా టు చేసి ఉండకపోతే కేసీఆర్ సీఎం హోదాలో మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించారు. తిట్టడం మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలనూ కేసీఆరే తీసుకువచ్చారా అని ప్ర శ్నించారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశాలను కొట్టిపారేశారు. రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతా తాను కేసీఆర్ లాంటి వాడిని కాదని, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతానని అన్నారు. నాలుగేళ్లపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో వివేచన కనిపించ డం లేదని, అసెంబ్లీలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో కి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం లో మీడియాపై ఆంక్షలు ఉండబోవన్నారు. -
ఓటమిపై యోగి.. గెలుపుపై అఖిలేశ్ ఏమన్నారంటే!
సాక్షి, లక్నో: బీజేపీ ఈ ఫలితాలు ఊహించలేదని యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటమిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఓటమి అనంతరం యోగి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు ప్రకటించిన సమయంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వేరువేరుగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపాయి. ఎస్పీ-బీఎస్పీపొత్తును చాలా తక్కువగా అంచనా వేశాం. ఈ ఫలితాలపై ఆత్మ విమర్శ చేసుకుని ముందుకెళ్తాం. ఈ ఓటమిని గుణపాఠంగా తీసుకుంటామని యోగి వివరించారు. బీజేపీపై తమ ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పార్టీల కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు రాజీనామా చేసిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాల్లోనే బీజేపీ నెగ్గలేదంటేనే ఆ పార్టీ పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతుందని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీని గెలిపించినందుకు గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువకులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు మాకు అండగా నిలవడంతోనే మా విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఎన్నికల హామీల అమలులో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తమకు ఈ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి అఖిలేశ్ ధన్యవాదాలు తెలిపారు. -
సీఎం యోగి కంచుకోట బద్దలు
సాక్షి, లక్నో: లోక్‌సభ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్ ఎస్పీ-బీఎస్పీ కూటమి బద్ధలు కొట్టింది. రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి పాలైంది. భాజపా అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ పై 20వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కాగా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన ఫుల్పూర్ నియోజకవర్గంలోనూ బీజేపీకి ప్రతికూల ఫలితం వచ్చింది. ఫూల్పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 59, 613 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయిన లోక్‌సభ రెండు స్థానాల్లో బీజేపీ ఓడినట్లయింది. కాగా, ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. మరోవైపు గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందలేదు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్పూర్ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా ఎన్నికవ్వడంతో ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచి 1998, 1999, 2004, 2009, 2014 వరుస ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి ఓటమిపాలైంది. -
బీజేపీకి షాకింగ్ ఫలితాలు
పూల్పూర్లో 22,842 ఓట్ల ఆధిక్యంలో ఎస్పీ గోరఖ్‌పూర్‌లో బీజేపీ వెనుకంజ. 1523 ఓట్ల ఆధిక్యంలో ఎస్పీ బబువా అసెంబ్లీలో 40,510 ఓట్లతో బీజేపీ లీడింగ్ జహనాబాద్‌లో 50,609 ఓట్లతో ఆర్జేడీ ముందంజ అరారియా లోక్‌సభ స్థానంలో 23,187 ఓట్ల ఆధిక్యంలో ఆర్జేడీ గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, పూల్పూర్ ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సొంత నియోజకవర్గం కావడంతో దేశం మొత్తం ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. విజయం మీద అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలు ధీమాతో ఉన్నాయి. గోర్ఖ్పూర్ బీజేపీకి కంచుకోట కాగా, పూల్పూర్లో కూడా తమ అభ్యర్ధి విజయం సాధిస్తారని యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉపేంద్ర దత్ శుక్లా పోటీ చేయగా, ఆయనపై ఎస్పీ, బీఎస్పీ కూటమి నుంచి ప్రవీణ్ నిషాద్ బరిలో ఉన్నారు. కాగా గోరఖ్‌పూర్‌లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందకపోవడం విశేషం. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్పూర్లో నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఇక్కడి నుంచి 1998,1999,2004,2009,2014 వరుస ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వచ్చని ప్రతిపక్షాలు ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక బిహార్‌లోని అరారియా లోక్ సభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరిగింది. మహాకూటమి నుంచి నితీశ్ బయటికి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఈ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. -
యూపీ, బిహార్‌లో ముగిసిన ఉప ఎన్నికలు
లక్నో/పట్నా: ఉత్తరప్రదేశ్, బిహార్లలో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక మోస్తరు నుంచి అత్యల్ప ఓటింగ్ నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో వరుసగా 43 శాతం, 37.39 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, బిహార్‌లోని అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 57 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, భబువా, జహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 54.03, 50.06 శాతం పోలింగ్ నమోదైందని బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అజయ్ వి.నాయక్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం!
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గోరఖ్‌పూర్, ఫూల్ఫూర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందని సీఎం యోగి ఆదిత్యానాథ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేయడంతో ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి ఎజెండాగా సాగుతున్న మోదీ పరిపాలనకు ప్రజలు మరోసారి పట్టం కడతారని, 2019 ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. నెగిటివ్ మైండ్‌సెట్ కలిగిన రాహుల్‌గాంధీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందని ఎద్దేవా చేశారు. ‘నేను ప్రధాని అయితే.. పెద్దనోట్ల రద్దు ఫైల్‌పై సంతకం పెట్టకుండా.. చెత్తకుప్పలో వేసేవాడిని’ అన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన అభ్యర్థననే ప్రజలు చెత్తకుప్పలో వేస్తారని వ్యాఖ్యానించారు. -
అక్కడ విపక్షాల అనైక్యత బీజేపీకి వరం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదే ముందే తేలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు సంయుక్తంగా బీజేపీకి పళ్లెంలో పెట్టి అందిస్తున్నాయని చెప్పవచ్చు. గతేడాది ఉత్తరప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఇకముందు కలిసికట్టుగా పోటీ చేయాలని ఈ మూడు పార్టీల నాయకులు ప్రకటించారు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేయగా, బీఎస్పీ విడిగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈసారి గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేస్తాయని, తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పాలకపక్ష బీజేపీకి ఓ సవాల్‌ను విసురుతాయని రాజకీయ పరిశీలకులు భావించారు. సాక్షి ప్రత్యేకం. ఈసారి ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. ఆయన మొండితనం తెలిసిన కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ నాయకురాలు మాయావతిని కదిపి చూసింది. ఆమె ఎలాంటి ఐక్యతా పిలుపునకు స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలోపెట్టుకొని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ గోరఖ్‌పూర్ నుంచి సంతోష్ నిషాద్, ఫూల్పూర్ నుంచి నాగేంద్ర పటేల్‌ను రంగంలోకి దించింది. గోరఖ్‌పూర్‌లో నిషాద్ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని, ఫూల్పూర్లో కుర్మీలు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ గోరఖ్‌పూర్ నుంచి సుర్హీత ఛటర్జీ కరీంను, ఫూల్పూర్ నుంచి మనీష్ మిశ్రాను బరిలోకి దింపింది. బీఎస్పీ నాయకురాలు మాయావతి మాత్రం ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.సాక్షి ప్రత్యేకం. యూపీలోని ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతగా తీవ్రంగా ప్రయత్నించిందీ ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ప్రతిపక్షాల ఐక్యత వల్ల లాభపడేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే కావడంతో ప్రాంతీయ పార్టీలు, ఇతర చిన్న పార్టీలు పట్టించుకోలేదు. 2014లో జరిగిన లోక్‌సభ, ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీనే బాగా దెబ్బతిన్నప్పటికీ ఐక్యత కోసం మాయావతి కలిసి రావడం లేదు. ఆమె నిర్ణయాలు ఎవరికి అర్థం కాకుండా ఉంటున్నాయి. పొత్తుకు అంగీకరించని ఆమె ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎలాగూ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లయితే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం బీజేపీ అభ్యర్థులదేనని ఎవరైనా చెప్పవచ్చు! -
ప్రజలే దైవాలు
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలే తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తూ ప్రజల మద్దతుతో బీజేడీ 17 ఏళ్లుగా అధికారం చేపడుతూ వివిధ ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేసిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. బీజేపూర్ ఉపఎన్నికలో బీజేడీ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం నియోజకవర్గంలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజేపూర్‌లో బీజేడీ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశాలో గడిచిన 17 ఏళ్ల బీజేడీ పాలనలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు చెప్పారు. మనిషి పుట్టిననాడు మమత యోజన నుంచి మనిషి మరణించిన నాడు హరిశ్చంద్ర పథకం వరకు అమలు చేసి ప్రజల వద్దకు పాలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపూర్ ఉప ఎన్నికలో బీజేడీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి రీతా సాహును శంఖం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేలాదిమంది జనం పాల్గొన్నారు. -
అప్రమత్తమైన వసుంధరా రాజే
సాక్షి, జైపూర్ : ఉప ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అప్రమత్తమయ్యారు. తన కుర్చీకే ఎసరుపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఆమె నేతృత్వంలో పార్టీ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. ‘‘ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది. అందుకే అప్రమత్తమయ్యాం. అభివృద్ధి పనులు జరుగుతున్నా ఇంత దారుణమైన ఫలితం ఎందుకొచ్చిందో సమీక్షించబోతున్నాం’’ అని సమావేశానికి ముందు ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది ఎన్నికలు ఉన్న ఆమె నేపథ్యంలో సమావేశంలో నేతలకు ధైర్యాన్ని నూరిపోసినట్లు సమాచారం. ఓటమి గురించి వదిలేయండి. అధైర్య పడవద్దు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే కావాలి అని నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటమికి బాధ్యుల్ని చేస్తూ సీఎం వసుంధర రాజేతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 1న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానాలను, మండల్‌గఢ్ శాసన సభ సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమితో బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీఎం వసుంధరా రాజే రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. -
ఉప సర్పంచ్ ఎన్నికలో హైడ్రామా
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : మండలంలోని పాల్మాకుల పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అవిశ్వాస తీర్మాణంతో ఉప సర్పంచ్ పదవి కోల్పోగా.. ఆ తర్వాత చోటుచే సుకుంటున్న వరుస ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఖాళీ అయిన వార్డుకు ఉప ఎన్నిక నిర్వహించిన రెండు రోజులకే మరో వార్డు సభ్యుడు రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పంచాయతీలో మొత్తం 14 వార్డులుండగా.. గతేడాది సెప్టెంబరు 26న ఉప సర్పంచ్ హరీందర్గౌడ్పై అవిశ్వాసం పెట్టారు. 9 మంది వార్డు సభ్యులు, సర్పంచ్ సరిత అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. కొత్తగా ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకునేందుకు.. హరీందర్‌గౌడ్ వర్గీయులు ఎత్తులు వేశారు. పంచాయతీ 3వ వార్డు స్థానానికి సభ్యురాలు బాలమణి గత అక్టోబరు 10న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా.. గత నెల 29న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక జరపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో హరీందర్‌గౌడ్ వర్గీయులు కొత్త షాక్ ఇచ్చారు. రెండు రోజుల కిందట పంచాయతీ 5వ వార్డు సభ్యుడు నవీన్‌కుమార్ రాజీనామాను ఎంపీడీఓకు అందజేశారు. వార్డు స్థానం ఖాళీ ఉండగా.. ఉప సర్పంచ్ ఎన్నిక జరిపే అవకాశం లేదనే ఆలోచనతో రాజీనామా చేయించినట్లు సమాచారం. ఇది వరకే నోటిఫికేషన్ జారీ.. ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయడానికి హరీందర్‌గౌడ్ వర్గీయులు పావులు కదువుతుండగా.. అప్పటికే నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం. గత నెల 29న వార్డు స్థానానికి ఉప ఎన్నిక పూర్తయిన మరుసటి రోజు 30వ తేదీన ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 9న ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ రాగా.. తాజాగా మరో వార్డు సభ్యుడు రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వార్డు స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక జరిపే అవకాశాలు ఎంత వరకు అనుకూలంగా ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగా.. వార్డు సభ్యుడు చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందనట్లు సమాచారం. న్యాయ సలహా తీసుకుంటాం పాల్మాకుల పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అయితే వార్డు సభ్యుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికను జరిపే అంశాన్ని న్యాయ సలహా మేరకు ముందుకు వెళ్తాం. – ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి -
ఏం చేస్తారో..? ఆ నలుగురు
భువనేశ్వర్: బిజేపూర్ ఉపఎన్నికకు అధికార పక్షం బిజూ జనతా దళ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాత్మకచర్యల్ని పటిష్టంగా ఎదుర్కొనేందుకు బిజూ జనతా దళ్ పకడ్బందీ సన్నాహాలు చేస్తోంది. ఉప ఎన్నిక ఆద్యంతాల్లో ప్రత్యర్థులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడి ఓటరును తప్పుదారి పట్టించకుండా చేసేందుకు పార్టీ వ్యూహాత్మక కార్యాచరణ ఖరారు చేసింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నాటినుంచి ఎంటి మీద కునుకు లేకుండా అధికార పార్టీ వర్గాలుశ్రమిస్తున్నాయి. బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను సొంతం చేసుకునేందుకు బీజేడీ యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 3 అంచెల్లో పరిశీలకులు, పర్యవేక్షకుల్ని నియమించింది. అసెంబ్లీ, సమితి, పంచాయతీ స్థాయిలో పర్యవేక్షక బృందం కృషి చేస్తోంది. వీరితో పాటు ఒక్కో స్థానిక నాయకుడు ప్రతి 10 కుటుంబాలకు బాధ్యత వహించేందుకు వ్యూహాత్మక పరిశీలన ఏర్పాట్లను బీజూ జనతా దళ్ పూర్తి చేసింది. ఈ వ్యవహారాలకు పార్టీ నుంచి ఎంపిక చేసిన నలుగురు ప్రముఖుల్ని బీజేడీ ఖరారు చేసింది. వీరిలో సుశాంత సింగ్,సంజయ్ కుమార్ దాస్ వర్మ, ప్రణబ్ ప్రకాశ్ దాస్, నిరంజన్ పూజారి ఉన్నారు. మంత్రి సుశాంత్ సింగ్, ప్రణబ్ ప్రకాశ దాస్ బిజేపూర్ సమితి వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. బర్పాలి సమితిబాధ్యతల్ని మాజీ మంత్రి సంజయ్ కుమార్ దాస్ వర్మకు కేటాయించగా గైసిలేట్ సమితి బాధ్యతల్ని మంత్రి నిరంజన్ పూజారికి కేటాయించారు. ఎంఎల్‌ఏలకూ పనే వీరితోపాటు పార్టీ ఎమేల్యేలంతా వరుస క్రమంలో బిజేపూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేక్షంగా సందర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారు. వీరంతాఅసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రతి పంచయతీని సందర్శిస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధీనంలో కొనసాగిన బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌తో ఉభయ బిజూజనతా దళ్, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంతవరకు తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గాలింపు కొనసాగిస్తోంది. ప్రతి పంచాయతీపై గట్టి నిఘా బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి పంచాయతీపై ఎమ్మెల్యేలంతా గట్టి నిఘా వేయాలని పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 59 పంచాయతీలు ఉన్నాయి.ఒక్కో పంచాయతీ బాధ్యతను ఒక్కో ఎమ్మెల్యేకి కేటాయించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రతి పంచాయతీని ప్రత్యక్షంగాసందర్శించేందకుకార్యక్రమం ఖరారు చేశారు. -
బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఝలక్ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని నౌపారా అసెంబ్లీ స్థానంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక రాజస్థాన్‌లోని ఆల్వార్, అజ్మీర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. బెంగాల్‌లోని ఉలుబేరియా లోక్‌సభ ఫలితాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. రాజస్థాన్‌లోని మందల్‌ఘడ్ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 'పద్మావత్' చిత్ర విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్ పుత్ లకు అనుకూలంగా వ్యవహరించలేదన్న ఆగ్రహం రాజస్థాన్ లో ఆ వర్గం ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పిందని అంచనా వేస్తున్నారు. కాగా, రాజస్థాన్‌లో రెండు పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, పశ్చిమ బెంగాల్‌లోని ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలను.. సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించిన విషయం తెలిసిందే. -
ఆ 20మందిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటించిన 20 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా తిరిగి గెలవబోరని ఆప్ ఎమ్మెల్యే(రెబల్) కపిల్ మిశ్రా చెబుతున్నాడు. ఉప ఎన్నికలకు వెళ్తే.. వారంతా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని అంటున్నాడు. అంతర్గత సర్వేలో ఈ విషయం తేటలెల్లమైందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాడు. ‘‘అంతర్గత సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశాం. ఆ 20 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ‘ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజల్లో వారిపై ఏ మేర వ్యతిరేకత’ ఉంది అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాం. వారు తిరిగి గెలిచే అవకాశాలే లేవు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమి ఖాయం. 9 స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులను మార్చినా లాభం లేకపోవచ్చు’’ అని కపిల్ పేర్కొన్నారు. కపిల్ సూచించిన స్థానాల మార్పుల్లో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి, సరితా సింగ్, ప్రవీణ్ దేశ్‌ముఖ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయని తెలుస్తోంది. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటన వెలువడగానే అంతర్గత సర్వేను ప్రారంభించేశాడు. సోషల్ మీడియా ద్వారా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల అభిప్రాయలను సేకరించిన కపిల్.. ఆ నివేదికను రాత్రికి రాత్రే ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అందజేశాడు. మీడియాతో కపిల్ మిశ్రా (పాత చిత్రం) -
గులాబీ.. గుబాళింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సంక్రాంతి పండగ ముంగింట్లో గులాబీ గుబాళించింది. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మునుగోడు మండలం కిష్టాపురం, నిడమనూరు మండలం ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. శాసనసభాపక్షనేత జానారెడ్డి ఇలాఖాలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుని ప్రతిపక్షానికి గట్టిషాక్ ఇచ్చింది. కిష్టాపురం, ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11న ఉపఎన్నికలు జరిగాయి. 13న జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎర్రబెల్లి ఎంపీటీసీ స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఇక్కడ ఎంపీటీసీ మన్నెం శేఖర్. ఇతని తండ్రి మరణంతో ఆయన ఉద్యోగంలో కారుణ్య నియామకం కింద చేరి ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. అలాగే కిష్టాపురం ఎంపీటీసీ చీమల గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఇతను కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచి ఆతర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇతని మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు. రెండు స్థానాలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచినవే కాగా, ఈసారి ఎన్నికల సంగ్రామంలో టీఆర్ఎస్కు దక్కాయి. కిష్టాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి కదిరె లింగయ్య 508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మునుకుంట్ల గోపాల్‌కు 725 ఓట్లు రాగా, బీజేపీకి 131, టీడీపీకి 29, నోటాకు 34 ఓట్లు పడ్డాయి. అలాగే ఎర్రబెల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నెం వెంకన్న 563 ఓట్ల మెజారిటీతో సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిద్దనూరు వెంకటేశ్వర్లుకు 768, టీడీపీకి 147, నోటాకు 58 ఓట్లు వచ్చాయి. గతంలోని ఎంపీటీసీ స్థానం దక్కించుకోకపోవడంతో నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇక్కడ ఆపార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేదాలే పార్టీ అభ్యర్థి ఓటమికి దారితీశాయని సమాచారం. అయితే టీఆర్ఎస్ అభ్యర్థులు నీళ్లలా ఓటర్లకు డబ్బులు పంచారని, అందుకే విజయం సాధించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయోత్సవం.. నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన యువత మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికల ముందు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా రెండు స్థానాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పార్టీ విజయం సునాయసంగా మారింది. రెండు స్థానాలు టీఆర్ఎస్ దక్కించుకోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. విజేతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభినందించారు. -
టీఆర్ఎస్కు షాక్.. ఉప ఎన్నికల్లో ఓటమి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/గంగాధర: ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు.. మరోవైపు సంస్థాగత పటిష్టతపై ముఖ్యమంత్రి కేసీఆర్ తలమునకలై ఉన్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఘోర పరాజయాన్ని పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేదు ఫలితాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. శనివారం వెలువడిన రెండు స్థానాల ఉప ఎన్నికల ఫలితాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ, మరోటి బీజేపీ కైవసం చేసుకున్నాయి. గతంలోనూ కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ ఎంపీటీసీ స్థానానికి సైతం టీఆర్ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు చుక్కెదురు కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి చెందడంపై ఆ పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలోని రెండు ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగిలింది. రెండు చోట్ల పరాజయం పాలైంది. మండలంలోని గంగాధర, ఆచంపల్లి ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటించారు. గంగాధరలో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులే పోటీ పడ్డారు. పోటీలో బీజేపీ అభ్యర్థి పెరుక శ్రావణ్ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మడ్లపల్లి శ్రీనివాస్‌పై 1,252 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 2,296 ఓట్లు పోలుకాగా బీజేపీ అభ్యర్థికి 1,752, టీఆర్ఎస్ అభ్యర్థికి 500 ఓట్లు వచ్చాయి. నోటా కింద 44 ఓట్లు పడ్డాయి. ఆచంపల్లిలో నలుగురు వ్యక్తులు పోటీ పడ్డా రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురమల్ల మనోహర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి పర్నె రాంరెడ్డిపై 734 ఓట్ల మెజారిటీతో వి జయం సాధించారు. మొత్తం 1,760 ఓట్లు పోలుకాగా కాంగ్రెస్ పార్టీకి 1,154, టీఆర్ఎస్కు 420, టీడీపీకి 142, స్వతంత్ర అభ్యర్థికి 21, నోటాకు 23 ఓట్లు పోలయ్యాయి. ఫలించని టీఆర్ఎస్ ప్రయత్నం.. సంబరాల్లో కాంగ్రెస్, బీజేపీలు.. ఉప ఎన్నికల్లో రెండు చోట్ల గెలుపొందడానికి టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీలో సిట్టింగ్ సీటైన ఆచంపల్లి స్థానాన్ని సైతం కోల్పోయింది. అభ్యర్థులను గెలిపించుకోవడానికి టీఆర్ఎస్కు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు రెండు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. జెడ్పీటీసీ స్వగ్రామమైన ఆచంపల్లిలో, స్థానిక సర్పంచ్ సైతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తే అయినా ఇక్కడి అభ్యర్థి భారీ మెజారిటీతో ఓడిపోయాడు. ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం ఉండే గంగాధరలో సైతం భారీ ఓట్ల వ్యత్యాసంతో ఓటమిని చవిచూశారు. చివరి నిమిషంలో కులసంఘాలతో సమావేశం నిర్వహించి ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముప్పుతిప్పల పడ్డా సిట్టింగ్ సీటైన ఆచంపల్లి ఎంపీటీసీ స్థానంలో రాణించలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సుద్దాల దేవయ్య, ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంతోపాటు పలువురు నాయకులు ప్రచారం నిర్వహించారు. రాబోయే ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమ ని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. -
‘స్థానిక’ ఉప నగారా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఉప ఎన్నిక నిర్వహణకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఉమ్మడి జిల్లాలో మూడు ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా, శనివారం ఫలితాలు వెలువడన్నాయి. ఇంతలోనే సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కావడం విశేషం. మృతి, రాజీనామా 2014 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో కొన్ని స్థానాల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు రాజీనామా చేయగా.. మరికొందరు సభ్యులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జడ్చర్ల మండలంలోని బూర్గుపల్లి, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ సర్పంచ్ స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే, బాలానగర్ మండలంలోని బోడజానంపేటలో 10వ వార్డు, గౌతాపూర్‌లో 4వ వార్డు, పెద్దరేవల్లి లో 6 వార్డు, చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంటలోని 2వ వార్డు, హన్వాడ మండలం వేపూర్‌లో 7వ వార్డు, జడ్చర్ల మండలం బూర్గుపల్లిలో 4వ వార్డు, మద్దూర్ మండలం భూనీడులో 4వ వార్డు, నర్వ మండలంలో పెద్దకడ్మూర్‌లోని 10వ వార్డులకు ఉప ఎన్నికలు జరుగనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. 17 నుంచి నామినేషన్ల స్వీకరణ... జిల్లాలోని రెండు సర్పంచ్, 8 వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరునున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఈనెల 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిం చి, మధ్యాహ్నం 2 నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటిస్తారు. గ్రామాల్లో కోలాహలం సర్పంచ్, ఉప ఎన్నికల స్థానాలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు నేతలు తమ అనుయాయుల గెలుపునకు వ్యూహాలు రచించడంతో పాటు సరైన అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డాయి. ఇదే అదునుగా బలం ఉన్న నాయకులు ప్రధాన నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. -
ఉప ఎన్నిక పోరు నేడే..
వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 44వ డివిజన్ ఓటర్లు తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. ఉపఎన్నిక బరిలో నిలిచిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్ తేల్చేందుకు ఓట ర్లు సిద్ధమయ్యారు. డివిజన్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, నాయకులు.. ఓటర్ల స్పందన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయ ంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలతో పోలింగ్స్టేషన్లకు.. గ్రేటర్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక బస్సులో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం తొమ్మిది ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 9,641 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హన్మకొండ నయీంనగర్‌లోని తేజస్వీ హైస్కూల్లో మూడు ఈవీఎంలు, తేజస్వీ హైస్కూల్ 2వ బ్లాక్‌లో నాలుగు ఈవీఎంలు, ఏకశిల హైస్కూల్లో రెండు ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తేజస్వీని హైస్కూల్ 2వ బ్లాక్‌లో మూడో తరగతి గదిలో 1,298 మంది ఓటర్లు, ఇదే స్కూల్లోని ఐదో తరగతి గదిలో 915 మంది ఓటర్లు తమ ఓటను వినియోగంచుకోనున్నారు. ⇒ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య మాక్ పోలింగ్ ⇒ పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ⇒ రిజర్వేషన్– జనరల్ ⇒ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థులు ఇద్దరు ⇒ పోలింగ్ సిబ్బంది–40 మంది ⇒ ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడిగ్ అధికారి, ఇద్దరు చొప్పన సహాయకులు ⇒ రిజర్వులో నలుగురు సిబ్బంది ⇒ పోలింగ్‌లో అభ్యర్థికి ఒక ఎజెంట్ చొప్పన రెండు పార్టీల అభ్యర్థులకు ఇద్దరు ⇒ ఇద్దరు రూట్ ఆఫీసర్లు, ఒకరు జోనల్ ఆఫీసర్ ⇒ ఉప ఎన్నిక కంట్రోల్ రూం ఇండోర్ స్టేడియం ⇒ ఎన్నికల విధుల్లో 50 మంది గ్రేటర్ సిబ్బంది ⇒ రెండు గంటలకోసారి పోలింగ్ శాతం వెల్లడి ⇒ శాంతి భద్రతల కోసం పోలింగ్ కేంద్రానికో ఎస్కార్టు ⇒ నిఘా కోసం వీడియోగ్రాఫర్‌ను నియమించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి.. 44వ డివిజన్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి కరుణాకర్ తెలిపారు. సోమవారం గ్రేటర్ ఇండోర్ స్టేడియంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎం, స్టేషనరీ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉపఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ బ్రహ్మయ్య, సీపీ శ్యాంకుకమార్, ఈఈ లింగమూర్తి, ఏఆర్ఓలు పారిజాతం, శ్రీవాణి, పర్యవేక్షకులు ప్రసన్నారాణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నిక డివిజన్ 44 పోలింగ్ కేంద్రాల సంఖ్య 3 పోలింగ్ బూత్‌లు 9 డివిజన్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 9,641 మహిళా ఓటర్లు 4,648 పురుష ఓటర్లు 4,993 మొత్తం ఓటర్లు 9,641 ఈవీఎంలు 9 -
నేను వద్దనుకున్న దాన్ని పోటీపడి ఏరుకుంటున్నారు
సాక్షి, కర్నూలు : జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో విలువల కోసం తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశానుసారం తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశానని అన్నారు. తాను వద్దని వదిలేసిన స్థానం కోసం టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారని చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని, రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయడం లేదని శిల్పా స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ స్థానానికి తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. ప్రజాస్వామ్యం మరోమారు అపహాస్యం కావడం ఇష్టం లేని కారణంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేట్లేదని తెలిపారు. విలువల కోసం తృణప్రాయంగా ఎమ్మెల్సీ పదవిని త్యజించిన తాము.. తిరిగి ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదని పార్టీ నాయకులు పేర్కొన్నారు. -
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచేదెవరో?
-
విశాల్ నామినేషన్ తిరస్కరణ
-
‘డిసెంబర్ 31లోపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక’
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని ఆర్కే నగర్లో డిసెంబర్ 31లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘా(ఈసీ)న్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్లో గత ఏప్రిల్‌లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీనిపై నోటిఫికేషన్ కూడా గతంలో విడుదలైంది. అప్పుడు అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థిగా పోటీచేసిన టీటీవీ దినకరన్ ఎన్నికల సమయంలో రూ.89 కోట్లు పంపిణీ చేసినట్లు తేలడంతో ఎన్నిక రద్దయింది. -
కొడంగల్‌లో ‘పరకాల’ ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్ : కొడంగల్ అసెంబ్లీ నియో జకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైతే.. దీటుగా ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవలే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారే ముందే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ పేరున రాసి టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబుకు అందజేశారు. ఆ లేఖ ఇంకా శాసనసభ స్పీకర్‌కు అందలేదు. ఒకవేళ రాజీనామా లేఖ అంది, ఆమోదం పొందితే.. ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం పోరుకు ముందస్తుగానే సన్నద్ధమ వుతోంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీశ్‌రావుకే కొడంగల్ బాధ్యతలు కూడా అప్పగించింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. కొడంగల్‌కు ఉపఎన్నిక తప్పనిసరైతే హరీశ్‌రావు ఇన్చార్జిగా వ్యవహరి స్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కొడంగల్ ఉప ఎన్నిక నుంచే శంఖారావం పూరిస్తామని టీఆర్ఎస్ నేతలు ఇటీవల చేసిన ప్రకటన ఉప ఎన్నికకు వారి సన్నద్ధతను స్పష్టం చేస్తోంది. పరకాల ప్రయోగం ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా పరకాల నియోజ కవర్గానికి జరిగిన ఉపఎన్నిక అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరఫున పోటీ పడ్డారు. ఆ ఎన్నికను సవాలుగా తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం.. హరీశ్‌కు బాధ్యతలు అప్పజెప్పి, తమ అభ్యర్థి మొలుగూరి భిక్షపతిని గెలిపించుకుంది. గ్రామస్థాయి మొదలు నియోజక వర్గం దాకా బాధ్యతల పంపకం, శ్రేణుల మోహరిం పు, ప్రచారంలో వినూత్న పోకడలతో టీఆర్ఎస్ పరకాల ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అదే తరహా ప్రణాళిక, వ్యూహాలనే ఇప్పుడు కొడంగల్ ఉప ఎన్నికలో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. గ్రామగ్రామాన సమస్యలను గుర్తిం చడం, ప్రజల తక్షణావసరాలు తీర్చడం ద్వారా వారిలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రామానికి ఒక ఎమ్మెల్యేను రంగంలోకి దింపాలని.. ఒక్కో మండలం బాధ్యతను ఒక మంత్రికి, పదిహేను గ్రామాలకో ఎంపీ స్థాయి నేత సేవలు ఉపయోగించుకోవాలని ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక గ్రామాల్లో కులాల వారీగా ఓటర్ల లెక్కలు తీసి.. ఆ కులానికే చెందిన మంత్రి లేదా, ఎమ్మెల్యేతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు కూడా.. నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు వినియోగించుకోవాలని అధికారపార్టీ నిర్ణయించింది. ఇప్పటికే మండలాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యుల ఫోన్ నంబర్లు, వివరాలను సేకరించారు. వారితో నేరుగా హరీశ్‌రావు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితిని అంచనా వేసేలా, తక్షణ నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధికి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డితో ఇప్పటికే పలుమార్లు హరీశ్ భేటీ అయ్యారని.. అందులో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ నుంచి వలసలు పెరిగాయని చెబుతున్నారు. -
ఉప ఎన్నికల రిజల్ట్స్.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆదివారం వెలువడిన ఓ పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో ఘోర పరాభవం ఎదురయ్యింది. కేరళ వెంగర అసెంబ్లీ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నిలుపుకోగా, గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి స్వర్ణ్ సాలారియాపై లక్షా 93 వేల 219 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆప్ తరఫున మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు స్వర్ణ్‌కు మంచి పోటీ ఇచ్చారనే తెలుస్తోంది. ఈ ఓటమితో ఆరు నెలల క్రితం పంజాబ్ లో సంకీర్ణ అధికారానికి దూరమైన బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ విజయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొంది. సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ శాతం (సుమారు 54 శాతం) పోలింగ్ నమోదు కావటం విశేషం. కేరళలోనూ వాడిన కమలం... ఇక కేరళ వెంగర అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంలో మాత్రం ఊహించిన విధంగానే తీర్పు వచ్చింది. వెంగర అసెంబ్లీ నియోజక వర్గంలో ముస్లిం లీగ్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కేఎన్ఏ ఖాదర్(యూడీఎఫ్ మద్దతుదారు).. ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి పీపీ బషీర్‌పై(ఎల్డీఎఫ్ మద్దతుదారు) 23,000 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ది సోషలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ మూడు స్థానంతో సరిపెట్టుకోగా, ఆరెస్సెస్ అల్లర్ల కారణంతో ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయి బీజేపీ చివరకు నాలుగో స్థానానికే పరిమితం అయ్యింది. విజయంపై ఖాదర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లీగ్ అభ్యర్థి కున్హాలీ కుట్టి 38,000 ఓట్ల తేడాతో విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఆ మెజార్టీ 15000పైగా పడిపోవటం గమనార్హం. కున్హాలీ లోక్‌సభ(మలప్పురం నియోజకవర్గం)కు వెళ్లటంతో ఖాళీ అయిన వెంగర అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 11 ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. -
నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు
-
నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు
► వందల ఇళ్లు కూల్చివేత ► 854 మంది ఇళ్ల పట్టాలు రద్దు ► ఆ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేత ► వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని పేదలపై కక్ష ► ఇదెక్కడి న్యాయమంటూ వాపోతున్న బాధితులు సాక్షి, నంద్యాల: అధికార పార్టీ నాయకులు చెప్పినంత పని చేస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేయకపోతే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లపట్టాలు రద్దు చేస్తామని ఉప ఎన్నికలో ఓటర్లను భయపెట్టారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు పక్కా గృహాల కూల్చివేతకు పూనుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని అయ్యలూరు మెట్ట వద్ద పేదలు వేసుకున్న స్థలంలోని బేస్‌మట్టాలను, ఇళ్లను పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం తొలగించారు. గృహాల వద్దకు లబ్ధిదారులు ఎవరూ రాకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య, వర్షపు నీటిలోనే పొక్లెయిన్లు పెట్టించి పేదల ఇళ్లను, బేస్‌మట్టాలను తొలగించడం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ద్వారా పట్టాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వీరు ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేయలేదని కక్ష సాధింపుతో అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈనెల 19న సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనకు వస్తుండటంతో ఆయన మెప్పు కోసం ఆగమేఘాల మీద పేదల పట్టాలు రద్దు చేసి, ఆ స్థానంలో నిర్మించుకున్న కట్టడాలను కూలగొడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ ప్రచారంలో భాగంగా ఇళ్లులేని నిరుపేదలు 13 వేల మందికి పక్కాగృహాలు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంది. అయితే నేడు టీడీపీకి ఓట్లు వేయలేదంటూ 854 మంది నిరుపేద కుటుంబాల ఇళ్ల పట్టాలను రద్దు చేసి, వారి స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూలగొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. పక్కాగృహాల కోసం ఏళ్లతరబడి నిరీక్షణ అయ్యలూరు మెట్ట సమీపాన 852/2, 853 సర్వే నంబర్లలోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2009వ సంవత్సరంలో 854 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1.50 సెంట్ల చొప్పున పంపిణీ చేశారు. వీటికి సంబంధించి అప్పటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి పట్టాలు కూడా అందజేశారు. ఈ స్థలంలో ముళ్లపొదలు ఉండడంతో పాటు వెళ్లేందుకు దారి లేకపోవడంతో లబ్ధిదారులే చందాలు వేసుకుని మార్గం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కాలనీలోకి వర్షపునీరు చేరకుండా కల్వర్టులు, మంచినీటి సౌకర్యం కోసం బోర్లు వేసుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి విద్యుత్ స్తంభాలు, వైర్లు, మెటల్‌రోడ్డు వేయించుకున్నారు. ఈ స్థలంలో గృహాల మంజూరుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇందిరమ్మ పథకం కింద పక్కాగృహాలు మంజూరు కావడంతో నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన లబ్ధిదారులు 2015లో ఇళ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. పక్కాగృహాలు మంజూరైతేనే ఇళ్లు కట్టుకోవాలన్న నిబంధన ఉండటంతో ఎక్కువశాతం మంది నిర్మాణాలు చేపట్టలేదు. మరికొందరు సొంత డబ్బు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అక్కడ నివాసం ఉంటున్నారు. అధికారపార్టీ పక్కాగృహాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ ఉప ఎన్నిక నేపథ్యంలో గృహాలు కట్టుకోలేదంటూ పట్టాలు రద్దు చేసింది. ఉప ఎన్నిక అనంతరం వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్మించిన కట్టడాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు. -
నంద్యాల చెప్పే నిజం
-
పరాజయాలు.. పరాభవాలే..
ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఓటములు 56 ఉప ఎన్నికల్లో 25సార్లు డిపాజిట్లు గల్లంతు.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనేక పరాజయాలు.. సాక్షి, అమరావతి: అధికారంలో ఉండగా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభపెట్టి, భయభ్రాంతులకు గురిచేసి విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ఓటమి చెందడంలో అంతకు మించిన రికార్డు సృష్టించింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ మొత్తం 56 ఉప ఎన్నికలలో పరాజయాన్ని మూటకట్టుకుంది. అందులో 25 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఉప ఎన్నికల్లో 56 సార్లు ఓడిన టీడీపీ రాష్ట్రంలో 2004 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత వివిధ కారణాలతో పలు అసెంబ్లీ స్థానాలకు 62 ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 56 స్థానాలలో ఓటమి పాలవ్వడమే కాకుండా 25 స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ► 2005లో టీడీపీ అభ్యర్థి మరణంతో జరిగిన బొబ్బిలి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి టీడీపీపై విజయం సాధించారు. ► 2005లో జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కాంగ్రెస్‌పై గెలిచారు. టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. ► తెలంగాణ సాధన వ్యూహంలో భాగంగా 17 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో 2008 మే 29న ఉప ఎన్నికలు జరిగాయి. దీంతోపాటు విజయనగరం జిల్లా తెర్లాంలో టీడీపీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్, కాంగ్రెస్‌నేత పి.జనార్దన్‌రెడ్డి హఠాన్మరణంతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నికలు ఇదేరోజున జరిగాయి. వీటితో పాటు తెలంగాణలోని, జడ్చర్ల, వికారాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, దొమ్మాట, రామాయంపేట, ఎల్లారెడ్డి, డిచ్పల్లి, ఖానాపూర్, మేడారం, హుజూరాబాద్, కమలాపూర్, చేర్యాల్, ఘణ్‌పూర్, ఆలేరు నియోజకవర్గాల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తెర్లాంలో టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మనాయుడు (జయప్రకాశ్ కుమారుడు) గెలిచారు. ఇక తెలంగాణలో జరిగిన మిగతా ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ గెల్చుకోగా, టీఆర్ఎస్ ఏడు స్థానాలను, టీడీపీ నాలుగు స్థానాలను, సాధించాయి. సిద్దిపేట సçహాæ కొన్ని నియోజకవర్గాలలో ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ► తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు, ఆపార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో 2010 జులై 27న 12 స్థానాలకు (చెన్నూరు, ఎల్లారెడ్డి, సిర్పూరు, సిద్ధిపేట, హుజూరాబాద్, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, మంచిర్యాల, వరంగల్ వెస్ట్, నిజామాబాద్ అర్బన్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ మినహా తక్కిన అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ► 2011 అక్టోబర్ 13న నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో ఈ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాటమంటూ చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్లి పెద్ద హైడ్రామా నడిపినా ఈ ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ► కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పిన అనంతరం జరిగిన కడప లోక్‌సభ స్థానానికి 2011లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి 5,45,672 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. ఇదే సమయంలో జరిగిన పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ► 2012 మార్చి 18న కోవూరు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఘణ్‌పూర్, కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏపీలోని కోవూరు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించగా, తెలంగాణాలోని ఆరింటిలో టీఆర్ఎస్ నాలుగు స్థానాలను, బీజేపీ, ఇండిపెండెంట్లు ఒక్కొక్క స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండూ ఓటమి పాలయ్యాయి. ఇక టీడీపీ అయితే ఈ ఉప ఎన్నికల్లో కోవూరుతో సహ నాలుగు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో పదవులకు రాజీనామాలు చేయించడంతో ఒక ఎంపీ స్థానంతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. 2012 జూన్ 12న జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మూడు (పరకాల, నరసాపురం, రామచంద్రాపురం) అసెంబ్లీ స్థానాలు మినహా తక్కిన 15 అసెంబీల స్థానాలనూ. నెల్లూరు ఎంపీ స్థానాన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొంది. తిరుపతి, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, ఒంగోలు, నరసన్నపేట, పాయకరావుపేట, అనంతపురం అర్బన్, ఎమ్మిగనూరు, రాయదుర్గం, రైల్వేకోడూరు, ఉదయగిరి, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరం స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ గెల్చుకుంది. ఇక పరకాలలో టీఆర్ఎస్, నరసాపురం, రామచంద్రాపురంలలో కాంగ్రెస్ విజయం సాధించాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేక చతికిలపడింది. పైగా 5స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఏడు స్థానాల్లో అధికార కాంగ్రెస్ కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. డబ్బు పంపిణీకి ఆద్యుడు బాబే.. ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతికి ఆద్యుడు చంద్రబాబేనని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. సాధారణ ఎన్నికల్లోనే కాదు ఉప ఎన్నికల్లోనూ వందల కోట్లు ఖర్చుచేసే విష సంస్కృతికి చంద్రబాబే శ్రీకారం చుట్టారని అంటుంటారు. 1995లో జరిగిన ఓ ఉప ఎన్నిక సందర్భంగా ఓటుకు రూ.500 పంపిణీ చేయించారని గుర్తు చేస్తుంటారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తీరు తాజా నిదర్శనం. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలో ఉండే పార్టీకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్థానిక యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవడంతో సహా అధికారపార్టీకి అన్ని అవకాశాలు ఉంటాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా నంద్యాలలోనే మకాం వేయించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు దాదాపు రూ.1,400 కోట్లతో వివిధ పథకాలను మంజూరు చేసి ప్రజలను ప్రలోభాలకు గురిచేశారు. ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 10వేల వరకూ పంపిణీ చేశారు. తమకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, పథకాలు ఆగిపోతాయని, పెన్షన్లు – రేషన్ నిలిచిపోతాయని బెదిరించారు. డ్వాక్రా మహిళలను కూడా కార్యకర్తల్లా ఉపయోగించుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తాము ఓడినా నైతిక విజయం తమదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
నంద్యాల చెప్పే నిజం
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవాల్లో ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. షరా మామూలుగా అన్నిచోట్లా పాలక పక్షాలే విజయం సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడం వల్ల నంద్యాల స్థానానికి ఎన్నిక అవసరమైంది. కేంద్ర రక్షణ మంత్రి పదవి నుంచి తప్పుకుని గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పరీకర్ కోసం బీజేపీ శాసనసభ్యుడు రాజీనామా చేయడంతో పణజీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ రాష్ట్రంలోనే వాల్పోయ్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీకి ఫిరాయించిన విశ్వజిత్ రాణే శాసన సభ్యత్వాన్ని వదులుకోవడం వల్ల ఆ స్థానానికీ ఎన్నిక తప్పలేదు. ఆయన తిరిగి ఎన్నికయ్యారు. ఢిల్లీలోనూ ఫిరాయింపు కారణంగానే ఉప ఎన్నిక జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ మొన్న మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి, శాసనసభ్యత్వాన్ని వదులుకున్నారు. కానీ ఉప ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అధికారపక్షమైన ఆప్ అక్కడ గెలిచింది. గోవా, ఢిల్లీల్లో ఫిరాయించినవారు అనుసరించిన ప్రమాణాలనే ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన 20 మంది ఫిరాయింపుదారులు కూడా పాటించి ఉంటే నంద్యాల ఒక్కచోట మాత్రమే కాదు... ఆ ఇరవై స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పకపోయేవి. వారిని చేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక విలువలకు తాను సహస్రయోజనాల దూరమని దశాబ్దాలక్రితమే ఎటూ నిరూపించుకున్నారు. కనీసం ఆ పంచన చేరినవారిలో ఒక్కరైనా తాము నైతికంగా ఉన్నతులమని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. వారిలో కొందరు మంత్రి పదవులు కూడా దక్కించుకుని తరించారు. పైపెచ్చు నంద్యాల ఫలితాన్నే ఆ స్థానాలకు కూడా అన్వయించుకోవాలని మర్కట తర్కానికి దిగుతున్నారు. గోవా, ఢిల్లీల్లో బీజేపీలోకి ఫిరాయించినవారు పాత పార్టీల ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవుల్ని వదులుకున్నారు గనుక బీజేపీ ఉన్నత ప్రమాణాలు పాటించిందనుకోనవసరం లేదు. వారిని రాజీనామా చేయమని కోరిందా లేక వారే స్వచ్ఛందంగా తప్పుకున్నారా అనే విచికిత్స కూడా అనవసరం. ఆ విషయంలో తనకు పెద్ద పట్టింపు లేదని బీజేపీ అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరుడు నిరూపించుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న తెలుగుదేశంతో చెలిమిని కొనసాగిస్తోంది. తమ నుంచి ఫిరాయించిన ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు లోక్‌సభ స్పీకర్ వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇది చాలదన్నట్టు నంద్యాల ఉప ఎన్నిక గెలిచినందుకు బాబును స్వయానా ప్రధాని నరేంద్రమోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ఎన్నిక ఎందుకు అవసరమైందో మోదీకి తెలియదనుకోలేం. పైగా అక్కడ ఎడాపెడా జరిగిన అధికార దుర్వినియోగం, సృష్టించిన భయానక వాతావరణం సంగతి ఆయనకు చేరి ఉండాలి. కనీసం తమను అక్కడ బాబు ప్రచారానికే రానీయకుండా అవమానించారన్న విషయం తెలిసి ఉండాలి. గోవా, ఢిల్లీల్లో తమ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ జనం తీర్పు కోరినందుకైనా నంద్యాల విషయంలో ఆయన మౌనంగా ఉండిపోతే వేరుగా ఉండేది. నంద్యాల అగ్నిపరీక్ష ఎదుర్కొనడం తప్పదని గ్రహించినప్పటినుంచీ అధికార తెలుగుదేశం అక్కడ సాగించిన అరాచకాలకూ, అధికార దుర్వినియోగానికీ అంతు లేదు. అంతకిత్రం నంద్యాలసహా విపక్షం గెలిచిన 67 స్థానాల్లోనూ కనీసం ఒక్కచోటైనా బాబు సర్కారు అభివృద్ధి ఊసెత్తలేదు. ఫిరాయింపులు జరిగాక ఆ 21 చోట్ల కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ ఉప ఎన్నిక అనేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తి ఆగమేఘాలపైన నంద్యాలలో స్వల్ప వ్యవధిలో రూ. 1,400 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది. చేతికి ఎముక లేకుండా జీవోలు జారీ చేసింది. ‘అవిగో ఇళ్లు... ఇవిగో పింఛన్లు, రోడ్లు’ అంటూ హడావుడి చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేసింది. స్వయానా ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్దే పోలీసుల్ని మోహరిం చడంతోపాటు ఇతర నాయకుల ఇళ్లపై అర్ధరాత్రుళ్లు పోలీసు దాడులు చేయించింది. ఇవన్నీ ఒకపక్క కొనసాగిస్తూనే రూ. 200 కోట్ల మేర టీడీపీ నల్లడబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలున్నాయి. స్వయానా చంద్రబాబే కులాలవారీ సమావేశాలు పెట్టి ప్రలోభపెట్టాలని చూశారు. ‘నా పింఛన్ తీసుకుంటున్నారు... నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు, నాకు ఓటెందుకు వేయరంటూ' ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయ త్నాలకు దిగారు. తన సొంత ఆస్తుల్ని జనానికి దోచిపెడుతున్నట్టు మాట్లాడారు. దాదాపు కేబినెట్నంతటినీ, 70మంది ఎమ్మెల్యేలనూ అక్కడ దించారు. ప్రచార పర్వం ముగిశాక ఎక్కడివారక్కడికి పోవాల్సి ఉండగా వారిలో చాలామంది నంద్యా లలోనే తిష్టవేసి బెదిరింపుల పర్వాన్ని కొనసాగించారు. చేసిందంతా చేసి నంద్యాల ఫలితం తన పాలనపై రిఫరెండమని బాబు చెప్పుకుంటున్నారు. విషాదమేమంటే ఎన్నికల సంఘం అధికారులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందినా వారు సరైన చర్యలు తీసుకోలేకపోయారు. ఒక ఉదంతంలో చర్య తీసుకోక తప్పనందుకు ఆ సంస్థపై బాబు ఆరోపణలు చేయడం చూస్తే ఎవరికైనా డేరా బాబా గుర్తుకు రాకమానడు. ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలకూ పాల్పడిన డేరా బాబా మూడు కేసుల్లో శిక్ష పడేసరికి తనకేదో అన్యాయం జరిగిందని లబలబలాడి మూడు రాష్ట్రాల్లో ఎలా విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలుసు. బాబు తొలిసారి పాలనలోనే డేరా బాబాకు సాటిరాగల నయూముద్దీన్ పుట్టుకొచ్చాడు. లెక్కలేనన్ని హత్యలు, అత్యాచారాలు, ఇతర అఘాయిత్యాలు బాబు సర్కారు ఆశీస్సులతో కొనసాగించాడు. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక తంతు చూస్తే ఎన్నికల సంఘానికంటూ కింది స్థాయి వరకూ శాశ్వత ప్రాతిపదికన సొంత వ్యవస్థ ఉండాలనీ, అది మరింత సమర్ధవంతంగా పనిచేసేలా నిబంధనలుండాలని, ఆ సంఘం ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకునే ఏర్పాటుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
ఉత్కంఠకు నేడు తెర
– నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం – ఉదయం 8నుంచి కౌంటింగ్ ప్రారంభం – మధ్యాహ్నం 12 గంటలకు ఫలితం వెల్లడి – 600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు – పట్టణంలో 144 సెక్షన్ అమలు నంద్యాల ఉపఎన్నిక ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపడిన ఈ ఎన్నిక ఫలితం మధ్యాహ్నానికి వెల్లడికానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నంద్యాల ఉపపోరు ఆసక్తికరంగా సాగింది. ఈ ఎన్నికపై భారీగా బెట్టింగ్‌లు నడిచాయి. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు కలిసినా నంద్యాలలో ఎవరు గెలుస్తారనే విషయంపై చర్చ సాగేది. సర్వేలు..విశ్లేషణలు.. సరేసరి. భారీ పోలింగ్ నమోదైన నేపథ్యంలో గెలుపెవరిది అనే అంశం సోమవారం తేలిపోనుంది. - నంద్యాల నంద్యాల ఉపఎన్నిక కౌటింగ్‌కు అధికార యంత్రంగా భారీ ఏర్పాటు చేసింది. నంద్యాల పట్టణం గిరినాథ్ సెంటర్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉపఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఉండగా 255 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను 19 రౌండ్లలో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కౌంటింగ్‌కు 15 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపునకు 14, ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి ఉంటుందన్నారు. ఒక్కో రౌండ్లో 8 నుంచి 10వేల ఓట్ల వరకు లెక్కించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 2,18,858 ఓటర్లు ఉండగా 1,73,189ఓటింగ్‌లో పాల్గొన్నారు. కౌంటింగ్ మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో 60మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్‌తో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షించనున్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధాన పోటీ దారులుగా ఉన్నారు. ఈనెల 23వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. వైఎస్సార్సీపీ పట్టు ఉన్న గోస్పాడు మండలంలో 90.81శాతం పోలింగ్ నమోదు కావడం, అలాగే నంద్యాల మండలంలో 87.61శాతం, పట్టణంలో 74 శాతం పోలింగ్ జరగడంతో టీడీపీ నాయకులుఅలజడికి లోనవుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళా ఓటర్లు ఉండగా 88,639 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొనడంతో వైఎస్సార్సీపీకి కలిసి వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై ఫలితాల వెల్లడి.. కౌంటింగ్ ఫలితాలను వెల్లడించేందుకుఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ ఫలితాలను దీనిపైనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మీడియా సిబ్బందికి కౌంటింగ్ హాల్లోకి ప్రవేశం ఉండబోదు. ఎన్నికల అధికారి గుర్తింపు కార్డు ఉన్న వారు మాత్రమే కౌంటింగ్ హాల్ ప్రాంగణంలో ఉంటారు. భారీ బందోబస్తు... కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ గోపినాథ జట్టి.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 30 పోలీస్ యాక్టు, సెక్షన్ 144 అమలు చేస్తున్నామని, ఐదుగురి మించి ఎవరూ గుంపులుగా ఉండరాదన్నారు. కౌంటింగ్ హాల్ వద్ద మూండంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తర్వాత ర్యాలీలు, బాణ సంచా పేల్చరాదన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ 5, స్పెషల్ స్టైకింగ్ ఫోర్స్ 3, మొబైల్ పార్టీలు 12, పికెట్స్ 21, పారా మిలటరీ సీఆర్పీఎఫ్ 1, నాలుగు ఏపీఎస్పీ ప్లటూన్లు, 12మంది డీఎస్పీలు, 18మంది సీఐలు, 63మంది ఎస్ఐలు, 58మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 232 మంది కానిస్టేబుళ్లు, 18మంది మహిళా కానిస్టేబుళ్లు, 12 స్పెషల్ పార్టీలు, 118 మంది హోంగార్డులు, మొత్తం 600మంది సిబ్బందిని బందోబస్తుకు విధులకు కేటాయించామన్నారు. రాకపోకల మళ్లింపు.. కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఉన్న ఐదు కాలనీల రహదారులను బ్లాక్ చేసినట్లు ఎస్పీ గోపినాథ్‌జట్టి తెలిపారు. ఎస్బీఐ కాలనీ, సుద్దులపేట, టూటౌన్ పోలీస్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పద్మావతినగర్, సరస్వతినగర్, రెవెన్యూక్వార్టర్స్ రహదారుల గుండా వెళ్లే వాహనాలు మళ్లిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలో 144సెక్షన్ అమలులో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతాలను, పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నంద్యాల నియోజకవర్గంలోని నాయకులు, గోస్పాడు మండలంలో నాయకుల ఇళ్ల వద్ద, గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
– గెలిచిన వారు ఊరేగింపులు నిర్వహించరాదు – జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమై ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ఓట్లు లెక్కింపు కేంద్రం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుందని, ఇందులోనే మీడియా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రౌండు వారీగా ఫలితాలు తెలుసుకునేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నంద్యాలలో 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గెలిచిన వారు ఎటువంటి ఊరేగింపులు చేపట్టకుండా నిషేధం విధించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని, అంతకు ముందుగా కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా టేబుళ్లకు కేటాయిస్తామని తెలిపారు. కౌంటింగ్‌కు 14 టేబుళ్లు వినియోగిస్తున్నామని, 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు. -
కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి
– పొరపాట్లకు తావివ్వొద్దు – పారదర్శకంగా వ్యవహరించాలి – అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచన కర్నూలు (అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పొరపాట్లకూ తావివ్వరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కౌంటింగ్ అధికారులు, అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఈ నెల 28న ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదలవుతుందన్నారు. సిబ్బంది ఆదివారం రాత్రికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మొత్తం 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు వినియోగిస్తున్నామన్నారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని తెలిపారు. రిజర్వుతో సహా 20 మంది కౌంటింగ్ అధికారులు, 20 మంది కౌంటింగ్ అసిసెంట్లను ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అవసరం ఉండవని, కంట్రోల్ యూనిట్‌ను మాత్రమే కౌంటింగ్‌కు ఉపయోగిస్తామని వివరించారు. రిజల్ట్ బటన్ నొక్కితే సీరియల్ నంబర్ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు డిస్ప్లే అవుతాయన్నారు. వాటిని రాసుకోవడం, లెక్కించడంలో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతోందా, లేదా అనే విషయాలను సూక్ష్మ పరిశీలకులు గమనిస్తుంటారన్నారు. మొదట రిటర్నింగ్ అధికారి టేబుల్‌పై పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని, ఇది అరగంటలో పూర్తవుతుందని తెలిపారు. ఆ తర్వాత కంటోల్ యూనిట్లలో నమోదయిన ఓట్లను లెక్కిస్తారని వివరించారు. కౌంటింగ్ సిబ్బందిని సిస్టమ్ ద్వారా టేబుళ్లకు ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, కర్నూలు, ఆదోని ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, ఓబులేసు, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి ధీమా వారిదే!
- ఉప ఎన్నికల ఫలితంపై నేతల్లో టెన్షన్ - గ్రామాల వారీగా లెక్కలు చూస్తున్న వైనం - రూ.కోట్లలో బెట్టింగ్‌లు నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఫలితంపై టెన్షన్‌గా గడుపుతున్నారు. గ్రామాల వారీగా లెక్కలు చూసుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీ అభ్యర్థుల తరఫున కోట్లాది రూపాయల బెట్టింగ్ కాసిన వారు అభ్యర్థులను మించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. బుధవారం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించిన అధికారులు సోమవారం కౌంటింగ్‌కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అంచనాల్లో నిమగ్నమైన నేతలు.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్ధుల్ఖాదర్తోపాటు మరో 13మంది ఎన్నికలో పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన మరు నిమిషం నుంచి వీరంతా వార్డులు, పల్లెల వారీగా ఫలితంపై అంచనాలు వేస్తూ గడుపుతున్నారు. పట్టణంలో 1,42,628 ఓటర్లకు 1,05,629 మంది, రూరల్‌కు సంబంధించి 47,386 ఓటర్లకుగాను 41,514 మంది, గోస్పాడు మండలంలో 28,844 ఓటర్లలో 26,192 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 79.20శాతం పోలింగ్ నమోదైంది. ఫలితం మిగిలి ఉండడంతో నాయకుల దృష్టి అటువైపు పడింది. గ్రామాల వారీగా నాయకులు, ఓటర్లకు పంపిణీ చేసిన నగదు, చీరలు, ముక్కుపుడకలు, దేవాలయాలకు అందజేసిన నగదు, వాటి కారణంగా తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ గడుపుతున్నారు టీడీపీ నాయకులు. ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన... నియోజకవర్గంలోని 2,18,858 ఓటర్లలో 1,73,335 మంది ఓటు వేసి రికార్డు సృష్టించడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందని లోలోన మధనపడుతున్నారు. నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళలుండగా 88,503 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరు ఎవరికి ఓటు వేశారనేది అంతు పట్టడం లేదు. గ్రామాల్లో కూడా టీడీపీ నాయకుల అంచనా కన్నా పోలింగ్ శాతం పెరగడం ఆ పార్టీ నాయకుల్లో అలజడి రేపుతోంది. గోస్పాడు, నంద్యాల మండలాల్లోని గ్రామాలు మొదటి నుంచి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటం, వాటిలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరగడం టీడీపీ నాయకుల కలవరపాటుకు కారణంగా మారింది. పందెంరాయుళ్ల ఉత్కంఠ.. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితంపై నాయకులు, బెట్టింగ్ రాయళ్లు రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.50కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. స్థానిక నాయకులు సైతం గ్రామాల వారీగా పందె కాస్తున్నట్లు తెలిసింది. -
అసహనం.. అరాచకం
►పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీలో అసహనం ►నంద్యాలలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నేతలు ►శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం ►వేటకొడవలితో ‘అభిరుచి మధు’ వీరంగం ►వైఎస్సార్సీపీకి ఓటేశారని ఓ కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాడి నంద్యాల : నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తడంతో టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. ఓటమి తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడంతో అరాచకాలకు తెగబడుతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. గురువారం నంద్యాలలోని సూరజ్ హోటల్ వద్ద మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం ఇందుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. టీడీపీ నాయకుడు అభిరుచి మధు పట్టపగలే, నడిరోడ్డుపై పోలీసుల సమక్షంలోనే వేటకొడవలి తీసుకుని వీరంగం చేయడం..అతని గన్‌మెన్ కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. అధికారం ఉందనే అహకారం, తమను ఏమీ చేయలేరన్న ధీమాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వారి విషయంలో పోలీసులు కూడా చూసీచూడనట్లు వెళుతుండడంతో ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నంద్యాల పట్టణంలోని సలీంనగర్లో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకుడు మహబూబ్‌బాషా అలియాస్ చింపింగ్ బాషా బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్న మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన అనుచరుల వాహనాలను సూరజ్ హోటల్ వద్ద టీడీపీ నాయకుడు అభిరుచి మధు అడ్డుకున్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు వేటకొడవలి తీసుకుని ‘నీ అంతు చూస్తా’ అంటూ వీరంగం సృష్టించాడు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ మధు చేతిలోని వేటకొడవలిని లాక్కోకపోవడం విమర్శలకు తావిచ్చింది. పైగా మధు సూచనతో అతని గన్‌మెన్ సోమభూపాల్ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే నంద్యాల పట్టణంలో అలజడి రేగింది. టీడీపీ నాయకులు పథకం ప్రకారం తమను హత్య చేయడానికి ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నాయకుడు జగదీశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అభిరుచి మధుతో పాటు అతని అనుచరులైన మున్నా అలియాస్ ఖాదర్, షేక్ చిన్ను, వేణు, గన్‌మెన్ సోమభూపాల్‌పై కేసు నమోదైంది. అదే విధంగా టీడీపీ నాయకుడు అభిరుచి మధు కూడా వైఎస్సార్సీపీ నాయకులు శిల్పాచక్రపాణిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, ముగ్గురు కౌన్సిలర్లతో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం కేసు పెట్టాడు. ఓటు వేయలేదని.. నంద్యాలలోని విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబ సభ్యులు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో వారి ఇంటి వద్ద ఉండే టీడీపీ వర్గీయుడైన ఆర్టీసీ డ్రైవర్ సుబ్బయ్య కుటుంబ సభ్యులు గురువారం దాడి చేసి గాయపరిచారు. తనతో పాటు కుమారుడు శ్రీనివాసరెడ్డిపై కర్రలతో దాడి చేసి గాయపరచడమే కాకుండా తన చీర కూడా లాగారని రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన పక్కింటి మహిళ కవితను తోసేసినట్లు ఆమె తెలిపింది. ఈ ఘటన కూడా ‘తమ్ముళ్ల’ అరాచకాలకు అద్దం పడుతోంది. ఇక బుధవారం పోలింగ్ సందర్భంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు అందరికీ తెలిసిందే. -
ప్రలోభాలు..బెదిరింపులు!
∙ నంద్యాల ఉప ఎన్నికలో హద్దులు దాటిన అధికారపార్టీ నేతలు ∙ క్యూలో నిల్చున్న ఓటర్లను భయపెట్టే యత్నం ∙ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు ∙ టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు నంద్యాల : ఉప ఎన్నికకు పదిరోజుల ముందు నుంచి ప్రలోభాలకు, బెదిరింపులకు దిగిన అధికార పార్టీ నేతలు ఎన్నికల రోజు కూడా అతే తంతు కొనసాగించారు. అధికార బలంలో ఎన్నికల కోడ్‌ను సైతం తూట్లుపపొడిచారు. ఓటింగ్ శాతం పెరిగితే తమపారీ ఓటమి తప్పదేమోనని భావించి క్యూలో నిలుచున్న ఓటర్లను సైతం భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఓటర్లకు డబ్బులు ఎరచూపడమే కాక, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను బెదిరించారు. అధికార పార్టీ నేతల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. నాగమౌనిక హల్చల్... అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చెల్లెలు నాగమౌనిక ఉదయం 9 గంటల ప్రాంతంలోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని హల్చల్ చేశారు. ఆమెకు ఓటు లేకపోయినా ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న షాదీఖానాలో ఏర్పాటు చేసిన 46, 47, పురపాలక సంఘం కోట ప్రాథమిక పాఠశాలల్లో 55, 56 వద్దనున్న పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను, ఆయా పార్టీల ఏజెంట్ల ఐడీ కార్డులను పరిశీలించారు. అంతటితో ఆగకుండా క్యూలో ఉన్న ఓటర్లను టీడీపకే ఓట్లు వేయాలని బెదిరింపు ధోరణి ప్రదర్శించింది. వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యం 58, 59, 60 పోలింగ్‌కేంద్రాల వద్ద అధికార పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెడుతూ కనిపించారు. ఏజెంట్ల ముసుగులో ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి డబ్బులు పంపిణీకి చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న 59, 60 వార్డుల వైఎస్సార్సీపీ నాయకులు, కౌన్సిలర్ కలాం టీడీపీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలాంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. -
నంద్యాలలో ఆగని టీడీపీ ప్రలోభాలు
-
నేడు హరిజనపేట నుంచి జగన్ రోడ్‌షో
సాక్షి బృందం, నంద్యాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం నంద్యాల పట్టణంలోని ఒకటో వార్డులో హరిజన పేట నుంచి రోడ్‌షో ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం రెండో వార్డులోని మాల్దార్పేట, స్వాలిహీన మసీదు మీదుగా.. ఆ తరువాత 3,5,6 వార్డుల పరిధిలోని ముత్తు ఇళ్లు, నబీనగర్, జగజ్జీవని టెంపుల్ మీదుగా ఆత్మకూరు బస్టాండ్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
'నిరూపిస్తే ఉపఎన్నిక నుంచి తప్పుకుంటాం'
నంద్యాల: తెలుగుదేశం పార్టీపై శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓటర్లను మభ్యపెడుతోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం నీచ రాజకీయాలు చేస్తోందని, ఇటువంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు. మొదటి నుంచి డబ్బు పంచే అలవాటు టీడీపీకి ఉందన్నారు. ఓటుకు రూ. 5వేలు ఇవ్వడానికి వెనుకాడట్లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్లకుండా ఉండేందుకు ఒక్కో మహిళకు రూ.300 ఇస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడంతో రాత్రికి రాత్రి అమరావతికి మకాం మార్చారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని రవిచంద్ర మండిపడ్డారు. ధైర్యం, నిజాయితీ ఉంటే తాము డబ్బు పంచామని ఆరోపిస్తున్న వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. వీడియోలో డబ్బు పంచినట్లు నిరూపిస్తే తన తండ్రి శిల్పామోహన్ రెడ్డి ఎన్నికల నుంచి తప్పుకుంటారని సవాలు విసిరారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయంపై రవిచంద్ర కిశోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
నంద్యాలలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి బృందం, నంద్యాల: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదో రోజు రోడ్ షో ఆదివారం నంద్యాల పట్టణంలో ప్రారంభమైంది. శ్రీనివాస సెంటర్, వెంకప్ప అంగడిల మీదుగా బాలాజీ కాంప్లెక్స్, పైప్‌లైన్ రోడ్, సింగ్ కాలనీ, ఫరూక్నగర్, చౌరస్తా వరకు రోడ్‌షో కొనసాగుతోంది. అక్కడి నుంచి ఫరూక్ నగర్, ఎన్ఆర్ఎస్ మూర్తి హాస్పిటల్, స్కావెంజర్స్, బాల్కొండహాల్, సంచిబట్టల సందు మీదుగా రోడ్‌షో కొనసాగనుంది. వెంకటేశ్వర దేవాలయం సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్, మేడం వారి వీధి, జుమ్మా మసీదు, గాంధీచౌక్‌ల మీదుగా కల్పనా సెంటర్, ఫళాని కూల్‌డ్రింక్స్ సందు, ముల్లాన్‌పేట వరకు రోడ్‌షో కొనసాగి, అనంతరం బైర్మల్‌వీధి, మున్సిపల్ హైస్కూల్ సెంటర్, చాంద్‌బాడ మీదుగా నిర్వహించనున్నారు. -
టీడీపీ అధికార దుర్వినియోగం
నంద్యాల: ఉప ఎన్నికలో గెలుపుకోసం తెలుగుదేశం ప్రభుత్వం వక్రమార్గాలను అన్వేషిస్తోంది. ప్రతి రోజు కొత్త మార్గాలను వెతుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తోంది. తెలుగుదేశానికి ఓటు వేయకపోతే పింఛన్లతో పాటు ఏప్రభుత్వ పథకాలను అందివ్వబోమని బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల 31 వార్డులో ఓటర్లను ప్రలోభ పెడుతూ తెలుగుదేశం నేతలు మీడియాకు చిక్కారు. మరోవైపు పారిశుధ్యకార్మికులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఓటర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చేసి తెలుగుదేశానికి ఓటు వేయాలని చెప్పడం వంటి పనులు కూడా చేశారు. తాజాగా తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రచారం కోసం డీఆర్డీఏ అధికారులను రంగంలోకి దించారు. జిల్లా నలుమూలల నుంచి డీఆర్డీఏ, సీఆర్పీ అధికారలను నంద్యాలకు పిలిపించారు. వచ్చి రాగానే అధికారులు స్వామి భక్తి నిరూపించుకొనే పనిలో పడ్డారు. తెలుగుదేశానికి ఓటు వేయాలని మహిళా సంఘాలపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు డీఆర్డీఏ అధికారలు నిర్వాకంపై ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. మేరకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. -
ఫేస్బుక్, వాట్సప్ అంటే తెలియదా..?
► పార్టీ అధినేతకు ఈ విషయం తెలిస్తే జిల్లా పరువుపోతుందని మండిపాటు ► హుటాహుటిన టీడీపీ కార్యాలయంలో ఇంటర్నెట్ డెస్క్ ఏర్పాటు ► వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమాలు వాడడంలో ముందుందని ఆవేదన ► ఫేస్బుక్ వాట్సప్ డౌన్లోడ్ చేసుకుని జగన్‌ను తిట్టండని దిశానిర్దేశం ► తికమక పడుతున్న నాయకులు, కార్యకర్తలు నంద్యాల: ఇంతవరకు ఫేస్బుక్, వాట్సాప్ అంటే ఎందో తెలీదా..! ఎవరికైనా తెలిస్తే నవ్విపోదురుగాక... అంటూ ఒక మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఆక్రోశం వెల్లగగ్గారు. అంతేకాదు హుటాహుటిన శుక్రవారం నంద్యాల పార్టీ కార్యాలయంలో వాట్సాప్, ఫేస్బుక్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోండని ఇంటర్నెట్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యర్థి పార్టీ సామాజిక మాధ్యమాలను వాడుకోవడంలో చాలా ముందుందని, చంద్రబాబును విమర్శలతో ముంచెత్తుతుంటే మీరు మాత్రం ఇంటర్నెట్ అంటే ఏందో తెలియదంటే ఎలా...! అంటూ నాయకులపై చిందులు తొక్కారు. ఆదివారం వరకు రోజుకు గంట సేపు ఇంటర్నెట్ ఉపయోగంపై ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరగతులకు అందరు హాజరు కావాలని లేదంటే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని కార్యకర్తలకు, నాయకులకు హెచ్చరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంప్యూటర్ను నేనే తెచ్చాను. స్మార్ట్ఫోన్లు నేనే తెచ్చాను, ఇంటర్నెట్‌ని నేనే ప్రపంచానికి పరిచయం చేశాను అని ప్రతీ మీటింగ్‌లో చెబుతుంటే మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ ఆ మంత్రి నాయకులు, కార్యకర్తలపై తిట్ల పురాణం అందుకున్నారు. గురువారం ఉదయం నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంటర్నెట్‌డెస్క్ ఉంటుందని ప్రతీ కార్యకర్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కుని అందులో వాట్సాప్, ఫేస్బుక్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని వైఎస్ఆర్సీపీని, జగన్‌ను తిట్టాలని సూచించారు. ఇక ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం సదరు మంత్రి తీరును ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ ఉండాలి, ఫేస్బుక్, వాట్సాప్ తెలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంటే ఎలా అని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ను చూసి రాజకీయాల్లోకి వచ్చామని ఆయన ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాడు కాదని ఆందోళన చెందారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే ప్రజల్లో ఎప్పుడూ నిలిచి ఉంటామని, అప్పుడు ఇలాంటి ఇంటర్నెట్లు పార్టీని ఏమి చేయలేవని ఆ మంత్రికి గట్టిగా బదులిచ్చారు. ఇప్పటికే పార్టీకి చెడ్డపేరు ఉందని ఇలాంటి నిర్ణయాలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కాస్త మంది నాయకులను దూరం చేసుకోవద్దని సదరు మంత్రికి బహిరంగంగానే బదులిచ్చారు. ప్రతీరోజు ఇంటర్నెట్ శిక్షణ తరగతులకు రమ్మంటున్నారని ముందు ప్రజలతో ఎలా మెలగాలో ఆ మంత్రికి శిక్షణ ఇవ్వాలని కార్యకర్తలు చర్చించుకున్నారు. అనవసరమైన నిర్ణయాలతో పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉందని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. -
చంద్రబాబువి దెయ్యాల మాటలు: భూమన
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు రాజకీయ నికృష్టుడని ఆనాడే ఎన్టీఆర్ అన్నారని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఔరంగజేబు లాంటి వాడని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. వంగవీటి మోహనరంగాను నడిరోడ్డులో నరికించిన కుట్రదారుడు కూడా చంద్రబాబేనని అన్నారు. ఈ విషయాన్ని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారని చెప్పారు. బాబు మాటలు దెయ్యాల మాటలని విమర్శించారు. ఆయన మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగాలేరని, అధికారం కోసం నీచంగా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలపై టీడీపీ కుట్రపూరిత దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. బాబు నిజస్వరూపం ఏంటనేది ఆయన్ను రాజకీయంగా పెంచి పోషించిన ఎన్టీఆరే చెప్పారని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు ప్రతి అడుగులో మోసమే’
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో అవినీతి, మోసమే కనిపిస్తుందని ఆయన విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ ఎంపీ బుట్టా రేణుకతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం మొత్తం నంద్యాల వైపే చూస్తోందని, ఉప ఎన్నికలో గెలవడానికి చంద్రబాబు చేసే అన్యాయాలను నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మోసానికి, నమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధమే నంద్యాల ఉపఎన్నిక అన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చేది మోసమని, అలాంటి వాళ్ల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎన్నికలు రాగానే బాబుకు అభివృద్ధి గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అబద్ధపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట అని, ఎన్నికలు అయిపోగానే హామీలను తుంగలో తొక్కే నైజం చంద్రబాబుకు మాత్రమే సొంతమని విమర్శించారు. నంద్యాల ప్రజలు తమ ఓట్లతో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఓట్ల కోసమే నంద్యాలపై సర్కార్ ప్రేమ.. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ బుట్టా రేణుక విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే జీవోలు ఇస్తూ నంద్యాలపైన లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారని ఇది చంద్రబాబు ప్రభుత్వానికి తగదని ప్రజలకు అన్ని విషయాలపైన అవగాహన వుందని ఆమె అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారని నంద్యాల ప్రజలనుంచి వస్తున్న స్పందనే దీనికి నిదర్శనమని బుట్టా రేణుక అన్నారు. -
చంద్రబాబు ప్రతి అడుగులో మోసమే
-
ఓట్ల కోసమే నంద్యాలపై సర్కార్ ప్రేమ
-
నంద్యాలలోనే కాదు 2019 లోనూ వైఎస్సార్సీపీనే
-
'రాజకీయాల్లో కొత్త పద్ధతులకు పునాది'
-
'నందమూరి'ని కూడా పట్టించుకోండి
-
2019 యుద్ధానికి నంద్యాలే నాంది
-
2019 కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాలే నాంది
⇔ ప్రజలకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ⇔ ఇది మోసపూరిత వాగ్దానాలు, కుట్రపూరిత రాజకీయాలు, అవినీతి అసమర్థ పాలనపై మీరిచ్చే తీర్పు ⇔ చంద్రబాబుకు ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి ⇔ మూడేళ్ల పరిపాలనలో ఒక్క పనైనా చేశారా? ⇔ నంద్యాలకు ప్రకటించిన ప్రతి పథకంలోనూ లంచాలే ⇔ విలువలతో కూడిన రాజకీయాల కోసమే చక్రపాణి రాజీనామా కోరా ♦ 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది నంద్యాలే. ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ♦ మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసపూరిత వాగ్దానాల మీద, కుట్ర పూరిత రాజకీయాల మీద, అవినీతి పాలన మీద, అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా ఈ నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయి ♦ నంద్యాల ప్రజలంతా జడ్జి స్థానంలో ఉండి చంద్రబాబు లాంటి వ్యక్తికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి ♦ అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది. ఒక్క హామీనైనా అమలు చేశారా అని అడుగుతున్నా? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా? ♦ కేవశరెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తా నని మాట ఇస్తున్నా. చంద్రబాబు ♦ చొక్కాను, ఆదినారాయణ రెడ్డి నిక్కరును ఊడదీస్తాం. ♦ ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా చేస్తాం. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 చేస్తాం. ♦ ఆర్యవైశ్య సోదరులు ప్రత్యేక కార్పొరేషన్ కోసం ఎవరివద్దకూ పోవాల్సిన అవసరం లేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తాం. ♦ నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే... చంద్రబాబు నంద్యాలకు కనీసం ఒక్క రూపా ౖయెనా విదిల్చేవాడా అని అడుగుతున్నా? ♦ నంద్యాల ఉప ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి. ♦ నంద్యాలకు చంద్రబాబు వచ్చినప్పుడు అడగండి. మూడేళ్లుగా మాకేం చేశావని. ♦ 2018లో వైఎస్సార్సీపీకి వచ్చే ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని నంద్యాలకు చెందిన ముస్లింకే ఇస్తాం. ♦ ఈ నెల 9వ తేదీ నుంచి 21 వరకూ నేను నంద్యాలలోనే ఉంటా. ♦ టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన్ను పులి అందామా.. సింహం అందామా... సాక్షి ప్రతినిధి, కర్నూలు : 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నంద్యాలే నాంది కావాలని...నంద్యాల ప్రజలు జడ్జిపాత్ర పోషించి, ఈవీఎం అనే విష్ణుచక్రాన్ని వదిలి చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపు వాగ్దానాలు, అవినీతి పాలన, కుట్ర రాజకీయాలు, అసమర్థపాలన మీద ప్రజలిచ్చే తీర్పుగా నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయని నంద్యాలలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లల్లో ఒక్క వాగ్దానాన్ని అమలు చేయని వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబట్టే నంద్యాల రోడ్లపై ముఖ్యమంత్రి, మంత్రులు తిరుగుతున్నారని పేర్కొన్నారు. కేశవరెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని జగన్ హామీనిచ్చారు. నంద్యాలను జిల్లా చేస్తామని...రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచుతామని పేర్కొన్నారు. ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలన్నారు. 2018లో పార్టీకి వచ్చే ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నంద్యాలకు చెందిన ముస్లింలకే కేటాయిస్తామని హామీనిచ్చారు. దర్మానికి– అధర్మానికి, న్యాయానికి–అన్యాయానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలిచి చంద్రబాబుకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అబద్దపు హామీలతో, పర్సంటేజీలతో పనులు చేస్తున్న ఇటువంటి వ్యక్తిని ఏమని పిలవాలో చెప్పాలని ప్రజలను కోరారు. ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ నంద్యాలలోనే ఉంటానని.... పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ!: ‘‘నంద్యాలకు చంద్రబాబు వచ్చినపుడు అడగండి. మూడేళ్లుగా మాకేం చేశావని అడగండి. చంద్రబాబుకు కూడా తెలుసు. తానేమీ చేయలేదని, ప్రజల దగ్గరికి పోతే కొడతారని ఆయనకు తెలుసు. అందుకే కళ్లు పెద్దవి చేసి ప్రజలపై పిచ్చి కోపం చూపిస్తాడు. నా పెన్షన్లు తింటున్నారు. నేనిచ్చే రేషన్ తింటున్నారు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు. నేను వేసిన దీపాల కింద కూర్చుంటున్నారు. నాకు ఓటు వేయకపోతే ఎలా? లేదంటే పెన్షన్లు, రేషన్ తీసుకోవద్దు. నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బెదిరిస్తున్నారు. తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ అని చెబుతున్నా. నువ్వు చెబుతున్న అవే రోడ్లపై నిలబడి నిన్ను ప్రశ్నిస్తాం. అవే వీధి దీపాల కింద కూర్చుని నిన్ను నిలదీస్తాం. నువ్వు ఇచ్చేది నీ అత్తగారి సొత్తా చంద్రబాబూ? మహా సంగ్రామంలో ఇది తొలిమెట్టు..: మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో సంవత్సరంన్నరలోనే మళ్లీ ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. నంద్యాలలో మీరు వేసే ఓటు ఆ కురుక్షేత్ర మహా సంగ్రామానికి తొలిమెట్టు కాబోతోంది. రేపు జరగబోయే మార్పుకు నంద్యాల నాంది పలకబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత నాకొదిలేయండి అని భరోసా ఇస్తున్నా. విత్తనానికి, వ్యవసాయానికి నంద్యాలను కేంద్ర బిందువుగా చేస్తాం. ఇక్కడే వ్యవసాయ యూనివర్సిటీ పెడతాం. కుందూ నది వల్ల నంద్యాల ఎంత బాధపడుతోందో తెలుసు. అక్కడ పనులు చూసా. కానీ జనాన్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు అక్కడ పెట్టిన నాలుగు పొక్లెయిన్ల వల్ల జరిగేది కాదది. ఆ పనులు పూర్తిచేసే మంచితనం చంద్రబాబుకు లేదు. నాకు వదిలేయండి ఆ పనులు నేను చూసుకుంటా. నంద్యాలను మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఓ కారణముంది. ప్లీనరీలో నవరత్నాల పథకాలను ప్రకటించాం. ఆ నవరత్నాలు రేపు రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఆ నవరత్నాలను అందించబోతున్నాం. జిల్లాలు 25 చేస్తాం..: ప్రతికుటుంబానికీ ఆ నవరత్నాలు అందాలంటే ఇపుడున్న వ్యవస్థ మారాలి. ఇది ఇంకా బలపడాలి. ఈ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా, నవరత్నాలను ప్రతి కుటుంబానికీ చేర్చే దిశగా ఇపుడున్న జిల్లాలను మార్చబోతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లా చేయబోతున్నాం. ఇపుడున్న జిల్లాలను 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్‌గా నంద్యాలే ఉంటుంది. ఒకసారి నంద్యాల జిల్లా అయిపోతే ఇక్కడే మీ కళ్ల ముందే కలెక్టరేట్, ఎస్పీకార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ప్రతి ప్రభుత్వ కార్యాలయం వస్తుంది. జిల్లా కేంద్రంగా నంద్యాల అత్యంత వేగంగా, అత్యంత అభివృద్ధి చెందుతుందని వేరే చెప్పనక్కరలేదు. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలని కోరుతున్నా. నంద్యాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాకొదిలేయండి. అందరికీ న్యాయం చేస్తాం.. మోసగాళ్లకు బుద్ది చెబుతాం: ఇల్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. చంద్రబాబు లంచాలు తీసుకున్న డబ్బును మీరు అప్పుగా బ్యాంకులకు కంతులు కట్టాల్సిన పనిలేదు. ప్రతిపేద వాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెబుతున్నా. ఇల్లు కట్టివ్వడమే కాదు. రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను కూడా వారి చేతికిస్తాం. నంద్యాలలో రోడ్డు విస్తరణ పేరుతో ఏ సంప్రదింపులు లేకుండా సరైన పరిహారం దక్కకుండా అన్యాయానికి గురైనవారందరికీ పూర్తిగా న్యాయం చేస్తాం. చంద్రబాబును ఎన్నిమార్లు అడిగినా ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టడం లేదని ఆర్యవైశ్య సోదరులు బాధపడుతున్నారు. ఆ సోదరులు ఇక ఎవరిదగ్గరికీ పోవలసిన పనిలేదు. అధికారంలోకి మనమే వస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ స్థాపిస్తాం. మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలని మైనారిటీ సోదరులు అడుగుతున్నారు. 2019లో కురుక్షేత్ర యుద్ధం. దానికన్నా ముందు 2018లో వైఎస్సార్సీపీకి ఒక ఎమ్మెల్సీ సీటు రానుంది. ఆ వచ్చే ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాలకు చెందిన ముస్లిం సోదరుడికే ఇస్తానని మాట ఇస్తున్నా. కేశవరెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తామని మాట ఇస్తున్నా. చంద్రబాబు చొక్కాను, ఆదినారాయణరెడ్డి నిక్కరును ఊడదీస్తాం. కేశవరెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం. కేసులన్నీ తిరగదోడతాం. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా గతంలో హామీ ఇచ్చా. అగ్రిగోల్డ్ బాధితులైనా, కేశవరెడ్డి బాధితులైనా మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వారికి ఇవ్వాల్సిన వన్నీ పూర్తిగా ఇచ్చేస్తాం. ఆ తర్వాత మోసం చేసిన వాళ్ల దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో, వాళ్ల చొక్కాలు, నిక్కర్లు ఎలా ఇప్పించాలో ప్రభుత్వం చూసుకుంటుంది. నంద్యాలలో మీరు ఇచ్చే ఆశీస్సులు రేపటి మన విజయానికి పునాది కావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం : ఇవాళ చంద్రబాబు దగ్గరుండి డబ్బులు, పదవి ఆశచూపించి కొనుగోలు చేస్తున్నాడు. ఇటువంటి కలియుగ రాక్షసుడిని హతమార్చేందుకు మీరంతా సవ్యసాచులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నంద్యాల ప్రజలు నడుం బిగించాలి. ఇవాళ వంచనకు విశ్వసనీయతకు మధ్య పోరాటం జరుగుతోంది. మన అభ్యర్థి శిల్పా మోహనరెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి విజ్ఞప్తి చేస్తున్నా. తోడుగా నిలబడాలని కోరుతున్నా. మన గుర్తు ఫ్యాన్. 9వ తారీఖు నుంచి 21 వరకు నేను నంద్యాలలోనే ఉంటా. ప్రతి వీధికీ వస్తా. ప్రతి ఊరుకూ వస్తా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో న్యాయం ఎవరికీ జరగదు. రాజగోపాల్ అన్నకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం. చక్రపాణి అన్నకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చి న్యాయం చేస్తాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా : వైఎస్సార్సీపీకి ఓటు వేసినా జగన్ ఇప్పుడే సీఎం కాడు కదా అని తెలుగుదేశం పార్టీవారు ప్రచారం చేస్తున్నారట. ధర్మానికీ, న్యాయానికీ ఓటు వేద్దామా? లేక అధర్మానికీ, మోసానికీ ఓటు వేద్దామా అన్న దానిపైనే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలతో బహుశా జగన్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంన్నర తర్వాత జరగబోయే కురుక్షేత్రానికి ఇది నాంది పలుకుతుంది. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆ వ్యత్యా సాన్ని నేను చూపుతున్నా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి నా దగ్గరకు వచ్చారు. నేను ఒకటే మాట చెప్పాను. చంద్రబాబు మాదిరిగా నేను రాజకీయాలు చేయలేను. న్యాయం, ధర్మం అనే రెండు కాళ్లపై మనం నిలబడాలి. చంద్రబాబు ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు మొహాన కొట్టు అన్నా అని అడిగా. అలా కొడితేనే ప్రజలు మనలను దీవిస్తారు. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. కొంచెం కష్టమనిపించినా చక్రపాణిరెడ్డి ఒక మంచి మనిషిగా బైటకొచ్చాడు. ఇదిగో.. స్పీకర్ ఫార్మాట్లో కౌన్సిల్ చైర్మన్‌కు రాజీనామా లేఖ రాసిస్తున్నాను మీరే పంపించండి అని అన్నాడు. పులి అంటారో సింహం అంటారో మీయిష్టం.. ఎన్నికలొస్తేనే ముస్లింలు గుర్తొస్తారా? ముస్లిం మైనారిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్నదల్లా కపట ప్రేమేనని, ఆయనకు వారి పట్ల ఎలాంటి ఆదరాభిమానాలు లేవని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నంద్యాలకు ఉప ఎన్నికలొచ్చేటప్పటికి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ఆయన మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేరు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కూడా ఒక ముస్లిం ఉన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో లేనే లేరు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేక పోవడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు. అది ఒక్క చంద్రబాబు హయాంలో మాత్రమే జరుగుతోంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను ఎమ్మెల్సీని చేసి మూడో రోజే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఒక ముస్లింను ఎమ్మెల్సీని చేసి, మంత్రివర్గంలోకి తీసుకుందామన్న ఆలోచనే చేయలేదు’ అని అన్నారు. నంద్యాలకు లంచాల పథకాలు ‘‘నంద్యాల ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి.’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. నంద్యాలకు ప్రకటించిన పథకాలలో దాగి ఉన్న అవినీతిని ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఏ పథకంలో ఏం కుంభకోణం జరుగుతుందో వివరించారు. ఇళ్లు, ట్రాక్టర్లు ఇలా ప్రతి పథకంలోనూ అవినీతి దాగి ఉందన్నారు. ఉప ఎన్నికల కోసమే నంద్యాలలో పెన్షన్ల సంఖ్యను పెంచారని చెప్పారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం ‘‘ఇవాళ నంద్యాలలో జరుగుతోన్నది ధర్మానికి,అధర్మానికి మధ్య, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. విశ్వసనీయ రాజకీయాలకు, వంచనతో కూడిన రాజకీయాలకు జరుగుతున్న యుద్ధమిది.’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘‘మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేసిన మోసపూరిత వాగ్దానాల మీద, కుట్ర పూరిత రాజకీయాల మీద, అవినీతి పాలన మీద, అసమర్థ పాలన మీద ప్రజలిచ్చే తీర్పుగా ఈ నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ పోటీపెట్టబట్టే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మొత్తం కేబినెట్ అంతా రోడ్లపైకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈవీఎం అనే విష్ణుచక్రాన్ని తిప్పి చంద్రబాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని జగన్ పిలుపునిచ్చారు. -
ఈ ప్రశ్నలకు బదులేది బాబుగారు ?
-
ఓటమి భయంతోనే దాడులు
►అధికార బలాన్ని ప్రయోగిస్తే ప్రజలు ఊరుకోరు ►చంద్రబాబు ప్రజాద్రోహి ►ఉప ఎన్నికలో టీడీపీకి గుణపాఠం తప్పదు ►వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ►ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్పందన నంద్యాల అర్బన్: ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘అధికార’ బలం ప్రయోగించి..ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గట్టిగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివారం ఆయన నంద్యాల పట్టణంలోని 19, 20 వార్డులు, మండలంలోని రాయమాల్పురం, మునగాల గ్రామాల్లో నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలారన్నారు. ఆయనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్ నిర్మించి ఎస్సార్బీసీ ద్వారా మునగాల, రాయమాల్పురం, ఊడుమాల్పురం గ్రామాల రైతులకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. టీడీపీ ఓటమి పాలవుతుందని తెలిసి నాయకులకు పదవులు, కార్యకర్తలకు డబ్బు ఎర వేస్తున్నారన్నారు. నంద్యాల ప్రజలు విజ్ఞులు అని, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ డబ్బు సంచులు సిద్ధం చేసుకుందన్నారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు చేసిన సేవలు ఎనలేనివన్నారు. అందుకే మైనార్టీలు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ ఉప ఎన్నిక గెలుపును వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో 19వ వార్డు పార్టీ ఇన్చార్జ్ వై.భీమ్‌రెడ్డి, గోస్పాడు మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, సిమెంట్ ప్రసాదరెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాజర్రెడ్డి, గోవిందరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, భూషణం, శ్రీనివాసగౌడ్, వెంకటేశ్వరగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, బాల హుసేనయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం
పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శ అనంతపురం సెంట్రల్: నంద్యాల ఉప ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఏనాడు నంద్యాలను పట్టించుకోని ఆయన ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. జాషువ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందన్నారు. అయితే నేడు కేంద్ర, రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుండడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయని చంద్రబాబు నంద్యాలకు 13వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారన్నారు. 10వేల పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా మంత్రులు, ఎంపీలు, ఇతర పారిశ్రామికవేత్తలను నంద్యాలలో మకాం వేయిస్తుండటం చూస్తే ఓటమి భయంతోనే అనే విషయం స్పష్టమవుతోందన్నారు. సీఎం స్థాయిలోని వ్యక్తి తాను వేయించిన రోడ్లపై నడుస్తున్నారు.. తానిచ్చిన పింఛన్లు తింటున్నారని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా çసత్యనారాయణ, పీసీసీ అధికారప్రతినిధి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు హామీలన్నీ బూటకాలే
- ఉపఎన్నిక కోసమే వాగ్దానాలు - సీఎం గిమ్మిక్కులను నమ్మొద్దు - ఎన్నికలు పూర్తయిన తరువాత జీవోలన్నీ చిత్తుకాగితాలే - కడప ఎంపీ అవినాష్ రెడ్డి నంద్యాలఅర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటనలో ఇచ్చిన హామీలన్నీ బూటకాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని 1వ వార్డు అరుంధతీనగర్‌లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన వధూవరులు సోని, షేక్మాబాషాలను దీవించారు. ఎల్ఐసీ ఉద్యోగి రమేష్ కుటుంబంతో మాట్లాడి వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కడప ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లను మభ్యపెట్టడానికి సీఎం చంద్రబాబు.. రూ.300కోట్లకు జీవోలను విడుదల చేశారని గుర్తు చేశారు. నాలుగు నెలలు గడిచినా టెండర్లు జరగలేదని, బాబు వేసిన శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా ఉన్నాయన్నారు. జీవోలు చిత్తు కాగితాలుగా మారాయని, మళ్లీ ఆయన ఇదే గిమ్మిక్కును నంద్యాలలో ప్రయోగిస్తున్నారన్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. నవ రత్నాలతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు... తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పథకాలతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి పాలనకు గుణపాఠం నేర్పడానికి నంద్యాల ఉపఎన్నికనే సరైన వేదిక అన్నారు. ఓటర్లు ఆలోచించి బాబుకు బుద్ధి చెప్పాలన్నారు. 2019 ఎన్నికలకు నాందిగా భావిస్తున్న నంద్యాల ఉపఎన్నికలో వైస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైతే దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. టీడీపీ.. ధన బలంతో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తోందని..ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్సార్సీలోకి మాజీ కౌన్సిలర్ మునెయ్య... వైఎస్సార్ అభిమాని, మాజీ కౌన్సిలర్ మునెయ్య, ఆయన అనుచరులు ఆదివారం వార్డు పర్యటనకు వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డిల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కల్లూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. శిల్పామోహన్‌రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించి టీడీపీకి బుద్ధి చెప్పాలన్నారు. వీరి వెంట స్థానిక కౌన్సిలర్ కన్నమ్మ, నాయకులు ఎల్లయ్య, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల ఉప ఎన్నికకు సిద్ధం కండి
– డీ డూప్లికేట్ ఓటర్లకు తావులేకుండా చర్యలు తీసుకోండి – మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయండి –పోలింగ్ కేంద్రాలను క్షుణంగా పరిశీలించాలి – రెండుమూడురోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం – అధికారులతో సమీక్షలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం స్టేట్‌గెస్ట్ హౌస్‌లోని సమావేశ మందిరం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నంద్యాల నియోజక వర్గ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ... డీ డూప్లికెట్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి బోగస్ ఓటర్లను తొలగించాలని సూచించారు. ఇప్పటికే నంద్యాల అసెంబ్లీలో 2.09 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, కొత్తగా ఓటరు నమోదుకు 10,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. నంద్యాల నియోజక వర్గం పరిధిలో ఆర్డీఓతో సహా తహసీల్దారు, డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు ఒకే చోట మూడేళ్లకు పైబడి పని చేస్తుంటే వారందరిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. స్వంత జిల్లాకు చెందిన వారిని నియమించరాదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఇతర నియోజక వర్గాలకు చెందిన ఉద్యోగులనే పోలింగ్ సిబ్బందిగా నియమించాలని వెల్లడించారు. పోలింగ్‌కు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్, సెకండ్ లెవల్ చెకింగ్ చేపట్టాలన్నారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్! నంద్యాల ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం సెప్టంబర్ 12లోపు పూర్తి కావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూలు వెలువడగానే జిల్లా మొత్తం మీద కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇంకా డీ డూప్లికేట్ ఓటర్లు ఉన్నారా? ఓటర్ల జాబితాలో ఇప్పటికీ డీ డూప్లికేట్ ఓటర్లు ఉండటం పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత టెక్నాలజీలో బోగస్ ఓటర్లు ఉండటమేమిటని ప్రశ్నించారు. తాను స్వయంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశానని ఇందులోనే డీ డూప్లికేట్ ఓటర్లు ఉండటం గుర్తించినట్లు తెలిపారు. ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో లేదు జిల్లాలో ఆశించిన స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరగడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదు కావడం లేదని చెపా్పరు. జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని వివరించారు. వారంతా 2019 ఎన్నికలలోపు ఓటర్లుగా నమోదు అయ్యే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికను స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలోని అధికారులను మార్చినట్లు తెలిపారు. బార్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డీ డూప్లికేట్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, అన్ని నియోజక వర్గాల ఇఆర్ఓలు వెంకటసుబ్బారెడ్డి, ఈశ్వర్, హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, తిప్పేనాయక్, జయకుమార్, మల్లికార్జునుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల ప్రజలను ఎవరూ మభ్యపెట్టలేరు
- అక్కడ అరాచక పాలన సాగుతోంది - రోడ్డు విస్తరణతో పది వేల మంది వీధిపాలు - ఉప ఎన్నికలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు - పాణ్యం పోలీస్ స్టేషన్లో బైరెడ్డి ప్రెస్‌మీట్ పాణ్యం : టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నంద్యాలలో అరాచక పాలన సాగుతోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ కారణంగా పదివేల మంది వీధి పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి పేరుతో ప్రకటనలు గుప్పిస్తున్నారని, అయితే అక్కడి ప్రజలను ఎవరూ మభ్యపెట్టలేరని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నంద్యాలలో బైరెడ్డిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు పాణ్యం స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్టేషన్లో బైరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణ చేపట్టే ముందు ఆయా దుకాణాల యజమానులకు మూడు సార్లు నోటీసులు ఇవ్వాలన్నారు. అయితే ఉప ఎన్నికలో గెలుపు కోసం అడ్డదారిలో పనులకు ఉపక్రమించడం సిగ్గుచేటన్నారు. రాజధాని అమరావతిలో బాధితులకు రెండింతల పరిహారం అందించాక పనులు మొదలెట్టారని, నంద్యాలలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది వరకు వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. బాధితుల తరపున పోరాడుతున్న తనకు సమాధానం చెప్పలేక అరెస్టు చేయించారన్నారు. ఎంత మంది మంత్రులు, కలెక్టర్లు, ఐఏఎస్‌లు వచ్చినా ప్రజల మనోభవాలను ఎవరూ మార్చలేరని, ఉప ఎన్నికలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పాణ్యం స్టేషన్లో ఉంచిన బైరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ఆర్పీఎస్ కార్యకర్తలు హైవేపై రాస్తారోకో చేశారు. అనంతరం పోలీసులు బైరెడ్డితో మాట్లాడించి కార్యకర్తలను శాంతింపజేశారు. -
శిల్పాను భారీ మెజార్టీతో గెలిపించండి
►నంద్యాల ప్రజలకు ఎంపీ అవినాష్‌రెడ్డి పిలుపు ►పట్టణంలో విస్తృత ప్రచారం నంద్యాల అర్బన్: ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ప్రజలకు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మధ్య చక్కటి అనుబంధం ఉందన్నారు. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్ కుటుంబంపై అభిమానాన్ని చూపుతున్నారన్నారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డిని ఆదరించాలని కోరారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం ఎంపీ అవినాష్‌రెడ్డి నంద్యాల ఒకటో వార్డులోని అరుంధతినగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వైఎస్సార్ చేసిన సహాయాన్ని నంద్యాల ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరన్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆమోదించిన తొమ్మిది పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కరెంట్ బిల్లులు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు.. ఇలా ప్రతిదీ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం వస్తే పెరిగిన ధరలను నియంత్రించడమే కాకుండా పింఛన్ల పెంపు, రైతు భరోసా తదితర ఎన్నో ప్రయోజక పథకాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కన్నమ్మ, పార్టీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, వైఎస్సార్ జిల్లా పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ పులికుమార్, కోలా భాస్కర్, సోమసుందరం మాదిగ, మద్దయ్య, ఎల్లయ్య, శీను తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి భయంతోనే బెదిరింపులు
- నంద్యాలలో అలజడికి టీడీపీ యత్నం - ప్రలోభాలతో గెలవాలనుకోవడం అవివేకం - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజం నంద్యాల అర్బన్ : ‘ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది. దీంతో ప్రలోభాలకు లొంగని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రశాంతమైన నంద్యాలలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నార’ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ బెదిరింపులకు తమ పార్టీ శ్రేణులు కూడా భయపడబోవని స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారన్న ఊహాగానాలకు తెరదించుతూ బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పదవుల ఆశ చూపి నాయకులను తిప్పుకున్నంత మాత్రాన గెలుపు సాధిస్తామనుకోవడం అవివేకమన్నారు. ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిపై పోలీసులతో దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. తమ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమన్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు వైఎస్సార్సీపీ వైపు ఉన్నారని తెలిసే ప్రభుత్వం ఆ వర్గం నాయకులకు తాయిలాలు ఎర వేస్తోందన్నారు. నంద్యాల ఉప ఎన్నిక గెలుపు కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కేందుకు సిద్ధపడుతోందన్నారు. మూడేళ్ల పాలనలో నంద్యాల అభివృద్ధిని మరిచిన సర్కారు.. ఉప ఎన్నిక నేపథ్యంలో రూ.కోట్లతో పనులు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన తప్ప మిగిలిన అన్నీ చేస్తోందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ వారిని ఎప్పుడు తీసుకోవాలనే దానిపైనే మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎంపీ ఎస్పీవైరెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీలోకి వెళ్లడాన్ని నంద్యాల ప్రజలు జీర్ణించుకోలేక పోయారన్నారు. నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, ఇందు కోసం ప్రలోభాలు, బెదిరింపులకు తెర తీసిందని విమర్శించారు. రాబోవు సాధారణ ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక నాంది కాబట్టే అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. సీఈసీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నంద్యాల ప్రజలకు ఎనలేని అభిమానమన్నారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి, నాయకులు విజయశేఖర్‌రెడ్డి, రవిచంద్రకిశోర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కైపరాముడు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ వారికేనా?
– నీరు–చెట్టు పనులపై రగిలిపోతున్న నంద్యాల టీడీపీ నేతలు – ఆళ్లగడ్డ, బనగానపల్లె నేతలకు ఇవ్వడంతో మంత్రిపై కినుక – అధినేతకు ఫిర్యాదు చేసిన మరో వర్గం నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు : నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇందుకు తాజాగా నీరు–చెట్టు కింద చేపట్టిన పనులు వేదికగా మారాయి. ఈ పథకం కింద నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ అక్కడి కాంట్రాక్టర్లకు కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి అప్పగించడంపై అధికార పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాలకు చెందిన వారికి పనులను అప్పగించారంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి మరో వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నంద్యాలలో ఇతర నియోజకవర్గాల వారి పెత్తనమేమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కార్యకర్తల కోసమే నీరు–చెట్టు పథకానికి రూపకల్పన చేసినట్టు స్వయంగా సీఎం చంద్రబాబు పార్టీ సమావేశాల్లో చెబుతుంటే... ఇందుకు భిన్నంగా నంద్యాలలో జరుగుతోందనేది వారి వాదనగా ఉంటోంది. మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ కేవలం మంత్రి అఖిలప్రియ మాటనే చెల్లుబాటు అవుతుండటం ఇతర వర్గం నేతలకు మింగుడుపడటం లేదు. ఈ వ్యవహారంపై కూడా తాడోపేడో తేల్చుకునేందుకు అధికార పార్టీలోని మరో వర్గం నేతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పనులన్నీ వారికేనా? నీరు–చెట్టు పథకం కింద నంద్యాల నియోజకవర్గంలోని అయ్యలూరు, మిట్నాలచెరువుల్లో పూడికతీత పనులను ఐదు ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఈ పనుల విలువ రూ.4.65 కోట్లు. ఈ ఐదు ప్యాకేజీ పనులను ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడం, వారంతా పార్టీకి నేరుగా సంబంధం లేకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ వ్యవహారమే ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. పార్టీ కోసం తామంతా కష్టపడుతున్నప్పటికీ కేవలం మంత్రి చెప్పిన వారికే పనులు అప్పగించడం ఏమిటనేది వారి ప్రశ్నగా ఉంది. పార్టీ కోసం కష్టపడుతున్న తమకు కూడా పనులు ఇస్తే అంతో ఇంతో వెనకేసుకునే అవకాశం ఉంటుందనేది వారి అభిప్రాయం. ఈ వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే, సీఎం నుంచి పెద్దగా స్పందన లేకపోవడం ఇప్పుడా నేతలకు మింగుడు పడటం లేదు. లబ్ధిదారుల ఎంపికలోనూ.. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని సర్వే నివేదికలు రావడంతో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. నంద్యాల అభివృద్ధి పేరుతో ఏకంగా రూ.1,050 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో మహిళలకు కట్టుమిషన్లు, కాపులకు రుణాలు, రైతులకు ట్రాక్టర్లు.... ఇలా అనేకానేక పథకాలను రచించింది. అయితే, వీటి కింద లబ్ధిదారుల ఎంపికలో మంత్రి మాటకే విలువ ఇస్తుండటం ఇతర నేతలకు మింగుడు పడటం లేదు. తమ వెనకున్న అనుచరులకు ఈ పథకాల కింద లబ్ధి చేకూర్చకపోతే తామేమి సమాధానం చెప్పుకోవాలని వారు మండిపడుతున్నారు. ఇదే తీరు కొనసాగితే తామంతా ఎంత కష్టపడినప్పటికీ పార్టీకి అంతిమంగా నష్టమే జరుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశాన్ని త్వరలో అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.మొత్తమ్మీద అధికారపార్టీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ శ్రుతిమించుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నంద్యాల గెలుపును జగన్‌కు కానుకగా ఇస్తాం
- రూ.5వేల కోట్లు ఖర్చు చేసినా టీడీపీ గెలవదు - కార్యకర్తల సమావేశంలో శిల్పా మోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి నంద్యాల అర్బన్: నంద్యాల ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇద్దామని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలన్నారు. ఈ ఉప ఎన్నిక గెలుపు 2019 ఎన్నికలకు మలుపు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుడు కల్లూరి రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో జగన్‌ను సీఎంగా చూడాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తే విజయం తథ్యమన్నారు. ఎన్నికలున్నాయి కాబట్టే నంద్యాల అభివృద్ధిపై అధికార పార్టీకి ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, రోడ్డు వెడల్పు అంటూ హడావుడి చేస్తూ ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని విమర్శించారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు నంద్యాల అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అప్పట్లో నిధులు మంజూరు చేయని ప్రభుత్వం ఓటమి భయంతో ఇప్పుడు ఆగమేఘాలపై పనులు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టినా నంద్యాలలో టీడీపీ గెలవలేదన్నారు. రాజగోపాల్‌రెడ్డికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, పరస్పర సహకారంతో ముందుకు సాగి వైఎస్సార్ ఆశీస్సులతో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సీఈసీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శిల్పా విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. శిల్పాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే తనకు బాధ్యతలు పెరిగాయన్నారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో మూడేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయని ప్రభుత్వం.. పదిరోజుల్లో పనులు ప్రారంభించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ భీమవరం నాయకులు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ శిల్పాను గెలిపించాలనే పట్టుదలతో కార్యకర్తలు కదలాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ద్వారం వీరారెడ్డి, సాయినాథరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, మాధవరెడ్డి, మండల నాయకులు భాస్కరరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కాపు సంఘం నేత రంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు చేరిక నంద్యాల ఆరో వార్డు కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో 300 మంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకుడు రామచంద్రుడు, ఆయన అనుచరులు 200మంది బుధవారం శిల్పా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ సిద్ధంశివరాం, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనిల్ అమృతరాజు, సుబ్బరాయుడు, పార్టీ నాయకులు జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, కారు రవికుమార్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
రగులుతున్న ‘ఉప’ చిచ్చు!
- అధికార పార్టీలో ఆధిపత్య పోరు - నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతలు కేఈ ప్రభాకర్‌కు అప్పగించడంపై మంత్రి అఖిల గుస్సా - కార్యకర్తల సమావేశానికి డుమ్మా - ఏవీతోనూ కొనసాగుతున్న విభేదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికార పార్టీలో రేగిన నంద్యాల ఉప ఎన్నిక చిచ్చు చల్లారడం లేదు. పైగా రోజురోజుకూ సరికొత్త రూపంలో రగులుతూనే ఉంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక కోసం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఏపీఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించడంపై మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బుధవారం నంద్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరుకాలేదని తెలిసింది. ఈ సమావేశాన్ని మొత్తం మాజీ మంత్రి ఫరూఖ్, కేఈ ప్రభాకర్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి నడిపించారు. మరోవైపు భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నట్టు అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రితో కాకుండా ఏవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా నంద్యాల ఉప ఎన్నిక వేడికి అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా చలి కాచుకుంటున్నారని తెలుస్తోంది. ఇన్‌చార్జ్‌లు వద్దంటూ... నంద్యాల ఉప ఎన్నిక మొత్తం భారాన్ని తానే మోయాలని మొదట్లో మంత్రి అఖిలప్రియ భావించారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆమె సవాల్‌పై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ సర్వేలో గెలుపు ముంగిట్లో లేమన్న సంకేతాల నేపథ్యంలోనే ఆమె విసిరిన సవాల్‌పై వెనక్కి తగ్గాలని సీఎం ఆదేశించారు. దీంతో ఆమె ఈ సవాల్‌పై తాజాగా పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. దీంతో పాటు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు అలాగే ఉన్నాయి. సీఎం స్థాయిలో పిలిచి మాట్లాడినా పరిష్కారం కాలేదు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికకు ఇప్పుడే ఇన్‌చార్జ్‌లను నియమించాల్సిన అవసరం లేదని నేరుగా సీఎంకే అఖిలప్రియ తేల్చిచెప్పారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏపీఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్‌ను నంద్యాలకు పంపించారు. ఇది ఆమెకు ఏ మాత్రమూ మింగుడుపడటం లేదని తెలుస్తోంది. అందుకే కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి నంద్యాలలో ఉన్నప్పటికీ ఆమె హాజరుకాలేదు. మరోవైపు సీనియర్లను కూడా ఆమె ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికి వారే.. వాస్తవానికి నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి ఇద్దామనే విషయంపై కుటుంబంలోనే విభేదాలొచ్చాయి. తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె నాగమౌనిక కోరుకున్నారు. అయితే, బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని అఖిల పట్టుబట్టింది. అనుకున్నట్టుగానే ఆయనకు టికెట్ ఇప్పించుకున్నారు. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు కొనసాగాయి. దాదాపు నెల పాటు కనీసం ఏవీకి ఫోన్ చేయకుండానే నంద్యాలలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నడిపించారు. దీనిపై కథనాలు రావడంతో నేరుగా సీఎం రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు. అయినప్పటికీ విభేదాలు సద్దుమణగకపోవడంతో ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వ్యవహారం తయారైంది. మంత్రితో సంబంధం లేకుండానే ఏవీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. ఇక ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు విడిగానో లేదా ఫరూఖ్ వర్గంతోనో కలిసి ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. -
ఇప్పుడే గుర్తొచ్చిందా?!
- ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలపై సర్కారుకు వల్లమాలిన ప్రేమ - గ్రామీణ రోడ్లకు రూ.63 కోట్లు విడుదల - మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం - బనగానపల్లె పనుల్లో జాప్యం కర్నూలు(అర్బన్): త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నంద్యాల నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వానికి వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. పట్టణ ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు ఓ వైపు మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల పనులు చేపడుతూనే.. మరో వైపు పల్లె ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు నంద్యాల రూరల్, గోస్పాడు మండలంలో కూడా పనులను షురూ చేసింది. నంద్యాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచిన భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మూడేళ్ల నుంచి నంద్యాల అభివృద్ధిపై శీతకన్ను వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఉప పోరులో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మంత్రులు కాలవ శ్రీనివాసులు, నారాయణ వారంలో రెండు రోజులు అక్కడే తిష్టవేసి పార్టీ వ్యవహారాలతో పాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నెల 3న జరిగిన సమావేశంలో నంద్యాల రూరల్, గోస్పాడు మండలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు రూ.63 కోట్లు విడుదల చేస్తూ.. మూడు నెలల్లో ఈ పనులు పూర్తి కావాలని సంబంధిత ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల రూరల్ మండలం, గోస్పాడు మండలంలో వేర్వేరు దశల్లో ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాలు, 19 గ్రామ పంచాయతీ భవనాలతో పాటు 45 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను పూర్తి చేసేందుకు రూ. 19 కోట్లను విడుదల చేశారు. అలాగే ఈ రెండు మండలాల్లో దాదాపు 100 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేసేందుకు రూ.44 కోట్లను విడుదల చేశారు. ఎంతో కాలంగా ఈ పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిధులు విడుదల చేసిందని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బనగానపల్లె పనుల్లో జాప్యం ... నంద్యాలకు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఇతర నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇటీవలే బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు సంబంధించి 15 పనులకు రూ.8.43 కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయంలో నివేదికలు అందించినట్లు సమాచారం. ఆ నివేదికలు జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయానికి రాగా, సంబంధిత ఇంజినీర్లు అంచనాలు రూపొందించి తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఇంకా వాటికి ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. అలాగే పలు నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన రోడ్ల పనులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. -
ఉప ఎన్నిక బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
నంద్యాల: ఉప ఎన్నిక నిర్వహణలో బందోబస్తుపై ఎస్పీ గోపినాథ్‌జట్టి మంగళవారం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పరిస్థితులు, రౌడీషీటర్ల కదలికలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు గుణశేఖర్‌బాబు, మురళీధర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బెదిరింపులు, ప్రలోభాలే బాబు నైజం
– కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి – శిల్పాను కలిసిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి నంద్యాల: బెదిరింపులు, ప్రలోభాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఇది ఉప ఎన్నిక సందర్భంగా తేటతెల్లమవుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి సోమవారం పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ కౌన్సిలర్‌ను తనవైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి హోదా కూడా దిగజారి ఫోన్లో మంతనాలు జరపడం చూస్తే ఆయనలో ఉన్న ఓటమి భయం స్పష్టమవుతుందన్నారు. రూ.1200కోట్ల రోడ్ల విస్తరణ, ఇతర పనులను చేస్తామని ఓటర్లను మభ్యపెడుతున్నారని, 2014ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రజలను మోసం చేశారన్నారు. హామీలను విస్మరించిన బాబు, మోడీ... ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు ప్రత్యేక హోదానిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చి దగా చేశారన్నారు. రైతురుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారన్నారు. మళ్లీ ఉప ఎన్నికలో కూడా ప్రజలను దగా చేయడానికి వస్తున్నారని అయినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. టీడీపీ పతనం నంద్యాల నుంచే మొదలవుతుందన్నారు. పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను చేశారని కొనియాడారు. ఆయన విజయం తథ్యమన్నారు. వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం.. చంద్రబాబు నాయుడు తాత్కాలిక ప్రలోభాలతో మభ్యపెట్టి ఓట్లను దండుకోవడానికి యత్నిస్తున్నా కుదిరే పని కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి అన్నారు. తమ అభ్యర్థి శిల్పా, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి కలిసి పని చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారన్నారు. ఈ సమావేశంలో పార్టీ రనేతలు దేశం సుధాకర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి పాల్గొన్నారు. -
ఉపఎన్నిక కోసమే అభివృద్ధి మంత్రం
- ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి చెన్నూరు (శిరివెళ్ల ) : ఉప ఎన్నిక ఉన్నందున నంద్యాలలో అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, ఇంతవరకు లేని ప్రేమ నేడెందుకు వచ్చిందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం ఏ నియోజకవర్గంలో పర్యటించని విధంగా సీఎం నుంచి మంత్రుల వరకు నంద్యాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని అన్నారు. ఇంతవరకు ఏ పని చేయకున్నా నేడు మాత్రం ఆ పని, ఈపని అని మంత్రులు ఆకస్మకి పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం చెన్నూరులో సర్పంచ్ నాగభూషణం,కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ బీసీ నాయకుడు కుమ్మరి సంజీవరాయుడు నాయకత్వంలో 30 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా వారందరికీ గంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఆయనను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాలకు 1300 ఇళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నవారు ఇప్పటి వరకు ఎంతమందికి మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శిల్పా నంద్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, నేడు అభివృద్ధి అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు విజయవాడ– గుంటూరులో జరగనున్న పార్టీ ప్లీనరీకి నియోజకవర్గం నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నామని గంగుల చెప్పారు. నియోజక, మండల, గ్రామ నాయకులు, జెడ్పిటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంధం రాఘవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నజీర్, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు బసాపురం సలాం, ఎంపీటీసీ నరహరి, మాజీ సర్పంచులు కమ్మా సుబ్బరాయుడు, జింకల నాగన్న, నరసింహ్మరెడ్డి, సదాశివారెడ్డి, ఇందూరి ప్రతాపరెడ్డి, ప్రతాపరెడ్డి, చౌదరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నిక వేళ.. ఎంత ఘాటు ప్రేమో!
►నంద్యాలలో అభివృద్ధి పేరిట హడావుడి ►కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలంటూ తాయిలాలు ►సీఎం కార్యాలయానికి ఆగమేఘాలపై ప్రతిపాదనలు ►ప్రజలను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ఎత్తుగడ కర్నూలు (అగ్రికల్చర్)/ సిటీ: ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై సర్కారుకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. అభివృద్ధి, సంక్షేమం అంటూ హడావుడి చేస్తోంది. ఇటీవల జరిగిన శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఓటమి పాలైతే పరువు పోతుందనే భయంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని ప్రకటించడంతోనే అధికార పార్టీలో వణుకు మొదలైంది. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అవకాశమున్న అన్ని దారులనూ వెతుకుతోంది. ఒకవైపు రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కాగృహాలు వంటి తాయిలాలను ఎర వేస్తూనే.. మరోవైపు అభివృద్ధి పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నంద్యాలలో పర్యటించారు. మంత్రులు కూడా క్యూ కడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఆలోపే నిధుల వరద పారించి..ప్రజలను మభ్యపెట్టాలని అధికార పార్టీ చూస్తోంది. ఈ క్రమంలోనే నంద్యాల నియోజకవర్గానికి ఏమేమి కావాలో ప్రతిపాదనలు పంపాలంటూ గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్న జిల్లా ఉన్నతాధికారి హడావుడిగా ఆ సమావేశాన్ని ముగించుకొని ఒకరిద్దరు ముఖ్య అధికారులతో కలిసి అధికార పార్టీ నేతల సూచన మేరకు గంట వ్యవధిలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం రూ.298.21 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల రూరల్ మండలం, గోస్పాడు మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో 2,09,612 మంది ఓటర్లు ఉన్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని ఉప ఎన్నికలో లబ్ధి పొందడానికి అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గానికి 2,131 రేషన్ కార్డులు, 980 పింఛన్లు మంజూరు చేసింది. పక్కాగృహాలు కూడా మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది. తెరపైకి చామకాలువ పూడికతీత ఉప ఎన్నికలో ప్రజలను మభ్యపెట్టేందుకు, తమకు అనుకూలంగా ఉన్న వారికి నిధులను దోచిపెట్టేందుకు చామ కాలువలో పూడికతీత పనులకు రాత్రికి రాత్రే అంచనాలు వేయించారు. వాస్తవానికి ఆ కాలువ వరద నీటి నుంచి నంద్యాల పట్టణవాసులను కాపాడేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు కాలేదు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు నీరు–చెట్టు పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులకు రూ.3 కోట్లతో అంచనాలు వేయించారు. పైగా ఈ పనులకు వచ్చే నెల 3వ తేదీనే టెండర్ పిలిచేందుకు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ.. జల వనరుల శాఖ ఎస్ఈ ఎస్.చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇదే మంత్రిని కర్నూలు నగరం మధ్యలో వెళ్లే హంద్రీ, వక్కెరువాగుల్లో పూడికతీసేందుకు అనుమతులు ఇవ్వాలని, నీరు–చెట్టు కింద నిధులు మంజూరు చేయాలని కోరినా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. కేవలం నంద్యాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. చామ కాలువ మొత్తం 5.9 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. దీనికి వెడల్పు సుమారు 45 మీటర్లు ఉంటుంది. ప్రతియేటా వర్షపు నీరు సమీప కాలనీల్లోకి వస్తుండడంలో రక్షణ గోడ నిర్మించేందుకు రూ.97.51 కోట్లకు 2008 మార్చి 12న అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్యాకేజీ–1 కింద రూ.20.44 కోట్లతో కాలువ ఇరువైపులా కాంక్రీట్ గోడ నిర్మించేందుకు సిద్ధపడ్డారు. అయితే.. భూసేకరణ సమస్య, కరెంట్, టెలిఫోన్ స్తంభాలు తొలగించక పోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీనికి తోడు డిజైన్స్ ఇవ్వడంలో అధికారులు చేసిన తీవ్రమైన జాప్యం వల్ల కూడా ఆ పనులు ఆగిపోయాయి. కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ అంగీకారానికి వచ్చారు. అయితే.. ఇంత వరకు ఆ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీ నేతలు కాలువ పూడికతీతకు నీరు–చెట్టు కింద అంచనాలు వేయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అంచనాలు వేశాం చామకాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నీరు–చెట్టు కింద అంచనాలు వేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అంచనాలు రూపొందించా. రూ.3 కోట్లతో సుమారు 3 కి.మీ మేర పూడిక తీయనున్నాం. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడతాం. – ఎస్.చంద్రశేఖర్‌రావు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ -
మైనార్టీలు నమ్మటం లేదు!
– సీఎంకు నేరుగా తేల్చిచెప్పిన పలువురు నేతలు – అందుకే బెదిరింపులకు దిగిన సీఎం చంద్రబాబు – మునిసిపల్ చైర్‌పర్సన్‌ను దించే అవకాశం లేదంటున్న నిపుణులు – నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టే వీలులేదంటున్న చట్టాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల వేడి అధికార పార్టీ అధినేతకు నేరుగా తాకింది. మైనార్టీలు పార్టీని నమ్మడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నంద్యాలకు చెందిన పలువురు నేతలు తేల్చిచెప్పారు. మైనార్టీలకు నిర్దిష్టంగా ఏదైనా లబ్ధి చేస్తే కనీసం వారికి చెప్పుకునే వీలు ఉంటుందని ఈ సందర్భంగా సీఎంకు స్పష్టం చేసినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాలలో సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్పొరేటర్లు తమ భావాలను నిర్దిష్టంగా తేల్చిచెప్పారు. మైనార్టీలకు ఇది చేశామని చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా వారి సంక్షేమం కోసం ఏమైనా చేస్తేనే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మరుసటి రోజు తమకు ఓట్లు వేయాల్సిందేనని సీఎం బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. తాను ఇచ్చే పింఛన్లను తీసుకుని, తాను వేసిన రోడ్లపై నడిచి ఎందుకు ఓట్లు వేయరని ఎదురు ప్రశ్న వేశారు. పార్టీ పరిస్థితిని గమనించే సీఎం ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఓట్లు వేయకుంటే అభివృద్ధి చేయబోమంటూ బెదిరింపులకు దిగడం ద్వారా లబ్ధి పొందాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి..పార్టీ మారడంతో నంద్యాల మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో మునిసిపల్ చైర్ పర్సన్‌ను దించాలనే నాటకానికి కూడా తెరదీశారు. చట్టం కుదరదంటోంది..! వాస్తవానికి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత జెడ్పీ చైర్మన్‌ను కానీ, ఎంపీపీని కానీ, మునిసిపల్ చైర్మన్‌ను కానీ దించాలంటే గతంలో రెండేళ్ల కాల పరిమితి ఉండేది. రెండేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి దించే వెసులుబాటు ఉండేది. అయితే, ఇది పరిపాలనకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సమయాన్ని నాలుగేళ్లకు పెంచారు. అంటే నాలుగేళ్ల వరకూ స్థానిక సంస్థల్లో అంటే జెడ్పీ చైర్మన్‌ను కానీ మునిసిపల్ చైర్మన్‌ను కానీ ఈ సమయంలోగా దించే అవకాశం లేదన్నమాట. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టంలోని సవరణలు కూడా 2008లో చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 91–ఏ ప్రకారం పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ల తర్వాత సగం కంటే ఎక్కువ మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీహెచ్ఎంసీ చట్టం–1995లో యాక్ట్ ఆఫ్ 42 ఆఫ్ 2008 ప్రకారం సవరణలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానంలో సస్పెండైన సభ్యులు కూడా ఓటింగులో పాల్గొనే వీలుంటుందని జీహెచ్ఎంసీ చట్టం–1955లోని 91–ఏ సెక్షన్ స్పష్టం చేస్తోంది. అయితే, చట్టాలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ అధికార తెలుగుదేశం నేతలు మాత్రం కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో పార్టీలోకి రాకపోతే సస్పెన్షన్ వేటు వేసి చైర్‌పర్సన్‌ను దించేస్తామనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అర్థమవుతోంది. -
‘ఉప’తంత్రం
- నంద్యాల ముస్లింలకు టీడీపీ గాలం - ఉప ఎన్నికల నేపథ్యంలో 21న సీఎం ఇఫ్తార్ విందు - కానుకల పేరిట మభ్యపెట్టే యత్నం - గతంలో గుర్తుకురాని ముస్లింలు - మంత్రి మండలిలో దక్కని చోటు - మండిపడుతున్న మైనార్టీ నాయకులు నంద్యాల: మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ వర్గం ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. రంజాన్ తోఫా..ఇఫ్తార్ విందులంటూ వారిని మభ్యపెడుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో..నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లింలను ఆకర్షించేందుకు.. 21వతేదీ సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విందుతోపాటు కానుకలను సమర్పించి ఓట్లు దండుకోవడానికి రంగం సిద్ధం చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం రూ.90లక్షలు ఖర్చు పెట్టడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును నమ్మి మోసపోవద్దని ఆవాజ్ కమిటీ నాయకులు..ముస్లింలకు సూచిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మొత్తం 175 సీట్లలో ముస్లింలకు ఒక్కటి కూడా కేటాయించలేదు. అధికారంలో వచ్చి ప్రమాణస్వీకారం జరిగేటప్పుడు పార్టీలోని ముస్లిం నేతకు మంత్రి పదవి ఇచ్చి.. తర్వాత ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు.. ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో అప్పట్లో ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రెండో దఫా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని ముస్లిం నేతలు అశించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు. నంద్యాల పట్టణం గాంధీచౌక్లోనూ భారీ స్థాయిలో రాస్తారోకో నిర్వహించారు. టీడీపీపై నంద్యాల నియోజకవర్గంలోని ముస్లింలతో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. మభ్యపెట్టే యత్నం.. రాష్ట్రంలో గుంటూరు, కడప, కర్నూలులో ముస్లిం జనాభా ఎక్కువ. ఆ తర్వాత నంద్యాల నిలుస్తోంది. నియోజకవర్గంలోని 2.30 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 70వేలకుపైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం వ్యతిరేకత అధికంగా ఉండడంతో ఉపఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని నిఘా వర్గాలు తెల్చిచెప్పాయి. దీంతో వారిని మక్కువ చేసుకునేందుకు రంజాన్ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నారు. మంత్రి వర్గంలో చోటు హామీని పక్కనపెట్టి ఇఫార్తర్ విందుతో మభ్యపెట్టడానికి సిద్ధపడ్డారు. రంజాన్ తోఫా బ్యాగ్‌పై వేయడానికి వక్స్బోర్డు, మైనార్టీ సంక్షేమ మంత్రి లేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఫొటోను మార్ఫింగ్ (మార్పు) చేసి ముస్లిం టోపీ పెట్టి మభ్యపెట్టడానికి యత్నించారు. రంజాన్‌తోఫా బ్యాగ్‌పై ముస్లిం నేత ఫొటో లేకపోవడంపై ఆ వర్గం నాయకులు మండిపడుతున్నారు. ఇంత ఖర్చా.. ఉపఎన్నికల్లో ముస్లిం ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రభుత్వం రూ. 90లక్షలతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఇస్తే.. ఉప ఎన్నిక కోసమే నంద్యాలలో ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. 21వ తేదీన ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం రూ. 90లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై విమర్శలు ఉన్నాయి. రాజకీయం చేయొద్దు : జాకీర్, నంద్యాల కౌన్సిలర్ ముస్లింలు ఉపవాసం ముగించాక సంఘీభావంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు, పట్టణ ప్రముఖులు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ముస్లింలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకుండా అవమానించి చంద్రబాబు.. ఇఫ్తార్ రాజకీయం చేయడం దారుణం. విందుతో ముస్లింలు దాసోహం అవుతారని భావించడం సరికాదు. ఇప్తార్‌తో సమస్యలు తీరువు: ముర్తుజా, రాష్ట్ర అధ్యక్షుడు, అవాజ్ కమిటీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషమే. అయితే దీనితో సమస్యలు పరిష్కారం కావని ముస్లింలు గమనించాలి. ముస్లింలకు తప్పని సరిగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వాలి. పది శాతం రిజర్వేషన్ ఇచ్చి సబ్‌ప్లాన్ అమలు పరచాలి. ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మోసం చేయ్యడానికే : మస్తాన్‌వలీ, ముస్లిం నాయకుడు ఉపఎన్నిక నేపథ్యంలో ముస్లింలను మోసం చేయడానికే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఒక్క రోజు విందుకు రూ. 90 లక్ష ఖర్చు చేయడం..రాజకీయ ప్రయోజనం కోసమే. -
నేర వార్తల ప్రేరణతో
రెండేళ్లలో 115 చైన్ స్నాచింగ్‌లు రెండు కేజీల బంగారు నగల స్వాధీనం కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : రెండేళ్ల కాలంలో 115 చైన్ స్నాచింగ్‌లు చేసి రెండు కేజీలకు పైబడిన బంగారు నగలు చోరీ చేసిన నిందితుడిని రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, క్రైం పార్టీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలసి నిందితుడిని క్వారీ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశామని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. అతని వద్ద నుంచి 2 కేజీల 069 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అన్నారు. వీఆర్వో సమక్షంలో బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం విలేకరులకు ఆమె వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో... నిందితుడు భాస్కరరావు చేసిన మొత్తం 115 చైన్ స్నాచింగ్ కేసులు స్టేషన్ల వారీగా ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం వన్‌టౌన్ పరిధిలో 23, టూ టౌన్ పరిధిలో ఆరు, త్రీటౌన్ పరిధిలో 33, ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 37, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్ పరిధిలో 10, సమిశ్రగూడెంలో ఒకటి, చాగల్లు స్టేషన్ పరిధిలో ఒకటి ఉన్నాయి. మోటారు సైకిల్ మీద తిరుగుతూ ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడలో బంగారు నగలు తెంపుకుని పరారయ్యేవాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినా... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నిందితుడు రెండు ఎకరాల పొలం అమ్ముకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ.30 లక్షల వరకూ అప్పులపాలయ్యాడు. మద్యం, జూదానికి బానిస అయ్యాడు. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామానికి చెందిన మల్లిన భాస్కరరావు (బాసి) రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్లపై వెళ్లే మహిళల మెడలోంచి బంగారు నగలను చోరీలు చేసేవాడు. నేర వార్తల ప్రేరణతో టీవీలలో వచ్చే క్రైం న్యూస్‌పై వచ్చే కథనాల ప్రేరణతో చోరీలకు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టం వచ్చి అప్పులపాలైన భాస్కరరావుకు ఇంట్లో చిల్లిగవ్వ కూడా ఇచ్చేవారు కాదు. దీంతో జల్సాలకు డబ్బులు సంపాదించేందుకు చైన్ స్నేచింగ్‌ను సులువైన మార్గంగా ఎన్నుకున్నాడు. 2015 నుంచి 2016 వరకూ, 2017 ఈ నెల 3న ఇతడు ఆఖరిసారిగా చైన్ స్నాచింగ్ చోరీ చేశాడు. చిక్కింది ఇలా... నగరంలో చైన్ స్నాచింగ్స్ జోరుగా సాగుతుండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. త్రీటౌన్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వరావుకు ఒక రోజు నిందితుడు ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని ఒక వీధిలో తిరుగుతూ కనిపించాడు. అనుమానంతో నిందితుడిని ప్రశ్నిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేర్కొంటూ కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. తెల్లటి దుస్తులతో దర్జాగా ఉండడంతో వదిలివేశారు. అయితే ఇతని స్వగ్రామంలో స్థితిగతులపై విచారణ చేస్తే పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. భర్తను వదిలి వేసిన ఒక మహిళతో ఇతడు వివాహేతర సంబంధం కొనసాగించడం, పేదరాలైన ఆమె తరచూ బంగారు నగలు ఎక్కువగా పెట్టుకొని తిరగ డంపై గ్రామస్తులకు అనుమానాలు వచ్చాయి. నిఘా పెట్టిన చైన్ స్నాచింగ్స్ ప్రాంతాలలో నిందితుడు మోటారుసైకిల్‌పై కనిపించడంతో అతడిపై పోలీసుల కన్ను పడింది. అతడి కాల్ డేటా ఆధారంగా నేరం జరిగిన ప్రదేశాలలో నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ టవర్ లోకేషన్‌కు సరిపోలడంతో నిందితుడిగా గుర్తించారు. నేరాలు ఎక్కువగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే చేసి, 9 గంటల కల్లా ఇంటికి వెళ్లిపోయే ప్రణాళికతో నిందితుడు చోరీలకు పాల్పడేవాడు. పోలీసులకు రివార్డు ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైం పార్టీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ పి.వెంకటేశ్వరరావు వి.శ్రీనివాస్, కేఎస్ శ్రీనివాస్, ఎ.రాంబాబులను ఎస్పీ అభినందించారు. వీరికి ప్రభుత్వం తరఫున రూ.10 వేల రివార్డును అర్బన్ ఎస్పీ రాజకుమారి అందజేశారు. ఇదిలా ఉండగా... ఈ కేసులో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో బంగారు నగలు రికవరీ చేసినా కేవలం 2 కేజీలకు పైబడిన నగలనే పోలీసులు చూపించారన్న ఆరోపణలు వస్తున్నాయి. బంగారు నగలు కొనుగోలు చేసిన బంగారం షాపు వారిపై కేసులు నమోదు చేయలేదని, ఈ కేసులో కొంతమందిని తప్పించారని తెలుస్తోంది. -
అఖిలప్రియకు అవమానం!
-
'అభ్యర్థి ఎంపికపై పార్టీదే తుది నిర్ణయం'
-
రసవత్తరంగా నంద్యాల ఉపఎన్నిక రాజకీయం
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భూమా నాగిరెడ్డి వారసున్ని ప్రకటించవద్దని మంత్రి అఖిలప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. అఖిలప్రియ తల్లి దివంగత శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భూమా వారసున్ని ప్రకటించాలని మంత్రి అఖిలప్రియ నిర్ణయించారు. ఈమేరకు ఆమె ప్రకటన కూడా చేశారు. అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబునాయుడు అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవద్దని అఖిలప్రియను ఆదేశించారు. ఇది ఇలా ఉండగా సీటు మాదంటే మాదని శిల్పా, భూమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఏకాభిప్రాయం వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై పార్టీదే తుది నిర్ణయం: అఖిలప్రియ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీదే తుది నిర్ణయమని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానన్నారు. -
రసవత్తరంగా నంద్యాల ఉపఎన్నిక రాజకీయం
-
ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన
-
ఉప ఎన్నికల సందేశం
మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రారంభించిన జైత్రయాత్రను బీజేపీ అప్రతిహ తంగా కొనసాగిస్తూనే ఉన్నదని గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు లభిస్తే కాంగ్రెస్‌కు మూడు... తృణమూల్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లకు ఒక్కోటి వచ్చాయి. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి బీజేపీ చాలా త్వరగానే కోలుకుని పకడ్బందీ ప్రణాళికతో అడుగులేస్తున్నదని ఆ తర్వాత మహారాష్ట్ర మొదలుకొని యూపీ వరకూ జరిగిన వరస ఎన్నికలు నిరూ పించాయి. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా తనకు మంచి భవిష్యత్తు ఉన్నదని ఆ పార్టీ రుజువుచేసుకుంది. సామాజిక మాధ్యమాలను సమర్ధవంతంగా ఉపయో గించుకోవడంలో అయితేనేమి, అవినీతి వ్యతిరేక ప్రచారంలో అయితేనేమి బీజేపీకి దీటుగా నిలబడి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొంతకాలంగా నిస్తేజమవుతున్న జాడలు కనబడుతూనే ఉన్నాయి. ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానే అయి చేస్తున్న పోరా టం ఆయనపై ఉన్న సానుకూలతను పెంచకపోగా నానాటికీ తగ్గిస్తున్నదని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి దాపురించిన ఘోర పరాజయం నిరూపించింది. కర్ణాటకలో కాంగ్రెస్ రెండు ఉప ఎన్నికల్లోనూ సాధించిన విజయం ఎన్నదగ్గది. అది నంజన్‌గూడ్‌లో 21,000 మెజారిటీతో, గుండ్లుపేట్‌లో 10,000 మెజారిటీతో నెగ్గింది. దాని ఓట్ల శాతం కూడా గతంతో పోలిస్తే పెరిగింది. కానీ ఆ విజయం తమ ఘనతేనని చెప్పుకునే స్థితి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి లేకుండాపోయింది. అవి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తిగత విజయాలు. ఆ రెండుచోట్లా మరో ప్రధాన పార్టీ జేడీ(ఎస్) అభ్యర్థుల్ని నిలపకపోవడం ప్రధానంగా కాంగ్రెస్‌కు కలిసొ చ్చింది. అంతేకాదు నంజన్గూడ్ కాంగ్రెస్ అభ్యర్థి కేశవమూర్తి ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందు జేడీ(ఎస్)నుంచి వచ్చి చేరారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న శ్రీనివాసప్రసాద్ మొన్నటివరకూ సిద్ధరామయ్య సర్కారులో రెవెన్యూ మంత్రిగా పనిచేసినవారే. కేబినెట్ నుంచి తనను తొలగించడంతో ఆగ్రహించిన శ్రీనివాసప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజే పీలో చేరారు. అందువల్లే అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. శ్రీనివాసప్రసాద్ చేరికతో అంతంతమాత్రంగా ఉన్న దక్షిణ కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకుం టుందని, అది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడి మళ్లీ సీఎం పీఠాన్ని తనకు దక్కిస్తుందని బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప భావించారు. కానీ ఆయన కల ఫలించలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ఎం కృష్ణ చేరిక కూడా బీజేపీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పు డెదురైన ఓటమితో యడ్యూరప్పకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సారథ్యం దక్కడం అనుమానమే. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఒక స్థానం కాంగ్రెస్ సొంత మైనా మెజారీటీ మాత్రం అతి స్వల్పం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం రాజస్థాన్‌లోని ఢోల్పూర్లో బీజేపీ గెలుపు కాంగ్రెస్‌కు నిరాశ కలిగించేదే. అక్కడ వసుంధర రాజే పాలనపై జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నదని, వచ్చే ఎన్నికల నాటికి అది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ కొండంత ఆశతో ఉంది. అక్కడి ఉప ఎన్నిక ఫలితం దానికి గండికొట్టింది. బెంగాల్లో జరిగిన ఉప ఎన్నిక బీజేపీని విజేతగా నిలబెట్టకపోయినా ఆ పార్టీని జనం తృణమూల్‌కు దీటైన పక్షంగా భావిస్తున్నారని తేల్చింది. అటు వామపక్షాలు, ఇటు కాంగ్రెస్ దీన్ని గమ నించుకుని ఉండాలి. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. సిక్కుల ఊచకోత కేసుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంపై విలేకరుల సమావేశంలో బూటు విసిరి సంచలనం సృష్టించిన పాత్రికేయుడు జర్నైల్‌సింగ్. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో జర్నైల్ దాదాపు 47 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించగా ఇప్పుడు ఆప్ మూడో స్థానానికి దిగజారి డిపాజిట్ కోల్పో యింది. రాజకీయాల్లో తాను అనుసరిస్తున్న బాణీ ప్రజలకు నచ్చడంలేదని ఈ ఫలి తంతో కేజ్రీవాల్‌కు అర్ధమై ఉండాలి. అయితే జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరిగిన తీరు ఆందోళన కలిగించేది. అక్కడ నిండా 7 శాతంమంది కూడా పోలింగ్‌లో పాల్గొన లేదు. పది శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు గతంలో లేక పోలేదుగానీ 30 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఇంత తక్కువగా పోలింగ్ జరగడం ఇదే ప్రథమం. 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్ నిర్వహిస్తే అందులో రెండంటే రెండు శాతంమంది ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. భద్రతా బలగాలకూ, నిరసన లకు దిగిన వేర్పాటువాదులకూ మధ్య బుడ్గామ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగడం, కొన్ని పోలింగ్ కేంద్రాలపైకి పెట్రోల్ బాంబులు విసరడం, భద్రతా బలగాల కాల్పుల్లో 8మంది మరణించడం ఈ ఉప ఎన్నికను రక్తసిక్తం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఒక వీడియోను గమనిస్తే ఆ ప్రాంతంలో విధి నిర్వ హణ భద్రతాబలగాలకు ఎంత సంక్లిష్టంగా మారిందో అర్ధమవుతుంది. జమ్మూ– కశ్మీర్ స్థితిగతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమీక్షించి అక్కడ అనుసరి స్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక గుర్తుచేసింది. ఎన్నికల్లో ప్రచారమే తప్ప అనంతరం ఎదురయ్యే వైఫల్యాల గురించి అయినా... దక్కే ఒకటో రెండో విజయాలపైన అయినా ఒక్కనాడూ చర్చించడం అలవాటులేని కాంగ్రెస్ ఎప్పటిలాగే ఈసారి కూడా జాడ, జవాబూ లేకుండా మిగిలిపోయింది. చిత్రమేమంటే 2014 సార్వత్రిక ఎన్నికలు దాన్ని విపక్షంలోకి నెడితే... అనంతరం జరుగుతున్న ఎన్నికలు దానికి ఆ స్థానం కూడా మిగలకుండా చేస్తున్నాయి. అయినా అధినేతల్లో చలనం లేదు. ఇలాంటి విపక్షం ఉన్నంతకాలం భవిష్యత్తుపై బీజేపీ బెంగపడాల్సిన అవసరం ఉండదు. -
ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజ
-
ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు
పదింటిలో ఐదు స్థానాల్లో విజయం ► ఢిల్లీలో ఆప్ డిపాజిట్ గల్లంతు ► అస్సాం, రాజస్తాన్, హిమాచల్ సీట్లు బీజేపీ ఖాతాలోకి ► కర్ణాటక హస్తానిదే.. పశ్చిమబెంగాల్లో తృణమూల్ హవా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ జయభేరి మోగించింది. గురువారం వెల్లడైన ఫలితాల్లో పది స్థానాలకుగానూ ఐదింటిని గెలుచుకుంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, కర్ణాటక, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపొందగా.. తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఒక్కోస్థానంలో విజయం సాధిం చాయి. కర్ణాటకలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకోగా, పశ్చిమ బెంగాల్లో మమత నాయకత్వానికే ప్రజలు జై కొట్టారు. జార్ఖండ్‌లో ఏకైక స్థానం లో జేఎంఎం విజయం సాధించింది. ఆప్‌కు షాక్ త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ స్థానంలో ఎన్డీయేకి భారీ విజయం దక్కింది. బీజేపీ–శిరోమణి అకాలీదళ్ సభ్యుడిగా బరిలో దిగిన మన్జిందర్ సింగ్ సిర్సా 50 శాతానికిపైగా ఓట్లు సంపాదించి ఘన విజయం సాధించారు. అధికార ఆమ్ఆద్మీ పార్టీ మూడోస్థానానికే పరిమితమై.. డిపాజిట్ కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. తాజా విజయంతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనుందని పార్టీ నాయకులంటున్నారు. మధ్యప్రదేశ్‌లో చెరొకటి: మధ్యప్రదేశ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాంధవ్‌గఢ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి శివనారాయణ్ సింగ్ 25,476 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. అటేర్ నియోజకవర్గంలో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హేమంత్ కటారే బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ భదోరియాపై 857 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని భోరంజ్ (ఎస్సీ) స్థానంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ ధిమాన్ 8,290 మెజారిటీతో గెలుపొందారు. అస్సాంలోని ధేమాజీ స్థానంలో బీజేపీకి చెందిన రానోజ్ పెగు 9,285 ఓట్ల తేడాతో గెలిచారు. కర్ణాటకలో పోలింగ్ జరిగిన రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నంజనగుడ స్థానంలో 21వేలకు పైగా మెజారిటీతో, గుండ్లుపేటలో పదివేలకు పైచిలుకు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాజస్తాన్‌లోని ఢోల్పూర్ అసెంబ్లీ స్థానంలో అధికార బీజేపీ 22,602 ఓట్ల తేడాతో మొదటిస్థానంలో నిలిచింది. జార్ఖండ్‌లోని లిట్టిపారా స్థానానికి జరిగిన పోలింగ్‌లో జేఎంఎం అభ్యర్థి సిమోన్ మరాండి 12,900 ఓట్లతో గెలిచారు. పశ్చిమబెంగాల్లోని కాంతి దక్షిణ్ అసెంబ్లీ స్థానంలో.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య 42,527 ఓట్ల (56శాతం) భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ ప్రదర్శన భేష్: ప్రధాని ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీపై విశ్వాసం కనబరుస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అభివృద్ధి రాజకీయాలు, సుపరిపాలనపై ప్రజలు మరోసారి విశ్వాసం కనబరిచారు. ప్రజలకు కృతజ్ఞతలు. కార్యకర్తలకు శుభాకాంక్షలు’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. శ్రీనగర్‌లో రీపోలింగ్ 2 శాతమే! శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల రీపోలింగ్‌లో కేవలం 2శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం 38 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్‌లో 709 మంది (మొత్తం 34,169 ఓట్లలో) మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. బుద్గాంలో ఓ రాళ్లురువ్విన ఘటన మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ శనివారం (ఏప్రిల్ 15న) జరగనుంది. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో 7.14 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. -
సత్తాచాటిన బీజేపీ.. కాంగ్రెస్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటగా, కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. గురువారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఐదు, కాంగ్రెస్ మూడు, టీఎంసీ, జేఎంఎం ఒక్కో సీటు గెల్చుకున్నాయి. కమలం పార్టీ మూడు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు అదనంగా మరో రెండు సీట్లను కైవసం చేసుకుంది. రాజౌరి గార్డెన్ (ఢిల్లీ), దోల్పూర్ (రాజస్థాన్), బంద్గఢ్ (మధ్యప్రదేశ్), బోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), డెమజీ (అసోం) అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇంతకుమందు దోల్‌పూర్‌లో బీఎస్పీ, రాజౌరి గార్డెన్లో ఆప్ గెలుపొందగా.. తాజా ఫలితాల్లో ఈ రెండు సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఇటీవల వరుస పరాజయాలు మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజా ఫలితాలు ఊరట కలిగించాయి. కర్ణాటకలోని గుండ్లుపేట్, నంజన్గూడ్, మధ్యప్రదేశ్‌లోని అతెర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అతెర్లో కాంగ్రెస్ 800 ఓట్లతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మూడు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానాలు. ఇక పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ కాంతి దక్షిణ్ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకుంది. జార్ఖండ్‌లోని లితిపర్లో జేఎంఎం గెలుపొందింది. కాగా ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజౌరి గార్డెన్ స్థానంలో ఆప్ మూడో స్థానానికి పడిపోయింది. -
ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజ
న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అసోం, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలోని పది స్థానాలకు ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని బోరంజ్, ఢిల్లీ రాజౌరి గార్డెన్, అసోం, హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, లితిపురాలో జేఎంఎం అభ్యర్థి, కర్ణాటకలోని నజంగుడు, గుండ్లుపేట ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. థీమజీ (అస్సాం), భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), అతెర్, బాంధవ్‌గఢ్ (మధ్యప్రదేశ్), కంతీదక్షిన్ (వెస్ట్ బెంగాల్), ధోల్పూర్ (రాజస్థాన్), నజంగుడు, గుండ్లుపేట్ (కర్ణాటక) లతిపురా (జార్ఖండ్), ఉప్పేర్ బుర్తూక్ (సిక్కిం), రాజౌరీ గార్డెన్ (ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే జమ్మూ,కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్, కేరళలోని మలప్పురం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. బుద్గాం జిల్లాలో రీపోలింగ్ మరోవైపు శ్రీనగర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పోలింగ్ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీ పోలింగ్ జరుగుతోంది. అల్లర్లు, ఓటింగ్ తక్కువగా నమోదు కావడంతో ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ నిర్వహిస్తోంది. రీ పోలింగ్‌కు అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఓటింగ్ కొనసాగనుంది. కాగా శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన గొడవల్లో పోలీసులు కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఆర్కేనగరం విచిత్రం
► నిన్నటి వరకు జాతర ► నేడు నిర్మానుష్యం ► సమస్యల పునరావృతం ► ప్రజలకు తప్పని పాట్లు సాక్షి, చెన్నై : ఆదివారం వరకు ఆ నియోజకవర్గంలో పండుగ సందడి. అక్కడి ప్రజలకు నిత్యం విందే. చిన్న సమస్యకు చిటికెలో పరిష్కారం. ఇళ్ల వద్దకే వాటార్ ట్యాంకర్లు. సంపూర్ణంగా విద్యుత్ సరఫరా. ఓటుకు నోటు, తాయిలాల పంపిణీ, నేతల ప్రచారంతో నెల రోజులుగా హడావుడిలో మునిగిన ఆర్కేనగర్ ఇప్పుడు నిర్మానుష్యమైంది. జనం ఆనందం ఆవిరి అయింది. మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి.. ఎన్నికలు వస్తే చాలు నియోజకవర్గాల్లో నేతల హడావుడి, వాగ్దానాలు హోరెత్తుతాయి. ఎన్నికలు అయ్యాక అదే నేతలు ముఖం చాటేస్తారు. ఎన్నికల సమయంలో అన్ని ప్రజలకు దరి చేరుతాయి. ఆ తర్వాత అధికారుల చుట్టు ప్రదక్షణలు తప్పదు. అయితే, అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజలకు మాత్రం ఎన్నికల సమయంలో పండుగే. గత రెండున్నరేళ్లలో మూడు సార్లు ఇక్కడి ప్రజల ముందుకు ఎన్నికలు వచ్చాయి. జైలు జీవితానంతరం అమ్మ కోసం ఓ మారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు, తాజాగా అమ్మ మరణంతో ఎన్నికలు తప్పలేదు. అయితే, ఈ నియోజకవర్గాన్ని కైవశం చేసుకునేందుకు తీవ్ర సమరమే సాగింది. అన్నాడిఎంకేను దక్కించుకునే రీతిలో సాగిన ఈ సమరంలో నోట్ల కట్టలు తాండవం చేశాయి. అధికార పక్షం, అన్నాడిఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ రేసులో దిగడంతో అనేక ప్రాంతాల్లోని ఓటర్లకు నిత్యం పండుగే. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే ఇక్కడ ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ దరి చేరాయి. ఇదీ విచిత్రం: అమ్మ అభ్యర్థి అడుగు పెట్టిన చోటంతా అధికారుల హడావుడి తప్పలేదు. ఇందుకు కారణం వెన్నంటి సీఎం, మంత్రులు ఉండటమే. ప్రజలు చిన్న సమస్యను ప్రస్తావించినా క్షణాల్లో పరిష్కరించేంతగా చర్యలు సాగాయి. నియోజకవర్గం పరిధిల్లోని వార్డుల్లో తమ నేతల కంటే తమ నేతలకు ఆహ్వానం పలుకుతూ తోరణాలు, అరటి గెలలు అబ్బో చెప్పాలంటే, అక్కడ పండుగ వాతావరణం మిన్నంటì నట్టుగా పరిస్థితి కనిపించాయి. అయితే, ఒక్క ఉత్తర్వుతో అన్నీ తలకిందులు అయ్యాయి. ఓటుకు నోటు తాండవం ధృవీకరణతో ఎన్నికల్ని సీఈసీ రద్దు చేసిందో ఏమోగానీ, ఆ నియోజకవర్గం వైపుగా ప్రస్తుతం తొంగి చూసే వారు లేదని చెప్పవచ్చు. ఎన్నికల రద్దు విషయంగా పోస్టర్లు వెలిసినా, ప్రజా సమస్యలు మాత్రం మళ్లీ పునరావృతమే. ఈ నియోజకవర్గం పరిధిలో సాధారణంగా వంద వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.ఇందుకు కారణం ఇక్కడ నీటి ఎద్దడి అధికమే. ఎన్నికల ప్రచార సమయాల్లో ఆ సంఖ్య 500 వందలకు చేరిందని చెప్పవచ్చు. నీళ్లు సంవృద్ధిగా దక్కాయి.ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా సాగింది. ఇదంతా ఆదివారం అర్థరాత్రితో కనుమరుగు అయ్యాయి. సోమవారం కాలం నెట్టుకు వచ్చినా, మంగళవారం , బుధవారం నుంచి సమస్యలు మళ్లీ పునరావృతం కాక తప్పలేదు. నియోజకవర్గంలో గతంలో వచ్చే ట్యాంకర్లు మాత్రమే బుధవారం రావడంతో నీటి కోసం క్యూ కట్టక తప్పలేదు. తాగు నీటి కోసం అన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద జనం క్యూ కట్టి నీటిని పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పవర్ కట్ సమస్య మళ్లీ మొదలు కావడంతో ఉక్క పోత అనుభవించక తప్పడం లేదు. ఆదివారం వరకు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న రోడ్లు, కాలువల్లో మళ్లీ చెత్తా చెదారం చేరుతున్నాయి. ఏ అధికారి, ఏ నాయకుడు అటు వైపుగా తొంగి చూడని దృష్ట్యా, ఇక తమకు ఎన్నికలు వచ్చే వరకు పాత కష్టాలు తప్పదన్నట్టుగా మనస్సు ఓదార్చుకుంటూ ఆర్కేనగర్ వాసులు ముందుకు సాగుతున్నారు. -
మంగళగిరి 31వ వార్డులో వైఎస్ఆర్ సీపీ విజయం
-
మంగళగిరి 31వ వార్డులో వైఎస్ఆర్ సీపీ విజయం
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డుకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటరమణ 182 ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు. హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టంకట్టారు. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు వెంకటరమణ విజయం సాధించినట్లు ప్రకటించారు. -
అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వాయిదా
-
అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వాయిదా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నిక మే 25కు వాయిదా పడింది. శాంతి భద్రతలు అదుపులో లేవని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నివేదించడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఉపఎన్నికకు పోలింగ్ జరగాల్సిన రెండు బూత్‌లకు దుండగులు ఆదివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. దీంతో అనంత్‌నాగ్ నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
పోలింగ్ స్లిప్ చూపితే చాలు.. డబ్బు!
గుడివాడ: గుడివాడ మున్సిపాలిటీలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు మృతితో జరుగతున్న ఉప ఎన్నికలో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. 19వ వార్డు ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటుకు రూ. 7 వేలు చొప్పున డబ్బు పంచుతున్నారు. పోలింగ్ స్లిప్ చూపితే చాలు డబ్బులు అందజేస్తూ.. సాక్షి టీవీకి అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ అక్రమాలపై వైఎస్ఆర్ సీపీ నేతలు డీఎస్పీ అంకినీడుకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా నగరపాలక కార్పొరేటర్ ఉపఎన్నికలో సైతం తెలుగు తమ్ముళ్లు ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్న కొంత మంది టీడీపీ నేతలను వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అక్కడ నుంచి పంపించివేశారు. కాగా.. గుంటూరు జిల్లా మాచర్లలో 15 వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికలో పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు టెంట్ వేసుకొని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో 12 వ వార్డుకు జరుగుతున్న పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు గూండాగిరి ప్రదర్శించారు. డబ్బులు పంచుతున్న దృశ్యాలను చిత్రీకరించిన సాక్షి టీవి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విలేకరి సర్ఫరాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. -
నేడు మూడు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: ఢిల్లీ సహా 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు, శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గతేడాది భద్రత దళాలు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీని ఎన్ కౌంటర్లో చంపడాన్ని నిరసిస్తూ శ్రీనగర్ పీడీపీ ఎంపీ తారిఖ్ హమీద్ కర్రా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండటంతో భద్రత చర్యల్లో భాగంగా ఈ రోజు శ్రీనగర్, బుద్గాం, గండర్బాల్ జిల్లాలలో అన్ని ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. ఈ నెల 13న అసెంబ్లీ స్థానాలలో, 15న శ్రీనగర్ లోక్ సభ స్థానంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాలివే.. రాజౌరి గార్డెన్ (ఢిల్లీ) లిటిపర (జార్ఖండ్) నంజన్గూడ్, గుండ్లుపేట్ (కర్ణాటక) దోల్పూర్ (రాజస్థాన్) కాంతి దక్షిణ్ (పశ్చిమ బెంగాల్) అటర్, బందవ్‌గఢ్ (మధ్యప్రదేశ్) భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్) దీమాయి (అసోం) -
కేబుల్ వార్
నంద్యాలలో సరికొత్త రాజకీయం - కేబుల్ విస్తరణ పనుల చుట్టూ టీడీపీ నేత ఎత్తులు – శిల్పా కేబుల్ పనులను అడ్డుకోవాలని ఎస్పీకి భూమా వర్గం ఫిర్యాదు – అధికార పార్టీలో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి - తాజాగా కేబుల్ వైర్లకు రాజకీయ రంగు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి కేబుల్ వైర్లను తాకింది. శిల్పా కేబుల్ విస్తరణ పనులను అడ్డుకోవాలని భూమా కేబుల్ వర్గం నేరుగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ)కి ఫిర్యాదు చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేబుల్ విస్తరణ పనులను చేపట్టకూడదని.. అయినప్పటికీ శిల్పాకు చెందిన కేబుల్ సంస్థ విస్తరణ పనులను చేస్తుందని ఈ ఫిర్యాదులో భూమా కేబుల్ వర్గం ఎస్పీకి చేసిన పిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో కాక పుట్టిస్తోంది. తాజాగా కేబుల్ వార్తో ఇది మరింత ముదరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భూమా కేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని నంద్యాల డీఎస్పీని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది. ఆది నుంచి వార్ వాస్తవానికి నంద్యాలలో భూమా, శిల్పా వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది రాజకీయాలతో పాటు కేబుల్ బిజినెస్‌లోనూ ప్రస్పుటమవుతోంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నికలు రావడం, అందులో తమ కుటుంబానికే సీటు ఇవ్వాలని భూమా వర్గం కోరుతుంది. మరోవైపు శిల్పా మోహన్‌రెడ్డి తనకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కోవలో ఆయన నేరుగా ముఖ్యమంత్రిని కూడా కలిసి విన్నవించారు. ఒకవేళ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు కూడా. అయితే భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంది. తాజాగా శిల్పా కేబుల్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇది ఇరువర్గాల మధ్య చిచ్చు రాజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకోర్టు ఆదేశాలపైనే ఫిర్యాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ప్రసారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నెట్ పథకానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల డివిజన్లో ఈ పనులను భూమా కేబుల్ సంస్థ దక్కించుకుంది. వాస్తవానికి సైబర్ నెట్ ఉద్దేశాల మేరకు ఇతర కేబుల్ సంస్థలకు చెందిన కేబుల్ తీగలు విద్యుత్ స్తంబాలపై వేలాడకూడదు. అలాంటి కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని స్వయంగా సీఎం ఆదేశించారు. అయితే దీనిపై ఇతర కేబుల్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే కోవలో హైకోర్టు కూడా ప్రస్తుతం ఉన్న యధాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆదేశాలకు భిన్నంగా శిల్పా కేబుల్ సంస్థ యధాతథ స్థితిలో ఉంచకుండా విస్తరణ పనులను చేపడుతుందనేది ఇప్పుడు భూమా కేబుల్ సంస్థ వాదన. అందువల్ల ఎస్పీకి చేసిన ఫిర్యాదులో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం హైకోర్టు ఆదేశాలపైనే ఫిర్యాదు చేశామనేది భూమా కేబుల్ సంస్థ చెబుతోంది. అయినప్పటికీ కేబుల్ వ్యాపారంలోనూ ఇటు భూమా, అటు శిల్పా వర్గాలు ఉండటంతో రాజకీయ రంగు అలుముకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే సీటు వస్తుందని భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొంటుండగా తమకే వస్తుందని శిల్పావర్గం అంటోంది. మరోవైపు ఇదే సీటు కోసం మాజీ మంత్రి ఫరూక్, ఎస్పీవై రెడ్డి వర్గాలు కూడా ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ చదరంగానికి తోడు కేబుల్ వ్యాపారంలో పట్టు కోసం సాగుతున్న పోరు నంద్యాల రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు చివరికి ఎటు దారి తీస్తాయన్నది తేలాల్సి ఉంది. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జగ్గంపేట మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన గరిక లోవదుర్గా నాగార్జున (25) బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రోడ్-కం-రైలు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. 2013లో తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిబుల్ ఐటీ చదివిన నాగార్జున బ్యాంక్ టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటూ అతడి గ్రామంలోని దారాల ఫ్యాక్టరీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రాజమహేంద్రవరం, కాకినాడలో వైద్యం చేయించినట్టు మృతుడి తండ్రి విశ్వనాథం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గంట సమయంలో ఇంటిలో భోజనం చేసి ఫ్యాక్టరీ పని ఉందని చెప్పినట్టు తండ్రి చెప్పారు. ఫ్యాక్టరీ మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం చేరుకున్న అతడు.. అక్కడ మోటారు సైకిల్, జేబులోని రూ.3000, సెల్‌ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అతడిని పరిశీలించిన వారు మోటారు సైకిల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకువెళ్లిపోయారు. మృతుడి సెల్‌ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి మీ కుమారుడు బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులకు తెలిపారు. విషయాన్ని వారు రాజమహేంద్రవరంలోని బంధువులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్సై నాగార్జున రాజు, పోలీసులు బ్రిడ్జి మీద మృతుడు వదిలిన మోటారుసైకిల్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహం కోసం జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు మృతుడు నాగార్జున తండ్రికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తె పెద్దది కాగా కుమారులలో నాగార్జునే ఇంటికి పెద్ద కుమారుడు. ఇతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ సభ్యులను కలచివేసింది. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ‘కౌరు’ నామినేషన్
తణుకు : తణుకు మునిసిపల్ పరిధిలోని మూడో వార్డు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. వార్డు కౌన్సిలర్ గుబ్బల రామారావు కుటుంబ సభ్యులకు టికెట్టు ఇవ్వడం ద్వారా ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తొలుత భావించినప్పటికీ ఆశావాహుల ఒత్తిడితో టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఏపీపీ, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు బుధవారం తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి, మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. భారీ ర్యాలీగా.. మునిసిపల్ పరిధిలోని 3వ వార్డు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. ప్రధాన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రధాన పక్షాలైన టీడీపీ, వైఎస్సార్ సీపీ నుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉండటంతో పోరు నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. గురువారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బు«ధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. మూడోవార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మునిసిపల్ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారాం, అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దాల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గుర్రాల సత్య ప్రియ, పట్టణ కన్వీనర్ కలిశెట్టి శ్రీనివాసు, పార్టీ రాష్ట్ర నాయకులు పెన్మత్స రామరాజు, మద్దిరాల రామ సతీష్, బూసి వినీత, నాయకులు పెన్మత్స సుబ్బరాజు, నరసింహమూర్తి రాజు, వీరవల్లి పాలేశ్వరరావు, పోలిశెట్టి వెంకన్నబాబు, అడ్డాల రమేష్, బెజ్జవరపు సాక్షి గోపాలరావు, చెల్లంకి వెంకటేశ్వరరావు, ఆర్వీవీ రమణ, పైబోయిన సత్యనారాయణ, చింతాడ సంజీవరావు, వి.సీతారాం, గంటా బాబి, బసవా గణేష్, కొమ్మోజు రామకృష్ణ, కేతా కృష్ణ, చదలవాడ యేసయ, మట్టా వెంకటేష్, రంబ నాగేశ్వరావు, గుర్రాల నాగేంద్ర, ఎలిపే సరోజిని పాల్గొన్నారు. -
ఉప ఎన్నికలకు మోగిన నగారా
గుడివాడ : జిల్లాలోని గుడి వాడ, పెడన మున్సిపాలిటీలు, విజయవాడ కార్పొరేషన్లో ఒక డివిజన్లో కార్పొరేటర్ స్థానానికి ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గుడివాడ 19వ వార్డు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 19వ వార్డు కౌన్సిలర్ గణపతి లక్ష్మ ణరావు మృతితో ఏర్పడిన ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ, ఏప్రిల్ 9న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. పెడన 20 వార్డుకు... పెడన: పెడన మున్సిపాలిటీలోని 20వ వార్డు ఉప ఎన్నిక ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పట్టణంలోని 20 వార్డు కౌన్సిలర్ యర్రా శేషగిరిరావు 2015 జూన్‌లో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడిందని తెలిపారు. 11వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి... విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ అనారోగ్యతో 2015లో మృతి చెందారు. దీంతో ఆ డివిజన్లో ఖాళీ ఏర్పడింది. తాజాగా ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 9 వ తేదీ పోలింగ్ జరుగుతుందని, 11న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, గుడివాడ డివిజన్ పంచాయతీ అధికారి విక్టర్ తెలిపారు. -
దమ్ముంటే ఉప ఎన్నికల్లో గెలవాలి
కేసీఆర్, బాబుకు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి సవాల్ కనగల్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల నుంచి తమ పార్టీల్లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవా ల్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో నిర్వ హించిన కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారిని అప్రజాస్వామికంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న ఇద్దరు ఎంపీటీసీలను చిత్తుగా ఓడించి ప్రజలు నిజమైన తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్ పతనం కనగల్ మండలం నుంచే ప్రారంభమైందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఉప ఎన్నికల్లో చూపించారన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ లేదు, డబుల్ బెడ్రూం ఊసేలేదు, దళితులకు మూడెకరాల భూమి లేదు ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు గొర్రెలిస్తం బర్రెలిస్తం చివరకు పందులను ఇస్తం అంటూ సీఎం కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. -
మోగిన ఉప నగారా
► వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక ► మార్చి 16 నుంచి నామినేషన్లు ► ఏప్రిల్ 15న ఓట్ల లెక్కింపు ► పోటీకి దీప సిద్ధం సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నగారా మోగింది. వచ్చేనెల 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఈనెల 16న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కేనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. ఆమె మరణంతో ఆమె ప్రాతిని«థ్యం వహించిన ఆర్కేనగర్లో ఉపఎన్నిక ఏర్పడింది. అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే అనతికాలంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోగా తదనంతర పరిణా మాల వల్ల రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వంతో ఆయన మద్దతుదారులపై శశికళ బహిష్కరణ వేటువేశారు. ఒక వర్గానికి పన్నీర్‌సెల్వం, మరో వర్గానికి శశికళ నాయకత్వం వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా శశికళ జైలు కెళ్లే ముందు ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బెంగళూరు జైలు నుంచి ఆమె పార్టీ చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని ఒక వర్గం జయ మేనకోడలు దీపను అనుసరిస్తోంది. దీంతో రెండుగా ఉండిన పార్టీ మూడు వర్గాలుగా మారిపోయింది. శశికళపై ఎన్నికల కమిషన్ కు పన్నీర్‌సెల్వం వర్గం ఫిర్యాదు చేయగా ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. శశికళ ఇచ్చిన వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తిచెందని పక్షంలో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారు. ఇటువంటి కీలకమైన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక ముంచుకొచి్చంది. ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం గురువారం మధ్యాహ్నం ఆర్కేనగర్ ఉపఎన్నిక నగారాను మోగించింది. ఆర్కేనగర్లో ఉప ఎన్నిక ప్రకటన వల్ల ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో అధికార అన్నాడీఎంకే నేతలు, ప్రభుత్వ అధికారులు హడావుడిగా నియోజక వర్గానికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకోవడం ప్రారంభించారు. అలాగే దీప, పన్నీర్‌సెల్వం అనుచరులు వేర్వేరుగా సమావేశమై ఎన్నికలపై సమాలోచనలు జరిపారు. ఆర్కేనగర్ నుంచి దీప పోటీ: అన్నాడీఎంకే ప్రతిష్ట, అమ్మ ప్రభావంపై ఆధారపడి మూడు వర్గాలు అభ్యర్థులను పోటీకి పెట్టడం దాదాపు ఖాయమని భావించవచ్చు. శశికళ జైలు కెళ్లకుంటే పోటీచేసి ఉండేవారు. దీంతో ఆమెకు బదులుగా దినకరన్ పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్నారు. పన్నీర్‌సెల్వం ఎవరిని పోటీకి పెడతారో ఇంకా తేటతెల్లం కాలేదు. ఇక మూడో వర్గం నుంచి దీప పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీచేయనున్నట్లు దీప గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఒక అభ్యర్థిని, బీజేపీ, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వీసీకే పార్టీలు కూడా రంగంలో నిలిచే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూలు: మార్చి 16వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 23 వ తేదీతో ముగుస్తుంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ ఆఖరు రోజు. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో ఉప ఎన్నికకు తెరపడనుంది. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : తమిళనాడులో మరో కీలక ఎన్నికకు నగారా మోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలిలత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 17న ఉప ఎన్నిక ఫలితం రానుంది. జయలలిత మృతి, శశికళ జైలుకు వెళ్లడం తదితర పరిణామాలు నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలుగా చీలడం, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ అరంగేట్రం చేయడంతో పాటు ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కాగా ఖాళీ అయిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఆర్కేనగర్ (తమిళనాడు)తో పాటు థీమజీ (అస్సాం), భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), అతెర్, బాంధవ్‌గఢ్ (మధ్యప్రదేశ్), కంతీదక్షిన్ (వెస్ట్ బెంగాల్), ధోల్పూర్ (రాజస్థాన్), నన్జన్గౌడ్, గుండ్లుపేట్ (కర్ణాటక) లతిపురా (జార్ఖండ్), ఉప్పేర్ బుర్తూక్ (సిక్కిం), రాజౌరీ గార్డెన్ (ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అలాగే జమ్మూ,కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్, కేరళలోని మలప్పురం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
‘తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము లేదు’
శ్రీకాకుళం : రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసన సభ సమావేశాలు తుతూమంత్రంగా జరపడం సరికాదని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల ఆవేదనను వినపించడానికి వేదికైన శాసనసభను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పక్క రాష్ట్రాలు అయిన ఒడిశాలో 85 రోజులు, తెలంగాణలో 75 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఏపీలో మాత్రం ఎందుకు అన్నిరోజులు నడపలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేకే నామినేషన్లు వేసినవారిని బెదిరిస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి 20మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు ఇస్తామనడం అవమానకరమని ఆయన అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా జరపలేక అధికార పార్టీ భయపడుతోందని, ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము టీడీపీకి లేదన్నారు. -
బీజేపీ ఓటమిని ఒప్పుకుంది : అఖిలేశ్
మెయిన్ పురి: ఎన్నికల్లో ఓడిపోయామని బీజేపీ ముందే అంగీకరించిందని, అందుకే గతంలోని విషయాలను తిరగదోడుతోందని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. 1984లో కాంగ్రెస్ నేతలు ములాయం సింగ్ యాదవ్‌పై హత్యాయత్నం చేసినా, ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడం గురించి ప్రధాని మోదీ చేసిన విమర్శలపై గురువారం కర్హాల్‌లో జరిగిన ప్రచార సభలో అఖిలేశ్ దీటుగా సమాధానమిచ్చారు. ఎప్పుడో జరిగిన విషయాల కంటే, ఫరియాబాద్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమను యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ ఓడించిన విషయాన్ని మోదీకి ఆయన సలహాదారులు వివరించాల్సిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తులో తన అనుభవలేమిని ప్రదర్శించారనే మోదీ విమర్శపై మాట్లాడుతూ.. సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) తొక్కడాన్ని తాను బాగా నేర్చుకున్నానని, తన వేగానికి దరిదాపుల్లో కూడా ఏనుగు (బీఎస్పీ గుర్తు) గాని, కమలం (బీజేపీ గుర్తు) గాని రాలేవన్నారు. -
పెన్షన్.. టెన్షన్
పీఎఫ్ పింఛనుదారులకూ ఇబ్బందులే వేలిముద్రలు, ఐరీష్ కోసం పరుగులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : కొత్తగా ప్రవేశపెట్టిన వేలిముద్ర, ఐరీష్ వి«ధానం కారణంగా ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ పొందుతోన్న ఉభయగోదావరి జిల్లాల్లోని పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో రిటైరై ఈ పెన్షన్ తీసుకునే వారు ఏడాదికోసారి లైవ్ సర్టిఫికెట్ సమర్పించాల్సివచ్చేది. ఈ ఏడాది నుంచి ఆ విధానానికి స్వస్తి పలికి వేలిముద్రలుంటేనే పెన్షన్ వచ్చేలా మార్పు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 54 ,607 మంది ఈ పెన్షన్లు పొందుతున్నారు. ఇప్పటికి 23,418 మంది మాత్రమే వేలిముద్రలను నమోదు చేసుకున్నారు. వేలిముద్రలు సరిగా పడని వృద్ధులకు ఐరీష్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియని వారు లైవ్ సరిఫ్టికెట్తో ఎప్పటిలానే పంపుతున్నారు. వేలిముద్రలు వేయకుండా ధ్రువపత్రం పంపిన వారికి పెన్షన్లు ఆగిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఈ వి«ధానం గతేడాది నవంబర్ నెల నుంచి ప్రారంభించినా.. ఈ నెల నుంచి అమలుకానుంది. అంతా 60 ఏళ్లు పైబడిన వారే.. ఈపీఎస్ పొందేవారిలో అత్యధిక శాతం 60 ఏళ్లు పైబడినవారే. వేలిముద్రల నమోదు చేయించుకునేందుకు వారు ఉభయగోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరంలోని పీఎఫ్ కార్యాలయాలకు వీరు వెళుతున్నారు. పనిచేయని స్థానిక కేంద్రాలు పెన్షన్‌దారుల రద్దీ దృష్ట్యా, ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రధాన మండలాల్లో వేలిముద్రల నమోదు చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులతో స్థానిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ పనిచేయక, మరికొన్ని సెంటర్లలో వేలిముద్రలు నమోదు కాక, ఇతర సాంకేతిక సమస్యలతో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. దీంతో పెన్షన్‌దారులను జిల్లాలోని ప్రధాన కేంద్రాలకు వెళ్లమని ఈ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెన్షన్‌దారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లడం కష్టమని, ఈ కేంద్రాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించి ఇక్కడే వేలిముద్రల నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని పెన్షన్‌దారులు కోరుతున్నారు. చాలా దూరం నుంచి వచ్చా.. వేలిముద్ర వేయకపోతే పెన్షన్ ఆగిపోతుందంటున్నారు. ఆరోగ్యం బాగోకపోయినా హడావుడిగా వచ్చేశాను. ఇంతదూరం రావడం కష్టంగా ఉంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. –సత్యనారాయణ, శృంగవృక్షం అందరూ నమోదు చేసుకోవాలి ఈపీఎస్ పొందేవారు కచ్చితంగా వేలిముద్ర వేసి వారి సమాచారాన్ని పొందుపర్చాలి. లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది. ఈ నెల 10వ తేదీలోగా ఈ నమోదు ప్రక్రియ పూర్తి కావాలి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఇబ్బందులు ఉంటే నేరుగా తమ కార్యాలయానికి తెలియజేయవచ్చు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లేముందు ఫోన్ చేసి అక్కడ పనిచేస్తుందో లేదో తెలుసుకుని వెళ్లండి. లేనిపక్షంలో ప్రధాన కార్యాలయానికి రావాల్సిందే. –కె.గణేష్‌కుమార్ జానీ, రీజినల్ పీఎఫ్ కమిషనర్ ఈపీఎఫ్ వేలిముద్రల నమోదు సెంటర్ల ఫోన్ నెంబర్లు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి, మోరి 94912 40130 జగన్నాయకపూర్ 98484 92002 మమ్ముడివరప్పాడు 99496 28107 జి.రంగంపేట 77023 22084 పిఠాపురం 90595 49906 సర్పవరం, కాకినాడ 91549 62076 బండారులంక, అమలాపురం 81259 83849 చీడిగ 93468 22647 ముక్కామల 98851 62355 నెల్లి అప్పన్నసెంటర్ 99592 78659 గోకవరం 93970 80300 కొత్తపేట 91775 45958 మొల్లేరు 94408 00882 మలికిపురం 98493 81195« ధవళేశ్వరం 92461 11809 రాజమండ్రి 94401 27694 బిక్కవోలు 92915 80865 అంగర 99590 18900 వెదురుపాక 98496 56084 కొండకుదురు 89788 72722 ఇంజరము 94921 79933 తాటిపాక 99129 75759 వేమగిరి 98854 75701 రంపచోడవరం 94902 46563 -
మంత్రి సునీత అధికార దుర్వినియోగం
-
మంత్రి సునీత అధికార దుర్వినియోగం
అనంతపురం: కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు పనిచేశాయి. ఎంపీటీసీలను బెదిరించి, ప్రలోభపెట్టి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ సీపీకి మెజార్టీ స్థానాలున్నా మంత్రి పరిటాల సునీత ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పాటు.. మామిళ్ల పల్లి దగ్గర ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. -
నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి పై వేటు
సర్వీసు నుంచి తొలగిస్తూ కలెక్టరు ఆదేశాలు రాజానగరం : దివాన్‌చెరువు పంచాయతీ నిధులు దుర్వినియోగం పై ఆ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన ప్రస్తుతం ఏలేశ్వరం మండలం, యర్రవరం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బీవీవీఎస్ఎన్ మూర్తి పై వేటు పడింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అతనిని సర్వీసు నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కాపీ స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి కూడా చేరింది. ఏపీసీఎస్ (సీసీఏ) రూల్ 1991 యాక్ట్ ననుసరించి ఈ చర్య తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో .... దివాన్‌చెరువు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దేశాల వెంకటరామారావు (శ్రీను) ప్రజావాణిలో 2015 ఆగస్టు మూడున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. సర్పంచ్ కొవ్వాడ చంద్రరావుతో కలిసి 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా గతేడాది నవంబరులో డీఎల్పీఓ చేసిన విచారణ నివేదిక ద్వారా గుర్తించి, సర్పంచ్‌కి, ఇన్చార్జి కార్యదర్శిగా ఉన్న మూర్తికి గత ఏడాది డిసెంబరు ఒకటిన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానికి మూర్తి జనవరిలో ఇచ్చిన జవాబును అనుసరించి డీఎల్పీఓ ఫిబ్రవరి 20న మరో నివేదికను అందజేశారు. దానిపై అప్పటికే రావులపాలెం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మూర్తిని సస్పెండ్ చేస్తూ మే 31న చార్జ్ మెమో ఇచ్చారు. దానిపై అతని నుంచి వచ్చిన సమాధానంతోపాటు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారం అతని సస్పెన్షన్‌ని రద్దు చేసి, ఏలేశ్వరం మండలం, యర్రంవరం పంచాయతీకి జూనియర్ అసిస్టెంట్‌గా జూన్ 22న ఉత్వర్వులిచ్చారు. సబ్ కలెక్టరు నివేదికతో పడిన వేటు ఇదిలావుండగా దివాన్‌చెరువు పంచాయతీ నిధుల దుర్వినియోగం సంఘటనపై వస్తున్న రకరకాల కథనాలు, జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరును విచారణకు ఆదేశించారు. సెప్టెంబరు 29న సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదికలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా గుర్తించడంతోపాటు ఇటువంటి వారిని సర్వీసులో కొనసాగించడం ప్రమాదకరమని, సర్వీసు నుంచి తొలగించాలంటూ ప్రతిపాధించారు. సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదిక ప్రకారం పంచాయతీలో రూ.78 లక్షల 80 వేల 755ల నిధులు దుర్వినియోగం అయినట్టుగా నిర్థారించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఖాతరు చేయకుండా, విచక్షణా రహితంగా బిల్లు కలెక్టరును, 44 మంది పారిశుద్ధ్య కార్మికులను (పోస్టులు మంజూరు లేకుండానే) నియమించుకోవడాన్ని తప్పుపట్టారు. అలాగే ఇంటి పన్నులుగా వసూలు చేసిన రూ. 67,961లు పంచాయతీ ఆదాయంలో జమ చేయకపోవడాన్ని, వాటర్ టాక్స్‌గా వసూలు చేసిన రూ.3,960ని కూడా జమ చేయకపోవడాన్ని గుర్తించారు. ఇదే విధంగా వివిధ రకాల ఖర్చులలో వచ్చిన తేడాలను, జరిగిన అవినీతిని తన నివేదికలో వివరంగా పేర్కొన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.34 లక్షల 34 వేల 613లు, పంచాయతీ సాధారణ నిధుల నుంచి రూ.36 లక్షల 51 వేల, 921లు, వాటర్ టాక్స్, పారిశుద్ధ్య కార్మికులకు నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించిన మొత్తం రూ.ఏడు లక్షల 22 వేల, 300లు, వసూలు చేసిన వాటర్ టాక్స్‌ని పంచాయతీ జమ చేయకుండా వాడకున్న మొత్తం రూ.71 వేల, 921లుగా ఉన్నాయి. ఇదిలావుండగా నిధుల దుర్వినియోగంలో పంచాయతీ సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు ఇప్పటికే సస్పెండ్ అయివున్నారు. కాగా ఈ విషయమై సర్వీసు నుంచి తొలగించబడిన మూర్తిని ఫోన్లో వివరణ కోరగా దుర్వినియోగంలో తాను నిర్థోషినన్నారు. అదే విషయాన్ని మరోసారి రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. -
హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు
నగదు రహితమే ముద్దంటూ అవగాహన ర్యాలీలు ఓ వైపు జిల్లాలో జరుగుతుంటే ఇంకో వైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన జనం మాత్రం ఎన్నాళ్లీ హద్దులు..కష్ట, నష్టాలంటూ పెదవి విరుస్తున్నారు. కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించారని వాపోయారు. ఈ క్యూలు పక్క నుంచే పోలీసుల రక్షణతో అవగాహన ర్యాలీలు జరుగుతుండడంతో అక్కడక్కడా జనం నిలదీసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్ వద్ద విద్యార్థులు, ఇతరులు మానవహారం చేసి అవసరాల కోసం హైటెక్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునివ్వగా బ్యాంకుల్లో నగదు పెట్టకుండా ఏమీటీ ప్రవచనాలంటూ బాధితులు విమర్శించారు. రాజానగరంలో కూడా ర్యాలీని నగదు బాధితులు అడ్డుకున్నారు. 20 రోజులుగా అన్ని పనులు ఆగిపోయాయని రైతులు, వ్యాపారులు, గృహిణులు ధ్వజమెత్తారు. రాజానగరం : నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్యపరుస్తూ రాజానగరంలో పోలీసులు, బ్యాంకు అధికారులు కలిసి ఇంజినీరింగ్ విద్యార్థినుల సాయంతో బుధవారం రాజానగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జనం తిరగబడ్డారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, సీఐ శంకర్‌నాయక్‌ల ఆధ్వర్యంలో గ్రామంలోని షిరిడీ సాయిబాబా సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైతులు, వ్యాపారులు అక్కడకు చేరుకుని ర్యాలీలో ఉన్న బ్యాంకు అధికారులు తమకు సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ఒకవైపు, రబీ సాగు మరోవైపు జరుగుతున్న నేప«థ్యంలో పొలాల్లో పనులు చేస్తున్న కూలీలకు సొమ్ములు ఇవ్వలేకపోతున్నామని వైఎస్సార్సీపీకి చెందిన దూలం పెద్ద, ప్రగడ చక్రితోపాటు మరికొందరు రైతులు తమ ఆవేదనను తెలిపారు. తమ ఖాతాలో ఉన్న సొమ్ములు ఇమ్మంటే రూ.రెండు వేలు ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకువెళ్లి ఎంతమందికి కూలీ ఇవ్వాలన్నారు. ఇలాగైతే ఎలా వ్యవసాయం చేసేందంటూ నిలదీశారు. వ్యాపారులు కూడా చిల్లర సమస్యతో సతమతమవుతున్నామని, బ్యాంకులో రూ.రెండు వేల నోట్లు తప్ప చిల్లర నోట్లు ఇవ్వడం లేదన్నారు. మా ఖాతాలో ఉన్న కరెన్సీనుంచి మేము అడిగినంత ఇవ్వాలని, మేనేజర్ సమాధానం చెప్పాలని పట్టుపడ్డారు. ఈ సమయంలో డీఎస్పీ, సీఐలు అడ్డుకుంటూ బ్యాంకుకు వెళ్లి మాట్లాడండి.. ఇక్కడ కాదు అని సర్థిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. బ్యాంకుకు వెళ్తుంటే తమను పురుగుల్లా చూస్తున్నారని, ఇక్కడే సమాధానం చెప్పాలన్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాధవ కలుగజేసుకుని తాము పై అధికారులు చెప్పిన విధంగా చేస్తున్నామని, మీ ఇబ్బందులను వారి దృష్టిలో పెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో వివాదం సద్దుమణిగి, ర్యాలీ ముందుకు సాగింది. -
గెలుపుతో అన్నాడీఎంకే సంబరాలు
తిరువళ్లూరు: అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలే ఉప ఎన్నికల్లో విజయానికి కారణమని పూందమల్లి ఎమ్మేల్యే ఏలుమలై అన్నారు. తంజావూర్, అరవకురుచ్చి, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరి నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడ్డారుు. తంజావూర్, తిరుప్పరకుండ్రం, అరవకురచ్చి మూడు అసెంబ్లీ స్థానాలను అన్నాడీఎంకే భారీ మోజారీటితో గెలుచుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు నిర్వహించారు. తన్నీర్‌కులం వద్ద ఉదయం బాణసంచా కాల్చిన నేతలు స్వీట్లు పంచి పెడుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఈకాడులోనూ సంబరాలను యూనియన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఈ విజయంతో మరిన్ని సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రకటించారు. పార్టీ నేతలు మోహనసుందరం, కేశవన్, రాజశేఖర్, సుబ్రమణ్యం, మురగయ్య పాల్గొన్నారు. అన్నాడీఎంకే విజయంతో కార్యకర్తల సంబరం వేలూరు: రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో కార్యకర్తలు స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలోని తంజావూర్, అరవకుర్చి, తిరుప్పరగుండ్రం నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందారు. దీంతో వేలూరు సమాచార టెక్నాలజీ విభాగం జిల్లా కార్యదర్శి జననీ సతీష్‌కుమార్ అధ్యక్షతన పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు బాణసంచా పేల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టారు. ఆయనతో పాటు సమాచార విభాగం అధ్యక్షుడు రాజన్, కోశాధికారి నిత్యానందం పాల్గొన్నారు. అదే విధంగా వేలూరు కామరాజర్ విగ్రహం ఎదుట మాజీ జిల్లా కార్యదర్శి మూర్తి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి పెట్టారు. ఆయనతో పాటు డివిజన్ కార్యదర్శి అన్వర్ బాషా, యువజన విభాగం జిల్లా కార్యదర్శి డీడీఆర్.రఘు, జిల్లా ప్రతినిధి రాజ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల్లో సీఎం ఘనవిజయం
-
ఉప ఎన్నికల్లో సీఎం ఘనవిజయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. పుదుచ్చేరి నెల్లితోప్పె అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్‌పై 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు. గత మే 16న జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వీ నారాయణస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, ఆయన శాసనసభ్యుడు కాకపోవడంతో ఉప ఎన్నికల బరిలోకి దిగారు. నారాయణస్వామి సీఎంగా కొనసాగాలంటే ఈ ఎన్నికలో తప్పక గెలువాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసకక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తిశేఖర్ గట్టిపోటీ ఇచ్చారు. దీంతో ఆసాంతం ఈ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. త్రిపురలోని బర్జాలా అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర సర్కార్ రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ సీపీఎం దూకుడు ప్రదర్శించింది. అదేవిధంగా సీపీఎం ఎమ్మెల్యే సమీర్ దేబ్ సర్కార్ మృతితో కోవాయి అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగగా.. ఈ స్థానాని కూడా సీపీఎం కైవసం చేసుకుంది. అసోం లఖీంపుర లోక్‌సభ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ స్థానంలోనూ, నేపనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. -
ఉప సమరం..ప్రశాంతం
అరవకురిచ్చి, నెల్లితోపులో భారీగా ఓటింగ్ ఓటు వేయని అభ్యర్థులు నోటాకు అవనియాపురం ఓట్లు ఐవీఆర్ఎస్ పద్ధతిలో సరళి వీక్షణ 22న ఫలితాలు సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరిలోని ఓ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రశాంత పూరిత వాతావరణంలో శనివారం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగిన ఈ ఎన్నికల్లో అరవకురిచ్చి, నెల్లితోపుల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, జల్లికట్టు తమకు దూరం అవుతుండడాన్ని నిరసిస్తూ తిరుప్పరగుండ్రం నియోజకవర్గం పరిధిలోని అవనియాపురం ఓటర్లు తమ ఓటు నోటాకు అని ప్రకటించి మరి ముందుకు సాగడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు బట్వాడా హోరుతో తంజావూరు, అరవకురిచ్చిల్లో ఎన్నికలు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో తిరుప్పర గుండ్రం ఖాళీ అరుుంది. పుదుచ్చేరిలోని నెల్లితోపు ఎమ్మెల్యే జాన్‌కుమార్ తమ సీఎం నారాయణస్వామి కోసం పదవిని త్యాగం చేశారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాలకు గాను ఉపఎన్నిక శనివారం జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిఘా నీడలో ఎన్నికలు సాగారుు. ఓటర్లు ఉత్సాహంగానే తరలి వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. కరూర్ జిల్లా అరవకురిచ్చిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థిగా సీనియర్ నాయకుడు కేసీ పళని స్వామి, బీజేపీ అభ్యర్థిగా ప్రభు, పీఎంకే అభ్యర్థిగా భాస్కరన్, డీఎండీకే అభ్యర్థిగా అరవై ముత్తు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. తంజావూరులో డీఎంకే అభ్యర్థిగా డాక్టర్ అంజుగం భూపతి, అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగస్వామి, బీజేపీ అభ్యర్థి ఎంఎస్ రామలింగం, డీఎండీకే అభ్యర్థిగా అబ్దుల్ షేట్, పీఎంకే అభ్యర్థిగా కురింజిపాదం, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా నల్లదురైలలో ఎవరి మీద ఓటరు కరుణ చూపించారో వేచి చూడాల్సి ఉంది. మధురై జిల్లా తిరుప్పరగుండ్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోసు, డీఎంకే అభ్యర్థి శరవణన్, డీఎండీకే అభ్యర్థిగా ధనపాండియన్ పోటీలో దిగడంతో సమరం ఆసక్తికరంగా సాగింది. పుదుచ్చేరిలోని నెల్లితోపు ఎన్నికల రేసులో ఆ రాష్ట్ర సీఎం నారాయణస్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా, ఓం శక్తి శేఖర్ అన్నాడీఎంకే అభ్యర్థులుగా ప్రధాన పోటీలో దిగారు. అరుుతే, సీఎం రేసులో ఉన్న దృష్ట్యా, విజయం ఏక పక్షం అన్న సంకేతాలు ఉన్నారుు. ప్రశాంతంగా ఓటింగ్: అరవకురిచ్చి నియోజకవర్గం పరిధిలో 245 పోలింగ్ బూతుల్లో నిఘా నీడలో ఎన్నికలు సాగాయి. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు 40 శాతం మేరకు, మూడు గంటలకు 73 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల అన్నాడిఎంకే, డిఎంకే వర్గాలు వాగ్యుద్దాలు, తోపులాటలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి ఉండడంతో, నాయకులకు ముచ్చెమటలు తప్పలేదు. కొన్ని చోట్ల అధికారులు అన్నాడీఎంకే వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యథేచ్ఛగా నోట్లను ఓటర్లకు ఇచ్చి మభ్య పెడుతున్నా, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటలకు 81.92 శాతంగా ఓటింగ్ నమోదైంది. ఇక, తంజావూరులో 276 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ సాగింది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువతీ,యువకులు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పద కొండు గంటల తర్వాత ఓటింగ్ మందకొడిగా సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాభై శాతంగా ఓటింగ్ నమోదైంది. మూడు గంటలకు 60.5 శాతానికి చేరుకుంది. సాయంత్రం ఐదు గంటలకు 69 శాతంగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కూడా పలు చోట్ల డీఎంకే, అన్నాడీఎంకే వర్గాల మధ్య వివాదంరాజుకున్నా పోలీసులు కొరడా ఝుళిపించడంతో సద్దుమనిగింది. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఆరుగుర్ని పోలీసులకు డీఎంకే నాయకులు అప్పగించారు. మధురై జిల్లా తిరుప్పరగుండ్రంలో అరుుతే, ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. ఇక్కడి 291 పోలింగ్ బూతుల్లో ఐదింటిని మోడరన్‌గా తీర్చిదిద్దారు. హరిదాపట్టి, కరిదిగల్, పనయూర్, అరలతోటై్ట పోలింగ్ బూత్‌ల వద్ద తోరణాలు, అరటి గెలలతో పండుగ సందడి వలే అలంకరించారు. ఈ కేంద్రాల్లో ఓటర్లకు ప్రత్యేకంగా కూర్చీలు, ఏసీ సౌకర్యం కూడా కల్పించడం విశేషం. మధ్యాహ్నం ఒంటి గంటకు 60 శాతం ఓటింగ్ జరగ్గా, తదుపరి మందగించింది. మూడు గంటలకు అదనంగా రెండు శాతం మాత్రమే ఓటింగ్ సాగింది. ఓటర్లను మభ్య పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని, అన్నాడీఎంకే వర్గాలపై డీఎంకే ఫిర్యాదులు చేయడం పలు పోలింగ్ బూత్‌ల వద్ద వివాదానికి దారి తీశారుు. తెన్కరింజి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు టీ కాఫీ, టిఫెన్ల నిమిత్తం టోకెన్లను అందిస్తున్న అన్నాడీఎంకే నాయకుల్ని తహసీల్దార్ మహేశ్వరి పట్టుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పార్టీ వర్గాలపై కేసులు నమోదు అయ్యారుు. ఇక, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన నలుగుర్ని ఎన్నికల అధికారులు పట్టుకోవడం విశేషం. సాయంత్రం ఐదు గంటలకు 70 శాతంగా ఓటింగ్ నమోదైంది. జల్లికట్టు తమకు దూరం అవుతుండడంతో ఆవేదన చెందిన అవనియాపురం ఓటర్లు తిర్పుర గుండ్రం ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఉదయం ప్రకటించారు.దీంతో అధికార వర్గాలు ఉరుకులు పరుగులు తీసి వారిని బుజ్జగించినట్టుంది. చివరకు తమ ఓటు నోటాకు అంటూ ముందుకు సాగడం గమనార్హం. పుదుచ్చేరిలో: పుదుచ్చేరిలో కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల నడుమ ఎన్నికలు సాగారుు. నివాస ప్రాంతాలతో కూడిన నెల్లితోపులో 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పది కేంద్రాలు ఒకే చోట ఏర్పాటు చేయడంతో రాజకీయ పక్షాలు తమ వీరంగాలను ప్రదర్శించేందుకు వీలు లేనంతగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓ చోట కాంగ్రెస్వ ర్గాలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ తన పార్టీ వర్గాలతో రోడ్డెక్కడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించారు. ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు 40 శాతంగా ఉన్న ఓటింగ్ తదుపరి పుంజుకుంది. మూడు గంటలకు డెబ్బై శాతంగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రానికి 85.76గా ఓటింగ్ శాతం తేలింది. ఓటు వేయని అభ్యర్థులు: ఉప ఎన్నికల రేసులో ఉన్న అభ్యర్థులు మెజారిటీ శాతం తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి. ఇందుకు కారణం ఆయా నియోజకవర్గాల్లో తమకు ఓటు హక్కుల లేకపోవడమే. తంజావూరు డీఎంకే అభ్యర్థి అంజుగం భూపతి అక్కడి సర్బోజి స్కూల్ ఆవరణలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి అన్నాడిఎంకే అభ్యర్థి రంగస్వామి ఓటు పాపనాశం నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. తిరుప్పరగుండ్రంలో బరిలో దిగిన డీఎంకే, అన్నాఎంకే అభ్యర్థులకు, అరవకురిచ్చి రేసులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు ఆ నియోజకవర్గాల్లో ఓట్లు లేవు. ఇక, పలువురు స్వతంత్ర అభ్యర్థులకే కాదు, బీజేపీ, పీఎంకే అభ్యర్థులకు కూడా ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామికి ఆ నియోజకవర్గంలో ఓటు హక్కులేదు. అయితే, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ తాను పోటీచేసిన నెల్లితోపులోని ఓ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐవీఆర్ఎస్ పద్ధతిలో సరళి వీక్షణ: ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని చెన్నై నుంచి పరిశీలించారు. రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం ఉన్న 812 పోలింగ్ బూత్‌లలో 187 బూత్‌లలో మాత్రం ఎన్నికల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేశారు. మిగిలిన అన్నీ బూత్‌లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఎప్పటికప్పుడు ఆయా బూత్‌లలోని పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆయా అధికారులకు సమాచారాలు వెళ్లడం, అక్కడి నుంచి సమాచారాలు రాబట్టడం, పరిస్థితులను తెలుసుకునే విధంగా ప్రక్రియ ముందుకు సాగడంతో ఉప ఎన్నిక సమరం ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతమైంది. 22న ఫలితాలు: ఉప ఎన్నిక ముగియడంతో ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన కళాశాలలకు తరలించారు. తిరుప్పరగుండ్రం పరిధిలో ఉపయోగించిన ఈవీఎంలను మధురై మెడికల్ కళాశాలకు, తంజావూరు నియోజకవర్గంలో ఉపయోగించిన ఈవీఎంలను నాచ్చియార్కళాశాలకు, అరవకురిచ్చి ఈవీఎంలను కరూర్ కరుప్పస్వామి కళాశాలకు, పుదుచ్చేరి నెల్లితోపు ఈవీఎంలను అక్కడి భారతీ దాసన్ కళాశాలకు తరలించారు. -
ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఉత్కంఠ
-
నోట్లు.. నేతల పాట్లు
► ఆకలి తీర్చని కరెన్సీ ► ఉప ఎన్నికల్లో కార్యకర్తల కష్టాలు కరెన్సీ చెలామణిలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులు ఉప ఎన్నికల అభ్యర్థులను కష్టాల్లోక నెట్టివేశాయి. చేతి నిండా (పాత కరెన్సీ) డబ్బున్నా కడుపునింపుకునే అవకాశం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రస్తుతం రాష్ట్రం లోని తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగున్రం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీ, డీఎండీకే అభ్యర్థులు రంగంలో నిలవగా, అన్నాడీఎంకే, డీఎంకే ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొం ది. గత ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బు, బహుమతులు పంచిపెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. తాజా ఎన్నికల్లో సైతం డబ్బు ప్రభావం ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈనెల 19వ తేదీన ఈ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుండగా ప్రచార గడువు ఇక వారం రోజుల్లో ముగుస్తుంది. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో అన్నాడీఎంకే, డీఎంకేలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల వెంట అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఈ దశలో ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు అకస్మాత్తుగా రద్దు కావడంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ప్రచారంలో పాలుపంచుకునే వారికి ఆహారాది సదుపాయాలను కల్పించేందుకు భారీ ఎత్తున నగదును ముందుగానే అప్పగించారు. ఉదయం, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనం, ప్రచారం ముగిసిన తరువాత మద్యం ప్రచారంలో పరిపాటిగా మారింది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగి ఉండగా వారి వద్దనున్న కరెన్సీ చెల్లని నోటుగా మారడం నేతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు కాళ్లరిగేలా ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు తమ వద్దనున్న డబ్బుతో కనీసం టిఫిన్ కూడా తినలేక పోతున్నారు. కార్యకర్తల ఖర్చుకు ప్రతిరోజూ భారీ ఎత్తున డబ్బు అవసరం కావడంతో రద్దయిన నోట్లనే దగ్గర ఉంచుకున్నారు. దీంతో కట్టలు కట్టలు కరెన్సీ ఉన్నా కడుపు నిండా తినే అవకాశం లేదని వాపోతున్నారు. అంతేగాక ప్రచారాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలు తిరుగు ప్రయాణ ఖర్చులు కూడా లేక అల్లాడిపోయారు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు ఈ ఏడాది మేలో డబ్బులను వెదజల్లిన అభ్యర్థులు సైతం ఇరకాటంలో పడిపోయారు. ఓటుకు నోటు ఇవ్వాలంటే వారి వద్ద కొత్త కరెన్సీ లేక పోయింది. ప్రచారం ముగిసిన తరువాతనే ఓటర్లను నోట్లు పంచడం అభ్యర్థులకు అలవాటు. రూ.500, రూ.1000 పాత కరెన్సీ చెల్లదు, పాత నోట్లను చెల్లించి భారీ ఎత్తున కొత్త కరెన్సీ కోసం నేతలు బ్యాంకు వద్ద క్యూ కడితే ఎన్నికల కమిషన్ దృష్టిలో పడుతుంది. దీంతో ఉప ఎన్నికల్లోని అభ్యర్థులు, కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
సారీ కెప్టెన్..
ఉపఎన్నికల్లో ఎవరికీ మద్దతుఇచ్చేది లేదన్న మక్కల్ ఇయక్కం నేతలు డీఎండీకేకు మద్దతుపై తిరుమా మరో కొత్త పలుకు సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కం వర్గాల మాటల గారడీ రాజకీయ విశ్లేషకులనే విస్మయంలో పడేస్తోంది. రోజుకో మా ట, పూటకో అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా, మరో మారు డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు మద్దతు కోరితే, పరిశీలన అని పలికిన ఆ నాయకులు మంగళవారం ఉప ఎన్నికల్లో డీఎండీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ కొత్త పలుకుగా, యూసీసీకి వ్యతిరేకంగా రా జకీయ పక్షాలు ఏకం కావాలంటూ అఖి ల పక్షానికి పిలుపునిచ్చే పనిలో పడ్డారు. మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల తీరు విమర్శలకు దారి తీస్తున్నారుు. రోజుకో మాట, పూటకో అభిప్రాయం అన్నట్టుగా ఎవరికి వారు మీడియా ముందుకు వచ్చి చర్చల్లోకి ఎక్కడమే కాకుండా, విమర్శలను, వ్యంగ్యాస్త్రాలను ముట్టగట్టుకునే పనిలో పడ్డారు. నిన్నటి వరకు ఉప ఎన్నికల్లో డీఎండీకే మద్దతు కోరితే పరిశీలిస్తామన్న సీపీఎం, సీపీఐ, వీసీకే నేతలు , తాజాగా మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చేశారు. వీరి పరిశీలన మేరకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమని ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా తమకు మద్దతును ప్రకటించాలని విన్నవించారు. దీంతో మక్కల్ ఇయక్కం మద్దతు ఉప రేసులో ఉన్న డీఎండీకే అభ్యర్థులకు దొరికినట్టేనా..? అన్న ఎదురు చూపులు పెరిగా రుు. అయితే, మీడియా సందించిన ప్రశ్నలకు సమాధానంగానే పరిశీలన అన్న నినాదాన్ని తాము తెర మీదకు తెచ్చామేగానీ, ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదంటూ ఆ ఇయక్కం తేల్చడం డీఎండీకేకు మరో షాక్కే. గత వారం విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని ఆ ఇయక్కంలోని వైగో స్పందిస్తే, తాజాగా మిగిలిన ముగ్గురు విజయకాంత్‌కు పరిశీలన అంటూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. వీసీకే నేత తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఇయక్కం వర్గాలు నిర్ణయం తీసుకున్నాయని, విజయకాంత్ తమ వద్దకు వచ్చి ఎలాంటి మద్దతు కోరలేదని, ఏ పనిచేసినా సక్రమంగా చేయాలన్నదే తన అభిమతం అని, అందుకే ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీపీఎం నేత రామకృష్ణన్ అదేపల్లవి అందుకున్నారు. తామందరం కల సి కట్టుగా ఎన్నికల బహిష్కరణ నిర్ణ యం తీసుకున్నామని, అలాంటప్పుడు ఎలా మద్దతు ఇస్తామని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ఇక, పరిశీలన అన్న విషయం, కేవలం డీఎండీకేకు మద్దతు ఇస్తారా..? అని మీడియా సంధించిన ప్రశ్నకు , అటు వైపు నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు పరిశీలన అని సమాధానం ఇచ్చామేగానీ, మద్దతు ఇచ్చేస్తామని చెప్పలేదుగా అంటూ స్పందించారు. తిరుమా కొత్త పల్లవి : యూనిఫాం ’సివిల్’ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌర సృ్మతి)కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మైనారిటీ సంఘాలు, పార్టీలు, జమాత్‌లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాము సైతం అంటూ వీసీకే నేత తిరుమావళవన్ కదిలారు. ఏకంగా సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలకు పిలుపు నిచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని, ప్రతి పక్షాలన్నీ ఏకం కావాలని కోరారు. అఖిల పక్షంగా ముందుకు సాగుదామని, యూసీసీని వ్యతిరేకిద్దామని పిలుపు నిచ్చారు. -
అన్నాడీఎంకే ప్రచార సాధనంగా ఐప్యాడ్!
అన్నాడీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి జయలలిత లేకుండా మొదటిసారి తమిళనాడులో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ కార్యకర్తలు, అమ్మ ఆశయాలు ప్రజలందరికీ తెలియాలని వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి అమ్మ మెసేజ్‌ను ఐప్యాడ్‌లో వివరిస్తున్నారు. జయలలిత సీఎం అయిన తరువాత పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, పూర్తి చేసిన అభివృద్ది పనుల వివరాలను ఐ ప్యాడ్‌లో తెలుపుతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ఈ ఐప్యాడ్ క్యాంపెయిన్‌ను ప్రజలు ఎంతగానో ఆహ్వానిస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. అమ్మ చొరవను మహిళలు ముందుకొచ్చి మెచ్చుకుంటున్నారని పేర్కొంటున్నారు. టెక్నాలజీని వాడుకుని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించే మొదటి రాష్ట్రం తమిళనాడేనట. అయితే ఇప్పటికే పలుమార్లు టెక్నాలజీని వాడుకుని అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం నిర్వహించింది. 2014 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే టెలిఫోనిక్ మెసేజ్ పద్ధతిని తీసుకొచ్చి, అమ్మ ఆశయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం 2016 ఎన్నికల సమయంలోనూ అన్నాడీఎంకే వాట్సాప్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించింది. నవంబర్ 15న తమిళనాడులో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అమ్మ లేకుండా నిర్వహించే ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకంగా మారాయి. గత 44 రోజులుగా జయలలిత ఆరోగ్యం బాగోలేకపోవడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తమిళనాడులో ఉప ఎన్నికలలో అమ్మలేని లోటు
-
అమ్మ వేలిముద్ర !
► బీ ఫాంలో అన్నాడీఎంకే ► అధినేత్రి జయ వేలిముద్ర ► వివాదాన్ని లేవనెత్తిన విపక్షాలు ► ఓకే అంటూ ఈసీ అంగీకారం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ముగ్గురు అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫాంలలో పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సంతకం చేయకుండా వేలిముద్ర వేయడం వివాదాలకు తెరతీసింది. ఆమె అరోగ్యంగా ఉన్నపుడు అమ్మ వేలిముద్రా అంటూ విపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో జయలలిత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు చేసిన చికిత్స ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది, దాదాపుగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి పడకపై కూర్చుని వైద్యులతో మాట్లాడుతున్నారని, తన చేతులతోనే ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల వరకు చెబుతూ వచ్చారు. అమ్మ ఆసుపత్రి చికిత్స పొందుతున్న తరుణంలోనే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ముగ్గురు అభ్యర్థులకు జయలలిత పార్టీ అధినేత్రి హోదాలో బీ ఫాంలను జారీ చేయడం తప్పనిసరి. జయ అంగీకారంతో కూడిన బీఫాంలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించినపుడే అభ్యర్థులకు రెండాకుల గుర్తును కేటాయిస్తారు. అన్నాడీఎంకే తరఫున పోటీచేసే అభ్యర్థులకు 1989 నుంచి జయలలిత సంతకంతో కూడిన బీఫాంలనే అందజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా, బీ ఫాంలో అమ్మ సంతకం ఉండాల్సిన స్థానంలో ఎడమచేతి వేలిముద్ర ఉంది. అమ్మ కోలుకున్న పరిస్థితుల్లో వేలిముద్ర వేయాల్సిన ఆవశ్యకత ఏమిటని విపక్షాలు విమర్శలు లేవనెత్తాయి. వేలిముద్ర వేసింది జయలలితేనా, బీఫాంలో వేలి ముద్ర చెల్లుతుందా అంటూ మరికొందరు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వేలిముద్రపై వైద్యుని వివరణ వేలి ముద్రకు సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ విపక్షాలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సీఎం కుడిచేతి గుండా మందులు ఎక్కిస్తున్న కారణంగా ఎడమ చేతి బొటనవేలి ముద్రను వేయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వేలిముద్ర వేసేపుడు ఆమె సృ్పహలోనే ఉన్నారు, వేలిముద్ర తీసుకోవడం సీఎంకు తెలుసని ప్రకటించాల్సి వచ్చింది. ఈసీ వివరణ ఈ నేపథ్యంలో వేలిముద్ర వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కార్యాలయం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఒక ఉత్తరం రాసింది. అన్నాడీఎంకే తరఫున పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు అందజేసే ఏ, బీ ఫారంలలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత చేతి ముద్రలు వినియోగిస్తున్నట్లు 26వ తేదీన పార్టీ కార్యాలయం నుంచి తమకు ఉత్తరం అందిందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుని సమక్షంలో వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు. వేలిముద్రపై ఏమా వేగం? బీఫాంలలో జయ వేలిముద్రను ఆమోదించడంలో ఎన్నికల కమిషన్ చూపిన వేగం అశ్చర్యాన్ని కలిగిస్తోందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ వ్యాఖ్యానించారు. వేలిముద్రను అంగీకరించడం అన్నాడీఎంకేపై ఎన్నికల కమిషన్ చూపుతున్న హద్దుమీరిన ఆదరణ అని దుయ్యబట్టారు. -
చతుర్ముఖ పోటీ
► ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే, ► డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులు ► బీజేపీ అభ్యర్థుల ఎంపిక ► పోలింగ్ సమయం కుదింపు సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చతుర్మఖ పోటీ నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టారనే ఆరోపణలతో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయిన విషయం తెలిసిందే. తిరుప్పరగున్రం ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. అన్నా డీఎంకే, డీఎంకే, పీఎంకే ఇప్పటికే తవ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగాయి. బీజేపీ అభ్యర్థులు వీరే : మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ గురువారం ఢిల్లీ నుంచి ప్రకటించింది. తంజావూరు నుంచి ఎమ్ఎస్.రామలింగం, అరవకురిచ్చి నుంచి ఎస్.ప్రభు, తిరుప్పరగున్రం నుంచి ప్రొఫెసర్ శ్రీనివాసన్ పోటీకి దిగుతున్నారు. ఫిర్యాదులు, పిటిషన్లు : ఉప ఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు చేసింది. గడిచిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులనే అన్నాడీఎంకే, డీఎంకే తదితర పార్టీలు మళ్లీ పోటీకి దింపినందున తంజావూరు, అరవకురిచ్చిల్లో ఉప ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు శాఖలో సీనియర్ న్యాయవాది ప్రకాష్ గురువారం పిటిషన్ వేశారు. పోలింగ్ సమయం కుదింపు : తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చీలో వచ్చే నెల 19న జరగనున్న ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పాటూ కుదించనున్నట్టు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని గతంలో ప్రకటించి ఉన్నారు. తాజాగా పోలింగ్ వేళలను సవరిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. నేడు అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల నామినేషన్లు : ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అరవకురిచ్చీలో సెంథిల్ బాలాజీ(అన్నాడీఎంకే), కేసీ.పళని స్వామి, తంజావూరులో రంగస్వామి(అన్నాడీఎంకే), అంజుగం భూపతి(డీఎంకే), తిరుప్పరగున్రంలో ఏకే.బోస్ (అన్నాడీఎంకే), డాక్టర్ శరవణన్(డీఎంకే) నా మినేషన్లు వేయనున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం 1-3 గంటల మధ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. -
ద్వితీయానికి సవాల్
► అపోలోలో అన్నాడీఎంకే అధినేత్రి జయ ► కరుణానిధికి అస్వస్థత ► పన్నీర్, స్టాలిన్లపై ఉప ఎన్నికల గెలుపు భారం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ఎన్నికల చరిత్రలో తొలిసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల అధినేతలు ఇద్దరూ ఒకేసారి అస్వస్థలుగా ఉన్న తరుణంలో ఉప ఎన్నికలు రావడం, అభ్యర్థులను గెలిపించే బాధ్యత ద్వితీయశ్రేణి నేతలపై పడడం విచిత్రకరమైన పరిణామం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు, మద్యం, పంచెలు, చీరలు, బహుమతులు పంపిణీ జరిగినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అలాగే తిరుప్పరగున్రం స్థానం నుంచి అన్నాడీఎంకే టికెట్టుపై గెలిచిన శీనివేల్ అనారోగ్య కారణాలతో ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే మృతి చెందారు. ఈ కారణాలతో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ సాగుతుండగా వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో గెలుపొందడం ద్వారా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. డీఎంకే 98, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. మిత్రపక్షాన్ని కలుపుకుంటే 106 స్థానాలు సాధించుకున్న డీఎంకే తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కేవలం కొద్ది సీట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకున్న అన్నాడీఎంకేకు, 28 సీట్లు తక్కువై తృటిలో అధికారాన్ని కోల్పోయిన డీఎంకేకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో గెలుపు ఎంతో అవసరం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. అన్నాడీఎంకే 4, డీఎంకే 2 దక్కించుకున్నాయి. ఆ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు కాకుండా, డీఎంకే అభ్యర్థులు గెలిచి ఉంటే డీఎంకేకు అదనంగా మరో రాజ్యసభ సీటు దక్కి ఉండేది. ఆస్పత్రిలో అమ్మ: సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు గడిచిపోయిన ఆరునెలల కాలంలో వచ్చిన ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకేకు ప్రతిష్టాత్మకం. ఒక్క సీటు చేజారినా అధికార పార్టీపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని ప్రచారం చేసేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యంత జనాకర్షణ నేతగా ఎదిగిన జయలలిత ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి లేదు. కనీసం వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఇప్పట్లో అవకాశం లేదు. ఉప ఎన్నికల అభ్యర్థులను గెలిపించగల స్థాయిలో జనాకర్షణ కలిగిన నేత అపోలో ఆసుపత్రికి పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీంతో అన్నాడీఎంకేలో అగ్రస్థాయిలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వమే ఉప ఎన్నికల గెలుపు భారాన్ని మోయకతప్పదు. ఆస్పత్రిలో ఉన్న అమ్మ కోలుకుని ఇంటికి రాగానే ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల గెలుపును బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానంగా సీనియర్ మంత్రి పన్నీర్‌సెల్వం పై ఉంది. అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బలమైన ప్రతి పక్షంగా అవతరించిన డీఎంకే అమ్మ అస్వస్థతను అవకాశంగా తీసుకోవడం, మూడు స్థానాల్లో గెలిచేం దుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఈ రకంగా ఉప ఎన్నికలు అన్నాడీఎంకే నేతలకు సవాలుగా మారాయి. అస్వస్థతతో రాజకీయ కురువృద్ధుడు : డీఎంకే అధ్యక్షులు కరుణానిధి 92 ఏళ్లు దాటిన వయస్సులోనూ తమిళనాడు రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో ప్రచారం కూడా చేశారు. ఎత్తులు వేయడంలో అపర చాణుక్యుడు, రాజకీయ కురువృద్ధుడైన కరుణానిధి సైతం ఉప ఎన్నికల సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులను గెలిపించే బాధ్యత సహజంగానే స్టాలిన్‌పై పడింది. పార్టీకి కాబోయే వారసుడు అని కరుణానిధి ఇప్పటికే స్టాలిన్‌కు కితాబు ఇచ్చిన నేపథ్యంలో ఉపఎన్నికలను స్టాలిన్ ఒక చాలెంజ్‌గా తీసుకునే అవకాశం లేక పోలేదు. అమ్మ ఆసుపత్రికి పరిమితమై ఉన్న తరుణంలో ద్వితీయశ్రేణిలో నాయకత్వ పటిమ, జనాకర్షణలపై అన్నాడీఎంకేతో పోల్చుకుంటే డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎంతో మెరుగు. అమ్మ ప్రచారానికి రాకున్నా ఆమెపై ఉన్న అభిమానం, అనారోగ్య సానుభూతి పవనాలు ఉప ఎన్నికలపై ప్రభావం చూపగలవు. అలాగే నాయకత్వలేమి, స్టాలిన్‌కు ఉన్న జనాకర్షణ ప్రతికూల ప్రభావానికి కూడా అవకాశం లేక పోలేదు. పార్టీ అగ్రజులు (జయలలిత, కరుణానిధి) ఎన్నికల ప్రచారానికి రాలేని తరుణంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఫలితాలు పన్నీర్ సెల్వం, స్టాలిన్లకు సవాలు విసురుతున్నట్లు భావించక తప్పదు. -
సగం గెలవకుంటే రాజీనామా: షబ్బీర్
-
సగం గెలవకుంటే రాజీనామా: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలా గెలవని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తప్పుడు సర్వేలు మానుకొని పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధంకావాల న్నారు. -
మోగిన ఉప నగారా
రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతో పాటు పుదుచ్చేరిలోని నెల్లితోప్పు అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ నేతృత్వంలో అధికార వర్గాలు ఎన్నికల పనుల్ని వేగవంతం చేసే పనిలో పడ్డాయి. సాక్షి, చెన్నై: రాష్ర్ట అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా అధికార వర్గాలు కొరడా ఝుళిపించాయి. అయినా, తంజావూరు, కరూర్జిల్లా అరవకురిచ్చి నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు తాండవం చేశాయి. పెద్ద ఎత్తున నగదు పట్టుబడడంతో చివరకు తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికల్ని నిలుపుదల చేసి, మిగిలిన 232 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఈ సమయంలో ప్రమాణ స్వీకారానికి ముందే తిరుప్పరగుండ్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్ఎం.శీనివేల్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ మూడు నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు తగ్గ చర్యల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ నిమగ్నమయ్యారు. అయితే, పలు కారణాల వల్ల జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు రాష్ట్రం నుంచి ఎన్నికల నిర్వహణకు తగ్గ నివేదిక ఢిల్లీకి చేరింది. అలాగే, పుదుచ్చేరి సీఎంగా ఉన్న నారాయణస్వామి కోసం నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానం భర్తీతో పాటు తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పర గుండ్రంలలో ఉప ఎన్నికల నిర్వహణకు తగ్గ నగారా సోమవారం మోగింది. నవంబర్ 19న ఎన్నికలు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించడంతో రాష్ట్రంలోని మూడు, పుదుచ్చేరిలోని నెల్లితోప్పునియోజకవర్గాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. చివరి తేదీ నవంబర్ రెండుగా నిర్ణయించారు. మూడో తేదీన పరిశీలన, ఐదో తేదీన ఉప సంహరణ ప్రక్రియ సాగనుంది. అదే రోజు తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక, ఎన్నికలు నవంబర్ 19వ తేదీ జరుగుతుంది. ఫలితాలు 22వ తేదీ ప్రకటించనున్నారు. నగారా మోగడంతో ఎన్నికల నిర్వహణకు తగ్గ చర్యల వేగవంతంలో రాజేష్‌లఖానీ నేతృత్వంలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. అభ్యర్థులు మారేనా: అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు అభ్యర్థిగా బి.అంజుగం, అరవకురిచ్చి అభ్యర్థిగా కేసీ పళని స్వామిలను డీఎంకే ప్రకటించింది. అయితే, ఈ ఇద్దరు ఆ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న దృష్ట్యా, అభ్యర్థుల్లో మార్పు అన్నది డౌటే. ఇక అన్నాడీఎంకే విషయానికి వస్తే తంజావూరులో రంగస్వామి, అరవకురిచ్చిలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఈ సారి ఈ ఇద్దరు అభ్యర్థులకు మళ్లీ చాన్స్ దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. రంగస్వామికి అవకాశం దక్కినా ఆరోపణల్ని ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక, అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, అభ్యర్థుల ఎంపిక భారాన్ని పార్టీ కోశాధికారి పన్నీరు సెల్వం భుజాన వేసుకుంటారా..? లేదా, వారినే కొనసాగిస్తారా..? అన్న ప్రశ్న బయలు దేరి ంది. ఇక, తిరుప్పరగుండ్రం స్థానాన్ని శీనివేల్ కుటుంబీకులు ఎవరికైనా అప్పగిస్తారా..? మరెవరైనా రేసులో ఉంటారా..? అన్నది వేచి చూడాల్సిందే. అయితే, శీనివేల్ చేతిలో ఓటమి చవిచూసిన డీఎంకే అభ్యర్థిగా ఎం. మణిమారన్‌కు తిరుప్పరగుండ్రంలో పోటీకి డీఎంకే మళ్లీ చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే అభ్యర్థులు ఈ స్థానాల రేసులో నిలబడ్డారు. అయితే, ఉప సమరంలో మళ్లీ పోటీకి దిగేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. తొలిసారిగా: పుదుచ్చేరి సీఎంగా నారాాయణస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాజ్యసభ పదవితో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చిన నారాయణస్వామికి ఈ సారి పుదుచ్చేరి సీఎం అయ్యే అవకాశం దక్కింది. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన తప్పనిసరిగా పోటీ చేయాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్‌కుమార్ తన పదవిని త్యాగం చేశారు. ఖాళీగా ఉన్న నెల్లితోప్పు నుంచి ఎన్నికల్లో పోటీకి పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లితోప్పులో నామినేషన్ దాఖలు చేయడానికి నారాయణస్వామి నిర్ణయించారు. -
ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీః తెలంగాణలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూలు జారీచేసింది. ఈ షెడ్యూలు ప్రకారం ఈనెల 26న నోటిఫికేషన్ జారీకానుంది. అక్టోబరు 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 4న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అక్టోబరు 6 వరకు గడువు విధించారు. అక్టోబరు 17వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఈసీఐ తన షెడ్యూలులో ప్రకటించింది. -
వెలికట్ట ఓటర్ల తీర్పు మరవలేం
డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక: వెలికట్ట ఎంపీటీసీ ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థి బూర్గుల మల్లవ్వను గెలిపించి విశిష్టమైన తీర్పుచెప్పారని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. కొండపాక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడగానే ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెలికట్ట ఎంపీటీసీ స్థానానికి తాను ఊహించిన విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారన్నారు. ఇదివరకు ఎంపీటీసీగా గెలుపొంది మృతి చెందిన బూర్గుల యాదంరావుపై ఉన్న నమ్మకంతో ఆయన భార్య మల్లవ్వ ను ఏకగ్రీవంగా గెలిపించాలనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారన్నారు. అయితే టీడీపీ నేతలు అందుకు సహకరించలేదన్నారు. కొందరు టీడీపీ నాయకులు ఇంకా సీమాంధ్ర పార్టీ నేతల కనుసన్నల్లోనే పని చేస్తున్నారన్నారు. తెలంగాణా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకునే వారికి ఇదేగతి పడుతుందన్నారు. తెలంగాణా ఏర్పడక ముందు టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు మరిచి పోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులకు సహకరించాలని లేకుంటే నోరు మూసుకు కూర్చోవాలని నియోజక వర్గ టీడీపీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డిని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతుల పద్మ, జెడ్పీటీసీ మాధురి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షులు , సర్పంచులు యాదగిరి, కనుకారెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఉప పోరులో కారు జోరు
నాలుగుచోట్ల గులాబీశ్రేణుల గెలుపు సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగించింది. ప్రధానంగా అందోల్ నియోజకవర్గంలో రెండుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. గురువారం జిల్లాలోని అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం చిన్నాషెల్మాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వసంత్‌పై టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి నరేశ్‌కుమార్ 97 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అందోల్ మండలం కిచ్చన్నపల్లి సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వరూప కాంగ్రెస్ అభ్యర్థి అరుణపై 166 ఓట్లతో గెలిచారు. జహీరాబాద్ మండలం రంజోల్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాణమ్మపై టీఆర్ఎస్ అభ్యర్థి జనాబాయి 838 అధిక్యంతో గెలుపొదారు. పస్తాపూర్ పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గురునాథ్‌రెడ్డి, న్యాల్కల్ మండలం హద్నుర్లో కాంగ్రెస్ అభ్యర్థి, గజ్వేల్ మండలం జాలిగామ పంచాయతీలోని 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి, దౌల్తాబాద్ మండలం కొత్తపల్లి సర్పంచ్‌గా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మౌనిక గెలుపొంరు. 10న ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పుల్కల్ మండలం కొడూర్, నారాయణఖేడ్ మండలం జగన్నథ్పూర్ ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. జగన్నథ్పూర్లో మొత్తం 1583 ఓట్లకు 1141 పోల్ అయ్యాయి. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున మాణిక్యం, కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సింలు, టీడీపీ అభ్యర్థిగా రాములు పోటీ చేస్తున్నారు. పుల్కల్ మండలం కొడూర్ ఎంపీటీసీ ఉప ఉన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నా చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. కొడూర్లో 698 ఓట్లకు 603, ఇసోజిపేటలో 751కి 661 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు ఈనెల 10వ తేదిన ఆయా మండల కేంద్రాల్లో జరుగుతాయని డీపీఓ సురేశ్‌బాబు తెలిపారు. ఈవీఎంలను పోలీసుల పర్యవేక్షణలో ఎంపీడీఓ కార్యయంలో భద్రపరిచామని చెప్పారు. -
ఓటేసిన ఓల్డ్‌లేడీ
కొండపాక: వెలికట్ట ఎంపీటీసీ ఉప ఎన్నిక పుణ్యమా అని 90 ఏళ్ల బాలవ్వ అనే వృద్ధురాలు ఓటేసి ఓటు విలువను తెలియజేసింది. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాని బాలవ్వ ‘ బిడ్డా నేను బతికున్న సమయంలో వచ్చిన ఓటు హక్కును వినియోగించుకుంటానని పక్కింటి లక్ష్మితో చెప్పగానే ఆలోచించకుండా లక్ష్మి బాలవ్వను పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించి ఇంటికి తీసుకవెళ్లింది. -
పోలింగ్ కేంద్రాల వద్ద నేతల హల్చల్
కొండపాక: కొండపాక మండలంలోని వెలికట్ట ఎంపీటీసీ స్థానానికి గురువారం జరిగిన ఉపఎన్నిక పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ నాయకులు హల్చల్ చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 7.30 గంటల నుంచి ఓటర్లు కేంద్రాలకు రావడం ప్రారంభమైంది. వెలికట్ట ఎంపీటీసీ పరిధిలో జప్తినాచారం మధిర రాజంపల్లి, దోమలోని పల్లి, ముర్కోనిపల్లి, వెలికట్ట మధిర విశ్వనాథపల్లి, ఆరేపల్లి, రవీంద్రనగర్ గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెలికట్ట ఎంపీటీసీ పరిధిలో సుమారు 2422 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి యాదం మల్లవ్వ, కాంగ్రెస్ నుంచి కోడెల వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వాసరి చిన్న ఐలయ్య, బీజేపీ అభ్యర్థి ముస్తాల నర్సింహులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీల మద్దతుదారులు తమ పార్టీ అభ్యర్థి గుర్తుకే ఓటువేయాలని ఓటర్లను వేడుకోవడం కనిపించింది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్‌కేంద్రాల వద్ద అధికార పార్టీ నాయకులు హల్చల్ చేస్తూ తమ కార్యకర్తలను ఉరుకులు పరుగులు పెట్టించారు. వెలికట్ట, విశ్వనాథపల్లి గ్రామాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద టీఆర్ఎస్ నాయకులు పీఏసీఎస్ డైరెక్టర్ అనంతుల నరేందర్, సర్పంచ్‌లు యాదగిరి, కనకారెడ్డి, రుషి, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ సలీం, కార్యకర్తలు కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మంచాల శ్రీనివాస్, ప్రతాప్‌చందర్, టీడీపీ నాయకులు శ్రీనివాస్, కనకాచారి, అంబటి నారాయణ, అహ్మద్ వారి అనుచరులు కూడా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ సరళి అధికారపార్టీకే అనుకూలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వెలికట్ట పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు అధికార పార్టీ నేతలు టిఫిన్ తీసుకెళుతున్నారని పోలింగ్ తీరును పరిశీలించేందుకు వచ్చిన ఎన్నికల అధికారి సురేష్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కోడెల వెంకటేశం ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై మండిపడుతూ మరోసారి ఇలాంటివి పునరావృత్తంకాకుండా చూసుకోవాలని మందలించారు. ఈ ఉపఎన్నికలో ఈవీఎంల ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఓటర్లు ముఖ్యంగా వృద్ధులు కాస్త తికమకపడ్డారు. రేపు కొండపాక ఎంపీడీఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు
సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిని జి. మనెమ్మ తన సమీప ప్రత్యర్థి జానా బాయి(కాంగ్రెస్)పై 1395 ఓట్లతో గెలుపొందారు. కిచ్చన్నపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్తి స్వరూప, కాంగ్రెస్ అభ్యర్థి బి. అరుణపై 166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెద్ద శంకరంపేట మండలం జూకల్ 3 వార్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సున్నం బేటయ్య 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
నేడు ‘స్థానిక’ ఉప పోరు
మూడు సర్పంచ్, ఏడు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ఖాళీ ఏర్పడిన మూడు సర్పంచ్, ఏడు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జపరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. జిల్లాలో నాలుగు 4 సర్పంచ్, 24 వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో ఒక సర్పంచ్, 17 వార్డు స్థానాల ఎన్నిక ఏకగీవ్రమైంది. ఉప ఎన్నికలకు మొత్తం 29 ఈవీఎంలను, 95 మంది సిబ్బందిని ఎన్నికల సంఘం కేటాయించింది. వీరిలో 19 మంది పీఓలు, 57 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. మూడు సర్పంచ్ స్థానాలకు ఎనిమిదిమంది, ఏడు వార్డు స్థానాలకు 15 మంది, ఒక ఎంపీటీసీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు ఈ నెల 10న ఉంటుంది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ డి.దివ్య శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లోని డీఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రితో అధికారులు, సిబ్బంది పోలీస్ బందోబస్తుతో వెళ్ళారు. పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయించాలని ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల రోజున ఆయా ప్రాంతాల్లో స్థానిక సెలవు దినం ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు తొలిసారిగా ఈవీఎంలు పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ దివ్య తెలిపారు. పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ నిర్వహించి క్లోజ్, రిజల్ట్ , క్లియర్ బటన్లు సరిచేసి ఏజెంట్లకు చూపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందితో చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం గ్రామం స్థానం వార్డు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– చింతకాని చింతకాని సర్పంచ్ – రఘునాధంపాలెం చిమ్మపూడి సర్పంచ్ – టేకులపల్లి బద్దుతండా సర్పంచ్ – బయ్యారం ఉప్పలపాడు వార్డు 1 వ బయ్యారం ఉప్పలపాడు వార్డు 9వ చండ్రుగొండ పెంట్ల వార్డు 2వ కొత్తగూడెం సుజాతనగర్ వార్డు 9వ ముదిగొండ అమ్మపేట వార్డు 7 వ సింగరేణి రేలకాయలపల్లి వార్డు 7 వ టేకులపల్లి టేకులపల్లి వార్డు 7 వ -
నేడే పంచాయతీ ఉప ఎన్నికలు
జిల్లాపరిషత్ : జిల్లాలో నిర్వహిస్తున్న పంచాయతీ ఉప పోరులో భాగంగా 3 సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 3 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని డీపీవో కృష్ణమూర్తి తెలిపారు. జిల్లాలో వివిధ కారణాల వల్ల ఆకస్మికంగా ఏర్పడిన 1 ఎంపీటీసీ, 3 సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బిచ్కుంద మండలం ఎల్లారం సర్పంచ్ స్థానానికి ఇద్దరు, నవీపేట్ మండలం బినోల సర్పంచ్ స్థానానికి ముగ్గురు, మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా ఎన్నికల్లో వరుసగా 507, 2059, 928 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 38 వార్డుస్థానాలకు గాను 32 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడు వార్డుసభ్యుల స్థానాలకు నామినేషన్లు రాలేవు. మరో మూడు వార్డు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో 7వ వార్డుకు ఇద్దరు, లింగంపేట్ మండలంలోని భవానీపేట్‌లో 7వ వార్డుకు ఇద్దరు, ఎడపల్లి మండలంలోని పోచారంలో 7వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానానికి.. కాగా సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ తెలిపారు. ముషీర్‌నగర్, కొటాల్‌పల్లిలో రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశామని, 1,224 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 8 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, 10న కౌంటింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో సెలవును ప్రకటించామని తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనవచ్చని సూచించారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
పది నెలల క్రితమే తండ్రి మృతి అనాథలైన ఇద్దరు చిన్నారులు న్యూలక్ష్మిపురం (ముదిగొండ) : ఇల్లు శుభ్రం చేసి, ఇంటి వెనుక ఊడ్చేందుకు వెళ్లిన మహిళలకు అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని న్యూలక్ష్మిపురంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... న్యూ లక్ష్మిపురం గ్రామానికి చెందిన తమ్మ నర్సమ్మ (35) కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఆదివారం ఇళ్లు ఊడ్చి చెత్తా చెదారం తొలగించి వెనుక ఉన్న ఆవరణను ఊడ్చడానికి వెళ్లిన నర్సమ్మకు ఇంటి వెనకాలే ఉన్న పెన్సింగ్‌కు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఓ వ్యక్తికి చెందిన గోశాల నిర్మాణంకు అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యుత్ కనెన్షన్ ఇచ్చారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా కనెన్షన్ ఇవ్వడంతో ఆ పెన్సింగ్‌కు విద్యుత్ వైర్లు తగడంతో కరెంట్ సరఫరా అయింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ తాటిపాముల కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనాథలైన పిల్లలు.. పది నెలల క్రితం తండ్రి నర్సింహారావు మృతి చెందగా ఇప్పుడు తల్లి కూడా విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. -
ఫిరాయింపుల్లో రికార్డు కేసీఆర్‌దే: షబ్బీర్
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల్లో రికార్డు సృష్టించిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కిందని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పీకర్‌కు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిందన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటువేయడం ఖాయమని షబ్బీర్ అన్నారు. పార్టీ మారిన 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్, పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి... ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్‌పై తమ పార్టీ విసిరిన సవాల్‌కు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. దీనిపై రిటైర్డ్ ఇంజినీర్లు ఎందుకు స్పందించారో అర్థం కాలేదని షబ్బీర్ అన్నారు. -
మ్యాన్‌ఫ్యాక్చర్డ్ బై ఖైదీలు
పోచమ్మమైదాన్ : ఖైదీలు.. ఈ పేరు వినగానే వారి చేసిన నేరాలు, ఘోరాలే గుర్తుకొస్తాయి. కానీ వరంగల్‌లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు బయటకు వెళ్లాక ఉపాధి పొం దేలా పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, సత్ప్రవర్తనతో మెలుగుతున్న పలువురు ఖైదీలతో ఓపెన్ ఎయిర్ జైలు పేరిట వ్యవసాయం, పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇదేకాకుండా ఖైదీలకు చేనేత, వడ్రంగి, వెల్డింగ్, బుక్ బైండింగ్, ఫినాయిల్, అగర్బత్తీలు, సబ్బుల తయారీ తదితర పనులు నేర్పిస్తూ వస్తువులు తయారుచేయిస్తున్నారు. ఈ మేరకు ఖైదీలు తయారుచేసిన వస్తువుల అమ్మకం, ప్రదర్శనను శనివారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని పద్మశ్రీ నేరేళ్ల వేణుమాదవ్ కళాప్రాంగణంలో ‘మై నేషన్’ ఆధ్వర్యాన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలో జంపఖానాలు, టవల్లు, కర్చీప్‌లు, బెడ్ షీట్లు, నోట్బుక్లు, బీరువాలు, ఫినాయిల్, సబ్బులతో పాటు వరంగల్, హైదరాబాద్ జైళ్లలోని ఖైదీలు గీసిన పెయింటింగ్‌లను అమ్మకానికి ఉంచారు. శని, ఆదివారాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను జైలు సూపరింటెండెంట్ న్యూటన్ ప్రారంభించి మాట్లాడారు. వస్తువులను సెంట్రల్ జైలు ఎదుట ప్రత్యేక కౌంటర్లో ప్రతిరోజూ విక్రయిస్తుండగా.. అందరికీ అందుబాబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో జైలర్ నర్సింహస్వామి, జైలు సిబ్బంది పాల్గొన్నారు, కాగా, నగర వాసులు పలువురు ప్రదర్శనలోని వస్తువులు, పెయింటింగ్స్‌ను ఆసక్తిగా పరిశీలించడంతో పాటు కొనుగోలు చేశారు. -
ఉద్యమానికి ఐలమ్మే స్ఫూర్తి
సమరశీలత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.. యువతకు ఉపాధి కల్పిస్తేనే అభివృద్ధి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ సభలో ప్రొఫెసర్ కోదండరాం సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘తెలంగాణ పోరాట పటిమకు గుర్తు.. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం వీరోచితంగా పోరాడి.. జైలుకెళ్లడం.. దొరల గూండాలను ఎదిరించి.. తన భూమిని కాపాడుకున్న ధీరవనిత చాకలి ఐలమ్మ’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కీర్తించారు. ఖమ్మంలోని ధర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయనతోపాటు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ సోమవారం ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐలమ్మ విగ్రహావిష్కరణ, వర్థంతి సభకు తెలంగాణ బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి అధ్యక్షత వహించగా.. కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా సామాజిక ఉద్యమాలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.. చాకలి ఐలమ్మ సమరశీలత్వాన్ని ఆదర్శంగా తీసుకుని కొనసాగిందన్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందినప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు చేయూతనివ్వాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి దిశలో నడుస్తుందని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం కష్టమైన పనికాదని, ప్రణాళికతో ముందుకెళితే ఇది సాధ్యమేనన్నారు. ప్రజలకు అండగా.. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో జిల్లా జేఏసీ నాయకులు విస్తృతంగా పోరాటం చేసి.. ఉద్యమ జెండాను రెపరెపలాడించారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. దళితులకు రాజ్యాధికారం దక్కితేనే స్వాతంత్య్ర ఫలాలు దక్కుతాయని అంబేడ్కర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో దళితులకు 25 శాతం ఉచిత విద్యను అందించాలని చెప్పిన ప్రభుత్వ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఇచ్చిన జీఓలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఎందుకు అడ్డొస్తాయని ప్రశ్నించారు. ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఎన్నో అవాంతరాలు కల్పించారని, అయినా వీటిని ఎదుర్కొని విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ.. వారి కోసం అమలు చేయాల్సిన పథకాలను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ప్రొఫెసర్లు ఐ.తిరుమలి, కనకాచారి, బీవీ.రాఘవులు, సామాజిక వేత్త ఉ.సాంబశివరావు, చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచందర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, బీసీ ఫ్రంట్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కేవీ.కృష్ణారావు, డాక్టర్ ఎస్.పాపారావు, రచయిత జ్వలిత, పలు సంఘాల నేతలు చిలకల వెంకటనర్సయ్య, లింగాల రవికుమార్, జె.విశ్వ, సుంకర శ్రీనివాస్, భద్రునాయక్, వినయ్‌కుమార్, లాల్‌జాన్‌పాషా, వరలక్ష్మి, దుంపటి నగేష్, వెంపటి నాగేశ్వరరావు నాయుడు, కె.నర్సయ్య, షేక్ షకీనా, తిప్పట్ల నర్సింహారావు, పొదిల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.