బెంగాల్లో తృణమూల్, బీజేపీ హోరాహోరీ
25న ఆరో విడతలో 8 స్థానాలకు పోలింగ్
బరిలో మంత్రి, మాజీ న్యాయమూర్తి, నటులు
తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికైన పశి్చమబెంగాల్‌లో ఎన్నికలు ఆరో దశకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా ఐదు విడతల్లో 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక ముగిసింది. ఆరో దశలో భాగంగా 8 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. తామ్లుక్, కాంథీ స్థానాల్లో బీజేపీ కీలక నేత సువేందు అధికారిపై ప్రతీకారానికి తృణమూల్ ఉవి్వళ్లూరుతోంది. సువేందు సోదరుడు సౌమేందు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్, పలువురు బెంగాలీ నటుల భవితవ్యాన్ని ఈ దశలో ఓటర్లు తేల్చనున్నారు...
బాంకురా
2019లో తృణమూల్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీపై కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ 1.74 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. కానీ సొంత కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు! టీఎంసీ నుంచి బాంకురా ఎమ్మెల్యే అరూప్ చక్రవర్తి, సీపీఎం నుంచి న్యాయవాది నీలాంజన్ దాస్ గుప్తా పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తికరం.
ఘాటల్
సిట్టింగ్ ఎంపీ, నటుడు, గాయకుడు దీపక్ అధికారి (దేవ్) తృణమూల్ నుంచి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. బీజేపీ కూడా ప్రముఖ బెంగాలీ నటుడు, ఖరగ్‌పూర్ ఎమ్మెల్యే హిరేన్ ఛటర్జీని పోటీకి దించింది. ఎంపీ భారీ సభల ద్వారా దర్పం ప్రదర్శిస్తుంటే తాను రోడ్లపైకొచ్చి సామాన్యులతో మమేకం అవుతున్నానని హిరేన్ అంటున్నారు. సీపీఐ కూడా బరిలో ఉండటంతోటిక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.
కాంథీ
ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పరిధిలోని ఈ స్థానమూ సువేందు కుటుంబానికి కంచుకోటే. ఆయన తండ్రి శిశిర్ అధికారి తృణమూల్ టికెట్‌పై 2009, 2014, 2019ల్లో వరుసగా గెలిచారు. ఈసారి సువేందు తమ్ముడు సౌమేందు అధికారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పతా‹Ùపూర్ ఎమ్మెల్యే ఉత్తమ్ బారిక్ తృణమూల్ నుంచి, యువ న్యాయవాది ఊర్వశి భట్టాచార్య సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. తామ్లుక్‌తో పాటు కాంథీలోనూ నెగ్గి సువేందుపై ప్రతీకారం తీర్చుకోవాలని తృణమూల్ చూస్తోంది.
మేదినీపూర్
బీజేపీ నుంచి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు. అసన్‌సోల్ దక్షిణ ఎమ్మెల్యే. తృణమూల్ నుంచి మేదినీపూర్ ఎమ్మెల్యే జూన్ మాలియా బరిలో ఉన్నారు. అభ్యర్థులిద్దరికీ సొంత పారీ్టల్లో విభేదాలు తలనొప్పిగా మారాయి. తమ పారీ్టలో విభేదాలు సర్దుకున్నాయని అగి్నమిత్ర చెబుతున్నారు. సీపీఐ నుంచి బిప్లబ్ భట్టా పోటీలో ఉన్నారు.
ఝార్‌గ్రాం
ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ కునార్ హెంబ్రమ్ పార్టీని వీడటంతో ప్రణత్ తుడుకు టికెట్ దక్కింది. సంథాలీ రచయిత, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత కాళీపద సోరెన్‌ను టీఎంసీ బరిలోకి దింపింది. మరోసారి విజయంపై ధీమాతో ఉంది. సీపీఎం నుంచి సోనామణి ముర్ము పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ పీపుల్స్ పార్టీ, ఐఎస్‌ఎఫ్ కూడా పోటీలో ఉన్నాయి.
పురూలియా
బీజేపీ సిట్టింగ్ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో ఈసారి కూడా బరిలో ఉన్నారు. తృణమూల్ నుంచి మాజీ మంత్రి శాంతిరాం మహతో, కాంగ్రెస్ నుంచి నేపాల్‌దేవ్ మహతో, ఫార్వార్డ్ బ్లాక్ తరఫున ధీరేంద్ర నాద్ మహతో, బీఎస్పీ నుంచి సంతోష్ రాజోవర్ పోటీ చేస్తున్నారు. వీరికి ఎస్‌యూసీఐ విద్యార్థి నేత సుషి్మత మహతో, స్వతంత్ర అభ్యర్థి అజిత్ ప్రసాద్ మహతో గట్టి పోటీ ఇస్తున్నారు. మహతోలంతా కుర్మి సామాజిక వర్గీయులే. బలమైన కుర్మి ఓటు బ్యాంకు కోసం తృణమూల్ బాగా ప్రయత్నిస్తోంది. దాంతో కురి్మల ఓటు బ్యాంకు చీలేలా కని్పస్తున్నాయి. ఆ లెక్కన బీజేపీకి ఈసారి విజయం సులువు కాదంటున్నారు.
తామ్లుక్
తృణమూల్, బీజేపీ ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీలో విపక్ష నేత, రాష్ట్ర బీజేపీ దిగ్గజం సువేందు అధికారి 2009, 2014ల్లో ఇక్కణ్నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016 ఉప ఎన్నికలో, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు దిబ్యేందు అధికారి తృణమూల్ టికెట్‌పై గెలవడం విశేషం! ఈసారీ గెలుపు కోసం తృణమూల్ గట్టిగా పోరాడుతోంది. ఈస్ట్ జిల్లా పరిధిలో సువేందు కుటుంబానికి అపార పలుకుబడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతపై నందిగ్రాం స్థానంలో సువేందు 1,956 ఓట్లతో గెలిచారు! మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయకు బీజేపీ ఇక్కడ టికెటిచి్చంది. సీపీఎం కూడా కలకత్తా హైకోర్టు యువ న్యాయవాది సాయన్ బెనర్జీకి టికెటిచి్చంది. తృణమూల్ నుంచి పార్టీ ఐటీ సెల్ చీఫ్ 27 ఏళ్ల దేబాన్షు భట్టాచార్య బరిలో ఉన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment