బీజేపీకి బిగ్‌ షాక్‌ | Congress Lead in Rajasthan By Poll results | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 1 2018 11:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Lead in Rajasthan By Poll results - Sakshi

బీజేపీ- కాంగ్రెస్‌ పార్టీ జెండాలు

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఝలక్‌ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని నౌపారా అసెంబ్లీ స్థానంలో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా.. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక రాజస్థాన్‌లోని ఆల్వార్‌, అజ్మీర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.

బెంగాల్‌లోని ఉలుబేరియా లోక్‌సభ ఫలితాల్లో కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. రాజస్థాన్‌లోని మందల్‌ఘడ్‌ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ఫ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 'పద్మావత్'  చిత్ర విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్ పుత్ లకు అనుకూలంగా వ్యవహరించలేదన్న ఆగ్రహం రాజస్థాన్‌ లో ఆ వర్గం ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పిందని అంచనా వేస్తున్నారు.

కాగా, రాజస్థాన్‌లో రెండు పార్లమెంట్‌ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, పశ్చిమ బెంగాల్‌లోని ఒక పార్లమెంట్‌, ఒక అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలను.. సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement